20 January 2023 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

January 19, 2023

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీరు శాంతిని స్థాపన చేసేందుకు నిమిత్తులు, అందుకే చాలా-చాలా శాంతిలో ఉండాలి, తండ్రి చేత దత్తత తీసుకోబడిన పిల్లలైన మేము పరస్పరంలో సోదరీ-సోదరులము అని బుద్ధిలో ఉండాలి’’

ప్రశ్న: -

పూర్తి సమర్పణ అయినవారు అని ఎవరిని అంటారు, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-

మేము ఈశ్వరీయ తల్లిదండ్రుల ద్వారా పాలింపబడుతున్నాము అని ఎవరి బుద్ధిలో ఉంటుందో వారే పూర్తి సమర్పణ అయినవారు. బాబా, ఇదంతా మీదే, మీరే మాకు పాలన ఇస్తున్నారు. ఎవరైనా ఉద్యోగం మొదలైనవి చేస్తున్నా కానీ బుద్ధి ద్వారా ఇదంతా బాబా కోసము అని భావిస్తారు. తండ్రికి సహాయం చేస్తూ ఉంటారు, దాని ద్వారా ఇంత పెద్ద యజ్ఞం యొక్క కార్య వ్యవహారము నడుస్తుంది, అందరి పాలన జరుగుతుంది… ఇటువంటి పిల్లలు కూడా సమర్పణ బుద్ధి కలిగినవారు. దానితోపాటు ఉన్నత పదవిని పొందేందుకు చదవాలి మరియు చదివించాలి కూడా. శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ అనంతమైన తల్లిదండ్రులను శ్వాస శ్వాసలోనూ స్మృతి చేయాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓం నమఃశివాయ…

