29 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris
28 April 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - పావనంగా అయినట్లయితే ఆత్మిక సేవకు యోగ్యులుగా అవుతారు, దేహీ-అభిమానులైన పిల్లలు ఆత్మిక యాత్రలో ఉంటారు మరియు ఇతరుల చేత కూడా ఇదే యాత్రను చేయిస్తారు”
ప్రశ్న: -
సంగమంలో పిల్లలైన మీరు చేసుకునే సంపాదనయే సత్యమైన సంపాదన – అది ఎలా?
జవాబు:-
ఇప్పుడు చేసుకునే సంపాదన 21 జన్మల వరకు కొనసాగుతుంది, మీరు ఎప్పుడూ దివాలా తీయరు. జ్ఞానాన్ని వినడం మరియు వినిపించడం, స్మృతి చేయడం మరియు చేయించడం – ఇదే సత్యాతి-సత్యమైన సంపాదన, దీనిని సత్యాతి-సత్యమైన తండ్రియే మీకు నేర్పిస్తారు. ఇటువంటి సంపాదనను మొత్తం కల్పంలో ఎవరూ చేసుకోలేరు. వేరే సంపాదన ఏదీ మీతో పాటు రాదు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
మేము ఆ మార్గంలో నడవాలి….. (హమే ఉన్ రాహోం పర్ చల్నా హై…..)
ఓంశాంతి. భక్తి మార్గంలో పిల్లలు చాలా ఎదురుదెబ్బలు తిన్నారు. భక్తి మార్గంలో చాలా భావనతో యాత్రలు చేసేందుకు వెళ్తారు, రామాయణం మొదలైనవి వింటారు. ఎంత ప్రేమగా కూర్చొని కథలను వింటారంటే, అవి వింటూ-వింటూ ఏడుపు కూడా వచ్చేస్తుంది. మా భగవంతుని, భగవతి అయిన సీతను దొంగ అయిన రావణుడు ఎత్తుకువెళ్ళిపోయాడు. అది వింటున్నప్పుడు కూర్చొని ఏడుస్తారు. ఇవన్నీ కట్టు కథలు, వీటి వల్ల లాభమేమీ లేదు. హే పతిత పావనా రండి, వచ్చి దుఃఖిత ఆత్మలైన మమ్మల్ని సుఖమయంగా చేయండి అని పిలుస్తారు. కానీ, ఆత్మ దుఃఖిస్తుంది అని వారు భావించరు, ఎందుకంటే వారు ఆత్మను నిర్లేపి అని అంటారు. ఆత్మ సుఖ-దుఃఖాలకు అతీతమైనదని భావిస్తారు. ఇలా ఎందుకు అంటారు? ఎందుకంటే పరమాత్మ సుఖ-దుఃఖాలకు అతీతమైనవారు కావున వారి పిల్లలు సుఖ-దుఃఖాల్లోకి ఎలా వస్తారు అని భావిస్తారు. ఇప్పుడు పిల్లలు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞాన మార్గంలో కూడా అప్పుడప్పుడు గ్రహచారం కూర్చొంటుంది, అప్పుడప్పుడు ఇంకేదో జరుగుతుంది. ఒక్కోసారి ప్రఫుల్లితులై ఉంటారు, ఒక్కోసారి వాడిపోయిన ముఖముతో ఉంటారు. ఇది మాయతో జరిగే యుద్ధము. మాయ పైనే విజయాన్ని పొందాలి. మూర్ఛితులు అయినప్పుడు ‘మన్మనాభవ’ అనే సంజీవని మూలికను ఇవ్వడం జరుగుతుంది. భక్తి మార్గంలో చాల ఆర్భాటం ఉంటుంది. దేవతల మూర్తులను ఎంతగా అలంకరిస్తారు, సత్యమైన ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ ఆభరణాలు స్వామి యొక్క ఆస్తి అయినట్లు. స్వామి ఆస్తి అనగా పూజారులది లేక ట్రస్టీలది అవుతుంది. మేము చైతన్యంలో చాలా వజ్ర వైఢూర్యాలతో అలంకరించబడి ఉండేవారమని, మళ్ళీ పూజారులుగా అయినప్పుడు కూడా చాలా ఆభరణాలను ధరిస్తామని పిల్లలైన మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఏమీ లేవు. చైతన్యమైన రూపంలోనూ ధరించారు మరియు జడమైన రూపంలోనూ ధరించారు. ఇప్పుడు