30 July 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

July 29, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఈ పాత ప్రపంచము, పాత శరీరములో ఎటువంటి మజా లేదు, అందుకే దీని నుండి జీవిస్తూ మరణించి తండ్రికి చెందినవారిగా అవ్వండి, సత్యమైన దీపపు పురుగులుగా అవ్వండి’’

ప్రశ్న: -

సంగమయుగం యొక్క ఫ్యాషన్ ఏమిటి?

జవాబు:-

ఈ సంగమయుగంలోనే పిల్లలైన మీరు ఇక్కడ కూర్చుని-కూర్చుని మీ మెట్టినిల్లు అయిన వైకుంఠం యొక్క విహారము చేసి వస్తారు. ఇది కేవలం సంగమయుగము యొక్క ఫ్యాషనే. సూక్ష్మవతనము యొక్క రహస్యం కూడా ఇప్పుడే తెరుచుకుంటుంది.

ప్రశ్న: -

ఏ విధి ద్వారా పేదరికాన్ని మరియు దుఃఖాలను సులభంగానే మర్చిపోగలరు?

జవాబు:-

అశరీరిగా అయ్యే అభ్యాసం చేసినట్లయితే పేదరికాన్ని మరియు దుఃఖాన్ని, అంతా మర్చిపోతారు. పేద పిల్లల వద్దకే తండ్రి షావుకార్లుగా చేయడానికి వస్తారు. పేద పిల్లలే తండ్రికి దత్తతగా వస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

సభలో దీపము వెలిగింది… (మహఫిల్ మే జల్ ఉఠీ శమా… )

ఓంశాంతి. ఆత్మలకు తమ పారలౌకిక తండ్రి పరమపిత పరమాత్మతో ప్రీతి ఏర్పడుతుంది. బాబా మనల్ని ఇక్కడ నుండి తీసుకువెళ్తారని మీకు తెలుసు. ఎవరి ఆత్మ అయినా శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కష్టపడతారు. ఏ విధంగానైతే సావిత్రి సత్యవంతుని కథను చెప్తారు. అతని ఆత్మ మళ్ళీ శరీరంలోకి రావాలని ఆమె ఎంతగా అతని వెంట పడింది. కానీ ఆమెలో జ్ఞానమైతే లేదు. మీలో జ్ఞానముంది, మనలోని ప్రతి ఒక్కరికీ ఆ పరమపిత పరమాత్మ పట్ల ప్రీతి కూడా ఉంది. ప్రీతి ఎందుకు ఏర్పడింది? మరణించేందుకు. తండ్రి పట్ల గల ఈ ప్రీతి అయితే చాలా బాగుంది. ఆత్మలు అర్ధకల్పము భక్తి మార్గంలో మేము మా ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్ళాలి అని ఎదురుదెబ్బలు తింటారు. నిజంగా అలా జరుగుతుంది కూడా. తండ్రి కూడా అంటారు, అశరీరిగా అవ్వండి, మరణించండి. ఆత్మ శరీరము నుండి వేరైనప్పుడు దానిని మరణించడము అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, ఈ ప్రపంచము నుండి లేక ఈ బంధనము నుండి మరణించండి అనగా నా వారిగా అవ్వండి. ఈ పాత ప్రపంచము, పాత శరీరములో ఎటువంటి మజా లేదు. ఇది చాలా ఛీ-ఛీ ప్రపంచము. ఇది తప్పకుండా రౌరవ నరకము. ఇప్పుడు నాకు చెందినవారిగా అవ్వండి అని పిల్లలైన మీకు చెప్తాను. నేను సుఖధామంలోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను, అక్కడ దుఃఖము యొక్క పేరే ఉండదు, అందుకే ఈ దీపముపై సంతోషంగా దీపపు పురుగులుగా అవ్వండి. దీపపు పురుగులు పరుగు-పరుగున సంతోషంగా వస్తాయి కదా. కొన్ని దీపపు పురుగులు ఎలా ఉంటాయంటే, జ్యోతి వెలిగినప్పుడు జన్మిస్తాయి, దీపము ఆరిపోయినప్పుడు మరణిస్తాయి. దీపావళి నాడు చిన్న-చిన్న ఆకుపచ్చని రంగు దీపపు పురుగులు చాలా వస్తాయి. దీపముపై బలిహారమవుతాయి. దీపము ఆరిపోతూనే అవి మరణిస్తాయి. ఇప్పుడు వీరైతే చాలా పెద్ద దీపము. తండ్రి అంటారు, మీరు కూడా దీపపు పురుగుల వలె సమర్పణ అవ్వండి. మీరు చైతన్యమైన మనుష్యులు, దేహపు బంధనాలు ఏవైతే ఉన్నాయో, వాటిని జీవిస్తూనే వదిలేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నాతో యోగము జోడించండి. సంతోషంగా ఉన్నట్లయితే ఈ శరీర భానము తొలగిపోతుంది. ఆత్మలమైన మనము ఈ ప్రపంచాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము. ఇప్పుడు ఈ ప్రపంచం దేనికీ పనికి రాదు, దీనిపై మనస్సు పెట్టుకోకండి. ఈ ప్రపంచంలో చాలామంది పేదవారు ఉన్నారు. పేదవారే దుఃఖితులుగా అవుతారు.