ఓంశాంతి. ఈ పాటలోనైతే మహిమ ఉంది. వాస్తవానికి మహిమ అంతా ఉన్నతోన్నతమైన పరమాత్మది, వారి గురించి పిల్లలకు తెలుసు మరియు పిల్లల ద్వారా మొత్తం ప్రపంచము కూడా మా తల్లి, తండ్రి వారేనని తెలుసుకుంటుంది. ఇప్పుడు మీరు తల్లిదండ్రులతోపాటు కుటుంబములో కూర్చున్నారు. శ్రీకృష్ణుడిని తల్లి-తండ్రి అనైతే అనలేరు. వారితోపాటు రాధే కూడా ఉన్నారు, అయినా కూడా వారిని తల్లి-తండ్రి అని అనరు ఎందుకంటే వారైతే రాకుమారుడు-రాకుమారీ. శాస్త్రాలలో ఈ పొరపాటు ఉంది. ఇప్పుడు ఈ అనంతమైన తండ్రి మీకు అన్ని శాస్త్రాల సారాన్ని తెలియజేస్తారు. ఈ సమయంలో కేవలం పిల్లలైన మీరు సమ్ముఖములో కూర్చున్నారు. కొందరు పిల్లలు దూరంగా ఉన్నా కానీ వారు కూడా వింటున్నారు. వారికి తెలుసు, తల్లి-తండ్రి మాకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తున్నారు మరియు సదా సుఖీగా తయారుచేసే మార్గాన్ని లేక యుక్తిని తెలియజేస్తున్నారు. ఇది ఖచ్చితముగా ఇల్లు వంటిదే. కొంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, చాలామంది అయితే బయట ఉన్నారు. ఇది బ్రహ్మా ముఖ వంశావళి, కొత్త రచన. అది పాత రచన అయినట్లు. బాబా మనల్ని సదా సుఖీగా తయారుచేసేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు. లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లలను పెంచి స్కూలుకు తీసుకువెళ్తారు. ఇక్కడ అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు కూడా, మన పాలన కూడా చేస్తున్నారు. పిల్లలైన మీకు ఇప్పుడు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేనే లేరు. తల్లిదండ్రులు కూడా వీరు మా పిల్లలు అని భావిస్తారు. లౌకిక కుటుంబము ఉంటే 10-15 మంది పిల్లలు ఉంటారు, ఇద్దరు-ముగ్గురికి వివాహాలు చేసి ఉంటారు. ఇక్కడైతే వీరందరూ బాబా పిల్లలు కూర్చున్నారు. ఎంతమంది పిల్లలకు జన్మనివ్వాలన్నా ఇప్పుడే బ్రహ్మా ముఖ కమలము ద్వారానే ఇవ్వాలి. చివరిలోనైతే పిల్లలకు జన్మనిచ్చేదే లేదు. అందరూ తిరిగి వెళ్ళాలి. ఈ ఒక్క దత్తత తీసుకోబడ్డ తల్లి నిమిత్తము. ఇది చాలా అద్భుతమైన విషయము. ఇదైతే తప్పనిసరి, పేదవాని కొడుకు మా తండ్రి పేదవారు అనే భావిస్తాడు. షావుకారు కొడుకు, మా తండ్రి షావుకారు అని భావిస్తాడు. అక్కడైతే అనేక తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ మొత్తం జగత్తుకు తల్లి, తండ్రి ఒక్కరే. మనము వారి ముఖము నుండి దత్తత తీసుకోబడ్డామని మీ అందరికీ తెలుసు. వీరు మన పారలౌకిక తల్లి-తండ్రి. వీరు రావడమే పాత సృష్టిలోకి వస్తారు, ఎప్పుడైతే మనుష్యులు చాలా-చాలా దుఃఖితులుగా అవుతారో అప్పుడు వస్తారు. మనము ఈ పారలౌకిక తల్లిదండ్రుల ఒడిని తీసుకున్నామని పిల్లలకు తెలుసు. మనమందరము పరస్పరంలో సోదరీ-సోదరులము. మనకు ఇంకే ఇతర సంబంధము లేదు. కావున సోదరీ, సోదరులు పరస్పరంలో చాలా మధురముగా, రాయల్ గా, శాంతియుతముగా, జ్ఞాన సంపన్నులుగా, ఆనంద స్వరూపులుగా అవ్వాలి. మీరు శాంతిని స్థాపన చేస్తున్నప్పుడు మరి మీరు కూడా చాలా శాంతిగా ఉండాలి. పిల్లలకైతే బుద్ధిలో ఉండాలి, మేము పారలౌకిక తండ్రి చేత దత్తత తీసుకోబడిన పిల్లలము. పరంధామం నుండి తండ్రి వచ్చారు. వారు తాతగారు (గ్రాండ్ ఫాదర్), వీరు దాదా (పెద్ద అన్నయ్య), ఎవరైతే పూర్తిగా సమర్పణ అయి ఉన్నారో, వారు మేము ఈశ్వరీయ తల్లిదండ్రుల చేత పాలింపబడుతున్నామని భావిస్తారు. బాబా, ఇదంతా మీది. మీరు మా పాలన చేస్తున్నారు. ఏ పిల్లలైతే అర్పణ అవుతారో వారి ద్వారా అందరి పాలనా జరుగుతుంది. ఎవరైనా ఉద్యోగం చేస్తున్నా కూడా ఇదంతా బాబా కోసమేనని భావిస్తారు. కావున తండ్రికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. లేదంటే యజ్ఞం యొక్క కార్య వ్యవహారాలు ఎలా నడుస్తాయి. రాజు, రాణులను కూడా తల్లి-తండ్రి అని అంటారు. కానీ వారు ఎంతైనా దైహిక తల్లి-తండ్రి అయినట్లు. రాజమాత అని కూడా అంటారు, అలాగే రాజపిత అని కూడా అంటారు. ఇక్కడ వీరు అనంతమైనవారు. మేము తల్లిదండ్రులతో పాటు కూర్చున్నామని పిల్లలకు తెలుసు. ఇది కూడా పిల్లలకు తెలుసు, మనం ఎంతగా చదువుతామో మరియు చదివిస్తామో అంతగా ఉన్నత పదవిని పొందుతాము. దానితోపాటు శరీర నిర్వహణార్థము కర్మ కూడా చేయాలి. ఈ దాదా కూడా వృద్ధులు. శివబాబాను ఎప్పుడూ వృద్ధులు లేక యవ్వనులు అని అనరు. వారు ఉన్నదే నిరాకారుడు. ఆత్మలైన మనల్ని నిరాకార తండ్రి దత్తత తీసుకున్నారని కూడా మీకు తెలుసు. మరియు సాకారములో ఈ బ్రహ్మా ఉన్నారు. అహమ్ ఆత్మ అంటుంది, మేము తండ్రిని మా వారిగా చేసుకున్నాము. మళ్ళీ కిందకు వస్తే, ఇలా అంటారు, సోదరీ-సోదరులమైన మేము బ్రహ్మాను మావారిగా చేసుకున్నాము అని. శివబాబా అంటారు – మీరు బ్రహ్మా ద్వారా మాకు చెందినవారిగా బ్రహ్మా ముఖవంశావళిగా అయ్యారు. బ్రహ్మా కూడా అంటారు, మీరు మా పిల్లలుగా అయ్యారు. బ్రాహ్మణులైన మీ బుద్ధిలో శ్వాస, శ్వాసలోనూ ఇదే నడుస్తుంది – వీరు మన తండ్రి, వారు మన దాదా అని. తండ్రికన్నా ఎక్కువగా తాతగారినే గుర్తు చేస్తారు. ఆ మనుష్యులైతే తండ్రితో పోట్లాడడము మొదలైనవి చేసి అయినా సరే తాతగారి నుండి ఆస్తిని తీసుకుంటారు. మీరు కూడా ప్రయత్నించి తండ్రి కన్నా కూడా ఎక్కువగా తాతగారి నుండి వారసత్వం తీసుకోవాలి. బాబా అడిగినప్పుడు, మేము నారాయణుడిని వరిస్తామని అందరూ అంటారు. కొందరు కొత్తవారు వచ్చేవారు, పవిత్రంగా ఉండలేకపోతే వారు చేతులెత్తలేరు. మాయ చాలా శక్తివంతమైనది అని అంటారు. మేము శ్రీ నారాయణుడిని లేక లక్ష్మిని వరిస్తామని వారైతే అనను కూడా అనలేరు. చూడండి, ఎప్పుడైతే బాబా సమ్ముఖముగా వినిపిస్తారో, అప్పుడు ఎంతగా సంతోషపు పాదరసము పైకి ఎక్కుతుంది. బుద్ధిని రిఫ్రెష్ చేయడం జరుగుతుంది కావున నషా ఎక్కుతుంది. మళ్ళీ కొందరికి ఆ నషా స్థిరంగా ఉంటుంది, కొందరిలో తగ్గిపోతుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి, 84 జన్మలను స్మృతి చేయాలి మరియు చక్రవర్తీ రాజ్యాన్ని కూడా స్మృతి చేయాలి. ఎవరైతే అంగీకరించరో వారికి గుర్తుండదు. బాప్ దాదా అర్థం చేసుకుంటారు, బాబా-బాబా అనైతే అంటారు కానీ సత్యాతి-సత్యమైన స్మృతి చేయడం లేదు మరియు లక్ష్మీ-నారాయణులను వరించేందుకు యోగ్యులుగా కూడా లేరు. నడవడికే అటువంటిది. అంతర్యామి అయిన తండ్రి ప్రతి ఒక్కరి బుద్ధిని అర్థం చేసుకుంటారు. ఇక్కడ శాస్త్రాల విషయమైతే ఏమీ లేదు. తండ్రి వచ్చి రాజయోగం నేర్పించారు, దానికి గీత అని పేరు పెట్టారు. మిగిలిన చిన్న-పెద్ద ధర్మాలవారందరూ తమ-తమ శాస్త్రాలను తయారుచేసుకుంటారు, తర్వాత వారు చదువుతూ ఉంటారు. బాబా శాస్త్రాలను చదవలేదు. పిల్లలూ – నేను మీకు స్వర్గం యొక్క మార్గాన్ని తెలియజేసేందుకు వచ్చానని అంటారు. మీరు ఎలా అశరీరిగా వచ్చారో, అలాగే మీరు వెళ్ళాలి. దేహ సహితముగా ఈ దుఃఖాల కర్మబంధనాలన్నింటినీ విడిచిపెట్టాలి ఎందుకంటే దేహము కూడా దుఃఖమునిస్తుంది. అనారోగ్యము వస్తే క్లాసులోకి రాలేరు. కావున ఇది కూడా దేహం యొక్క బంధనము అయ్యింది, ఇందులో బుద్ధి చాలా మంచిగా ఉండాలి. మొదట అయితే నిశ్చయము కావాలి, తప్పకుండా బాబా స్వర్గాన్ని రచిస్తారు. ఇప్పుడైతే నరకము ఉంది. ఎప్పుడైనా, ఎవరైనా మరణిస్తే స్వర్గానికి వెళ్ళారని అంటారు, మరి తప్పకుండా నరకములో ఉండేవారనే కదా. కానీ ఇది మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు ఎందుకంటే మీ బుద్ధిలో స్వర్గము ఉంది. బాబా రోజు కొత్త-కొత్త పద్ధతులలో అర్థం చేయిస్తారు. అప్పుడు మీ బుద్ధిలో మంచి రీతిలో కూర్చుంటుంది. వారు మన అనంతమైన తల్లి-తండ్రి. కావున మొదట బుద్ధి పూర్తిగా పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ సమయంలో బాబా ఆబూలో ఉన్నారు అని అంటారు. ఎలాగైతే యాత్రలకు వెళ్ళినప్పుడు బద్రీనాథ్ మందిరం పైన ఉంటుంది. పండాలు తీసుకువెళ్తారు, బద్రీనాథుడు స్వయంగానైతే తీసుకువెళ్ళేందుకు రారు. మనుష్యులు పండాలుగా అవుతారు. ఇక్కడ శివబాబా స్వయంగా పరంధామం నుండి వస్తారు. ఓ ఆత్మలూ, మీరు ఈ శరీరాన్ని వదిలి శివపురికి వెళ్ళాలని అంటారు. ఎక్కడికైతే వెళ్ళాలో ఆ గుర్తులు తప్పకుండా గుర్తుంటాయి. ఆ బద్రీనాథుడు చైతన్యముగా వచ్చి పిల్లలను తోడుగా తీసుకువెళ్ళడము, ఇలా అయితే జరగదు. వారైతే ఇక్కడి నివాసియే. ఈ పరమపిత పరమాత్మ అంటారు, నేను పరంధామ నివాసిని. మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాను. శ్రీకృష్ణుడైతే ఈ విధముగా అనలేరు. రుద్రుడైన శివబాబా అంటారు, ఈ రుద్ర యజ్ఞము రచించబడి ఉంది. గీతలో