29 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

August 28, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీరు మీ మధురమైన దైవీ నడవడికతో తండ్రిని ప్రత్యక్షము చేయాలి, అందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి వారసత్వానికి అధికారులుగా చేయాలి’’

ప్రశ్న: -

ఏ పిల్లలైతే దేహీ-అభిమానులుగా ఉంటారో, వారి గుర్తులేమిటి?

జవాబు:-

వారు చాలా-చాలా మధురముగా, ప్రియమైనవారిగా ఉంటారు. వారు శ్రీమతముపై ఏక్యురేట్ గా నడుస్తారు. వారెప్పుడూ ఏ పని కోసం సాకులు చెప్పరు. సదా హా జీ అని అంటారు. ఎప్పుడూ కాదు అని అనరు. అదే దేహాభిమానులైతే ఈ పని చేయడము వలన నా పరువు పోతుందని భావిస్తారు. దేహీ-అభిమానులు సదా తండ్రి ఆజ్ఞపై నడుచుకుంటారు. తండ్రిపై పూర్తి గౌరవాన్ని ఉంచుతారు. ఎప్పుడూ క్రోధంలోకి వచ్చి తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించరు. వారికి తమ దేహముపై మోహము ఉండదు. శివబాబా స్మృతిలో తమ భాగ్యాన్ని సంపన్నంగా చేసుకుంటారు, నష్టపరచుకోరు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు… (భోలేనాథ్ సే నిరాలా…)

ఓంశాంతి. ఇది ఇంత పెద్ద ప్రపంచము, ఇందులో విశేషంగా భారత్ మరియు మామూలుగా యూరోప్ అని అనవచ్చు ఎందుకంటే భారత్ అయితే ప్రాచీనమైనదే. వాస్తవానికి భారత్ మాత్రమే ఉండేదని కూడా భావిస్తారు. అన్ని ధర్మాలవారికి ఇదైతే తెలుసు, మనము ఒకరి తర్వాత ఒకరు వచ్చాము, మా కన్నా ముందు భారత్ మాత్రమే ఉండేది. ఇది అర్థము చేసుకోవాల్సిన విషయము కదా. పిల్లలైన మీకు తెలుసు, తప్పకుండా భారత్ యే ప్రాచీనమైనది. ఆ సమయంలో భారత్ యే చాలా ధనవంతముగా ఉండేది, కనుక స్వర్గమని అనబడేది. ఈ సమయంలోనైతే పిల్లలైన మీకు తప్ప మనుష్యమాత్రులెవ్వరికీ తండ్రి గురించి తెలియనే తెలియదు. అది కూడా నంబరువారు పురుషార్థానుసారముగా ఉన్నారు. కనుక అనంతమైన తండ్రి గురించి తెలియదని ప్రతి ఒక్కరూ స్వయము అర్థం చేసుకోగలరు. వారిని పిలుస్తారు, భక్తి చేస్తారు. కానీ తండ్రి జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి కొడుకును ప్రత్యక్షం చేస్తాడు, కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు పిల్లలైన మీరే తండ్రిని ప్రత్యక్షం చేయాలి. ఫాదర్ అయితే తమను తాము ప్రత్యక్షం చేసుకోలేరు. ఫాదర్ అయితే బయటకు వెళ్ళరు. పిల్లలైన మీరే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అని కూడా అర్థము చేసుకుంటారు. వారి గురించి ఒకవేళ తెలిస్తే ఆశ్చర్యపోతారు, భగవంతుని పిల్లలైన మేము దుఃఖములో, ఇనుప యుగంలో ఎందుకు ఉన్నాము? ఈ ప్రశ్న కూడా మీరు అడగాలి. మొదటి ప్రశ్న- పరమపిత పరమాత్మతో ఏం సంబంధము ఉంది? అని అడగాలి. అడిగేవారికైతే తప్పకుండా తెలుస్తుంది, ఇంకెవ్వరూ ఇలా అడగరు. ఎందుకంటే వారికి తెలియదు. మీరు ఎవరినైనా అడగవచ్చు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అయితే సాధారణ రీతిలో అందరూ అనేస్తారు. కానీ సర్వవ్యాపి అన్నదానికైతే ఏ అర్థమూ లేదు. దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు కదా. దుఃఖాన్ని తొలగించేవారు, సుఖాన్ని ఇచ్చేవారైతే ఒకరు కావాలి కదా. మీరు కొద్దిగా టచ్ చేసినా (అర్థం చేయించినా) కూడా తప్పకుండా సత్యయుగంలో సుఖమే సుఖము ఉండేదని అర్థం చేసుకుంటారు. ఇప్పుడైతే దుఃఖమే దుఃఖము ఉంది. కనుక తప్పకుండా అందరి దుఃఖాలను తండ్రి తొలగించి ఉంటారు. ఇదైతే అతి సహజమైన విషయము. మేము పారలౌకిక తల్లిదండ్రులకు చెందినవారమని మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానం యొక్క విషయాలు ఇప్పుడు ఇక్కడ నడుస్తాయి, సత్యయుగంలో నడవవు. అక్కడైతే జ్ఞానమూ ఉండదు, అజ్ఞానమూ ఉండదు. అక్కడ జ్ఞానాన్ని ఇచ్చేవారు ఎవ్వరూ ఉండరు. జ్ఞానము ద్వారానైతే ప్రారబ్ధాన్ని పొందారు. ఇప్పుడు మీరు జ్ఞానము ద్వారా ప్రారబ్ధాన్ని నంబరువారు పురుషార్థానుసారంగా పొందుతున్నారు. దేహీ-అభిమానిగా అవ్వడము చాలా శ్రమతో కూడిన పని. ఎవరైతే శివబాబా సేవలో తత్పరులై ఉంటారో, వారే దేహీ-అభిమానిగా అవ్వగలరు. దేహాభిమానము రావడముతో మళ్ళీ వారి నుండి ఆ సుగంధము తొలగిపోతుంది. వీరు దేహాభిమానిగా ఉన్నారని వారి నడవడిక ద్వారానే అంతా తెలిసిపోతుంది. దేహీ-అభిమానులు చాలా మధురంగా, ప్రియమైనవారిగా ఉంటారు. మనము ఒక్క తండ్రి పిల్లలము, సోదరులము. పరస్పరములో సోదరీ సోదరులము కూడా. ఇరువురూ శ్రీమతముపై ఏక్యురేట్ గా నడుచుకునేవారము. అంతేకానీ, ఒకరు శ్రీమతముపై నడుస్తూ మరొకరు సాకులు చెప్పి కూర్చుండిపోవడము కాదు. శ్రీమతముపై నడవనివారిని తండ్రి ఎప్పుడూ నా పిల్లలు అని అనలేరు. బయటికి పిల్లలూ, పిల్లలూ, అని అంటారు – కానీ లోలోపల, వీరు ఆజ్ఞకు కట్టుబడి ఉండనివారు, వీరు ఏం పదవిని పొందుతారు అని భావిస్తారు. బాప్ దాదా ఇరువురూ అర్థం చేసుకోగలరు. వీరు శ్రీమతమును అమలుపర్చడము లేదు, దేహాభిమానము కారణంగా శ్రీమతముపై నడవడము లేదు. దేహీ-అభిమానులు చాలా మధురంగా ఉంటారు. ఈ ఆసురీ ప్రపంచము ఎంత చేదైనది. తల్లి-తండ్రి, సోదరీ-సోదరులు అందరూ చేదుగానే ఉన్నారు. ఇక్కడ కూడా ఎవరైతే దేహాభిమానులుగా ఉన్నారో, వారు చేదుగా ఉన్నారు. ఇప్పుడైతే మీరు దేహీ-అభిమానిగా అవుతున్నారు. కొందరైతే