1 September 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

August 31, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా కూడా ఎక్కువ రాయల్టీతో నడుచుకోవాలి ఎందుకంటే మీరు ఇప్పుడు నిరాకారీ మరియు సాకారీ ఉన్నత కులానికి చెందినవారు’’

ప్రశ్న: -

ఏ పిల్లల ముఖము పుష్పము వలె వికసించి ఉంటుంది?

జవాబు:-

ఎవరికైతే తండ్రి నుండి మేము అనంతమైన వారసత్వాన్ని తీసుకొని విశ్వానికి యజమానులుగా అవుతాము అన్న గుప్తమైన సంతోషం ఉంటుందో, రెండవది, ఎవరైతే జ్ఞానము మరియు యోగముతో సతోప్రధానంగా అవుతూ ఉన్నారో, ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటుందో, అటువంటి పిల్లల యొక్క ముఖము పుష్పము వలె సంతోషంతో వికసించి ఉంటుంది. ఆత్మలో శక్తి నిండుతూ ఉంటుంది. నోటి నుండి జ్ఞాన రత్నాలు వెలువడుతూ-వెలువడుతూ రూప్-బసంత్ గా అవుతారు. వారికి కొత్త రాజధాని యొక్క సాక్షాత్కారము జరుగుతూ ఉంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీ దారిలోనే మరణించాలి… (మర్నా తేరీ గలీ మే…)

ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలు మేము బాబా మెడలోని హారంగా అవ్వాలి అన్నది బాగా అర్థము చేసుకున్నారు. ఇలా ఎవరన్నారు? ఇప్పుడు మీ మెడలోని హారంగానే అవ్వాలి అని ఆత్మ అన్నది. దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మనము రుద్ర మాలలో కూర్చబడతాము. తిరిగి వెళ్ళాలి, అందుకే జీవిస్తూ ఉండగానే దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. ఆత్మ పరమాత్మ యొక్క సంతానము, వారి నుండే ఇప్పుడు మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాము. పిల్లలకు ఈ నషా ఉండాలి. అప్పుడు బుద్ధి శివబాబా వద్దకు వెళ్తుంది. ఆత్మలమైన మనము వారి సంతానము. ఇప్పుడు బ్రహ్మా ద్వారా వారికి మనవలుగా అయ్యాము. నిరాకార బాబా, సాకార దాదా ఉన్నారు. తండ్రి ఉన్నతోన్నతమైనవారు. మనుష్యులలో ఉన్నతమైన ధనవంతులు ఎవరైతే ఉంటారో, వారు చాలా రాయల్టీతో ఉంటారు. వారికి తమ హోదా యొక్క నషా ఉంటుంది. పిల్లలైన మీకు లోలోపల చాలా సంతోషం ఉండాలి. తండ్రి స్మృతిలో ఉండడము – ఇదే దేహీ-అభిమాని అవస్థ, దీని ద్వారా మీకు చాలా లాభము ఉంటుంది. మేము ఈశ్వరీయ సంతానము, బ్రహ్మా యొక్క సంతానము అని పిల్లలైన మీకు తెలుసు. బాబా అంటారు – మీరు నా పిల్లలే, ఇప్పుడు మిమ్మల్ని బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటాను. మేము నిరాకారీ మరియు సాకారీ ఉన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందినవారము – అని మీకు ఈ నషా ఉండాలి. స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించాలి. ఈశ్వరీయ సంతానమైన మనము బ్రహ్మా యొక్క సంతానము. మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఇది మర్చిపోకూడదు. బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా కూడా ఎక్కువ రాయల్టీతో నడుచుకోవాలి. మీ జీవితం అమూల్యమైనదిగా ఇప్పుడు తయారవుతుంది. ఇంతకుముందు గవ్వ వలె ఉండేది, ఇప్పుడు వజ్రం వలె తయారవుతుంది అందుకే మీకు మహిమ ఉంది. మందిరాలు కూడా మీ స్మృతిచిహ్నాలుగా తయారయ్యాయి. సోమనాథుడు – ఎవరైతే దేవతలను ఇలా తయారుచేసారో, వారి స్మృతిచిహ్నము కూడా ఉంది. మీ స్మృతి చిహ్నము కూడా ఉంది. సోమనాథుడు అవినాశీ జ్ఞాన రత్నాలను ఇచ్చారు కనుక వారి మందిరం ఎంత బాగా తయారై ఉంది. మీరు పాట వినేటప్పుడు మేము శివబాబా మెడలోని హారంగా అయ్యామని మీకు తెలుసు. బాబా మనల్ని చదివిస్తారు. మమ్మల్ని చదివించేవారు ఎవరు, ఆ సంతోషం కూడా ఉండాలి. మొదట అక్షరాలు చదువుకునేటప్పుడు నేలపై కూర్చుని చదువుకుంటారు, ఆ తర్వాత బెంచిపై కూర్చుని చదువుకుంటారు, ఆ తర్వాత కుర్చీపై కూర్చుని చదువుకుంటారు. రాకుమార, రాకుమారీలైతే కాలేజీలో సోఫా వంటి ఆసనంపై కూర్చుంటారు. వారిని చదివించేవారేమీ రాకుమార-రాకుమారీలు కాదు. చదివించేందుకు ఎవరో టీచరు ఉంటారు. కానీ పదవి అయితే రాకుమార-రాకుమారీలది ఉన్నతంగా ఉంటుంది కదా. మీరైతే సత్యయుగీ రాకుమార-రాకుమారీల కన్నా కూడా ఉన్నతమైనవారు కదా. వారు ఎంతైనా దేవతల యొక్క సంతానము. మీరు ఈశ్వరీయ సంతానము, ఎవరి నుండైతే వారసత్వము తీసుకోవాలో, వారిని స్మృతి కూడా చేయాలి. లేస్తూ-కూర్చుంటూ, వ్యవహారాలలో ఉంటూ, వారిని మర్చిపోకూడదు. స్మృతితోనే ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు.

