31 May 2021 TELUGU Murli Today – Brahma Kumari
30 May 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఈ ప్రపంచం శ్మశానవాటికగా అవ్వనున్నది, అందుకే దీనిపై మనసును పెట్టుకోకండి, పరిస్తాన్ ను గుర్తు చేయండి”
ప్రశ్న: -
పేద పిల్లలైన మీ వంటి అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరూ లేరు, ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే పేద పిల్లలైన మీరే డైరెక్టుగా ఆ తండ్రికి చెందినవారిగా అయ్యారు, వారి నుండి సద్గతి యొక్క వారసత్వం లభిస్తుంది. పేద పిల్లలే చదువుకుంటారు. షావుకారులు ఒకవేళ కొద్దిగా చదువుకున్నా కూడా, వారికి తండ్రి స్మృతి కష్టంగా నిలుస్తుంది. మీకైతే అంతిమంలో తండ్రి తప్ప ఇంకేమీ గుర్తుకు రాదు, అందుకే మీరు అందరికన్నా అదృష్టవంతులు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
మనసు యొక్క ఆధారం తెగిపోకూడదు….. (దిల్ కా సహారా టూట్ న జాయే…..)
ఓంశాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మరియు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు – తప్పకుండా ఈ ప్రపంచం ఇప్పుడు శ్మశానవాటికగా అవ్వనున్నది అని. ఇంతకుముందు ఈ ప్రపంచం పరిస్తాన్ గా ఉండేది, ఇప్పుడు పాతదిగా అయిపోయింది, అందుకే దీనిని శ్మశానవాటిక అని అంటారు. అందరూ శ్మశానగ్రస్తులుగా అవ్వాల్సిందే. పాత వస్తువు సమాధి అవుతుంది అనగా మట్టిలో కలిసిపోతుంది. ఇది కూడా కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి తెలియదు. శ్మశానవాటికగా అయ్యే సమయం కనిపిస్తుందని కొంతమంది విదేశీయులకు తెలుస్తుంది. పరిస్తాన్ ను స్థాపన చేసే మా తండ్రి మళ్ళీ వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఒకవేళ ఈ శ్మశానవాటిక పట్ల మనసు పెట్టుకున్నట్లయితే, నష్టపోతామని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. మీరిప్పుడు కల్పక్రితం వలె, అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇది అడుగడుగునా పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి, ఇదే మన్మనాభవ. తండ్రి స్మృతిలో ఉండడంతోనే స్వర్గవాసులుగా అవుతారు. భారత్ పరిస్తాన్ గా ఉండేది, ఇంకే ఖండము పరిస్తాన్ గా అవ్వదు. ఇది మాయా రావణుని ఆర్భాటము. ఇది ఇంకా కొద్ది సమయమే నడవనున్నది. ఇది అసత్యపు ఆర్భాటము. అసత్యపు మాయ, అసత్యపు శరీరం కదా. ఇది అంతిమ సమయం యొక్క ఆర్భాటము. దీనిని చూసి, స్వర్గమైతే ఇప్పుడే ఉంది, ఇంతకుముందు నరకముండేదని అనుకుంటారు. పెద్ద-పెద్ద భవనాలను నిర్మిస్తూ ఉంటారు. ఇది ఈ 100 సంవత్సరాల్లో ఏర్పడిన ఆర్భాటము. టెలిఫోన్, విద్యుత్తు, విమానాలు మొదలైనవన్నీ ఈ 100 సంవత్సరాల లోపలే తయారయ్యాయి. ఎంతటి ఆర్భాటముంది, అందుకే స్వర్గమైతే ఇప్పుడే ఉందని భావిస్తారు. పాత ఢిల్లీ ఎలా ఉండేది? ఇప్పుడు కొత్త ఢిల్లీ ఎంత బాగా తయారయ్యింది. పేరు కూడా న్యూ ఢిల్లీ అని పెట్టబడింది. కొత్త ప్రపంచం రామరాజ్యంలా ఉండాలని, పరిస్తాన్ లా ఉండాలని బాపూజీ కోరుకునేవారు. ఇది తాత్కాలిక ఆర్భాటము. ఎంత పెద్ద-పెద్ద భవనాలు, ఫౌంటెన్లు మొదలైనవి నిర్మిస్తారు, దీనిని అల్పకాలికమైన కృత్రిమ స్వర్గమని అంటారు. దీని పేరు స్వర్గమేమీ కాదని మీకు తెలుసు. దీని పేరు నరకము. నరకానికి కూడా ఒక ఆర్భాటము ఉంది, ఇది అల్పకాలిక ఆర్భాటము. ఇప్పుడిది ఇక సమాప్తమైనట్లే.
ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు – ముందుగా శాంతిధామాన్ని స్మృతి చేయండి. మనుష్యమాత్రులందరూ శాంతిని వెతుకుతూ ఉంటారు. శాంతి ఎక్కడ లభిస్తుంది? ప్రపంచంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అనే ప్రశ్న అయితే ఇప్పుడు మొత్తం ప్రపంచానికుంది. వాస్తవానికి మనమంతా శాంతిధామ నివాసులమని మనుష్యులకు తెలియదు. ఆత్మలైన మనం శాంతిధామంలో శాంతిగా ఉంటాము, తర్వాత ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు వయా శాంతిధామం, సుఖధామానికి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు. ఆత్మలైన మేమిప్పుడు మా ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్తామని ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంది. ఇక్కడైతే శాంతి యొక్క విషయం ఉండదు, ఇది దుఃఖధామము. సత్యయుగం పావన ప్రపంచము, కలియుగం పతిత ప్రపంచము. ఈ విషయాలను గురించిన వివేకం, ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. ప్రపంచంలోని వారికి ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి మాకు సృష్టి చక్రం యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తారని మీ బుద్ధిలోకి వచ్చింది. తర్వాత ధర్మ స్థాపకులు వచ్చి, ధర్మాలను ఎలా స్థాపన చేస్తారు అనేది కూడా తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు సృష్టిలో ఎంతమంది మనుష్యులున్నారు. భారత్ లో కూడా చాలామంది ఉన్నారు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు చాలా షావుకారుగా ఉండేది, వేరే ధర్మమేదీ ఉండేది కాదు. పిల్లలైన మిమ్మల్ని రోజూ రిఫ్రెష్ చేయడం జరుగుతుంది. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. భక్తి మార్గంలో కూడా ఇది కొనసాగుతూ వచ్చింది – పరమాత్మను స్మృతి చేయండి, పరమాత్మ లేక అల్లా అక్కడ ఉన్నారని సదా వేలును పైకి చూపిస్తారు. కేవలం అలానే స్మృతి చేయడం వలన ఏమీ జరగదు. స్మృతితో కలిగే లాభమేమిటి అనేది కూడా వారికి తెలియదు. వారితో మనకున్న సంబంధమేమిటి అనేది తెలియనే తెలియదు. దుఃఖం సమయంలో ఓ రామా….. అని పిలుస్తారు. ఆత్మ గుర్తు చేస్తుంది. కానీ సుఖ-శాంతులని వేటిని అంటారు అనేది వారికి తెలియదు. మనమంతా ఒక్క తండ్రి సంతానమని మీ బుద్ధిలోకి వస్తుంది. మరి దుఃఖం ఎందుకు ఉండాలి. అనంతమైన తండ్రి నుండి సదా సుఖం యొక్క వారసత్వం లభించాలి. ఇది కూడా చిత్రంలో స్పష్టంగా ఉంది. భగవంతుడే స్వర్గ స్థాపనను చేసేవారు, వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు రావడం కూడా భారత్ లోనే వస్తారు కానీ ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. దేవీ-దేవతా ధర్మ స్థాపన తప్పకుండా సంగమంలోనే జరుగుతుంది, సత్యయుగంలో ఎలా జరుగుతుంది. కానీ ఈ విషయాలు ఇతర ధర్మాల వారికి తెలియదు. తండ్రియే నాలెడ్జ్ ఫుల్, ఆది సనాతన దేవీదేవతా ధర్మ స్థాపన ఎలా జరిగింది అనేది వారు అర్థం చేయిస్తారు. సత్యయుగం ఆయువు లక్షల సంవత్సరాలని అనడంతో చాలా దూరం తీసుకువెళ్ళారు. పిల్లలైన మీరు, చిత్రాలపైనే అర్థం చేయించాలి. భారత్ లో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. వీరు ఎలా మరియు ఎప్పుడు ఈ రాజ్యాన్ని పొందారు అనేది తెలియదు. కేవలం, వీరు సత్యయుగానికి యజమానులుగా ఉండేవారని అంటారు. వారి ఎదురుగా వెళ్ళి భిక్ష అడుగుతారు, అప్పుడు