26 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris
25 May 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞను అనుసరిస్తూ ఉండండి, ఆజ్ఞానుసారంగా నడుచుకోవడంతోనే శ్రేష్ఠంగా అవుతారు”
ప్రశ్న: -
ఏ పిల్లలను సత్యాతి-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులని అంటారు?
జవాబు:-
ఎవరైతే రాజ్యాన్ని పొందే పురుషార్థం చేస్తారో మరియు ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేస్తారో, అటువంటి ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉండే పిల్లలే సత్యాతి-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులు. వారిని చూసి ఇతరులు కూడా సహయోగులుగా అవుతారు.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు, శివబాబాను స్మృతి చేయండి – అని అందరికీ చెప్పాలి. శివబాబా ఉన్నారని మీకు తెలుసు. వారి మందిరాలకు వెళ్తారు కానీ శివబాబా ఎవరు అన్నది పిల్లలైన మీకు తప్ప ఎవరికీ తెలియదు. కనుక శివబాబా స్మృతినిప్పించాలి. ఇక్కడ కూర్చుని ఉన్నా సరే, చాలా మంది బుద్ధియోగం ఎక్కడెక్కడికో భ్రమిస్తూ ఉంటుంది కనుక స్మృతినిప్పించడం మీ బాధ్యత. సోదరీ-సోదరులారా, ఏ తండ్రి నుండైతే వారసత్వం లభించనున్నదో, ఆ తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు మీరు సత్యమైన సోదరీ-సోదరులు. వారు కేవలం స్త్రీ, పురుషులైన కారణంగా, సోదరీ-సోదరులని అంటారు. లెక్చర్లలో కూడా బ్రదర్స్, సిస్టర్స్….. అని అంటారు. వారు శరీరం పరంగా సోదరీ సోదరులు. ఇక్కడ అటువంటి విషయం లేదు. రచయిత అయిన మీ తండ్రిని స్మృతి చేయండి, వారి నుండి వారసత్వం లభించనున్నదని ఇక్కడ ఆత్మలకు అర్థం చేయించడం జరుగుతుంది. తేడా ఉంది కదా. సోదరీ-సోదరులు అనే పదాలు సాధారణమైనవి. తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని ఇక్కడ తండ్రి పిల్లలకు చెప్తారు. ఆ శివబాబా ఆత్మిక తండ్రి మరియు ప్రజాపిత బ్రహ్మా దైహిక తండ్రి. కనుక బాప్ దాదా ఇరువురూ అంటారు – పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి మరియు బుద్ధి యోగం ఇంకెక్కడికీ వెళ్ళకూడదు. బుద్ధి చాలా భ్రమిస్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. కృష్ణుని ఎదురుగా లేక ఇంకెవరైనా దేవతల ఎదురుగా కూర్చొని మాలను తిప్పుతారు. బుద్ధి ఎక్కడెక్కడికో పరుగెడుతూ ఉంటుంది. దేవతలెవరు, వారికి ఈ రాజ్యం ఎలా లభించింది, ఎప్పుడు లభించింది అనేది ఎవరికీ తెలియదు. గురునానక్ సిక్కు మార్గాన్ని స్థాపన చేసారని సిక్కులకు తెలుసు. తర్వాత వారి మనవళ్ళు, గురువులుగా కొనసాగుతూ వస్తారు. వాళ్ళు పునర్జన్మల్లోకి వస్తూ ఉంటారు. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. వారు సదా గురునానక్ ను గుర్తు చేయరు. అచ్ఛా, ఒకవేళ గురునానక్ ను అయినా, బుద్ధుడిని అయినా లేదా ధర్మ స్థాపకులెవరినైనా స్మృతి చేసినా, వారిప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది ఎవరికీ తెలియదు. వారు జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు లేదా వాణికి అతీతంగా వెళ్ళిపోయారని అంటారు లేదా కృష్ణుడు అంతటా హాజరై ఉన్నారని, ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు, రాధనే