తండ్రి పిల్లలకు వీలునామా రాసి వానప్రస్థములోకి వెళ్ళినట్లయితే, ఇక వారి వద్ద ఏమీ ఉండదు, అంతా ఇచ్చేసినట్లే. ఏ విధంగానైతే మీరు – బాబా, ఇదంతా మీదే అని వీలునామా రాస్తారు. అప్పుడు బాబా అంటారు – అచ్ఛా, ట్రస్టీగా అయి సంభాళించండి. మీరు నన్ను ట్రస్టీగా చేస్తారు, నేను మళ్ళీ మిమ్మల్ని ట్రస్టీగా చేస్తాను, కావున శ్రీమతముపై నడుచుకోండి, ఎటువంటి తప్పుడు వ్యాపారాలు చేయకండి. నన్ను అడుగుతూ ఉండండి, పిల్లలు భోజనము ఎలా తినాలి అన్నది కూడా కొందరికి తెలియదు. బ్రహ్మా భోజనానికి చాలా మహిమ ఉంది. దేవతలు కూడా బ్రహ్మా భోజనం యొక్క ఆశను పెట్టుకుంటారు, అందుకే కదా మీరు బ్రహ్మా భోజనాన్ని తీసుకువెళ్తారు. ఈ బ్రహ్మా భోజనంలో చాలా శక్తి ఉంది. మున్ముందు భోజనాన్ని యోగీలు తయారుచేస్తారు. ఇప్పుడైతే పురుషార్థులుగా ఉన్నారు. ఎంత వీలైతే అంత శివబాబా స్మృతిలో ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. ఎంతైనా పిల్లలే కదా. తినేటువంటి పిల్లలు పక్కా అవుతూ ఉంటారు, అలాగే తయారుచేసేవారు కూడా పక్కాగా ఉన్నవారు వెలువడుతూ ఉంటారు. బ్రహ్మా భోజనము అని అంటారు. శివ భోజనము అని అనరు. శివుని భండారము అని అంటారు. ఏదైతే పంపిస్తారో, అది శివబాబా భండారములో పవిత్రమైపోతుంది. శివబాబా యొక్క భండారము. బాబా చెప్పారు – శ్రీనాథ ద్వారములో నేతి బావులు ఉన్నాయి. అక్కడ సంపూర్ణ భోజనం తయారవుతుంది మరియు జగన్నాథ ద్వారములో అసంపూర్ణ భోజనం తయారవుతుంది. తేడా ఉంది కదా. వారు శ్యామ్, వీరు సుందర్. శ్రీనాథుని వద్ద చాలా ధనము ఉంది – అక్కడ (ఒరిస్సా వైపు) ఇంత ధనవంతులు ఉండరు. పేదవారు మరియు షావుకార్లు అయితే ఉంటారు కదా. ఇప్పుడైతే చాలా పేదవారిగా ఉన్నారు, తర్వాత షావుకార్లుగా అవుతారు. ఈ సమయంలో మీరు చాలా పేదవారిగా ఉన్నారు. అక్కడైతే మీకు 36 రకాల భోజనం లభిస్తుంది. కనుక అటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రజలు కూడా 36 రకాల భోజనాన్ని తింటూ ఉండవచ్చు కానీ రాజ్య పదవి అయితే ఉన్నతమైనది కదా. అక్కడి భోజనమైతే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. అన్ని వస్తువులు ఏ వన్ క్వాలిటీవిగా ఉంటాయి. ఇక్కడ అన్ని వస్తువులు జెడ్ క్వాలిటీవిగా ఉన్నాయి. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. ధాన్యము మొదలైనవి ఏవైతే వెలువడతాయో, అన్నీ కుళ్ళిపోయి ఉంటాయి. పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి, ఎవరైనా పెద్ద పరీక్ష పాస్ అయితే నషా ఉంటుంది కదా. మీకైతే – మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని చాలా ఉన్నతమైన నషా ఉండాలి. వారు సర్వుల సద్గతి దాత. తండ్రి అంటారు, నేను మీకు విధేయుడైన సేవకుడిని. తండ్రి పిల్లలకు విధేయుడైన సేవకునిగా ఉంటారు కదా. పిల్లలపై బలిహారమై, ఆ తర్వాత స్వయము వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. తండ్రి అంటారు, నేను కూడా బలిహారమవుతాను. కానీ మొదట మీరు బలిహారమవుతారు. మనుష్యులు మరణిస్తే వారి వస్తువులను శ్మశాన బ్రాహ్మణులకు ఇస్తారు కదా. షావుకార్లు అయితే ఫర్నీచర్ మొదలైనవి కూడా ఇచ్చేస్తారు. పిల్లలైన మీరు ఏమిస్తారు? పనికిరానిది ఇస్తారు. దానికి ప్రతిఫలంగా మీకు ఏం లభిస్తుంది? పేదవారే వారసత్వాన్ని తీసుకుంటారు. బలిహారమవుతారు. బాబా తీసుకునేది ఏమిటి, ఇచ్చేది ఏమిటి? కావున పిల్లలైన మీకు నషా ఉండాలి. అనంతమైన బాబా లభించారు, మురికి పట్టిన వస్త్రాలను శుభ్రము చేస్తారు. సిక్కులు అంటారు – గురునానక్ ఈ వాణిని నడిపించారు – దాని ఆధారంగా గ్రంథ్ తయారుచేయబడింది. భారతవాసులకు ఈ విషయాలు కూడా తెలియవు – మా గీతను ఎవరు వినిపించారు? గీతా భగవంతుడు ఎవరు? ఏ ధర్మాన్ని స్థాపన చేసారు? వారైతే హిందూ ధర్మము అని అంటారు. ఆర్య ధర్మము అని అంటారు, అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోరు. ఆర్య ధర్మము ఉండేదని వారు భావిస్తారు, ఇప్పుడైతే మొత్తం భారత్ అంతా అనార్య్ గా (సభ్యత లేనిదిగా) ఉంది. ఆర్య ధర్మం అన్న పేరును దయానంద్ పెట్టారు. చివర్లో ఏవైతే కొమ్మలు-రెమ్మలు వెలువడతాయో, వాటి వృద్ధి త్వర-త్వరగా జరుగుతుంది. మీరైతే శ్రమ చేయవలసి ఉంటుంది. వారికి కన్వర్ట్ చేయడానికి సమయం ఏమైనా పడుతుందా. ఇక్కడైతే కన్వర్ట్ అయ్యే విషయమే లేదు. ఇక్కడైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వాలి. బ్రాహ్మణులుగా అవ్వడము అంటే పిన్నమ్మ ఇంటికి వెళ్ళడము అంత సులువా. నడుస్తూ-నడుస్తూ ఫెయిల్ అవుతారు. బాబా అంటారు, ఎవరైనా గొంతు కోసినా సరే అపవిత్రంగా మాత్రము అవ్వకూడదు. ఈ పరిస్థితిలో ఏం చేయను అని బాబాను అడుగుతారు. అప్పుడు బాబా వీరు సహనం చేయలేరు అని అర్థము చేసుకుంటారు. అప్పుడిక బాబా అంటారు, వెళ్ళి పతితముగా అవ్వండి. ఇదైతే మీపై ఆధారపడి ఉంది. వారు మహా అయితే ఈ ఒక్క జన్మ కోసం హతమారుస్తారు, మీరైతే 21 జన్మల కోసం స్వయాన్ని హతమార్చుకుంటారు. నడుస్తూ-నడుస్తూ మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. ఇది బాక్సింగ్ కదా. ఒక్క దెబ్బతో పూర్తిగా పడేస్తుంది. 15-20 సంవత్సరాల వారు, ప్రారంభం నుండి వచ్చినవారు కూడా ఎలా ఉంటారంటే, పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మరణిస్తారు. ఇటువంటి నాజూకైనవారు కూడా ఉన్నారు. తప్పు చేస్తే పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది కదా. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, మీరు ఈ డిస్సర్వీస్ చేస్తారు, ఇది సరి కాదు. శిక్షణ అయితే ఇవ్వడము జరుగుతుంది కదా. ఇక్కడేమీ దెబ్బలు వేయడము జరగదు. ఏ విధంగానైతే, ఇంట్లో పిల్లలు చాలా విసిగించినప్పుడు చెంపదెబ్బలు వేయాల్సి ఉంటుంది అని అంటారు కదా. బాబా అంటారు, అచ్ఛా, వారి కళ్యాణము కోసం కొద్దిగా చెవి పట్టుకోండి. ఎంత వీలైతే అంత చాలా ప్రేమగా అర్థం చేయించండి. కృష్ణుని కోసం కూడా వారిని తాడుతో బంధించేవారు అని అంటారు. కానీ అటువంటి చంచలత్వము అక్కడ ఉండదు. ఈ సమయం యొక్క పిల్లలే ఊపిరి ఆడనివ్వకుండా చేస్తారు.

