28 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

August 27, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘హోలీ జరుపుకోవడము అనగా దృఢ సంకల్పమనే అగ్నిలో బలహీనతలను కాల్చడము మరియు మిలనము యొక్క ఆనందాన్ని జరుపుకోవడము’’

♫ వినండి ఆడియో (audio)➤

ఈ రోజు ఆత్మిక పూలతోటకు యజమాని అయిన బాప్ దాదా డబల్ పూలతోటను చూస్తున్నారు. (ఈరోజు స్టేజి పైన చాలా సుందరమైన పూలతోట అలంకరించబడి ఉంది). ఒక వైపు ప్రకృతి సౌందర్యము మరియు రెండవ వైపు ఆత్మిక గులాబీల ఆత్మిక పూలతోట యొక్క శోభ ఉంది. డ్రామాలో ఆది కాలమైన సత్యయుగంలో ప్రకృతి యొక్క సతోప్రధానమైన సౌందర్యము మాస్టర్ ఆదిదేవ్, ఆది శ్రేష్ఠ ఆత్మలైన మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది. ఈ సమయంలో అంతిమ కాలంలో కూడా ప్రకృతి సౌందర్యాన్ని చూస్తున్నారు. కానీ ఆది కాలానికి మరియు అంతిమ కాలానికి ఎంత తేడా ఉంది! మీ సత్యయుగీ రాజ్యంలో ప్రకృతి యొక్క స్వరూపము ఎంత శ్రేష్ఠంగా, సతోప్రధానంగా, సుందరంగా ఉంటుంది! అక్కడి పూలతోటకు మరియు ఇక్కడి పూలతోటలకు ఎంత తేడా ఉంది! ఆ వాస్తవిక సుగంధాన్ని అనుభవం చేసారు కదా? అయినా కూడా శ్రేష్ఠ ఆత్మలైన మీరు ప్రకృతి పతులు. ప్రకృతి పతులు, కనుక ప్రకృతి యొక్క ఆటను చూసి హర్షిస్తారు. ప్రకృతి అలజడి చేసినా కానీ, ప్రకృతి సుందరమైన ఆటను చూపించినా కానీ – రెండింటిలోనూ ప్రకృతిపతి ఆత్మలు సాక్షిగా అయి ఆటను చూస్తారు. ఆటలో ఆనందాన్ని పొందుతారు, గాభరాపడరు, అందుకే బాప్ దాదా తపస్య ద్వారా సాక్షీతనపు స్థితి అనే ఆసనంపై స్థిరంగా, నిశ్చలంగా స్థితులయ్యే విశేషమైన అభ్యాసాన్ని చేయిస్తున్నారు. మరి ఈ స్థితి అనే ఆసనము అందరికీ మంచిగా అనిపిస్తుందా లేక అలజడి చెందే ఆసనము మంచిగా అనిపిస్తుందా? స్థిరమైన ఆసనము మంచిగా అనిపిస్తుంది కదా. ప్రకృతి ద్వారా గానీ, వ్యక్తుల ద్వారా గానీ ఏ విషయం జరిగినా, రెండూ స్థిరమైన స్థితి అనే ఆసనాన్ని కొద్దిగా కూడా కదిలించలేవు. ఇంత పక్కాగా ఉన్నారు కదా లేక ఇప్పుడింకా అవ్వాలా?