కూడా రుద్రుని విషయం రాయబడి ఉంది. ఆ ఆత్మిక తండ్రి నన్ను స్మృతి చేయండి అని అంటారు. తండ్రి ఎటువంటి యుక్తితో యాత్రను నేర్పిస్తారంటే, ఎప్పుడైతే వినాశనం జరుగుతుందో అప్పుడు ఆత్మలైన మీరు శరీరాన్ని విడిచి నేరుగా తండ్రి వద్దకు వెళ్ళిపోతారు. మళ్ళీ శుద్ధ ఆత్మకైతే శుద్ధమైన శరీరము కావాలి, అది కూడా ఎప్పుడైతే కొత్త సృష్టి ఉంటుందో అప్పుడే జరుగుతుంది. ఇప్పుడైతే ఆత్మలందరూ దోమల గుంపు వలె బాబాతోపాటు తిరిగి వెళ్తారు, అందుకే వారిని నావికుడు అని కూడా అంటారు. ఈ విషయ సాగరము నుండి అటు తీరానికి తీసుకువెళ్తారు. శ్రీకృష్ణుడిని నావికుడు అని అనలేరు. తండ్రియే ఈ దుఃఖపు ప్రపంచం నుండి సుఖపు ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. ఇదే భారత్ విష్ణుపురిగా, లక్ష్మీ-నారాయణుల రాజ్యముగా ఉండేది. ఇప్పుడు రావణపురిగా ఉంది. రావణుడి చిత్రాన్ని కూడా చూపించాలి. చిత్రాలను బాగా ఉపయోగించాలి. ఏ విధముగా మన ఆత్మ ఉందో అలాగే బాబా ఆత్మ కూడా ఉంది. కేవలం మనం మొదట అజ్ఞానులుగా ఉండేవారము, వారు జ్ఞాన సాగరుడు. ఎవరికైతే రచయిత మరియు రచన గురించి తెలియదో అజ్ఞాని అని వారినే అంటారు. రచయిత ద్వారా ఎవరైతే రచయిత మరియు రచన గురించి తెలుసుకుంటారో వారినే జ్ఞాని అని అంటారు. ఈ జ్ఞానము మీకు ఇక్కడ లభిస్తుంది. సత్యయుగములో లభించదు. పరమాత్మ విశ్వానికి యజమాని అని వారు అంటారు. మనుష్యులు ఆ యజమానిని స్మృతి చేస్తారు, కానీ వాస్తవానికి విశ్వానికి లేక సృష్టికి యజమానులైతే లక్ష్మీ-నారాయణులే అవుతారు. నిరాకార శివబాబా విశ్వానికి యజమానిగా అవ్వరు. కావున వారిని అడగాల్సి ఉంటుంది, ఆ యజమాని నిరాకారుడా లేక సాకారుడా? నిరాకారుడైతే సాకార సృష్టికి యజమాని కాలేరు. వారు బ్రహ్మాండానికి యజమాని. వారే వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేస్తారు. స్వయము పావన ప్రపంచానికి యజమానిగా అవ్వరు. దానికి యజమానులుగా అయితే లక్ష్మీ-నారాయణులే అవుతారు మరియు తయారుచేసేవారు తండ్రి. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన గుహ్యమైన విషయాలు. ఆత్మలైన మనం కూడా బ్రహ్మతత్వములో ఉన్నప్పుడు బ్రహ్మాండానికి యజమానులము. ఎలాగైతే రాజా-రాణి, మేము భారత్ కు యజమానులము అని అంటారు, అలాగే ప్రజలు కూడా మేము యజమానులము అని అంటారు. అక్కడే నివసిస్తారు కదా. ఎలాగైతే తండ్రి బ్రహ్మాండానికి యజమానియో, మనం కూడా యజమానులమే అయినట్లు. మళ్ళీ బాబా వచ్చి కొత్త మనుష్య సృష్టిని రచిస్తారు. వారు అంటారు, నేను దీనిపై రాజ్యము చేయను, నేను మనిషిగా అవ్వను. నేనైతే ఈ శరీరాన్ని కూడా లోన్ గా తీసుకుంటాను. మిమ్మల్ని సృష్టికి యజమానులుగా చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మీరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు, ఇందులో ఏ లోటు రానివ్వకండి. టీచర్ అయితే అందరినీ చదివిస్తారు. ఒకవేళ పరీక్షలో చాలామంది పాస్ అయితే టీచరు ప్రత్యక్షత కూడా జరుగుతుంది. అప్పుడు వారికి గవర్నమెంట్ నుండి లిఫ్ట్ లభిస్తుంది. ఇది కూడా అటువంటిదే. ఎంత బాగా చదువుతారో అంత మంచి పదవి లభిస్తుంది. తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. పరీక్షలో పాస్ అయితే మిఠాయిలు పంచుతారు. ఇక్కడైతే మీరు రోజు మిఠాయిలు పంచుతారు. మళ్ళీ ఎప్పుడైతే పరీక్షలో పాసవుతారో అప్పుడు బంగారు పుష్పాల వర్షం కురుస్తుంది. మీపై ఆకాశము నుండి పుష్పాలు ఏమీ పడవు కానీ మీరు ఒక్కసారిగా బంగారు మహళ్ళకు యజమానులుగా అవుతారు. ఇలా ఎవరినైనా మహిమ చేసేందుకు బంగారు పుష్పాలను తయారుచేసి వారిపై వేస్తారు. ఎలాగైతే దర్భంగా యొక్క రాజు చాలా షావుకారుగా ఉండేవారు, వారి కొడుకు విదేశాలకు వెళ్ళినప్పుడు పార్టీ ఇచ్చారు, చాలా ధనం ఖర్చు పెట్టారు. వారు బంగారు పుష్పాలను తయారుచేసి వర్షింపజేసారు. దానికి చాలా ఖర్చు అయ్యింది. చాలానే పేరు ప్రఖ్యాతమయ్యింది. చూడండి, భారతవాసులు ధనాన్ని ఎలా వ్యర్థం చేస్తారు అని అనేవారు. మీరైతే స్వయమే బంగారు మహళ్ళలోకి వెళ్ళి కూర్చుంటారు, మరి మీకు ఎంత నషా ఉండాలి. తండ్రి అంటారు, కేవలం నన్ను మరియు చక్రాన్ని స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది. ఎంత సహజము.

