28 May 2021 TELUGU Murli Today – Brahma Kumari

27 May 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తండ్రి ద్వారా మీకు సృష్టి ఆదిమధ్యాంతాల నాలెడ్జ్ ఏదైతే లభించిందో, దానిని మీరు బుద్ధిలో ఉంచుకుంటారు, అందుకే మీరు స్వదర్శన చక్రధారులు”

ప్రశ్న: -

ఆత్మను పావనంగా చేసేందుకు ఆత్మిక తండ్రి ఏ ఇంజెక్షన్ ఇస్తారు?

జవాబు:-

మన్మనాభవ అనే ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ను ఆత్మిక తండ్రి తప్ప ఎవరూ ఇవ్వలేరు. తండ్రి అంటారు – మధురమైన పిల్లలూ, మీరు నన్ను స్మృతి చేయండి, అంతే. స్మృతితోనే ఆత్మ పావనంగా అవుతుంది. ఇందులో సంస్కృతం మొదలైనవి చదవాల్సిన అవసరం కూడా లేదు. తండ్రి అయితే హిందీలో స్పష్టమైన పదాలతో వినిపిస్తారు. ఎప్పుడైతే ఆత్మకు, మేము పావనంగా అయ్యేందుకు ఆత్మిక తండ్రి యుక్తులను తెలియజేస్తున్నారు అన్న నిశ్చయం ఏర్పడుతుందో, అప్పుడు వికారాలను వదులుతూ వెళ్తుంది.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఓం శాంతి అర్థాన్ని పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మ తన పరిచయాన్నిస్తుంది. నా స్వరూపం శాంతి మరియు నా నివాస స్థానం శాంతిధామం, దానినే పరంధామం, నిర్వాణధామం అని కూడా అంటారు. దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వండి, తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి కూడా అంటారు. వారు పతితపావనుడు. నేను ఒక ఆత్మను, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాను – అని ఎవరికీ తెలియదు. ఇప్పుడు డ్రామా పూర్తవుతుంది, తిరిగి వెళ్ళాలి, అందుకే, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని అంటారు. దీనినే సంస్కృతంలో మన్మనాభవ అని అంటారు. తండ్రి సంస్కృతంలోనేమీ చెప్పలేదు. తండ్రి ఈ హిందీ భాషలో అర్థం చేయిస్తారు. ఒక్క హిందీ భాష మాత్రమే ఉండాలని గవర్నమెంట్ అంటుంది. వాస్తవానికి తండ్రి కూడా హిందీలోనే అర్థం చేయించారు. కానీ ఈ సమయంలో అనేక ధర్మాలు, మఠాలు, మార్గాలు ఉన్న కారణంగా అనేక రకాల భాషలను కూడా సృష్టించారు. సత్యయుగంలో ఇక్కడ ఉన్నన్ని భాషలుండవు. గుజరాత్ లో ఉండేవారి భాష వేరుగా ఉంటుంది. ఎవరు ఏ ఊరిలో ఉంటారో, వారికి అక్కడి భాష తెలుస్తుంది. అనేక మంది మనుష్యులున్నారు, అనేక భాషలున్నాయి. సత్యయుగంలోనైతే ఒకే ధర్మం, ఒకే భాష ఉండేవి. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతాల నాలెడ్జ్ బుద్ధిలో ఉంది, ఇది ఏ శాస్త్రాలలోనూ లేదు. ఈ నాలెడ్జ్ ఉన్నటువంటి శాస్త్రమేదీ లేదు. కల్పం ఆయువు గురించి కూడా ఎక్కడా రాసి లేదు, ఎవరికీ తెలియదు కూడా. సృష్టి ఒక్కటే. సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. కొత్త దాని నుండి పాతదిగా, పాత దాని నుండి మళ్ళీ కొత్తదిగా అవుతుంది, దీనినే స్వదర్శన చక్రమని అంటారు. ఎవరికైతే ఈ చక్రం యొక్క నాలెడ్జ్ ఉంటుందో, వారిని స్వదర్శన చక్రధారులని అంటారు. ఆత్మకు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానం ఉంటుంది. వారేమో కృష్ణుడికి, విష్ణువుకు స్వదర్శన చక్రాన్ని చూపించారు కానీ వారికి ఈ నాలెడ్జ్ ఉండేది కాదని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. సృష్టి ఆదిమధ్యాంతాల నాలెడ్జ్ ను తండ్రియే ఇస్తారు. ఇదే స్వదర్శన చక్రము. అంతేకానీ, శిరస్సును ఖండించే హింస యొక్క విషయమేమీ లేదు. అన్నీ అసత్యాలే రాసారు. ఈ నాలెడ్జ్ ను తండ్రి తప్ప మనుష్యమాత్రులెవరూ ఇవ్వలేరు. బ్రహ్మా-విష్ణు-శంకరులనే దేవతలని అంటున్నప్పుడు, మనుష్యులను ఎప్పుడూ భగవంతుడు అని అనలేరు. తండ్రికి ఏ మహిమ అయితే ఉందో, అది దేవతలకు కూడా లేదు. తండ్రి అయితే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తండ్రికి ఏదైతే మహిమ ఉందో, పిల్లల మహిమ కూడా అదేనని అనరు. పిల్లలు పునర్జన్మలు తీసుకుంటారు, తండ్రి అయితే పునర్జన్మల్లోకి రారు. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు, వారు సదా పావనుడు. పిల్లలు పావనంగా అయి, మళ్ళీ పతితంగా అవుతారు. తండ్రి పావనమైనవారు. పిల్లలకు తండ్రి వారసత్వం కూడా తప్పకుండా కావాలి. ఒకటి ముక్తి కావాలి, రెండు జీవన్ముక్తి కావాలి. శాంతిధామాన్ని ముక్తి అని, సుఖధామాన్ని జీవన్ముక్తి అని అంటారు. ముక్తి అయితే అందరికీ లభిస్తుంది. ఎవరైతే చదువుకుంటారో, వారికి జీవన్ముక్తి లభిస్తుంది. భారత్ లో తప్పకుండా జీవన్ముక్తి ఉండేది, మిగిలినవారంతా ముక్తిధామంలో ఉండేవారు. సత్యయుగంలో కేవలం భారత ఖండం మాత్రమే ఉండేది, లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. అందరికన్నా ఎక్కువగా లక్ష్మీనారాయణుల మందిరాలను నిర్మిస్తారని బాబా అర్థం చేయించారు. బిర్లా మొదలైనవారు ఎవరైతే మందిరాలను నిర్మిస్తారో, వారికి, లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యాధికారం ఎక్కడ నుండి లభించింది, వారు ఎంతకాలం రాజ్యం చేసారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనేది ఏమీ తెలియదు. కావున బొమ్మల పూజలా ఉన్నట్లు కదా, దీనిని భక్తి అని అంటారు. మీరే పూజ్యులు, మళ్ళీ మీరే పూజారులని అంటారు. పూజ్యులు మరియు పూజారులకు చాలా తేడా ఉంటుంది, దీనికి కూడా అర్థముంటుంది కదా. ఎవరైతే వికారులుగా ఉన్నారో, వారిని పతితులని అంటారు. క్రోధం కలవారిని పతితులని అనరు. ఎవరైతే వికారాల్లోకి వెళ్తారో, వారిని పతితులని అంటారు. ఈ సమయంలో మీకు జ్ఞానామృతం లభిస్తుంది. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. ఈ భారత్ యే సతోప్రధానంగా, ఉన్నతాతి ఉన్నతంగా ఉండేదని, ఇప్పుడు తమోప్రధానంగా ఉందని తండ్రి అర్థం చేయించారు. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఇక్కడ రాజ్యమేమీ లేదు. ఇక్కడ ఇది ప్రజలపై ప్రజా రాజ్యము. సత్యయుగంలో చాలా తక్కువ మంది ఉంటారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. వినాశనానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఢిల్లీ పరిస్తాన్ గా అవ్వాల్సిందే. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇది కొత్త ఢిల్లీ అని వారనుకుంటారు. ఈ పాత ప్రపంచాన్ని మార్చేవారు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఇది ఏ శాస్త్రాలలోనూ లేదు. అర్థం చేయించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతున్నారు. భారత్ ఎంత సంపన్నంగా ఉండేది, వేరే ధర్మాలేవీ ఉండేవి కాదు. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు దయాహృదయుడైన తండ్రిని స్మృతి చేస్తారు. భారత్ సుఖధామంగా ఉండేదని మర్చిపోయారు. ఇప్పుడు భారత్ పరిస్థితి ఎలా ఉంది. లేదంటే భారత్ హెవెన్ గా ఉండేది. ఇది తండ్రి జన్మ స్థలం కదా కావుననే డ్రామానుసారంగా తండ్రికి దయ కలుగుతుంది. భారత్ ప్రాచీన దేశము. తప్పకుండా క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేదని, వేరే ధర్మాలేవీ ఉండేవి కాదని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు ఈ భారత్ పూర్తిగా నేలపై పడిపోయింది. మా భారతదేశం అన్నింటికన్నా ఉన్నతంగా ఉండేదని పాడుతారు. హెవెన్, స్వర్గం అన్న పేర్లు ఉండేవి. భారత్ మహిమ గురించి కూడా ఎవరికీ తెలియదు. తండ్రియే వచ్చి, భారత్ కథను అర్థం చేయిస్తారు. భారత్ కథ అనగా ప్రపంచ కథ, దీనిని సత్యనారాయణ కథ అని అంటారు. 5 వేల సంవత్సరాల క్రితం, భారత్ లో లక్ష్మీనారాయణుల రాజ్యముండేదని తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ వారికి ఈ రాజ్యం ఎలా లభించింది. సత్యయుగానికి ముందు ఏముండేది? సంగమయుగానికి ముందు ఏముండేది? కలియుగం ఉండేది. ఇది సంగమయుగము. తండ్రికి ఈ యుగంలో రావాల్సి ఉంటుంది ఎందుకంటే పాత ప్రపంచాన్ని ఎప్పుడైతే కొత్తదిగా చేయాల్సి ఉంటుందో, అప్పుడు పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడానికి నేను రావాల్సి ఉంటుంది. నేను సర్వవ్యాపినని, ప్రతి యుగంలోనూ వస్తానని నా గురించి చెప్పారు కనుక మనుష్యులు తికమకపడిపోయారు. సంగమయుగం గురించి కేవలం మీకే తెలుసు. మీరు ఎవరు – ప్రజాపిత బ్రహ్మాకుమారీ-కుమారులని బోర్డుపై రాసి ఉంది. మరి బ్రహ్మాకు తండ్రి ఎవరు? శివుడు, వారు ఉన్నతాతి ఉన్నతమైనవారు. వారి తర్వాత బ్రహ్మా. బ్రహ్మా ద్వారా రచన జరుగుతుంది. ప్రజాపిత అని తప్పకుండా బ్రహ్మానే అంటారు. శివుడిని ప్రజాపిత అని