కావున తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, గమ్యము చాలా ఉన్నతమైనది. ప్రతి విషయములోనూ అడగండి – బాబా యుక్తులు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి వ్యాధి వేర్వేరుగా ఉంటుంది. అడుగడుగునా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మోసపోతారు. చాలా చాలా మధురంగా అవ్వాలి. శివబాబా ఎంత మధురమైనవారు, ఎంత ప్రియమైనవారు. పిల్లలు కూడా ఆ విధంగా తయారవ్వాలి. తండ్రి అయితే కోరుకుంటారు కదా – పిల్లలు నా కన్నా కూడా ఉన్నతంగా అవ్వాలి, పేరు రావాలి, ఎటువంటి ఫస్ట్ క్లాస్ వారిగా అవ్వాలంటే నా కన్నా కూడా మీ పదవి ఉన్నతంగా ఉండాలి. తప్పకుండా ఉన్నత పదవినిస్తారు కదా! వీరు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు అన్నది ఎవరికీ ఆలోచనలో కూడా ఉండదు. కావున మీ నడవడిక చాలా రాయల్ గా ఉండాలి. నడవడము, తిరగడము, మాట్లాడడము, తినడము అన్నీ చాలా రాయల్టీతో ఉండాలి. మేము ఈశ్వరీయ సంతానము అని లోలోపల చాలా సంతోషం ఉండాలి. లక్ష్మీ-నారాయణుల చిత్రాలైతే ప్రత్యక్షంగా ఉన్నాయి. మీరైతే గుప్తమైనవారు కదా. బ్రాహ్మణులైన మీ గురించి బ్రాహ్మణులకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మీకు తెలుసు, మనము గుప్త వేషంలో బాబా నుండి వారసత్వము తీసుకుని విశ్వానికి యజమానులుగా అవుతాము. ఇది చాలా ఉన్నతమైన పదవి, ఇందులో లోలోపల చాలా సంతోషం ఉంటుంది. ముఖము పుష్పము వలె వికసించి ఉండాలి, ఇటువంటి పురుషార్థం చేయాలి. ఇప్పుడింకా ఎవ్వరూ ఆ విధంగా తయారవ్వలేదు. పురుషార్థము చేయాలి. మున్ముందు మీకు చాలా గౌరవం లభించనున్నది. సన్యాసులకు మరియు రాజులకు కూడా చివర్లో జ్ఞానాన్ని ఇవ్వాలి. అప్పటికి మీలో పూర్తి శక్తి వచ్చేస్తుంది.