ప్రకృతికి కూడా ఐదుగురు ఆటగాళ్ళు ఉన్నారు మరియు మాయకు కూడా ఐదుగురు ఆటగాళ్ళు ఉన్నారు. ఈ పది మంది ఆటగాళ్ళ గురించి బాగా తెలుసు కదా? ఆటగాడు ఆట లేకుండా ఉండగలరా? ఒకసారి ఒక ఆటగాడు ఎదురుగా వస్తారు, మరోసారి మరొకరు ఎదురుగా వస్తారు. ఈ రోజుల్లో కూడా పాత ప్రపంచంలో ఆటను చూడడానికి చాలా ఆసక్తి ఉంటుంది కదా? ఎంత ప్రేమతో ఆటను చూస్తారు. వారు పాత ప్రపంచానికి చెందినవారు మరియు మీరు సంగమయుగీ బ్రాహ్మణ ఆత్మలు, కనుక ఆటను చూస్తూ ఆనందించాలా లేక గాభరాపడాలా? కొంతమంది పడిపోతారు, కొంతమంది పడదోస్తారు, కానీ ఆట చూసేవారికి పడిపోవడము చూసి కూడా ఆనందమనిపిస్తుంది మరియు విజయం ప్రాప్తించుకోవడము చూసి కూడా ఆనందమనిపిస్తుంది. కనుక ఇది కూడా చాలా పెద్ద ఆట. కేవలం ఆసనాన్ని వదలకండి, అంతే. ఎవరు ఎంతగా కదిలించినా కానీ శక్తిశాలి ఆత్మలైన మీరు కదలరు. కనుక బాప్ దాదా ఈ రోజు ఆత్మిక గులాబీలు ప్రతి ఒక్కరినీ చూస్తున్నారు. ఎప్పుడైతే పూలతోటలోకి పిలిచారో, అప్పుడు పూలతోటలోని ఆకులను చూస్తారా లేక పుష్పాలను చూస్తారా? దీనిని కూడా బాగా అలంకరించారు. శ్రమ చేసినవారి అద్భుతం బాగుంది. కానీ బాప్ దాదా ఆత్మిక పుష్పాలను చూస్తున్నారు. వెరైటీ అయితే ఉంది కదా. కొందరు చాలా సుందరమైన రంగు, రూపం కలవారు. రంగు కూడా ఉంది, రూపం కూడా ఉంది. మరియు కొందరు రంగు, రూపము మరియు సుగంధం కలవారు, కొందరు కేవలం రంగు, రూపం కలవారు. రంగు మరియు రూపమైతే పిల్లలందరిలో వచ్చేసింది ఎందుకంటే తండ్రి సాంగత్యమనే రంగు అయితే అందరికీ అంటుకుంది. ఏదైనా వ్యవహారానికి చెందిన విషయాలలో, పురుషార్థం యొక్క విషయాలలో సంపూర్ణ సంతుష్టత లేకపోయినా కానీ తండ్రి సాంగత్యమనే రంగు అందరికీ అతి ప్రియంగా అనిపిస్తుంది, అందుకే రంగు అందరిలోనూ వచ్చేసింది మరియు రూపం కూడా పరివర్తన అయిపోయింది ఎందుకంటే బ్రాహ్మణాత్మలుగా అయ్యారు. ఎటువంటి పురుషార్థీ ఆత్మ అయినా కానీ, బ్రాహ్మణాత్మగా అవ్వడముతోనే రూపము తప్పకుండా మారుతుంది. బ్రాహ్మణాత్మలకు ఉండే మెరుపు, సౌందర్యము ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలోనూ వచ్చేస్తుంది, అందుకే రంగు మరియు రూపము అందరిలో కనిపిస్తూ ఉంది. సుగంధము నంబరువారుగా ఉంది. సుగంధము అంటే సంపూర్ణ పవిత్రత. మామూలుగా ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారు బ్రహ్మాకుమారులు-బ్రహ్మాకుమారీలని పిలవబడతారు. కుమార్ మరియు కుమారీగా అవ్వడము అనగా పవిత్రంగా అవ్వడము. పవిత్రత యొక్క పరిభాష అతి సూక్ష్మమైనది. కేవలం బ్రహ్మచర్యం కాదు. తనువు ద్వారా బ్రహ్మచారిగా అవ్వడము సంపూర్ణ పవిత్రత అని అనరు. మనసు ద్వారా కూడా బ్రహ్మచారిగా ఉండాలి అనగా మనసు కూడా తండ్రి ఆకర్షణలోకి తప్ప ఇతర ఏ విధమైన ఆకర్షణలోకి రాకూడదు. తనువు ద్వారా కూడా బ్రహ్మచారి, సంబంధంలో కూడా బ్రహ్మచారి, సంస్కారాలలో కూడా బ్రహ్మచారి. దీని పరిభాష అతి ప్రియమైనది మరియు అతి గుహ్యమైనది. దీని విస్తారాన్ని తర్వాత వినిపిస్తారు. ఈ రోజైతే హోలీ జరుపుకోవాలి కదా, గుహ్యమైన చదువు కాదు, ఈ రోజు జరుపుకోవాలి.

