30 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris
29 April 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మీరు తండ్రి ద్వారా సమ్ముఖంగా చదువుకుంటున్నారు, మీరు సత్యయుగీ రాజ్యాధికారానికి యోగ్యులుగా అయ్యేందుకు పావనంగా తప్పకుండా అవ్వాలి”
ప్రశ్న: -
తండ్రి యొక్క ఏ కర్తవ్యము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు?
జవాబు:-
మన తండ్రి, తండ్రి కూడా, టీచరు మరియు సద్గురువు కూడా అని మీకు తెలుసు. తండ్రి కల్పం యొక్క సంగమయుగములో వస్తారు, పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయడానికి, ఒక్క ఆది సనాతన ధర్మాన్ని స్థాపన చేయడానికి వస్తారు. తండ్రి ఇప్పుడు పిల్లలైన మనల్ని, మనుష్యుల నుండి దేవతలుగా చేసేందుకు చదివిస్తున్నారు. ఈ కర్తవ్యము గురించి పిల్లలైన మనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు ఎవరూ లేరు….. (భోలేనాథ్ సే నిరాలా…..)
ఓంశాంతి. ఓం శాంతి అర్థాన్ని, పిల్లలకు అనేక సార్లు అర్థం చేయించారు. ఓం అనగా నేను ఆత్మను మరియు ఇది నా శరీరము. ఇది నా ఆత్మ అని శరీరము కూడా అనవచ్చు. శివబాబా ఏ విధంగా మీరు నా వారు అని అంటారో మరియు పిల్లలు బాబా, మీరు మా వారు అని అంటారో, అలా ఆత్మ కూడా, ఇది నా శరీరము అని అంటుంది, శరీరము, ఇది నా ఆత్మ అని అంటుంది. నేను అవినాశిని అని ఇప్పుడు ఆత్మకు తెలుసు. ఆత్మ లేకుండా శరీరం ఏమీ చేయలేదు. ఆత్మకు శరీరమైతే ఉంటుంది, నా ఆత్మకు కష్టం కలిగించవద్దని అంటుంది, నా ఆత్మ పాపాత్మ అని లేదా నా ఆత్మ పుణ్యాత్మ అని అంటుంది. మీ ఆత్మ సత్యయుగంలో పుణ్యాత్మగా ఉండేదని మీకు తెలుసు. నేను సత్యయుగంలో, సతోప్రధానంగా అనగా సత్యమైన బంగారంగా ఉండేదానినని స్వయంగా ఆత్మ కూడా అంటుంది. నిజంగా ఆత్మ బంగారమని కాదు, ఒక ఉదాహరణగా ఇలా చెప్పడం జరుగుతుంది. నా ఆత్మ పవిత్రంగా ఉండేది, బంగారు యుగానికి చెందినదిగా ఉండేది. ఇప్పుడైతే అపవిత్రముగా ఉన్నామని అంటారు. ప్రపంచంలోని వారికి ఈ విషయం తెలియదు. మీకైతే శ్రీమతము లభిస్తుంది. మీ ఆత్మ సతోప్రధానంగా ఉండేది, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యిందని మీకు ఇప్పుడు తెలుసు. ప్రతి వస్తువు ఇలా అవుతుంది. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము….. ఇలా ప్రతి వస్తువు కొత్త నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. ప్రపంచం కూడా మొదట బంగారు యుగముగా, సతోప్రధానముగా ఉండేది, తర్వాత తమోప్రధానముగా, ఇనుప యుగముగా అయ్యింది, కావుననే దుఃఖితులుగా ఉన్నారు. సతోప్రధానమనగా తీర్చదిద్దబడినది, తమోప్రధానమనగా పాడైపోయినది. పాటలో కూడా, పాడైనదానిని బాగుచేసేవారు….. అని అంటారు. పాత ప్రపంచం పాడైపోయింది ఎందుకంటే ఇది రావణ రాజ్యము మరియు అందరూ పతితులుగా ఉన్నారు. సత్యయుగములో అందరూ పావనంగా ఉండేవారు, దానిని కొత్త నిర్వికారీ ప్రపంచము అని అంటారు. ఇది పాత వికారీ ప్రపంచము. ఇప్పుడు కలియుగం ఇనుప యుగముగా ఉంది. ఈ విషయాలన్నింటినీ ఏ స్కూలులో గానీ, కాలేజిలో గానీ చదివించడం జరగదు. భగవంతుడు వచ్చి చదివిస్తారు మరియు రాజయోగాన్ని నేర్పిస్తారు. గీతలో భగవానువాచ – శ్రీమద్భగవద్గీత అని రాయబడి ఉంది. శ్రీమత్ అనగా శ్రేష్ఠమైన మతము. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు, ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు. వారి ఏక్యురేట్ పేరు శివ. రుద్ర జయంతి లేక రుద్ర రాత్రి అని ఎప్పుడూ విని ఉండరు. శివరాత్రి అని అంటారు. శివుడైతే నిరాకారుడు, మరి నిరాకారుని రాత్రిని లేక జయంతిని ఎలా జరుపుకోవాలి. కృష్ణ జయంతి అనడం బాగానే ఉంది. ఫలానావారి బిడ్డ అని, అతని తిథి-తారీఖులను చూపిస్తారు. శివుడు ఎప్పుడు జన్మించారు అనేది ఎవరికీ తెలియదు, కానీ తెలుసుకోవాలి కదా. శ్రీకృష్ణుడు సత్యయుగం ఆదిలో ఎలా జన్మ తీసుకున్నారు అనేది మీకు ఇప్పుడు అర్థమయ్యింది. అతను జన్మించి 5 వేల సంవత్సరాలు అయ్యిందని మీరు అంటారు. వారు కూడా, క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితం భారత్ ప్యారడైజ్ గా ఉండేదని అంటారు. ఇస్లాముల కన్నా ముందు చంద్రవంశీయులు, వారి కన్నా ముందు సూర్యవంశీయులు ఉండేవారు. శాస్త్రాలలో సత్యయుగానికి లక్షల సంవత్సరాలుగా చూపించారు. ముఖ్యమైనది గీత. గీత ద్వారానే దేవీ దేవతా ధర్మ స్థాపన జరిగింది. అది సత్య-త్రేతా యుగాల వరకు నడిచింది, అనగా గీతా శాస్త్రం ద్వారా పరమపిత పరమాత్మ, ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసారు. ఆ తర్వాత అర్ధ కల్పము వరకు ఏ శాస్త్రమూ లేదు, ఏ ధర్మ స్థాపకుడూ లేరు. తండ్రి వచ్చి బ్రాహ్మణులను దేవతలుగా, క్షత్రియులుగా చేసారు, అనగా తండ్రి మూడు ధర్మాలను స్థాపన చేస్తారు. ఇది లీప్ ధర్మము, దీని ఆయువు తక్కువగా ఉంటుంది. సర్వశాస్త్రమయి శిరోమణి గీతను భగవంతుడు వినిపించారు. తండ్రి పునర్జన్మల్లోకి రారు. వారికి జన్మ ఉంటుంది కానీ నేను గర్భములోకి రాను అని తండ్రి అంటారు. నా పాలన జరగదు. సత్యయుగంలో జన్మించే పిల్లలు కూడా, గర్భ మహళ్ళలో ఉంటారు. రావణ రాజ్యంలో గర్భ జైలులోకి రావలసి ఉంటుంది. పాపాలను జైలులో అనుభవిస్తారు. గర్భములో ఉన్నప్పుడు, నేను ఇక పాపం చేయను అని ప్రతిజ్ఞ చేస్తారు కానీ ఇది పాపాత్ముల ప్రపంచము. గర్భం నుండి బయటకు రాగానే, మళ్ళీ పాపం చేయడం మొదలుపెడతారు. అక్కడి ప్రతిజ్ఞ అక్కడే ఉండిపోతుంది….. ఇక్కడ కూడా చాలా ప్రతిజ్ఞలను చేస్తారు – మేము పాపాలు చేయమని, పరస్పరంలో కామ ఖడ్గాన్ని ఉపయోగించమని అంటారు, ఎందుకంటే ఈ వికారము ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. సత్యయుగంలో విషము ఉండదు కావున మనుష్యులు ఆదిమధ్యాంతాలు అనగా 21 జన్మలు దుఃఖాన్ని అనుభవించరు ఎందుకంటే అది రామ రాజ్యము. దానిని ఇప్పుడు తండ్రి మళ్ళీ స్థాపన చేస్తున్నారు. సంగమంలోనే స్థాపన జరుగుతుంది కదా. ధర్మ స్థాపన చేసేందుకు ఎవరైతే