30 June 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 29, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తండ్రితో ఏ ప్రతిజ్ఞనైతే చేసారో దానిపై పూర్తి-పూర్తిగా నడుచుకోవాలి, ధరణిని వదిలినా ధర్మాన్ని వదలకండి - ఇదే అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యము, ప్రతిజ్ఞను మర్చిపోయి తప్పుడు కర్మలు చేసినట్లయితే రిజిస్టర్ పాడైపోతుంది’’

ప్రశ్న: -

యాత్రలో మనం వేగంగా వెళ్తున్నాము అన్నదానికి ఆనవాలు లేక గుర్తులు ఏమిటి?

జవాబు:-

ఒకవేళ యాత్రలో వేగంగా వెళ్తూ ఉన్నారంటే బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది. సదా తండ్రి మరియు వారసత్వం తప్ప ఇంకేదీ కూడా గుర్తుండదు. యథార్థమైన స్మృతి అంటేనే ఇక్కడివేవీ కూడా కనిపించకూడదు. చూస్తున్నా కూడా చూడనట్లుగా ఉండాలి. వారు అంతా చూస్తున్నప్పటికీ కూడా ఏమని భావిస్తారంటే – ఇదంతా మట్టిలో కలిసిపోనున్నది. ఈ మహళ్ళు మొదలైనవి సమాప్తమవ్వనున్నాయి. ఇవేవీ కూడా మా రాజధానిలో ఉండేవి కావు, తర్వాత కూడా ఉండవు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నా అదృష్టానికి నావికుడు… (మాంఝీ మేరే కిస్మత్ కీ…)

ఓంశాంతి. వాస్తవానికి పాటలోని ఈ వాక్యము రాంగ్. తండ్రి అంటారు, పిల్లలూ, నేను మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఎక్కడికి తీసుకువెళ్తారు? ముక్తి మరియు జీవన్ముక్తిధామానికి. ఎంత ఉన్నత పదవి కావాలనుకుంటే అంత తీసుకోండి. అంతేకానీ వారు ఎక్కడ కోరుకుంటే… అని కాదు. పురుషార్థం చేయాలి అనైతే అందరూ కోరుకుంటారు. కానీ డ్రామానుసారంగా పురుషార్థులందరూ ఒకే విధంగా అయితే తయారవ్వరు. ఇక్కడైతే పిల్లలు తమపై తాము కృప చూపించుకోవాలి. జ్ఞానసాగరుడైతే జ్ఞాన-యోగాలను నేర్పించేందుకు వచ్చారు. ఇదే వారు చూపించే కృప. టీచరు చదివిస్తారు, యోగులు యోగాన్ని నేర్పిస్తారు. ఇకపోతే ఎక్కువ నేర్చుకోవడము, తక్కువ నేర్చుకోవడమనేది తమపై ఆధారపడి ఉంది. మీకు తెలుసు, మనమంతా సత్యమైన సాంగత్యంలో కూర్చుని ఉన్నాము, అంతేకానీ అసత్యమైన సాంగత్యంలో కాదు. సత్యమైన సాంగత్యము ఒక్కటే ఉంది ఎందుకంటే సత్యమైనవారు ఒక్కరే. సత్యయుగం యొక్క స్థాపన కూడా వారే చేస్తారు మరియు సత్యయుగంలోకి తీసుకువెళ్ళేందుకు పురుషార్థం కూడా చేయిస్తారు. సత్యం గురించి ఒక శ్లోకము కూడా ఉంది, సత్యం మాట్లాడండి, సత్యంగా నడుచుకోండి, అప్పుడే సత్యఖండంలోకి వెళ్ళగలరు. సిక్కులు కూడా సత్ శ్రీ అకాల్ అని అంటారు. ఆ సత్యమైన తండ్రి ఒక్కరే అందరికన్నా శ్రేష్ఠమైనవారు, అకాలమూర్తి. వారిని ఎప్పుడూ మృత్యువు కబళించదు. మనుష్యులనైతే పదే-పదే మృత్యువు కబళిస్తుంది. కావున పిల్లలైన మీరు సత్యమైన సత్సంగంలో కూర్చుని ఉన్నారు. భారత్, ఏదైతే ఇప్పుడు అసత్య ఖండంగా ఉందో, దానిని సత్య ఖండంగా తయారుచేసేవారు ఒక్క తండ్రే. దేవీ-దేవతలందరూ పిల్లలు. దేవతలు ఇక్కడి నుండి పుణ్యాత్మ యొక్క వారసత్వాన్ని తీసుకువెళ్తారు. ఇక్కడైతే అసత్యమే అసత్యము ఉంది. గవర్నమెంట్ ఏ ప్రమాణమైతే చేయిస్తుందో, అది కూడా అసత్యమే. మేము భగవంతునిపై ప్రమాణం చేసి సత్యం చెప్తున్నామని అంటారు. కానీ ఇలా చెప్పినా మనుష్యులకు భయముండదు. దీని కన్నా, వారు తమ ప్లిలలపై ప్రమాణం చేస్తున్నామని చెప్తే, అప్పుడు భయపడతారు, దుఃఖం కలుగుతుంది ఎందుకంటే ఈశ్వరుడు తమకు పిల్లలను ఇస్తారని భావిస్తారు. ఈశ్వరుని పేరు మీద మేము పిల్లలపై ప్రమాణం చేస్తే, వారు మరణిస్తారేమో తెలియదు… కావున వారు దీనిలో భయపడతారు. స్త్రీ, తన పతిపైన ఎప్పుడూ ప్రమాణం చేయదు. పురుషుడు, స్త్రీపైన త్వరగా ప్రమాణం చేస్తారు. ఒక స్త్రీ పోతే మరొక స్త్రీని చేసుకుందామని అనుకుంటారు. మనుష్యులు ఏ ప్రమాణాలైతే చేస్తారో, అవన్నీ అసత్యాలే. మొదటైతే భగవంతుడిని తండ్రిగా భావించాలి. లేకపోతే పితృత్వపు నషా ఎక్కదు.

