2 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

August 1, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - చదువును స్మరిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ ఏ విషయములోనూ తికమకపడరు, మమ్మల్ని చదివించేవారు స్వయంగా నిరాకార భగవంతుడు అన్న నషా సదా ఉండాలి’’

ప్రశ్న: -

ఈ జ్ఞాన రత్నాల యొక్క అవినాశీ నషా ఏ పిల్లలకు ఉండగలదు?

జవాబు:-

పేద పిల్లలకు ఉండగలదు. పేద పిల్లలే తండ్రి ద్వారా పదమాపదమపతులుగా అవుతారు. వారు మాలలో కూర్చబడగలరు. షావుకార్లకైతే తమ వినాశీ ధనము యొక్క నషా ఉంటుంది. బాబాకు ఈ సమయంలో కోటీశ్వరులైన పిల్లలు అవసరము లేదు. పేద పిల్లల యొక్క పైసా-పైసాతోనే స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది ఎందుకంటే పేదవారే షావుకార్లుగా అవ్వనున్నారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఈ పాపపు ప్రపంచము నుండి… (ఇస్ పాప్ కీ దునియా సే…)

ఓంశాంతి. బాప్ దాదా యొక్క మధురాతి-మధురమైన పిల్లలకు తెలుసు, మనం ఇప్పుడు ఎటువంటి స్థానానికి వెళ్తున్నామంటే, అక్కడ దుఃఖం యొక్క నామ రూపాలే ఉండవు, దాని పేరే సుఖధామము. మనము ఆ సుఖధామానికి లేక స్వర్గానికి యజమానులుగా ఉండేవారము. సుఖధామంలోనైతే సత్యయుగము మాత్రమే ఉండేది, దేవీ-దేవతల రాజ్యముండేది. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయిన మీరు బ్రహ్మా ముఖవంశావళి. మీరు రాస్తారు కూడా – శివబాబా, కేర్ ఆఫ్ బ్రహ్మాకుమారీస్. తప్పకుండా మనది ఎక్కే కళ అని కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఎక్కే కళ మరియు దిగే కళ గురించి పిల్లలైన మీరు మంచి రీతిలో అర్థం చేసుకున్నారు. భారత్ ఎక్కే కళలో ఉన్నప్పుడు, వారిని దేవీ-దేవతలని అనేవారని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దిగే కళలో ఉన్నారు, అందుకే వారిని దేవీ-దేవతలని అనలేరు. ఇప్పుడు స్వయాన్ని మనుష్యులుగా భావిస్తారు. మందిరాలలోకి వెళ్ళి దేవీ-దేవతల ఎదురుగా తల వంచి నమస్కరిస్తారు. వీరు ఒకప్పుడు ఉండి వెళ్ళారని భావిస్తారు. ఎప్పుడు? ఈ విషయం తెలియదు. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు – క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితము భారత్ స్వర్గంగా ఉండేది. చక్రము ఇప్పుడు తిరిగేదే ఉందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. పతిత ప్రపంచము పావనంగా అవ్వాల్సిందే. మనము తండ్రి ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి చదివిస్తున్నారు – ఈ నషా ఎక్కాలి కదా. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అన్నది భగవానువాచ అని అంటూ ఉంటారు కూడా. తండ్రికి బదులుగా కొడుకు పేరు వేసేసారు, కేవలం ఈ పొరపాటు చేసారు. ఈ పొరపాటును కూడా కేవలం పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు, ఇతరులెవ్వరూ అర్థం చేసుకోరు.