అనరు. శివుడు ఆత్మలందరికీ నిరాకార తండ్రి. ఇక్కడకు వచ్చి ప్రజాపిత బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు – నేను వీరిలో ప్రవేశించాను, వీరి ద్వారా మీరు ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు, బ్రహ్మా ద్వారానే మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేసి, తర్వాత దేవతలుగా చేస్తాను. ఇప్పుడు మీరు బ్రహ్మాకు పిల్లలుగా అయ్యారు. మరి బ్రహ్మా ఎవరి బిడ్డ. బ్రహ్మా యొక్క తండ్రికి ఏదైనా పేరు ఉందా. వారు నిరాకార తండ్రి అయిన శివుడు. వారు వచ్చి వీరిలో ప్రవేశించి దత్తత తీసుకుంటారు, ముఖవంశావళిని తయారుచేస్తారు. తండ్రి అంటారు – నేను వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను, వీరు నా వారిగా అవుతారు, సన్యాసాన్ని ధారణ చేస్తారు. ఏ సన్యాసము, 5 వికారాల సన్యాసము. ఇళ్ళు-వాకిళ్ళను వదలాల్సిన అవసరం లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇదే యోగము, దీనితో మాలిన్యం తొలగిపోతుంది మరియు మీరు సతోప్రధానంగా అయిపోతారు. భక్తిలో ఎన్ని గంగా స్నానాలు చేసినా, జప-తపాదులు మొదలైనవి చేసినా, తప్పకుండా కిందకు దిగాల్సిందే. ఇంతకుముందు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నారు, మళ్ళీ సతోప్రధానంగా ఎలా అవ్వాలి. తండ్రి తప్ప ఎవ్వరూ మార్గాన్ని తెలియజేయలేరు. నన్నొక్కడినే స్మృతి చేయండి అని తండ్రి పూర్తిగా సహజ రీతిలో తెలియజేస్తారు. వారు ఆత్మలతో మాట్లాడుతారు, అంతేకానీ గుజరాతీలతో లేక సింధీలతో మాట్లాడరు. ఇది ఆత్మిక జ్ఞానము. శాస్త్రాలలో భౌతిక జ్ఞానం ఉంటుంది. ఆత్మకే జ్ఞానం కావాలి, ఆత్మయే పతితంగా అయ్యింది. ఆత్మకే ఆత్మిక ఇంజక్షన్ కావాలి. తండ్రిని, ఆత్మిక అవినాశీ సర్జన్ అని అంటారు. నేను మీ ఆత్మిక సర్జన్ ను అని వారు వచ్చి, తమ పరిచయాన్ని ఇస్తారు. మీ ఆత్మ పతితంగా ఉన్న కారణంగా, శరీరం కూడా రోగగ్రస్తంగా అయిపోయింది. ఈ సమయంలో భారతవాసులు మరియు మొత్తం ప్రపంచమంతా నరకవాసులుగా ఉన్నారు, మళ్ళీ స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. నేనే వచ్చి పిల్లలందరినీ స్వర్గవాసులుగా చేస్తానని తండ్రి అంటారు. నిజంగా మేము నరకవాసులుగా ఉండేవారమని, మీరు కూడా అర్థం చేసుకున్నారు. కలియుగాన్ని నరకమని అంటారు. ఇప్పుడిది నరకానికి కూడా అంతిమము. భారతవాసులు ఈ సమయంలో రౌరవ నరకంలో ఉన్నారు, దీనిని రాజ్యమని కూడా అనరు. కొట్లాడుకుంటూ, గొడవపడుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి స్వర్గంలోకి తీసుకువెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తారు కనుక వారు చెప్పింది స్వీకరించాలి. మనుష్యులకు తమ ధర్మశాస్త్రం గురించి కూడా తెలియదు, తండ్రి గురించి కూడా తెలియదు.

