8 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

August 7, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీకు జ్ఞాన యోగాలతో సత్యమైన అలంకారాన్ని చేసేందుకు తండ్రి వచ్చారు, ఈ అలంకారాన్ని పాడు చేసేది దేహాభిమానము, అందుకే దేహము పట్ల మమకారాన్ని తొలగించాలి’’

ప్రశ్న: -

జ్ఞాన మార్గంలో ఉన్నతమైన మెట్లు ఎవరు ఎక్కగలరు?

జవాబు:-

ఎవరికైతే తమ దేహము పట్ల మరియు ఏ దేహధారి పట్ల మమకారము ఉండదో, ఒక్క తండ్రి పట్ల హృదయపూర్వకమైన సత్యమైన ప్రీతి ఉంటుందో, ఎవరి నామ రూపాలలో చిక్కుకోరో, వారే జ్ఞాన మార్గం యొక్క ఉన్నతమైన మెట్లను ఎక్కగలరు. ఒక్క తండ్రితో హృదయపూర్వకమైన ప్రేమను ఉంచుకునే పిల్లల ఆశలన్నీ పూర్తవుతాయి. నామ-రూపాలలో చిక్కుకునే వ్యాధి చాలా కఠినమైనది, అందుకే బాప్ దాదా వార్నింగ్ ఇస్తారు – పిల్లలూ, మీరు పరస్పరం నామ-రూపాలలో చిక్కుకొని మీ పదవిని భ్రష్టం చేసుకోకండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము… (తుమ్హే పాకే హమ్నే…)

ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలైతే ఈ పాట యొక్క అర్థాన్ని మంచి రీతిలో తెలుసుకొని ఉంటారు. అయినా సరే బాబా ఒక్కొక్క లైను యొక్క అర్థాన్ని తెలియజేస్తారు. వీటి ద్వారా కూడా పిల్లల నోరు తెరుచుకోగలదు. అర్థము చాలా సహజమైనది. ఇప్పుడు పిల్లలైన మీకే తండ్రి గురించి తెలుసు. మీరెవరు? బ్రాహ్మణ-బ్రాహ్మణీలు. మొత్తం ప్రపంచమంతా శివ వంశీయులు. ఇప్పుడు కొత్త రచనను రచిస్తున్నారు. మీరు సమ్ముఖంలో ఉన్నారు. అనంతమైన తండ్రి నుండి బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ-బ్రాహ్మణీలైన మనము మొత్తం విశ్వ రాజ్యాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఆకాశమే కాదు, మొత్తం భూమి, వాటి మధ్యలో సాగరము, నదులు కూడా వచ్చేస్తాయి. బాబా, మేము మీ నుండి మొత్తం విశ్వ రాజ్యాన్ని తీసుకుంటున్నాము. పురుషార్థం చేస్తున్నాము. మనం కల్ప-కల్పము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. మనం రాజ్యము చేసినప్పుడు మొత్తం విశ్వంపై భారతవాసులైన మన రాజ్యమే ఉంటుంది, ఇంకెవరూ ఉండరు. చంద్రవంశీయులు కూడా ఉండరు. కేవలం సూర్యవంశీ లక్ష్మీ-నారాయణుల రాజ్యమే ఉంటుంది. మిగిలినవారంతా తర్వాత వస్తారు. ఇది కూడా మీకు ఇప్పుడే తెలుసు. అక్కడైతే ఇవేవీ తెలియవు. మనం ఈ వారసత్వాన్ని ఎవరి నుండి పొందాము అనేది కూడా తెలియదు. ఒకవేళ ఎవరి నుండైనా పొందితే, అది మళ్ళీ ఎలా పొందాము అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కేవలం ఈ సమయంలోనే మొత్తం సృష్టి చక్ర జ్ఞానము ఉంది, ఆ తర్వాత ఇది కనుమరుగైపోతుంది. అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారని, వారిని గీతా భగవానుడు అంటారని ఇప్పుడు మీకు తెలుసు. భక్తి మార్గంలో మొదట సర్వ శాస్త్రమయి శిరోమణి గీతనే వింటారు. గీతతో పాటు భాగవతము, మహాభారతము కూడా ఉన్నాయి. ఈ భక్తి కూడా చాలా సమయం తర్వాత ప్రారంభమవుతుంది. నెమ్మది-నెమ్మదిగా మందిరాలు తయారవుతాయి, శాస్త్రాలు తయారవుతాయి. 3-4 వందల సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మీరు తండ్రి నుండి సమ్ముఖంగా వింటారు. పరమపిత పరమాత్మ శివబాబా బ్రహ్మా తనువులోకి వచ్చారని మీకు తెలుసు. మనం మళ్ళీ వచ్చి వారి పిల్లలుగా, బ్రాహ్మణులుగా అయ్యాము. మనం మళ్ళీ చంద్రవంశీయులుగా అవుతామని సత్యయుగములో తెలియదు. ఇప్పుడు తండ్రి మీకు మొత్తం సృష్టి చక్రాన్ని అర్థం చేయిస్తున్నారు. తండ్రికి సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలు తెలుసు. వారిని అన్నీ తెలిసినవారు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. వారికి దేని గురించి జ్ఞానముంది? ఇది ఎవరికీ తెలియదు. గాడ్ ఫాదర్ జ్ఞాన సంపన్నులు అని కేవలం పేరు పెట్టారు. భగవంతుడికి అందరి మనసులు గురించి తెలుసు అని వారు భావిస్తారు. మనం శ్రీమతంపై నడుస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, అర్ధకల్పం నుండి మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది కావున భక్తి తొలగిపోతుంది. సత్యయుగము పగలు, కలియుగము రాత్రి. కాళ్ళు నరకం వైపు, ముఖము స్వర్గము వైపు ఉన్నాయి. అమ్మగారింటికి వెళ్ళి అత్తగారింటికి వస్తారు. అలంకారము చేయించేందుకు ప్రియుడైన శివబాబా ఇక్కడకు వస్తారు ఎందుకంటే అలంకారము పాడై ఉంది. పతితులుగా అయితే అలంకారము పాడైపోతుంది. ఇప్పుడు పతితులుగా, పాపులుగా, నీచులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. గుణహీనుల నుండి గుణవంతులుగా అవుతున్నారు. మీకు తెలుసు – తండ్రిని స్మృతి చేయడం వలన మరియు అర్థం చేసుకోవడం వలన మనం ఎటువంటి పాపము చేయము. ఎటువంటి తమోప్రధానమైన వస్తువులను తినము. మనుష్యులు తీర్థ యాత్రలకు వెళ్ళినప్పుడు కొందరు వంకాయలు వదిలి వస్తారు, కొందరు మాంసము వదిలి వస్తారు. ఇక్కడ ఉండేది 5 వికారాల దానము ఎందుకంటే దేహాభిమానము అన్నింటికన్నా చాలా చెడ్డది. ఘడియ-ఘడియ దేహము పట్ల మమకారం ఏర్పడుతుంది.

తండ్రి అంటారు – పిల్లలూ, ఈ దేహము పట్ల మమకారాన్ని విడిచిపెట్టండి. దేహం పట్ల మమకారం తొలగకపోతే మళ్ళీ ఇతర దేహధారుల పట్ల మమకారం ఏర్పడుతుంది. తండ్రి అంటారు, పిల్లలూ, ఒక్కరి పట్ల ప్రీతిని ఉంచండి, ఇతరుల నామ-రూపాలలో చిక్కుకోకండి. బాబా పాట యొక్క అర్థాన్ని కూడా అర్థం చేయించారు. అనంతమైన తండ్రి నుండి మళ్ళీ అనంతమైన స్వర్గ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. ఈ రాజ్యాన్ని మన నుండి ఎవరూ లాక్కోలేరు. అక్కడ వేరే వారెవరూ లేనే లేరు కనుక ఎలా లాక్కుంటారు? ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతంపై నడుచుకోవాలి. అలా నడుచుకోకపోతే, ఉన్నత పదవిని ఎప్పుడూ పొందలేరని గుర్తుంచుకోండి. శ్రీమతము కూడా తప్పకుండా సాకారుని ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేరణతో అయితే లభించజాలదు. మేము శివబాబా ప్రేరణతో తీసుకుంటామని చాలా మందికి గర్వము వస్తుంది. ఒకవేళ ప్రేరణ విషయము అయితే, మరి భక్తి మార్గంలో కూడా మన్మనాభవ అని ప్రేరణ ఎందుకు ఇచ్చేవారు కాదు? ఇక్కడైతే సాకారంలోకి వచ్చి అర్థం చేయించాల్సి ఉంటుంది. సాకారుడు లేకుండా మతాన్ని కూడా ఎలా ఇవ్వగలరు. చాలా మంది పిల్లలు తండ్రితో అలిగి మేమైతే శివబాబాకు చెందినవారము అని అంటారు. శివబాబా బ్రహ్మా ద్వారా మనల్ని బ్రాహ్మణులుగా చేస్తారని మీకు తెలుసు. మొదట పిల్లలుగా అవుతారు కదా, తర్వాత తెలివి లభిస్తుంది – మనకు తాతగారి వారసత్వము వీరి ద్వారా లభిస్తుంది అని. తాతగారు (శివబాబానే) బ్రహ్మా ద్వారా మనల్ని తమవారిగా చేసుకుంటారు. శిక్షణను ఇస్తారు.