ఏ ఆభరణాలు లేవు. పూర్తిగా సాధారణంగా ఉన్నారు. నేను సాధారణ తనువులోకి వస్తానని, రాజరికపు ఆర్భాటమేమీ ఉండదు అని తండ్రి అంటారు. సన్యాసులకు కూడా చాలా ఆర్భాటము ఉంటుంది. సత్యయుగంలో ఆత్మలమైన మనము ఏ విధంగా పవిత్రంగా ఉండేవారము అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మన శరీరాలు కూడా పవిత్రంగా ఉండేవి. ఆ అలంకరణ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సుందరంగా ఉంటే, వారికి అలంకరించుకునే అభిరుచి కూడా ఉంటుంది. మీరు కూడా సుందరంగా ఉన్నప్పుడు చాలా మంచి-మంచి ఆభరణాలను ధరించేవారు. వజ్రాలతో పొదగబడిన పెద్ద పెద్ద హారాలు మొదలైనవి ధరించేవారు. ఇక్కడ ప్రతి వస్తువు నల్లగా ఉంటుంది. చూడండి, గోవులు కూడా నల్లగా అవుతూ వచ్చాయి. బాబా శ్రీనాథ ద్వారానికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలా మంచి గోవులు ఉండేవి. కృష్ణుని గోవును చాలా సుందరంగా చూపిస్తారు. ఇక్కడైతే కొన్ని ఒకలా, కొన్ని మరోలా ఉన్నాయి, ఎందుకంటే ఇది కలియుగము. ఇలాంటి గోవులు అక్కడ ఉండవు. పిల్లలైన మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అక్కడ మీ అలంకరణ కూడా అంత సుందరంగా ఉంటుంది. ఆలోచించండి – గోవులైతే అక్కడ తప్పకుండా కావాలి. అక్కడి గోవుల పేడ కూడా ఎలా ఉండి ఉండవచ్చు. అందులో ఎంత శక్తి ఉంటుంది. భూమికి ఎరువు కావాలి కదా. ఎరువు వేసినట్లయితే మంచి ధాన్యం పండుతుంది. అక్కడ, అన్ని వస్తువులు మంచి శక్తి కలిగినవిగా ఉంటాయి. ఇక్కడైతే ఏ వస్తువులోనూ శక్తి లేదు. ప్రతి వస్తువు పూర్తిగా పవర్ లెస్ గా (శక్తిహీనం) అయిపోయింది. పిల్లలు సూక్ష్మవతనానికి వెళ్ళేవారు. అక్కడ ఎంత మంచి-మంచి పెద్ద ఫలాలను తినేవారు, శూబీ రసము మొదలైనవి తాగేవారు. ఇవన్నింటినీ సాక్షాత్కారం చేయించేవారు. అక్కడ తోటమాలులు ఫలాలు మొదలైనవి ఎలా కోసి ఇస్తారు. సూక్ష్మవతనంలోనైతే ఫలాలు మొదలైనవి ఉండజాలవు. ఇదంతా సాక్షాత్కారమవుతుంది. వైకుంఠమైతే ఇక్కడే ఉంటుంది కదా. వైకుంఠం ఎక్కడో పైన ఉంటుందని మనుష్యులు భావిస్తారు. వైకుంఠము సూక్ష్మవతనములోనూ ఉండదు, మూలవతనములోనూ ఉండదు. ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఏవైతే సాక్షాత్కారాలలో చూస్తారో, వాటిని తర్వాత ఈ కళ్ళ ద్వారా చూస్తారు. ఎలాంటి హోదానో, అలాంటి సామాగ్రి ఉంటుంది. రాజుల మహళ్ళు ఎంత మంచి-మంచివి ఉంటాయో చూడండి. జైపూర్ లో చాలా మంచి-మంచి మహళ్ళు నిర్మించబడ్డాయి. కేవలం ఆ మహళ్ళను చూసేందుకే మనుష్యులు వెళ్తారు, దానికి కూడా టికెట్ ఉంటుంది. ఆ మహళ్ళను విశేషంగా చూడడం కోసం తెరిచి ఉంచుతారు. చూడడానికి వెళ్ళినవారు వేరే మహళ్ళలో ఉంటారు. కలియుగంలో ఇలా ఉంటుంది. ఇది పతిత ప్రపంచము. కానీ ఎవరూ తమను తాము పతితులుగా భావించరు. మేము పతితులుగా ఉండేవారము, దేనికీ కొరగాని వారిగా ఉండేవారము, మళ్ళీ మేము తెల్లగా అవుతామని