16 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

15 May 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘కొత్త సంవత్సరం - బాబా సమానంగా తయారయ్యే సంవత్సరం’’

♫ వినండి ఆడియో (audio)➤

ఈ రోజు త్రిమూర్తి తండ్రి మూడు సంగమాలను చూస్తున్నారు. ఒకటి – తండ్రి మరియు పిల్లల సంగమం, రెండవది – ఈ యుగం సంగమయుగం, మూడవది – ఈ రోజు సంవత్సరాల సంగమము. మూడు సంగమాలకు దేని విశేషత దానికి ఉంది. ప్రతి సంగమం పరివర్తన అయ్యేందుకు ప్రేరణను ఇచ్చేటువంటిది. సంగమయుగం విశ్వ పరివర్తనకు ప్రేరణనిస్తుంది. తండ్రి మరియు పిల్లల సంగమం సర్వ శ్రేష్ఠ భాగ్యాన్ని మరియు శ్రేష్ఠ ప్రాప్తులను అనుభూతి చేయిస్తుంది. సంవత్సరాల సంగమం నవీనత యొక్క ప్రేరణను ఇచ్చేటువంటిది. మూడు సంగమాలకు దేని మహత్వం దానికి ఉంది. ఈ రోజు దేశ-విదేశాల పిల్లలందరూ విశేషంగా పాత ప్రపంచం యొక్క కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. బాప్ దాదా సాకార రూపధారులైన పిల్లలను మరియు బుద్ధి రూపీ విమానం ద్వారా వచ్చి చేరుకున్న ఆకార రూపధారులైన పిల్లలందరినీ చూస్తున్నారు మరియు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నందుకు వజ్ర తుల్యమైన శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ వజ్ర తుల్యమైన జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు. డబల్ హీరోలుగా అయ్యారా? ఒకటి – బాబా యొక్క అమూల్యమైన రత్నము, హీరో డైమండ్. రెండు – హీరో పాత్రను అభినయించే హీరో. అందుకే బాప్ దాదా ప్రతి సెకండుకు, ప్రతి సంకల్పానికి, ప్రతి జన్మకు అవినాశీ శుభాకాంక్షలను ఇస్తున్నారు. శ్రేష్ఠ ఆత్మలైన మీకు కేవలం ఈ రోజు మాత్రమే శుభాకాంక్షల రోజు కాదు. కానీ ప్రతి సమయం శ్రేష్ఠ భాగ్యం మరియు శ్రేష్ఠ ప్రాప్తి ఉన్న కారణంగా మీరు తండ్రికి కూడా ప్రతి సమయం శుభాకాంక్షలను ఇస్తారు మరియు తండ్రి పిల్లలకు శుభాకాంక్షలనిస్తూ సదా ఎగిరేకళలోకి తీసుకువెళ్తున్నారు. ఈ కొత్త సంవత్సరంలో ఈ విశేషమైన నవీనతను జీవితంలో అనుభవం చేస్తూ ఉండండి – ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో తండ్రికైతే శుభాకాంక్షలను ఇస్తారు కానీ పరస్పరంలో కూడా బ్రాహ్మణ ఆత్మలైనా లేక ఎవరైనా తెలియనివారు, అజ్ఞానీ ఆత్మలు మీ సంబంధ-సంపర్కంలోకి వచ్చినప్పుడు, బాబా సమానంగా ప్రతి సమయం, ప్రతి ఆత్మ పట్ల హృదయం నుండి సంతోషకరమైన శుభాకాంక్షలు లేక అభినందనలు వెలువడుతూ ఉండాలి. ఎవరెలా ఉన్నా సరే, మీ సంతోషకరమైన అభినందనలు వారికి కూడా సంతోషం యొక్క ప్రాప్తిని అనుభవం చేయించాలి. అభినందనలు ఇవ్వడం అనగా సంతోషాన్ని ఇచ్చిపుచ్చుకోవడము. ఎప్పుడైనా ఎవరికైనా అభినందనలను తెలిపినప్పుడు, అవి సంతోషం యొక్క అభినందనలు. దుఃఖం సమయంలో అభినందనలను తెలపరు. కావున ప్రతి ఆత్మను చూసి సంతోషించడం మరియు సంతోషాన్నివ్వడం – ఇవే హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మరియు అభినందనలు. వేరే ఆత్మలు మీతో ఎలా వ్యవహరించినా కానీ, బాప్ దాదా నుండి ప్రతి సమయం అభినందనలను తీసుకునే శ్రేష్ఠ ఆత్మలైన మీరు సదా ప్రతి ఒక్కరికి సంతోషాన్నివ్వండి. వారు ముళ్ళు ఇస్తే, మీరు వాటి బదులుగా ఆత్మిక గులాబీలను ఇవ్వండి. వారు దుఃఖాన్నిస్తే, సుఖదాత పిల్లలైన మీరు సుఖాన్నివ్వండి. వారెలా ఉంటే మీరు కూడా అలా అవ్వకండి, అజ్ఞానుల ద్వారా అజ్ఞానులుగా అవ్వకూడదు. సంస్కారాలకు లేక స్వభావానికి ‘వశీభూతమైన’ ఆత్మ ద్వారా మీరు కూడా వశీభూతులుగా అవ్వకూడదు.