(పాట) బాబాతో ప్రేమను పెట్టుకోవడం వలన మన ఆశలన్నీ పూర్తవుతాయి. ప్రేమ చాలా మంచిగా ఉండాలి. ఆత్మలైన మీరందరూ తండ్రికి ప్రేయసులుగా అయ్యారు. బాల్యంలో కూడా పిల్లలు తండ్రికి ప్రేయసులుగా అవుతారు. తండ్రిని స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుంది. కొడుకు పెద్దగా అవుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఆత్మలైన మీరు కూడా అనంతమైన తండ్రికి పిల్లలు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. స్వయాన్ని అత్మగా భావించి పరమపిత పరమాత్మను స్మృతి చేయాల్సి ఉంటుంది. తండ్రికి ప్రేయసులుగా అయినట్లయితే మీ ఆశలన్నీ పూర్తవుతాయి. మనసులో ఏదో ఒక ఆశను పెట్టుకుని ప్రేయసి ప్రియుడిని స్మృతి చేస్తుంది. కొడుకు వారసత్వము కోసము తండ్రిపై ప్రేమను పెట్టుకుంటాడు. తండ్రి మరియు ఆస్తి గుర్తుంటుంది. ఇప్పుడది హద్దుకు సంబంధించిన విషయము. ఇక్కడ, ఎవరైతే అందరికీ ప్రియుడో, ఆ పారలౌకిక ప్రియునికి ఆత్మ ప్రేయసిగా అవ్వాల్సి ఉంటుంది. బాబా నుండి మనం విశ్వ రాజ్యాన్ని తీసుకుంటామని మీకు తెలుసు, అందులో అంతా వచ్చేస్తుంది. విభజనకు సంబంధించిన విషయమేమీ లేదు. సత్య-త్రేతాయుగాలలో ఎటువంటి ఉపద్రవాలు జరగవు. దుఃఖము యొక్క పేరు కూడా ఉండదు. ఇది ఉన్నదే దుఃఖధామము, అందుకే మేము రాజా-రాణులుగా అవ్వాలని, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ గా అవ్వాలని మనుష్యులు పురుషార్థం చేస్తారు. నంబరువారు పదవులైతే ఉన్నాయి కదా. ఉన్నత పదవిని పొందేందుకు ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తారు. స్వర్గంలో కూడా ఉన్నత పదవిని పొందేందుకు మమ్మా-బాబాను ఫాలో చేయాలి. మనమెందుకు వారసులుగా అవ్వకూడదు. భారత్ నే తల్లిదండ్రుల దేశమని అంటారు. భారత మాత అని అంటారు. కావున తప్పకుండా తండ్రి కూడా కావాలి కదా. మరి ఇద్దరూ కావాలి. ఈ రోజుల్లో వందే మాతరం అని భారత మాతను అంటారు ఎందుకంటే భారత్ అవినాశీ ఖండము. పరమపిత పరమాత్మ ఇక్కడే వస్తారు. కావున భారత్ మహాన్ తీర్థ స్థానమయ్యింది కదా. మరి మొత్తం భారత్ కు వందనం చేయాలి. కానీ ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు. పవిత్రమైనవారికే వందనం చేయడం జరుగుతుంది. వందే మాతరం అని తండ్రి అంటారు. మీరు శివ శక్తులు, మీరే భారత్ ను స్వర్గంగా తయారుచేసారు. ప్రతి ఒక్కరికీ తమ జన్మ భూమి బాగా అనిపిస్తుంది కదా. కావున అన్నింటికన్నా ఉన్నతమైన భూమి ఈ భారత్, ఇక్కడికే తండ్రి వచ్చి అందరినీ పావనంగా చేస్తారు. పతితులను పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇకపోతే భూమి మొదలైనవి ఏమీ చేయవు. అందరినీ పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారే ఇక్కడకు వస్తారు. భారత్ యొక్క మహిమ చాలా గొప్పది. భారత్ అవినాశీ ఖండము. ఇదెప్పుడూ వినాశనమవ్వదు. ఈశ్వరుడు భారత్ లోనే వచ్చి వీరి శరీరంలో ప్రవేశిస్తారు, వీరిని భగీరథుడని, నందీగణమని కూడా అంటారు. నందీగణము అన్న పేరు విని వారేమో జంతువును చూపించారు. కల్ప-కల్పము తండ్రి బ్రహ్మా తనువులోకి వస్తారని మీకు తెలుసు. వాస్తవానికి జటాజూటాలు మీకు ఉన్నాయి. రాజఋషులు మీరు. ఋషులు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటారు. మీరు రాజఋషులు, ఇల్లు-వాకిళ్ళను కూడా సంభాళించాలి. నెమ్మది-నెమ్మదిగా పవిత్రంగా అవుతూ ఉంటారు. వారు వెంటనే పవిత్రంగా అవుతారు ఎందుకంటే వారు ఇల్లు-వాకిళ్ళను వదిలి వెళ్తారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. తేడా ఉంది కదా. మనం ఈ పాత ప్రపంచంలో కూర్చుని కొత్త ప్రపంచం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు.

తండ్రి అంటారు, మధురాతి-మధురమైన పిల్లలూ, ఈ చదువు భవిష్యత్తు కోసము. మీరు కొత్త ప్రపంచం కోసం పురుషార్థం చేస్తున్నారు. కావున తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. పరస్పరం నామ-రూపాలలో చిక్కుకునేవారు చాలామంది ఉన్నారు. వారికి శివబాబా ఎప్పుడూ గుర్తు రారు. ఎవరినైతే ప్రేమిస్తారో వారు గుర్తుకొస్తూ ఉంటారు. వారు ఈ మెట్లు ఎక్కలేరు. నామ-రూపాలలో చిక్కుకునే వ్యాధి కూడా అంటుకుంటుంది. పరస్పరం నామ-రూపాలలో చిక్కుకొని తమ పదవిని భ్రష్టం చేసుకుంటున్నారని బాబా వార్నింగ్ ఇస్తారు. ఇతరుల కళ్యాణం జరగవచ్చు కానీ మీకు ఎటువంటి కళ్యాణము జరగదు. స్వయం యొక్క అకళ్యాణం చేసుకుంటారు. (పండితుని ఉదాహరణ ఉంది కదా) ఇలా నామ-రూపాలలో చిక్కుకొని మరణించేవారు చాలా మంది ఉన్నారు.