తండ్రి అంటారు, పిల్లలూ, ఇప్పుడు అశరీరిగా అవ్వండి. ఆత్మలమైన మనము అక్కడ శాంతిధామంలో ఉండేవారము. ఇప్పుడైతే పవిత్రంగా అవ్వనంత వరకు ఆ శాంతిధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు. ఈ సమయంలో అందరి రెక్కలు తెగిపోయి ఉన్నాయి. ఎవరైతే స్వయాన్ని భగవంతునిగా భావిస్తూ కూర్చున్నారో, అందరికన్నా ఎక్కువగా వారి రెక్కలు తెగిపోయి ఉన్నాయి. అటువంటప్పుడు వారు ఎక్కడికి తీసుకువెళ్తారు. స్వయం వారే వెళ్ళలేకపోతే, మీ సద్గతిని ఎలా చెయ్యగలరు, అందుకే భగవంతుడు అన్నారు, ఈ సాధువులను కూడా నేను ఉద్ధరించాలి. కేవలం వారు కృష్ణ భగవానువాచ అని భావిస్తారు, కానీ అది శివ భగవానువాచ. శివుడు ఉన్నదే అశరీరి. కనుక తప్పకుండా ప్రజాపిత బ్రహ్మా నోటి ద్వారానే అర్థం చేయిస్తారు. మనుష్యుల రచన ప్రజాపిత బ్రహ్మా ద్వారా జరుగుతుంది. ఇది అందరూ అంగీకరిస్తారు. ఎవరినైనా అడగండి, దానితో వారికి, నిజంగా తండ్రి పిల్లలను ఎందుకు రచిస్తారు అన్నది అర్థమవ్వాలి. తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి రచిస్తారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచించారు. తండ్రి స్వర్గానికి యజమానులుగా చేయడానికి మనల్ని చదివిస్తారు, రాజయోగాన్ని నేర్పిస్తారని మీకు తెలుసు. తండ్రి ప్రపంచాన్ని మార్చడానికి, నరకాన్ని స్వర్గంగా తయారుచేయడానికి, మనుష్య సృష్టిని దైవీ సృష్టిగా తయారుచేయడానికి వస్తారు. వారే సుఖము ఇవ్వడానికి వస్తారు కదా. ఇక్కడ మనుష్యులు పదమపతులు అయి ఉండవచ్చు, మహళ్ళు మొదలైనవి ఉండి ఉండవచ్చు కానీ మీరు ఏ చదువునైతే చదువుతారో దాని ద్వారా మీరు చాలా ఉన్నత పదవిని పొందుతారు. లౌకిక చదువు చదువుకునేవారు, మేము బ్యారిస్టరుగా అవుతాము, మేము ఐ.ఎ.ఎస్. గా అవుతామని భావిస్తారు. మమ్మల్ని శివబాబా విశ్వానికి యజమానులుగా తయారుచేయడానికి చదివిస్తున్నారని మీ బుద్ధిలో ఉంది. ఇది ఎంత ఉన్నతోన్నతమైన పదవి. అది కూడా 21 జన్మలు ఎప్పుడూ రోగగ్రస్థులుగా అవ్వరు. అకాల మృత్యువులు సంభవించవు. కానీ ఎవరికి? ఏ దీపపు పురుగులైతే తండ్రిని తమవారిగా చేసుకుంటారో, తండ్రి ఒడిని తీసుకుంటారో వారికి. షావుకార్లు అయితే పేదవారికి దత్తతగా వెళ్ళరు. పేదవారి పిల్లలు షావుకార్లకు దత్తతగా వెళ్తారు. ఇప్పుడైతే అందరూ పూర్తిగా పేదవారుగా ఉన్నారు. ఈ మహళ్ళు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయని, మట్టిలో కలిసిపోతాయని మీకు తెలుసు. మనమే విశ్వానికి యజమానులుగా అవ్వనున్నాము. ఒకప్పుడు యజమానులుగా ఉండేవారము, ఇప్పుడు లేము, యజమానులుగా అవుతాము. మొత్తం సృష్టికి యజమానులుగా ఇంకెవ్వరూ అవ్వరు.

