20 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris
19 May 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఈ పాత ప్రపంచం మరియు దేహధారుల పట్ల ఎప్పుడూ మనసు పెట్టుకోకండి, అలా మనసు పెట్టుకున్నట్లయితే భాగ్యాన్ని నష్టపోతారు”
ప్రశ్న: -
తండ్రి పిల్లలకు ఈ నాటకంలోని ఏ గుహ్య రహస్యాన్ని వినిపించారు?
జవాబు:-
పిల్లలూ – ఈ నాటకం ఇప్పుడు సమాప్తమవ్వనున్నది కనుక ఆత్మలందరూ ఇక్కడ హాజరవ్వాల్సిందే. ఇప్పుడు అన్ని ధర్మాల ఆత్మలు ఇక్కడ హాజరవుతారు ఎందుకంటే సర్వుల తండ్రి ఇక్కడ హాజరై ఉన్నారు. తండ్రి ఎదుట సెల్యూట్ చేయడానికి అందరూ రావాల్సిందే. అన్ని ధర్మాల ఆత్మలు మన్మనాభవ మంత్రాన్ని తీసుకొని వెళ్తారు. వారేమీ మధ్యాజీ భవ మంత్రాన్ని ధారణ చేసి చక్రవర్తులుగా అవ్వరు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
మనసు యొక్క ఆధారం తెగిపోకూడదు….. (దిల్ కా సహారా టూట్ న జాయే…..)
ఓంశాంతి. అన్ని సెంటర్ల పిల్లలు పాటను విన్నారు. మీరు ఈ రోజు వింటున్నారు, మిగిలిన పిల్లలు 2-4 రోజుల తర్వాత వింటారు. ఒకవేళ ఈ పాత ప్రపంచం, పాత శరీరం పట్ల మనసు పెట్టుకున్నట్లయితే, భాగ్యాన్ని నష్టపోతారు ఎందుకంటే ఈ శరీరం ఈ పాత ప్రపంచానికి సంబంధించినది. ఒకవేళ దేహాభిమానులుగా అయినట్లయితే, ఈ తయారవుతున్న భాగ్యం దూరమైపోతుంది. ఇప్పుడు మీరు దురదృష్టవంతుల నుండి అదృష్టవంతులుగా అవుతున్నారు, అందుకే ఎంత వీలైతే అంత అనంతమైన వారసత్వాన్నిచ్చే తండ్రి ఒక్కరినే స్మృతి చేయండి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, ఈ పాత ప్రపంచంలో ఇక కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ కొద్ది సమయంలో మీరు పురుషార్థం చేసి, సర్వగుణ సంపన్నులుగా తప్పకుండా అవ్వాలి. పవిత్రంగా ఉండేవారు కూడా చాలా మంది ఉన్నారు. చాలామంది పదే-పదే పడిపోతూ ఉంటారు. తండ్రి అంటారు – మీరు సేవలో తండ్రికి సహచరులుగా అవ్వాలి, ఇది చాలా పెద్ద సేవ, ఈ ప్రపంచమంతటినీ పతితం నుండి పావనంగా చేయాలి. అలాగని అందరూ తండ్రికి సహాయం చేస్తారని కూడా కాదు. కల్పక్రితం ఎవరైతే సహాయం చేసారో, బ్రాహ్మణ కులభూషణులైన బి.కె.లుగా అయ్యారో, వారే తెలివైనవారిగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మా పేరైతే గాయనం చేయబడింది. బ్రహ్మా సంతానాన్ని తప్పకుండా బి.కె.లనే అంటారు. వారు తప్పకుండా ఒకప్పుడు ఇక్కడ ఉండేవారు. ఆదిదేవ్, ఆదిదేవీలను కూడా స్మృతి చేస్తారు. ఏదైతే గతంలో ఉండేదో, అది మళ్ళీ తప్పకుండా ఉండాలి. సత్యయుగం ఇంతకుముందు ఉండేదని మీకు తెలుసు. అందులో ఆది సనాతన దేవీ-దేవతల రాజ్యముండేది, అది ఇప్పుడు లేదు. పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందిన దేవీ-దేవతలు రాజ్యం చేసేవారు, వారు ఇప్పుడు 84 జన్మల అంతిమంలో ఉన్నారు. ఇప్పుడు వారు పవిత్రంగా కూడా లేరు, ఆ రాజ్యం కూడా లేదు, పతితులుగా అయిపోయారు. మళ్ళీ పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. పతితులతో బుద్ధియోగాన్ని జోడించకండి అని, ఒక్క తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి అంటారు.
