03 June 2021 TELUGU Murli Today – Brahma Kumari

2 June 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - శివబాబా మీరు అర్పించే పుష్పాలు మొదలైనవాటిని స్వీకరించలేరు ఎందుకంటే వారు పూజ్యులుగా మరియు పూజారిగా అవ్వరు, మీరు కూడా సంగమయుగంలో పుష్పాల హారాలను ధరించకూడదు”

ప్రశ్న: -

భవిష్య రాజ్య సింహాసనాధికారులుగా ఎవరు అవుతారు?

జవాబు:-

ఎవరైతే ఇప్పుడు తల్లిదండ్రుల హృదయసింహాసనాన్ని జయిస్తారో, వారే భవిష్య సింహాసనాధికారులుగా అవుతారు. అద్భుతమేమిటంటే, పిల్లలు తల్లిదండ్రులపై కూడా విజయాన్ని ప్రాప్తించుకుంటారు, శ్రమించి తల్లిదండ్రుల కన్నా ముందుకు వెళ్తారు

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి….. (చోడ్ భీ దే ఆకాష్ సింహాసన్…..)

ఓంశాంతి. మధురాతి మధురమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు పాట విన్నారు. ఈ పాటతో సర్వవ్యాపి జ్ఞానం తొలగిపోతుంది. ఇప్పుడు భారత్ చాలా దుఃఖంగా ఉంది, అందుకే స్మృతి చేస్తారు. ఈ పాటలన్నీ డ్రామానుసారంగా తయారయ్యాయి. ఈ విషయం ప్రపంచంలోని వారికి తెలియదు. తండ్రి, పతితులను పావనంగా చేయడానికి మరియు దుఃఖితులను దుఃఖం నుండి ముక్తులుగా చేసి సుఖాన్నిచ్చేందుకు వస్తారు. ఆ తండ్రియే వచ్చి ఉన్నారని పిల్లలు తెలుసుకున్నారు. పిల్లలకు వారి పరిచయం లభించింది. వారు స్వయంగా కూర్చుని తెలియజేస్తారు – నేను సాధారణ తనువులో ప్రవేశించి మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తాను. సృష్టి ఒక్కటే, కేవలం కొత్తగా మరియు పాతగా అవుతుంది. ఏ విధంగా శరీరం బాల్యంలో కొత్తగా ఉంటుంది, తర్వాత పాతగా అవుతుంది. కొత్త శరీరం, పాత శరీరం అని రెండు శరీరాలుగా చెప్పరు. శరీరం ఒక్కటే, కేవలం కొత్త నుండి పాతదిగా అవుతుంది. అలాగే ప్రపంచం కూడా ఒక్కటే. కొత్త నుండి ఇప్పుడు పాతదిగా అవుతుంది. కొత్తగా ఎప్పుడు ఉండేది? ఇది ఎవరూ చెప్పలేరు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు – పిల్లలూ, కొత్త ప్రపంచమున్నప్పుడు భారత్ కొత్తగా ఉండేది. దానిని సత్యయుగం అని అనేవారు. అదే భారత్ ఇప్పుడు పాతగా అయ్యింది. దీనిని పురాతన, పాత ప్రపంచమని అంటారు. కొత్త ప్రపంచం నుండి మళ్ళీ పాతగా అయ్యింది, మళ్ళీ అది కొత్తగా తప్పకుండా అవ్వాలి. పిల్లలకు కొత్త ప్రపంచం యొక్క సాక్షాత్కారం జరిగింది. అచ్ఛా, ఆ కొత్త ప్రపంచానికి యజమానులుగా ఎవరుండేవారు. తప్పకుండా ఈ లక్ష్మీనారాయణులే ఉండేవారు. ఆది సనాతన దేవీ దేవతలు ఆ ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. ఈ విషయం తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నిరంతరం ఈ విషయాన్నే గుర్తు చేయండి అని తండ్రి అంటారు. తండ్రి పరంధామం నుండి మనల్ని చదివించడానికి, రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చి ఉన్నారు. మహిమంతా ఆ ఒక్కరిదే, వీరికి (బ్రహ్మా) ఏ మహిమ లేదు. ఈ సమయంలో అందరూ తుచ్ఛ బుద్ధి కలవారిగా ఉన్నారు, ఏమీ అర్థం చేసుకోరు. అందుకే నేను వస్తాను, కావుననే ఈ పాటలు కూడా తయారుచేయబడ్డాయి. ఈ పాట ద్వారా సర్వవ్యాపి జ్ఞానం తొలగిపోతుంది. ప్రతి ఒక్కరికీ తమ-తమ పాత్ర ఉంటుంది. మీరు దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి మరియు కర్మేంద్రియాల ద్వారా శిక్షణలను ధారణ చేయండి అని తండ్రి పదే-పదే చెప్తారు. ఈ బాబాను నడుస్తూ-తిరుగుతూ ఉండగా చూసినా కానీ శివబాబానే స్మృతి చేయండి. శివబాబాయే అంతా చేస్తారు, బ్రహ్మా లేరు అని అనుకోండి. ఈ కనులకు వీరి రూపం కనిపిస్తుంది. మీ బుద్ధి శివబాబా వైపుకు వెళ్ళాలి. శివబాబా లేకపోతే వీరి ఆత్మ, వీరి శరీరం దేనికీ పనికి రాదు. వీరిలో శివబాబా ఉన్నారని ఎల్లప్పుడూ భావించండి. వారు వీరి ద్వారా చదివిస్తారు. వీరు (బ్రహ్మా) మీకు టీచరు కాదు. సుప్రీమ్ టీచరు వారు (శివబాబా). వారిని స్మృతి చేయాలి. ఎప్పుడూ కూడా దేహాన్ని స్మృతి చేయకూడదు. బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. మీరు మళ్ళీ వచ్చి జ్ఞాన-యోగాలను నేర్పించండి అని పిల్లలు స్మృతి చేస్తారు. పరమపిత పరమాత్మ తప్ప ఎవరూ రాజయోగాన్ని నేర్పించలేరు. వారే కూర్చొని గీతా జ్ఞానాన్ని వినిపిస్తారని పిల్లల బుద్ధిలో ఉంది, తర్వాత ఈ నాలెడ్జ్ ప్రాయః లోపమైపోతుంది. అక్కడ (సత్యయుగంలో) అవసరమే లేదు, అప్పటికి రాజధాని స్థాపన అయిపోతుంది, సద్గతి జరిగిపోతుంది. దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్ళేందుకు జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. మిగిలినవన్నీ భక్తి మార్గపు విషయాలు. మనుష్యులు జప-తపాదులు, దాన-పుణ్యాలు మొదలైనవి ఏవైతే చేస్తారో, అవన్నీ భక్తి మార్గపు విషయాలు, వీటి ద్వారా నన్ను ఎవరూ కలుసుకోలేరు. ఆత్మ రెక్కలు తెగిపోయి ఉన్నాయి. రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. రాతి వలె ఉన్నవారిని మళ్ళీ పారసంగా చేయడానికి నేను రావాల్సి ఉంటుంది. తండ్రి అంటారు – ఇప్పుడు ఎంతమంది మనుష్యులున్నారు. ఆవగింజల వలె ప్రపంచమంతా నిండి ఉన్నారు. ఇప్పుడు అందరూ సమాప్తమవ్వనున్నారు. సత్యయుగంలోనైతే ఇంతమంది మనుష్యులుండరు. కొత్త ప్రపంచంలో వైభవాలు ఎక్కువగా మరియు మనుష్యులు తక్కువగా ఉంటారు. ఇక్కడైతే ఎంతమంది మనుష్యులున్నారంటే తినడానికి కూడా లభించదు. ఇది పాత బంజరు భూమిలా ఉంది, మళ్ళీ కొత్తగా అయిపోతుంది. అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి. పేరే ఎంత మధురంగా ఉంది – హెవెన్, బహిష్త్, దేవతల కొత్త ప్రపంచము అని. పాతదానిని పడగొట్టి, కొత్తదానిలో కూర్చోవాలని మనసు కలుగుతుంది కదా. ఇప్పుడిది కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్ళే విషయము. ఇందులో పాత శరీరానికి ఎటువంటి విలువ లేదు. శివబాబాకు శరీరమంటూ ఏదీ లేదు.

