4 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

August 3, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీరు తండ్రి సమానంగా రూప్-బసంత్ గా (యోగీగా, జ్ఞానీగా) అవ్వాలి, జ్ఞాన యోగాలను ధారణ చేసి, ఆ తర్వాత వ్యక్తిని చూసి దానం చేయాలి’’

ప్రశ్న: -

ఏ పద్ధతి ద్వాపరము నుండి కొనసాగుతూ వస్తుంది కానీ సంగమములో తండ్రి ఆ పద్ధతిని ఆపు చేయిస్తారు?

జవాబు:-

ద్వాపరము నుండి పాదాలకు నమస్కరించే పద్ధతి కొనసాగుతూ వస్తుంది. బాబా అంటారు, ఇక్కడ మీరు ఎవరి పాదాలకు నమస్కరించాల్సిన అవసరము లేదు. నేనైతే అభోక్త (అనుభవాలకు అతీతమైనవాడిని), అకర్త (ఏమీ చేయనివాడిని), అసోచత (ఆలోచనా రహితమైనవాడిని). పిల్లలైన మీరైతే తండ్రి కన్నా పెద్దవారు ఎందుకంటే కొడుకు తండ్రి యొక్క పూర్తి ఆస్తికి యజమానిగా అవుతాడు. కావున యజమానులకు తండ్రినైన నేను నమస్కరిస్తాను. మీరు పాదాలకు నమస్కరించాల్సిన అవసరము లేదు. అయితే చిన్నవారు పెద్దవారి పట్ల గౌరవాన్ని అయితే ఉంచాల్సే ఉంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఎవరైతే ప్రియునితో పాటు ఉన్నారో… (జో పియా కే సాథ్ హై…)