మేము తండ్రి సలహాను అనుసరిస్తూ, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. వారసత్వాన్ని ఎలా పొందాలి అనే యుక్తిని కూడా తెలియజేస్తారు. మనుష్యులైతే అనేక రకాల యుక్తులను రచిస్తారు. కొందరు సైన్స్ గర్వంతో ఉన్నారు, కొందరు డాక్టరీ గర్వంతో ఉన్నారు. మనుష్యుల గుండె పాడైపోతే, వేరే ప్లాస్టిక్ గుండెను తయారుచేసి పెట్టగలమని రాసారు. సహజమైనదానిని తొలగించి కృత్రిమమైనదానితో నడిపిస్తూ ఉంటారు. ఇది కూడా ఎంతటి నైపుణ్యము. ఇది అల్పకాలిక సుఖం కోసము. ఒకవేళ రేపు మరణిస్తే, శరీరమే సమాప్తమైపోతుంది, ప్రాప్తి ఏమీ ఉండదు. అది అల్పకాలానికే లభించింది. సైన్స్ ద్వారా చాలా అద్భుతాలను చేసి చూపిస్తారు, అవి కూడా అల్పకాలికమైనవే. ఈ విషయమైతే పూర్తిగా అతీతమైనది. పావనాత్మ 84 జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు పతితంగా అయిపోయింది. ఆ పతితాత్మను మళ్ళీ పావనంగా చేయడమనేది, తండ్రి తప్ప వేరెవ్వరూ చేయలేరు. ఆ ఒక్కరికే గాయనం ఉంది. సర్వుల పతితపావనుడు, సర్వుల సద్గతి దాత, సర్వులపై దయా దృష్టిని ఉంచేవారు, సర్వోదయ లీడర్ వారే. మనుష్యులు తమను తాము సర్వోదయ లీడర్ అని పిలుచుకుంటారు, ఇప్పుడు సర్వ అనగా అందులో అందరూ వచ్చేస్తారు. సర్వులపై దయ చూపించేవారు ఒక్క తండ్రి మాత్రమేనని గాయనం చేయడం జరుగుతుంది. వారిని దయా హృదయుడు, బ్లిస్ ఫుల్ (ఆనంద సాగరుడు) అని అంటారు. ఇకపోతే మనుష్యులు సర్వులపై ఏమి దయ చూపించగలరు! తమపై తామే దయ చూపించుకోలేనప్పుడు, ఇతరులపై ఏమి చూపగలరు. వారు అల్పకాలానికి దయ చూపిస్తారు. ఎంత గొప్ప-గొప్ప పేర్లు పెట్టుకున్నారు.
ఇప్పుడు తండ్రి అంటారు – సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవ్వటానికి నేను మీకు ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తాను. యుక్తి చాలా సింపుల్, కేవలం నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే మీరు నన్నే మర్చిపోయారు. సత్యయుగంలోనైతే మీరు సుఖంగా ఉంటారు, అందుకే నన్ను అసలు స్మృతి చేయరు. మీ 84 జన్మల చరిత్ర-భూగోళాలను మీకు వినిపించాను – మీరు అలా రాజ్యం చేసేవారు, సదా సుఖంగా ఉండేవారు, తర్వాత రోజు-రోజుకు దిగిపోతూ-దిగిపోతూ తమోప్రధానంగా, దుఃఖితులుగా, పతితులుగా అయిపోయారు. కల్ప-కల్పం ఎవరైతే వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారో, శ్రీమతమనుసారంగా నడుచుకుంటారో, అటువంటి పిల్లలైన మీకు, ఇప్పుడు తండ్రి మళ్ళీ కల్పక్రితం వలె వారసత్వాన్ని ఇస్తున్నారు. శ్రీమతం అంటేనే బాప్ దాదా మతము. వారి నుండి కాకుండా శ్రీమతం ఎక్కడ నుండి లభిస్తుంది. ఈ నైపుణ్యం ఎవరిలోనైనా ఉందా అన్నది మీరే ఆలోచించండి అని తండ్రి అంటారు. ఎవరిలోనూ లేదు. ఎవరినైనా విశ్వానికి యజమానులుగా చేసేటువంటి యుక్తిని తండ్రియే తెలియజేస్తారు. ఇది తప్ప వేరే ఉపాయం లేదని తండ్రి అంటారు. ఉన్నత పదవిని పొందేందుకు, పతితపావనుడైన తండ్రియే నాలెడ్జ్ ఇస్తారు. అలాగని కేవలం సృష్టి చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు పవిత్రులుగా అయిపోతారని కాదు. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేయండి, ఈ యోగాగ్నితో నిండుగా ఉన్న మీ పాపాల కుండ అంతమైపోతుంది.
