18 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
17 August 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఆత్మిక సర్జన్ మరియు ఆత్మిక ప్రొఫెసర్, మీరు హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరిచి అనేకుల కళ్యాణము చేయాలి’’
ప్రశ్న: -
తండ్రి కూడా ధర్మ స్థాపన చేస్తారు మరియు ఇతర ధర్మ స్థాపకులు కూడా ధర్మ స్థాపన చేస్తారు, ఇరువురికీ తేడా ఏమిటి?
జవాబు:-
తండ్రి కేవలం ధర్మ స్థాపన చేసి తిరిగి వెళ్ళిపోతారు కానీ ఇతర ధర్మ స్థాపకులు తమ ప్రారబ్ధాన్ని తయారుచేసుకుని వెళ్తారు. తండ్రి తమ ప్రారబ్ధాన్ని తయారుచేసుకోరు. ఒకవేళ తండ్రి కూడా తమ ప్రారబ్ధాన్ని తయారుచేసుకుంటే వారి చేత కూడా పురుషార్థము చేయించేవారు ఎవరో ఉండాలి. తండ్రి అంటారు, నేను రాజ్యం చేయను. నేను పిల్లలకు ఫస్ట్ క్లాస్ ప్రారబ్ధాన్ని తయారుచేస్తాను.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
రాత్రి ప్రయాణీకుడా… (రాత్ కే రాహీ…)
ఓంశాంతి. పాటను పిల్లలు తయారుచేసినట్లుగానే ఉంది. పాట అర్ధాన్ని అయితే ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. ఇప్పుడు ఘోర అంధకారము పూర్తవుతుందని పిల్లలకు తెలుసు. నెమ్మది-నెమ్మదిగా అంధకారమవుతూ వచ్చింది. ఈ సమయాన్ని ఘోర అంధకారమని అంటారు. ఇప్పుడు మీరు ప్రకాశంలోకి వెళ్ళేందుకు లేక శాంతిధామానికి, పుట్టినింటికి వెళ్ళేందుకు యాత్రికులుగా అయ్యారు. అది పావనమైన పుట్టినిల్లు మరియు ఇది పతితంగా ఉన్న పుట్టినిల్లు. ప్రజాపితలో ప్రియమైనవారు ఎవరైతే కూర్చుని ఉన్నారో, వారిని మీరు తండ్రి అని అంటారు. వారు మిమ్మల్ని పవిత్రంగా చేసి తమ ఇంటికి తీసుకువెళ్తారు. వారు కూడా తండ్రే, వీరు కూడా తండ్రే. వారు నిరాకారుడు, వీరు సాకారుడు. అనంతమైన తండ్రి తప్ప ఇతరులెవ్వరూ పిల్లలూ అని అనలేరు. తండ్రే అలా అంటారు ఎందుకంటే పిల్లలను తమతో పాటు ఇంటికి తీసుకువెళ్ళాలి. పవిత్రంగా తయారుచేసారు మరియు నాలెడ్జ్ ను ఇచ్చారు. పిల్లలు అర్థం చేసుకున్నారు, పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి మరియు మొత్తం సృష్టి చక్రాన్ని స్మృతి చేయాలి. ఈ జ్ఞానంతో మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. మాకు ఏదైనా సేవ ఉంటే చెప్పండి అని కొందరు అంటారు. మూడు అడుగుల పృథ్వినిచ్చి అందులో ఆత్మిక కాలేజి మరియు హాస్పిటల్ ను తెరవండి – ఇదే సేవ. అప్పుడు