01 July 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 30, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీరు మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి, ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు, ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉండాలి’’

ప్రశ్న: -

నడుస్తూ-నడుస్తూ మాయ ఏ పిల్లల గొంతును పూర్తిగా నొక్కేస్తుంది?

జవాబు:-

ఎవరైతే ఏదైనా విషయంలో కొద్దిగానైనా సంశయం పెట్టుకుంటారో, కామము లేదా క్రోధము యొక్క గ్రహచారము కూర్చుంటుందో, మాయ వారి గొంతును నొక్కేస్తుంది. మళ్ళీ వారి పైన ఎటువంటి గ్రహచారం కూర్చుంటుందంటే, వారు చదువునే విడిచిపెట్టేస్తారు. ఏదైతే చదివారో మరియు చదివించేవారో, అదంతా ఎలా మర్చిపోయారు అన్నది అర్థమే కాదు. బుద్ధి తాళము పూర్తిగా మూసుకుపోతుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవు ప్రేమ సాగరుడవు… (తూ ప్యార్ కా సాగర్ హై…)

ఓంశాంతి. ఇది తండ్రి మహిమ మరియు పిల్లలకు తెలుసు, భక్తులైతే అలానే పాటలు పాడుతారు. తండ్రి ఎంతటి ప్రేమ సాగరులో పిల్లలైన మీకు తెలుసు. పతితులందరినీ పావనంగా చేస్తారు. పిల్లలందరికీ సుఖధామం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. మనం వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు అర్థం చేసుకున్నారు. అర్ధకల్పము మాయా రాజ్యము ఉన్నప్పుడు ఇంత ప్రియమైన తండ్రి ఉండరు. అనంతమైన తండ్రి ప్రేమ సాగరుడు. వారు ప్రేమకు, శాంతికి, సుఖానికి సాగరునిగా ఎలా ఉన్నారు అన్నది ఇప్పుడు మీకు తెలుసు. ప్రాక్టికల్ గా పిల్లలైన మీకు అంతా లభిస్తుంది. భక్తి మార్గము వారికి లభించదు. వారు కేవలం పాడుతారు, స్మృతి చేస్తారు. ఇప్పుడు ఆ స్మృతి పూర్తవుతుంది. పిల్లలు సమ్ముఖంలో కూర్చున్నారు. ఇది అనంతమైన తండ్రి మహిమయే అని అర్థం చేసుకుంటారు. తప్పకుండా ఆ తండ్రి ఇంతటి ప్రేమనిచ్చి వెళ్ళారు. సత్యయుగంలో కూడా ప్రతి ఒక్కరు, ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు. జంతువులలో కూడా పరస్పరంలో ప్రేమ ఉంటుంది. ఇక్కడైతే అది లేదు. పరస్పరంలో ప్రేమతో ఉండనటువంటి జంతువులేవీ అక్కడ ఉండవు. పిల్లలైన మీకు కూడా నేర్పించడం జరుగుతుంది, ఇక్కడ ప్రేమ యొక్క మాస్టర్ సాగరులుగా అయినట్లయితే మీ ఆ సంస్కారము అవినాశీగా అయిపోతుంది. ఇక్కడ అందరూ ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము. తండ్రి అంటారు, కల్పక్రితము వలె అదే విధంగా ఇప్పుడు మిమ్మల్ని చాలా ప్రియమైనవారిగా తయారుచేస్తాను. వీరు