తండ్రి అంటారు – మీరే 84 జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ చాలా పతితులుగా అయిపోయారు. ఈ రోజుల్లోనైతే స్వయాన్ని శివోహమ్, తతత్వమ్ అని చెప్పుకుంటారు లేదా మీరు పరమాత్ముని రూపాలు, ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చారు, శివబాబా స్మృతిని ఇప్పించవలసి ఉంటుందని మీకు తెలుసు. సర్వుల సద్గతిదాత ఒక్క పరమపిత పరమాత్మయే. శివుని మందిరాలు వేరుగా నిర్మించబడతాయి, శంకరుని రూపమే వేరు. దీనిని ప్రదర్శనీలో కూడా చూపించవలసి ఉంటుంది. శివుడు నిరాకారుడు, శంకరుడు ఆకారీ. కృష్ణుడైతే సాకారంలో ఉన్నారు, వారితో పాటు రాధను చూపించడం కరక్టే. వీరే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారని నిరూపించబడుతుంది. కృష్ణుడు గీతను వినిపించేందుకు ద్వాపరంలో రానే రారు. పతితులు కలియుగాంతములో ఉంటారు, పావనులు సత్యయుగంలో ఉంటారు. కనుక భగవంతుడు తప్పకుండా సంగమంలోనే వస్తారు. ఇది తండ్రికి మాత్రమే తెలుసు, వారే త్రికాలదర్శి. కృష్ణుడిని త్రికాలదర్శి అని అనరు. అతను మూడు కాలాల జ్ఞానాన్ని వినిపించలేరు. అతనికి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానం లేదు. అతడొక చిన్న బాలుడు, దైవీ రాకుమారీ-కుమారుల కాలేజ్ లో చదువుకోవడానికి వెళ్తారని అంటారు. ఇంతకుముందు ఇక్కడ కూడా రాకుమారీ-రాకుమారుల కాలేజ్ ఉండేది, ఇప్పుడు అన్నీ కలిసిపోయాయి. కృష్ణుడు రాకుమారుడిగా ఉండేవారు, ఇంకా రాకుమారీ-రాకుమారులు ఉండేవారు. వారందరూ కలిసి చదువుకుంటూ ఉండవచ్చు. అక్కడ నిర్వికారీ ప్రపంచం ఉంటుంది. ఒక్క శివబాబాయే సర్వుల సద్గతిదాత. మనుష్యులు సర్వుల సద్గతి దాతగా కాలేరు. తండ్రియే వచ్చి సర్వులకు ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. దేవతల రాజ్యంలో వేరే ధర్మమేదీ ఉండేది కాదని అర్థం చేయించడం జరుగుతుంది. ఇతర ధర్మాల వారు రావడమే సగంలో వచ్చారు, కనుక సత్యయుగంలో ఎలా ఉండగలరు. నివృత్తి మార్గానికి చెందినవారు హఠయోగులు. వారు రాజయోగాన్ని అర్థం చేసుకోలేరు. ఈ రాజయోగం ప్రవృత్తి మార్గం వారి కోసం ఉన్నది. భారత్ పవిత్ర ప్రవృత్తి మార్గంలో ఉండేది, ఇప్పుడు కలియుగంలో పతిత ప్రవృత్తి మార్గం వారిగా అయిపోయారు. భగవానువాచ -నన్నొక్కడినే స్మృతి చేయండి. పాత ప్రపంచంతో మరియు దేహ సంబంధాలతో మనసును జోడించినట్లయితే, భాగ్యం దూరమైపోతుంది. అనేకుల భాగ్యం దూరమైపోతుంది. ఏదైనా తప్పుడు కార్యం చేసినట్లయితే, చివర్లో అదంతా ఎదురుగా వస్తుంది, సాక్షాత్కారం జరుగుతుంది. చాలామంది పిల్లలు చాలా దాచిపెడతారు. ఈ జన్మలో చేసిన పాప కర్మలను తండ్రికి వినిపించడంతో సగం శిక్ష నుండి ముక్తులవుతారు, కానీ సిగ్గు కారణంగా వినిపించరు. అశుద్ధమైన పనులైతే చాలామంది చేస్తారు. తెలియజేయడం వలన ముక్తులవుతారని బుద్ధిలో గుర్తుంటుంది. వీరు అవినాశీ సర్జన్. సిగ్గు కారణంగా సర్జన్ కు అనారోగ్యాన్ని తెలియజేయకపోతే ఎలా ముక్తులవుతారు. ఏదైనా వికర్మ చేసినట్లయితే, అది తెలియజేయడం వలన సగం క్షమించబడుతుంది. తెలియజేయకపోతే అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువగా అందులో చిక్కుకుపోతూ ఉంటారు. అప్పుడు భాగ్యం