05 June 2021 TELUGU Murli Today – Brahma Kumari

4 June 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ఒక్క తండ్రి పట్ల పూర్తి ప్రీతి పెట్టుకోండి, మీకు ఏ దేహధారి పట్ల ప్రీతి ఉండకూడదు”

ప్రశ్న: -

ఎవరైతే మన దైవీ సంప్రదాయానికి చెందినవారుంటారో, వారి ఎదురుగా ఏ మాటలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి?

జవాబు:-

తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని మరియు దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుందని మీరు వారికి తెలియజేసినప్పుడు, ఆ మాటలు వారి ఎదురుగా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. మేము దేవతలుగా అవ్వాలి కనుక మా ఆహార-పానీయాలు శుద్ధంగా ఉండాలి అని వారి బుద్ధిలోకి వస్తుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు….. (భోలేనాథ్ సే నిరాలా…..)

ఓంశాంతి. భోళానాథుని పిల్లలు వింటున్నారు. ఎవరి నుండి వింటున్నారు, భోళానాథుని నుండి. భోళానాథుడు అని శివుడినే అంటారు. వారి పేరే శివ. భోళానాథుని పిల్లలు అనగా శివుని పిల్లలు. ఆత్మలు ఈ చెవుల ద్వారా వింటున్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అయ్యారు. పిల్లలు టేప్ ద్వారా కూడా మురళీ వింటారు. అప్పుడు, మాకు శివబాబా తమ పరిచయాన్ని ఈ విధంగా ఇస్తున్నారని అర్థం చేసుకుంటారు – నేను ఆత్మలందరికీ తండ్రిని, వారిని మీరు పరమపిత పరమ ఆత్మ అనగా పరమాత్మ అని అంటారు. వారిని సదా ఫాదర్ అనే అంటారు. వారు ఫాదర్ అని ఎవరంటారు? ఆత్మ అంటుంది. ఆత్మకు ఇప్పుడు జ్ఞానం లభించింది, ఇతర మనుష్యమాత్రులెవరికీ ఈ జ్ఞానం లేదు. ఆత్మలైన మనకు ఇద్దరు తండ్రులున్నారు. ఒకరు సాకార తండ్రి, మరొకరు నిరాకార తండ్రి. వారు పరమపిత, ఈ వివరణ ఇతరులెవరూ ఇవ్వలేరు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇలా అడగలేరు, తండ్రియే అడుగుతారు – మీరు పరమపిత పరమాత్మ, గాడ్ ఫాదర్ అని అంటారు కదా, అలా ఎవరి గురించి అంటారు, లౌకిక తండ్రి గురించా లేక పారలౌకిక తండ్రి గురించా, లౌకిక తండ్రిని గాడ్ ఫాదర్ అని అంటారా? హిందీలో పరమపిత అనే పదం కూడా ఉంది. వారు ఒక్కరే, నిరాకారుడు. ఈశ్వర, ప్రభు లేక భగవంతుడు అని అనడంతో వారు తండ్రి అనేది నిరూపణ అవ్వదు. గాడ్ ఫాదర్ అనే పదం బాగుంది. వారు మా గాడ్ ఫాదర్ అని ఆత్మ అంది. లౌకిక ఫాదర్ అయితే కేవలం శరీరానికి తండ్రి. మీకు ఎంతమంది ఫాదర్స్, అని మిమ్మల్నందరినీ అడగడం జరుగుతుంది. ఒకరు లౌకిక ఫాదర్, మరొకరు పారలౌకిక ఫాదర్. ఇరువురిలో ఎవరు పెద్ద? తప్పకుండా పారలౌకిక ఫాదర్ అని అంటారు. పతితులందరినీ పావనంగా చేసే పారలౌకిక తండ్రి అని వారికి మహిమ ఉంది. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ఎవరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. మీకు పారలౌకిక తండ్రి పట్ల ప్రీతి ఉందని తండ్రి అర్థం చేయించారు. ఇతరులకు వినాశకాలే విపరీత బుద్ధి ఉంది. ఇప్పుడిది వినాశన సమయము. అదే మహాభారత యుద్ధం ఇప్పుడు జరగనున్నది. ఒకరికొకరు విమానాలు, ట్యాంకులు మొదలైనవాటిని సప్లై చేసుకుంటున్నారు, అందరికీ ఇస్తూ ఉంటారు. ధనానికి రిటర్న్ లో ఎవరికి, ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటారు. అప్పుగా కూడా తీసుకుంటారు. ఇలా విమానాలు, తుపాకులు మొదలైనవి కొంటూ ఉంటారు. ఈ వస్తువులన్నీ చాలా ఖరీదైనవిగా ఉంటాయి. విదేశీయులు తయారుచేస్తారు, అవి మళ్ళీ అమ్ముతూ ఉంటారు. భారతవాసులు విమానాలు మొదలైనవాటిని అమ్మరు. ఈ వస్తువులన్నీ విదేశాల నుండి వచ్చాయి. ఇప్పుడు ఏ వస్తువులనైతే కొంటారో, వాటిని తప్పకుండా ఉపయోగిస్తారు, పారేయడానికి కొనరు. వారు వినాశకాలే విపరీత బుద్ధి గల యాదవ సంప్రదాయానికి చెందినవారు, వారు యూరోప్ లో ఉంటారు. అందులో అందరూ వచ్చేస్తారు. భారత్ అయితే అవినాశీ ఖండము ఎందుకంటే ఇది అవినాశీ తండ్రి యొక్క జన్మ స్థలం. పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నప్పుడే తండ్రి వస్తారు మరియు ఎప్పటికీ సమాప్తం కానటువంటి స్థానంలో జన్మ తీసుకుంటారు. తండ్రి వచ్చారు కావుననే శివజయంతిని జరుపుకుంటారు కానీ శివబాబా ఎప్పుడు వస్తారు అనేది వారికి తెలియదు. వారు రావడం కూడా వినాశనం కోసం ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే వస్తారు.

