20 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

August 19, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఈ ఆత్మిక చదువును ఎప్పుడూ మిస్ చేయకండి, ఈ చదువుతోనే మీకు విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది’’

ప్రశ్న: -

ఏ నిశ్చయము పక్కాగా ఉన్నట్లయితే చదువును ఎప్పుడూ మిస్ చేయరు?

జవాబు:-

స్వయంగా భగవంతుడే మనల్ని టీచరు రూపంలో చదివిస్తున్నారు, ఈ చదువు ద్వారానే మనకు విశ్వ రాజ్యాధికారం యొక్క వారసత్వం లభిస్తుంది మరియు ఉన్నతమైన హోదా కూడా లభిస్తుంది, తండ్రి మనల్ని తమతో పాటు కూడా తీసుకువెళ్తారు – అన్న నిశ్చయం ఒకవేళ ఉంటే చదువును ఎప్పుడూ మిస్ చేయరు. నిశ్చయం లేని కారణంగా చదువుపై ధ్యాస ఉండదు, మిస్ చేస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మన తీర్థాలు అతీతమైనవి… (హమారే తీర్థ్ న్యారే హై…)

ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలు గతంలోని సత్సంగాలు మరియు ఇప్పటి సత్సంగాల యొక్క అనుభవజ్ఞులు కదా. గతములో అనగా ఈ సత్సంగములోకి రాక ముందు బుద్ధిలో ఏముండేది మరియు ఇప్పుడు బుద్ధిలో ఏముంటుంది! రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా కనిపిస్తూ ఉండవచ్చు. ఆ సత్సంగాలలో కేవలం వింటూనే ఉంటారు. మనసులో ఏ రకమైన ఆశ ఉండదు. కేవలం సత్సంగాలకు వెళ్ళి శాస్త్రాలలోని రెండు వాక్యాలను వినడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చుని ఉన్నారు. బుద్ధిలో ఉంది – ఆత్మలమైన మనం బాప్ దాదా ఎదురుగా కూర్చుని ఉన్నాము మరియు వారి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోవడానికి జ్ఞానాన్ని మరియు యోగాన్ని నేర్చుకుంటున్నాము. ఎలాగైతే స్కూలులో విద్యార్థులు – మేము బ్యారిస్టరుగా లేక ఇంజనీరుగా అవుతామని భావిస్తారు. ఏదో ఒక పరీక్ష పాస్ అయ్యి ఈ పదవిని పొందుతారు. ఈ ఆలోచనలు ఆత్మకు వస్తాయి. ఇప్పుడు మేము చదువుకుని ఫలానాగా అవుతాము. సత్సంగాలలో ప్రాప్తి కలుగుతుంది అన్న ఎలాంటి లక్ష్యము ఉండదు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఆశ ఉన్నా కూడా అది అల్పకాలము కోసమే. సాధువులు-సత్పురుషులను కృప చూపించండి, ఆశీర్వదించండి అని అడుగుతారు. ఈ భక్తి, సత్సంగాలు మొదలైనవి చేస్తూ ఇంత వరకు వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు మనము తండ్రి ఎదురుగా కూర్చున్నాము. ఆత్మకు తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలనే ఆశ ఒక్కటే ఉంది. ఆ సత్సంగాలలో వారసత్వము తీసుకునే విషయమే ఉండదు. పాఠశాల లేక కాలేజిలో కూడా వారసత్వము తీసుకునే విషయమే ఉండదు. వారైతే చదివించే టీచరు. ఈ సమయంలో పిల్లలైన మీరు వారసత్వము యొక్క ఆశ పెట్టుకుని కూర్చున్నారు. తప్పకుండా తండ్రి పరంధామము నుండి వచ్చి ఉన్నారు మనకు మళ్ళీ సదా సుఖం యొక్క స్వరాజ్యాన్ని ఇవ్వడానికి. ఇది పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది కదా. అయినా కూడా తండ్రి సమ్ముఖంలోకి వెళ్ళడం వలన జ్ఞానం యొక్క మంచి బాణాలు తగులుతాయని భావిస్తారు ఎందుకంటే వారు సర్వశక్తివంతులు. పిల్లలు కూడా జ్ఞాన బాణాలను వేయడం