25 November 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

November 24, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - అవగుణాలను తొలగించి స్వచ్ఛమైన హృదయం కలవారిగా అవ్వండి, సత్యత మరియు పవిత్రతా గుణాలను ధారణ చేసినట్లయితే సేవలో సఫలత లభిస్తూ ఉంటుంది’’

ప్రశ్న: -

బ్రాహ్మణ పిల్లలైన మీ కర్మాతీత అవస్థ ఎప్పుడు మరియు ఎలా తయారవుతుంది?

జవాబు:-

ఎప్పుడైతే యుద్ధ సామాగ్రి పూర్తిగా తయారవుతుందో, అప్పుడు మీ అందరి కర్మాతీత అవస్థ నంబరువారుగా తయారవుతుంది. ఇప్పుడు రేస్ జరుగుతూ ఉంది. కర్మాతీతులుగా అయ్యేందుకు పాత ప్రపంచం నుండి బుద్ధి తొలగిపోవాలి. ఏ శివబాబా నుండైతే 21 జన్మల వారసత్వము లభిస్తుందో, వారు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు, పూర్తిగా పవిత్రముగా అవ్వండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీ ముఖాన్ని చూసుకో ప్రాణీ… (ముఖ్డా దేఖ్ లే ప్రాణీ…)

ఓంశాంతి. అనంతమైన తండ్రి పిల్లలకు లభించారు మరియు పిల్లలు వారిని గుర్తించారు. తాము ఎంత పాపాత్ములుగా ఉండేవారు మరియు ఇప్పుడు ఎంత పుణ్యాత్ములుగా అవుతున్నారు అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరూ రియలైజ్ అవుతారు. ఎంతెంతగా శ్రీమతంపై నడుస్తారో అంతగా తప్పకుండా తండ్రిని ఫాలో చేస్తారు. పిల్లల ఎదురుగా ఒకటేమో ఈ చిత్రముంది మరియు ఇంకొకటి దిల్వాడా మందిరం కూడా పూర్తి స్మృతిచిహ్నము. దూరదేశ నివాసి ఇప్పుడు పరాయి దేశములోకి, పతిత శరీరములోకి వచ్చారని పాటను కూడా పాడుతారు. ఇది పరాయి దేశమని స్వయంగా తండ్రి అంటారు. పరాయి అనగా ఎవరిది? రావణునిది. మీరు కూడా పరాయి దేశములో లేక రావణ రాజ్యములో ఉన్నారు. భారతవాసులు మొదట రామ రాజ్యములో ఉండేవారు. ఈ సమయంలో పరాయి అనగా రావణ రాజ్యములో ఉన్నారు. శివబాబా అయితే విచార సాగర మథనము చేయరు. ఈ బ్రహ్మా విచార సాగర మథనము చేసి ఏమి అర్థం చేయిస్తారంటే, ఈ దిల్వాడా మందిరము జైనులది. ఎవరైతే ఒకప్పుడు చైతన్యముగా ఉండి వెళ్ళారో, వారిదే ఈ జడ స్మృతిచిహ్నము. ఇందులో ఆదిదేవ్, ఆదిదేవి కూడా కూర్చున్నారు. పైన స్వర్గము ఉంది. ఇప్పుడు ఒకవేళ వారి భక్తులు ఎవరైతే ఉన్నారో, వారికి జ్ఞానం లభిస్తే – తప్పకుండా కింద రాజయోగ శిక్షణను తీసుకుంటున్నారని మంచి రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. పైన కూడా ప్రవృత్తి మార్గము, కింద కూడా ప్రవృత్తి మార్గము. కుమారీ కన్య, అదర్ కన్యల చిత్రాలు కూడా ఉన్నాయి. అదర్ కుమారులు మరియు కుమారీలు కూడా ఉన్నారు. కావున మందిరంలో ఆదిదేవ్ అయిన బ్రహ్మా కూడా కూర్చున్నారు మరియు పిల్లలు కూడా కూర్చున్నారు. బ్రహ్మా, సరస్వతులే రాధే-కృష్ణులుగా అవుతారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మా ఆత్మకు ఇది అనేక జన్మల అంతిమ జన్మ. ఇది తండ్రి మరియు పిల్లల స్మృతిచిహ్నము. అలాగని వేలాది, లక్షలాది చిత్రాలను పెడతారని కాదు. మోడల్ లో కొన్ని చిత్రాలను పెట్టడం జరుగుతుంది. అది జడము మరియు మనది చైతన్యము. ఎవరైతే కల్పపూర్వము భారత్ ను స్వర్గముగా తయారుచేసారో, ఇది వారి స్మృతిచిహ్నము. జగదాంబ, జగత్పిత మరియు వారి పిల్లలు ఉన్నారు. మెజారిటీ మాతలది ఉన్న కారణముగా బ్రహ్మాకుమారీలు అన్న పేరు రాసారు. మందిరాల్లో కూడా కుమారీ కన్య మరియు అదర్ దేవి ఉన్నారు. లోపలికి వెళ్తే ఏనుగులపై పురుషుల చిత్రాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు.

