31 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

30 August 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఉదయముదయమే లేచి తండ్రిని ప్రేమగా స్మృతి చేసినట్లయితే రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు’’

ప్రశ్న: -

21 జన్మల కోసం సుసంపన్నులుగా అయ్యేందుకు సాధనమేమిటి?

జవాబు:-

అవినాశీ జ్ఞాన రత్నాలను దానమిచ్చినట్లయితే సుసంపన్నులుగా అవుతారు ఎందుకంటే ఈ ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల రూపాయల విలువైనది. ఎవరు ఎంతగా దానము చేస్తారో, తండ్రి స్మృతిలో ఉంటారో, అంతగా వారికి సంతోషమనే పాదరసం ఎక్కి ఉంటుంది.

ప్రశ్న: -

తమ ద్వారా ఎటువంటి పాప కర్మ జరగకూడదు, దాని కోసం ఏ పథ్యము కావాలి?

జవాబు:-

భోజనము విషయంలో చాలా పథ్యము ఉండాలి. పాపాత్ముల భోజనం లోపలకి వెళ్ళడముతో దాని ప్రభావం పడుతుంది. ప్రతి ఒక్కరి పరిస్థితులను చూసి తండ్రి సలహానిస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఎవరు కూర్చుని ఉన్నారు, ఎవరు వచ్చారు? ఆత్మలమైన మేమందరము ఈ సమయంలో పతితముగా ఉన్నామని జీవాత్మలకు తెలుసు. ప్రత్యేకంగా భారత్ మరియు మిగతా ప్రపంచమంతా ఓ పతిత-పావనా, అని పిలుస్తారు. ఇది పతిత ప్రపంచము. ఆత్మలందరూ పతితంగా, దుఃఖితులుగా, నల్లగా అయ్యారు. పతిత-పావనుడు అనంతమైన తండ్రి, వారిని జ్ఞాన సాగరుడు, సర్వుల సద్గతి దాత అని అంటారు. పిల్లలు తండ్రి ఎదురుగా కూర్చున్నారు. పిల్లలకు ఎక్కడి నుండి పరిచయం లభించింది? పతిత-పావనుడైన తండ్రి ద్వారా లభించింది. ఎప్పుడైతే సత్యయుగము ఉండేదో, అప్పుడు అక్కడ రాజా రాణి మరియు ప్రజలు, అందరూ పావనంగా ఉండేవారు. అందరూ బంగారు యుగంలో ఉండేవారు. జీవాత్మలమైన మేము కూర్చుని ఉన్నామని పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం ఉంది. ఆత్మ శరీరముతో పాటు ఉన్నప్పుడు సుఖాన్ని లేక దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఆత్మ శరీరంలో లేకపోతే శరీరానికి ఏమీ తెలియదు. ఆత్మ ఒక శరీరం నుండి బయటకు వచ్చి మరొక శరీరంతో కనెక్షన్ జోడించినప్పుడు అది చైతన్యమవుతుంది. శరీరము జడమైనది. జడమైనది కూడా వృద్ధి చెందుతుంది. మొదట 5 తత్వాల బొమ్మ తయారవుతుంది, అందులో ఇంద్రియాలు ఏర్పడతాయి, అప్పుడు అందులో ఆత్మ ప్రవేశిస్తుంది, తర్వాత అది చైతన్యమవుతుంది. ఇప్పుడు జీవాత్మలైన మీరు కూర్చుని ఉన్నారు, మీ ఎదురుగా తండ్రి కూర్చున్నారు. వారు కూడా పరమ సుప్రీమ్ ఆత్మ మరియు ఎవర్ ప్యూర్ (సదా పావనుడు). ఇప్పుడు తండ్రి పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు – పిల్లలూ, మీరు కూడా తండ్రి వలె పావనంగా అవ్వాలి. ఆత్మలైన మీరు అమరులు, మీరు మొదట శాంతిధామంలో ఉండేవారు. మీకు తెలుసు, ఆత్మలమైన మనము శివబాబా వద్దకు వచ్చాము, వారు ఈ సాధారణ శరీరాన్ని ధారణ చేసారు. కేవలం పరమపిత పరమాత్మ తప్ప పిల్లలకు ఈ విధంగా కూర్చుని డైరెక్షన్లు ఇచ్చేవారు ఇంకెవ్వరూ ఉండజాలరు. వారైతే పరమాత్మ ఎప్పుడూ రారు, వారు నామ రూపాలకు అతీతమైనవారు అని భావిస్తారు. మనం మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి మనల్ని పావనంగా ఎలా తయారుచేస్తారు అన్నది గుర్తించారు. ఆత్మ పతితంగా అవ్వడముతో శరీరము కూడా పతితముగా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. ఆత్మలమైన మనం మూలవతనంలో పావనంగా ఉండేవారము. ఈ-ఈ విధంగా తమతో తాము మాట్లాడుకోవాలి. విచార సాగర మథనము చేయాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు పరిచయం లభించింది. ఆత్మలమైన మనం నిర్వాణధామంలో ఉండేవారము, ఆ తర్వాత సుఖం యొక్క పాత్రను అభినయించేందుకు సత్యయుగంలోకి వస్తాము. మీరు ఆల్ రౌండర్లు, అందుకే మొట్టమొదట మీకు జ్ఞానం లభించింది. శివబాబా, ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల యొక్క రచనను రచిస్తారని మీకు తెలుసు. బాబా అంటారు, జీవాత్మలైన మిమ్మల్ని శూద్ర వర్ణము నుండి బ్రాహ్మణ వర్ణములోకి తీసుకువచ్చాను. శూద్రుల నుండి ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు బ్రహ్మా ముఖ వంశావళిగా అయ్యారు. ఎందుకు? వారసత్వము తీసుకునేందుకు. బ్రహ్మా ముఖ వంశావళిగా కేవలం సంగమములోనే అవుతారు. సంగమము మీ కోసమే ఉంది. ఆత్మలైన మీరు అంటారు – మేము మొదట పావనంగా ఉండేవారము, ఇప్పుడు పతితంగా అయ్యాము, మళ్ళీ పావనంగా అదే విధంగా అవుతాము. ఓ పతిత-పావన బాబా, మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని పతితము నుండి పావనముగా చేయండి. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు ఆత్మకు ఔషధము లభించింది. ఆత్మలమైన మనము పావనంగా ఉన్నప్పుడు ముక్తిధామంలో ఉండేవారము, ఆ తర్వాత స్వర్గంలోకి వచ్చాము, ఇన్ని జన్మలు తీసుకున్నాము, ఇక కిందకు పడిపోతూ వచ్చాము, మళ్ళీ బంగారు యుగంలోకి వెళ్ళాలి. బాబా అంటారు, నేను 5 వేల సంవత్సరాల క్రితము కూడా – నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పాను. గృహస్థ వ్యవహారంలో, వ్యాపారాలు మొదలైనవాటిలో ఉంటూ కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి, ఇప్పుడు మనము పావనంగా అవ్వాలి. ఇంటికి వెళ్ళాలి. పావన ప్రపంచానికి యజమానిగా అవ్వాలి. ఇప్పుడు మేము ఇనుప యుగము నుండి బంగారు యుగంలోకి ఎలా వెళ్ళాలి, ఈ చింత నిత్యం ఉండాలి. బాబా అయితే ఏ సహజ యుక్తిని తెలియజేస్తారంటే – నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. గీతలో ‘మన్మనాభవ’ అన్న ఈ మహావాక్యము రెండు సార్లు ఉంది. ఓ పిల్లలూ, దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. తండ్రిని స్మృతి చేయండి. వారు అథారిటీ. మీకు అన్ని శాస్త్రాల సారాన్ని, సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయించారు. మీరు ఎంతగా నన్ను స్మృతి చేస్తారో, అంతగా మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది, వేరే ఉపాయము ఏమీ లేదు. రాతి బుద్ధి కలవారు పారసబుద్ధి కలవారిగా అవ్వాలి. గంగా స్నానాలతో పావనంగా అవ్వరు. ఒకవేళ అలా అయినట్లయితే ఇక్కడ ఉండనే ఉండరు. కానీ ఇనుప యుగంలోకి అందరూ వచ్చేదే ఉంది. కావున మొదట ఉదయముదయమే ఈ ఆలోచనలో కూర్చోవాలి. ప్రభాత వేళలో రాముడిని స్మరించు మనసా… అని అంటారు కదా. ఆత్మ అంటుంది, ఓ నా బుద్ధి, ఇప్పుడు తండ్రిని స్మృతి చేయి… బుద్ధి యొక్క యోగాన్ని తండ్రితో జోడించాలి. ఇప్పుడు ఎవరు ఎంతగా జోడిస్తారో, అంతగా రాతిబుద్ధి నుండి బంగారుబుద్ధి కలవారిగా అవుతూ ఉంటారు. పారసబుద్ధి కలవారిగా తయారుచేసేది ఒక్క తండ్రి మాత్రమే. వారంటారు – నేను కల్ప-కల్పము వచ్చి సంగమములో మిమ్మల్ని తయారుచేస్తాను. ఇది క్షణము యొక్క విషయము కదా. ఏ విధంగానైతే డాక్టర్లు కురుపు లోలోపలే అంతమయ్యేలాంటి మందును ఇస్తారు. తండ్రి అంటారు, మీరు కూడా నోటి ద్వారా ఏమీ అనాల్సిన అవసరం లేదు. చేతులు, కాళ్ళతో కూడా ఏమీ చేసేది లేదు. కేవలం బుద్ధితో స్మృతి చేయాలి. కల్పక్రితము కూడా మీరు స్మృతి చేసారు, తద్వారా వికర్మలు భస్మమయ్యాయి. ఈ విధంగా మీకు ఇంతకుముందు అర్థం చేయించాను, ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నాను. ఇప్పుడు మీరు తండ్రి స్మృతితో పారసబుద్ధి కలవారిగా అవ్వాలి. తండ్రి అంటారు, పతిత-పావనుడైన మీ తండ్రినైన నేను కల్ప-కల్పము యొక్క సంగమములో శ్రీమతాన్ని ఇవ్వడానికి వస్తాను. ఓ నా మధురమైన ప్రియమైన పిల్లలూ, ఇది ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా వింటుంది. ఇది బ్రహ్మా ముఖము, గోముఖము అని అంటారు కదా. ఇక్కడ గోవు అనగా జంతువు కాదు. వీరు గోమాత కదా. ఈ గోముఖము ద్వారా వినిపిస్తారు. మందిరాలలోనేమో ఆ గోవు ముఖాన్ని చూపించారు. ఆ గోవు ముఖం నుండి నీరు ప్రవహిస్తుంది. దానినే గోముఖము అని భావిస్తారు. అది గంగా జలము అని భావిస్తారు. ఈ జ్ఞానాన్ని తండ్రి వీరి ద్వారా ఇస్తారని మీకు తెలుసు. వీరు గోమాత కదా. వీరు పెద్ద తల్లి. వీరికి తల్లి ఎవ్వరూ లేరు. సాకార మమ్మాకు కూడా వీరు తల్లి అయ్యారు కదా. మాతలైన మీరందరూ గోవులు. మీ నోటి నుండి ఈ జ్ఞాన వర్షము కురుస్తుంది. ఇకపోతే, నీటి నదులైతే అన్ని చోట్ల ఉంటాయి. ఆ గంగ పతిత-పావని కాలేదు. గంగా నది వద్దన కూడా మందిరం ఉంది. అక్కడ దేవత యొక్క మూర్తి ఉంది. ఈ దేవతలలోనైతే జ్ఞానము లేదు. జ్ఞానము మీకు లభిస్తుంది, దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. దేవతలను జ్ఞాని అని అనరు. విష్ణువుకు అలంకారాలను చూపిస్తారు, వాస్తవానికి అవి బ్రాహ్మణులైన మీ అలంకారాలు. పిల్లలైన మీరు ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పాలి, ఇందులో హింస యొక్క విషయమేమీ లేదు. ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు. జ్ఞానం యొక్క శంఖాన్ని మోగించాలి మరియు చక్రాన్ని స్మృతి చేయాలి. ఇది స్వదర్శన చక్రము, వారేమో రాట్నాన్ని చూపించారు. కమలపుష్ప సమానంగా పవిత్రంగా కూడా మీరు ఇక్కడే అవ్వాలి. గద కూడా జ్ఞానానికి సంబంధించినది, దాని ద్వారా మాయపై విజయాన్ని పొందాలి. కావున ఇవన్నీ మీ అలంకారాలు.