వస్తారో, వారు ఏ పాపము చేయకూడదు. అర్ధ సమయం పుణ్యాత్ములుగా ఉంటారు, మళ్ళీ అర్ధ సమయం తర్వాత పాపాత్ములుగా అవుతారు. మీరు సత్య, త్రేతా యుగాలలో పుణ్యాత్మగా ఉంటారు, మళ్ళీ పాపాత్మగా అవుతారు. సతోప్రధాన ఆత్మ పై నుండి వచ్చినప్పుడు, అది శిక్షలు అనుభవించజాలదు. క్రీస్తు ఆత్మ ధర్మ స్థాపన చేసేందుకు వచ్చారు, వారికి ఎటువంటి శిక్ష లభించజాలదు. క్రీస్తును శిలువ పై ఎక్కించారని అంటారు కానీ అతని ఆత్మ ఎటువంటి వికర్మలను చేయలేదు. ఆ ఆత్మ ఎవరి శరీరంలోకైతే ప్రవేశిస్తుందో, వారికి దుఃఖం కలుగుతుంది, వారు సహనం చేస్తారు. ఎలాగైతే వీరిలోకి బాబా ప్రవేశిస్తారో, అక్కడ కూడా అలా జరుగుతుంది. శివబాబా సతోప్రధానమైనవారు. ఏదైనా దుఃఖము లేక కష్టము వీరి ఆత్మకు కలుగుతుంది, శివబాబాకు కలగదు. వారు సదా సుఖ, శాంతులతో ఉంటారు. వారు సదా సతోప్రధానులు. కానీ రావడమైతే ఈ పాత శరీరంలోకే వస్తారు కదా. ఇదే విధంగా క్రీస్తు ఆత్మ ఎవరిలోకైతే ప్రవేశించిందో, ఆ శరీరానికి దుఃఖం కలగవచ్చు. క్రీస్తు ఆత్మ దుఃఖాన్ని అనుభవించజాలదు ఎందుకంటే ఇంకా సతో, రజో, తమోలలోకి రావాల్సి ఉంది. కొత్త కొత్త ఆత్మలు కూడా వస్తాయి కదా. వారు ముందు తప్పకుండా సుఖాన్ని అనుభవించవలసి ఉంటుంది, దుఃఖాన్ని అనుభవించజాలరు. అలా లా లోనే లేదు. వీరిలో బాబా కూర్చొన్నారు, ఏ కష్టమైనా వీరికి (దాదాకు) కలుగుతుందే కానీ శివబాబాకు కాదు. కానీ ఈ విషయాలు మీకు తెలుసు, ఇంకెవరికీ తెలియవు.
ఈ రహస్యాలన్నింటినీ ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ సహజ రాజయోగం ద్వారానే స్థాపన జరిగింది, తర్వాత భక్తి మార్గంలో ఇవే విషయాలు గాయనం చేయబడతాయి. ఈ సంగమంలో ఏదైతే జరుగుతుందో, అది గాయనం చేయబడుతుంది. భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు, శివబాబా పూజ జరుగుతుంది. భక్తి మొట్టమొదటగా ఎవరు చేస్తారు. ఆ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేటప్పుడు పూజ్యులుగా ఉండేవారు, తర్వాత వామ మార్గంలోకి వస్తారు, అప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు – నిరాకార పరమపిత పరమాత్మ వీరి ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారని మొట్టమొదట పిల్లలైన మీ బుద్ధిలో రావాలి. ఈ విధంగా అర్థం చేయించేటువంటి స్థానము, మొత్తం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. తండ్రియే వచ్చి భారత్ కు మళ్ళీ స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. త్రిమూర్తి చిత్రం కింద ఇలా రాయబడి ఉంది – దైవీ ప్రపంచపు స్వరాజ్యము మీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము. శివబాబా వచ్చి పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు, యోగ్యులుగా చేస్తున్నారు. బాబా మనల్ని యోగ్యులుగా చేస్తున్నారని మీకు తెలుసు. మనం పతితులుగా ఉండేవారము కదా. పావనంగా అయినట్లయితే ఇక ఈ శరీరము ఉండదు. రావణుని ద్వారా మనం పతితులుగా