రాధ అని అంటారు. ఇలా అంటూ ఉంటారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు – భారతవాసులైన మీరు దేవతలుగా ఉండేవారు. మీ ముఖం మనుష్యుల వలె, లక్షణాలు దేవతల వలె ఉండేవి. దేవతల చిత్రాలైతే ఉన్నాయి కదా. చిత్రాలు లేకపోయి ఉంటే, ఇది కూడా అర్థం చేసుకునేవారు కాదు. రాధా-కృష్ణులకు, లక్ష్మీనారాయణులకు ఉన్న సంబంధమేమిటి అనేది తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఈ నిరాకార బాబా మాకు అర్థం చేయిస్తున్నారని మీరెవరికైనా అర్థం చేయించవచ్చు. వాస్తవానికి అందరూ నిరాకారులే. ఆత్మ నిరాకారి, ఈ సాకార రూపం ద్వారా మాట్లాడుతుంది. నిరాకార రూపంలో మాట్లాడలేదు. మా బాబాయే, మీ బాబా అని మీరు అర్థం చేయించవచ్చు. శివబాబా జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, అనంతమైన తండ్రి. వారికి కూడా శరీరం కావాలి కదా. నేను ఈ బ్రహ్మా తనువులోకి వస్తాను, అప్పుడే ఈ బ్రాహ్మణ ధర్మ స్థాపన జరుగుతుందని వారు స్వయంగా అంటారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల రచన జరుగుతుంది. తండ్రి బ్రాహ్మణ పిల్లలకే అర్థం చేయిస్తారు, ఇంకెవరికీ అర్థం చేయించరు, పిల్లలకే అర్థం చేయిస్తారు. నేను శివబాబా సంతానాన్ని కనుక నేను భగవంతుడిని అని కాదు, అలా అనుకోకూడదు. తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే. అయితే, పిల్లలు ఎప్పుడైతే పెద్దవారై, తండ్రి అవుతారో, పిల్లలకు జన్మనిస్తారో అప్పుడు వారిని తండ్రి అని అంటారు. వీరికి ఎంతోమంది పిల్లలున్నారు కదా. నిశ్చయబుద్ధి గల పిల్లలకే అర్థం చేయిస్తారు. నిశ్చయబుద్ధి గల పిల్లలు తండ్రి ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారు ఎందుకంటే శ్రీమతం ద్వారానే శ్రేష్ఠంగా అవ్వగలరు.
ఇప్పుడు మనం ఆ దేవతల వలె అవుతున్నామని మీకు తెలుసు. మనం జన్మ-జన్మలుగా దేవతల మహిమను పాడుతూ వచ్చాము. ఇప్పుడు మనం శ్రీమతాన్ని అనుసరించి అలా తయారవ్వాలి. రాజ్యం స్థాపన అవ్వనున్నది. శ్రీమతాన్ని అందరూ పూర్తిగా అనుసరించరు, నంబరువారుగా అనుసరిస్తారు ఎందుకంటే అది చాలా పెద్ద రాజ్యము. రాజ్యంలో ప్రజలు, నౌకర్లు, ఛండాలులు మొదలైనవారందరూ కావాలి. ఫలానా వారు ఛండాలుని ఫ్యామిలీలోకి వెళ్తారని, అలాంటి నడవడిక గలవారి గురించి కూడా సాక్షాత్కారం జరుగుతుంది. ఛండాలుడు ఒక్కరే ఉండరు, అతని ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఛండాలులకు కూడా యూనియన్ ఉంటుంది. అందరూ పరస్పరంలో కలుసుకుంటారు. సమ్మెలు మొదలైనవి చేసినప్పుడు అన్ని పనులు వదిలేస్తారు. సత్యయుగంలోనైతే ఇలాంటి విషయాలుండవు. మీ వద్ద ఒక చిత్రం కూడా ఉంది, దానిని చూపించి, మీరు ఏమవ్వాలని అనుకుంటున్నారు – బ్యారిస్టర్ గా అవుతారా, దేవతగా అవుతారా అని మీరు అడుగుతారు. మీ రాజధాని అంతా స్థాపనవుతూ ఉంది, ఇది చిన్న విషయమేమీ కాదు. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు, అవి బుద్ధిలో కూర్చుండిపోవాలి. మనం భవిష్యత్తు కోసం పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందుతాము. మనం శ్రీమతాన్ని అనుసరించి శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన రాజ్య పదవిని పొందుతాము మరియు ఇతరులను ఎప్పుడైతే తమ సమానంగా తయారు చేస్తారో, అప్పుడు ఈశ్వరీయ సేవాధారులని అంటారు. ఎవరి విషయాలు, ఏ మాత్రం దాగి ఉండవు. మున్ముందు అంతా తెలుస్తుంది. దీనినే జ్ఞాన ప్రకాశం అని అంటారు, ప్రకాశం లభిస్తూ ఉంటుంది. మనుష్యులకేమీ తెలియదు. లోపల (అండర్ గ్రౌండ్ లో) బాంబులను కూడా తయారుచేస్తూ ఉంటారు. ఏ వస్తువునైనా అలాగే ఉంచుకునేందుకు తయారుచేయడం జరగదు. మొదట్లో ఖడ్గాలతో యుద్ధాలు జరిగేవి, తర్వాత తుపాకీలు తయారు చేసారు. వాటిని అలాగే ఉంచుకోవడానికి కాదు, ఉపయోగించేందుకు తయారు చేసారు. వీటి ద్వారా మృత్యువు సంభవిస్తుందని కూడా తెలుసు. ట్రయల్ వేసి చూసారు కదా. హిరోషిమాలో ఒక్క బాంబుతోనే ఎంతమంది మరణించారు, ఆ తర్వాత ఎంత ఉన్నతిని చేసారో, ఎన్ని భవనాలను నిర్మించారో చూడండి. ఇప్పుడు హాస్పిటల్ లో పడి ఉండే లాంటి వినాశనం జరగదు. హాస్పిటల్ మొదలైనవి ఉండవు ఎందుకంటే భూకంపాలు మొదలైనవి కూడా అప్పుడే వస్తాయి. ప్రాకృతిక ఆపదలను ఎవరూ ఆపలేరు. ఇదంతా ఈశ్వరుని చేతిలో ఉందని అంటారు. వినాశనమైతే జరగాల్సిందేనని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. కరువు వస్తుంది, నీరు లభించదు….. ఇది కొత్త విషయమేమీ కాదని మీరిప్పుడు తెలుసుకున్నారు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. కల్పం యొక్క జ్ఞానమైతే ఎవరిలోనూ లేదు. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితం ప్యారడైజ్ ఉండేదని అంటారు కానీ శాస్త్రాలలో కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని రాసేసారు. ఎవరికీ దాని పట్ల అటెన్షన్ ఉండదు, ఆ మాటను విని మళ్ళీ తమ వ్యాపారాలు మొదలైనవాటిలో నిమగ్నమైపోతారు. కనుక ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు – ఇప్పుడు త్వర త్వరగా పురుషార్థం చేయండి. స్మృతిలో ఉన్నట్లయితే మాలిన్యం తొలగుతూ ఉంటుంది. మీరు ఇక్కడే సతోప్రధానంగా అవ్వాలి లేదంటే శిక్షలను అనుభవించి, మళ్ళీ తమ-తమ ధర్మాలలోకి వెళ్ళిపోతారు. భగవంతుని శ్రీమతం లభిస్తుంది. శ్రీకృష్ణుడైతే రాకుమారుడు, అతను ఎవరికైనా ఏ మతాన్ని ఇస్తాడు. ఈ విషయాల గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియవు. శివబాబాను స్మృతి చేయండి అని ప్రేమగా అర్థం చేయించాలి. నన్నొక్కడినే స్మృతి చేయండి అని శివబాబా స్వయంగా అంటారు. వారు కళ్యాణకారి కూడా, ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి. మీరు భారత్ యొక్క నావను తీరానికి చేర్చేవారు. సత్య-నారాయణ కథకు కూడా భారత్ తోనే సంబంధముంటుంది. ఇతర ధర్మాల వారెప్పుడూ సత్య-నారాయణ కథను వినరు. ఎవరైతే నరుని నుండి నారాయణునిగా తయారయ్యేవారిగా మరియు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా ఉన్నారో, వారే వింటారు. వారే అమరకథను వింటారు. అమరలోకంలో దేవీ-దేవతలుండేవారు, వారు తప్పకుండా అమరకథ ద్వారా అమరలోకంలో ఈ పదవిని పొంది ఉంటారు. ఒక్కొక్క విషయము గుర్తుంచుకునేందుకు యోగ్యమైనది. ఒక్క విషయమైనా బుద్ధిలో మంచి రీతిగా కూర్చున్నట్లయితే, మిగిలినవన్నీ వచ్చేస్తాయి. తండ్రిని స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని ధ్యానంలో ఉంచుకోవాలి. శివబాబాతో పాటు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు, తర్వాత వెళ్ళిపోవాలి.