పిల్లలైన మీకు తెలుసు – ఇది నరకము, స్వర్గము అటువైపు ఉంది, మనము సంగమములో ఉన్నాము. ఒక వైపు మురికి నీరు, మరొక వైపు మంచి నీరు ఉంది. వాటి సంగమము జరుగుతుంది, దానిని వెళ్ళి చూస్తారు. వీరు జ్ఞాన సాగరుడైన పరమపిత పరమాత్మ మరియు మీరు మురికిగా ఉన్న నదులు. తండ్రి కూర్చుని తమ సమానంగా పవిత్రంగా తయారుచేస్తారు. తండ్రిని స్మృతి చేయండి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పండి, ఇందులో కృప మొదలైనవాటి యొక్క విషయమేమీ లేదు. టీచరుతో ఎప్పుడైనా – మాస్టర్గారు, మీరు కృప చూపండి, అప్పుడు మేము ఉన్నత పదవిని పొందుతాము అని ఏమైనా అంటారా ఏమిటి. అప్పుడు టీచరు చదవండి అని చెప్తారు. తండ్రి అయితే, నేను అందరినీ ఒకేలా చదివిస్తాను అని అంటారు. మీరు పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు. మీరు ఈ డ్రామాలోని పాత్రధారులు మరియు మీకు డ్రామా యొక్క ఆది మధ్యాంతాలు, క్రియేటర్, డైరెక్టరు గురించి తెలియదు. మీరు రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకోవడముతో పారసబుద్ధి కలవారిగా అవుతారు. తండ్రి అంటారు, ఉదయము కేవలం అరగంట, ముప్పావు గంట కూర్చుని ఈ విచార సాగర మథనము చేయండి. పాయింట్లు అయితే మీకు చాలా వినిపిస్తారు. వారైతే కూర్చుని 18 అధ్యాయాలు తయారుచేసారు. భక్తి మార్గంలో మళ్ళీ డ్రామానుసారంగా ఈ శాస్త్రాలు మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేయాలి. అమృతవేళ లేచి తమతో తాము మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి. మాలలోని మణి పూసగా అవ్వాలి. తండ్రి స్మృతితో పవిత్రంగా అవుతారు, ఎంతగా పవిత్రంగా అవుతూ ఉంటారో మరియు అలా తయారుచేస్తూ ఉంటారో, అంతగా సంతోషమనే పాదరసం ఎక్కుతూ ఉంటుంది. ఈ అవినాశీ జ్ఞాన రత్నాల దానాన్ని ఇతరులకు ఇవ్వాలి. షావుకార్లు దాన-పుణ్యాలు చేస్తారు కదా. మీరు అవినాశీ జ్ఞాన రత్నాల దానము చేసేవారు. ఒక్కొక్క రత్నము లక్షల విలువైనది. మీరు ఎంతగా పవిత్రంగా అవుతారో, అంతగా 21 జన్మల కోసం సుసంపన్నులుగా అవుతారు. మీరు ఎప్పుడైతే పారసబుద్ధి కలవారిగా ఉండేవారో, అప్పుడు సుఖము, శాంతి, సంపద అన్నీ ఉండేవి. ఇప్పుడు రాతిబుద్ధి కలవారిగా అవ్వడముతో అంతా సమాప్తమైపోయింది. ఇప్పుడు తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని ఉదయము లేచే అభ్యాసము ఏర్పరచుకోండి. ఆ సమయం మంచిది. అంధకారమయమైన రాత్రిలో మనుష్యులు ఘోర పాపాలు చేస్తారు. ఇప్పుడు మీరు పావనంగా అవ్వాలి. మీరు 100 శాతము నిర్వికారిగా ఉండేవారు. ఇప్పుడు ఆత్మలో మాలిన్యము చేరుకుంది, అది యోగ భట్టీతో, యోగాగ్నితో తొలగుతుంది. ఈ జ్ఞానము మరియు యోగము గురించి ఏదైతే అర్థం చేయిస్తారో, అది ఎప్పుడూ వినాశనమవ్వదు. కొద్దిగా విన్నా సరే ప్రజలలోకి వస్తారు. తండ్రి అంటారు, పిల్లలూ, కల్పక్రితము వలె పూర్తి వారసత్వము తీసుకోండి. అప్పటివారే రాజులుగా, అప్పటివారే ప్రజలు మొదలైనవారిగా అవుతారు. అజ్ఞాన కాలములో కూడా దాన-పుణ్యాలు చేసినట్లయితే రాజ కుటుంబంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. కొందరు కర్మల అనుసారముగా పేదవారి ఇంట్లో జన్మ తీసుకుంటారు. తండ్రి కూర్చుని కర్మ, వికర్మ, అకర్మల గతిని అర్థం చేయిస్తారు. సత్యయుగంలో కర్మ అకర్మగా అవుతుంది ఎందుకంటే మాయ ఉండనే ఉండదు. ఇది రావణ రాజ్యము, అది రామ రాజ్యము. ఇప్పుడు రావణ రాజ్యము వినాశనమై, సత్యయుగ స్థాపన జరుగుతూ ఉంది. తండ్రి అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు. కన్యలు చాలా బాగా అర్థం చేయించాలి, వారు బంధన ముక్తులు. కన్యల సంపాదనను తల్లిదండ్రులు తినరు. తల్లిదండ్రులు కన్యను పూజిస్తారు. కన్య ఎప్పుడైతే వికారీగా అవుతుందో, అప్పుడు అందరి ఎదురుగా తల వంచి నమస్కరించవలసి ఉంటుంది. అయితే కన్య కూడా దేవతల ఎదురుగా తల వంచి నమస్కరిస్తుంది. ఎందుకంటే జన్మ అయితే పతితమైన తల్లిదండ్రుల నుండి తీసుకున్నది కదా. దేవతలైతే ఉన్నదే పావనులుగా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు – మేమే దేవతలుగా ఉండేవారము, 84 జన్మలు తీసుకొని మళ్ళీ పతితులుగా అయ్యాము, దిగిపోతూ వచ్చాము. ఇప్పుడు మేము మళ్ళీ శ్రీమతముపై నడుచుకోవాల్సి ఉంటుంది, అప్పుడిక ఎటువంటి పాప కర్మలు జరగవు, పాపాత్ముల భోజనము లోపలికి వెళ్ళదు. పథ్యము పాటించమని చెప్పడము జరుగుతుంది కదా, లేదంటే ఆ ప్రభావం పడుతుంది. కానీ అక్కడక్కడ పరిస్థితులు చూడడము జరుగుతుంది. కర్మల లెక్కాచారము ఉంటుంది, భోజనం వేరుగా తయారుచేసుకోనివ్వరు. అచ్ఛా, తండ్రిని స్మృతి చేయండి, తప్పనిసరి పరిస్థితి ఉంది – బాబాను స్మృతి చేసి తినండి. మర్చిపోయినట్లయితే మీపై దాని ప్రభావం పడుతుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే సమీపంగా వస్తూ ఉంటారు. ఇప్పుడైతే సమ్ముఖంలో కూర్చున్నారు. తండ్రి డైరెక్ట్ గా అర్థం చేయిస్తారు. ఓ పిల్లలూ, ఓ పిల్లలూ, అని అంటూ తండ్రి మాట్లాడుతున్నారు కావున తండ్రిని స్మృతి చేయాలి. ఇక చేస్తారా చేయరా మీ ఇష్టము. ఎవరైతే చేస్తారో వారు తప్పకుండా పొందుతారు. ఇది స్పష్టమైన విషయము.