అల్పకాలానికి ఎదో ఒకటి లభిస్తుంది. ఎవరైనా దాన-పుణ్యాలు చేసినప్పుడు, వారికి కూడా అల్పకాలానికి ఫలం లభిస్తుంది. షావుకారు పంచాయతీ ముఖ్యుడికి ఎంత సంతోషముంటుందో, పేద పంచాయతీ ముఖ్యుడికి కూడా అంతే సంతోషముంటుంది. పేదవారు కూడా తమను తాము సుఖంగా ఉన్నామని భావిస్తారు. బొంబాయిలో పేదవారు ఎలాంటి స్థానాలలో ఉంటారో చూడండి. కోటీశ్వరులైనా కానీ ఎంత దుఃఖితులుగా ఉన్నారు అనేది పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మాలాంటి అదృష్టవంతులు ఇంకెవరూ లేరని మీరంటారు. మేము డైరెక్టుగా తండ్రికి చెందినవారిగా అయ్యాము, వారి నుండి సద్గతి యొక్క వారసత్వం లభిస్తుంది. పెద్ద-పెద్ద వ్యక్తులు ఎప్పుడూ ఉన్నత పదవిని పొందలేరు. ఎవరైతే ఇప్పుడు పేదవారిగా ఉన్నారో, వారు షావుకారులుగా అవుతారు. మీరు చదువుకుంటారు. వారు చదువుకోనివారు, ఒకవేళ కొద్దిగా చదువుకున్నా కూడా, తండ్రి స్మృతిలో ఉండలేరు. అంతిమంలో మీకు తండ్రి తప్ప ఇంకేమీ గుర్తుండకూడదు. ఇదంతా శ్మశానవాటికగా అవ్వనున్నదని మీకు తెలుసు. ఈ వ్యాపారాలు మొదలైనవి ఏవైతే మేము చేస్తున్నామో, ఇవి కొద్ది సమయం కోసమే ఉంటాయని బుద్ధిలో ఉండాలి. ధనవంతులు ధర్మశాలలు మొదలైనవాటిని నిర్మిస్తారు. వాటిని వ్యాపారం కోసమేమీ నిర్మించరు. తీర్థ స్థానాలున్న చోట ధర్మశాలలు లేకపోతే ఎక్కడ ఉండాలి, అందుకే షావుకారులు ధర్మశాలలను నిర్మిస్తారు. అలాగని వ్యాపారస్తులు అక్కడకు వచ్చి వ్యాపారం చేసుకోవడం కాదు. ధర్మశాలలను తీర్థ స్థానాలలో నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు మీ సెంటర్లు అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానాలు. మీ సెంటర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అవి అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానాలు, అక్కడ మనుష్యులకు సుఖ-శాంతులు లభిస్తాయి. మీ ఈ గీతాపాఠశాల పెద్దది. ఇది సంపాదనకు ఆధారము, దీనితో మీకు చాలా సంపాదన జరుగుతుంది. పిల్లలైన మీ కోసం, ఇది కూడా ధర్మశాలయే, ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. దీనంతటి పెద్ద తీర్థ స్థానం ఇంకేదీ ఉండదు. ఆ తీర్థ స్థానాలకు వెళ్ళడంతో మీకు ఏమీ లభించదు. ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకున్నారు. భక్తులు మందిరాలు మొదలైనవాటిలో, చాలా ప్రేమగా చరణామృతాన్ని తీసుకుంటారు. దీనితో మా హృదయం పవిత్రంగా అయిపోతుందని భావిస్తారు. కానీ అది నీరు మాత్రమే. నన్ను స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుందని ఇక్కడ తండ్రి అంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి మీకు అవినాశీ జ్ఞాన రత్నాల ఖజానా లభిస్తుంది. తరచుగా శంకరుని వద్దకు వెళ్తారు, అమరనాథుడు పార్వతికి కథ వినిపించారని అనుకుంటారు. అందుకే, మా జోలిని నింపండి….. అని అంటారు. మీరు అవినాశీ జ్ఞాన రత్నాలతో జోలిని నింపుకుంటారు. అంతేకానీ, అమరనాథుడు కూర్చుని ఎవరో ఒక్కరికే కథ వినిపించరు. తప్పకుండా చాలామంది ఉంటారు, అది కూడా మృత్యులోకంలోనే ఉంటారు. సూక్ష్మవతనంలో కథ వినిపించే అవసరమే ఉండదు. అనేక తీర్థ స్థానాలను తయారుచేసారు. సాధు-సన్యాసులు, మహాత్ములు మొదలైనవారు ఎంతోమంది వెళ్తారు. అమరనాథ్ కు లక్షలాది మంది వెళ్తారు. అన్నింటికన్నా ఎక్కువగా కుంభ మేళాలో గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. మేము