సత్ శ్రీ అకాల్ అని ఆ తండ్రిని అంటారని పిల్లలైన మీకైతే తెలుసు. ఆ సత్యమైనవారి పేరు శివ. ఒకవేళ కేవలం రుద్రుడు అని అంటే తికమకపడతారు. కానీ అర్థం చేయించేందుకు చెప్పాల్సి వస్తుంది. గీతలో కూడా, రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యిందని ఉంది. అది కూడా ఇక్కడి విషయమే. కృష్ణుని యజ్ఞము యొక్క పేరు లేదు. రెండింటినీ కలిపేసారు. సత్య-త్రేతాయుగాలలోనైతే ఏ యజ్ఞమూ జరగదని అర్థం చేయించడం జరిగింది. యజ్ఞము అన్నది ఒక్క జ్ఞానానికి సంబంధించిందే జరుగుతుంది. మిగిలినవన్నీ భౌతికమైన యజ్ఞాలు. పుస్తకాలు చదవడము, పూజలు చేయడము అంతా భక్తి మార్గము. జ్ఞానమనేది ఒక్కటే, దానిని సత్యమైన పరమాత్మ ఇస్తారు. మనుష్యులందరూ ఈశ్వరుని గురించి కూడా అసత్యం చెప్తారు, అందుకే భారత్ నిరుపేదగా అయ్యింది. ఇటువంటి అతి పెద్ద అసత్యం ఇంకేదీ లేదు. ఈ నాటకమైతే తయారై ఉంది. దీనికున్న ఒక పేరు పద్మవ్యూహము అనగా తండ్రిని మరచిపోవడం వలన భ్రమించడము. మళ్ళీ తండ్రి వచ్చి భ్రమించడం నుండి విడిపిస్తారు. ఈ డ్రామాలో గెలుపు-ఓటముల ఆట ఉంది. ఓడిపోవడానికి అర్ధకల్పం పడుతుంది. ఒక్కసారిగా పూర్తి మట్టిలో కలిసిపోతారు. తర్వాత అర్ధకల్పం మన గెలుపు ఉంటుంది. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవరికీ కూడా తెలియవు, పెద్ద పెద్ద గీతా పాఠశాలలు ఉన్నాయి. గీత గురించి భారతీ విద్యా భవనము కూడా తయారు చేయబడింది. గీతకు చాలా గొప్ప పేరైతే ఉంది. గీతను సర్వ శాస్త్రమయి శిరోమణి అని అంటారు. కానీ పేరు మార్చడం వలన దేనికీ పనికి రాకుండా అయిపోయింది. గీత యొక్క పేరైతే చాలా కాలం బట్టి కొనసాగుతుంది. తండ్రి అంటారు, గీతా భగవంతుడను నేను, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు. ఇప్పుడిది సంగమము. తండ్రి రచయిత, ఎప్పుడైతే స్వర్గాన్ని రచిస్తారో, అప్పుడే రాధే-కృష్ణులు లేక లక్ష్మీ-నారాయణులు వస్తారు. తండ్రి వచ్చి జగదంబ మరియు జగత్పిత ద్వారా స్వర్గానికి యజమానులుగా మనల్నే చేస్తారు. రాజయోగాన్ని అయితే భగవంతుడు తప్ప ఇంకెవరూ నేర్పించలేరు. జగదంబ చాలా పేరు-ప్రఖ్యాతలు కలిగినవారు. కలశాన్ని కూడా జగదంబకు చూపిస్తారు. లక్ష్మీ-నారాయణులు లేక రాధే-కృష్ణులు అయితే ఇప్పుడు లేరు. కృష్ణునితో పాటు రాధే కూడా ఉండాలి. గీతలో రాధే గురించి ఏ వర్ణనా లేదు. భాగవతములో ఉంది. తండ్రి అంటారు, రాధే-కృష్ణులుగా ఎవరైతే ఉండేవారో, వారిప్పుడు 84వ అంతిమ జన్మలో ఉన్నారు. నేను వారిని మరియు వారి రాజధానిని మళ్ళీ మేల్కొల్పుతున్నాను. అందరినీ తెల్లగా చేస్తున్నాను. ఇవి చాలా గుహ్యమైన విషయాలు, మీకు మాత్రమే తెలుసు – మనము సూర్యవంశీ, చంద్రవంశీ దైవీ కుటుంబానికి చెందినవారము. మనం 84 జన్మలు అనుభవించాము. ఇప్పుడు మళ్ళీ మనం సత్యయుగంలోకి వెళ్తాము. సత్యయుగము నుండి మొదలుకొని లెక్కపెడతారు కదా. 84 జన్మల చక్రం కూడా ప్రసిద్ధి చెందింది. మీరు వారసత్వాన్ని పదే-పదే గుర్తు చేసుకుంటారు కదా. ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. ఈ చక్రాన్ని స్మృతి చేయడము అనగా మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర-భౌగోళికాన్ని స్మృతి చేయడము. ఎంతగా స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుందో, అంతగా వారు యాత్రలో వేగంగా వెళ్తున్నారని భావించండి.