కేవలం తమోప్రధానము నుండి తమో వరకు వచ్చారు, కేవలం ప్రధానత తొలగిపోయింది. కొందరు రజో వరకు చేరుకున్నారు. సతోలోకైతే కొందరే వచ్చారు. అలాగని నెమ్మది-నెమ్మదిగా వస్తూ ఉంటారని కాదు. ఎప్పటివరకు నెమ్మది-నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. దేహీ-అభిమానులకు ఎప్పుడూ ఈ పని నేనెందుకు చేయాలి, ఇందులో నా పరువు పోతుంది అని దేహం యొక్క అభిమానము ఉండదు. మీరు పాకిస్తాన్ లో ఉండేటప్పుడు బాబా కూడా దేహాభిమానము ఉండకూడదు అని పిల్లలకు నేర్పించడము కోసం అన్ని పనులు చేసేవారు. దేహాభిమానిగా అయితే సర్వ నాశనమైపోతుంది. బయట ఎవరైతే ప్రజలుగా అవుతారో, వారి కన్నా కూడా పడిపోతారు. ప్రజలలో కూడా ఎవరైతే షావుకార్లుగా అవుతారో, వారికి కూడా నౌకర్లు లభిస్తారు. దేహాభిమానం ఉన్నవారైతే వెళ్ళి వీరి కన్నా కింద ఉండే నౌకర్లుగా అవుతారు. వీరి కన్నా ఆ షావుకార్లు మంచిగా ఉన్నారు కదా. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. కనుక ఎవరైతే పిల్లలుగా అవ్వరో, కేవలం సహాయకులుగా అవుతారో, వారు కూడా మంచి ధనవంతులుగా అవుతారని అర్థమవుతుంది. వారికి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడైతే ఉద్యోగం చేయవలసి ఉంటుంది. చివరికి రాజ్య భాగ్యము (కిరీటం) లభిస్తుంది. ఇరువురూ శిక్షలనైతే అనుభవించవలసి వస్తుంది! ఈ విషయాలన్నింటినీ జ్ఞాన యుక్త ఆత్మలు అర్థము చేసుకోగలరు. అజ్ఞానులు దేహాభిమానులుగా ఉంటారు. వారి నడవడికే అలా ఉంటుంది. వారు దేనికీ ఉపయోగపడరని అర్థం చేసుకోవడము జరుగుతుంది. ఇక్కడైతే పిల్లలు శ్రీమతముపై నడవాల్సి ఉంటుంది. లేదంటే మాయ చాలా మోసం చేసేటువంటిది. వెంటనే దేహాభిమానం వచ్చేస్తుంది. దేహాభిమానాన్ని తొలగించి దేహీ-అభిమానిగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఇక్కడ ఉండేవారికైతే బ్రాహ్మణుల సాంగత్యము ఉంటుంది. బయట అయితే ప్రపంచం చాలా చెడుగా ఉంది. జ్ఞానంలో సాంగత్యము ఫస్ట్ క్లాసుగా ఎలా ఉండాలంటే, దాని ద్వారా పూర్తి రంగు అంటుకోవాలి. దేహాభిమానుల సాంగత్యము లభించడము వలన పూర్తిగా మట్టిపాలు అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆజ్ఞలపై కూడా నడవరు. బాబా అంటారు, ఒకవేళ నన్ను వచ్చి అడిగితే నేను వెంటనే చెప్తాను, మీరు ఆజ్ఞాకారిగా ఉన్నారా లేదా అని. నంబరువారు పురుషార్థానుసారంగా చాలా మంచి-మంచివారు ఉన్నారు, వారు మనసుకు సంతోషం కలిగిస్తూ ఉంటారు. ప్రపంచంలోనైతే చాలా దుఃఖము, కొట్లాటలు ఉన్నాయి. రక్తపాతము చాలా జరుగుతుంది, దీనిని ముళ్ళ అడవి అని అంటారు. మీరు దీని నుండి దూరంగా ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. మేము గృహస్థ వ్యవహారంలో ఉంటూ సంగమములో నిలబడి ఉన్నామని బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉన్నాము. ముళ్ళ విస్తారము తొలగిపోతూ ఉంది. ప్రపంచంలో ధార్మికమైనవారు కేవలం మీరు మాత్రమే, అది కూడా నంబరువారు పురుషార్థానుసారంగా ఉన్నారు. ఎవరికైతే తండ్రి గురించే తెలియదో, వారు అధార్మికమైనవారు. ధార్మికమైనవారు మరియు అధార్మికమైనవారు, పాండవులు మరియు కౌరవులు అని అంటారు కూడా. పాండవుల యొక్క స్థూల యుద్ధమేదీ లేదు. మీది మాయతో గుప్తమైన యుద్ధము, ఒకవేళ మీరు తండ్రిని స్మృతి చేయకపోతే మాయ యొక్క చెంపదెబ్బలు తగులుతాయి, తుఫానులు వస్తాయి. తండ్రి అంటారు, ఇప్పుడు మీ ముఖము అటువైపు మరియు కాళ్ళు ఇటువైపు ఉన్నాయి. ఎల్లప్పుడూ కొత్త ప్రపంచాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. గృహస్థ వ్యవహారంలో అయితే ఉండాల్సిందే. తండ్రి అంటారు, నిర్బంధనులుగా ఉన్నవారికన్నా గృహస్థ వ్యవహారంలో ఉన్నవారి అవస్థ మంచిగా ఉంది. అందరూ అయితే ఒకే విధంగా ఉండలేరు. నంబరువారుగా ఉన్నారు. స్కూలులో ఎవరైనా ఒకే విధమైన నంబరు ఏమైనా తీసుకుంటారా. ఇది కూడా అనంతమైన స్కూల్. తండ్రి అన్ని సెంటర్ల పిల్లలను చూసుకుంటారు, దీనినే విశాలబుద్ధి అని అంటారు. ఎప్పుడైతే తండ్రిని స్మృతి చేస్తారో, అప్పుడే విశాలబుద్ధి కలవారిగా అవుతారు.