పావనంగా అవుతామని భావిస్తారు. వాస్తవానికి ఇది కుంభ మేళా. ఆ మేళాలకైతే జన్మ-జన్మలుగా వెళ్తూ ఉన్నారు. కానీ తండ్రి అంటారు – వీటి ద్వారా ఎవరూ తమ ఇంటికి తిరిగి వెళ్ళలేరు ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా అవుతుందో అప్పుడే వెళ్ళగలదు. కానీ అపవిత్రంగా ఉన్న కారణంగా, అందరి రెక్కలు తెగిపోయాయి. ఆత్మకు రెక్కలు లభించాయి, యోగంలో ఉండడంతో ఆత్మ అన్నింటికన్నా వేగంగా ఎగురుతుంది. ఎవరి లెక్కాచారమైనా లండన్ లో, అమెరికాలో ఉన్నట్లయితే వెంటనే ఎగిరిపోతుంది, సెకండులో అక్కడకు చేరుకుంటుంది. కానీ ఎప్పుడైతే కర్మాతీతులుగా అవుతారో, అప్పుడే ముక్తిధామానికి వెళ్ళగలరు, అప్పటివరకు ఇక్కడే జనన-మరణాలలోకి వస్తారు. ఎలాగైతే డ్రామా టిక్-టిక్ అంటూ నడుస్తుందో, అలా ఆత్మ కూడా టిక్ అంటూనే వెళ్ళిపోతుంది. ఆత్మ అంతటి వేగవంతమైనది ఇంకేదీ ఉండదు. ఇన్ని ఆత్మలన్నీ మూలవతనానికి వెళ్తాయి. ఆత్మకు ఎక్కడ నుండి ఎక్కడికైనా చేరుకోవడానికి సమయం పట్టదు. మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. కొత్త ప్రపంచంలో తప్పకుండా కొద్దిమంది ఆత్మలే ఉంటారని మరియు అక్కడ చాలా సుఖమయంగా ఉంటారని పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది. ఆ ఆత్మలే ఇప్పుడు 84 జన్మలను అనుభవించి చాలా దుఃఖితులు అయ్యారు. మీకు మొత్తం చక్రం గురించి తెలిసింది. మీ బుద్ధి నడుస్తుంది, వేరే మనుష్యమాత్రుల బుద్ధి నడవదు. ప్రజాపిత బ్రహ్మా కూడా గాయనం చేయబడ్డారు. కల్పక్రితం కూడా మీరు ఇలాగే బ్రహ్మాకుమారీ-కుమారులుగా అయ్యారు. మేము ప్రజాపిత బ్రహ్మా సంతానమని మీకు తెలుసు. మన ద్వారా బాబా స్వర్గ స్థాపనను చేయిస్తున్నారు. ఎప్పుడైతే నంబరువారు పురుషార్థానుసారంగా యోగ్యులుగా అవుతారో, అప్పుడు పాత ప్రపంచం వినాశనమవుతుంది. త్రిమూర్తి కూడా ఇక్కడే గాయనం చేయబడ్డారు. త్రిమూర్తి చిత్రాన్ని కూడా పెడతారు. అందులో శివుడిని చూపించరు. బ్రహ్మా ద్వారా స్థాపన అని కూడా అంటారు. ఎవరు చేయిస్తారు, శివబాబా. విష్ణువు ద్వారా పాలన అని అంటారు. బ్రాహ్మణులైన మీరిప్పుడు దేవతలుగా అయ్యేందుకు యోగ్యులుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు ఆ పాత్రను అభినయిస్తున్నారు. కల్పం తర్వాత మళ్ళీ అభినయిస్తారు. మీరు పవిత్రంగా అవుతారు. కామం రూపీ శత్రువును జయించండి, నన్నొక్కడినే స్మృతి చేయండి అనేది బాబా ఆజ్ఞ అని అంటారు. ఇది చాలా సహజము. భక్తి మార్గంలో పిల్లలైన మీరు చాలా దుఃఖాన్ని చూసారు. కొద్దిగా సుఖమున్నప్పటికీ అది అల్పకాలానికే ఉంటుంది. భక్తిలో సాక్షాత్కారాలు జరుగుతాయి. అది కూడా అల్పకాలం కోసం మీ ఆశ పూర్తవుతుంది. ఆ సాక్షాత్కారాలను కూడా నేనే చేయిస్తాను, డ్రామాలో నిశ్చయించబడి ఉన్నాయి. ఏదైతే గతించిపోయిందో, ఆ సెకండు-సెకండు డ్రామాలో చిత్రీకరించబడింది. ఇప్పుడు షూటింగ్ అయ్యింది అని అనరు. ఇది అనాదిగా తయారై తయారవుతున్న డ్రామా. ఎంతమంది పాత్రధారులున్నారో, వారందరిదీ అవినాశీ పాత్ర. మోక్షాన్ని ఎవరూ పొందరు. మేము లీనమైపోతామని సన్యాసులంటారు. నీవు ఒక అవినాశీ ఆత్మ అని తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ ఒక బిందువు, ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర నిశ్చయించబడి ఉంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎవరైతే మొట్టమొదట