సమాప్తమై, దురదృష్టం కలుగుతుంది. తండ్రి అంటారు – దేహంతో కూడా సంబంధం పెట్టుకోకండి, సదా నన్నొక్కడినే స్మృతి చేస్తూ ఉండండి, అప్పుడు ఏ అశుద్ధమైన పని జరగదు. వీరు ధర్మరాజు కూడా, వీరి దగ్గర కూడా దాచిపెడుతూ ఉన్నట్లయితే, ఇక తర్వాత మీకు లభించేంతటి శిక్ష ఇంకెవ్వరికీ లభించదు. సమయం ఎంతగా సమీపంగా వస్తుందో, అంతగా అందరికీ సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడిది అందరి వినాశన సమయము, అందరూ పతితులుగా ఉన్నారు. పాపాలకు తప్పకుండా శిక్ష లభిస్తుంది. ఎలాగైతే ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుందో, అలా ఒక్క సెకండులో ఆ శిక్షలు ఎలా అనుభవమవుతాయంటే, ఎంతో కాలం నుండి శిక్షలను అనుభవిస్తూనే ఉన్నాను అన్నట్లు అనిపిస్తుంది. ఇది చాలా సూక్ష్మమైన మెషినరీ. ఇది అందరి వినాశన సమయము. శిక్షలనైతే తప్పకుండా అనుభవించాల్సిందే. తర్వాత ఆత్మలందరూ పవిత్రంగా అయి వెళ్తారు. తండ్రియే వచ్చి పతితాత్మలను పావనంగా చేస్తారు. తండ్రికి తప్ప వేరెవ్వరికీ ఆ శక్తి లేదు. 63 జన్మలుగా పాపాలు చేస్తూ-చేస్తూ, ఇప్పుడు మీ పాపాల కుండ నిండిపోయింది. మాయ గ్రహణం అందరికీ పట్టింది. మీకు పెద్ద గ్రహణం పట్టింది. మీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు, తర్వాత మీకు గ్రహణం పట్టింది, జ్ఞానం కూడా ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. మీరు భారత్ కు యజమానులుగా ఉండేవారని, తర్వాత మీరు 84 జన్మలను అనుభవించారని తండ్రి తెలియజేస్తారు. తప్పకుండా మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారని, తర్వాత పతితులైన కారణంగా హిందువులుగా పిలుచుకుంటున్నారని తండ్రి ఎంత డైరెక్టుగా తెలియజేస్తారు. హిందూ ధర్మాన్ని అయితే ఎవరూ స్థాపన చేయనే లేదు. మఠాలను, వర్గాలను వంశమని అనరు, వంశము రాజులకు ఉంటుంది. లక్ష్మీనారాయణ ది ఫస్ట్, సెకెండ్, థర్డ్….. ఇలా రాజ్యం నడుస్తుంది. పావనుల నుండి పతితులుగా అవ్వాల్సిందే, ఇది కూడా తప్పకుండా జరుగుతుంది. పతితులైన కారణంగా దేవీ-దేవతలుగా పిలుచుకోలేరు. మేము పూజ్య ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారమని మీరు అర్థం చేసుకున్నారు. తమ తమ ధర్మాల చిత్రాలనే పూజిస్తారు. మేమే పూజ్య దేవీ-దేవతలుగా ఉండేవారమని, ఇప్పుడు పూజారులుగా అయ్యామని కేవలం ఈ విషయాన్ని మర్చిపోయారు. తండ్రి ఇంతకుముందు వారసత్వాన్ని ఇచ్చారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, తర్వాత పతితులుగా అవ్వడంతో తమ చిత్రాలనే కూర్చొని పూజించారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. భారత్ కోసం తప్ప ఇతరులెవ్వరి కోసం ఇలా అనరు. బాబా కూడా భారత్ లోనే వచ్చి, మళ్ళీ దేవతలుగా చేసేందుకు జ్ఞానాన్నిస్తారు. మిగిలిన వారంతా లెక్కాచారాలను పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోతారు. ఆత్మలందరూ ఓ గాడ్ ఫాదర్, అని తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఈ సమయంలో మీకు ముగ్గురు తండ్రులున్నారు. ఒకరు శివబాబా, రెండు లౌకిక తండ్రి మరియు ఈ అలౌకిక తండ్రి ప్రజాపిత బ్రహ్మా. మిగిలిన వారందరికీ ఇద్దరు తండ్రులుంటారు, లౌకికము