మీరు 21 జన్మల కోసం మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. సుఖమైతే అందరికీ ఉంటుంది. ఇక్కడైతే చిన్న ఆయుష్షు కలవారు కూడా చనిపోతారు. రాజు వద్ద జన్మ తీసుకోవడంతోనే మరణించేవారు కూడా చాలామంది ఉంటారు. వారికి రాజ్యము తీసుకోవడము వరకే జన్మ లభించినట్లుగా ఉంటుంది. ఇక్కడ మేము అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తూ ఉంటుంది. ఆత్మలమైన మా తండ్రి మమ్మల్ని పాత బంధనాల నుండి విడిపించి కొత్త సంబంధాలతో జోడింపజేసేందుకు వచ్చి ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. తప్పకుండా మీరు సూక్ష్మవతనము, వైకుంఠము మొదలైనవాటికి వెళ్తారు, వారిని కలుసుకుంటూ ఉంటారు. మీ సంబంధము అనంతమైనది అయ్యింది. ఇది ఎంత మంచి ఫ్యాషన్ గా ఉంది. మీ మెట్టినింటికి వెళ్ళగలరు. మీరాకు కూడా వైకుంఠము మెట్టినిల్లుగా ఉండేది కదా. మెట్టినింటికి (వైకుంఠానికి) వెళ్ళాలని కోరుకునేవారు. ఇక్కడిది మెట్టినిల్లు కాదు. ఇక్కడైతే పూర్తిగా పేదవారుగా ఉన్నారు. మీ వద్ద ఏమీ లేదు. మన భారత్ చాలా ఉన్నతమైన దేశము, బంగారు భారత్ ఉండేది, ఇప్పుడు లేదు. ఎప్పుడైతే అలా ఉండేదో, అప్పటి మహిమ చేస్తారు. ఇప్పుడైతే బంగారము పరిస్థితి ఎలా అయిపోయింది. నగలు మొదలైనవాటన్నింటినీ తీసేసుకుంటారు. దొంగలు దోచుకోకూడదని పాపం వాటిని దాచి పెట్టుకుని ఉంటారు. అక్కడైతే లెక్కలేనంత బంగారము ఉంటుంది. వాటి గుర్తులు కూడా ఉన్నాయి. సోమనాథ మందిరంలో గుర్తులు ఉన్నాయి. మణులు మొదలైనవాటిని ముస్లిమ్ లు తీసుకువెళ్ళి సమాధులలో పెట్టుకున్నారు. ఆంగ్లేయులు కూడా తీసుకువెళ్ళిపోయారు. వాటి గుర్తులు ఉన్నాయి. అంటే భారత్ ఎంత షావుకారుగా ఉండేది. ఇప్పుడు భారత్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. స్వర్గానికి యజమానులుగా అవ్వడానికి తండ్రికి చెందినవారిగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బాబా వచ్చి ఉన్నారు. ఇంతకుముందు కూడా వచ్చారు. శివరాత్రిని జరుపుకుంటారు. ఇప్పుడు కృష్ణుని రాత్రి అని కూడా అంటారు. శివుని రాత్రి అని కూడా అంటారు. కొద్ది తేడానే ఉంది. ఈ విషయాలు ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కృష్ణుని జన్మ పగలు జరిగినా, రాత్రి జరిగినా అందులో