ఇప్పుడు మీరు భావిస్తారు. అక్కడ ప్రపంచమే ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ఇక్కడ అమెరికా మొదలైన వాటిలో ఫస్ట్ క్లాస్ మహళ్ళు ఉన్నాయి, కానీ అక్కడి వాటితో పోలిస్తే ఇవేమీ కాదు, ఎందుకంటే ఇవి అల్పకాలికమైన సుఖాన్ని ఇచ్చేవి. అక్కడైతే ఫస్ట్ క్లాస్ మహళ్ళు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ గోవులు ఉంటాయి. అక్కడ గోపాలులు కూడా ఉంటారు. శ్రీ కృష్ణుడిని గొపాలుడని అంటారు కదా. ఇక్కడ గోవులను సంభాళించేవారు, మేము గోపాలులము, కృష్ణుని వంశానికి చెందినవారమని అంటారు. వాస్తవానికి కృష్ణుని వంశావళి అని అనరు, కృష్ణుని రాజధానికి చెందినవారని అంటారు. షావుకారుల వద్ద గోవులుంటే, వాటిని సంభాళించే గోపాలులు కూడా ఉంటారు. ఈ గోపాలులు అనే పేరు సత్యయుగానికి చెందినది. ఇది నిన్నటి విషయము. నిన్న మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారిగా ఉండేవారము, తర్వాత పతితులుగా అయ్యాము కావున స్వయాన్ని హిందువులని పిలుచుకుంటాము. మీరు ఆది సనాతన దేవి దేవతా ధర్మము వారా లేక హిందూ ధర్మము వారా అని అడగండి. ఈ రోజుల్లో అందరూ హిందువులు అని రాస్తారు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారో చెప్పండి అని బాబా ప్రశ్న అడుగుతారు. శివబాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తున్నారు. రాముడు లేక శివబాబా శ్రీమతమనుసారంగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అయ్యింది. తర్వాత రావణ రాజ్యం వస్తుంది, వికారాల్లోకి వెళ్తారు. భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు హిందువులని పిలుచుకుంటారు. ఇప్పుడు ఎవరూ తమను తాము దేవతలు అని చెప్పుకోలేరు. రావణుడు వికారులుగా చేసాడు, తండ్రి వచ్చి నిర్వికారులుగా చేస్తారు. మీరు ఈశ్వరీయ మతం ద్వారా దేవతలుగా అవుతున్నారు. తండ్రియే వచ్చి బ్రాహ్మణులైన మిమ్మల్ని దేవతలుగా చేస్తారు. మెట్లు ఎలా దిగుతారు అనేది పిల్లలైన మీ బుద్ధిలో నంబరువారుగా కూర్చొంటుంది. మిగిలిన మనుష్యులందరూ ఆసురీ మతంపై నడుస్తున్నారని, మీరు ఈశ్వరీయ మతంపై నడుస్తున్నారని మీకు తెలుసు. రావణుని మతంపై మెట్లు దిగుతూ వచ్చారు. 84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి నంబరు జన్మను తీసుకుంటారు. ఈశ్వరీయ బుద్ధి ద్వారా మీరు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు. తండ్రి వచ్చి మనల్ని ఇంత పావనంగా తయారుచేస్తున్న సమయంలో మన ఈ జీవితం చాలా అమూల్యమైనది, ఇది సాహసమయమైనది. మనం ఆత్మిక సేవకు యోగ్యులుగా అవుతాము. వారు దైహిక సమాజ సేవకులు, వారు దేహాభిమానంలో ఉంటారు. మీరు దేహీ-అభిమానులు. ఆత్మలను ఆత్మిక యాత్రకు తీసుకువెళ్తారు. మీరు సతోప్రధానంగా ఉండేవారని, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారని బాబా అర్థం చేయిస్తారు. సతోప్రధానంగా