ఇప్పుడు మీరు స్వచ్ఛమైన హృదయం కలవారిగా అవుతారు. ఆత్మ నుండి అవగుణాలను తొలగించుకుంటున్నారు. మీ మమ్మా ఎవరికైనా అర్థం చేయిస్తే వారికి బాణం తగిలేది. మమ్మాలో సత్యత, పవిత్రత ఉండేవి. వారు కుమారి కూడా. మమ్మా పేరు మొదట వస్తుంది. మొదట లక్ష్మి, ఆ తర్వాత నారాయణుడు. ఇప్పుడు తండ్రి అంటారు, మమ్మా వలె గుణాలను ధారణ చేయండి. అవగుణాలను తొలగించుకుంటూ వెళ్ళండి. తొలగించుకోకపోతే పదవి భ్రష్టమవుతుంది. సుపుత్రులైన పిల్లల పని – ప్రతి విషయము అర్థం చేసుకోవడము. ఇంతకుముందు మీరు తెలివిహీనులుగా ఉండేవారు. ఇప్పుడు బాబా తెలివైనవారిగా తయారుచేస్తారు. అజ్ఞానములో పిల్లలు పాడైపోతే తండ్రి పేరును అప్రతిష్టపాలు చేస్తారు. వీరైతే అనంతమైన తండ్రి. బ్రహ్మాకుమార, కుమారీలుగా పిలవబడుతూ తండ్రియైన ఈశ్వరుని పేరును అప్రతిష్టపాలు చేస్తే వారి పరిస్థితి ఏమవుతుంది? పదవి భ్రష్టమయ్యే విధంగా మరియు అనేకులకు నష్టం కలిగే విధంగా, అటువంటి పనులను అసలు ఎందుకు చేయాలి. కావున తండ్రి అర్థం చేయించారు, దూరదేశము నుండి పరాయి దేశంలోకి వస్తాను. తర్వాత రావణ రాజ్యం ద్వాపరము నుండి మొదలవుతుంది. భక్తి కూడా ద్వాపరము నుండి మొదలవుతుంది, ఈ సమయంలో అందరిదీ తమోప్రధానమైన శిథిలావస్థ. ఇది అనంతమైన పాత వృక్షము. అనంతమైన జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. అనంతమైన సన్యాసాన్ని ఎవ్వరూ చేయించలేరు. వారు హద్దు సన్యాసము చేయిస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన పాత ప్రపంచం యొక్క సన్యాసము చేయిస్తారు. ఓ పిల్లలూ, ఇది పాత ప్రపంచము – అని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. మహాభారత యుద్ధం ఎదురుగా నిలిచి ఉంది. వినాశనం తప్పకుండా జరిగేదే ఉంది, అందుకే అనంతమైన తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఓ ఆత్మలూ, వింటున్నారా? మనం ఆత్మలము, పరమాత్మ అయిన తండ్రి మనల్ని చదివిస్తారు. ఎప్పటివరకైతే ఈ పక్కా నిశ్చయం ఉండదో, అప్పటివరకు ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మనైన నేను అవినాశీ అన్నది మొదట నిశ్చయం చేసుకోవాలి. అశరీరి ఆత్మనైన నేను శరీరములోకి వచ్చి ప్రవేశిస్తాను, లేదంటే జనాభా సంఖ్య ఎలా వృద్ధి చెందుతుంది? ఆత్మలు ఏ విధంగా పరంధామం నుండి వచ్చి శరీరంలోకి ప్రవేశిస్తాయో, అలాగే పరమపిత పరమాత్మ కూడా ఈ శరీరంలోకి ప్రవేశించి, మీరు నా పిల్లలు అని అంటారు. సాగరుడినైన నా పిల్లలైన మీరు దగ్ధమై బూడిదైపోయారు. ఇప్పుడు మిమ్మల్ని పావనంగా తయారుచేసి తిరిగి ఇంటికి తీసుకువెళ్ళేందుకు నేను వచ్చాను. ఎవరైతే వికారాల్లోకి ఎక్కువగా వెళ్తారో వారినే పతితులు, భ్రష్టాచారులు అని అంటారు. ఈ మొత్తం ప్రపంచమే వికారీగా ఉంది, అందుకే డ్రామా ప్లాన్ అనుసారముగా నేను రావణుడి దేశంలోకి వచ్చాను. 5000 సంవత్సరాల క్రితం కూడా వచ్చాను. ప్రతి కల్పము వస్తాను మరియు రావడము కూడా సంగమయుగములోనే వస్తాను. పిల్లలకు ముక్తి-జీవన్ముక్తులను ఇవ్వడానికి వస్తాను. సత్యయుగంలో జీవన్ముక్తి ఉంటుంది. మిగిలినవారంతా ముక్తిలో ఉంటారు. మరి ఇంతమంది ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారందరినీ తీసుకువెళ్ళేది ఎవరు? తండ్రినే ముక్తిదాత మరియు మార్గదర్శకుడు అని అంటారు. తండ్రే వచ్చి భక్తులకు భక్తి ఫలాన్ని ఇస్తారు. మీరే పూజారులు నుండి పూజ్యులుగా అవుతారు. బాబా ఇంకే కష్టాన్ని ఇవ్వరు. దిల్వాడా మందిరంలో ఉన్న చిత్రాలు తప్పకుండా సరైనవి. పిల్లలు యోగంలో కూర్చున్నారు, వారికి శిక్షణ ఇచ్చేవారు ఎవరు? పరమపిత పరమాత్ముని చిత్రం కూడా ఉంది. శివబాబా బ్రహ్మా ద్వారా సత్యయుగ స్థాపన చేస్తున్నారు. ఇక్కడ కూడా చిత్రంలో చూడండి, వృక్షం కింద తపస్య చేస్తున్నారు. బ్రహ్మా, సరస్వతికి కూడా తల్లి అయ్యారు. త్వమేవ మాతాశ్చ పిత… అని అంటూ ఉంటారు. నిరాకారుడిని అలా ఎలా అనగలరు? వారు వీరిలోకి ప్రవేశించారు కావున వీరు తల్లి అయినట్లు కదా. సన్యాసులైతే నివృత్తి మార్గానికి చెందినవారు – వీరు నా అనుచరులు అని వారూ తమ నోటితో అంటారు. మేము అనుచరులము అని ఇటు వీరూ అంటారు. ఇక్కడైతే తల్లి-తండ్రి ఇరువురూ ఉన్నారు, అందుకే త్వమేవ మాతాశ్చ పితా… బంధువు అని కూడా అంటారు. ఎవరిలోనైతే ప్రవేశిస్తారో వారు కూడా చదువుకుంటూ ఉంటారు. కావున సఖునిగా కూడా అవుతారు. శివబాబా అంటారు, నేను బ్రహ్మా ద్వారా దత్తత తీసుకున్నాను, మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు. శివబాబాకు తమదంటూ శరీరము లేదు. అక్కడ మందిరంలో లింగం పెట్టారు. దిల్వాడా అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. అధర్ కుమారీ, కుమారీ కన్య కూడా ఉన్నారు. నేర్పించేటువంటి శివుని యొక్క చిత్రం కూడా ఉంది. స్వర్గానికి యజమానులుగా తయారుచేసే గురువు తప్పకుండా కావాలి. ఇక్కడ శ్రీకృష్ణుని విషయం ఉండదు. ఎక్కడైతే బ్రహ్మా కూర్చుని ఉన్నారో అక్కడికి శ్రీకృష్ణుడు ఎలా వస్తారు. శ్రీకృష్ణుని ఆత్మ సుందరంగా తయారయ్యేందుకు తపస్య చేస్తున్నారు. ఇప్పుడు వారు నల్లగా ఉన్నారు. పైన వైకుంఠం యొక్క సుందరమైన చిత్రాలు ఉన్నాయి. బ్రాహ్మణ-బ్రాహ్మణీలే మళ్ళీ దేవతలుగా అవుతారు. మిమ్మల్ని ఆ విధంగా తయారుచేసేవారు అందరికన్నా ఉన్నతమైనవారు. కావున ఈ దిల్వాడా మందిరం కూడా అన్నింటికన్నా ఉన్నతమైనది.