నేర్చుకుంటారు కానీ నంబరువారు పురుషార్థానుసారంగా. ఇక్కడ మాత్రమే డైరెక్టుగా వింటారు. బాబా అర్థం చేయిస్తున్నారు అని భావిస్తారు. ఇతర ఏ సత్సంగాలలో లేక కాలేజీలలో ఈ విధంగా భావించరు. మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మనము ఈ సృష్టి చక్రము గురించి తెలుసుకున్నాము. ఆ సత్సంగాలకైతే జన్మ-జన్మాంతరాలుగా వెళ్తూనే ఉంటారు. ఇక్కడ ఒక్కసారి యొక్క విషయము. భక్తి మార్గంలో ఏదైతే చేస్తారో, అది ఇప్పుడు పూర్తి అవుతుంది. అందులో ఏ విధమైన సారమూ లేదు. అయినా కూడా అల్పకాలము కోసం మనుష్యులు ఎంతగా తల బాదుకుంటూ ఉంటారు. మమ్మల్ని బాబా చదివిస్తున్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంటుంది. బాబాయే బుద్ధిలో గుర్తుకొస్తారు మరియు తాము పోగొట్టుకున్న రాజధాని కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనము ఎంతగా పురుషార్థము చేస్తామో, బాబాను స్మృతి చేస్తామో మరియు జ్ఞానాన్ని ధారణ చేస్తామో, ఇతరులతో కూడా జ్ఞాన ధారణ చేయిస్తామో, అంత ఉన్నత పదవిని పొందుతాము. ఇదైతే ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంది కదా. తండ్రి ఈ ప్రజాపిత బ్రహ్మా ద్వారా అర్థం చేయిస్తున్నారు. వీరిని దాదా అనే అంటారు. శివబాబా వీరిలో ప్రవేశించి మనల్ని చదివిస్తున్నారు. మీకు తెలుసు, ఇంతకుముందు ఈ విషయాలు మన బుద్ధిలో లేవు. మనము కూడా చాలా సత్సంగాలు మొదలైనవి చేసేవారము. కానీ పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి చదివిస్తారు అన్నది ఆలోచనలో కూడా లేదు. ఇప్పుడు తండ్రి గురించి మరియు సమయం గురించి తెలుసుకున్నారు. కొత్త ప్రపంచము, స్వర్గం యొక్క స్వరాజ్యము మళ్ళీ గుర్తుకొస్తుంది. లోలోపల సంతోషం ఉంటుంది. అనంతమైన తండ్రి ఎవరినైతే భగవంతుడు అని అంటారో, వారు మనల్ని చదివిస్తున్నారు. బాబా అయితే పతితపావనుడే, మళ్ళీ టీచరు రూపంలో కూర్చుని మనల్ని చదివిస్తున్నారు. ఈ ప్రపంచంలో పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ ఈ ఆలోచనల్లో కూర్చుని ఉండకపోవచ్చు. మీరు అనంతమైన తండ్రి స్మృతిలో కూర్చున్నారు. లోపల ఈ తెలివి ఉంది – ఆత్మలమైన మేము 84 జన్మల పాత్రను పూర్తి చేసి తిరిగి వెళ్తాము, మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళడం కోసం తండ్రి మనకు రాజయోగం యొక్క శిక్షణ ఇస్తున్నారు. పిల్లలకు తెలుసు, ఈ రాజయోగం యొక్క శిక్షణను ఇచ్చి స్వర్గం యొక్క మహారాజు-మహారాణిగా తయారుచేసేవారు తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఉండరు, అది ఇతరులకు అసాధ్యము. స్వర్గానికి యజమానులుగా చేయడానికి బాబా ఒక్కసారే వచ్చి చదివిస్తారు. పిల్లలైన మనం తండ్రి ద్వారా అనంతమైన సృష్టి యొక్క స్వరాజ్యం తీసుకోవడానికి చదువును చదువుకుంటున్నామని బుద్ధిలో ఉంటుంది. లక్ష్యము-ఉద్దేశ్యము యొక్క శక్తి ద్వారానే చదువుతాము. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లల బుద్ధిలో మేము ఎక్కడ కూర్చొన్నాము అనేది ఉంది. మనుష్యుల ఆలోచనలైతే ఎక్కడో ఒక చోటుకు వెళ్తూ ఉంటాయి. చదువుకునే సమయంలో చదువు గురించి, ఆడుకునే సమయంలో ఆట గురించి ఆలోచనలు వస్తాయి.