శ్రేష్ఠ ఆత్మలైన మీ ప్రతి సంకల్పంలో సర్వుల కళ్యాణం చేసే, శ్రేష్ఠ పరివర్తన చేసే, ‘వశీభూతుల’ నుండి స్వతంత్రులుగా చేసే హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మరియు సంతోషకరమైన శుభాకాంక్షలు సదా న్యాచురల్ రూపంలో కనిపించాలి ఎందుకంటే మీరందరూ దాతలు అనగా దేవతలు, ఇచ్చేవారు. కావున ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా సంతోషాల శుభాకాంక్షలను ఇస్తూ ఉండండి. అయితే కేవలం ఈ రోజు లేక రేపు మాత్రమే నడుస్తూ-తిరుగుతూ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు అని చెప్తూ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం కాదు. చెప్పండి కానీ మనస్ఫూర్తిగా చెప్పండి, పూర్తి సంవత్సరమంతా చెప్పండి, కేవలం ఈ రెండు రోజులే కాదు. ఒకవేళ ఎవరికైనా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలను తెలిపితే ఆ మనస్ఫూర్వకమైన శుభాకాంక్షలను అందుకుని ఆ ఆత్మ మనసు సంతోషిస్తుంది. కనుక ప్రతి సమయం దిల్ ఖుష్ (మనసును సంతోషపెట్టే) మిఠాయిని పంచుతూ ఉండండి. కేవలం ఒక్కరోజు మాత్రమే మిఠాయిని తినడం మరియు తినిపించడం కాదు. రేపు ఎన్ని మిఠాయిలు కావాలంటే అన్ని తినండి, అందరికీ చాలా చాలా మిఠాయిలు తినిపించండి. కానీ అదే విధంగా ప్రతి ఒక్కరికి సదా మనసుతో దిల ఖుష్ మిఠాయిని తినిపిస్తూ ఉంటే ఎంత సంతోషం ఉంటుంది! నేటి ప్రపంచంలోనైతే ఎంతైనా నోటితో తినే మిఠాయిలు తినాలంటే భయం ఉంటుంది కానీ ఈ దిల ఖుష్ మిఠాయిని ఎంత కావాలంటే అంత తినవచ్చు, తినిపించవచ్చు. దీని వలన ఎలాంటి జబ్బులు రావు ఎందుకంటే బాప్ దాదా పిల్లలను సమానంగా తయారుచేస్తున్నారు. కనుక విశేషంగా ఈ సంవత్సరంలో బాబా సమానంగా అయ్యే విశేషతను విశ్వం ముందు, బ్రాహ్మణ పరివారం ముందు చూపించండి. ప్రతి ఆత్మ ‘‘బాబా’’ అని అంటూ మధురతను మరియు సంతోషాన్ని అనుభవం చేస్తుంది. ‘వాహ్ బాబా’ అని అనడంతో నోరు మధురంగా అవుతుంది ఎందుకంటే ప్రాప్తి లభిస్తుంది. అదే విధంగా ప్రతి బ్రాహ్మణాత్మ మరొక బ్రాహ్మణాత్మ పేరును తీసుకుంటూనే సంతోషపడాలి ఎందుకంటే బాబా సమానంగా మీరందరూ కూడా పరస్పరంలో బాబా ద్వారా ప్రాప్తించిన విశేషత ద్వారా పరస్పరంలో ఇచ్చిపుచ్చుకోవడం చేస్తారు, పరస్పరంలో ఒకరికొకరు సహయోగులుగా, సాథీలు (సహచరులు)గా అయి