మీకు తెలుసు, ఇప్పుడిది ముళ్ళ ప్రపంచము. తమోప్రధాన మనుష్యులు 5 వికారాలలో చిక్కుకుని ఉన్నారు. తండ్రి అంటారు, నాది అన్నదానిని విడిచిపెట్టండి అని, కానీ విడిచిపెట్టరు. ఇంత అనంతమైన రాజ్యం లభిస్తున్నా కూడా, ఆలోచిస్తాము అని అంటారు. విడిచిపెట్టేందుకు ఆలోచిస్తున్నాము అని అంటున్నారంటే, ఈ వికారాలు అంత ప్రియంగా అనిపిస్తున్నాయా. అరే, ఇప్పుడైనా ప్రతిజ్ఞ చేయండి, అప్పుడు తండ్రి యొక్క సహాయం లభిస్తుంది. ప్రతిజ్ఞ చేసి, మళ్ళీ కులకళంకితులుగా అవ్వకూడదు, ఇదైతే తప్పనిసరి. ధరణిని వదిలినా ధర్మాన్ని వదలకండి. ఇది చాలా కఠినమైన గమ్యము. తండ్రి అయితే పూర్తిగా ప్రయత్నిస్తారు కదా! లూజ్ గా వదిలిపెట్టరు. అచ్ఛా, ఒకసారి క్షమిస్తారు. ఒకవేళ మళ్ళీ చేస్తే వారు మరణిస్తారు, ఇలా అయితే రిజిస్టర్ పాడవుతుంది. ఈ వికారాలైతే విషము. జ్ఞానము అనేది అమృతము, దీని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. అదైతే చెడు సాంగత్యము. సిక్కులు సత్ శ్రీ అకాల్ అంటూ పెద్ద ధ్వని మ్రోగిస్తారు ఎందుకంటే సత్ శ్రీ అకాల్ అందరి యొక్క ఉద్ధరణ చేసారు. కానీ వారిని మర్చిపోయారు. మర్చిపోవడం కూడా డ్రామాలో ఉంది. జైను ధర్మం వారిది చాలా కఠినమైన సన్యాసము. తండ్రి అంటారు, నేను మీకు సహజ రాజయోగాన్ని నేర్పిస్తాను. తండ్రి ఎలాంటి కష్టాన్ని ఇవ్వరు. అయితే విమానంలోనైనా వెళ్ళండి, కార్లలో తిరగండి. కానీ ఆహార-పానీయాలలో ఎంతైతే అంత పథ్యం పాటించాలి. భోజనానికి దృష్టినిచ్చి అప్పుడు తినాలి, కానీ పిల్లలు దీనిని మర్చిపోతారు. ఇందులో తండ్రిని లేక ప్రియుడిని సంతోషంగా స్మృతి చేయాలి. ప్రియుడా, మేము మీ స్మృతిలో మీతో పాటు భోజనం చేస్తాము. మీకు తమకంటూ శరీరమైతే లేదు. మేము మిమ్మల్ని స్మృతి చేసి తింటాము మరియు మీరు మా భావాన్ని స్వీకరిస్తూ ఉండండి. ఈ విధంగా స్మృతి చేస్తూ-చేస్తూ అలవాటైపోతుంది మరియు సంతోషం యొక్క పాదరసం ఎక్కుతూ ఉంటుంది. జ్ఞాన ధారణ కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా లోపమున్నట్లయితే ధారణ కూడా తక్కువగా జరుగుతుంది. వారి బాణము గట్టిగా తగలదు. తండ్రితో యోగము అనగా ఈ మంచి-మంచి మహళ్ళను చూస్తున్నప్పటికీ, ఇవి మట్టిలో కలిసిపోతాయి అని భావించడము. ఇవి మన రాజధానిలో ఉండేవి కావు. ఇప్పుడైతే మన రాజధాని స్థాపనవుతుంది, అందులో ఇవేవీ ఉండవు. కొత్త ప్రపంచముంటుంది. ఈ పాత వృక్షము మొదలైనవేవీ ఉండవు. అక్కడ అన్నీ ఫస్ట్ క్లాస్ వస్తువులు ఉంటాయి, ఇన్ని జంతువులు మొదలైనవన్నీ సమాప్తమవుతాయి. అక్కడ వ్యాధులు మొదలైనవేవీ కూడా ఉండవు. ఇవన్నీ తర్వాత వెలువడతాయి. సత్యయుగము అంటేనే స్వర్గము. ఇక్కడైతే ప్రతి వస్తువు దుఃఖమిచ్చేటటువంటిది. ఈ సమయంలో అందరిదీ ఆసురీ మతము. గవర్నమెంట్ కూడా పిల్లలు చంచలం అవ్వకుండా ఉండేటటువంటి విద్య కావాలని కోరుకుంటుంది. ఇప్పుడైతే చాలా చంచలత్వం ఉంది. ధర్నాలు చేయడము, నిరాహార దీక్షలు మొదలైనవి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇవన్నీ ఎవరు నేర్పించారు? తాము నేర్పించినదే తమ ముందుకు వస్తుంది. తండ్రి అంటారు, పిల్లలూ, శాంతిగా ఉండండి. తాళాలు మ్రోగించడము, దుఃఖముతో మొరపెట్టుకోవడము, ఇవన్నీ భక్తికి సంబంధించిన గుర్తులు. మీరు సాధన అయితే జన్మ-జన్మాంతరాలుగా చేస్తూ వచ్చారు, సాధన అన్న పేరు కొనసాగుతూ ఉంటుంది. కానీ ఎవ్వరి సద్గతి జరగదు. మీ వద్ద చిత్రాలు, లిటరేచర్ మొదలైనవి లేకపోయినా కూడా మీరు మందిరాలకు వెళ్ళి అర్థం చేయించవచ్చు, ఈ లక్ష్మీ-నారాయణులు మొదట స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా. వారికి స్వర్గ రచయిత నుండి తప్పకుండా వారసత్వం లభించి ఉంటుంది. స్వర్గ రచయిత అయితే పరమపిత పరమాత్మ, వారే అర్థం చేయిస్తారు. మందిరాలు నిర్మించేవారికి ఇవి తెలియవు. వారికి పరమపిత పరమాత్మ నుండి వారసత్వం లభించింది అని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. తప్పకుండా కలియుగ అంతిమంలోనే లభించి ఉంటుంది కదా. గీతలో రాజయోగం యొక్క విషయముంది. తప్పకుండా సంగమంలోనే రాజయోగము నేర్చుకుని ఉంటారు, మరియు పరమపిత పరమాత్మ నుండే నేర్చుకుని ఉంటారు, అంతేకానీ రచన అయిన శ్రీ కృష్ణుని నుండి కాదు. రచయిత అయితే ఒక్క తండ్రే, వారినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. ఎవరైతే మంచి విశాల బుద్ధి కలవారు ఉంటారో, వారు మంచి రీతిలో అర్థం కూడా చేసుకుంటారు మరియు ధారణ కూడా చేస్తారు. చిన్న-చిన్న కన్యలు పెద్ద మనుష్యులతో కూర్చుని మాట్లాడాలి, వీరిని రచించేవారు ఎవరు అని చిత్రాలపై అర్థం చేయించాలి. అయితే ఆ చిత్రాలు సాధారణంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కన్యలు చిలుక పలుకుల వలె అర్థం చేయించగలరు. చిన్న కన్యలు ఒకవేళ తెలివైనవారిగా అయితే, అప్పుడు ఎవరైతే వీరిని ఈ విధంగా తెలివైనవారిగా చేసారో, ఆ ఒక్క తండ్రిదే బలిహారము అని అంటారు. నాకు తెలుసు కావుననే నేను వినిపిస్తాను అని కన్య అంటుంది. అనంతమైన తండ్రి ఇప్పుడు రాజయోగం నేర్పిస్తున్నారు.

తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఏ దేహధారినీ కూడా గురువుగా భావించకండి. ఒక్క సద్గురువే తీరానికి చేరుస్తారు, మిగిలినవారంతా ముంచేవారే. ఈ విధంగా పలుకుతూ ఉన్నట్లయితే, పేరు ప్రఖ్యాతి చెందుతుంది. కన్యల ద్వారానే జ్ఞాన బాణాలు వేసారు – ఈ విధంగా చూపించారు కదా. అలాగని అందరూ అర్థం చేసుకుంటారని కూడా కాదు. ఎవరైతే మన ధర్మానికి చెందినవారు ఉంటారో, వారు త్వరగా అర్థం చేసుకుంటారు. వానప్రస్థంలో ఉన్నవారికి లేక ఎవరైతే మందిరాలను తయారుచేస్తారో, వెళ్ళి వారికి అర్థం చేయించాలి, నిలబెట్టాలి. మేము మీకు శివబాబా జీవితచరిత్రను తెలియజేస్తాము. రెండవ నంబరులో బ్రహ్మా, విష్ణు, శంకరులున్నారు. మనుష్యులు 84 జన్మలు ఎలా తీసుకుంటారు అని మేము మీకు ప్రపంచం యొక్క చరిత్ర-భౌగోళికాన్ని తెలియజేస్తాము. ఇది 84 జన్మల చక్రము. బ్రహ్మా, సరస్వతి అందరి కథలు కూర్చొని చెప్పాలి. ఇది పిల్లలైన మీరు తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేరు. మీరు వస్తే, లక్ష్మీ-నారాయణులు రాజ్యాన్ని ఎలా పొందారు మరియు తర్వాత ఎలా పోగొట్టుకున్నారు అనేది తెలియజేస్తాము. అచ్ఛా – ఇది కూడా అర్థం అవ్వకపోతే కేవలం మన్మనాభవగా అవ్వండి. పిల్లలు వెళ్ళి ఈ విధంగా సేవ చేయాలి. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లోపల ఏదైనా లోపమున్నట్లయితే దానిని చెక్ చేసుకొని తొలగించాలి. తండ్రితో ఏ ప్రతిజ్ఞనైతే చేసారో, దానిపై స్థిరంగా ఉండాలి.

2. భోజనం చాలా శుద్ధంగా, దృష్టినిచ్చి స్వీకరించాలి. తండ్రి మరియు ప్రియుని స్మృతిలో చాలా సంతోషంగా భోజనం తినాలి.

వరదానము:-

ఒకటి ఇవ్వండి వేయి పొందండి అని అంటూ ఉంటారు, వినాశీ ఖజానాను ఇచ్చినట్లయితే తరుగుతుంది, అవినాశీ ఖజానాను ఇచ్చినట్లయితే పెరుగుతుంది. కానీ ఎవరైతే స్వయం నిండుగా ఉంటారో, వారే ఇవ్వగలరు. కావున మాస్టర్ దాత అనగా స్వయము నిండుగా మరియు సంపన్నంగా ఉండేవారు. తండ్రి ఖజానా, నా ఖజానా అనే నషా వారికి ఉంటుంది. ఎవరి స్మృతి అయితే సత్యంగా ఉంటుందో వారికి సర్వ ప్రాప్తులు స్వతహాగా కలుగుతాయి, యాచించడము లేక ఫిర్యాదు చేసే అవసరము ఉండదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top