ఇప్పుడు తండ్రి అంటారు – వారు యూరోప్ వాసులు, యాదవ సంప్రదాయానికి చెందినవారు, వారు సత్యయుగంలో ఉండరు. అక్కడ బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైనవారు ఉండరు. ఇప్పుడు తండ్రి అంటారు – వారిది వినాశకాలే విపరీత బుద్ధి ఎందుకంటే తండ్రి అయిన పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. మీది వినాశకాలే ప్రీతి బుద్ధి. మీరు తండ్రిని తెలుసుకున్నారు. మేము 84 జన్మలు తీసుకున్నామని మీరు అర్థం చేసుకున్నారు. 84 జన్మలలో పాపాత్ములుగా, తమోప్రధానంగా అయిపోయారు. భారతవాసులే 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, అందరూ తిరిగి వెళ్ళాలి. మీకు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది అందరి వినాశన సమయము అనగా మృత్యు సమయము. ఆ యాదవులకు కూడా ఈశ్వరుని పట్ల ప్రీతి లేదు, అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. దేహధారి మనుష్యులెవరి పట్ల ప్రీతి పెట్టుకోకూడదు. వారు రచన, వారి నుండి వారసత్వం లభించదు. సోదరునికి సోదరుని నుండి వారసత్వం లభించదు. ఈ విషయాన్ని మంచిరీతిగా అర్థం చేయించారు.