వారిపై ఎటువంటి భారము కూడా పడదు. ఇందులో అడగాల్సిన విషయమే లేదు. ఒకవేళ మీ వద్ద ధనము ఉంటే ఆత్మిక హాస్పిటల్ ను తెరవండి అని సలహానిస్తారు. ధనము లేని వారు కూడా చాలామంది ఉన్నారు. వారు కూడా హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరవవచ్చు. మున్ముందు చాలా ఆస్పత్రులు తెరవబడడము మీరు చూస్తారు. మీ పేరు ఆత్మిక సర్జన్ అని రాయబడి ఉంటుంది – ఆత్మిక సర్జన్ మరియు ప్రొఫెసర్. ఆత్మిక కాలేజి లేదా హాస్పిటల్‌ను తెరవడంలో ఏ ఖర్చూ ఉండదు. పురుషుడు లేక స్త్రీ ఇరువురూ ఆత్మిక సర్జన్ గా లేక ప్రొఫెసర్ గా అవ్వవచ్చు. ఇంతకుముందు స్త్రీలు అలా అయ్యేవారు కాదు. వ్యవహారము, కార్యాలు పురుషుల చేతులలో ఉండేవి. ఈ రోజుల్లోనైతే మాతలు వెలువడ్డారు. కనుక ఇప్పుడు మీరు కూడా ఈ ఆత్మిక సేవను చేస్తారు. జ్ఞానం యొక్క అభిరుచి కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఎవరికైనా కూడా అర్థం చేయించడము చాలా సులభము. ఇంటికి బోర్డు తగిలించండి. కొన్ని పెద్ద హాస్పిటల్స్, కొన్ని చిన్నవి కూడా ఉంటాయి. ఒకవేళ పెద్ద హాస్పిటల్ కు తీసుకువెళ్ళాల్సిన పేషెంటు అని చూసినట్లయితే అప్పుడు వారికి చెప్పాలి, మేము పెద్ద హాస్పిటల్ కు తీసుకువెళ్తాము. అక్కడ పెద్ద-పెద్ద సర్జన్లు ఉంటారు. చిన్న సర్జన్ పెద్ద సర్జన్ వద్దకు పంపిస్తారు. వాళ్ళ ఫీజు వాళ్ళు తీసేసుకుంటారు, ఆ తర్వాత ఈ రోగి ఈ విధంగా ఉన్నారు, వీరిని పెద్ద హాస్పిటల్ కు తీసుకువెళ్ళాలి అని భావిస్తారు, అదే సలహాను ఇస్తారు. కనుక ఇటువంటి సెంటర్ ను తెరిచి బోర్డు పెట్టండి. అప్పుడు మనుష్యులు ఆశ్చర్యపోతారు కదా. ఇది అర్థం చేసుకోవాల్సిన సాధారణ విషయము. కలియుగము తర్వాత సత్యయుగము తప్పకుండా వస్తుంది. భగవంతుడైన తండ్రే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు. అటువంటి తండ్రి లభించినప్పుడు మనం ఎందుకు వారసత్వాన్ని తీసుకోకూడదు. మనసా-వాచా-కర్మ ద్వారా ఈ భారత్ కు సుఖాన్ని ఇవ్వాలి. మనసా-వాచా-కర్మ, అవి కూడా ఆత్మికంగా ఉండాలి. మనసాతో అనగా స్మృతితో మరియు వాచాతో వినిపించేవి రెండే పదాలు – మన్మనాభవ మరియు మధ్యాజీభవ. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, ఇవి రెండు వచనాలు అయ్యాయి కదా. వారసత్వాన్ని ఎలా తీసుకున్నారు, ఎలా పోగొట్టుకున్నారు – ఇది చక్రము యొక్క రహస్యము. వృద్ధ మాతలకు కూడా అభిరుచి ఉండాలి. మాకు నేర్పించండి అని అడగాలి. ఏదైతే ఇతర విద్వాంసులు, పండితులు మొదలైనవారెవరూ అర్థము చేయించలేరో, దానిని వృద్ధులు కూడా అర్థము చేయించగలరు. అప్పుడే పేరును ప్రఖ్యాతము చేయగలరు కదా. చిత్రాలు కూడా చాలా సహజమైనవి ఉన్నాయి. ఎవరికైనా అదృష్టంలో లేకపోతే పురుషార్థము చేయరు. నేను బాబాకు చెందినవానిగా అయిపోయాను అని కేవలం ఈ విధంగా భావించడం కాదు. అలా అయితే ఆత్మలందరూ తండ్రికి చెందినవారే. ఆత్మలకు తండ్రి పరమాత్మ, ఇదైతే క్షణం యొక్క విషయము. అయితే వారి నుండి వారసత్వము ఎలా లభిస్తుంది, వారు ఎప్పుడు వస్తారు – ఇవి అర్థము చేయించాలి. వారు సంగమములోనే వస్తారు. వారు అర్థం చేయిస్తారు, సత్యయుగంలో మీరు ఇన్ని జన్మలు తీసుకున్నారు, త్రేతాలో ఇన్ని జన్మలు, 84 జన్మల చక్రం పూర్తి చేసారు, ఇప్పుడు మళ్ళీ స్వర్గ స్థాపన జరగాలి. సత్యయుగంలో వేరే ఇతర ధర్మాలు ఉండవు. ఎంత సహజమైన విషయము. ఇతరులకు అర్థము చేయించడం వలన చాలా సంతోషం కలుగుతుంది. ఆరోగ్యవంతులుగా అవుతారు ఎందుకంటే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. వృద్ధ మాతలకైతే చాలా సహజము. వారు ఈ ప్రపంచము యొక్క అనుభవీలు కూడా. ఎవరికైనా ఇది కూర్చొని అర్థం చేయించినట్లయితే అద్భుతం చేసి చూపిస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి మరియు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. జన్మ తీసుకుంటారు మరియు నోటి ద్వారా మమ్మా-బాబా అని అనడము మొదలుపెడతారు. మీ అవయవాలైతే పెద్ద-పెద్దవిగా ఉన్నాయి. మీరైతే అర్థము చేసుకుని అర్థము చేయించగలరు. వృద్ధ మాతలకు చాలా అభిరుచి ఉండాలి, మేమైతే బాబా పేరును ప్రఖ్యాతి చేయాలి మరియు చాలా మధురంగా అవ్వాలి. మోహము, మమకారము తొలగిపోవాలి. మరణించడమైతే మరణించాల్సిందే. ఇకపోతే, రెండు-నాలుగు రోజులే జీవించాలి అన్నప్పుడు మనము ఒక్కరితోనే బుద్ధి యోగాన్ని ఎందుకు పెట్టుకోకూడదు. ఎంత సమయం లభిస్తే అంత తండ్రి స్మృతిలో ఉండాలి, అన్నివైపుల నుండి మమకారాన్ని తొలగించాలి. ఎప్పుడైతే 60 సంవత్సరాలవారిగా అవుతారో, అప్పుడు వానప్రస్థము తీసుకుంటారు. వారైతే చాలా బాగా అర్థము చేయించగలరు. నాలెడ్జ్ ను ధారణ చేసి మరియు ఇతరులది కూడా కళ్యాణము చేయాలి. మంచి-మంచి ఇంటికి చెందిన కుమార్తెలు ఇటువంటి పురుషార్థము చేసి ఇంటింటికి వెళ్ళి అర్థము చేయించినట్లయితే ఎంతగా పేరు ప్రసిద్ధమవుతుంది. పురుషార్థము చేసి నేర్చుకోవాలి, అభిరుచి పెట్టుకోవాలి.
ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. ఇలా చెప్పండి, చూడండి, కలియుగము ఇప్పుడు పూర్తవుతుంది, అందరి మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. కలియుగ అంతిమంలోనే తండ్రి వచ్చి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. కృష్ణుడినైతే తండ్రి అని అనరు. వారైతే చిన్న బాలుడు. వారికి సత్యయుగ రాజ్యము ఎలా లభించింది! తప్పకుండా గత జన్మలో అటువంటి కర్మలు చేసి ఉండవచ్చు. తప్పకుండా వీరు పురుషార్థము చేసి ఈ ప్రారబ్ధాన్ని తయారుచేసుకున్నారని మీరు అర్థం చేయించగలరు. కలియుగంలో పురుషార్థం చేసారు, సత్యయుగంలో ప్రారబ్ధాన్ని పొందారు. అక్కడైతే పురుషార్థం చేయించేవారు ఎవ్వరూ ఉండరు. సత్య-త్రేతా యుగాలలో ఇంతటి ప్రారబ్ధం లభించింది. తప్పకుండా ఉన్నతోన్నతమైన తండ్రి లభించారు, వారే బంగారం-వెండి యుగాలకు యజమానిగా తయారుచేస్తారు, ఇంకెవ్వరూ తయారుచేయలేరు. వారికి తప్పకుండా తండ్రే లభించారు. లక్ష్మీ-నారాయణులు స్వయమైతే లభించరు. బ్రహ్మా లేక శంకరులు లభించారని కాదు. అలా కాదు. భగవంతుడు లభించారు. వారు నిరాకారుడు. భగవంతుడు తప్ప ఇటువంటి పురుషార్థాన్ని చేయించేవారు ఎవ్వరూ లేరు. భగవానువాచ – నేను మీకు ఫస్ట్ క్లాస్ ప్రారబ్ధాన్ని తయారుచేస్తాను. ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. స్థాపన ఇక్కడే చేయాలి. చేయించేవారైతే ఒక్క తండ్రి. మిగిలినవారు ఎవరైతే ధర్మ స్థాపన చేస్తారో, వారైతే ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటారు. ధర్మ స్థాపన చేసేవారు ప్రారబ్ధాన్ని తయారుచేసుకుని వెళ్తారు. తండ్రికైతే తమ ప్రారబ్ధాన్ని తయారుచేసుకునేది లేదు. ఒకవేళ ప్రారబ్ధాన్ని తయారుచేసుకున్నారు అంటే, వారి చేత కూడా పురుషార్థము చేయించేవారు ఎవరో ఒకరు కావాలి. శివబాబా అంటారు, నా చేత ఎవరు పురుషార్థము చేయిస్తారు. నా పాత్రయే ఈ విధంగా ఉంది, నేను రాజ్యం చేయను. ఇది తయారై-తయారుచేయబడిన డ్రామా.
తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, నేను మీకు అన్ని వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. ఇదంతా భక్తి మార్గము. ఇప్పుడు భక్తి మార్గం పూర్తవుతుంది. అదైతే దిగే కళ. ఇప్పుడు మీది ఎక్కే కళ జరుగుతుంది. మీ ఎక్కే కళ వలన అందరికీ మేలు జరుగుతుంది అని అంటారు కదా. అందరూ ముక్తి-జీవన్ముక్తిని పొందుతారు. తర్వాత 16 కళల నుండి దిగుతూ-దిగుతూ ఏ కళ లేని స్థితికి చేరుకుంటారు. గ్రహణము పడుతుంది కదా. గ్రహణము కొద్ది-కొద్దిగా పడుతుంది. ఇది ఉన్నదే అనంతమైన విషయము. ఇప్పుడు మీరు సంపూర్ణులుగా అవుతారు. తర్వాత త్రేతాలో రెండు కళలు తగ్గిపోతాయి. కొద్దిగా నల్లగా అవుతారు, అందుకే సత్యయుగ రాజ్యం కోసం పురుషార్థము చేయాలి. తక్కువ ఎందుకు తీసుకోవాలి. కానీ అందరూ అయితే 16 కళల సంపూర్ణులుగా అయ్యే విధంగా పరీక్షను పాస్ అవ్వలేరు. పిల్లలు పురుషార్థము చేయాలి మరియు చేయించాలి. ఈ చిత్రాల ద్వారా చాలా మంచి సేవ జరగగలదు. చాలా