పిల్లలైన మీది ఇప్పుడు విశాలబుద్ధిగా అయింది. మీకు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము గురించి మరియు ఈ చక్రమంతా ఎలా తిరుగుతుంది అన్నది తెలుసు, దీనిని విశాలబుద్ధి లేక అనంతమైన బుద్ధి అని అంటారు. మనుష్యుల బుద్ధి హద్దుకు సంబంధించినది. మీది అనంతమైన బుద్ధిగా అవుతుంది. కావున పిల్లలు చాలా మధురంగా అవ్వాల్సి ఉంటుంది. ఎంత మధురంగా అవుతారో, సంపూర్ణంగా అవుతారో, అంతగా వారు భవిష్యత్తులో అవినాశీగా అవుతారు. నాలో దేహాభిమానమైతే లేదు కదా అని చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా పనిలో కాదు అని చెప్తున్నారంటే వారిలో దేహాభిమానము ఉందని భావించబడుతుంది. సత్యయుగంలో అందరూ దేహీ-అభిమానిగా ఉంటారు. ఒక పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకోవాలి అని వారికి తెలుసు. ఇక్కడైతే ఎంతగా ఏడుస్తారు. దేహాభిమానము ఉంది కదా. దేహముపై చాలా ప్రేమ ఉంటుంది.