కోపం చేస్తున్నారని ఎప్పుడైనా ఎవరి మాటలనైనా వింటే తండ్రి శిక్షణనిస్తారు, పిల్లలూ, కోపము చేయడము మంచిది కాదు, దీని వలన మీరు కూడా దుఃఖితులుగా అవుతారు, ఇతరులను కూడా దుఃఖితులుగా చేస్తారు. ఎలా అయితే లౌకిక తండ్రి కూడా పిల్లలకు శిక్షణనిస్తారు, వారు హద్దు సుఖాన్ని ఇచ్చేవారు. ఈ తండ్రి అనంతమైన మరియు సదాకాలపు సుఖాన్ని ఇచ్చేవారు. కనుక పిల్లలైన మీరు ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకోకూడదు. అర్ధకల్పము చాలా దుఃఖాన్ని ఇచ్చారు. రావణుడు చాలా పాడు చేసాడు. ఎవరు ఎవరిపైన అయితే దాడి చేస్తారో, వారిని దోచుకుంటారు. ఇప్పుడు మీకు ప్రకాశం లభిస్తుంది. ఈ డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు జ్ఞానం యొక్క విస్తారాన్ని అర్థం చేసుకోలేకపోతే, రెండు పదాలనే స్మృతి చేయండి. అనంతమైన తండ్రి ద్వారా మనకు ఈ వారసత్వం లభిస్తుంది. ఎవరు ఎంతగా తండ్రిని స్మృతి చేసి కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటారో అనగా వికారాలపై విజయాన్ని పొందుతారో, అంతగా వారసత్వానికి అధికారులుగా అవుతారు. వికారాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. శ్రీమతముపై నడుచుకోకపోవడము, అది కూడా వికారమే. శ్రీమతముపై నడుచుకోవడం వలన మీరు నిర్వికారిగా అవుతారు. నన్నొక్కడినే స్మృతి చేయాలి, ఇతరులెవ్వరినీ స్మృతి చేయకూడదు, తండ్రి వీరి ద్వారా చెప్తారు, ఓ పిల్లలూ, అందరినీ తీసుకువెళ్ళేవాడిని నేను వచ్చాను. ప్రతి ఒక్క ధర్మములోనూ నంబరువారుగా ఉన్నారు. పోప్ కు ఎంత గౌరవం ఉంది. ఈ సమయంలోనైతే అందరూ అంధ విశ్వాసంలో ఉన్నారు. మీరు ఒక్క తండ్రికి తప్ప ఇతరులెవ్వరికీ గౌరవమునివ్వజాలరు. అన్నీ కృత్రిమమైనవి. ఈ సమయంలో అందరూ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ పతితులుగా అవుతారు. మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో, వారు చివర్లో పూర్తిగా పతితులుగా అవ్వాల్సిందే. పతిత-పావనా అన్న పేరును అంటారు కానీ విస్తారంగా అర్థం చేసుకోరు. ఇది పతితుల ప్రపంచము కనుక వారికి ఏం గౌరవం ఉంటుంది. ఏ విధంగానైతే పోప్ ఉన్నారు, ఫస్ట్, సెకెండ్, థర్డ్ కొనసాగుతూ వచ్చారు, కిందకు దిగుతూ వచ్చారు. వారిని నంబరువారుగా చూపిస్తారు, మళ్ళీ కూడా వారు నంబరువారుగానే తమ పదవిని తీసుకుంటారు. ఈ చక్రము గురించి మీకు ఇప్పుడు మంచి రీతిలో తెలుసు. ఇక్కడ అనంతమైన తండ్రి వద్దకే వస్తారు, వారి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. సాకారుడు లేకుండానైతే వారసత్వం లభించదు.