పిల్లలైన మీరు చైతన్య దీపపు పురుగులు, బాబా చైతన్య దీపము. మీరు అంటారు, ఇప్పుడు మన రాజ్య స్థాపన జరగనున్నది. ఇప్పుడు సత్యమైన బాబా భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చి ఉన్నారు. నేను వచ్చి ఏ విధముగా కొత్త బ్రాహ్మణుల సృష్టిని రచిస్తాను అని, బాబా స్వయంగా తెలియజేసారు. నేను తప్పకుండా రావలసి ఉంటుంది. పిల్లలైన మీకు తెలుసు, మీరు బ్రహ్మాకుమారులు మరియు కుమారీలు. శివబాబాకు మనవలు. ఈ ఫ్యామిలీ అద్భుతమైనది. దేవీ-దేవతా ధర్మం యొక్క అంటు ఏ విధముగా కట్టబడుతుంది, ఇది వృక్షములో స్పష్టంగా ఉంది. కింద మీరు కూర్చున్నారు. పిల్లలైన మీరు ఎంత సౌభాగ్యశాలులు. అతి మధురమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, నేను పిల్లలైన మిమ్మల్ని రావణుని సంకెళ్ళ నుండి విడిపించేందుకు వచ్చాను. రావణుడు మిమ్మల్ని రోగగ్రస్థులుగా చేసేసాడు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి అనగా శివబాబాను స్మృతి చేయండి, దీనితో మీ జ్యోతి వెలుగుతుంది, మళ్ళీ మీరు ఎగిరేందుకు యోగ్యులుగా అవుతారు. మాయ అందరి రెక్కలను తెంచేసింది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బుద్ధిని మంచిగా చేసుకునేందుకు దేహములో ఉంటూ, దేహం యొక్క బంధనం నుండి అతీతముగా ఉండాలి. అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి. అనారోగ్యము సమయంలో కూడా తండ్రి స్మృతిలో ఉండాలి.