మీకు తెలుసు – మనం అనంతమైన తండ్రి సమ్ముఖంలో కూర్చున్నాము. ఇంతకుముందు తెలియదు. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారని ఏ మనుష్యమాత్రులకు తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు – జన్మ-జన్మాంతరాలుగా మనము భక్తి చేస్తూ వచ్చాము. ఈ జ్ఞానం తండ్రి తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు, ఎప్పటివరకైతే తండ్రి రారో – విశ్వ యజమానత్వపు వారసత్వం ఎలా లభిస్తుంది? ఎవరి బుద్ధిలోకి ఈ విషయం రాదు. మనం భగవంతుని పిల్లలము, వారు స్వర్గ రచయిత, మరి మనం స్వర్గంలో ఎందుకు లేము? నరకంలో దుఃఖితులుగా ఎందుకు ఉన్నాము? ఓ భగవంతుడా, ఓ పతితపావనా అని అంటారు కానీ మనం దుఃఖితులుగా ఎందుకు ఉన్నాము అన్నది బుద్ధిలోకి రాదు. తండ్రి పిల్లలకు దుఃఖమేమైనా ఇస్తారా! తండ్రి పిల్లల కోసం సృష్టిని రచిస్తారు. దుఃఖం కోసం రచిస్తారా? ఇలా అయితే జరగదు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతంపై నడుచుకుంటారు. ఆఫీసులో లేదా వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటిలో ఎక్కడ కూర్చొన్నా కానీ బుద్ధిలోనైతే మనల్ని చదివించేవారు భగవంతుడు అయిన తండ్రి అని ఉంది కదా. మనం రోజూ ఉదయము క్లాసుకు వెళ్ళాల్సి ఉంటుంది. క్లాసుకు వెళ్ళేవారికే స్మృతి వస్తూ ఉండవచ్చు. మిగిలిన వారు ఎవరైతే క్లాసుకే రారో, వారు చదువును మరియు చదివించేవారిని ఎలా అర్థం చేసుకోగలరు. ఇవి కొత్త విషయాలు, వీటి గురించి మీకే తెలుసు. అనంతమైన తండ్రి ఎవరైతే కొత్త ప్రపంచాన్ని రచించేవారో, వారు కూర్చుని కొత్త ప్రపంచం కోసం మన జీవితాన్ని వజ్రం వలె తయారుచేస్తారు. ఎప్పటి నుండైతే మాయ ప్రవేశించిందో, అప్పటి నుండి మనం గవ్వ వలె అవుతూ వచ్చాము. కళలు తగ్గిపోతూ వచ్చాయి. మాయ ఎలా తింటూ వచ్చింది అంటే మనకు అసలు ఏమీ తెలియనే తెలియలేదు. ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలను అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పారు. ఆ నిద్ర కాదు, అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు. జ్ఞానమైతే జ్ఞానసాగరుడే ఇస్తారు, ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఒక్క మన అత్యంత ప్రియమైన తండ్రి, జ్ఞాన సాగరుడు, పతితపావనుడే ఇవ్వగలరు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు – ఈ యుక్తితో తండ్రి మనల్ని పావనంగా తయారుచేస్తున్నారు. ఓ పతితపావనా, బాబా రండి అని పిలుస్తారు కూడా. కానీ ఎలా వచ్చి పావనంగా చేస్తారు అన్నది అర్థం చేసుకోరు. కేవలం పతితపావనా అని అంటూ ఉండడం వలన అయితే పావనంగా అవ్వరు.