ఓంశాంతి. వర్షమైతే ప్రతి సంవత్సరము పడుతుంది. అది నీటి వర్షము, ఇది జ్ఞాన వర్షము – ఇది కల్ప-కల్పము కురుస్తుంది. ఇది పతిత ప్రపంచము, నరకము. దీనిని విషయ సాగరమని కూడా అంటారు, ఈ విషము అనగా కామాగ్ని వల్లనే భారత్ నల్లగా అయ్యింది. తండ్రి అంటారు, జ్ఞాన సాగరుడినైన నేను జ్ఞాన వర్షముతో తెల్లగా చేస్తాను. ఈ రావణ రాజ్యములో అందరూ నల్లగా అయ్యారు, అందరినీ మళ్ళీ పవిత్రంగా చేస్తాను. మూలవతనములో పతిత ఆత్మలెవ్వరూ ఉండరు. సత్యయుగంలో కూడా పతితులెవ్వరూ ఉండరు. ఇప్పుడిది పతిత ప్రపంచము. కనుక అందరిపై జ్ఞాన వర్షము కురవాలి. జ్ఞాన వర్షంతోనే మళ్ళీ మొత్తము ప్రపంచము పవిత్రంగా అవుతుంది. మేము నల్లగా, పతితంగా అయ్యాము అన్నది ప్రపంచానికి తెలియదు. సత్యయుగంలో పతితులెవ్వరూ ఉండరు. మొత్తం ప్రపంచమే పవిత్రంగా ఉంటుంది. అక్కడ పతితుల యొక్క పేరు-గుర్తులు ఉండవు, అందుకే విష్ణువును క్షీర సాగరములో చూపిస్తారు. దాని అర్థం కూడా మనుష్యులకు తెలియదు. విష్ణువు యొక్క రెండు రూపాలు ఈ లక్ష్మీనారాయణులే అని మీరు అర్థం చేసుకుంటారు. అక్కడ నేతి నదులు ప్రవహిస్తాయని అంటారు కావున తప్పకుండా క్షీర సాగరముండాలి. మనుష్యులైతే విష్ణు భగవానుడు అని అంటారు. మీరు విష్ణువును భగవంతుడని అనలేరు. విష్ణు దేవతాయ నమః, బ్రహ్మా దేవతాయ నమః అని అంటారు. విష్ణువును భగవాన్ నమః అని అనరు. శివ పరమాత్మాయ నమః అని అనడము శోభిస్తుంది. ఇప్పుడు మీకు ప్రకాశము లభించింది. ఉన్నతోన్నతమైన శ్రీ శ్రీ 108 రుద్రమాల అని అంటారు. పై భాగములో పుష్పముంటుంది, తర్వాత లక్ష్మీ-నారాయణులను జంట పూసలు, యుగళ్ అని అంటారు. బ్రహ్మా-సరస్వతులను యుగళ్ అని అనరు, ఈ మాల శుద్ధమైనది కదా. జంట పూసలు అని లక్ష్మీ-నారాయణులను అంటారు. ఇది ప్రవృత్తి మార్గము కదా. ఇది విష్ణువు అనగా లక్ష్మీ-నారాయణుల వంశము. కేవలం లక్ష్మీ-నారాయణులు అని అంటారు కానీ వారి సంతానము కూడా ఉంటారు కదా, ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు విషయ సాగరము నుండి బయటకు వచ్చారు, దానిని కాళింది నది అని కూడా అంటారు. సత్యయుగములోనైతే ఏమీ ఉండదు. సర్పము పై నాట్యం చేసారు, ఇది చేసారు – ఇవన్నీ కట్టుకథలు. అంధ విశ్వాసముతో బొమ్మల పూజను చేస్తూ ఉంటారు. చాలా మంది దేవీల మూర్తులను తయారుచేస్తారు. లక్షల, కోట్ల రూపాయలను ఖర్చు చేసి దేవీలను అలంకరిస్తారు. కొందరైతే సత్యమైన బంగారంతో తయారుచేసిన నగలు మొదలైనవి కూడా వేస్తారు ఎందుకంటే బ్రాహ్మణులకు దానము ఇవ్వాల్సి ఉంటుంది. పూజలు చేయించే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో, వారు చాలా ఖర్చు పెట్టిస్తారు, ఎంతో వైభవముగా దేవీల ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు. దేవీలను తయారుచేసి, పాలన చేసి, మళ్ళీ వాటిని అలంకరించి ముంచేస్తారు. దీనిని బొమ్మలపూజ అని అంటారు. ఇది ఏ విధంగా అంధ విశ్వాసంతో కూడిన పూజ అన్నది భాషణలో మీరు అర్థం చేయించవచ్చు. గణేశుడిని కూడా చాలా బాగా తయారుచేస్తారు. ఇప్పుడు తొండము కల మనుష్యులెవ్వరూ ఉండరు. ఎన్ని చిత్రాలను తయారుచేస్తారు, ధనాన్ని ఖర్చు చేస్తారు.

తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు – నేను మిమ్మల్ని ఎంతటి షావుకార్లుగా, పూర్తిగా విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను. ఇది పరమాత్మ కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. కల్పక్రితము ఎవరైతే చదువుకున్నారో మరియు శ్రీమతముపై నడిచారో, వారే నడుస్తారని కూడా మీకు తెలుసు. చదువుకోకపోతే, అటూ-ఇటూ తిరుగుతూ ఉంటే పాడైపోతారు. ఉన్నత పదవిని పొందలేరు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని అవినాశీ జ్ఞాన రత్నాలతో ఎంత షావుకార్లుగా చేస్తున్నారు. వారికైతే శివుడు మరియు శంకరుని యొక్క అర్థం తెలియదు. శంకరుని ఎదురుగా వెళ్ళి జోలిని నింపండి అని అంటారు, కానీ శంకరుడైతే జోలిని నింపరు. ఇప్పుడు పిల్లలకు తండ్రి అవినాశీ జాన రత్నాలను ఇస్తారు. వాటిని ధారణ చేయాలి. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది. కావున మంచి రీతిలో ధారణ చేయాలి మరియు ధారణ చేయించాలి, దానము చేయాల్సి ఉంటుంది. బాబా అర్థం చేయించారు, దానము కూడా వ్యక్తిని చూసి చేయండి, ఎవరికైతే వినాలని మనసే లేదో, వారి వెనుక సమయాన్ని వృథా చేయకండి. శివుని పూజారులకైనా లేక దేవతల పూజారులకైనా, ఇటువంటి వారికి ప్రయత్నించి దానము చేయాలి, అప్పుడు మీ సమయము వృథా అవ్వదు. మీలోని ప్రతి ఒక్కరూ రూప్-బసంత్ గా (యోగీగా, జ్ఞానీగా) కూడా అవ్వాలి కదా. ఏ విధంగా బాబా రూప్ బసంత్ కదా. వారి రూపము జ్యోతిర్లింగము కాదు, నక్షత్రము వలె ఉంటారు. పరమపిత పరమ ఆత్మ పరంధామములో నివసించేవారు. పరంధామము అన్నింటికన్నా పైన ఉంది కదా. ఆత్మలను పరమాత్మ అని అనరు, వారు పరమ ఆత్మ. ఇక్కడ దుఃఖిత ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారు పరమపితను పిలుస్తారు. వారిని సుప్రీమ్ ఆత్మ అని అంటారు. వారు బిందువు వలె ఉంటారు. వారికి నామ రూపాలేవీ లేవని కాదు. వారు జ్ఞాన సాగరుడు, పతితపావనుడు. ప్రపంచానికి ఇది తెలియదు. పరమపిత పరమాత్మ ఎక్కడ ఉన్నారని అడగండి. సర్వవ్యాపి అని అంటారు. అరే, మీరు వారిని పతితపావనుడని అంటున్నారంటే, వారు పావనంగా ఎలా తయారుచేస్తారు? ఏమీ అర్థం చేసుకోరు, దీనిని అంధకారమయ నగరమని అంటారు. మిమ్మల్ని అయితే బాబా అన్ని విషయాల నుండి విడిపించారు. బాబా అభోక్త (అనుభవాలకు అతీతమైనవారు), అకర్త (ఏమీ చేయనివారు), అసోచత (ఆలోచనా రహితమైనవారు). వీరు ఎప్పుడూ పాదాలకు నమస్కరించనివ్వరు కానీ ద్వాపరము నుండి ఈ పద్ధతి కొనసాగుతూ వచ్చింది. పిల్లలు పెద్దవారి పట్ల గౌరవముంచుతారు. వాస్తవానికి కొడుకు తండ్రి ఆస్తికి వారసునిగా అవుతాడు. తండ్రి అంటారు, మీరు నా ఆస్తికి యజమానులు. యజమానులకు నమస్కరిస్తారు. తండ్రి యజమాని అయి ఉండవచ్చు కానీ మొత్తం ఆస్తి అంతటికీ సత్యమైన యజమానైతే కొడుకే అయినట్లు. కావున మిమ్మల్ని పాదాలకు నమస్కరించండి, ఇది చేయండి అని అనరు. అలా అనరు. పిల్లలు కలుసుకునేందుకు వస్తారు, అప్పుడు కూడా బాబా అంటారు, శివబాబాను స్మృతి చేసి కలవడానికి రండి. ఆత్మ అంటుంది, నేను శివబాబాకు దత్తతగా వెళ్తాను. మనుష్యులు ఈ విషయాల్లో తికమకపడతారు. శివబాబా ఈ బ్రహ్మా ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటారు. కావున వీరు తల్లి అయినట్లు కదా. మేము తల్లిదండ్రులను కలుసుకునేందుకు వచ్చామని మీరు భావిస్తారు. స్మృతి శివబాబాను చేయాలి. కావున వీరు మొదటి తల్లి అయినట్లు. వారసత్వము మీకు శివబాబా నుండి లభిస్తుంది. వీరు కూడా వారి స్మృతిలో ఉంటారు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని ధారణ చేయాలి. రూప్ బసంత్ గా అవ్వాలి. యోగములో ఉన్నట్లయితే, జ్ఞానాన్ని ధారణ చేసి మరియు చేయించినట్లయితే, నా సమానంగా రూప్ బసంత్ గా అవుతారు. మళ్ళీ నాతో పాటు వస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానము ఉంది, తర్వాత ఎప్పుడైతే స్వర్గములోకి వస్తారో, అప్పుడు