ఏముంది? కృష్ణుని రాత్రిని జరుపుకోవడము వాస్తవానికి తప్పు, రాత్రి అనేది శివునిది. కానీ ఇది అనంతమైన విషయము మరియు శివ భగవానువాచ కూడా. వారు శివుడిని మరచి కృష్ణుని రాత్రి అని రాసారు. ఎప్పుడైతే రాత్రి పూర్తవుతుందో, అప్పుడు పగలు మొదలవుతుంది. తండ్రి అనంతమైన పగలును తయారుచేయడానికి వస్తారు. బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి. బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు? గర్భము నుండైతే రాలేదు. బ్రహ్మా యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఇది ఎంత విచిత్రమైన విషయము. తండ్రి దత్తత తీసుకుంటారు. వీరిని తల్లిగా కూడా చేస్తారు మరియు బిడ్డగా కూడా చేసుకుంటారు. తల్లినే దత్తత తీసుకుంటారు. అందుకే మీరు తల్లి, తండ్రి… అని అంటూ ఉంటారు. ఆత్మలమైన మేమంతా మీ పిల్లలము. ఆత్మనే ఈ ఇంద్రియాల ద్వారా చదువుకుంటుంది. పిల్లలు ఈ స్మృతిని మర్చిపోతారు. దేహాభిమానంలోకి వచ్చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు – ఆత్మలైన మీరు అవినాశీ. శరీరము వినాశీ. నన్ను స్మృతి చేయండి అని బాబా అర్థం చేయించారు. ఇది మీ అంతిమ జన్మ, ఇది వజ్రతుల్యమైనది. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అవుతారో, వారిది వజ్రతుల్యమైన జన్మ. మీ ఆత్మ శరీరంతో పాటు పరమపిత పరమాత్మకు చెందినదిగా అయ్యింది. ఇప్పుడు ఆత్మ వజ్రతుల్యముగా అవుతుంది అనగా 24 క్యారట్ల పవిత్రమైన బంగారంగా అవుతుంది. ఇప్పుడైతే ఏ క్యారట్ మిగల్లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు సమ్ముఖంలో కూర్చుని వినడంతో మధుబన్ యొక్క అనుభూతి కలుగుతుంది. ఇక్కడే మురళీ మోగుతుంది. ఒకవేళ బాబా ఎక్కడికైనా వెళ్ళినా, అక్కడ అంత ఆనందం కలగదు ఎందుకంటే మురళీ విని మళ్ళీ మిత్ర-సంబంధీకులు మొదలైనవారి వద్దకు మాయా రాజ్యంలోకి వెళ్తారు. ఇక్కడైతే భట్టీలో ఉంటారు. ఇక్కడైతే రాజ్య ప్రాప్తి కోసం చదువుకుంటున్నారు. ఇది మీరు నివసించేందుకు హాస్టల్. ఇంటివారు మరియు బయటివారు కూడా ఎంతమంది వచ్చి ఉంటారు. ఇక్కడ మీరు స్కూల్లో కూర్చున్నారు. వ్యాపార-వ్యవహారాలు మొదలైనవేవీ లేవు. పరస్పరంలోనే చిట్-చాట్ చేస్తూ ఉంటారు. ఒకవైపు మొత్తం ప్రపంచము ఉంది, మరో వైపు మీరు ఉన్నారు.