బాబాకు హారం వేస్తామని పిల్లలంటారు. కానీ వీరికి హారం వేసినట్లయితే, మీ బుద్ధి యోగం వీరి వైపుకు వెళ్ళిపోతుంది. హారం అవసరం లేదని శివబాబా అంటారు. మీరే పూజ్యులుగా అవుతారు, పూజారులుగా కూడా మీరే అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. కావున మీ చిత్రాలను మీరే పూజించడం మొదలుపెడతారు. బాబా అంటారు – నేను పూజ్యునిగా అవ్వను, నాకు పుష్పాలు మొదలైనవాటిని అర్పించే అవసరం కూడా లేదు. నేను వీటిని ఎందుకు ధరించాలి, అందుకే ఎప్పుడూ పుష్పాల మాలలు మొదలైనవాటిని తీసుకోరు. మీరు పూజ్యులుగా అవుతారు, తర్వాత ఎన్ని కావాలనుకుంటే అన్ని పుష్పాలు ధరించండి. నేను పిల్లలైన మీకు అత్యంత ప్రియమైన, విధేయుడైన ఫాదర్ ను కూడా, టీచరును కూడా, సేవకుడిని కూడా. గొప్ప-గొప్ప రాయల్ వ్యక్తులు కింద సంతకం చేసేటప్పుడు, మింటో, కర్జన్….. అని రాస్తారు. తాము లార్డ్ అని ఎప్పుడూ రాసుకోరు. ఇక్కడైతే శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ ఫలానా….. అని రాసుకుంటారు. నేరుగా శ్రీ అనే పదాన్ని రాసుకుంటారు. కావున తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు – ఇప్పుడు ఈ శరీరాన్ని గుర్తు చేయకండి, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచంలో ఆత్మ మరియు శరీరం, రెండూ పతితంగా ఉన్నాయి. బంగారం 9 క్యారట్లది ఉంటే, ఆభరణం కూడా 9 క్యారట్లదే తయారవుతుంది. బంగారంలోనే మాలిన్యం చేరుకుంటుంది. ఆత్మను ఎప్పుడూ నిర్లేపి అని అనుకోకూడదు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు మాత్రమే ఉంది. మీరు అర్ధకల్పం 21 జన్మల కోసం ప్రారబ్ధం పొందుతారు కనుక ఎంత పురుషార్థం చేయాలి. కానీ పిల్లలు పదే-పదే మర్చిపోతారు. శివబాబా, బ్రహ్మా ద్వారా మనకు శిక్షణనిస్తున్నారు. బ్రహ్మా ఆత్మ కూడా వారిని స్మృతి చేస్తుంది. బ్రహ్మా, విష్ణు, శంకరులు సూక్ష్మవతనవాసులు. తండ్రి, ముందు సూక్ష్మ సృష్టిని రచిస్తారు, నిర్వాణధామం ఉన్నతాతి ఉన్నతమైన ధామము. ఆత్మల నిర్వాణధామం అన్నింటికన్నా ఉన్నతమైనది. భక్తులందరూ ఒక్క భగవంతుడినే స్మృతి చేస్తారు. కానీ తమోప్రధానంగా అయిపోయారు కనుక తండ్రిని మర్చిపోయి, రాళ్ళు-రప్పలు అన్నింటినీ పూజిస్తూ ఉంటారు. ఏది జరుగుతున్నా సరే, అది డ్రామాలో షూటింగ్ అవుతూ ఉందని మనకు తెలుసు. డ్రామాలో ఏ షూటింగ్ అయితే ఒక్కసారి జరుగుతుందో, ఉదాహరణకు, పక్షి మొదలైనది ఏదైనా మధ్యలో ఎగిరిందనుకోండి, అది పదే-పదే రిపీట్ అవుతూ ఉంటుంది. గాలిపటం ఎగురుతున్నట్లు షూటింగ్ అయితే, అది పదే-పదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా డ్రామాలోని ప్రతి సెకండు రిపీట్ అవుతూ ఉంటుంది, షూటింగ్ అవుతూ ఉంటుంది. ఇది తయారై తయారవుతున్న డ్రామా. మీరు పాత్రధారులు, మొత్తం డ్రామాను సాక్షీగా అయి చూస్తారు. ఒక్కొక్క సెకండు డ్రామానుసారంగా