హోలీ జరుపుకునేవారు ఎవరు? హోలీ హంసలు. హోలీ హంసలు ఎంత ప్రియమైనవారు! హంసలు సదా నీటిలో ఈదుతూ ఉంటాయి. హోలీ హంసలు కూడా సదా జ్ఞానమనే నీటిలో ఈదేవారు. ఎగిరేవారు మరియు ఈదేవారు. మీ అందరికీ కూడా ఎగరడము మరియు ఈదడము తెలుసు కదా, జ్ఞానాన్ని మననము చేయడము, దీనిని అంటారు జ్ఞానామృతంలో ఈదడము మరియు ఎగరడము అనగా సదా ఉన్నతమైన స్థితిలో ఉండడము. రెండూ తెలుసు కదా? అందరి మనసులో తండ్రిపై ప్రేమ అయితే 100 శాతం కన్నా కూడా ఎక్కువగా ఉంది మరియు తండ్రికి కూడా ప్రతి ఒక్క బిడ్డపై ప్రేమ ఉంది, వారు పడిపోతున్నా కానీ, ఎక్కుతూ ఉన్నా కానీ, ఆడుతూ ఉన్నా కానీ తండ్రికి ప్రేమ ఉంది. తండ్రి ఆటను చూసి వీరు కొంచెం అల్లరి చేసే బిడ్డ అని భావిస్తారు. పిల్లలందరూ ఒకేవిధంగా అయితే ఉండరు కదా. కొంతమంది అల్లరిగా, కొంతమంది గంభీరముగా, కొంతమంది రమణీకముగా ఉంటారు, కొంతమంది చాలా ఫాస్ట్ నేచర్ కలవారిగా ఉంటారు. అయినా కూడా పిల్లలే కదా. పిల్లలు అన్న పదమే అతి ప్రియమైనది. ఎలాగైతే మీ అందరికీ తండ్రి అన్న పదము ప్రియమైనదో, అలాగే తండ్రికి పిల్లలు ప్రియమైనవారు. తండ్రి ఎప్పుడూ ఏ బిడ్డతోనూ నిరాశ చెందరు. సదా శుభమైన ఆశలను పెట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా పక్కకు తప్పుకున్నా కానీ బాప్ దాదా వారి పట్ల కూడా ఆశను పెట్టుకుంటారు, ఈరోజు కాకపోతే రేపు వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్తారు? ఎలాగైతే శారీరక లెక్కాచారము వలన కొందరు ఎక్కువ వ్యాధిగ్రస్థులుగా అవుతారు, వారికి నయమవ్వడములో కూడా ఎక్కువ సమయం పడుతుంది. మరియు ఎవరైతే కొద్ది సమయం కోసం వ్యాధిగ్రస్థులుగా అవుతారో, వారికి త్వరగా నయమవుతుంది. కానీ ఇరువురు వ్యాధిగ్రస్థులే. ఎలాంటి వ్యాధిగ్రస్థులు అయినా సరే, స్థూల రీతి అనుసారంగా కూడా వ్యాధిగ్రస్థులు పట్ల ఎప్పుడూ ఆశను వదులుకోవడము జరగదు. ఈ రోజు కాకపోతే రేపు నయమవుతారు అని ఎల్లప్పుడూ ఆశను పెట్టుకోవడము జరుగుతుంది. అందుకే బాప్ దాదా ఏ బిడ్డతోనూ నిరాశ చెందరు. ఈరోజు కొద్దిగా ఢీలాగా ఉన్నారు, రేపు చురుకైనవారిగా అయిపోతారు అని సదా శుభ ఆశలను పెట్టుకుంటారు. గమ్యము ఒక్కటి, తండ్రి ఒక్కరే అయినప్పుడు మరి తండ్రి వద్దకు కాక ఇంకెక్కడికి వెళ్తారు? అయినా కూడా వారసత్వము ప్రతి ఆత్మకు తండ్రి నుండే లభించాలి. తండ్రిని నిందించినా కానీ తండ్రి ముక్తి యొక్క వారసత్వాన్ని అయితే తప్పకుండా