తండ్రి అంటారు – నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసాను, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు. కృష్ణుడు నంబర్ వన్ పావనంగా ఉండేవారు. అతడిని శ్యామ సుందరుడని కూడా అంటారు. కృష్ణుని ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు శ్యామంగా (నల్లగా) అయిపోయింది. కామ చితిపై కూర్చొని నల్లగా అయిపోయింది. జగదంబను నల్లగా ఎందుకు చూపిస్తారు? ఇది ఎవరికీ తెలియదు. కృష్ణుడిని ఎలాగైతే నల్లగా చూపించారో, అదే విధంగా జగదంబను కూడా నల్లగా చూపిస్తారు. ఇప్పుడు మీరు నల్లగా ఉన్నారు, మళ్ళీ సుందరంగా అవుతారు. భారత్ చాలా సుందరంగా ఉండేదని మీరు అర్థం చేయించవచ్చు. సౌందర్యాన్ని చూడాలంటే అజ్మీర్ లో (బంగారు ద్వారకలో) చూడండి. స్వర్గంలో బంగారం, వజ్రాలతో తయారుచేయబడిన మహళ్ళు ఉండేవి. ఇప్పుడైతే రాళ్ళు-రప్పలతో తయారుచేయబడిన మహళ్ళు ఉన్నాయి, అందరూ తమోప్రధానంగా ఉన్నారు. శివబాబా, బ్రహ్మా దాదా ఇరువురూ కలిసి ఉన్నారని పిల్లలకు తెలుసు. అందుకే బాప్ దాదా అని పిలుస్తారు. వారసత్వం శివబాబా నుండి లభిస్తుంది. ఒకవేళ దాదా నుండే వారసత్వం లభిస్తుందంటే, మరి శివుని వద్ద ఏమున్నట్లు. వారసత్వం శివబాబా నుండి, బ్రహ్మా ద్వారా లభిస్తుంది. బ్రహ్మా ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడిది రావణ రాజ్యము. మీరు తప్ప అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇప్పుడు పతితుల నుండి పావనులుగా అవుతున్నారు, తర్వాత విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఇక్కడ మనుష్యులేమీ చదివించడం లేదు. మీకు మురళీ ఎవరు వినిపిస్తారు, శివబాబా వినిపిస్తారు. పరంధామం నుండి పాత ప్రపంచంలోకి, పాత శరీరంలోకి వస్తారు. ఎవరికైనా నిశ్చయం ఏర్పడితే, ఇక తండ్రిని కలుసుకోకుండా ఉండలేరు. ముందు అనంతమైన తండ్రిని కలుసుకోవాలి అని అంటారు, కలుసుకోకుండా ఉండలేరు. ఏ అనంతమైన తండ్రి అయితే స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారో, నన్ను వారి వద్దకు వెంటనే తీసుకువెళ్ళండి, శివబాబా రథము ఎవరు అనేది చూడాలి అని అంటారు. మనుష్యులు కూడా గుర్రాన్ని అలంకరిస్తారు, పట్కా (నడికట్టు) ను గుర్తుగా పెడతారు. అది మహమ్మద్ రథంగా ఉండేది, అతను ధర్మస్థాపనను చేసారు. భారతవాసులు నందికి తిలకాన్ని దిద్ది, మందిరంలో పెడతారు. దీనిపై శివుడు స్వారీ చేసారని భావిస్తారు. ఇప్పుడు శివుడు కాని, శంకరుడు కాని నందిపై స్వారీ చేయలేదు. ఏమీ అర్థం చేసుకోరు. శివుడు నిరాకారుడు, వారు స్వారీ ఎలా చేస్తారు. ఎద్దుపై కూర్చొనేందుకు కాళ్ళు ఉండాలి. ఇది అంధ శ్రద్ధ. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి ఏ జ్ఞానామృతమైతే లభిస్తుందో, ఆ అమృతాన్ని తాగాలి మరియు తాగించాలి. పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేందుకు వికారాలను త్యాగం చేయాలి.

2. ఏ తండ్రి అయితే స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా చేస్తున్నారో, వారి ప్రతి మాటను స్వీకరించాలి, పూర్తి నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వాలి.

వరదానము:-

ఇప్పుడు మీ సంపూర్ణ స్థితిని మరియు సంపూర్ణ స్వరూపాన్ని ఆహ్వానించినట్లయితే ఆ స్వరూపమే సదా స్మృతిలో ఉంటుంది. ఇక అప్పుడప్పుడు ఉన్నత స్థితి, అప్పుడప్పుడు నీచ స్థితిలోకి వెళ్ళే ఆవాగమన చక్రం ఏదైతే నడుస్తుందో, పదే పదే స్మృతి మరియు విస్మృతి యొక్క ఏ చక్రంలోకైతే వస్తారో, ఆ చక్రం నుండి ముక్తులైపోతారు. మనుష్యులు జనన-మరణాల చక్రం నుండి ముక్తులవ్వాలనుకుంటారు మరియు మీరు వ్యర్థ విషయాల నుండి ముక్తులై, ప్రకాశిస్తున్న లక్కీ సితారలుగా అయిపోతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top