(పాట) ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు – అర్ధకల్పం మనం దుఃఖాన్ని సహనం చేసాము. బాధను సహనం చేసాము. ఇప్పుడది తొలగిపోయి సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. మీరు దుఃఖాన్ని చూస్తూ-చూస్తూ పూర్తిగా తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మీకు సంతోషం కలుగుతుంది – మన సుఖమయమైన రోజులు వచ్చాయి, సుఖధామంలోకి వెళ్తున్నాము, దుఃఖమయమైన రోజులు పూర్తయ్యాయి. కావున సుఖధామంలో ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేయాలి. మనుష్యులు సుఖం కోసం చదువుకుంటారు. మనం భవిష్య విశ్వానికి యజమానులుగా అవుతున్నామని మీకు తెలుసు. ఉత్తరంలో ఈ విధంగా రాస్తారు – బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము అనగా సూర్యవంశ రాజధానిలో మేము ఉన్నత పదవిని పొందుతాము. పురుషార్థం యొక్క సంపూర్ణ భావన ఉంచుకోవాలి.

(పాట) ఇప్పుడు సత్యయుగం యొక్క మీ సుఖపు ఆశా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. దీపం ఆరిపోతే దుఃఖమే దుఃఖము కలుగుతుంది. భగవానువాచ – ఇప్పుడు మీ దుఃఖాలన్నీ తొలగిపోనున్నాయి. ఇప్పుడు మీకు అపార సుఖమయమైన రోజులు వస్తున్నాయి. పురుషార్థం చేసి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఎంత తీసుకుంటారో, దాని ద్వారా కల్ప-కల్పము మనము ఈ వారసత్వాన్ని పొందేందుకు అధికారులుగా అవుతామని అర్థం చేసుకుంటారు. మనం ఎంతమందికి ఈ మార్గాన్ని తెలియపరుస్తున్నాము అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటూ ఉంటారు. బాబా అంటారు – పుణ్యాత్మగా, నంబరువన్ సూర్యవంశీయులుగా అవ్వాలి. అంధులకు చేతికర్రగా అవ్వాలి. ప్రశ్నావళి మొదలైనవి బోర్డు పై ప్రతి చోట పెట్టాలి. ఒక్క తండ్రిని ఋజువు చేసి చూపించాలి. వారే అందరికీ తండ్రి. ఆ తండ్రి బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణుల నుండి మీరు దేవతలుగా అవుతారు. ఒకప్పుడు శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు పిలక వంటివారు, ఆ తర్వాత దేవతలు. బ్రాహ్మణులైన మీది ఎక్కే కళ. బ్రాహ్మణ, బ్రాహ్మణీలైన మీరు భారత్ ను స్వర్గంగా తయారుచేస్తారు. పాదాలు మరియు పిలక, పిల్లి మొగ్గలాట ఆడినట్లయితే రెండింటి సంగమము జరుగుతుంది. ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. వినాశనము జరిగితే మా రాజధాని స్థాపనయ్యిందని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మీరంతా శరీరాలను వదిలి అమరలోకంలోకి వెళ్తారు. ఇది మృత్యులోకము.