ఉన్నవారిని పావనులు అని, తమోప్రధానంగా ఉన్నవారిని పతితులు అని అంటారు. ఆత్మలోనే మాలిన్యం చేరుకుంది. ఆత్మనే సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. ఎంత స్మృతిలో ఉంటారో, అంత పవిత్రంగా అవుతారు, లేదంటే తక్కువ పవిత్రంగా అవుతారు, పాపాల భారం తలపై మిగిలిపోతుంది. ముందు ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి, తర్వాత ప్రతి ఒక్కరి పాత్ర వేరు వేరుగా ఉంటుంది. అందరి పాత్ర ఒకేలా ఉండదు. అందరికన్నా ఉన్నతమైన పాత్ర బాబాది, తర్వాత బ్రహ్మా-సరస్వతులది ఎంత పాత్ర ఉంది. ఎవరైతే స్థాపన చేస్తారో, వారే పాలన కూడా చేస్తారు. పెద్ద పాత్ర వారిదే. మొదట శివబాబా, తర్వాత బ్రహ్మా-సరస్వతులు, వీరు పునర్జన్మలలోకి వస్తారు. శంకరుడు కేవలం సూక్ష్మ రూపాన్ని మాత్రమే ధరిస్తాడు. అంతేకానీ, శంకరుడు ఏదైనా శరీరాన్ని అద్దెకు తీసుకుంటారని కాదు. కృష్ణుడికి తన శరీరముంది. ఇక్కడ కేవలం శివబాబా మాత్రమే శరీరాన్ని అద్దెకు తీసుకుంటారు. పతిత శరీరంలోకి, పతిత ప్రపంచంలోకి వచ్చి ముక్తి-జీవన్ముక్తులలోకి తీసుకువెళ్ళే సేవను చేస్తారు. ముందు ముక్తిలోకి వెళ్ళవలసి ఉంటుంది. నాలెడ్జ్ ఫుల్ అయిన తండ్రి ఒక్కరే పతితపావనుడు, వారినే శివబాబా అని అంటారు. శంకరుడిని బాబా అని అంటే అది శోభించదు. శివబాబా అన్న పదము చాలా మధురమైనది. శివునిపై కొందరు జిల్లేడు పుష్పాలను వేస్తారు, కొందరు ఇంకేవో వేస్తారు. కొందరు పాలను కూడా పోస్తారు.
తండ్రి పిల్లలకు అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మొత్తం ఆధారమంతా యోగంపై ఉందని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. యోగం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. యోగం చేసేవారికి జ్ఞాన ధారణ కూడా బాగా జరుగుతుంది. వారు తమ ధారణలో నడుస్తూ ఉంటారు, ఎందుకంటే వారు ఇతరులకు కూడా వినిపించవలసి ఉంటుంది. ఇది కొత్త విషయము. ఎవరికైతే భగవంతుడు డైరెక్టుగా వినిపించారో, వారే విన్నట్లు, ఆ తర్వాత ఈ జ్ఞానం ఇక ఉండదు. ఇప్పుడు తండ్రి మీకు ఏదైతే వినిపిస్తున్నారో, అది మీరు ఇప్పుడు వింటున్నారు. ధారణ జరుగుతుంది, తర్వాత ప్రారబ్ధపు పాత్రను అభినయించవలసి ఉంటుంది. జ్ఞానం వినడము, వినిపించడము ఇప్పుడే జరుగుతుంది. సత్యయుగంలో ఈ పాత్ర ఉండదు. అక్కడ ఉండేదే ప్రారబ్ధపు పాత్ర. మనుష్యులు బ్యారిస్టర్ చదువును చదువుతారు, తర్వాత బ్యారిస్టర్ గా అయి సంపాదిస్తారు. ఇది ఎంత గొప్ప సంపాదన, దీని గురించి ప్రపంచం వారికి తెలియదు. సత్యమైన బాబా మా చేత సత్యమైన సంపాదనను చేయిస్తున్నారని మీకు తెలుసు. మీరు ఎప్పుడూ దివాలా తీయరు. ఇప్పుడు మీరు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు. ఇది మళ్ళీ 21 జన్మలు మీతో పాటు ఉంటుంది. ఆ సంపాదన మీతో పాటు రాదు. ఈ సంపాదన మీతో పాటు వస్తుంది కావున మీరు ఇటువంటి సంపాదనను చేసుకోవాలి. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప, ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. మీలో కూడా కొందరు పదే-పదే మర్చిపోతూ ఉంటారు. తండ్రిని మరియు వారసత్వాన్ని మర్చిపోకూడదు. ముఖ్యమైన విషయము ఒక్కటే, తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వం లభిస్తుంది, 21 జన్మలకు నిరోగి శరీరం ఉంటుంది. వృద్ధాప్యం వరకు అకాల మృత్యువు జరగదు. పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. తండ్రి స్మృతి ముఖ్యమైనది, ఇందులోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. తుఫానులు తీసుకొస్తుంది. అనేక రకాల తుఫాన్లు వస్తాయి. తండ్రిని స్మృతి చేయాలని మీరు అంటారు కానీ చేయలేకపోతారు. స్మృతిలోనే చాలా మంది ఫెయిల్ అవుతారు. చాలా మంది యోగంలో బలహీనంగా ఉన్నారు. ఎంత వీలైతే అంత యోగంలో దృఢంగా అవ్వాలి. ఇకపోతే, బీజము మరియు వృక్షము యొక్క జ్ఞానము పెద్ద విషయమేమీ కాదు.
తండ్రి అంటారు – నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి చేయడం ద్వారా, నన్ను తెలుసుకోవడం ద్వారా మీరు అంతా తెలుసుకుంటారు. స్మృతిలోనే అంతా నిండి ఉంది. స్వీట్ బాబా అయిన శివబాబాను స్మృతి చేయాలి. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు. వారు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు. 21 జన్మల కోసం ఉన్నతాతి ఉన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. సదా సుఖమయంగా, అమరులుగా చేస్తారు. మీరు అమరపురికి యజమానులుగా అవుతారు కావున ఇటువంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేయకపోతే, మిగిలినవన్నీ గుర్తుకు వస్తాయి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ ఈశ్వరీయ జీవితం చాలా-చాలా అమూల్యమైనది, ఈ జీవితంలో ఆత్మ మరియు శరీరము, రెండింటినీ పావనంగా తయారు చేసుకోవాలి. ఆత్మిక యాత్రలో ఉంటూ, ఇతరులకు కూడా ఈ యాత్రను నేర్పించాలి.
2. ఎంత వీలైతే అంత, సత్యమైన సంపాదనలో నిమగ్నమవ్వాలి. నిరోగిగా అయ్యేందుకు స్మృతిలో దృఢంగా ఉండాలి.
వరదానము:-
మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అయ్యేవారిలో ఏ విధమైన తెలియనితనము ఉండదు. ఫలానా విషయం గురించి మాకు తెలియనే తెలియదు అని వారు తమను తాము విడిపించుకోలేరు. జ్ఞాన స్వరూప పిల్లల్లో ఏ విషయానికి సంబంధించిన అజ్ఞానము ఉండజాలదు మరియు ఎవరైతే యోగయుక్తులుగా ఉంటారో, వారికి ముందే అంతా తెలిసినట్లుగా అనుభవమవుతుంది. మాయ యొక్క మెరుపు, శోభ తక్కువేమీ కాదని, మాయ కూడా చాలా శోభాయమానంగా ఉంటుందని, అందుకే దాని నుండి సురక్షితంగా ఉండాలని వారికి తెలుసు. ఎవరైతే అన్ని రూపాలలోనూ మాయ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారో, వారు ఓడిపోవడమనేది అసంభవము.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!