స్పష్టంగా రాయబడి ఉంది. చెప్పండి, తండ్రి స్వర్గం యొక్క రచనను రచిస్తారు, మళ్ళీ మనం నరకంలో ఎందుకు పడి ఉన్నాము. ఈ పాత ప్రపంచం నరకం కదా. ఇందులో దుఃఖమే దుఃఖము ఉంది. మళ్ళీ కొత్త ప్రపంచము సత్యయుగము రావాలి. పిల్లలు నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారు. ఇక్కడేమీ అంధ విశ్వాసం యొక్క విషయము లేదు. ఏ కాలేజిలో కూడా అంధ విశ్వాసం యొక్క విషయం ఉండదు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. ఆ కాలేజీలు మొదలైనవాటిలో ఈ జన్మలోనే చదువుతారు, ఈ జన్మలోనే ప్రారబ్ధాన్ని పొందుతారు. ఇక్కడ ఈ చదువు యొక్క ప్రారబ్ధాన్ని మీరు వినాశనం తర్వాత మరుసటి జన్మలో పొందుతారు. దేవతలు కలియుగంలోకి ఎలా రాగలరు. పిల్లలు అర్థం చేయించడము చాలా సహజము. చిత్రాలు కూడా చాలా మంచివి తయారుచేయబడి ఉన్నాయి. కల్పవృక్షము కూడా చాలా మంచిగా ఉంది. క్రిస్టియన్లు కూడా కల్పవృక్షాన్ని అంగీకరిస్తారు. తమ జాతీయ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అందరికీ తమ-తమ పాత్ర ఉంది. ఇది కూడా మీకు తెలుసు, భక్తి కూడా అర్ధ కల్పము ఉండాలి. అందులో యజ్ఞ తపాదులు, తీర్థయాత్రలు మొదలైనవన్నీ ఉంటాయి. తండ్రి అంటారు, నేను వీటి ద్వారా లభించను. ఎప్పుడైతే మీ భక్తి పూర్తవుతుందో, అప్పుడు భగవంతుడు వస్తారు. అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పము భక్తి ఉంటుంది. కల్పవృక్షం స్పష్టంగా రాయబడి ఉంది. కేవలం చిత్రాలు ఉండి అందులో ఏమీ రాయకపోయినా కూడా వాటి పై అర్థం చేయించగలరు. చిత్రాల పై అటెన్షన్ ఉండాలి, వీటిలో ఎంత అద్భుతమైన జ్ఞానము ఉంది. శరీరాన్ని లోన్ గా తీసుకున్నంత మాత్రాన దానిని నా ఆస్తి అని ఏమైనా భావిస్తారా. అలా కాదు, నేను అద్దెకున్నవాడిని అని భావిస్తారు. ఈ బ్రహ్మా స్వయము కూడా కూర్చుని ఉన్నారు, వారిని కూడా కూర్చోబెట్టాలి. ఎలాగైతే ఏదైనా ఇంటిలో స్వయం యజమాని కూడా ఉంటారు మరియు అద్దెకున్నవారు కూడా ఉంటారు. బాబా అయితే మొత్తం సమయమంతా వీరిలో ఏమీ ఉండరు, వీరిని హుస్సేన్ యొక్క రథము అని అంటారు. ఎలాగైతే క్రైస్టు యొక్క ఆత్మ ఒక పెద్ద వయస్సు కల తనువులోకి ప్రవేశించి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసింది. చిన్నతనంలో ఆ శరీరం వేరొకరిది, ఆ తనువు చిన్న వయస్సులో ఉన్నప్పుడు అవతరణ జరగలేదు. నానక్ లో కూడా తర్వాత ఆత్మ ప్రవేశించి సిక్కు ధర్మాన్ని స్థాపన చేస్తుంది. ఈ విషయాలు ఆ మనుష్యులు అర్థము చేసుకోలేరు. ఇవి బాగా అర్థము చేసుకోవాల్సిన విషయాలు. పవిత్ర ఆత్మయే వచ్చి ధర్మ స్థాపన చేస్తుంది. ఇప్పుడు కృష్ణుడైతే సత్యయుగం యొక్క మొదటి రాకుమారుడు. వారిని ద్వాపరములోకి ఎందుకు తీసుకువెళ్ళారు! సత్యయుగంలో లక్ష్మీ-నారాయణుల రాజ్యాన్ని చూపిస్తారు. ఇది కూడా మీకు తెలుసు, రాధే-కృష్ణులే లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతారు. వారి రాజధాని ఎలా స్థాపించబడింది? ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు.