వారిది వినాశకాలే విపరీత బుద్ధి మరియు మీది ప్రీతి బుద్ధి అని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇందులో కూడా ఎవరైతే తీవ్రమైన ప్రీతిగలవారున్నారో, వారు తండ్రి పట్ల పూర్తి ప్రీతి పెట్టుకుంటారు. మనం బాబా నుండి 21 జన్మలకు స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాము. ఆ బాబాయే సత్యాన్ని తెలియజేస్తారు. ఇంకెవరి పట్ల ప్రీతి పెట్టుకోకూడదు. కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు, ఇక కొత్త ఇంటి పట్ల ప్రీతి ఏర్పడుతుంది. పాత ఇల్లు పడిపోనున్నదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. కనుక మనం కూడా పాత ప్రపంచం నుండి మనసు తెంచుకుంటూ వెళ్తాము. రోజు-రోజుకు వాయుమండలం పాడవుతూ ఉంటుందని తండ్రి అర్థం చేయిస్తారు. ఎన్ని హంగామాలు జరుగుతాయో మీరు చూస్తారు, అప్పుడిక ఇది సమాప్తమైపోతుందని అర్థం చేసుకుంటారు. మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. కనుక కొత్త ప్రపంచాన్ని గుర్తు చేయాల్సి ఉంటుంది. అనంతమైన తండ్రిని మరియు వారసత్వాన్ని గుర్తు చేయాలి. ఇతరులెవరినైనా గుర్తు చేయడం వలన ఏమీ లభించదు. మనుష్యులు భక్తి మార్గంలో ఎంతగా గుర్తు చేస్తారు. తల్లిదండ్రులను, మిత్ర-సంబంధీకులను గుర్తు చేసుకుంటూ కూడా, మళ్ళీ దేవీదేవతలను ఎంతగా గుర్తు చేస్తారు. నీటిలో స్నానం చేస్తారు, దానిని పతితపావని అని అంటారు. బాణం వేయగానే గంగ వెలువడినట్లుగా చూపిస్తారు. మరణించేటప్పుడు గంగా జలాన్ని నోటిలో వేస్తారు. గంగా జలం కొద్దిగా లభించినా కూడా ముక్తిని పొందుతారని భావిస్తారు. ఇక్కడ జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉన్నాయని తండ్రి అంటారు. మీరు కొద్దిగా జ్ఞానం విన్నా దాని ఫలం లభిస్తుంది. ఇది జ్ఞానం వినడానికి సంబంధించిన విషయము. అమృతం అనగా తాగేటువంటి వస్తువు కాదు, ఇది నాలెడ్జ్. భోగ్ రోజున అమృతం తాగిస్తారని భావించకండి. అది తీపి నీరు. ఇకపోతే ఇది జ్ఞానానికి సంబంధించిన విషయము. జ్ఞానమనగా తండ్రిని మరియు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడము మరియు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, 84 జన్మలు ఎవరు తీసుకుంటారు అనేది అర్థం చేసుకోవడము. అందరూ 84 జన్మలు తీసుకోలేరు. మొట్టమొదట భారతవాసులే వస్తారు. వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే దేవతలుగా ఉండేవారో, వారే 84 జన్మలను అనుభవించి పతితులుగా అయిపోతారు. తండ్రి వచ్చి మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు. మనుష్యులు దేహాభిమానంలోకి వచ్చి 5 వికారాలలో చిక్కుకుపోతారు. ఇప్పుడిది రావణ రాజ్యము. సత్యయుగం దైవీ రాజ్యముగా ఉండేది. శివబాబాయే స్వర్గపురిని రచిస్తారు. అక్కడ సూర్యవంశీ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఇప్పుడు స్థాపన జరుగుతుందని మీకు తెలుసు. మీది వినాశకాలే ప్రీతి బుద్ధి, అందుకే విజయులుగా అవుతారు. మీరు విశ్వమంతటిపై విజయం పొందుతారు. ఇది మంచి రీతిగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కలియుగంలో ఉన్న భారతవాసులైన మనం పరివర్తన చెంది స్వర్గంలోకి వెళ్తాము. పాత ప్రపంచాన్ని