అయ్యాము, మళ్ళీ పరమపిత పరమాత్మ పావనంగా తయారుచేసి, పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తారు. వారే జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు. ఈ నిరాకార బాబా మనల్ని చదివిస్తున్నారు. అందరూ కలిసి చదువుకోలేరు. మీరు కొద్దిమంది మాత్రమే, సమ్ముఖంగా కూర్చొన్నారు. ఇక మిగిలిన పిల్లలందరికీ, ఇప్పుడు శివబాబా బ్రహ్మా తనువులో కూర్చొని సృష్టి ఆదిమధ్యాంతాల నాలెడ్జ్ ను వినిపిస్తూ ఉండవచ్చు అని తెలుసు. ఆ మురళి రాత పూర్వకంగా వస్తుంది. ఇతర సత్సంగాలలో ఈ విధంగా భావించరు. ఈ రోజుల్లో టేప్ రికార్డరు కూడా వెలువడింది, కావున టేప్ లో నింపి పంపిస్తారు. వారు, ఫలానా పేరు కల గురువు వినిపిస్తున్నారని అంటారు, వారి బుద్ధిలో మనుష్యులే ఉంటారు. ఇక్కడ అటువంటి విషయము లేదు. ఇక్కడ నాలెడ్జ్ ఫుల్ అయిన నిరాకార తండ్రి ఉన్నారు. మనుష్యులను నాలెడ్జ్ ఫుల్ అని అనరు. గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ ఫుల్, పీస్ ఫుల్ (శాంతి స్వరూపులు), బ్లిస్ ఫుల్ (ఆనంద స్వరూపులు) అని పాడుతారు. మరి వారు ఇచ్చే వారసత్వం కూడా కావాలి కదా. వారిలో ఏవైతే గుణాలు ఉన్నాయో, అవి పిల్లలకు లభించాలి, ఇప్పుడు లభిస్తున్నాయి. గుణాలను ధారణ చేసి, మనం ఈ విధంగా లక్ష్మీ నారాయణుల వలె అవుతున్నాము. అందరూ రాజా-రాణులుగా అవ్వరు. రాజు, రాణి, మంత్రి….. అని అంటూ ఉంటారు. అక్కడ మంత్రి కూడా ఉండరు. మహారాజు-మహారాణులలో పవర్ ఉంటుంది. వికారులుగా అయినప్పుడు మంత్రులు మొదలైనవారు ఉంటారు. ఇంతకుముందు మినిస్టర్లు మొదలైనవారు కూడా ఉండేవారు కారు. అక్కడ ఒకే రాజు-రాణి యొక్క రాజ్యము నడిచేది. వారికి మంత్రి అవసరం ఏముంటుంది, వారు స్వయం యజమానులుగా ఉన్నప్పుడు, సలహా తీసుకునే అవసరం ఉండదు. ఇది చరిత్ర-భూగోళము. కానీ మొట్టమొదటగా లేస్తూ-కూర్చొంటూ, మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు, యోగం నేర్పిస్తున్నారు అన్నది బుద్ధిలోకి రావాలి. స్మృతి యాత్రలో ఉండాలి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. మనం పూర్తిగా పతితులుగా అయిపోయాము ఎందుకంటే వికారాల్లోకి వెళ్ళాము, అందుకే పాపాత్ములని అంటారు. సత్యయుగంలో పాపాత్ములు ఉండరు. అక్కడ పుణ్యాత్ములుంటారు. అది ప్రారబ్ధము, దాని కోసం మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు. మీది స్మృతి యాత్ర, దీనిని భారత్ యొక్క యోగమని అంటారు కానీ అర్థం తెలియదు. యోగము అనగా స్మృతి, దీనితో వికర్మలు వినాశనమవుతాయి. తర్వాత ఈ శరీరాన్ని వదిలి, ఇంటికి వెళ్ళిపోతాము, దానిని స్వీట్ హోమ్ అని అంటారు. నేను ఆ శాంతిధామ నివాసిని అని ఆత్మ అంటుంది. మనం అక్కడ నుండి అశరీరులుగా వచ్చాము, ఇక్కడ పాత్రను అభినయించేందుకు శరీరాన్ని తీసుకున్నాము. పంచ వికారాలను మాయ అంటారని కూడా అర్థం చేయించారు, ఇవి ఐదు భూతాలు. కామమనే భూతము, క్రోధమనే భూతము, నంబరువన్ భూతము దేహాభిమానము.