గడుస్తూ ఉంటుంది. ఆకు కదిలింది అంటే డ్రామా గడిచింది. అలాగని ప్రతి ఆకు భగవంతుని ఆజ్ఞతో కదులుతుందని కాదు. ఇదంతా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. దీనిని మంచి రీతిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు మరియు డ్రామా నాలెడ్జ్ ను ఇస్తారు. చిత్రాలు కూడా ఎంత మంచివి తయారై ఉన్నాయి. గడియారపు ముల్లు కూడా సంగమయుగాన్ని సూచిస్తుంది. ఇది కలియుగాంతము మరియు సత్యయుగం ఆది యొక్క సంగమము. ఇప్పుడు పాత ప్రపంచంలో అనేక ధర్మాలున్నాయి. కొత్త ప్రపంచంలో మళ్ళీ ఇవి ఉండవు. పిల్లలైన మీరు సదా, మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారని, మేము ఈశ్వరీయ విద్యార్థులమని భావించండి. భగవానువాచ – నేను మిమ్మల్ని రాజులకే రాజుగా చేస్తాను. రాజులు కూడా లక్ష్మీనారాయణులను పూజిస్తారు. వారిని పూజ్యులుగా చేసేవాడిని నేను. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారిప్పుడు పూజారులుగా అయిపోయారు. మేమే పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ మేమే పూజారులుగా అయ్యామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబా అయితే అలా అవ్వరు. బాబా అంటారు – నేను పూజారిగా అవ్వను, పూజ్యునిగానూ అవ్వను, అందుకే నేను హారాన్ని వేసుకోను, అలాగే ఇతరులు కూడా నాకు వేయాల్సిన అవసరం లేదు. కావున నేనెందుకు పుష్పాలను స్వీకరించాలి. మీరు కూడా స్వీకరించకూడదు. నియమానుసారంగా దేవతలకే ఆ హక్కు ఉంది ఎందుకంటే వారి ఆత్మ మరియు శరీరం పవిత్రంగా ఉన్నాయి. వారే పుష్పాలకు హక్కుదారులు. అక్కడ స్వర్గంలోనైతే సుగంధ భరితమైన పుష్పాలుంటాయి. పుష్పాలనేవి సుగంధం కోసమే ఉంటాయి, అలాగే ధరించేందుకు కూడా ఉంటాయి. తండ్రి అంటారు – పిల్లలైన మీరిప్పుడు విష్ణు కంఠహారంగా అవుతారు. నంబరువారుగా మీరు సింహాసనంపై కూర్చోనున్నారు. కల్పక్రితం ఎవరు ఎంత పురుషార్థం చేసారో, ఇప్పుడూ చేస్తారు మరియు చేస్తూ ఉంటారు, నంబరువారుగా అయితే ఉంటారు. ఫలానా బిడ్డ చాలా సర్వీసబుల్ అని బుద్ధి చెప్తుంది. ఎలాగైతే దుకాణంలో సేఠ్ ఉంటారు, పార్టనర్ ఉంటారు, మేనేజరు ఉంటారు. వారి కింద వారికి కూడా లిఫ్ట్ (ప్రమోషన్) లభిస్తుంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. పిల్లలైన మీరు కూడా తల్లిదండ్రులపై విజయం పొందాలి. తల్లిదండ్రుల కన్నా ముందుకు ఎలా వెళ్ళగలమని మీకు ఆశ్చర్యమనిపిస్తుంది. తండ్రి అయితే శ్రమించి పిల్లలను సింహాసనాధికారులుగా చేసేందుకు యోగ్యులుగా చేస్తారు, అందుకే తండ్రి అంటారు – ఇప్పుడు నా హృదయం రూపీ సింహాసనాన్ని జయించినట్లయితే, భవిష్య సింహాసనాధికారులుగా అవుతారు. నరుని నుండి నారాయణునిగా అయ్యేంత పురుషార్థం చేయండి. ముఖ్యమైన లక్ష్యం-ఉద్దేశ్యం ఒక్కటే, ఇకపోతే రాజధాని స్థాపన అవుతూ ఉంది కనుక అందులో వెరైటీ పదవులుంటాయి.