పిల్లలైన మీరు జ్ఞానమైతే అందరికీ ఇస్తారు కానీ చాలామంది ఏమనుకుంటారంటే – జ్ఞానంలోకి వచ్చి పతి-పత్ని ఇరువురూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడము – ఇది చాలా గొప్ప శక్తి. కానీ ఇది సర్వశక్తివంతుడైన తండ్రి శక్తి అని వారు అర్థం చేసుకోరు. తండ్రి స్వర్గం యొక్క ఆశను ఎంతగా కలిగిస్తారో చూడండి. పిల్లలూ, పవిత్రంగా అయినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు అని అంటారు. మాయ తుఫానులైతే ఎన్నో వస్తాయి. తండ్రి అంటారు, పిల్లలూ, మీరు ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉండేవారు, మీకు ఏమయ్యింది? ఈ సమయంలో బ్రాహ్మణుల మాలలో నంబరువారుగా ఎవరెవరు ఉన్నారు అన్నది బాబా వెంటనే చెప్తారు. కానీ అందరూ నిలిచి ఉండరు. సంపాదనలో దశలు కూర్చుంటాయి కదా. ఎవరిపైనైనా రాహు దశ కూర్చుంటే ఇక విడిచిపెట్టి పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మేము ఇంతగా కష్టపడలేము, బాబాను స్మృతి చేయలేము అని అంటారు. ఇలా ‘చేయలేము’ అని అనడంతో నాస్తికులుగా అయిపోతారు, దశలు తిరుగుతూ ఉంటాయి. మాయ తుఫానులు రావడంతో చల్లబడిపోతారు. ఒకవేళ వదిలి వెళ్ళిపోతే నల్లగా అయిపోయారని భావించడము జరుగుతుంది. ఇక్కడకు సుందరంగా అయ్యేందుకు వస్తారు. బ్రాహ్మణ కులంవారైన మీరు శ్యామము నుండి సుందరంగా అవుతున్నారు. ఇక్కడ ఇది చాలా అద్భుతమైన సంపాదన. మమ్మా, బాబాలు లక్ష్మీ-నారాయణులుగా అవుతారని పిల్లలకు తెలుసు. పిల్లలు అంటారు – బాబా, మేము కూడా మీ వలె పురుషార్థం చేసి తప్పకుండా సింహాసనాధికారులుగా అవుతాము, వారసులుగా అవుతాము. అయినా గ్రహచారం కూర్చుంటుంది. నడవడిక కూడా మంచిగా ఉండాలి. శివబాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అన్న ఈ సందేశాన్ని ఇంటింటికి చేర్చడమే మీ వ్యాపారము. వినాశనం ఎదురుగా నిలిచి ఉంది – మీరు ఆహ్వానము ఇస్తూ ఉండండి. మీ వృద్ధి రోజురోజుకు జరుగుతూ ఉంటుంది. సెంటర్లు తెరుచుకుంటూ ఉంటాయి. ఇంత పెద్ద ఇల్లు కూడా చిన్నదైపోతుంది. మున్ముందు ఎన్ని ఇళ్ళు కావాలి. డ్రామాలో మున్ముందు రానున్న వారి కోసం ఏర్పాట్లు తప్పకుండా కావాలి. పిల్లలు తమ కోసమే అంతా చేస్తున్నారు. కావున పిల్లలకు అనంతమైన సంతోషం ఉండాలి. కానీ మాయ ఘడియ-ఘడియ బుద్ధి యోగాన్ని తెంచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మాల తయారవ్వజాలదు – అంతిమంలో రుద్రమాల తయారవుతుంది, ఆ తర్వాత మళ్ళీ విష్ణు మాల తయారవుతుంది. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. అంబ యొక్క మందిరాల ఎదురుగా కూడా మన సెంటర్ ఉండాలి – ఇప్పుడు వారు జ్ఞాన-జ్ఞానేశ్వరి అని అందరికీ అర్థం చేయించాలి. అక్కడ కూడా గుంపులుగా ఉంటారు. మీరు కేవలం పని చేయండి, ధనం దానంతటదే పుష్కలంగా వస్తుంది. డ్రామాలో మొదటి నుండే నిశ్చయించబడి ఉంది. మీరు 10 సెంటర్లు తెరవండి, బాబా కస్టమర్లను ఇస్తారు. కానీ సెంటర్లనే తెరవలేకపోతారు. కలకత్తా వంటి నగరాల్లోనైతే చాలా సెంటర్లు తెరవబడాలి. ధైర్యమునుంచే పిల్లలకు బాబా సహాయం లభిస్తుంది, ఎవరికైనా టచ్ చేస్తారు. పనిని మీరు చేయాలి. బహురూపి యొక్క పిల్లలైన మీరు బహురూపాలను ధారణ చేసి ఈ సేవ చేయవచ్చు. ఎక్కడికైనా వెళ్ళి చాలామంది కళ్యాణము చేయవచ్చు. జైనుల సేవను కూడా చేయాలి. చాలా మంచి పెద్ద-పెద్ద జైనులు ఉన్నారు. కానీ పిల్లలకు ఇలా సేవ చేసేంతటి విశాలబుద్ధి లేదు. కొంత దేహాభిమానం ఉంటుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రికి చెందినవారిగా అయి మాయకు వశమవ్వకూడదు. కర్మాతీతులుగా అయ్యే పురుషార్థం చేయాలి. తండ్రిని మరచి నాస్తికులుగా అవ్వకూడదు.