ఉన్నతిని ప్రాప్తి చేసుకుంటారు. జీవన సాథీలుగా అవ్వకండి కానీ కార్యంలో సాథీలుగా అవ్వండి. ఆత్మలైన మీరందరూ మీకు ప్రాప్తించిన విశేషతల ద్వారా పరస్పరంలో సంతోషాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు, ఇకముందు కూడా సదా ఇలా చేస్తూ ఉండండి. ఎలాగైతే తండ్రిని స్మృతి చేస్తూనే సంతోషంలో నాట్యం చేస్తారో, అలా ప్రతి బ్రాహ్మణాత్మ మరొక బ్రాహ్మణాత్మను స్మృతి చేస్తూ ఆత్మిక సంతోషాన్ని అనుభవం చేయాలి, హద్దు సంతోషాన్ని కాదు. ప్రతి సమయం తండ్రి ద్వారా లభించిన సర్వ ప్రాప్తుల యొక్క సాకార నిమిత్త రూపాన్ని అనుభవం చేయాలి. దీనినే ప్రతి సంకల్పంలో మరియు ప్రతి సమయము ఒకరికొకరు శుభాకాంక్షలను ఇచ్చుకోవడమని అంటారు. అందరికీ బాబా సమానంగా అవ్వాల్సిందేననే లక్ష్యమే ఉంది ఎందుకంటే సమానంగా అవ్వకుండా బాబాతో పాటు స్వీట్ హోమ్ కు వెళ్ళలేరు, అంతేకాక బ్రహ్మాబాబాతో పాటు రాజ్యంలోకి కూడా రాలేరు. ఎవరైతే బాప్ దాదాతో పాటు ఇంటికి వెళ్తారో, వారే బ్రహ్మాబాబాతో పాటు రాజ్యంలోకి దిగుతారు. పై నుండి కిందకు వస్తారు కదా. కేవలం కలిసి వెళ్ళడమే కాదు, కలిసి వస్తారు కూడా. పూజ్యులుగా కూడా బ్రహ్మాబాబాతో పాటే అవుతారు మరియు పూజారులుగా కూడా బ్రహ్మాబాబాతో పాటే అవుతారు. కనుక ఇది అనేక జన్మల తోడు. కానీ దీనికి ఆధారమేమిటంటే, ఈ సమయంలో సమానంగా అయి వారితో పాటు వెళ్ళాలి.

ఈ సంవత్సరానికి ఉన్న విశేషత చూడండి – నంబరు కూడా 8,8 (1988). 8 కి ఎంత మహత్వముంది! మీ పూజ్య రూపాన్ని చూసినట్లయితే అష్ట భుజధారి, అష్ట శక్తులు దీని స్మృతిచిహ్నాలే. అష్ట రత్నాలు, అష్ట రాజధానులు, ఇలా ఎనిమిదికి రకరకాలుగా మహిమ ఉంది, కనుక ఈ సంవత్సరాన్ని విశేషంగా బాబా సమానంగా అవ్వాలనే దృఢ సంకల్పం చేసే సంవత్సరంగా జరుపుకోండి. ఏ కర్మ చేసినా, బాబా సమానంగా చేయండి. సంకల్పం చేసినా, మాట మాట్లాడినా, సంబంధ-సంపర్కంలోకి వచ్చినా, బాబా సమానంగా ఉండాలి. బ్రహ్మాబాబా సమానంగా అవ్వడము సులభమే కదా ఎందుకంటే వారు సాకారుడు. 