ఇస్తారు. మొత్తం విశ్వంలోని సర్వాత్మలకు ముక్తి, జీవన్ముక్తి వారసత్వము తప్పకుండా లభించనున్నది ఎందుకంటే తండ్రి సృష్టిపై అవతరించి ఉండి పిల్లలను వారసత్వము నుండి వంచితులుగా చేయలేరు. తండ్రి వారసత్వం ఇవ్వాల్సిందే. పిల్లలు తీసుకున్నా, తీసుకోకపోయినా తండ్రి ఇవ్వాల్సిందే. మరియు సర్వాత్మలకు తండ్రి ద్వారా వారసత్వం లభించింది, అందుకే తండ్రి అని పిలుస్తారు కదా. తండ్రి అంటేనే వారసత్వాన్ని ఇచ్చేవారు అని అర్థము. ఏ ధర్మంలోకైనా వెళ్ళిపోయి ఉండవచ్చు, అయినా కూడా ఫాదర్ అని అంటూ స్మృతి అయితే చేస్తారు కదా. ఒక్క ఆత్మ కూడా వారసత్వం లేకుండా మిగిలిపోదు. కనుక సాకార సృష్టిపై పాత్రను అభినయిస్తూ పిల్లలకు వారసత్వం ఇవ్వలేదు అంటే వారిని తండ్రి అని ఎలా అంటారు? కానీ మీరు డైరెక్ట్ గా వారసత్వం తీసుకుంటారు, గుర్తించడము ద్వారా తీసుకుంటారు. మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది. సాకార మాధ్యమము అయిన బ్రహ్మా నిమిత్తంగా అవ్వచ్చు, కానీ బ్రహ్మాతో యోగాన్ని జోడించరు, యోగం తండ్రితో జోడిస్తారు. బ్రహ్మా తండ్రి కూడా అంటారు తండ్రిని స్మృతి చేయండి. నన్ను స్మృతి చేయండి అని అనరు. తండ్రి ద్వారా తప్ప ఇంకే సంబంధం ద్వారా కూడా ఎప్పుడూ పూర్తి వారసత్వం లభించదు. మీరు డైరెక్ట్ తండ్రితో సంబంధాన్ని జోడించి మూడు కాలాలలో వారసత్వం యొక్క అధికారాన్ని ప్రాప్తించుకుంటారు. ఇప్పుడు కూడా వారసత్వం లభిస్తుంది కదా! శక్తులు, గుణాల యొక్క వారసత్వం లభిస్తోంది. లభించిందా? మరియు ముక్తిధామంలో కూడా ఎక్కడ ఉంటారు? సమీపంగా ఉంటారు కదా! కనుక ఇప్పుడు కూడా వారసత్వము ఉంది, ముక్తిధామంలో కూడా ఉంది మరియు తర్వాత 21 జన్మల వారసత్వం కూడా ఉంది. కనుక మూడు కాలాలలో వారసత్వానికి అధికారులుగా అవుతారు. మనుష్యులు మీ అందరితో అంటారు కదా, మీ జీవన్ముక్తి కన్నా మా ముక్తి మంచిది, మీరైతే చక్రంలోకి వస్తారు, మేమైతే చక్రం నుండి విడుదలైపోతాము. మీరు నషాతో చెప్పవచ్చు, ముక్తి యొక్క వారసత్వమైతే మాకు కూడా లభిస్తుంది, కానీ మేము ముక్తి తర్వాత మళ్ళీ జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము. డబల్ లభిస్తుంది! వయా ముక్తిధామం వెళ్తారు కదా, కనుక డైరెక్ట్ కనెక్షన్ ఉన్న కారణంగా వర్తమానములో మరియు మృత్యువు తర్వాత, మళ్ళీ కొత్త శరీరం తీసుకున్న తర్వాత – మూడు కాలాలలోనూ వారసత్వానికి అధికారిగా అవుతారు. ఇంతటి నషా ఉందా?