మీకు తెలుసు, తండ్రి ఒక్కసారి మాత్రమే అవతరిస్తారు, పతితులను పావనంగా చేస్తారు. కృష్ణ జయంతిపైన కూడా ఋజువు చేయాలి శ్రీకృష్ణుడైతే జ్ఞానాన్ని ఇవ్వలేదు, ఎవరైతే వారిని అలా తయారుచేసారో వారి జయంతిని మొదట జరుపుకోవాలి . శివజయంతికి మనుష్యులు వ్రతము మొదలైనవి పెట్టుకుంటారు. అభిషేకాలు చేస్తారు. రాత్రంతా మేల్కొని ఉంటారు. ఇక్కడ ఉన్నదే రాత్రి, ఇక్కడ ఎంతవరకైతే జీవించనున్నారో, అంతవరకు పవిత్రతా వ్రతాన్ని పెట్టుకోవాలి. పవిత్రతా వ్రతాన్ని ధారణ చేస్తేనే పవిత్ర రాజధానికి యజమానిగా అవుతారు. శ్రీకృష్ణ జయంతిపైన అర్థం చేయించాలి, కృష్ణుడు తెల్లగా ఉండేవారు, ఇప్పుడు నల్లగా అయ్యారు, అందుకే శ్యామ సుందరుడు అని అంటారు. ఇది ఎంత సహజమైన జ్ఞానము. శ్యామ సుందర్ యొక్క అర్థము – ఈ చక్రము ఎలా తిరుగుతుంది అన్నది అర్థం చేయించాలి. పిల్లలైన మీరు నిలబడాలి. శివశక్తులు భారత్ ను స్వర్గంగా తయారుచేసారు, ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి కూడా గుప్తముగా ఉన్నారు, జ్ఞానం కూడా గుప్తమైనది మరియు శివశక్తులు కూడా గుప్తముగా ఉన్నారు. మీరు చిత్రాలు తీసుకొని ఎవరి ఇంటికైనా కూడా వెళ్ళవచ్చు. చెప్పండి, మీరు సెంటరుకు రావడం లేదు కనుక మీకు సుఖధామం యొక్క మార్గాన్ని చెప్పడానికి మేము మీ ఇంటికి వచ్చాము. అప్పుడు వారు, వీరు మా శుభచింతకులు అని భావిస్తారు. ఇక్కడ చెవులకు ఇంపైన విషయము వినిపించడమని కాదు. చివరిలో మనుష్యులు అర్థము చేసుకుంటారు, నిజంగా మేము జీవితాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నాము, జీవితమంటే వీరిదే. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. నష్టోమోహులుగా అయి ఒక్క తండ్రితోనే మీ బుద్ధియోగాన్ని పెట్టుకోవాలి. దేహీ-అభిమానిగా అయ్యి ఈ శిక్షణలను ధారణ చేయాలి మరియు చేయించాలి.
2. మనసా-వాచా-కర్మల ద్వారా భారత్ కు సుఖాన్ని ఇవ్వాలి. నోటి ద్వారా ప్రతి ఒక్కరికి జ్ఞానం యొక్క రెండు వచనాలు వినిపించి వారి కళ్యాణము చేయాలి. శుభచింతకులుగా అయి అందరికీ శాంతిధామము, సుఖధామము యొక్క మార్గాన్ని చెప్పాలి.
వరదానము:-
ఎలాగైతే తండ్రికి ఇంత పెద్ద పరివారము ఉన్నా కూడా నిశ్చింతా చక్రవర్తిగా ఉన్నారు, అన్నీ తెలిసి కూడా, చూస్తూ కూడా నిశ్చింతగా ఉన్నారు. అలా తండ్రిని ఫాలో చేయండి. వాయుమండలంపై తమ ప్రభావాన్ని వేయండి, వాయుమండలం యొక్క ప్రభావం మీ పై పడకూడదు ఎందుకంటే వాయుమండలం రచన మరియు మీరు మాస్టర్ రచయిత. రచయిత యొక్క ప్రభావము రచనపై ఉండాలి. ఏ విషయం వచ్చినా కానీ నేను విజయీ ఆత్మను అన్నది స్మృతిలో పెట్టుకోండి, దీని వలన సదా నిశ్చింతగా ఉంటారు, గాభరాపడరు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!