ఇదైతే అర్థం చేసుకున్నారు – ఇది హాస్పిటల్. ఇది ఆరోగ్యము, ఐశ్వర్యము యొక్క యూనివర్సిటీ కూడా. దీని కోసం కేవలం మూడు అడుగుల భూమి కావాలి, అంతే. అనంతమైన తండ్రిని చూడండి, ఎలా చదివిస్తారో. ఎంతటి నిరహంకారి తండ్రి. పతిత శరీరములో, పతిత ప్రపంచములో కూర్చుని పిల్లలైన మీ వెనుక ఎంతగా శ్రమిస్తున్నారు. పిల్లలూ, మీరు మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకోండి. ఎవరెవరు మంచి పురుషార్థము చేస్తున్నారో నేను సాక్షీగా ఉండి చూస్తున్నాను. ఇందులో కేవలం 3 అడుగుల భూమి కావాలి. కలకత్తాలో సెంటరు ఉంది, ఎంతమందికి కళ్యాణము జరుగుతూ ఉంది, ఎవరైతే పరస్పరములో కలిసి సెంటరు నడిపిస్తారో, వారికి కూడా పదవి లభిస్తుంది. క్లాసుకు సరిపడా గది ఉండాలి, అందులో అందరూ క్లాసు వినగలగాలి. మనమైతే బంగారు యుగంలోకి వెళ్ళాలి. కేవలం స్మృతి తప్పితే వేరే ఉపాయమేమీ లేదు. తండ్రి అంటారు, పిల్లలూ, తమ మరియు ఇతరుల కళ్యాణము చేయాలి. మీరు ఈ హాస్పిటల్ ను తెరవండి. మీకు ఇక్కడ చాలా మంది యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. మనుష్యులు ఇతరుల కోసం కాలేజీలు తెరుస్తారు. వారు స్వయము అందులో చదువుకోరు, అయితే వారికి మరుసటి జన్మలో మంచి విద్య లభిస్తుంది. తండ్రి అంటారు, పేదవారు అయినా సరే, షావుకార్లు అయినా సరే, 3 అడుగుల భూమిని ఏర్పాటు చేయాలి, అక్కడ కూర్చుని జ్ఞానాన్ని మరియు యోగాన్ని నేర్పించాలి, రాతి నుండి పారసముగా తయారుచేయాలి. ఇక్కడ సోదరీ-సోదరులుగా చేస్తారు, విషం యొక్క వారసత్వం నుండి విడిపిస్తారు, అటువంటప్పుడు ప్రపంచం ఎలా నడుస్తుంది అని అంటారు. ఇది పిల్లలైన మీకు తెలుసు, అక్కడ ఈ ప్రపంచమేమీ భోగ బలానికి సంబంధించినది కాదు. అక్కడైతే యోగబలంతో పిల్లలు జన్మిస్తారు. ఇప్పుడు మీరు ఆ కొత్త విశ్వానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉదయాన్నే లేచే అభ్యాసము ఏర్పరచుకోవాలి. ఉదయముదయమే లేచి విచార సాగర మథనము తప్పకుండా చేయాలి. అరగంట, ముప్పావు గంట అయినా కూర్చుని తమతో తాము మాట్లాడుకోవాలి. బుద్ధిని జ్ఞానముతో నిండుగా చేసుకోవాలి.