తండ్రి కూర్చుని అర్థము చేయిస్తారు, ఆత్మలైన మీ ప్రియతముడు ఒక్కరే. ఆత్మనే వారిని స్మృతి చేస్తుంది. భక్తిలో నిరాకార తండ్రిని కలుసుకునేందుకు ఎంతగా భ్రమిస్తారు ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు. సత్యయుగంలో భ్రమించరు. ఇప్పుడైతే లెక్కలేనన్ని చిత్రాలను తయారుచేసారు, ఎవరికి ఎలా తోస్తే అలాంటి చిత్రాన్ని తయారుచేసారు. గురువులకు ఎంత గౌరవం ఉంది. ఎలాగైతే ఆ గురువులు ఉన్నారో, అలా ఇక్కడ కూడా వీరు గురువు అని భావిస్తారు. ఏ విధంగానైతే సాధు వాస్వాని ఒకప్పుడు టీచరుగా ఉండేవారు, తర్వాత సాధువుగా అయ్యారు. పేదవారి సేవ చేసారు. ఇప్పుడు వారి వద్దకు ఎన్ని లక్షల రూపాయలు వస్తాయి. ఏ విధంగా ఇతర ఆశ్రమాలు ఉన్నాయో, అదే విధంగా ఇది కూడా ఆశ్రమమే అని మనుష్యులు భావిస్తారు. కానీ ఇక్కడ తండ్రి రావడమే బ్రహ్మా తనువులోకి వస్తారని మీరు భావిస్తారు. తప్పకుండా బ్రహ్మాకుమారులు-కుమారీలు కావాలి. రుద్ర యజ్ఞాన్ని రచించే బ్రహ్మా ముఖ వంశావళి కావాలి కదా. ఇది రుద్రుడైన శివబాబా యజ్ఞము. ఇప్పుడు ఒక్కరినే స్మృతి చేయాలి. ఇక్కడిది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే విషయము. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే విషయాన్ని మాట్లాడుకునే సత్సంగము ఇంకేదీ లేదు. మీకే స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. మీ మాటలకు మనుష్యులు, ఇది ఎలా జరుగుతుంది అని నవ్వుతారు. తర్వాత ఎప్పుడైతే పూర్తిగా అర్థం చేసుకుంటారో, అప్పుడు విషయము సరైనది అని అంటారు. తప్పకుండా భగవంతుడు తండ్రి కదా. తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. మనము విశ్వానికి యజమానులుగా ఉండేవారము. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి. ఎవరికైనా సరే ఇలా చెప్పండి, వారు తండ్రి, స్వర్గ రచయిత, మరి మీరు స్వర్గానికి యజమానులుగా ఎందుకు అవ్వరు. నరకంలో ఎందుకు కూర్చున్నారు. ఇప్పుడిది రావణ రాజ్యము, సత్యయుగంలో రావణుడు ఉండనే ఉండడు. అహింసా పరమో ధర్మముగా ఉంటుంది. దానిని విష్ణుపురి అని అంటారు. కానీ విష్ణుపురి అనగా స్వర్గపురి అని అర్థం చేసుకోరు. విష్ణుపురిలోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చి చదివిస్తారని పిల్లలైన మీకు తెలుసు. వారంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. పరమపిత పరమాత్మ వచ్చి బ్రహ్మా, విష్ణు, శంకరుల ద్వారా తమ కర్తవ్యాన్ని చేయిస్తారు. ఇది స్పష్టంగా రాయబడి ఉంది. విష్ణుపురి అనండి లేక కృష్ణపురి అనండి, విషయం ఒక్కటే. లక్ష్మీ-నారాయణులు బాల్యములో రాధే-కృష్ణులు. ఈ ప్రజాపిత బ్రహ్మా అయితే సాకారీ కదా. సూక్ష్మవతనంలోనైతే ప్రజాపిత అని అనరు కదా. ప్రజాపిత బ్రహ్మా ద్వారా దత్తత