జ్ఞానము పూర్తయిపోతుంది. అప్పుడిక ప్రారబ్ధము మొదలవుతుంది. ఇక జ్ఞానం యొక్క పాత్ర పూర్తయిపోతుంది. ఇవి చాలా గుప్తమైన విషయాలు, ఎవరో కష్టం మీద అర్థం చేసుకుంటారు. వృద్ధ మాతలకు కూడా తండ్రి ఇదే అర్థం చేయిస్తారు, ఒక్కరినే స్మృతి చేయండి, ఇతరులెవ్వరినీ కాదు. అప్పుడు తండ్రి వద్దకు వెళ్ళి తర్వాత కృష్ణపురిలోకి వెళ్తారు. ఇది కంసపురి. కృష్ణపురిలో కంసుడు కూడా ఉండేవాడని కాదు, ఇవన్నీ కట్టు కథలు. కృష్ణుని తల్లికి 8 మంది పిల్లలను చూపిస్తారు. ఇది నిందించినట్లు. కృష్ణుడిని బుట్టలో పెట్టి యమునా నదిని దాటి తీసుకువెళ్ళారని, అప్పుడు యమునా నది కిందకు వెళ్ళిపోయిందని అంటారు. అక్కడ ఈ విషయాలు ఉండవు. ఇప్పుడు పిల్లలైన మీకు ప్రకాశము లభించింది. తండ్రి అంటారు, ఇంతకుముందు ఏదైతే విన్నారో, దానిని మర్చిపోండి. తండ్రి అంటారు, ఈ యజ్ఞ-తపాదులు మొదలైనవి చేయడం ద్వారా నన్ను ఎవ్వరూ కలుసుకోలేరు. ఆత్మ తమోప్రధానంగా అవ్వడముతో రెక్కలు తెగిపోతాయి. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. హోలికను చేస్తారు, అప్పుడు అగ్నిలో కోకీని (తీపి రొట్టెను) కాలుస్తారు. ఇది ఆత్మ మరియు శరీరం యొక్క విషయము. అందరి శరీరాలు కాలిపోతాయి, ఇకపోతే, ఆత్మ అమరంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు, సత్యయుగములో ఇంతమంది మనుష్యులు, ఇన్ని ధర్మాలు ఉండవు. కేవలం ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము మాత్రమే ఉంటుంది. భారత్ యే అన్నింటికన్నా అతి పెద్ద తీర్థ స్థానము. కాశీకి చాలామంది వెళ్ళి కూర్చునేవారు, ఇప్పుడిక కాశీలో నివసిద్దామని భావించేవారు. ఎక్కడైతే శివుడు ఉన్నారో, అక్కడే మేము శరీరము వదులుతాము అని అనుకునేవారు. చాలామంది సాధువులు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. జయ విశ్వనాథ గంగ అని రోజంతా ఇదే పాటను పాడుతూ ఉంటారు. ఇప్పుడు శివుని ద్వారా నీటి గంగ అయితే వెలువడదు. శివుని ద్వారము వద్ద మరణించడాన్ని ఇష్టపడతారు. ఇప్పుడైతే మీరు ప్రాక్టికల్ గా ద్వారము వద్ద ఉన్నారు. ఎక్కడ ఉన్నా కానీ శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. శివబాబా మా తండ్రి అని మీకు తెలుసు, మనము వారిని స్మృతి చేస్తూ-చేస్తూ వారి వద్దకు వెళ్ళిపోతాము. కావున శివబాబా పట్ల అంతటి ప్రేమ ఉండాలి కదా. వారికి తమకంటూ తండ్రి ఎవ్వరూ లేరు, టీచరూ లేరు, మిగిలిన వారందరికీ ఉన్నారు. బ్రహ్మా, విష్ణు, శంకరులకు కూడా రచయిత ఆ తండ్రే కదా. రచన ద్వారా రచనకు (అది ఎవరైనా కావచ్చు) వారసత్వము లభించజాలదు. వారసత్వమనేది ఎల్లప్పుడూ పిల్లలకు తండ్రి నుండి లభిస్తుంది. మేము జ్ఞాన సాగరుడైన తండ్రి వద్దకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి ఇప్పుడు జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. మీరిప్పుడు పావనంగా అవుతున్నారు. మిగిలినవారంతా తమ-తమ లెక్కాచారాలను సమాప్తము చేసుకుని తమ-తమ ధామానికి వెళ్ళిపోతారు. మూలవతనములో ఆత్మల వృక్షము ఉంది. ఇక్కడ కూడా సాకారీ వృక్షము ఉంది. అక్కడ రుద్ర మాల ఉంది, ఇక్కడ ఉన్నది విష్ణు మాల. తర్వాత చిన్న-చిన్న వంశాలు వెలువడుతూ ఉంటాయి. వంశాలు వెలువడుతూ-వెలువడుతూ వృక్షము పెద్దదిగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆ తర్వాత దేవీ-దేవతా ధర్మమువారు రాజ్యము చేస్తారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా, విశ్వానికి యజమానులుగా అవుతున్నారు కావున భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు అన్న సంతోషం చాలా ఉండాలి. రాజయోగము మరియు జ్ఞానముతో రాజులకే రాజులుగా చేస్తారు. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా తయారుచేస్తారు. సూర్యవంశీయులు తర్వాత చంద్రవంశంలోకి కూడా వస్తారు. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తారు, ప్రకాశాన్ని ఇస్తూ ఉంటారు.