84 జన్మలు తీసుకున్న ఆత్మ. పూజ్యుడు మరియు పూజారి, అన్ని విధాలుగా అనుభవీ అత్మ. పాత ప్రపంచం, పాత సంస్కారాలు, పాత లెక్కాచారాలు, సంగఠనలో నడుచుకోవడం మరియు నడిపించడం – అన్ని విషయాలలోనూ అనుభవీ ఆత్మ. అనుభవజ్ఞుడిని ఫాలో చేయడం కష్టమనిపించదు. అంతేకాక, బ్రహ్మాబాబా యొక్క ప్రతి అడుగుపై అడుగు వేయండని బాబా చెప్తారు. కొత్త మార్గం కనిపెట్టవలసిన అవసరమేమీ లేదు, కేవలం ప్రతి అడుగుపై అడుగు వేయాలి. బ్రహ్మాను కాపీ చేయండి. ఈ మాత్రం తెలివైతే ఉంది కదా! కేవలం వారితో కలుపుకుంటూ వెళ్ళండి ఎందుకంటే బాప్ దాదా, ఇరువురు మీతో పాటు వెళ్ళేందుకు ఆగి ఉన్నారు. నిరాకార తండ్రి పరంధామ నివాసి కానీ సంగమయుగంలో సాకారుని ద్వారా పాత్రను అభినయించాల్సి వస్తుంది కదా, అందుకే ఈ కల్పంలో మీ పాత్ర సమాప్తమవ్వడంతో పాటు బాప్, దాదా ఇరువురి పాత్ర కూడా ఈ కల్పానికి సమాప్తమవుతుంది. తర్వాత, కల్పము రిపీట్ అవుతుంది, కనుకనే నిరాకార తండ్రి కూడా పిల్లలైన మీ పాత్రతో బంధించబడి ఉన్నారు. ఇది శుద్ధమైన బంధనమే కానీ పాత్ర యొక్క బంధనమైతే ఉంది కదా. ఇది స్నేహ బంధనం, సేవా బంధనం….. కానీ మధురమైన బంధనం. కర్మభోగంతో కూడిన బంధనం కాదు.

కనుక కొత్త సంవత్సరం సదా శుభాకాంక్షల సంవత్సరం. కొత్త సంవత్సరం సదా బాబా సమానంగా తయారయ్యే సంవత్సరం. కొత్త సంవత్సరం బ్రహ్మాబాబాను ఫాలో చేసే సంవత్సరం. కొత్త సంవత్సరం స్వీట్ హోమ్ మరియు స్వీట్ రాజధానిలో బాబాతో పాటు ఉండే వరదానాన్ని ప్రాప్తి చేసుకునే సంవత్సరం ఎందుకంటే ఇప్పటి నుండే సదా కలిసి ఉంటారు. ఇప్పుడు కలిసి ఉండడమే సదా కలిసి ఉండే వరదానాన్ని పొందడము. లేదంటే ఊరేగింపులో వెళ్ళేవారిగా అవుతారు, సమీప బంధువులకు బదులుగా దూరపు బంధువులుగా అవుతారు. అప్పుడప్పుడు కలుస్తారు. అప్పుడప్పుడు కలిసేవారైతే కాదు కదా? మొదటి జన్మలోని మొదటి రాజ్యం యొక్క సుఖము మరియు మొదటి నంబరులోని రాజ్యాధికారులైన విశ్వమహారాజు-మహారాణుల రాయల్ సంబంధము, దాని మెరుపు మరియు నషా అతీతమైనదిగా ఉంటుంది! ఒకవేళ రెండవ నంబరు విశ్వమహారాజు-మహారాణుల రాయల్ కుటుంబంలోకి వచ్చినా, అప్పటికి తేడా వచ్చేస్తుంది. ఒక్క జన్మకు కూడా తేడా వచ్చేస్తుంది. దీనిని కలిసి ఉండడమని అనరు. ఏదైనా కొత్త వస్తువును ఒక్కసారి వాడినా సరే దానిని వాడిన వస్తువనే అంటారు కదా. కొత్తది అని అనరు కదా! కలిసి వెళ్ళాలి, కలిసి రావాలి, కలిసి మొదటి జన్మలో రాయల్ పరివారంగా అయి రాజ్యం చేయాలి. దీనినే సమానంగా అవ్వడమని అంటారు. కనుక ఏం చేయాలి, సమానంగా అవ్వాలా లేదా ఊరేగింపులో వెళ్ళేవారిగా అవ్వాలా?

బాప్ దాదా అజ్ఞానులు మరియు జ్ఞానులలో ఒక తేడాను చూస్తున్నారు. ఒక దృశ్యం రూపంలో చూస్తున్నారు. బాబా పిల్లలు ఎలా ఉన్నారు మరియు అజ్ఞానులు ఎలా ఉన్నారు? నేటి ప్రపంచంలో వికారీ ఆత్మలు ఎలా తయారయ్యారు? ఈ రోజుల్లో పెద్ద ఫ్యాక్టరీలలో లేదా ఎక్కడైతే అగ్ని మండుతుందో, అక్కడ ఆ అగ్ని పొగ బయటకు వెళ్ళేందుకు చిమ్నీలు తయారుచేస్తారు కదా. వాటి నుండి సదా పొగ వస్తూ ఉంటుంది మరియు ఆ చిమ్నీలు సదా నల్లగా కనిపిస్తాయి. అదే విధంగా నేటి మానవులు వికారులుగా ఉన్న కారణంగా, ఏదో ఒక వికారానికి వశమై ఉన్న కారణంగా, వారి సంకల్పాల నుండి, మాటల నుండి ఈర్ష్య, ద్వేషం లేదా ఏదో ఒక వికారం యొక్క పొగ వెలువడుతూ ఉంటుంది. కళ్ళ నుండి కూడా వికారాల పొగ వెలువడుతూ ఉంటుంది. జ్ఞానీ పిల్లల ప్రతి మాట మరియు సంకల్పం ద్వారా, ఫరిస్తాతనం ద్వారా ఆశీర్వాదాలు వెలువడుతాయి. వారిది వికారాల అగ్ని యొక్క పొగ మరియు జ్ఞానీ ఆత్మల యొక్క ఫరిస్తా రూపం ద్వారా సదా ఆశీర్వాదాలు వెలువడుతాయి. ఎప్పుడూ కూడా, సంకల్పంలో కూడా, ఏదైనా వికారానికి వశమై, వికారాల అగ్ని యొక్క పొగ వెలువడకూడదు, సదా ఆశీర్వాదాలే వెలువడాలి. కనుక చెక్ చేసుకోండి – ఎప్పుడైనా ఆశీర్వాదాలకు బదులుగా పొగ రావడం లేదు కదా? ఫరిస్తా అంటేనే ఆశీర్వాదాల స్వరూపం. ఎప్పుడైనా అలాంటి సంకల్పం వచ్చినా లేక మాట వచ్చినా, ఈ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకోండి – నేనెలా తయారయ్యాను, ఫరిస్తా రూపం నుండి మారిపోలేదు కదా? వ్యర్థ సంకల్పాల నుండి కూడా పొగ వస్తుంది. అది మండుతున్న అగ్ని యొక్క పొగ అయితే ఇది సగం మండుతున్న అగ్ని యొక్క పొగ. అగ్ని పూర్తిగా మండకపోయినా పొగ వస్తుంది కదా. కనుక సదా ఆశీర్వాదాలు వెలువడే ఫరిస్తా రూపంగా ఉండాలి. వీరినే మాస్టర్ దయాళువు, కృపాళువు, మెర్సిఫుల్ అని అంటారు. ఇప్పుడీ పాత్రను అభినయించండి. స్వయంపై కూడా కృప చూపించుకోండి, ఇతరులపై కూడా కృప చూపించండి. ఏది చూసినా, ఏది విన్నా దానిని వర్ణించకండి, దాని గురించి ఆలోచించకండి. వ్యర్థాన్ని ఆలోచించకుండా ఉండడం, చూడకుండా ఉండడం – ఇదే స్వయంపై కృప చూపించుకోవడం మరియు ఎవరైతే అలా చేసారో లేక మాట్లాడారో, వారి పట్ల కూడా సదా దయ చూపించండి, కృప చూపించండి అనగా ఏదైతే వ్యర్థం విన్నారో, చూసారో ఆ ఆత్మ పట్ల కూడా శుభ భావన, శుభ కామనల దయ చూపించండి. వేరే కృప ఏదో చూపించడం