జ్ఞానం మరియు యోగం యొక్క బలముతో మీరు సతోప్రధానంగా అవ్వాలి. నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి, అప్పుడు మీరు రూప్-బసంత్ గా అవుతారు. ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. మీరు ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో, అంతగా లోలోపల చాలా సంతోషము ఉంటుంది. తమ రాజధాని యొక్క సాక్షాత్కారము కూడా జరుగుతూ ఉంటుంది. మీరు మీ పురుషార్థాన్ని చాలా గుప్త రీతిలో చేయాలి. మార్గాన్ని తెలియజేయాలి. మీరందరూ ద్రౌపదులు. బాబా అంటారు, ఈ అత్యాచారాలను సహనం చేయవలసి ఉంటుంది, బాబా కోసము. సత్యయుగంలో ఎంత పవిత్రత ఉంటుంది. దానిని 100 శాతము నిర్వికారీ ప్రపంచము అని అంటారు. ఇప్పుడిది 100 శాతము వికారీ ప్రపంచము. ఇప్పుడు మనం శివబాబా మెడలో హారంగా అయ్యేందుకు ఆత్మిక యోగం యొక్క రేస్ చేస్తున్నామని మీ బుద్ధిలో ఉంది. తర్వాత మనం విష్ణు మెడలో హారంగా అవుతాము. మీ మొట్టమొదటి వంశావళి – బ్రాహ్మణులది. తర్వాత మీరు దేవతలుగా, క్షత్రియులుగా అవుతారు. దిగే కళలో మీకు మొత్తం కల్పము పడుతుంది మరియు ఎక్కే కళలో క్షణము పడుతుంది. ఇప్పుడు మీది ఎక్కే కళ. కేవలం బాబాను స్మృతి చేయాలి, ఇది అంతిమ జన్మ. పడిపోవడానికి మీకు 84 జన్మలు పడతాయి. ఈ జన్మలో మీరు పైకి ఎక్కుతూ వెళ్తారు. బాబా క్షణంలో జీవన్ముక్తిని ఇస్తారు. ఆ సంతోషం ఉండాలి. ఆ జ్ఞానం ద్వారా మనం ఎలా తయారవుతాము, దీని ద్వారా మనం ఎలా తయారవుతాము అన్న భేదాన్ని చూడడము జరుగుతుంది. ఇది కూడా చదవాలి, అది కూడా చదవాలి. బాబా అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ భవిష్యత్తు కోసం పురుషార్థము చేయాలి. ఆసురీ మరియు దైవీ కులమువారు, ఇరువురితోనూ సంబంధాలను నిర్వర్తించాలి. బాబా ఒక్కొక్కరి లెక్కను తీసుకుంటారు. తర్వాత దానికి – ఈ విషయంలో ఇలా నడుచుకోండి అని అటువంటి యుక్తిని తెలియజేస్తారు. ఎవరైనా కోపగించినా కానీ మీరు చాలా మధురంగా ఉండాలి. ఎవరైనా నిందించినా కానీ చిరునవ్వు నవ్వుతూ ఉండాలి.