మరియు పారలౌకికము. సత్యయుగంలో కేవలం ఒక్క లౌకిక తండ్రి మాత్రమే ఉంటారు. పారలౌకిక తండ్రి గురించి తెలియనే తెలియదు. అక్కడ సుఖమే ఉంటుంది, ఇక పారలౌకిక తండ్రిని ఎందుకు స్మృతి చేయాలి. దుఃఖంలో అందరూ స్మరిస్తారు. ఇక్కడ మళ్ళీ మీకు ముగ్గురు తండ్రులుంటారు, ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు, తర్వాత దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇక్కడ మీరు ఆత్మాభిమానులుగానూ ఉన్నారు, పరమాత్మాభిమానులుగానూ ఉన్నారు. మేమంతా తండ్రి సంతానమని, వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని శుద్ధ అభిమానం ఉంది. వారు తండ్రి, శిక్షకుడు, సద్గురువు. వారి ఈ మహిమను కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. వారే వచ్చి పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. సత్యయుగంలో మీకు వారసత్వం ఉండేది, తర్వాత 84 జన్మలు తీసుకొని దానిని పోగొట్టుకున్నారు. ఇప్పుడిది అర్థం చేయించడం ఎంత సహజము. తండ్రిని పతితపావనుడు, సర్వుల సద్గతిదాత అని అంటారు. ఈ ప్రపంచమే పతితుల ప్రపంచము. ఎవరైనా సద్గతిని ఎలా ఇవ్వగలరు. ఇకపోతే ఎవరైనా చాలా శాస్త్రాలు చదివి ఉంటే, అంతమతి సో గతి ఏర్పడుతుంది. అటువంటి వారికి చిన్నతనంలోనే అవి కంఠస్థమైపోతాయి. కనుక తండ్రి పిల్లలైన మీకు ఎంత మంచి మధురాతి-మధురమైన మాటలను వినిపిస్తారు. పిల్లలూ, మీరు తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రిని స్మృతి చేసినట్లయితే మాలిన్యం తొలగిపోతుంది. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, అందరూ హాజరవ్వాల్సిందే. క్రీస్తు మొదలైన వారందరి ఆత్మలు హాజరై ఉన్నాయి. వారు కూడా తండ్రి వద్దకు సెల్యూట్ చేసేందుకు వస్తారు కానీ చక్రవర్తి రాజులుగా అయితే అవ్వరు. కేవలం తండ్రిని స్మృతి చేస్తారు, మన్మనాభవ మంత్రాన్ని తీసుకువెళ్తారు. మీది మన్మనాభవ మరియు మధ్యాజీభవ అనే డబుల్ మంత్రము. తండ్రి ఎంత మంచి యుక్తిని తెలియజేస్తారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత ప్రపంచంలో ఉంటూ పురుషార్థం చేసి, సర్వగుణ సంపన్నులుగా తప్పకుండా అవ్వాలి. ఈ పాత శరీరంతో మరియు పాత ప్రపంచంతో మనసును జోడించకూడదు. అదృష్టవంతులుగా అవ్వాలి.
2. ఆత్మాభిమానులుగా మరియు పరమాత్మాభిమానులుగా ఉండాలి. ఈ వినాశన సమయంలో తండ్రి వద్ద ఏమీ దాచిపెట్టకూడదు. అవినాశీ సర్జన్ నుండి సలహా తీసుకుంటూ ఉండాలి.
వరదానము:-
ఎలాగైతే సూర్యుడిని ఎదురుగా చూసినప్పుడు, సూర్యుని కిరణాలు తప్పకుండా వస్తాయో, అదే విధంగా ఏ పిల్లలైతే జ్ఞాన సూర్యుడైన తండ్రికి సదా సమ్ముఖంగా ఉంటారో, వారు జ్ఞాన సూర్యుని సర్వ గుణాల కిరణాలను స్వయంలో అనుభవం చేస్తారు. వారి ముఖంపై అంతర్ముఖత యొక్క ప్రకాశం మరియు సంగమయుగపు మరియు భవిష్య సర్వ స్వమానాల నషా కనిపిస్తాయి. దీనికోసం, ఇది అంతిమ ఘడియ అని సదా స్మృతిలో ఉండాలి. ఏ ఘడియలోనైనా ఈ తనువు యొక్క వినాశనం జరగొచ్చు, అందుకే సదా ప్రీతి బుద్ధి కలవారిగా అయి, జ్ఞాన సూర్యుని సమ్ముఖంలో ఉంటూ, అంతర్ముఖత మరియు స్వమానం యొక్క అనుభూతిలో ఉండాలి.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!