తీసుకోవడం జరుగుతుంది. తండ్రి తమవారిగా చేసుకుంటారు. ఇది ఎంత సహజమైన విషయము. కేవలం త్రిమూర్తి చిత్రాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి. అందులో రాయబడి కూడా ఉండాలి. బ్రహ్మా ద్వారా స్థాపన అని పాడుతారు కూడా కానీ త్రిమూర్తి బ్రహ్మా అని అంటూ తండ్రి అయిన శివుడిని మాయం చేసేసారు. వారు నిరాకార పరమపిత పరమాత్మ, వీరు ప్రజాపిత బ్రహ్మా అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మాను దేవత అని కూడా అంటారు. ఎప్పుడైతే సంపూర్ణ ఫరిశ్తాగా అవుతారో, అప్పుడు దేవత అని అంటారు. ఇప్పుడు మిమ్మల్ని దేవత అని అనరు. దేవతలు సత్యయుగంలో ఉంటారు. మీది దైవీ ధర్మము. బ్రహ్మా, విష్ణు, శంకర దేవతాయ నమః అని అంటారు. అంతేకానీ బ్రహ్మా పరమాత్మాయ నమః అని అనరు. వీరినే దేవతలు అని అంటున్నప్పుడు స్వయాన్ని పరమాత్మ అని ఎందుకు చెప్పుకుంటారు. అందరూ పరమాత్మ యొక్క రూపాలు అనేది ఎలా జరగగలదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వారిది కూడా దోషమేమీ లేదు. ఇప్పుడు వారికి మార్గాన్ని ఎలా తెలియజేయాలి. భక్తులందరూ మర్చిపోయారు. రకరకాల మార్గాలు ఎన్నో చెప్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. వారసత్వము తీసుకోవాలంటే బ్రహ్మా లేకుండా శివబాబా నుండి వారసత్వము లభించదు. అందరూ ఆ ఒక్క ప్రియతముడినే పిలుస్తారు. నేను కల్ప-కల్పము ఈ సంగమములో వస్తాను. నేను కూడా బిందువునే. ఎలా పోలుస్తున్నారో చూడండి. ఎంత చిన్న ఆత్మలో అవినాశీ పాత్ర ఉంది. ఇది ప్రాకృతికము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ హృదయపూర్వకమైన ప్రీతిని ఒక్క తండ్రితో జోడించాలి. ఈ ప్రపంచము ఎందుకూ పనికి రాదు, అందుకే దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి.

2. తమ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారుచేసుకునేందుకు ఒక్క తండ్రిపై పూర్తి-పూర్తిగా బలిహారమవ్వాలి. నాకైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు – ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలి.

వరదానము:-

సమయము యొక్క వేగము తీవ్రగతితో సదా ముందుకు వెళ్తూ ఉంటుంది. సమయము ఎప్పుడూ ఆగదు, ఒకవేళ దానిని ఎవరైనా ఆపాలని అనుకున్నా కూడా అది ఆగదు. సమయము రచన, మీరు రచయిత, అందుకే ఎటువంటి పరిస్థితి వచ్చినా లేక సమస్యల పర్వతము వచ్చినా కూడా, ఎగిరేవారు ఎప్పుడూ ఆగరు. ఒకవేళ ఎగిరే వస్తువు గమ్యాన్ని చేరుకోకుండా ఆగిపోతే యాక్సిడెంట్ జరుగుతుంది. కనుక పిల్లలైన మీరు కూడా తీవ్ర పురుషార్థులుగా అయి ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి, ఎప్పుడూ అలసిపోకూడదు మరియు ఆగిపోకూడదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top