మేము మళ్ళీ మా శాంతిధామము నుండి సుఖధామానికి వెళ్ళేందుకు పావనంగా అవుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలోకి వచ్చింది. పతితపావనా రండి, అని పాడుతారు కూడా. పతితిపావనుడైతే గాడ్ ఫాదర్ మాత్రమే. కృష్ణుడిని అలా అనలేరు. ఇది బుద్ధిలో స్మరణ చేస్తూ ఉండాలి. స్కూల్లో పిల్లల బుద్ధిలో చదువు యొక్క స్మరణ నడుస్తుంది కదా. మీరు కూడా ఒకవేళ ఈ స్మరణ చేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ తికమకపడరు. ఇప్పుడు మనది ఎక్కే కళ అని మీకు తెలుసు. క్షణంలో జీవన్ముక్తి అని కూడా అంటూ ఉంటారు. కొడుకు జన్మించగానే వారసత్వానికి హక్కుదారునిగా అవుతాడు. కానీ అది జీవన్ముక్తి యొక్క వారసత్వమేమీ కాదు. ఇక్కడ మీకు జీవన్ముక్తి యొక్క రాజ్య భాగ్యము లభిస్తుంది. తండ్రి నుండి తప్పకుండా లభించాలి కూడా. భారత్ కు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము ఇంతకుముందు కూడా లభించిందని, ఇప్పుడు మళ్ళీ లభించనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు మీరు శ్రీమతముపై నడుస్తూ వారసత్వాన్ని పొందుతున్నారు. భక్తి మార్గంలో ఎవరో ఒకరిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. చిత్రాలు కూడా అందరివీ ఉన్నాయి, అవి పూజించబడతాయి కదా. ఈ రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. ఈ విషయాలను కోట్లలో కొందరు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు మరియు నిశ్చయం ఏర్పరచుకుంటారు, కొంతమంది సంశయపడతారు. ఎవరికీ సంశయం రాకూడదు, అందుకే మొదట సంబంధం యొక్క విషయాన్ని అర్థం చేయించాలి. అర్జునుడికి భగవంతుడు కూర్చుని అర్థం చేయించారని గీతలో కూడా ఉంది కదా. ఇప్పుడు గుర్రపు బండిలో కూర్చుని రాజయోగాన్ని నేర్పించడమనేదైతే జరగదు. రాజయోగాన్ని ఏమైనా అలా కూర్చుని నేర్పిస్తారా. ఇప్పుడు అది అసత్యము అయినట్లు. విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా చూపిస్తారు మరియు బ్రహ్మా చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. వీరు సూక్ష్మవతనములోనైతే ఉండరు. కావున ఇక్కడే సారాన్ని అర్థం చేయిస్తారు కదా. ఇలాంటి-ఇలాంటి చిత్రాలపై మీరు అర్థం చేయించవచ్చు. ప్రదర్శనీలో కూడా ఈ చిత్రాలు తప్పకుండా ఉపయోగపడతాయి. సూక్ష్మవతనము యొక్క విషయమే లేదు. బ్రహ్మా ముఖం ద్వారా ఎవరికి అర్థం చేయించాలి? అక్కడ ఉన్నదే బ్రహ్మా, విష్ణు, శంకరులు. మరి శాస్త్రాల సారాన్ని ఎవరికి అర్థం చేయించాలి? ఇవన్నీ భక్తి మార్గం యొక్క కర్మకాండలని మీకు తెలుసు. సత్య, త్రేతా యుగాలలో ఈ భక్తి మార్గం ఉండజాలదు. అక్కడ ఉన్నదే దేవతల రాజధాని. అక్కడ భక్తి ఎలా ఉండగలదు. ఈ భక్తి తర్వాత ఉంటుంది. పిల్లలైన మీకు తెలుసు, నిశ్చయబుద్ధి కలవారే విజయులుగా అవుతారు, తండ్రి పట్ల నిశ్చయం పెట్టుకున్నట్లయితే తప్పకుండా రాజ్యాధికారం లభిస్తుంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, నేను స్వర్గ స్థాపన చేసేవాడిని, పతితులను పావనముగా చేసేవాడిని. శివుడిని ఎప్పుడూ తెల్లగా, నల్లగా ఉంటారని అనరు. కృష్ణుడినే శ్యామ సుందరుడని అంటారు. శివుడైతే చక్రములోకి రారు అని కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. వారిని నల్లగా లేక తెల్లగా చూపించలేరు. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలైన మీదిప్పుడు ఎక్కే కళ. నల్లగా ఉన్నవారి నుండి తెల్లగా అవ్వాలి. భారత్ సుందరంగా ఉండేది, ఇప్పుడు నల్లగా ఎందుకు అయ్యింది! కామ చితిపై కూర్చోవడంతో అలా జరిగింది. సాగరుని పిల్లలను కామము కాల్చి భస్మము చేసిందని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని జ్ఞాన చితిపై కూర్చోబెడతారు. మీపై జ్ఞాన వర్షము కురుస్తుంది. ఇదొక్కటే సత్యమైన సాంగత్యమని కూడా అర్థం చేసుకున్నారు. పరమపిత పరమాత్మ, ఎవరైతే స్వర్గాన్ని స్థాపన చేస్తారో, వారిని అమరనాథ్ అని కూడా అంటారు, కనుక వారు తప్పకుండా పిల్లలకు ఇక్కడ కూర్చుని అర్థం చేయిస్తారు కదా! పర్వతముపై కేవలం ఒక్క పార్వతికి మాత్రమే వినిపిస్తారా ఏమిటి? వారికైతే మొత్తం పతిత ప్రపంచాన్ని పావనంగా చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక్కరి విషయమే కాదు. మనమే పావన ప్రపంచానికి యజమానులుగా ఉండేవారమని, మళ్ళీ మనమే అలా అవుతామని మీకు తెలుసు. కల్పవృక్షం గురించి కూడా అర్థం చేయించారు, చివర్లో కూడా చిన్న-చిన్న కొమ్మలు-రెమ్మలు వెలువడతాయి. ఇవన్నీ చిన్న-చిన్న మఠాలు, మార్గాలు. మొట్టమొదట చాలా సుందరమైన ఆకులు వెలువడతాయి. ఎప్పుడైతే వృక్షము శిథిలావస్థకు చేరుకుంటుందో, అప్పుడిక కొత్త ఆకులు రావు, అలాగే ఫలాలు కూడా వెలువడవు. ప్రతి విషయాన్ని తండ్రి పిల్లలకు మంచి రీతిలో అర్థం చేయిస్తూ ఉంటారు. మీ యుద్ధము కూడా మాయతో ఉంది. ఇంతటి ఉన్నతమైన పదవి కావున తప్పకుండా ఎంతోకొంత శ్రమించాల్సి ఉంటుంది కదా! చదువుకోవాలి కూడా, పవిత్రంగా కూడా అవ్వాలి. అర్ధకల్పము రావణ రాజ్యం నడిచింది మరియు ఇప్పుడు రామ రాజ్యముగా అవ్వనున్నది. రామ రాజ్యము ఉండాలని అంటారు కూడా. కానీ ఎప్పుడు మరియు ఎలా ఉంటుంది అన్నది వారికి తెలియదు. శాస్త్రాల్లోనైతే ఈ విషయాలు లేవు. పాండవులు పర్వతాలపై కరిగి మరణించారు అన్నట్లు చూపిస్తారు. అచ్ఛా, తర్వాత ఏమయ్యింది? ప్రళయమైతే జరగదు. ఒక వైపు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారని చూపిస్తారు. మీరు భవిష్యత్తులో రాజులకే రాజుగా అవుతారని తండ్రి అంటారు, మరో వైపు పాండవులు అంతమైపోయారు అన్నట్లు చూపిస్తారు. ఇది ఎలా జరగగలదు! కొత్త ప్రపంచం యొక్క స్థాపన ఎలా జరుగుతుంది? శ్రీకృష్ణుడు ఎక్కడ నుండి వస్తారు? తప్పకుండా బ్రాహ్మణులు కావాలి.

మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళే పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. ఇక్కడకు జ్ఞాన సాగరుని వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. అక్కడ జ్ఞాన గంగల ద్వారా వింటారు. అమరనాథ్ వద్ద మానస సరోవరమనే ఒక చెరువును చూపిస్తారు. అందులో స్నానము చేయడంతో దేవకన్యలుగా అవుతారని అంటారు. వాస్తవానికి ఇది జ్ఞాన మానస సరోవరము. జ్ఞాన సాగరుడైన తండ్రి కూర్చుని జ్ఞాన స్నానము చేయిస్తారు, దానితో మీరు స్వర్గము యొక్క దేవకన్యలుగా అవుతారు. దేవకన్యల పేరు విని అటువంటి రెక్కలు గల మనుష్యులను చూపించారు. వాస్తవానికి రెక్కలు మొదలైనవాటి విషయమేమీ లేదు. ఆత్మ ఎగిరేందుకు ఇప్పుడు రెక్కలు తెగిపోయాయి. శాస్త్రాల్లోనైతే ఏమేమి విషయాలను రాసేసారు. వీరు కూడా చాలా శాస్త్రాలు చదివి ఉన్నారు. వీరితో కూడా తండ్రి అంటారు, నీకు నీ జన్మల గురించి తెలియదు. నేను నీ అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. కృష్ణుడిది సత్యయుగము యొక్క మొదటి జన్మ. స్వయంవరం తర్వాత మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. కనుక ఎవరైతే శ్రీనారాయణునిగా ఉండేవారో, వారు అనేక జన్మల అంతిమంలో ఇప్పుడు సాధారణంగా ఉన్నారు. మళ్ళీ తప్పకుండా వారి తనువులోకే రావాల్సి ఉంటుంది. చాలా మంది, భగవంతుడు పతిత ప్రపంచంలోకి ఎలా వస్తారని అంటారు! అర్థం చేసుకోని కారణంగా అందరికన్నా పావనమైన శ్రీకృష్ణుని పేరును వేసేసారు, కానీ శ్రీకృష్ణుడిని అందరూ భగవంతునిగా అంగీకరించరు. భగవంతుడైతే నిరాకారుడు. వారి పేరు శివునిగా ప్రసిద్ధి చెందింది. ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడ ఉన్నారు. సూక్ష్మవతనములోనైతే బ్రహ్మా-విష్ణు-శంకరులు ఉన్నారు. ఇది కూడా మంచి రీతిలో అర్థం చేయించాలి. ధారణ చాలా బాగుండాలి. పరస్పరములో ఒకరికొకరు ఈ స్మృతినిప్పించుకోవాలి. బాబాను స్మృతి చేస్తారు, 84 జన్మల చక్రాన్ని స్మృతి చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్తారు. ఈ పాత ప్రపంచాన్ని, పాత వస్త్రాన్ని, అన్నింటినీ త్యాగము చేయాలి. ఇప్పుడు మనము కొత్త ప్రపంచము కోసం తయారవుతున్నాము. ఇక పాత ప్రపంచం యొక్క నషా ఉండదు. ఇది అవినాశీ జ్ఞాన రత్నాల నషా, ఆ నషా తొలగడము కష్టంగా ఉంటుంది. పేదవారి నషా తొలగిపోతుంది. తండ్రి అంటారు – నేను పేదల పెన్నిధిని, ఇక్కడికి రావడము కూడా పేదవారే వస్తారు. ఈ రోజుల్లోనైతే కోటీశ్వరులనే ధనవంతులని అంటారు. లక్షాధికారులను ధనవంతులని అనరు. వారు ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. తండ్రి అంటారు, కోటీశ్వరులైతే నాకు అవసరమే లేదు. ఏం చేసుకుంటాను! నేను పేదవారి పైసా-పైసాతో స్వరాజ్యాన్ని స్థాపన చేయాల్సి ఉంటుంది. నేను పక్కా వ్యాపారిని కూడా. అనవసరంగా ఎందుకు తీసుకుంటాను, అలా తీసుకుంటే మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు వారితో ఇచ్చి-పుచ్చుకోవడము ఉంది, అందుకే భోళానాథుడని అంటారు. అత్యంత పేదవారే మాలలో కూర్చబడతారు. అంతా పురుషార్థంపైనే ఆధారపడి ఉంది, ఇందులో ధనము యొక్క విషయమేమీ లేదు. చదువు విషయంలో పేదవారు మంచిగా అటెన్షన్ పెడతారు. చదువైతే ఒక్కటే కదా. పేదవారు బాగా చదువుకుంటారు ఎందుకంటే షావుకార్లకైతే ధనము యొక్క నషా ఉంటుంది.

మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని, ఇప్పుడు నిరుపేదగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చారు, 84 జన్మల చక్రంలోనైతే తప్పకుండా తిరగాలి. పునర్జన్మలు కూడా ఋజువు చేస్తారు. చాలా కాలం క్రితం విడిపోయి కలిసిన ప్రియమైన పిల్లలైన మీరు మాత్రమే 84 జన్మల చక్రములోకి వస్తారు. ఇది కూడా మీకు తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. చక్రం పూర్తి అవుతుందని, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలని మీకు తెలుసు. చదువును నెమరువేయాలి. చిత్రము పెట్టి ఉంటే, దానిని చూసి చక్రము గుర్తుకొస్తుంది. పాటల్లో కూడా కొన్ని-కొన్ని చాలా బాగున్నాయి, వాటిని వినడంతో నషా ఎక్కుతుంది. మీరు ఇప్పుడు శివబాబాకు చెందినవారిగా అయ్యారు, ఇప్పుడు మీకు వారసత్వం నిరాకారుడి నుండి సాకారుని ద్వారా లభిస్తుంది. సాకారంలోకి రానంతవరకు నిరాకారుడు ఎలా ఇస్తారు. కనుక నేను వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తానని అంటారు. ప్రజాపిత కూడా ఇక్కడ కావాలి కదా. బ్రహ్మా పేరు ప్రసిద్ధి చెందింది, బ్రహ్మా ముఖ వంశావళి ఉన్నారు. పిల్లలకు పిల్లిమొగ్గలాట కూడా అర్థం చేయించబడింది. మనము ఇప్పుడు బ్రాహ్మణులము, తర్వాత దేవతలుగా అవుతాము. పిలక కనిపిస్తుంది. పైన శివబాబా నక్షత్రము వలె ఉన్నారు, ఎంత సూక్ష్మముగా ఉన్నారు. వారు ఇంత పెద్ద లింగము కాదు, దీనిని పూజ కోసం అలా తయారుచేసారు. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు ఒక పెద్ద శివలింగాన్ని మరియు చిన్న-చిన్న సాలిగ్రామాలను తయారుచేస్తారు. షావుకార్లు చాలా ఎక్కువ తయారుచేస్తారు. ఇదంతా ద్వాపరము నుండి భక్తి మార్గంలో మొదలవుతుంది. మొదట 16 కళలు ఉంటాయి, తర్వాత 14 కళలు, ఆ తర్వాత కళలు తగ్గిపోతూ-తగ్గిపోతూ ఇప్పుడు ఏ కళ మిగలలేదు. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి ఇంకే కష్టాన్ని ఇవ్వరు. నోట్ చేసుకుంటూ వెళ్ళండి, పతులకే పతి అయినవారిని ఎంత సమయం స్మృతి చేసాను! అవ్యభిచారీ నిశ్చితార్థము కావాలి కదా. మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరినీ మర్చిపోవాలి. ఒక్కరితోనే ప్రీతిని ఉంచుకోవాలి. ఈ విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి వెళ్ళాలి. ఆత్మల నివాస స్థానమైతే బ్రహ్మ తత్వములో ఉంది. క్షీరసాగరంలో విష్ణువును చూపిస్తారు. విష్ణువు మరియు బ్రహ్మా. బ్రహ్మా ద్వారా మీకు అర్థం చేయిస్తారు, ఆ తర్వాత మీరు విష్ణుపురిలోకి, క్షీర సాగరములోకి వెళ్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇంకే కష్టాన్ని ఇవ్వను. వారు కేవలం ఇలా అంటారు – ఓ ఆత్మలూ, నన్ను స్మృతి చేయండి. నేను మిమ్మల్ని పాత్రను అభినయించేందుకు పంపించాను. వారు మీకు స్మృతినిప్పిస్తారు – వివస్త్ర (అశరీరి)గా వచ్చారు. మొట్టమొదట మీరు దేవతలుగా అయ్యి స్వర్గములోకి వచ్చారు. భగవంతుడు అందరికీ తండ్రి అన్నప్పుడు అందరూ స్వర్గములోకి రావాలి కదా! కానీ అన్ని ధర్మాల వారైతే రాలేరు. 84 జన్మలు దేవతలు మాత్రమే తీసుకున్నారు. వారు మాత్రమే వస్తారు. ఈ విషయాలన్నింటినీ మీరు తప్ప ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. మంచి బుద్ధి కలవారే ధారణ చేస్తారు. సమయం కొద్దిగా ఉంది, కేవలం తమను తాము ఆత్మగా భావించండి. నేను ఒక శరీరాన్ని విడిచి మరొకదానిని తీసుకుంటాను, 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడిది అంతిమ జన్మ. ఆత్మ సత్యమైన బంగారంగా అవుతుంది. సత్యయుగంలో సత్యమైన ఆభరణాలు ఉండేవి, ఇప్పుడు అన్నీ అసత్యమైనవి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మీరు జ్ఞాన చితిపై కూర్చున్నారు, తెల్లగా అవుతారు. శ్వాస-శ్వాసలోనూ స్మృతి చేసినట్లయితే ఆ అవస్థ అంతిమంలో వస్తుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. క్షీరసాగరములోకి వెళ్ళేందుకు ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతిని ఉంచుకోవాలి. ఒక్కరి అవ్యభిచారి స్మృతిలోనే ఉండాలి మరియు అందరికీ ఒక్క తండ్రి స్మృతినిప్పించాలి.

2. వినాశీ ధనం యొక్క నషాను ఉంచుకోకూడదు. జ్ఞాన ధనం యొక్క నషాలో స్థిరంగా ఉండాలి. చదువు ద్వారా ఉన్నత పదవిని పొందాలి.

వరదానము:-

కర్మయోగీ పిల్లలకు కర్మలో తండ్రి తోడు ఉన్న కారణంగా ఎక్స్ ట్రా సహాయము లభిస్తుంది. ఏ పని అయినా సరే, అది ఎంత కష్టమైనదైనా కావచ్చు, కానీ తండ్రి సహాయము అనేది ఉల్లాస-ఉత్సాహాలను, ధైర్యాన్ని మరియు అలసటలేనితనము యొక్క శక్తిని ఇచ్చేటువంటిది. ఏ కార్యములోనైతే ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో, అది తప్పకుండా సఫలమవుతుంది. తండ్రి తమ చేతితో పని చేయరు కానీ సహాయాన్ని ఇచ్చే పనిని తప్పకుండా చేస్తారు. కనుక మీరు మరియు తండ్రి – ఇటువంటి కర్మయోగీ స్థితి ఉన్నట్లయితే ఎప్పుడూ అలసట అనుభవమవ్వదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top