మీరు మాయను జయించేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. పిల్లలు మొదలైనవారిని కూడా ప్రేమగా నడిపించండి కానీ ట్రస్టీగా అయి ఉండండి. భక్తి మార్గంలో – ప్రభూ, ఇదంతా మీరు ఇచ్చినదే, మీ తాకట్టును మీరే తీసుకున్నారు అని అంటారు కదా. అచ్ఛా, మరి ఏడ్చే విషయమే లేదు కానీ ఇది ఏడ్చేటువంటి ప్రపంచము. మనుష్యులు చాలా కథలను వినిపిస్తారు. మోహజీత్ రాజు కథను కూడా వినిపిస్తారు. అతనికి ఎటువంటి దుఃఖం అనుభవమవ్వలేదు. ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి, మరొకటి తీసుకున్నారు. అక్కడ ఎప్పుడూ వ్యాధులు మొదలైనవేవీ ఉండవు. 21 జన్మల కోసం సదా ఆరోగ్యవంతమైన, నిరోగీ శరీరం ఉంటుంది. పిల్లలకు అంతా సాక్షాత్కారం అవుతుంది. అక్కడి ఆచార-పద్ధతులు ఎలా ఉంటాయి, ఎలాంటి వస్త్రాలను ధరిస్తారు, స్వయంవరం మొదలైనవి ఎలా జరుగుతాయి – ఇవన్నీ పిల్లలకు సాక్షాత్కారం కలిగాయి. ఆ పాత్రంతా గతించిపోయింది. ఆ సమయంలో ఇంత జ్ఞానముండేది కాదు. ఇప్పుడు రోజు రోజుకు పిల్లలైన మీకు చాలా శక్తి వస్తూ ఉంటుంది. ఇదంతా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. అద్భుతం కదా. పరమపిత పరమాత్మకు కూడా ఎంత భారీ పాత్ర ఉంది. భక్తి మార్గంలో కూడా, పైన కూర్చొని నేను ఎంత పని చేస్తాను అనేది, స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తారు. కల్పంలో ఒక్కసారి మాత్రమే కిందకు వస్తాను. నిరాకారుని పూజారులు కూడా చాలామంది ఉంటారు కానీ నిరాకార పరమాత్మ ఎలా వచ్చి చదివిస్తారు అనే విషయాన్ని మాయం చేసేసారు. గీతలో కూడా కృష్ణుని పేరు వేసేసారు కనుక నిరాకారునితో ప్రీతియే తెగిపోయింది. ఇక్కడ పరమాత్మయే వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించారు మరియు ప్రపంచాన్ని మార్చారు. ప్రపంచం మారుతూ ఉంటుంది, యుగాలు మారుతూ ఉంటాయి. ఈ డ్రామా చక్రాన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మనుష్యులకేమీ తెలియదు. సత్యయుగపు దేవీ-దేవతల గురించి కూడా తెలియదు. కేవలం దేవీ-దేవతల గుర్తులు మాత్రం మిగిలి ఉన్నాయి. కనుక మేము శివబాబాకు చెందినవారమని, శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని సదా భావించండి అని తండ్రి అర్థం చేయిస్తారు. శివబాబా ఈ బ్రహ్మా ద్వారా సదా శిక్షణనిస్తారు. శివబాబా స్మృతిలో చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇటువంటి గాడ్ ఫాదర్ ఎవరైనా ఉంటారా. వారు ఫాదర్ కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా. చాలామంది తండ్రులు తమ పిల్లలను చదివిస్తారు కూడా, అప్పుడు వారి పిల్లలు, మా ఫాదర్ యే టీచరు అని తప్పకుండా అంటారు. కానీ ఆ ఫాదర్ గురువుగా కూడా అవ్వడమనేది జరగదు. టీచరుగా అవ్వ వచ్చు. ఫాదర్ ను గురువు అని ఎప్పుడూ అనరు. వీరి (బాబా) ఫాదర్ టీచరుగా కూడా ఉండేవారు, చదివించేవారు. వారు హద్దు ఫాదర్ మరియు