మేఘాలైన మీరు సాగరుని వద్దకు నింపుకునేందుకు వస్తారు. నింపుకుని మళ్ళీ వెళ్ళి వర్షించాలి. నింపుకోకపోతే రాజ్య పదవిని పొందరు, ప్రజల్లోకి వెళ్తారు. ప్రయత్నించి ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడైతే ఒకరు ఒకరిని, మరొకరు మరొకరిని తలచుకుంటూ ఉంటారు, అనేక పేర్లు ఉన్నాయి. తండ్రి వచ్చి వందేమాతరం అని అంటారు. ద్రౌపది పాదాలను ఒత్తినట్లుగా చూపిస్తారు కూడా. బాబా వద్దకు వృద్ధ మాతలు వస్తారు, అప్పుడు బాబా వారితో, బచ్చీ, అలసిపోయావా అని అంటారు. ఇప్పుడు కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. మీరు ఇంట్లో కూర్చుని శివబాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా వికర్మాజీతులుగా అవుతారు. ఇతరులను తమ సమానంగా తయారుచేయకపోతే ప్రజలు ఎలా తయారవుతారు. చాలా శ్రమించాలి. ధారణ చేసి మళ్ళీ ఇతరులను కూడా తమ సమానంగా తయారుచేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రతి విషయంలో తమ సమయాన్ని సఫలము చేసుకోవాలి. దానము కూడా వ్యక్తిని (పాత్రుడిని) చూసి చేయాలి. ఎవరైతే వినాలనుకోరో, వారి వెనుక సమయాన్ని వృథా చేయకూడదు. తండ్రి యొక్క భక్తులకు మరియు దేవతల యొక్క భక్తులకు జ్ఞానము ఇవ్వాలి.