2. పారలౌకిక తల్లిదండ్రులకు పిల్లలుగా అయ్యారు, అందుకే చాలా-చాలా మధురముగా, రాయల్ గా, శాంతియుతముగా, జ్ఞాన సంపన్నులుగా మరియు ఆనంద స్వరూపులుగా ఉండాలి. శాంతిగా ఉంటూ శాంతిని స్థాపన చేయాలి.

వరదానము:-

చాలామంది పిల్లలు పరిహాసం చాలా చేస్తారు మరియు దానినే రమణీకత అని భావిస్తారు. వాస్తవానికి రమణీకత అనే గుణము మంచిది అని భావించడం జరుగుతుంది కానీ వ్యక్తి, సమయము, సంగఠన, స్థానము, వాయుమండలం అనుసారముగా రమణీకత మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ ఈ అన్ని విషయాలలో ఒక్క విషయమైనా సరిగ్గా లేకపోతే రమణీకత కూడా వ్యర్థం యొక్క లైనులో లెక్కించబడుతుంది మరియు – వీరు చాలా బాగా నవ్విస్తారు కానీ చాలా మాట్లాడుతారు అనే సర్టిఫికెట్ లభిస్తుంది, అందుకే ఏ పరిహాసంలోనైతే ఆత్మికత ఉంటుందో మరియు ఆ ఆత్మకు లాభం ఉంటుందో, మాటలు హద్దు లోపలే ఉంటాయో, ఆ పరిహాసమే మంచిది, అప్పుడు మర్యాదా పురుషోత్తములు అని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Kannada Murli Audio August 2022

Listen Brahma Kumaris Kannada Murli In Mp3

TODAY ➤ Download Audio of

19/05/2024

Baba Murli Page footer vector

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top