మీకు తెలుసు – ఈ సమయంలో అందరూ పతితులుగా, భ్రష్టాచారులుగా ఉన్నారు. వారు భ్రష్టాచారం ద్వారా జన్మిస్తారు. వారు కర్తవ్యాలు కూడా అలాంటివే చేస్తారు. ఇవి అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, మీరు ఇక్కడ సమ్ముఖంలో కూర్చుని వింటున్నప్పుడు మీ బుద్ధియోగము తండ్రితో ఉంటుంది. మళ్ళీ చెడు సాంగత్యము వైపుకు వెళ్తే, అనేకులను కలుస్తూ ఉంటే, వాతావరణం గురించి వింటూ ఉంటే, సమ్ముఖంలో ఉండే అవస్థ ఏదైతే ఉందో, ఆ అవస్థ మారిపోతుంది. ఇక్కడైతే సమ్ముఖంలో కూర్చున్నారు. స్వయం జ్ఞానసాగరుడు పరమపిత పరమాత్మ కూర్చుని జ్ఞాన బాణాలను వేస్తారు, అందుకే మధుబన్ కు మహిమ ఉంది. మధుబన్ లో మురళి మ్రోగుతుంది అని పాడుతారు కూడా. మురళి అయితే చాలా స్థానాలలో మ్రోగుతుంది కానీ ఇక్కడ సమ్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తారు మరియు పిల్లలకు సావధానపరుస్తారు కూడా, పిల్లలూ జాగ్రత్తగా ఉండండి. ఏ రకమైన తప్పుడు సాంగత్యాలను చేయకండి. మనుష్యులు మీకు తప్పుడు మాటలు వినిపిస్తూ, భయపెట్టి ఈ చదువు నుండే విడిపించేస్తారు. మంచి సాంగత్యం తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. ఇక్కడ సత్యమైన తండ్రి యొక్క సాంగత్యముంది. మీరు ప్రతిజ్ఞ కూడా చేస్తారు – మేము ఒక్కరి ద్వారానే వింటాము, ఒక్కరి ఆజ్ఞనే పాటిస్తాము. మీ అందరికీ తండ్రి, టీచరు, సద్గురువు వారొక్కరే. అక్కడైతే ఆ గురువులు కేవలం శాస్త్రాలనే వినిపిస్తూ ఉంటారు. కొత్త విషయమేమీ లేదు. తండ్రి పరిచయాన్ని ఇవ్వలేరు, జ్ఞానం యొక్క విషయాల గురించి తెలియదు. అందరూ మాకు తెలియదు-మాకు తెలియదు అని అంటూ వచ్చారు. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు. ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడే అర్థం చేయిస్తారు. ఈ కలియుగీ గురువులు కూడా నంబరువారుగా ఉంటారు, కొందరికైతే లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. మా సద్గురువు ఒక్కరేనని మీరు భావిస్తారు. మరణించడము మొదలైన విషయమేమీ లేదు. ఈ శరీరమైతే శివబాబాది కాదు. వారైతే అశరీరి, అమరులు. మన ఆత్మకు కూడా అమరకథను వినిపించి అమరంగా చేస్తున్నారు. అమరపురిలోకి తీసుకువెళ్తారు. మళ్ళీ సుఖధామంలోకి పంపిస్తారు. నిర్వాణధామము ఉన్నదే అమరపురి. ఇప్పుడు ఆత్మలైన మేము శరీరాలను వదిలి తండ్రి వద్దకు వెళ్ళిపోతామని మీ బుద్ధిలో ఉంటుంది. తర్వాత ఎవరెంత పురుషార్థం చేసి ఉంటారో, దాని అనుసారంగా పదవిని పొందుతారు. క్లాసు ట్రాన్స్ఫర్ అవుతుంది. మన చదువు యొక్క పదవి ఈ మృత్యులోకంలో లభించదు. ఈ మృత్యులోకము మళ్ళీ అమరలోకంగా అయిపోతుంది. మేము సత్య-త్రేతాయుగాలలో 21 జన్మలు రాజ్యం చేసాము, తర్వాత ద్వాపర-కలియుగాలలోకి వచ్చామని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఇప్పుడిది మన అంతిమ జన్మ, మళ్ళీ మనం తిరిగి వెళ్తాము, ముక్తిధామానికి వెళ్ళి, అక్కడ నుండి సుఖధామంలోకి వస్తాము. తండ్రి పిల్లలను ఎంతగా రిఫ్రెష్ చేస్తారు. మనం 84 జన్మల చక్రంలోకి వస్తామని ఆత్మ అర్థం చేసుకుంటుంది. పరమాత్మ అంటారు – నేను ఈ చక్రంలోకి రాను. నాలో ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానముంది. పతితపావనుడు అనంతమైన తండ్రి అని మీకు తెలుసు. కనుక వారు అనంతాన్ని పావనంగా చేసేవారై ఉంటారు కదా. మనుష్యులు ఎవరూ అనంతమైన తండ్రి అవ్వలేరు. ఆ అనంతమైన తండ్రి ఒక్కరే.