వదిలేయాలి. ఇవి వికారీ సంబంధాలు, వీటిని బంధనాలని అంటారు. మీరు వికారీ బంధనాల నుండి బయటకొచ్చి, నిర్వికారీ సంబంధాలలోకి వెళ్తారు, ఇక తర్వాత జన్మలో మీరు వికారీ బంధనంలోకి రారు. అక్కడ నిర్వికారీ సంబంధాలుంటాయి, ఈ సమయంలో ఆసురీ బంధనాలున్నాయి. నాకు శివబాబా పట్ల ప్రీతి ఉందని ఆత్మ అంటుంది. బ్రాహ్మణులైన మీకు ప్రీతి ఉంది ఎందుకంటే మీరు యథార్థ రీతిగా తెలుసుకున్నారు. మీరు తండ్రిని, సృష్టి చక్రాన్ని తెలుసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఎంతగా ఇతరులకు అర్థం చేయిస్తారో, అంతగా అనేకుల కళ్యాణం చేస్తారు. ఎవరైతే ఎక్కువ అర్థం చేసుకుంటారో, వారే తెలివైనవారు, వారే ఉన్నత పదవిని కూడా పొందుతారు. సేవ తక్కువగా చేస్తే, పదవి కూడా తక్కువదే పొందుతారు. ఈ ప్రపంచమంతా పతితంగా ఉంది. ప్రతి ఒక్కరికీ పతితం నుండి పావనంగా అయ్యే మార్గాన్ని తెలియజేయాలి, ఇంకే ఉపాయం లేదు. స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. దైవీ సంప్రదాయానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారిలో ఈ మాటలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి, ఇవి సరైన విషయాలని అర్థం చేసుకుంటారు. మనం తప్పకుండా దేవీ దేవతలుగా అవుతాము. మన భోజనం కూడా శుద్ధంగా ఉండాలి. దైవీ గుణాలు కూడా ఇక్కడే ధారణ చేయాలి, సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు అలా తయారవుతున్నారు. ఈ లక్ష్మీ నారాయణులు దేవతలు, వీరికి భోగ్ పెట్టేటప్పుడు సిగరెట్ మొదలైనవాటిని భోగ్ లా పెడతారా. సిగరెట్ తాగేవారు ఉన్నత పదవిని పొందలేరు. ఇది దైవీ పదార్థమేమీ కాదు. సిగరెట్ తాగినా లేదా ఉల్లి, వెల్లుల్లి మొదలైనవి తిన్నా ఇంకా దిగజారిపోతారు. ఇవి మానేస్తే ఆరోగ్యం పాడైపోతుందని అంటారు. శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఈ అలవాటులన్నింటినీ వదిలేస్తే మీ సద్గతి జరుగుతుంది. సిగరెట్ తాగే అలవాటు అయితే చాలా మందికి ఉంటుంది. దేవతలకెప్పుడూ వీటిని భోగ్ లా పెట్టరని వివరణ ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు దేవతల వలె ఇక్కడే తయారవ్వాలి. మీరు ఛీ-ఛీ పదార్థాలు తింటూ ఉన్నట్లయితే, ఆ దుర్వాసన వస్తూ ఉంటుంది. సిగరెట్ లేదా మద్యం తాగే వారి నుండి దూరం నుండే దుర్వాసన వస్తుంది. కనుక పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి, వైష్ణవులుగా అవ్వాలి. ఎలాగైతే విష్ణువుకు సంతానం ఉంటారో, అలాగే మీరు కూడా విష్ణు సంతానంగా అనగా దైవీ సంతానంగా అవుతారు. ఇక్కడ మీరు ఈశ్వరీయ సంతానము. ఇది మీ సర్వోత్తమ జన్మ. దేవతల కన్నా ఉత్తములు మీరు. మీరు ఇతరులను కూడా ఉత్తములుగా చేసేటువంటివారు. ఇది అనంతమైన తండ్రి యొక్క మిషనరీ. క్రిస్టియన్ల మిషనరీ ఉంటుంది కదా. అనేకులను తమ క్రిస్టియన్ ధర్మంలోకి కన్వర్ట్ చేస్తారు. ఇది ఈశ్వరీయ మిషనరీ. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణ ధర్మంలోకి కన్వర్ట్ అయి, తర్వాత దేవతా ధర్మంలోకి కన్వర్ట్ అయిపోతారు. మేము శూద్రుల నుండి ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. మీరు జీవిస్తూ మరణించారు, తర్వాత వెళ్ళి దేవతలుగా అవుతారు, గర్భం నుండి జన్మ లభిస్తుంది.