(పాట) ఎప్పటి నుండి ప్రేమ కలిగిందో. దీని అర్థము, చాలా కాలంగా ప్రేమ కలిగినవారు ఉన్నత పదవిని పొందుతారు మరియు కొత్తగా ప్రేమ కలిగినవారు తక్కువ పదవిని పొందుతారని కాదు. అలా కాదు, మొత్తం అంతా పురుషార్థంపై ఆధారపడి ఉంది. చాలా మంది పాతవారి కన్నా కొత్తవారు చాలా చురుకుగా వెళ్తారని గమనించడం జరుగుతుంది, ఎందుకంటే ఇక చాలా కొద్ది సమయమే ఉంది కావున శ్రమ చేయడం మొదలుపెడతారు. పాయింట్లు కూడా సహజంగా లభిస్తూ ఉంటాయి. తండ్రి పరిచయాన్ని ఇచ్చి అర్థం చేయించాలి, గీతా భగవంతుడు ఎవరు – శివుడా లేక శ్రీ కృష్ణుడా? వారు రచయిత, ఇతను రచన. కావున తప్పకుండా రచయితను భగవంతుడు అని అంటారు కదా. యజ్ఞాలు, జప-తపాదులు, శాస్త్రాలు మొదలైనవి చదువుతూ కిందకి దిగుతూ వచ్చారని మీరు ఋజువు చేసి చెప్తారు. భగవానువాచ అని చెప్పి అర్థం చేయించినట్లయితే ఎవరికీ కోపం రాదు. అర్ధకల్పం భక్తి కొనసాగుతుంది. భక్తి అనగా రాత్రి. దిగే కళ, ఎక్కే కళ. అందరూ గతిని పొంది, తద్వారా సద్గతిలోకి రావాల్సిందే. ఇది అర్థం చేయించాల్సి ఉంటుంది. చాలా సహజమైన రీతిలో అర్థం చేయించినట్లయితే చాలా సంతోషం కలుగుతుంది. బాబా, మమ్మల్ని ఈ విధంగా తయారుచేస్తున్నారు. ఇప్పుడు ఆత్మకు రెక్కలు లభించాయి. భారంగా ఉన్న ఆత్మ ఇప్పుడు తేలికగా అవుతుంది. దేహ భానం తొలగిపోతే మీరు తేలికగా అవుతారు. తండ్రి స్మృతిలో మీరు ఎంతగా నడుస్తూ వెళ్ళినా అలసట కలగదు. ఇవి కూడా యుక్తులు తెలియజేస్తారు. శరీర భానం తొలగిపోతే గాలి వలె ఎగురుతూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహాభిమానానికి వశమై ఎప్పుడూ అలగకూడదు. సాకారుని ద్వారా తండ్రి మతాన్ని తీసుకోవాలి. ప్రియుడైన ఒక్క పరమాత్మకు సత్యమైన ప్రేయసులుగా అవ్వాలి.

2. ఇల్లు-వాకిళ్ళను సంభాళిస్తూ రాజఋషులుగా అయి ఉండాలి. సుఖధామంలోకి వెళ్తామనే పూర్తి ఆశను పెట్టుకుని పురుషార్థంలో సంపూర్ణ భావనను ఉంచుకోవాలి.

వరదానము:-

ఏదైనా పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడము లేక చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడమనేది మన చేతిలో ఉంది. కొంతమంది స్వభావము చిన్న విషయాన్ని పెద్దదిగా చేసేలా ఉంటుంది మరియు కొందరు పెద్ద విషయాన్ని కూడా చిన్నదిగా చేస్తారు. కావున మాయ యొక్క ఎంత పెద్ద విషయము ఎదురుగా వచ్చినా కానీ మీరు దాని కన్నా పెద్దవారిగా అవ్వండి, అప్పుడది చిన్నదిగా అయిపోతుంది. స్వ-స్థితిలో ఉండడం వలన పెద్ద పరిస్థితి కూడా చిన్నదిగా అనిపిస్తుంది మరియు దానిపై విజయం పొందడం సహజమవుతుంది. నేను కల్ప-కల్పం యొక్క విజయీని అని సమయానికి గుర్తు రావాలి, అప్పుడు ఈ నిశ్చయంతో విజయులుగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top