మీకు తెలుసు – ఆత్మలమైన మనం అక్కడ నివసించేవారము. అక్కడ నుండి మళ్ళీ శరీరంలోకి వస్తాము. మొట్టమొదట పాత్రను అభినయించడానికి ఎవరు వచ్చారు అన్నది మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలమైన మనం నిరాకారీ ప్రపంచం నుండి పాత్రను అభినయించడానికి వచ్చాము. ఈ సమయంలో పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. ప్రతి ఒక్క ధర్మం వారు తమ పాత్ర అనుసారంగా నంబరువారుగా ఎలా వస్తారు, దీనిని అవినాశీ డ్రామా అని అంటారు. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. మనం అనంతమైన డ్రామాలోని పాత్రధారులము. అనంతమైన చరిత్ర-భౌగోళికం గురించి కానీ, తమ జన్మల గురించి కానీ తెలియదు. పురుషార్థం అనుసారంగా బాబా మిమ్మల్ని ఎంతగా రిఫ్రెష్ చేస్తారు. కొంతమంది అయితే చాలా సంతోషంలో ఉంటారు. బాబా మాకు సత్య జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇంకే మనుష్యమాత్రులు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు, అందుకే దీనిని అజ్ఞాన అంధకారమని అనడం జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు – మనం అజ్ఞాన అంధకారంలోకి ఎలా వచ్చాము, మళ్ళీ జ్ఞాన ప్రకాశంలోకి ఎలా వెళ్ళాలి. ఇది కూడా నంబరువారుగా అర్థం చేసుకోగలరు. ఘోర అంధకారము మరియు అత్యంత ప్రకాశము – ఈ పదాలు అనంతానికి సంబంధించినవి. అర్ధకల్పం రాత్రి, అర్ధకల్పం పగలు లేదా సాయంత్రము మరియు ఉదయము… అని అయినా భావించండి. ఇది అనంతమైన విషయము. బాబా వచ్చి అన్ని శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. దాన-పుణ్యాలు ఏవైతే చేస్తారో, శాస్త్రాలు చదువుతారో, వాటి ద్వారా అల్పకాలిక సుఖం లభిస్తుంది. తండ్రి అంటారు – వారిని విశ్వానికి యజమానులుగా చేయడానికి, నేను వాటి ద్వారా లభించను. అందరూ విశ్వానికి యజమానులుగా అవ్వలేరని కూడా అర్థం చేసుకుంటారు. ఎవరినైతే తండ్రి చదివిస్తారో, వారే యజమానులుగా అవుతారు. వారే రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మొత్తం ప్రపంచము వారైతే రాజయోగాన్ని నేర్చుకోరు. కోటిలో ఏ ఒక్కరు మాత్రమే చదువుతారు. చాలా మంది 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు రాజయోగాన్ని నేర్చుకుంటారు, అయినా కూడా చదువును విడిచిపెడతారు. తండ్రి అంటారు – మాయ చాలా ప్రబలమైనది, పూర్తిగా బుద్ధిహీనులుగా చేస్తుంది, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆశ్చర్యం కలిగేలా తండ్రికి చెందినవారిగా అవుతారు, కథాగానం చేస్తారు, మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు అనే నానుడి ఉంది కదా.