పిల్లలైన మీ కోసం ఈ ప్రపంచము ఇక లేనట్లే. అశరీరిగా వచ్చారు, అశరీరిగా అయి వెళ్ళాలి. అనంతమైన తండ్రి పిల్లలను చదివిస్తారు, వారిపై ఎంత గౌరవముంచాలి. కోతి ఎవ్వరిపైనా గౌరవముంచదు. ఏనుగుతో కూడా గుర్రు గుర్రుమంటుంది. కనుక ఎవరైతే లోపల చేదుగా ఉంటారో, తండ్రి వారిని సుపుత్రులు అని ఏమైనా అంటారా. వారికన్నా బయట ఉన్నవారు మంచివారు, గౌరవమైతే ఉంటుంది అని అంటారు. దీనిని కూడా డ్రామా అనే అంటారు. ఈ రోజు బాగా నడుస్తున్నారు, రేపు మాయా తుఫానులు వస్తాయి. మేము తుఫానులో ఉన్నామని అర్థము చేసుకోరు. పెద్ద-పెద్దవారికి కూడా తుఫానులైతే వస్తాయి కదా. అయినా కూడా డ్రామా అని అనడము జరుగుతుంది. మనం శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము, దీనిని మర్చిపోతే భాగ్యము పాడైపోతుంది. శివబాబా భండారి ద్వారా భాగ్యము సంపన్నమవుతుంది. వీరిని మర్చిపోతే జోలి ఖాళీ అయిపోతుంది. ప్రజలలో కూడా సాధారణ పదవిని పొందుతారు. శిక్షలనైతే చాలా అనుభవిస్తారు. వారు స్వయము వదిలేయడము ద్వారా మళ్ళీ ఇతరులను కూడా సంశయబుద్ధి కలవారిగా చేస్తారు. బాబాకైతే దయ కలుగుతుంది. కానీ పిల్లలు మాయ యొక్క దాడిని సహనం చేయలేరు. గురువు నేర్పించడమైతే చాలా నేర్పిస్తారు. స్థిరంగా, నిశ్చలంగా ఉండాలి. లేదంటే ఇంకా వెండి యుగము వరకు కూడా చేరుకోలేదని బాబా భావిస్తారు. ఆశ్చర్యమనిపిస్తుంది. జ్ఞానము పూర్తిగా లేని కారణంగా, శివబాబాతో యోగం లేని కారణంగా పడిపోతారు. తుఫానులైతే ఎలాంటివి-ఎలాంటివి వస్తాయి. ఎక్కడము మరియు పడిపోవడము – ఇదైతే జరుగుతూనే ఉంటుంది. పడిపోతే మళ్ళీ లేచి నిలబడాలి కదా. మనకు శివబాబాతో పని ఉంది. ఏం జరిగినా కానీ మనము శివబాబా నుండి వారసత్వము తీసుకోవాలి. మమ్మా, బాబా కూడా వారి నుండే తీసుకుంటారు, వారినే స్మృతి చేయాలి. వారి మురళీని వినాలి. లేదంటే ఎక్కడికి వెళ్తారు. దుకాణమైతే ఒక్కటే కదా. ఇక్కడికి రాకుండా ముక్తి-జీవన్ముక్తి లభించజాలదు. తండ్రి ఎదురుగానైతే రావాల్సిందే కదా. అయితే, ఎవరైనా బంధనంలో ఉన్నవారుంటే, వారు బాబా స్మృతిలో మరణిస్తే వారు కూడా మంచి పదవిని పొందుతారు. ఇక్కడ ఎవరైతే దేహాభిమానంలోకి వచ్చి అవజ్ఞ చేస్తారో, అటువంటివారి కన్నా బంధనంలో ఉన్నవారి పదవి బాగుంటుంది ఎందుకంటే బాబా స్మృతిలో మరణించారు కదా. మంచి సౌభాగ్యము కదా. ఈ జ్ఞాన మార్గంలో ఇంకే కష్టమూ ఉండదు. చాలా సహజము. ఇక్కడ చాలా దేహీ-అభిమానిగా అవ్వాలి. చాలామంది దేహాభిమానంలో ఉంటారు. బాబా అయితే ఇంకేమీ అనరు, కేవలం మనసులో జాలిపడతారు. శివబాబా భండారి నుండి శరీర నిర్వహణ చేస్తారు. యజ్ఞాన్ని ఏ మాత్రమూ సంభాళించకపోతే ఏం పదవిని పొందుతారు? ఈ యజ్ఞాన్ని అయితే చాలా సంభాళించాలి. ఎక్కడ సెంటర్లు స్థాపించబడినా, అవి శివబాబా యజ్ఞాలే. ఈ యజ్ఞాన్ని రచించేందుకు కేవలం 3 అడుగుల పృథ్వి కావాలి. అంతే. ఎవరైనా వృద్ధులు ఉంటే, స్వయం ఇతరులకు అర్థం చేయించలేరు. అచ్ఛా, అప్పుడు ఎవరైనా సోదరిని లేక సోదరుడిని పిలవండి. ఒక చిన్న గదిని తయారుచేయండి మరియు బోర్డును తగిలించండి. ఇది చాలా పుణ్య కార్యము. ఇప్పుడిది కలియుగము, వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి నుండి తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. స్వర్గ వారసత్వము సంగమములోనే లభిస్తుంది, అప్పుడు పాత ప్రపంచము సమాప్తమవుతుంది, కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది. సంగమములో వారసత్వము లభిస్తుంది, అది మళ్ళీ భవిష్యత్తు కోసం అవినాశీగా అవుతుంది. మీరు చాలా అర్థం చేయించగలరు. కేవలం 3 అడుగుల పృథ్వి కావాలి, అంతే. ఒకరిద్దరిని మేలుకొల్పినా కూడా అహో సౌభాగ్యము. మీరు మన్మనాభవ అని ఒక్క మంత్రాన్నే ఇస్తారు. కేవలం ఇదే చెప్తారు, తండ్రిని స్మృతి చేసినట్లయితే అంత మతి సో గతి అవుతుంది. తండ్రి స్వర్గం యొక్క ఖజానాను ఇస్తారు. విన్నారు అంటే, ఇక బుద్ధిలో కూర్చుంటుంది. స్వర్గంలోకి వచ్చేందుకు యోగ్యులుగా అయిపోతారు. స్థలమిచ్చేవారికి హక్కు లభిస్తుంది. బాబా ఇంతగా సహజం చేసి తెలియజేస్తారు. ఎవరికైనా సుఖధామము యొక్క మార్గాన్ని తెలియజేయండి. ప్రజలుగా తయారైనా అది కూడా మంచిదే. నంబరువారుగా తయారవుతూ ఉంటారు. 3 అడుగుల పృథ్వి ప్రసిద్ధి చెందింది, దీనితో మీరు విశ్వానికి యజమానిగా అవుతారు. ప్రజలు కూడా అంటారు కదా – మేము విశ్వానికి యజమానులము. ఇది (ఇల్లు) కూడా 3 అడుగుల పృథ్వియే కదా! ఆరంభము కూడా 3 అడుగుల పృథ్వితోనే జరిగింది. ఒక గది ఉండేది, తర్వాత నెమ్మది-నెమ్మదిగా పెద్దగా అవుతూ వచ్చింది. ఇటువంటివారు చాలామంది వస్తారు, వారికి బాబా చెప్తారు – మీరు ఈ ధనాన్ని ఏం చేసుకుంటారు? మీకు చాలా మంచి సలహానిస్తాను, 3 అడుగుల పృథ్విని తీసుకోండి, 10-15 హాస్పిటల్స్, కాలేజీలను తెరవండి, మీ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకోండి. ఇదంతా సమాప్తమైపోతుంది. దీని కన్నా ఈ ఖర్చుతో 10-15 సెంటర్లు తెరిచినట్లయితే చాలామంది కళ్యాణం జరుగుతుంది. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. మీరు చిన్న స్థలంలో ఈ కాలేజిని తెరవవచ్చు. మీరు కేవలం మార్గాన్ని తెలియజేయాలి, అంధులకు చేతికర్రగా అవ్వాలి. మేల్కొల్పవలసి వస్తుంది. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తే చాలు, మీ నావ తీరానికి చేరుకుంటుంది. ఇంకే ఖర్చు మొదలైనవాటి విషయము లేదు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. అర్థం చేయించడము చాలా సహజము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఫస్ట్ క్లాస్ జ్ఞానయుక్త ఆత్మల యొక్క సాంగత్యము చేయాలి. దేహీ అభిమానిగా అవ్వాలి. దేహాభిమానుల సాంగత్యము నుండి దూరంగా ఉండాలి.