2. బుద్ధి ద్వారా అనంతమైన సన్యాసము చేయాలి. అనంతమైన సంతోషంలో ఉంటూ విశాలబుద్ధి కలవారిగా అయి సేవ చేయాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే దూరంగా కూర్చుని ఉన్నా సదా తండ్రి హృదయానికి సమీపంగా ఉన్నారో, వారికి సహయోగం యొక్క అధికారము ప్రాప్తించి ఉంది మరియు అంతిమం వరకు సహయోగము లభిస్తూ ఉంటుంది, అందుకే ఈ అధికారము యొక్క స్మృతితో ఎప్పుడూ బలహీనంగా అవ్వకూడదు, నిరాశ చెందకూడదు, అలాగే పురుషార్థంలో సాధారణ పురుషార్థులుగా అవ్వకూడదు. తండ్రి కంబైండుగా ఉన్నారు, అందుకే సదా ఉల్లాస-ఉత్సాహాలతో తీవ్ర పురుషార్థులుగా అయి ముందుకు వెళ్తూ ఉండండి. బలహీనతను లేక నిరాశను తండ్రికి సమర్పించండి, మీ వద్ద కేవలం ఉల్లాస-ఉత్సాహాలను ఉంచుకోండి.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

1) సతోగుణీ, రజోగుణీ, తమోగుణీ – ఈ మూడు పదాలను ఉపయోగిస్తారు, వీటిని యథార్థంగా అర్థం చేసుకోవడం అవసరము. ఈ మూడు గుణాలు కలిసే నడుస్తూ ఉంటాయని మనుష్యులు భావిస్తారు కానీ వివేకం ఏం చెప్తుంది – ఈ మూడు గుణాలు కలిసే నడుస్తాయా లేక మూడు గుణాల పాత్ర వేర్వేరు యుగాలలో ఉంటుందా? ఈ మూడు గుణాలు ఒకేసారి నడవవని వివేకం చెప్తుంది. సత్యయుగం ఉన్నప్పుడు సతోగుణముంటుంది, ద్వాపరములో రజోగుణము మరియు కలియుగంలో తమోగుణముంటుంది. సతోగుణము ఉన్నప్పుడు తమో, రజో గుణాలుండవు. రజోగుణము ఉన్నప్పుడు సతో గుణముండదు. కానీ మనుష్యులు ఈ మూడు గుణాలు కలిసే నడుస్తాయని భావిస్తూ కూర్చున్నారు. ఇలా అనడము పూర్తిగా తప్పు. మనుష్యులు సత్యం చెప్పినప్పుడు, పాప కర్మలు చేయనప్పుడు, వారు సతోగుణము కలవారని భావిస్తారు. కానీ వివేకం ఏం చెప్తుందంటే – మనం సతోగుణము అని అన్నప్పుడు, ఆ సతోగుణం యొక్క అర్థం సంపూర్ణ సుఖము అనగా మొత్తం సృష్టి సతోగుణీగా ఉంటుంది. అంతేకానీ, ఎవరైతే సత్యం చెప్తారో, వారు సతోగుణీ అని, ఎవరైతే అసత్యం చెప్తారో, వారు కలియుగీ తమోగుణీ అని, ప్రపంచం ఇలాగే నడుస్తూ ఉంది అని అనరు. మనం సత్యయుగము అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే, మొత్తం సృష్టిపై సతోగుణము, సతోప్రధానత ఉండాలి. అయితే, ఏదో ఒక సమయంలో అటువంటి సత్యయుగముండేది, అక్కడ మొత్తం ప్రపంచమంతా సతోగుణీగా ఉండేది. ఇప్పుడు ఆ సత్యయుగం లేదు, ఇప్పుడు ఉన్నది కలియుగీ ప్రపంచము అనగా మొత్తం సృష్టిపై తమోప్రధానత యొక్క రాజ్యముంది. ఈ తమోగుణీ సమయంలో సతోగుణము ఎక్కడ నుండి వచ్చింది! ఇప్పుడు ఘోర అంధకారముంది, దీనినే బ్రహ్మా యొక్క రాత్రి అని అంటారు. బ్రహ్మా యొక్క పగలు సత్యయుగము మరియు బ్రహ్మా యొక్క రాత్రి కలియుగము. కనుక మనం ఈ రెండింటినీ కలపలేము.