లేక చేతితో వరదానం ఇవ్వడం కాదు, కానీ మనసులో పెట్టుకోకండి – ఇదే ఆ ఆత్మ పట్ల కృప చూపించడం. ఒకవేళ మీరు చూసిన వ్యర్థ విషయాన్ని లేక విన్న వ్యర్థ విషయాన్ని వర్ణిస్తున్నారంటే, ఆ వ్యర్థమనే బీజం నుండి వృక్షాన్ని పెంచుతున్నారని అర్థం, వాయుమండలంలో వ్యాపింపజేస్తున్నారని అర్థం. ఇది వృక్షంగా తయారవుతుంది ఎందుకంటే ఎవరైతే చెడు చూస్తారో లేక వింటారో, వారు తమ మనసులోనే ఉంచుకోరు, వేరే వారికి తప్పకుండా వినిపిస్తారు, తప్పకుండా వర్ణిస్తారు. ఇలా ఒకరి నుండి ఒకరికి చేరితే ఏమవుతుంది? ఒక్కరి నుండి అనేకమందికి వ్యాపిస్తుంది. ఎప్పుడైతే ఇలా ఒకరి నుండి ఒకరికి, వారి నుండి మరొకరికి చేరుతూ మాలగా అవుతుందో, అప్పుడు ఎవరైతే చేసారో వారు ఆ వ్యర్థాన్ని స్పష్టం చేసేందుకు ఇంకా మొండితనంలోకి వచ్చేస్తారు. అప్పుడు వాయుమండలంలో ఏం వ్యాపించినట్లు? వ్యర్థము. ఈ పొగ వ్యాపించినట్లు కదా. ఇది ఆశీర్వాదమా లేక పొగా? కనుక వ్యర్థాన్ని చూస్తూ, వింటూ దాన్ని స్నేహంతో, శుభ భావనతో ఇముడ్చుకోండి. విస్తారం చేయకండి. దీనినే ఇతరులపై కృప చూపించడం అనగా ఆశీర్వాదాలు ఇవ్వడమని అంటారు. కనుక సమానంగా తయారయ్యి కలిసి వెళ్ళేందుకు మరియు కలిసి ఉండేందుకు ఏర్పాట్లు చేసుకోండి. అయితే, ఇప్పుడు ఇక్కడ ఉండడమే బాగుంది, కలిసి వెళ్ళే ఏర్పాట్లు ఇప్పుడే కాదు, ఇంకా కొంత ఆగి చేద్దామని అనుకోవడం లేదు కదా? ఆగాలని అనుకుంటున్నారా? ఆగాలనుకున్నా బాబా సమానంగా అయి అప్పుడు ఆగండి. ఇలాగే ఆగిపోకండి, కానీ సమానంగా అయి ఆగండి. తర్వాత ఆగితే ఆగండి, అనుమతి ఉంది. మీరు ఎవర్రెడీ కదా? సేవ ఆపడం లేక డ్రామా ఆపడం అనేది వేరే విషయం కానీ స్వయం కారణంగా ఆగేవారిగా అవ్వకండి. కర్మబంధనాలకు వశమై ఆగేవారిగా అవ్వకండి. కర్మ లెక్కాచారాల ఖాతా పుస్తకం స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉండాలి. అర్థమయిందా, అచ్ఛా.

నలువైపులా ఉన్న పిల్లలందరికీ కొత్త సంవత్సరం యొక్క మహానత ద్వారా మహాన్ గా అయ్యే శుభాకాంక్షలు సదా మీతో పాటు ఉండాలి. సర్వ ధైర్యం కలవారు, ఫాలో ఫాదర్ చేసేవారు, సదా ఒకరికొకరు దిల్ ఖుష్ మిఠాయిని తినిపించుకునేవారు, సదా ఫరిస్తాలుగా అయి ఆశీర్వాదాలను ఇచ్చేవారు, ఇలాంటి బాబా సమానమైన దయాళువు, కృపాళువు పిల్లలకు సమానంగా అయ్యే శుభాకాంక్షలతో పాటు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే.