ఈరోజు హోలీ జరుపుకుంటున్నారు కదా. హోలీలో కాల్చడము కూడా జరుగుతుంది మరియు జరుపుకోవడము కూడా ఉంటుంది. మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. హోలీ జరుపుకోవడము అనగా కొన్నింటిని కాల్చడము, మరి కొన్నింటిని జరుపుకోవడము. కాల్చకుండా జరుపుకోవడము ఉండదు. కనుక దృఢ సంకల్పమనే అగ్ని ద్వారా మొదట తమ బలహీనతలను కాల్చాలి, అప్పుడే జరుపుకోవడము యొక్క ఆనందాన్ని అనుభవం చేయగలరు. ఒకవేళ కాల్చలేదంటే జరుపుకునే ఆనందం యొక్క అనుభవం సదాకాలానికి ఉండదు. హోలీ అన్న పదంలో కాల్చడము కూడా ఉంది, జరుపుకోవడము కూడా ఉంది. రెండు అర్థాలు ఉన్నాయి. హోలీ అన్న పదమైతే పక్కా కదా? కనుక హోలీ అంటే హో లీ అనగా గడిచినదేదో గడిచిపోయింది. ఏ విషయమైతే గడిచిపోయిందో, దానిని హో లీ అని అంటారు. ఏదైతే జరగాలి అని ఉందో, అది జరిగింది. కనుక గతాన్ని గతింపజేయడము అనగా హోలీని కాల్చడము. మరియు ఎప్పుడైతే తండ్రి ఎదురుగా వస్తారో, అప్పుడు అంటారు, నేను తండ్రికి చెందినవానిగా అయిపోయాను. కనుక జరుపుకున్నారు కూడా మరియు హో లీ, అనగా గడిచినదేదో గడిచిపోయింది. గతాన్ని మర్చిపోవడము, ఇదే కాల్చడము. కనుక ఒక్క హోలీ అన్న పదంలోనే కాల్చడము మరియు జరుపుకోవడము ఉన్నాయి. నేనైతే తండ్రికి చెందినవానిగా అయిపోయాను అన్న పాటను పాడుతారు కదా. పక్కా కదా? ఎందుకంటే బాప్ దాదా అందరి తపస్య యొక్క లెక్కాపత్రాన్ని చూసారు. తపస్య ఒకవేళ ఎప్పుడైనా తగ్గింది అంటే దానికి కారణమేమిటి? గతాన్ని గతింపజేయడములో బిందువు పెట్టేందుకు బదులుగా ప్రశ్నార్థకము పెట్టారు. మరియు చిన్న పొరపాటు చేస్తారు, పొరపాటు చిన్నదే కానీ నష్టం చాలా పెద్దగా ఉంటుంది. పొరపాటు చేస్తారు? దేనినైతే మర్చిపోవాలో దానిని గుర్తు చేసుకుంటారు మరియు దేనినైతే గుర్తు చేయాలో దానిని మర్చిపోతారు. కనుక మర్చిపోవడము వస్తుంది కదా? తండ్రిని మర్చిపోవాలనుకోరు, అయినా కూడా మర్చిపోతారు మరియు ఏ సమయాన్ని అయితే మర్చిపోవాలో ఆ సమయంలో ఏమంటారంటే – మర్చిపోవాలనుకుంటాము కానీ మర్చిపోలేకపోతున్నాము, పదే-పదే గుర్తుకొస్తుంది. కనుక గుర్తు చేసుకోవడము మరియు మర్చిపోవడము, రెండు విషయాలూ వస్తాయి. కానీ దేనిని గుర్తు చేసుకోవాలి మరియు దేనిని మర్చిపోవాలి? ఏ సమయాన్ని అయితే మర్చిపోవాలో ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటారు మరియు ఏ సమయాన్ని అయితే గుర్తు చేసుకోవాలో ఆ సమయాన్ని మర్చిపోతారు. చిన్న పొరపాటు కదా? మరి దీనిని హో లీ చేయండి, అనగా కాల్చేయండి. అంశము సహితంగా సమాప్తము చేయండి. మీరు జ్ఞానయుక్త ఆత్మలు కదా? జ్ఞానీ అంటేనే తెలివైనవారు అని అర్థము. మరియు మీరైతే మూడు కాలాలు తెలిసిన తెలివైనవారు, అందుకే హోలీని జరుపుకోవడము అనగా ఈ పొరపాటును కాల్చేయడము. దేనినైతే మర్చిపోవాలో దానిని క్షణంలో మర్చిపోవాలి మరియు దేనినైతే గుర్తు చేసుకోవాలో అది క్షణంలో గుర్తుకు రావాలి. కారణం ఏమిటంటే, కేవలం బిందువుకు బదులుగా ప్రశ్నార్థకము పెడుతున్నారు. ఎందుకు అని ఆలోచిస్తారు మరియు క్యూ మొదలవుతుంది. ఇలా, అలా, ఎందుకు, ఏమిటి అన్న పెద్ద క్యూ మొదలవుతుంది. కేవలం ప్రశ్నార్థకము పెట్టడముతో మొదలవుతుంది. మరియు బిందువు పెడితే ఏమవుతుంది? మీరు కూడా బిందువు, తండ్రి కూడా బిందువు మరియు వ్యర్థానికి కూడా బిందువు, ఫుల్ స్టాప్. స్టాప్ కూడా కాదు, ఫుల్స్టాప్. దీనినే హోలీ అని అంటారు. మరియు ఈ హోలీ ద్వారా సదా తండ్రి సాంగత్యమనే రంగు యొక్క హోలీని, మిలనము యొక్క హోలీని జరుపుకుంటూ ఉంటారు. అన్నింటికన్నా పక్కా రంగు ఏమిటి? ఈ స్థూలమైన రంగు ఎంత పక్కాగా ఉన్నా కానీ, అన్నింటికన్నా శ్రేష్టమైన మరియు అన్నింటికన్నా పక్కా రంగు తండ్రి సాంగత్యమనే రంగు. కనుక ఈ రంగుతో జరుపుకోండి. గోప గోపికలు హోలీని జరుపుకోవడము అనేది మీ స్మృతిచిహ్నమే. ఆ చిత్రంలో ఏం చూపిస్తారు? తండ్రి మరియు మీరు, ఇరువురూ కలిసి హోలీని ఆడుతారు. ఒక్కొక్క గోపిక మరియు గోపిలతో గోపీ వల్లభుడిని చూపిస్తారు. కనుక ఇది సాంగత్యము అయింది కదా! తోడుగా ఉండడము లేక సాంగత్యములో ఉండడమే అవినాశీ హోలీ, తండ్రి సాంగత్యమనే రంగుకు స్మృతిచిహ్నంగా హోలీ రాస్ లో తోడుగా ఉన్న రూపాన్ని చూపించారు. కనుక హోలీ జరుపుకోవడము వస్తుంది కదా? ఇలా జరిగిపోయింది, ఏం చేయను, కావాలనుకోలేదు కానీ అలా జరిగిపోతూ ఉంది… నేటి నుండి వీటి హోలీ, కాల్చండి, సమాప్తము చేయండి. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ సంకల్పంలో కూడా ఇలా ఆలోచించరు. అచ్ఛా.

డబల్ విదేశీయులు కూడా సేవ యొక్క వృద్ధిలో బాగా ముందుకు వెళ్తున్నారు. తండ్రితో కూడా ప్రేమ ఉంది, మరి సేవతో కూడా ప్రేమ ఉంది. సేవ అనగా స్వ మరియు సర్వాత్మల సేవ తోడు తోడుగా జరగాలి. మొదట స్వ సేవ ఎందుకంటే స్వ స్థితి కలిగినవారే ఇతర ఆత్మలను పరిస్థితుల నుండి బయటకు తీసుకురాగలరు. సేవలో సఫలత అంటేనే స్వ మరియు సర్వుల బ్యాలెన్స్ యొక్క స్థితి. సేవలో చాలా బిజీగా ఉన్నాము కదా, అందుకే స్వ స్థితి యొక్క చార్టు ఢీలాగా అయిపోయింది అని ఎప్పుడూ ఇలా అనకండి. ఒకవైపు సంపాదించుకున్నారు, మరొకవైపు పోగొట్టుకున్నారంటే ఇక ఏం మిగిలినట్లు? అందుకే ఎలాగైతే తండ్రి మరియు మీరు కంబైండ్ గా ఉన్నారో, శరీరము మరియు ఆత్మ కంబైండ్ గా ఉన్నాయో, మీ భవిష్య విష్ణు స్వరూపము కంబైండ్ గా ఉందో, అలాగే స్వ-సేవ మరియు సర్వుల సేవ కంబైండ్ గా ఉండాలి. వీటిని వేరు చేయకండి, లేదంటే శ్రమ ఎక్కువ మరియు సఫలత తక్కువగా లభిస్తుంది. అసంపూర్ణమైపోయింది కదా!