2) ఈ కలియుగీ ప్రపంచాన్ని నిస్సారమైన ప్రపంచము అని ఎందుకంటారు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎటువంటి సారము లేదు అనగా ఏ వస్తువులోనూ ఆ శక్తి లేదు అనగా సుఖము, శాంతి, పవిత్రత లేవు. ఈ సృష్టిపై ఒకానొక సమయంలో సుఖము, శాంతి, పవిత్రత ఉండేవి. ఇప్పుడు ఆ శక్తి లేదు ఎందుకంటే ఈ సృష్టిలో 5 భూతాలు ప్రవేశించి ఉన్నాయి, అందుకే ఈ సృష్టిని భయం యొక్క సాగరము లేక కర్మ బంధనం యొక్క సాగరము అని అంటారు. అందుకే మనుష్యులు దుఃఖితులై పరమాత్మను పిలుస్తున్నారు – పరమాత్మా, మమ్మల్ని భవ సాగరము నుండి దాటించండి. దీని ద్వారా ఏం ఋజువు అవుతుందంటే, ఏదో ఒక భయం లేని అనగా నిర్భయతా ప్రపంచము కూడా ఉంది, అందులోకి వెళ్ళాలని కోరుకుంటారు. అందుకే ఈ ప్రపంచాన్ని పాపాల సాగరము అని అంటారు, దీనిని దాటి పుణ్యాత్ముల ప్రపంచంలోకి వెళ్ళాలని కోరుకుంటారు. కనుక ప్రపంచాలు రెండు ఉన్నాయి – ఒకటి సారము ఉన్న సత్యయుగీ ప్రపంచము, రెండవది సారము లేని కలియుగీ ప్రపంచము. రెండు ప్రపంచాలు ఈ సృష్టిపైనే ఉంటాయి. అచ్ఛా – ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Kannada Murli Audio August 2022

Listen Brahma Kumaris Kannada Murli In Mp3

TODAY ➤ Download Audio of

19/05/2024

Baba Murli Page footer vector

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top