డబల్ విదేశీ సోదరీ-సోదరులతో అవ్యక్త బాప్ దాదా కలయిక – సదా స్వయాన్ని సంగమయుగ శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? శ్రేష్ఠ ఆత్మల ప్రతి సంకల్పం మరియు మాట మరియు ప్రతి కర్మ స్వతహాగా శ్రేష్ఠంగా ఉంటాయి. కనుక ప్రతి కర్మ శ్రేష్ఠంగా అయింది కదా? ఎవరెలా ఉంటారో, వారి కార్యం అలా ఉంటుంది. కనుక శ్రేష్ఠ ఆత్మల కర్మ కూడా శ్రేష్ఠంగానే ఉంటుంది కదా. ఎలాంటి స్మృతి ఉంటుందో, అలాంటి స్థితి స్వతహాగానే ఉంటుంది. కనుక శ్రేష్ఠ స్థితి మీ న్యాచురల్ స్థితి ఎందుకంటే మీరు విశేషమైన ఆత్మలు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక ఎలాంటి తండ్రినో, అలాంటి పిల్లలుగా అయ్యారు కదా. పిల్లల కొరకు సదా ‘సన్ షోస్ ఫాదర్’ (కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు) అని చెప్పబడుతుంది. మరి ఇలా ఉన్నారా? మీ అందరి మనసులలో ఎవరు ఇమిడి ఉన్నారు? ఎవరైతే మనసులో ఉంటారో, వారే బుద్ధిలో ఉంటారు, మాటలో ఉంటారు, సంకల్పంలో కూడా వారే ఉంటారు. మీరు కార్డు కూడా హృదయం గుర్తుదే తీసుకొస్తారు కదా. కానుక కూడా హృదయం గుర్తుదే పంపిస్తారు. అంటే, మీ స్థితి యొక్క చిత్రాన్ని పంపిస్తున్నారు కదా. ఎవరైతే సదా తండ్రి హృదయంలో ఉంటారో, వారు సదా ఏం మాట్లాడినా, ఏం చేసినా, అది స్వతహాగానే తండ్రి సమానంగా ఉంటుంది. తండ్రి సమానంగా అవ్వడం కష్టమేమీ కాదు కదా? కేవలం డాట్ (బిందువు)ను గుర్తుంచుకుంటే కష్టం అనేది నాట్ (లేదు) అన్నట్లు అవుతుంది. బిందువును మర్చిపోతే కష్టమనిపిస్తుంది. బిందువు గీయడం మరియు బిందువు పెట్టడం ఎంత సులభము! పూర్తి జ్ఞానమంతా ఈ ఒక్క ‘బిందువు’ అనే పదంలో ఇమిడి ఉంది. మీరు బిందువే, తండ్రి కూడా బిందువే, ఏదైతే గడిచిపోయిందో దానికి కూడా బిందువు పెట్టండి, అంతే. చిన్న బిడ్డ కూడా ఎప్పుడైతే వ్రాయడం ప్రారంభిస్తాడో, మొదట కాగితంపై పెన్సిల్ పెట్టినప్పుడు ఏం తయారవుతుంది? బిందువే కదా. కనుక ఇది కూడా పిల్లల ఆట వంటిది. ఈ పూర్తి జ్ఞానం యొక్క చదువంతా ఆటలా ఉంటుంది. కష్టమైన పనేమీ ఇవ్వలేదు కనుక పని కూడా సహజమే, అంతేకాక మీరు ఎలాగూ సహజయోగులు. బోర్డుపై కూడా ‘సహజ రాజయోగము’ అని వ్రాస్తారు. కనుక ఇలా సహజంగా అనుభవం చేయడాన్నే జ్ఞానమని అంటారు. ఎవరైతే నాలెడ్జ్ ఫుల్ గా ఉంటారో, వారు స్వతహాగానే పవర్ఫుల్ గా కూడా ఉంటారు ఎందుకంటే నాలెడ్జ్ ను లైట్ మరియు మైట్ (ప్రకాశము మరియు శక్తి) అని అంటారు. కనుక నాలెడ్జ్ ఫుల్ ఆత్మలు సహజంగా పవర్ ఫుల్ గా ఉన్న కారణంగా ప్రతి విషయంలోనూ సహజంగా ముందుకు వెళ్తారు. ఈ మొత్తం గ్రూపు అంతా సహజయోగుల గ్రూపే కదా. ఇలాగే సహజయోగులుగా ఉండండి. అచ్ఛా.

వరదానము:-

ఎప్పుడూ కూడా ముందు నుండే ‘మేము ఫెయిల్ అవుతామేమో తెలియదు’ అనే సంశయంతో కూడిన సంకల్పం ఉత్పన్నమవ్వకూడదు. సంశయ బుద్ధి కలవారిగా అవ్వడంతోనే ఓటమి కలుగుతుంది, అందుకే సదా మేము విజయాన్ని ప్రాప్తి చేసుకునే చూపిస్తాము అనే సంకల్పమే ఉండాలి. విజయం మా జన్మ సిద్ధ అధికారం – ఇటువంటి అధికారులుగా అయి కర్మ చేస్తే విజయం అనగా సఫలత యొక్క అధికారం తప్పకుండా ప్రాప్తిస్తుంది. దీని ద్వారానే విజయీ రత్నాలుగా అవుతారు కనుక మాస్టర్ జ్ఞానసాగరుల నోటి ద్వారా ‘ఏమో తెలియదు’ అనే మాట ఎప్పుడూ వెలువడకూడదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top