అచ్ఛా – మీరు నిందిస్తారు, మేము మీపై పుష్పాలను కురిపిస్తాము. అప్పుడు ఒక్కసారిగా శాంతిగా అయిపోతారు. ఒక్క నిమిషంలో శీతలమైపోతారు. బాబా యుక్తులను తెలియజేసేవారు. చాలా యుక్తులను తెలియజేస్తారు. పతితులను పావనముగా చేస్తారు కావున వారి వద్ద తప్పకుండా యుక్తి ఉంటుంది కదా. శ్రీమతము తీసుకోవాలి. శ్రీమతము ద్వారా శ్రేష్ఠంగా తయారయ్యేందుకే వచ్చారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎటువంటి ఫస్ట్ క్లాస్ గా మధురంగా మరియు రాయల్ గా అవ్వాలి అంటే తండ్రి పేరు ప్రఖ్యాతి చెందాలి. ఎవరైనా కోపగించుకున్నా, నిందించినా కానీ చిరునవ్వు నవ్వుతూ ఉండాలి.

2. శ్రీమతముపై పూర్తి-పూర్తి ట్రస్టీగా అవ్వాలి. ఎటువంటి తప్పుడు వ్యాపారము చేయకూడదు. పూర్తి-పూర్తిగా బలిహారమవ్వాలి.

వరదానము:-

ఏ ధర్మం యొక్క ఆత్మలను కలిసినా లేక చూసినా ఈ స్మృతి ఉండాలి – ఈ ఆత్మలందరూ మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క వంశావళి. బ్రాహ్మణాత్మలమైన మేము పూర్వజులము. పూర్వజులు అందరికీ పాలన చేస్తారు. మీ అలౌకిక పాలనా స్వరూపము ఏమిటంటే – తండ్రి ద్వారా ప్రాప్తించిన సర్వ శక్తులు ఇతర ఆత్మలలో నింపడము. ఏ ఆత్మకు ఏ శక్తి అవసరమో, వారిని ఆ శక్తి ద్వారా పాలన చేయండి. దీని కోసం తమ వృత్తి చాలా శుద్ధంగా ఉండాలి మరియు మనసా అనేది శక్తి సంపన్నంగా ఉండాలి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Kannada Murli Audio August 2022

Listen Brahma Kumaris Kannada Murli In Mp3

TODAY ➤ Download Audio of

19/05/2024

Baba Murli Page footer vector

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top