2. అనేకుల ఆశీర్వాదాలు తీసుకునేందుకు 3 అడుగుల భూమిపై కాలేజీను లేక హాస్పిటల్ ను తెరవాలి. తండ్రి సమానముగా నిరహంకారిగా అయి సేవ చేయాలి.

వరదానము:-

జ్ఞానములో నవీనతకు అర్థమేమిటంటే, వివేకవంతులుగా అయి నడుచుకోవడము అనగా తమలో ఏదైతే లోపము ఉందో దానిని సమాప్తం చేస్తూ వెళ్ళడము. యోగం యొక్క ప్రయోగంలో నవీనత అనగా దాని పర్సెంటేజ్ ను పెంచడము. అదే విధంగా నాలుగు సబ్జెక్టులలోనూ స్వయం యొక్క ప్రగతిలో నవీనత, విధిలో నవీనత, ప్రయోగములో నవీనత, సేవలో నవీనత, ఇతరులను సహజయోగిగా తయారుచేయడంలో లేక పర్సెంటేజ్ ను పెంచడంలో నవీనతను అనుభవం చేయడము అనగా తీవ్ర పురుషార్థీగా అవ్వడము, దీని ద్వారానే సమీపతను అనుభవం చేస్తారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

அழிவற்ற ஞான இரத்தினங்களை தானம் செய்தீர்கள் என்றால் மிகுந்த செல்வம் நிறைந்த வராக ஆகி விடுவீர்கள், ஏனென்றால் இந்த ஒவ்வொரு ஞான ரத்தினமும் இலட்சக் கணக்கான ரூபாயின் மதிப்பு மிக்கவை ஆகும். ஒருவர் எந்த அளவு தானம் செய்கின்றனரோ, தந்தையை நினைவு செய்கின்றனரோ அந்த அளவு அவர்களுக்கு குஷியின் எல்லை அதிகரித்தபடி இருக்கும்.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top