సత్యయుగంలో ఈ వికారాలు ఉండవని, దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారని తండ్రి అర్థం చేయిస్తారు. వికారీ ప్రపంచాన్ని నిర్వికారిగా చేయడము, ఇది కేవలం తండ్రి పని. వారినే సర్వశక్తివంతుడు, జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు అని అంటారు. ఈ సమయంలో అందరూ భ్రష్టాచారం ద్వారానే జన్మిస్తారు. సత్యయుగంలోనే నిర్వికారీ ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు మీరు వికారుల నుండి నిర్వికారులుగా అవ్వాలని తండ్రి అంటారు. వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారు అని అంటారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ అని తండ్రి అర్థం చేయిస్తారు. మృత్యులోకమే సమాప్తం కానున్నది, ఇక దీని తర్వాత వికారీ మనుష్యులు ఉండరు. అందుకే పవిత్రంగా అవుతామని తండ్రితో ప్రతిజ్ఞ చేయాలి. బాబా, మేము మీ నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటామని అంటారు. వారు అసత్యపు ప్రతిజ్ఞలను చేస్తారు. ఏ భగవంతుని పేరు మీద ప్రతిజ్ఞలను చేస్తారో, వారి గురించి తెలియదు. వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, వారి నామ, రూప, దేశ, కాలాలు ఏమిటి అనేది ఏమీ తెలియదు. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. ఇప్పుడు మీకు పరిచయం లభిస్తూ ఉంది. ప్రపంచమంతటిలోనూ ఎవరికీ గాడ్ ఫాదర్ గురించి తెలియదు. తండ్రిని పిలుస్తారు కూడా, పూజలు కూడా చేస్తారు కానీ వారి కర్తవ్యం గురించి తెలియదు. పరమపిత పరమాత్మ మన తండ్రి, టీచరు, సద్గురువు అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ తండ్రి స్వయంగా, నేను మీ తండ్రిని, నేను ఈ శరీరంలో ప్రవేశించాను అని తమ పరిచయాన్నిచ్చారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది. ఎవరి స్థాపన జరుగుతుంది. బ్రాహ్మణుల స్థాపన జరుగుతుంది. తర్వాత బ్రాహ్మణులైన మీరు చదువుకొని దేవతలుగా అవుతారు. నేను వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తాను. తండ్రి అంటారు – నేను కల్పం యొక్క సంగమయుగములోనే వస్తాను. కల్పము 5 వేల సంవత్సరాలు ఉంటుంది. ఈ సృష్టి చక్రం అయితే తిరుగుతూ ఉంటుంది. నేను పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయడానికి వస్తాను. నేను పాత ధర్మాలను వినాశనం చేయించి, ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. పిల్లలను చదివిస్తాను, మీరు చదువుకొని 21 జన్మలకు మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, ప్రజలు అందరూ దేవతలే. ఇకపోతే పురుషార్థం అనుసారంగా ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో, అదే కల్ప-కల్పము నడుస్తుంది. ఇక కల్ప-కల్పము ఇటువంటి పురుషార్థమునే చేస్తామని, ఇటువంటి పదవినే పొందుతామని మీరు అర్థం చేసుకుంటారు. మమ్మల్ని నిరాకార భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వారిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేయకుండా వికర్మలు వినాశనమవ్వజాలవు. తాము ఎన్ని జన్మలు తీసుకుంటారు అనేది కూడా మనుష్యులకు తెలియదు. శాస్త్రాలలో ఎవరో 84 లక్షల జన్మలుంటాయని వ్యర్థ ప్రలాపాలు రాసారు. 84 జన్మలుంటాయని ఇప్పుడు మీకు తెలుసు. ఇది అంతిమ జన్మ, తర్వాత మనం స్వర్గంలోకి వెళ్ళాలి. ముందు మూలవతనానికి వెళ్ళి, తర్వాత స్వర్గంలోకి వస్తాము. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పవిత్రంగా అవుతామని తండ్రితో ఏ ప్రతిజ్ఞనైతే చేసారో, దానిపై పక్కాగా ఉండాలి. కామము, క్రోధము మొదలైన భూతాలపై తప్పకుండా విజయాన్ని పొందాలి.
2. నడుస్తూ-తిరుగుతూ, ప్రతి కార్యాన్ని చేస్తూ, చదివించే తండ్రిని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది కనుక ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి.
వరదానము:-
సదా ఒక్క తండ్రి పట్ల లగనములో మరియు తండ్రి కర్తవ్యం పట్ల లగనములో ఎంతగా నిమగ్నమవ్వాలంటే, ఇక ప్రపంచంలో ఏ వస్తువైనా ఉందా, ఏ వ్యక్తి అయినా ఉన్నారా అన్నట్లు అనుభవమవ్వాలి. ఈ విధంగా ఒకే లగనములో, ఒకే భరోసాలో, ఏకరస అవస్థలో ఉండే పిల్లలు సదా నిర్విఘ్నంగా అయి ఎక్కే కళను అనుభవం చేస్తారు. వారు కారణాన్ని పరివర్తన చేసి, నివారణా రూపంగా చేసేస్తారు. కారణాన్ని చూసి బలహీనులుగా అవ్వరు, నివారణా స్వరూపులుగా అయిపోతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!