2. అవినాశీ జాన రత్నాలను ధారణ చేసి షావుకార్లుగా అవ్వాలి. చదువును తప్పకుండా చదువుకోవాలి. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది, కావున వీటిని ధారణ చేయాలి మరియు చేయించాలి.

వరదానము:-

అన్నింటికన్నా సహజమైన నిరంతర స్మృతి యొక్క సాధనము – సదా తండ్రి తోడు యొక్క అనుభవం ఉండాలి. తోడు యొక్క అనుభూతి స్మృతి యొక్క శ్రమ నుండి విడిపిస్తుంది. తోడుగా ఉన్నారంటే స్మృతి తప్పకుండా ఉంటుంది కానీ ఇక్కడ తోడుగా ఉండడమంటే కేవలం తోడుగా కూర్చోవడము కాదు, కానీ సహచరునిగా ఉండడము అనగా సహాయకునిగా ఉండడము. తోడుగా ఉన్నవారిని ఎప్పుడైనా మర్చిపోవచ్చు కానీ సహచరునిగా ఉన్నవారిని మర్చిపోరు. కనుక ప్రతి కర్మలో తండ్రి ఎటువంటి సహచరుడంటే వారు కష్టాన్ని కూడా సహజము చేస్తారు. ఇటువంటి సహచరుని యొక్క తోడు సదా అనుభవం అవుతూ ఉన్నట్లయితే సిద్ధి స్వరూపులుగా అవుతారు.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

మనం ఈ కనులతో ఏదైతే చూస్తున్నామో, ఇప్పుడిది ఈ కలియుగ అంతిమమని మరియు సత్యయుగీ దైవీ ప్రపంచ స్థాపన జరుగుతుందని తెలుసు. మన దృష్టిలో ఈ కలియుగీ ప్రపంచం సమాప్తమయ్యే ఉంది. ఎలాగైతే గీతలో భగవంతుని మహావాక్యాలు ఉన్నాయి – పిల్లలూ, ఈ గురువులు, పండితులు మొదలైనవారిని ఎవరినైతే చూస్తున్నారో, వీరంతా మరణించే ఉన్నారు. నిజానికి మనం ఏమని భావిస్తున్నామంటే, ఇన్ని మనుష్య సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఇనుప యుగము వరకు చేరుకున్నాయి అని, అందుకే పరమాత్మ మహావాక్యాలు ఉన్నాయి, నేను ఈ ఆసురీ ప్రపంచాన్ని వినాశనం చేసి దైవీ సృష్టిని స్థాపన చేస్తాను. అందుకే మనము, అందరూ మరణించే ఉన్నారు అని అనగలము. కనుక మనకు ఈ ప్రపంచముతో ఎటువంటి కనెక్షన్ లేదు. పాత ప్రపంచము జీవించి ఉన్నట్లుగా చూడకండి, కొత్త ప్రపంచం కోసం 7 రోజుల కోర్సు తీసుకోండి అని అంటారు ఎందుకంటే కొత్త ప్రపంచం స్థాపన అయితే అనగా జీవిస్తే మన కోసం ఇక ఈ ప్రపంచం లేనే లేనట్లు. మనుష్యులు, మేము మంచి కర్మలు చేసినట్లయితే, దాన-పుణ్యాలు చేసినట్లయితే, మళ్ళీ వచ్చి ఈ ప్రపంచంలోనే అనుభవిస్తాము అని భావిస్తారు. కానీ ఈ ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నదని మనం తెలుసుకున్నాము. ఈ వినాశీ ప్రపంచము యొక్క ప్రారబ్ధము వినాశీ అయినదే. ఇది జన్మ-జన్మాంతరాలు కొనసాగదు, ఇప్పుడు చూడండి, మన దృష్టికి మరియు ప్రపంచం దృష్టికి ఎంత వ్యత్యాసం ఉంది. మమ్మల్ని చదివించేవారు ఎవరు అన్న నిశ్చయం ఏర్పడినప్పుడే ఈ నిశ్చయం కూడా కూర్చుంటుంది. అచ్ఛా – ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top