సత్యమేమిటి, అసత్యమేమిటి అనేది తండ్రియే అర్థం చేయిస్తారు. వారొక్కరే సత్యము, మిగిలినవన్నీ అసత్యము. లంకలో రావణుడుండేవాడు, ఇది ఒక్కరి విషయమేనా! సత్య, త్రేతా యుగాలలో ఇలాంటి విషయాలుండవు. మనుష్యులుండే ఈ ప్రపంచమంతా లంకయే. ఇది రావణ రాజ్యం. సీతలందరూ ఒక్క రాముడినే స్మృతి చేస్తారు అనగా భక్తులందరూ, ప్రేయసులందరూ, ప్రియుడైన ఆ భగవంతుడు ఒక్కరినే స్మృతి చేస్తారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము. సన్యాసులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. అందరూ దుఃఖితులుగా ఉన్నారు, శోక వాటికలో ఉన్నారు. కలియుగం శోక వాటిక, సత్యయుగం అశోక వాటిక. ఇక్కడ అడుగడుగులోనూ శోకముంది, దుఃఖముంది. బాబా మిమ్మల్ని శోకం లేని స్వర్గంలోకి తీసుకువెళ్తారు. ఇక్కడ మనుష్యులు ఎంత శోకంలో ఉంటారు. ఎవరైనా మరణిస్తే పిచ్చివారిలా అయిపోతారు. స్వర్గంలో ఈ విషయాలు ఉండవు. స్త్రీ విధవగా అయ్యేందుకు, అకాల మృత్యువులు ఎప్పుడూ సంభవించవు. అక్కడ సమయానికి ఒక శరీరాన్ని వదిలి, వెళ్ళి వేరొకటి తీసుకుంటారు. పురుష శరీరం గాని, స్త్రీ శరీరం గాని తీసుకుంటారు, ఇది సాక్షాత్కారం అవుతుంది. ఎవరెవరు ఏమవుతారు అనేది చివర్లో అంతా తెలిసిపోతుంది. మేమింత సమయము శ్రమ చేయలేదని ఆ సమయంలో అంటారు. కానీ ఆ సమయంలో ఇలా అనడం వలన ఏమవుతుంది. సమయమైతే గడిచిపోయింది కదా, అందుకే తండ్రి అంటారు – పిల్లలూ, శ్రమ చేయండి, సేవలో సత్యమైన రైట్ హ్యాండ్ గా అయినట్లయితే రాజ్యంలోకి వచ్చేస్తారు. సేవలో తత్పరులై ఉండండి. కుటుంబాలకు కుటుంబాలే, సేవలో ఎలా తత్పరులయ్యారు అనే ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. ఈ కుటుంబం అటువంటి మంచి కర్మలేవో చేసి ఉంటుందని, అందుకే అందరూ ఈశ్వరీయ సేవలో తత్పరులయ్యారని అంటారు. తల్లి, తండ్రి, పిల్లలు….. అందరూ తత్పరులై ఉండడం మంచిదే కదా. సేవ వెనుకే తిరుగుతూ ఉంటారు. మనుష్యాత్మలకు సంతోషం కలిగే విధంగా, వారికి మార్గం తెలియజేయాలి అని పిల్లలైన మీకు చాలా ఉత్సాహముండాలి. ఎంతమందికి మార్గాన్ని తెలియజేస్తారు. మీరు ప్రజలను తయారుచేసుకున్నట్లు, బీజం నాటారు కదా. జన్మిస్తూనే ఎవరూ రాజుగా అవ్వరు. ముందు ప్రజలుగా అయ్యేందుకు అధికారులు అవుతారు, తర్వాత పురుషార్థం చేస్తూ-చేస్తూ ఎలా ఉన్నవారు ఎలా అవ్వగలరు. మీరు సేవ చేయడం చూసి, ఇతరులకు కూడా ఉత్సాహం కలుగుతుంది, మేము కూడా ఇటువంటి పురుషార్థం ఎందుకు చేయకూడదని అనిపిస్తుంది. లేదంటే ఇక కల్ప-కల్పం ఇలాంటి పరిస్థితే ఉంటుంది. చాలా మంది వస్తారు, పశ్చాత్తాపపడతారు. ఆ సమయంలో మనుష్యులు అనుభవించే దుఃఖాన్ని, వారు మొత్తం జీవిత కాలంలో ఎప్పుడూ అనుభవించరు. శ్రీమతమనుసారంగా నడుచుకోని కారణంగా, చివర్లో ఎలాంటి దుఃఖాన్ని చూస్తారంటే, ఇక అడగకండి, ఎందుకంటే అనేక వికర్మలను చేసారు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి అనే చాలా సహజమైన మార్గాన్ని తండ్రి తెలియజేస్తారు. ఇతరులకు కూడా ఈ మార్గాన్ని తెలియజేయండి.
మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. ఎలాగైతే క్రిస్టియన్ ధర్మానికి చెందిన మనుష్యులుంటారో, ఇస్లామ్ ధర్మానికి చెందిన మనుష్యులుంటారో, అలాగే మీరు కూడా. దేవీ-దేవతలు అందరికన్నా పవిత్రమైనవారు. ఇలాంటి ధర్మం ఇంకేదీ ఉండదు. అర్ధకల్పం మీరు పవిత్రంగా ఉంటారు. స్వర్గం మరియు నరకం గాయనం చేయబడ్డాయి. హెవెన్ అని దేనినంటారు అనేది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి భారత్ లోనే వచ్చి, పిల్లలను మేల్కొల్పుతారు. ఇది 5 వేల సంవత్సరాల విషయము. ఎవరైతే స్వర్గవాసులుగా ఉండేవారో, వారే ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. మళ్ళీ తండ్రి వచ్చి, పావన స్వర్గవాసులుగా తయారుచేస్తారు. ఒక్క ప్రియుడు వచ్చి, ప్రేయసులందరినీ తన అశోక వాటికలోకి తీసుకువెళ్తారు. కనుక మొట్టమొదట తండ్రిని స్మృతి చేయండి – అని అందరికీ చెప్పండి. లేదంటే ఇక్కడ కూర్చున్నప్పటికీ, బుద్ధి ఎక్కడెక్కడికో భ్రమిస్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. బాబా అనుభవజ్ఞులు కదా. అన్నింటికన్నా మంచి వ్యాపారం వజ్రాల వ్యాపారం. అందులో సత్యమైనవాటిని, నకిలీవాటిని చాలా కష్టం మీద గుర్తిస్తారు. ఇక్కడ కూడా సత్యం దాగి ఉంది. అంతటా అసత్యమే అసత్యం నడుస్తూ ఉంటుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. మనమంతా డ్రామాలోని పాత్రధారులమని మీకు తెలుసు. దీని నుండి ఎవరూ బయటపడలేరు. ఎవరూ మోక్షాన్ని పొందలేరు. వివేకాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. పాత్రను అభినయిస్తూనే ఉంటారు, మళ్ళీ కల్పం తర్వాత అదే పాత్రను రిపీట్ చేస్తారు. మనుష్యులు ఎలా మరణిస్తారు అనేది మీరు చూస్తారు. వినాశనం జరగనున్నది. ఆత్మలందరూ నిర్వాణధామానికి వెళ్ళిపోతారు. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. సేవలో తత్పరులై ఉండడంతో అనేకుల కళ్యాణం జరుగుతుంది. మొత్తం పరివారమంతా ఈ జ్ఞానం మార్గంలో నిమగ్నమైనట్లయితే చాలా అద్భుతం జరుగుతుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. అంతిమంలోని భయంకరమైన దృశ్యాలు మరియు దుఃఖాల నుండి ముక్తులుగా అయ్యేందుకు, ఇప్పటి నుండి తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి. శ్రీమతాన్ని అనుసరిస్తూ తమ సమానంగా తయారుచేసే సేవను చేయాలి.
2. సేవలో తండ్రికి రైట్ హ్యాండ్ గా అవ్వాలి. ఆత్మలకు సంతోషాన్ని కలిగించే మార్గాన్ని తెలియజేయాలి. అందరి కళ్యాణం చేయాలి.
వరదానము:-
ఏ పిల్లలైతే స్వయాన్ని ఆ ఒక్క తండ్రికి అనగా రామునికి సత్యమైన సీతలుగా భావిస్తూ, సదా మర్యాదల రేఖ లోపల ఉంటారో అనగా జాగ్రత్తను వహిస్తారో, వారు కేర్ ఫుల్ గా మరియు చియర్ ఫుల్ గా (హర్షితంగా) స్వతహాగా ఉంటారు. కనుక ఉదయం నుండి రాత్రి వరకు, ఏ మర్యాదలైతే లభించాయో, బుద్ధిలో వాటి గురించిన స్పష్టమైన నాలెడ్జ్ ను పెట్టుకొని, స్వయాన్ని సత్యమైన సీతగా భావిస్తూ, మర్యాదల రేఖ లోపల ఉండండి, అప్పుడు మర్యాదా పురుషోత్తములని అంటారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!