తండ్రి అంటారు – వారి దోషము కూడా లేదు. ఈ మాయ తుఫానులలోకి తీసుకొస్తుంది. ఏ ప్రేయసులనైతే అలంకరించి, స్వర్గానికి మహారాణులుగా తయారుచేస్తారో, వారు కూడా వదిలి వెళ్ళిపోతారు. అయినా కూడా తండ్రి అంటారు – ఎవరితోనైతే నిశ్చితార్థం జరుపుకున్నారో, వారిని స్మృతి చేయాలి. స్మృతి వెంటనే నిలవదు. అర్ధకల్పం నామ-రూపాలలో చిక్కుకుంటూ వచ్చారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడమనేది చాలా కష్టము. సత్యయుగంలో మీరు ఆత్మాభిమానులుగా అవుతారు కానీ పరమాత్మ గురించి తెలియదు. పరమాత్మను కేవలం ఒకేసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అర్ధకల్పం దేహాభిమానులుగా అవుతారు. ఆత్మలు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయించాల్సి ఉంటుంది, కావున ఏడ్వవలసిన అవసరం కూడా ఉండదని అర్థం చేసుకోరు. తండ్రి ద్వారా సుఖధామం యొక్క వారసత్వం లభిస్తున్నప్పుడు, మరి దానిపై పూర్తి ధ్యాసను ఎందుకు ఉంచకూడదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి ఆజ్ఞ అనుసారంగానే నడుచుకోవాలి. తండ్రి ద్వారానే వినాలి. మనుష్యుల యొక్క తప్పుడు మాటలను విని వారి ప్రభావంలోకి రాకూడదు. తప్పుడు సాంగత్యాలను చేయకూడదు.

2. చదువును మరియు చదివించేవారిని సదా గుర్తుంచుకోవాలి. ఉదయముదయమే క్లాసుకు తప్పకుండా రావాలి.

వరదానము:-

చాలా మంది పిల్లలు నడుస్తూ-నడుస్తూ బీజాన్ని వదిలి కొమ్మలు-రెమ్మలకు ఆకర్షితులవుతారు, కొందరు ఆత్మలను ఆధారంగా చేసుకుంటారు మరియు కొందరు సాధనాలను, ఎందుకంటే బీజం యొక్క రంగు-రూపము శోభనీయంగా ఉండదు మరియు కొమ్మల-రెమ్మల రంగు-రూపము ఎంతో శోభనీయంగా ఉంటాయి. మాయ బుద్ధిని ఎలా పరివర్తన చేస్తుందంటే, అసత్యమైన ఆధారమే సత్యమైనదిగా అనుభవమవుతుంది. అందుకే ఇప్పుడు సాకార స్వరూపంలో తండ్రి తోడును మరియు సాక్షీ దృష్టా స్థితి యొక్క అనుభవాన్ని పెంచండి, సాధనాలను ఆధారంగా చేసుకోకండి, వాటిని నిమిత్త-మాత్రంగా కార్యంలో వినియోగించండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top