ఇక్కడ తండ్రి మిమ్మల్ని ధర్మాత్ములుగా చేసేందుకు దత్తత తీసుకున్నారు. తండ్రి మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. పిల్లలకు తండ్రి నేర్పిస్తారు, మీరు బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు. ఆ మనుష్యులు (దేవతలు) ఎంత ఉన్నతమైనవారు, వారిలో అన్ని దైవీ గుణాలున్నాయి. ఆత్మలైన మీరు పవిత్రంగా అయినప్పుడు, శరీరం కూడా పవిత్రమైనది కావాలి. పాత శరీరం సమాప్తమవ్వనున్నది, తర్వాత మీకు సతోప్రధానమైన కొత్త శరీరం కావాలి. సత్యయుగంలో 5 తత్వాలు కూడా సతోప్రధానంగా అయిపోతాయి. తండ్రి అంటారు – మీరు శూద్ర వర్ణంలో ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వర్ణానికి చెందినవారిగా అయ్యారు, తర్వాత దైవీ వర్ణంలోకి వస్తారు. 84 జన్మలు తీసుకుంటారు కదా. బ్రాహ్మణ వర్ణాన్ని మాయం చేసేసారు. ఇప్పుడు తండ్రి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి, దేవతలుగా చేస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. పిల్లి మొగ్గలాట ఉంటుంది కదా. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు, తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా….. మళ్ళీ బ్రాహ్మణులుగా అవుతారు. దీనిని చక్రమని అంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. ఈ నాలెడ్జ్ ఇప్పుడు ఉంది, తర్వాత ప్రారబ్ధం లభిస్తుంది. ఈ సమయంలో చేసే నంబరువారు పురుషార్థానుసారంగా, అక్కడ 21 జన్మలు సదా సుఖమయంగా ఉంటారు. కొందరు రాజ్య వంశంలోకి, కొందరు ప్రజలలోకి వెళ్తారు. రాజ్య వంశంలో చాలా సుఖముంటుంది, తర్వాత కళలు తగ్గిపోతాయి. మీకు 84 జన్మల జ్ఞానం లభించింది, స్మృతి కలిగింది. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు – మధురాతి మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. కొందరు 84 జన్మలు, 80, 50 లేదా 60 జన్మలు కూడా తీసుకున్నారు. అందరికన్నా ఎక్కువగా భారతవాసులైన మీరు సుఖాన్ని చూస్తారు. ఈ డ్రామాలో మీ పేరు ప్రసిద్ధి చెందింది. మీరు దేవతల కన్నా ఉన్నతమైనవారు. మేమే పూజ్యులుగా అవుతామని మీకు తెలుసు. సత్యయుగంలో మనం ఎవరినీ పూజించము, అలాగే మనల్ని ఎవరూ పూజించరు. అక్కడ మనం పూజ్యులుగానే ఉంటాము, తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. మనం పూజ్యుల నుండి పూజారులుగా అయి తల వంచి నమస్కరిస్తూ ఉంటాము. ద్వాపరంలో మనం పూజారులుగా అవ్వడం ప్రారంభిస్తాము. అంతిమానికి అందరూ వ్యభిచారులుగా అయిపోతారు. ఈ శరీరం 5 తత్వాలతో తయారుచేయబడింది, ఎవరైనా దీనిని పూజిస్తే, దానిని భూత పూజ అని అంటారు. ప్రతి ఒక్కరిలో 5 భూతాలున్నాయి. దేహాభిమాన భూతం మొదటిది, తర్వాత కామ-క్రోధాల భూతాలు. భూత సంప్రదాయం అనండి లేదా ఆసురీ సంప్రదాయం అనండి, విషయం ఒక్కటే. తండ్రి వచ్చి మళ్ళీ దైవీ సంప్రదాయాన్ని తయారుచేస్తారు. తండ్రి భూతాల నుండి విడిపించడానికి వస్తారు మరియు తనతో యోగం జోడింపజేసి దేవతలుగా చేస్తారు. గురునానక్ కూడా, పరమపిత పరమాత్మ మనుష్యులను దేవతలుగా చేసారని మహిమ పాడారు. వారే పతితులను పావనంగా తయారుచేసేవారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు, ఛీ-ఛీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ వదిలేయాలి. శూద్రులను బ్రాహ్మణ ధర్మంలోకి కన్వర్ట్ చేసి దేవతలుగా చేసేందుకు, ఈశ్వరీయ మిషన్ యొక్క కార్యంలో సహయోగులుగా అవ్వాలి. మద్యం, సిగరెట్ లేదా అశుద్ధమైన అలవాట్లు ఏమున్నా సరే, వాటిని తొలగించి వేయాలి.

2. ఈ వినాశకాల సమయంలో ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. పాత ఇల్లు పడిపోనున్నది కనుక దీని నుండి మనసు తొలగించి కొత్తదానితో జోడించాలి.

వరదానము:-

ప్రవృత్తిలో ముందుగా వృత్తి ద్వారానే పవిత్రంగా లేక అపవిత్రంగా అవుతారు. ఒకవేళ వృత్తిని సదా ఒక్క తండ్రితోనే జోడిస్తే, ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అనేటువంటి ఉన్నతమైన వృత్తి ఉంటే, ప్రవృత్తి ప్రగతికి సాధనంగా అయిపోతుంది. వృత్తి ఉన్నతంగా మరియు శ్రేష్ఠంగా ఉన్నట్లయితే, ఇక చంచలమవ్వదు. ఇటువంటి శ్రేష్ఠ వృత్తి ద్వారా ప్రగతిని పొందుతూ గతి-సద్గతులను సహజంగానే పొందుతారు. ఇక తర్వాత ఫిర్యాదులన్నీ సమాప్తమైపోతాయి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top