టీచరు. వీరు అనంతమైన ఫాదర్ మరియు టీచరు. మీరు స్వయాన్ని ఈశ్వరీయ విద్యార్థులుగా భావించినా కూడా అహో సౌభాగ్యము. గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు, ఎంత క్లియర్ గా ఉంది. మరి వీరు ఎంత మధురమైన బాబా, మధురమైనదానిని స్మృతి చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ప్రేయసీ-ప్రియుల మధ్య ప్రేమ ఉంటుంది. వారి ప్రేమ వికారాల కోసం ఉండదు, కేవలం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆత్మలైన మీది పరమాత్మ తండ్రితో యోగము. బాబా ఎంతటి జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు అని ఆత్మ అంటుంది. ఈ పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చి మనల్ని ఎంత ఉన్నతంగా తయారుచేస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా చేయడానికి భగవంతుడికి ఎంతో సమయం పట్టదు అని గాయనం కూడా ఉంది. సెకండులో వైకుంఠానికి వెళ్తారు. సెకండులో మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. ఇదే లక్ష్యం-ఉద్దేశ్యం, దీని కోసం చదువుకోవాలి. గురునానక్ కూడా, మురికిపట్టిన వస్త్రాలను శుభ్రం చేసారని….. అంటారు కదా. లక్ష్యం అనే సబ్బు ఉంది కదా. బాబా అంటారు – నేను ఎంత మంచి చాకలివాడిని. మీ వస్త్రాలను, మీ ఆత్మను మరియు శరీరాన్ని ఎంత శుద్ధంగా తయారుచేస్తాను. కావున ఈ దాదాను ఎప్పుడూ స్మృతి చేయకూడదు. ఈ కార్యమంతా శివబాబాది, వారినే స్మృతి చేయండి. శివబాబా వీరికన్నా మధురమైనవారు. ఈ కళ్ళకు మీకు ఈ బ్రహ్మా రథం కనిపిస్తూ ఉండవచ్చు కానీ మీరు శివబాబానే స్మృతి చేయాలని ఆత్మకు చెప్తారు. శివబాబా వీరి ద్వారా మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేస్తున్నారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి హృదయం రూపీ సింహాసనాన్ని జయించే పురుషార్థం చేయాలి. ట్రస్టీగా ఉంటూ పరివారంలో అందరినీ ప్రేమగా నడిపించాలి. మోహజీతులుగా అవ్వాలి.

2. యోగబలంతో ఆత్మను స్వచ్ఛంగా చేసుకోవాలి. ఈ కళ్ళతో అన్నీ చూస్తూ, ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ పుష్పాల హారాలను స్వీకరించకుండా సుగంధ భరితమైన పుష్పాలుగా అవ్వాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే తమ చంచల వృత్తిని పరివర్తన చేసుకుంటారో, వారే సతోప్రధాన వాయుమండలాన్ని తయారుచేయగలరు, ఎందుకంటే వృత్తి ద్వారా వాయుమండలం తయారవుతుంది. వృత్తిలో ఇంత పెద్ద కార్యం యొక్క స్మృతి లేనప్పుడు వృత్తి చంచలమవుతుంది. ఒకవేళ ఎవరైనా చాలా చంచలమైన బాలుడు బిజీగా ఉన్నా కానీ చంచలతను వదలకపోతే అతడిని బంధిస్తారు. అదే విధంగా, ఒకవేళ జ్ఞాన-యోగాలలో బిజీగా ఉంటున్నా కూడా, వృత్తి చంచలంగా ఉన్నట్లయితే, ఒక్క తండ్రితో సర్వ సంబంధాల బంధనంలో వృత్తిని బంధించండి, అప్పుడు చంచలత సహజంగా సమాప్తమైపోతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top