ఈ గ్రూపు యొక్క చార్టులో కూడా సెకెండు నంబరువారు ఎక్కువగా ఉన్నారు. ఫస్ట్ వారు కూడా తక్కువగా ఉన్నారు, అలాగే నాలుగు, ఐదవ నంబరువారు కూడా తక్కువగా ఉన్నారు, సెకెండు నంబరు వరకు వెళ్ళారు అంటే సెకెండుకు ముందు ఏం ఉంటుంది? ఫస్ట్ కదా. సెకెండు వరకు అడుగు వేసేసారు, ఇప్పుడు మిగిలిన ఒక అడుగు ఫస్ట్ లో పెట్టాలి. దానికి విధి – కంబైండ్ స్వరూపము యొక్క సేవ. పిల్లలు సేవ యొక్క ప్లాన్లు కూడా తయారుచేస్తున్నారు కదా. బాప్ దాదా అయితే సూచన ఇచ్చేసారు, ఇప్పుడు సమయమనుసారంగా సేవను ఏదైతే చేసారో, అది చాలా బాగా చేసారు. దీని ద్వారా తండ్రిని, స్వయాన్ని ప్రత్యక్షం చేసారు, వాయుమండలము మరియు వైబ్రేషన్ పరివర్తన అయ్యాయి. స్నేహీ మరియు సహయోగీ ఆత్మలు నలువైపులా చాలా సంఖ్యలో సమీపంగా వచ్చారు. ఇప్పుడు ఎటువంటి సేవను చేయండి అంటే ఒక్కరి ద్వారా అనేకుల సేవ జరగాలి. మొత్తం విశ్వానికి సందేశాన్ని ఇవ్వాలి. ఒక్కొక్కరికి సందేశాన్ని ఇస్తూ తద్వారా రాజధానిలోకి వచ్చే ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారు తమ భాగ్యాన్ని తయారుచేసుకుని ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడైతే సందేశాన్ని ఇవ్వాల్సిన వారి సంఖ్య, రాజ్యాధికారీ పిల్లల సంఖ్య కన్నా ఎక్కువగా ఉంది. రాజ్య కుటుంబంలోకి వచ్చేవారు లేక రాజ్య సింహాసనంపై కూర్చునేవారు ఇరువురూ మంచిగా వెలువడ్డారు. రాజ్య అధికారులుగా కూడా మీరే అవుతారు కదా. మీరు అవుతారా లేక ఇతరులను తయారుచేస్తారా? ఇతరులను రాజ్య అధికారులుగా తయారుచేస్తారు మరియు మీరు ఏమవుతారు? అచ్ఛా.

కల్పక్రితపు వారసత్వం తీసుకునేందుకు కొత్త-కొత్త పిల్లలు కూడా చేరుకున్నారు, దీని కోసం బాప్ దాదా స్వాగతిస్తున్నారు, మరియు కొత్త జన్మ యొక్క జన్మదినానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న సర్వ కంబైండ్ స్థితిలో స్థితులయ్యేవారు, సదా కంబైండ్ సేవలో అలసటలేని సేవ ద్వారా నిమిత్తముగా అయ్యేవారు, సదా గతాన్ని గతింపజేసి తండ్రి సాంగత్యమనే రంగు యొక్క హోలీని జరుపుకునే హోలీ హంసలైన ఆత్మలు, సదా మూడు కాలాల వారసత్వం యొక్క సంతోషంలో ఉండేవారు, సదా సాక్షిగా అయి ప్రకృతి మరియు మాయ యొక్క ఆటను చూసేవారు – ఇటువంటి సదా విజయీ, సదా ఎగిరే కళ కలిగినవారు, సదా ఫరిశ్తా స్వరూపాన్ని ఎదురుగా అనుభవం చేసే, శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

మహాన్ ఆత్మగా అయ్యేందుకు ఆధారము – ‘‘పవిత్రతా వ్రతాన్ని ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేయడము’’ ఏదైనా దృఢ సంకల్పం రూపీ వ్రతాన్ని తీసుకోవడము అనగా తమ వృత్తిని పరివర్తన చేసుకోవడము. దృఢమైన వ్రతము వృత్తిని మారుస్తుంది. వ్రతానికి అర్థము మనసులో సంకల్పం తీసుకోవడము మరియు స్థూల రీతిలో పథ్యము ఉండడము. మీరందరూ పవిత్రతా వ్రతాన్ని తీసుకున్నారు మరియు వృత్తిని శ్రేష్ఠంగా చేసుకున్నారు. సర్వాత్మల పట్ల ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు అనే వృత్తి తయారవ్వడం ద్వారానే మీరు మహాన్ ఆత్మగా అయ్యారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top