2. యజ్ఞాన్ని చాలా ప్రేమతో, సత్యమైన హృదయంతో సంభాళించాలి. చాలా ప్రియమైనవారిగా, మధురంగా అవ్వాలి. సుపుత్రులుగా అయ్యి చూపించాలి. ఎటువంటి అవజ్ఞను చేయకూడదు.

వరదానము:-

మొత్తం రోజంతటిలో ఏ ఆత్మలైతే సంబంధ సంపర్కంలోకి వస్తారో, వారికి మహాదానిగా అయి ఏదో ఒక శక్తిని, జ్ఞానాన్ని, గుణాలను దానమివ్వండి. దానము అన్న పదానికి ఆత్మిక అర్థము, సహయోగాన్ని ఇవ్వడము. మీ వద్ద జ్ఞానం యొక్క ఖజానా కూడా ఉంది, అలాగే శక్తులు మరియు గుణాల యొక్క ఖజానా కూడా ఉంది. మూడింటిలోనూ సంపన్నంగా అవ్వండి, ఒకదానిలో కాదు. ఎటువంటి ఆత్మ అయినా కానీ, దూషించేవారైనా కానీ, నిందించేవారైనా కానీ – వారికి కూడా తమ వృత్తి లేక స్థితి ద్వారా గుణాల దానమివ్వండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top