పాత్రను అభినయించేందుకు వస్తారో, వారే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ తీసుకోలేరు. మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఈ నాలెడ్జ్ ఉండదు. జ్ఞాన సాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. తండ్రి మనల్ని పతితుల నుండి పావనులుగా చేస్తారు. సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇస్తారు. సత్యయుగంలో దుఃఖం యొక్క నామ రూపాలు ఉండవు. తండ్రి అంటారు – ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ….. నివృత్తి మార్గం వారు ఇటువంటి ఆశీర్వాదాలను ఇవ్వలేరు. పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. సత్య-త్రేతా యుగాలు సుఖధామము. తర్వాత దుఃఖం ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరికీ తెలియదు. దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళ్తారు అన్నదానికి గుర్తులున్నాయి. జగన్నాథపురిలో దేవతల చిత్రాలను, కిరీటం మొదలైనవి ధరించి ఉన్నట్లుగా చూపిస్తారు, మళ్ళీ అశుద్ధమైన చిత్రాలను కూడా తయారుచేసారు, అందుకే వారి విగ్రహాలను కూడా నల్లగా చేసారు. దీని ద్వారా దేవతలు వామ మార్గంలోకి వెళ్తారని ఋజువవుతుంది. కనుక అంతిమంలో పూర్తిగా నల్లగా అయిపోతారు. భారత్ ఎంత సుందరంగా ఉండేది అన్న విషయం ఇప్పుడు మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారంగా మళ్ళీ తమోప్రధానంగా అవ్వాల్సిందే. ఇప్పుడు సంగమంలో మీకు ఈ నాలెడ్జ్ ఉంది. తండ్రి నాలెడ్జ్ ఫుల్. మీకు తండ్రి, టీచరు, గురువు ముగ్గురూ ఒక్కరే. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని సదా బుద్ధిలో ఉండాలి. ఇది అనంతమైన చదువు, దీనితో మీరు నాలెడ్జ్ ఫుల్ గా అయిపోయారు. మీకు అంతా తెలుసు. వారు పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు, మీరు పరమాత్మను పతితపావనుడని అంటారు. ఎంతగా రాత్రి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు మీరు నంబరువారుగా మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అయ్యారు. తండ్రి వద్ద ఏదైతే ఉందో, అది మీకు నేర్పిస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే 21 జన్మల వారసత్వం లభిస్తుందని మీరు కూడా అందరికీ తెలియజేయాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయం రిఫ్రెష్ గా ఉంటూ, ఇతరులను రిఫ్రెష్ చేసేందుకు తండ్రి మరియు వారసత్వం యొక్క స్మృతిలో ఉండాలి మరియు అందరికీ స్మృతినిప్పించాలి.
2. ఈ పాత ప్రపంచం పట్ల, ఈ శ్మశానవాటిక పట్ల మనసు పెట్టుకోకూడదు. శాంతిధామాన్ని, సుఖధామాన్ని గుర్తు చేయాలి. స్వయాన్ని దేవతలుగా అయ్యేందుకు యోగ్యులుగా తయారుచేసుకోవాలి.
వరదానము:-
సంగమయుగంలో బాప్ దాదా ద్వారా పిల్లలందరికీ కిరీటం మరియు సింహాసనం ప్రాప్తిస్తాయి. పవిత్రతా కిరీటం కూడా ఉంది మరియు బాధ్యతల కిరీటం కూడా ఉంది, అకాల సింహాసనం కూడా ఉంది మరియు హృదయ సింహాసనాధికారం కూడా ఉంది. ఎప్పుడైతే ఇటువంటి డబల్ కిరీటధారులుగా మరియు సింహాసనాధికారులుగా అవుతారో, అప్పుడు నషా మరియు లక్ష్యము స్వతహాగా గుర్తుంటాయి. అప్పుడు ఈ కర్మేంద్రియాలు జీ హజూర్ (చిత్తం ప్రభూ) అని అంటాయి. ఎవరైతే కిరీటం మరియు సింహాసనాలను వదిలేస్తారో, వారి ఆర్డర్ ను కర్మచారులెవరూ పాటించరు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!