తండ్రి అంటారు, దేహధారులను స్మృతి చేయకండి. ఉన్నతోన్నతమైన ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఎంత పెద్ద ఆజ్ఞ ఉంది – పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహధారులను స్మృతి చేసారంటే వారి స్మృతి వలన పునర్జన్మను మళ్ళీ తీసుకోవలసి ఉంటుంది. మీ స్మృతి యాత్ర నిలిచిపోతుంది. వికర్మలు వినాశనమవ్వవు, చాలా నష్టం జరుగుతుంది. వ్యాపారంలో లాభం కూడా ఉంటుంది, నష్టం కూడా ఉంటుంది. నిరాకారుడైన తండ్రిని ఇంద్రజాలికుడు, వ్యాపారస్థుడు అని కూడా అంటారు. మీకు తెలుసు, దివ్య దృష్టి యొక్క తాళం చెవి తండ్రి చేతిలో ఉంది. అచ్ఛా, ఏదైనా చూసారు, కృష్ణుని సాక్షాత్కారము చేసుకున్నారు, దీని వలన లాభమేముంది? ఏమీ లేదు. ఈ డ్రామా చక్రాన్ని తెలుసుకోవడమైతే చదువు కదా. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, చక్రాన్ని తిప్పుతారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు నా పిల్లలుగా అయ్యారు. మేము మీకు చెందినవారిగా ఉండేవారము అని స్మృతి వస్తుంది కదా. ఆత్మలమైన మనము పరంధామంలో నివసించేవారము. అక్కడ చెప్పేటటువంటి అవసరం కూడా ఉండదు. డ్రామా దానంతట అదే నడుస్తూ ఉంటుంది. ఏ విధంగానైతే ఒక చేపల ఆటబొమ్మను చూపిస్తారు కదా. అందులో తీగలో చేపలు కూర్చబడి ఉంటాయి. దానిని తిప్పినప్పుడు నెమ్మది-నెమ్మదిగా కిందకు దిగుతాయి. అలాగే ఆత్మలందరూ డ్రామా సూత్రంలో బంధించబడి ఉన్నారు. చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు పైకి ఎక్కుతారు, మళ్ళీ దిగడం మొదలుపెడతారు. మీకు తెలుసు, ఇప్పుడు మనది ఎక్కే కళ. జ్ఞాన సాగరుడైన తండ్రి వచ్చి ఉన్నారు – ఎక్కే కళ గురించి, మళ్ళీ దిగే కళ గురించి మీరు తెలుసుకున్నారు. ఎంత సహజమైనది. దిగే కళ ఎంత సమయం తీసుకుంటుంది. మళ్ళీ ఎక్కే కళ ఎలా జరుగుతుంది. మీకు తెలుసు, తండ్రి వచ్చి మార్చేస్తారు. మొట్టమొదటిది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము, తర్వాత ఇతర ధర్మాలు వస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు తెలుసుకున్నారు, మనది ఎక్కే కళ. దిగే కళ పూర్తయ్యింది. తమోప్రధాన ప్రపంచంలో చాలా దుఃఖము ఉంది. ఈ తుఫానులు మొదలైనవైతే ఏమీ కావు. తుఫానులు ఎటువంటివి వస్తాయంటే పెద్ద-పెద్ద మహళ్ళు పడిపోతాయి. చాలా దుఃఖం యొక్క సమయం రానున్నది. ఇది వినాశన సమయము. అయ్యో-అయ్యో అని ఆర్తనాదాలు చేస్తారు. అందరి నోటి నుండి అయ్యో రామా, అనే వెలువడుతుంది. భగవంతుడినే స్మృతి చేస్తారు. ఉరికంబము ఎక్కించేటప్పుడు కూడా ఫాదర్లు మొదలైనవారు గాడ్ ఫాదర్ ను స్మృతి చేయండి అని అంటారు. కానీ వారి గురించి తెలియదు. తమ ఆత్మను గురించి కూడా యథార్థ రీతిలో అర్థం చేసుకోరు. ఆత్మనైన నేను ఎవరిని? ఏ పాత్రను అభినయిస్తాను? ఏమీ తెలియదు. ఆత్మ ఎంత చిన్నది. ఆత్మ నక్షత్రం వలె చిన్నదిగా ఉంటుందని అంటారు. ఆత్మ యొక్క సాక్షాత్కారము చాలా మందికి జరుగుతుంది. చాలా చిన్న లైటు లాగ ఉంటుంది. అది బిందువు వలె తెల్లని లైటు. దానిని దివ్యదృష్టి లేకుండా ఎవ్వరూ చూడలేరు. ఒకవేళ చూసినా కూడా అర్థం కాదు. జ్ఞానం లేకుండా ఏమీ అర్థం కాదు. సాక్షాత్కారాలైతే చాలా జరుగుతాయి. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఇక్కడైతే బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. బాబా యథార్థ రీతిలోనే అర్థం చేయిస్తారు, మన ఆత్మలో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది అన్న విషయము ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఎవరైతే బ్రాహ్మణ పిల్లలుగా అవుతారో, వారికే తండ్రి అర్థం చేయిస్తారు మరియు వారికే 84 జన్మలు ఉంటాయి. ఇతురులెవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. ఇది 84 జన్మల చక్రమని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. మొదటి గాయనము బ్రాహ్మణులకే ఉంటుంది, ముఖ వంశావళి బ్రాహ్మణులు కదా. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. బ్రహ్మాకుమార-కుమారీలు అన్నది సాధారణ విషయము అయిపోయింది. ఈ సంస్థ ఏమిటి? ఈ పేరు ఎందుకు వచ్చింది? ఇది ఎవరూ అర్థం చేసుకోరు. ప్రజాపిత బ్రహ్మా పేరు పెట్టడం వలన ఎందుకు అన్న ప్రశ్నే తొలగిపోతుంది. శివబాబాకు పిల్లలము, అందరూ పరస్పరంలో సోదరులము అని మీరు చెప్పగలరు. మళ్ళీ ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలు సోదర, సోదరీలు. ఇది అర్థం చేసుకుంటే మళ్ళీ ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. కొత్త ప్రపంచం స్థాపన అవుతుందని అర్థం చేసుకుంటారు. తప్పకుండా బ్రహ్మా ద్వారా మీరు పతితం నుండి పావనంగా అవుతున్నారు. ఈ రక్షాబంధనం మొదలైనవి ఏవైతే జరుపుకుంటారో, ఇది పాత ఆచారముగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు మీరు అర్థాన్ని అర్థం చేసుకున్నారు, స్మృతిచిహ్నాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటి జ్ఞానము మీకు ఈ సమయంలో లభిస్తుంది. సత్యయుగంలో రామ నవమిని ఏమైనా జరుపుకుంటారా. అక్కడ జరుపుకునే విషయమే ఉండదు. అక్కడైతే జ్ఞానమే ఉండదు. మనది దిగే కళ అని కూడా వారికి తెలియదు. సుఖంలో జన్మలు తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నదే యోగబలముతో కూడిన జన్మ. వికారాల పేరే ఉండదు ఎందుకంటే రావణ రాజ్యమే ఉండదు. అక్కడైతే సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. మొదటే సాక్షాత్కారం జరుగుతుంది. లేదంటే ఒక పాత శరీరాన్ని విడిచి మరొక కొత్తదానిని తీసుకుంటారని ఎలా ఋజువవుతుంది. ఇక్కడ నుండి ముందు మీరు శాంతిధామానికి వెళ్తారు. అది మన ఇల్లు అని పిల్లలు అర్థం చేసుకున్నారు, దానినే శాంతిధామము అని అంటారు. అదైతే మన ఇల్లు అంటే తండ్రి ఇల్లు, ఆ తండ్రినే స్మృతి చేస్తాము. తండ్రి నుండే విడిపోయారు, అందుకే స్మృతి చేస్తారు. సుఖములోనైతే తండ్రి కూడా గుర్తుకు రారు. అది ఉన్నదే సుఖము యొక్క ప్రపంచము. బాబా తమ ధామములో ఉంటారు, ఎలాగైతే వానప్రస్థంలోకి వెళ్తారో, అలా ఉంటారు. ప్రపంచంలోనైతే వృద్ధులుగా అయినప్పుడు వానప్రస్థము స్వీకరిస్తారు. కానీ పరమపిత పరమాత్మను వృద్ధుడు అని ఏమైనా అంటారా. వృద్ధాప్యము లేక యవ్వనము శరీరానికి ఉంటుంది. ఆత్మ అయితే అలాగే ఉంటుంది. ఆత్మపై మాయ యొక్క నీడ పడుతుంది. మీరు అంతా తెలుసుకున్నారు, ఇంతకుముందు మీకు తెలియదు. రచయిత, రచనల యొక్క రహస్యాన్ని తండ్రి అర్థం చేయించారు.

పిల్లలైన మీరు తండ్రి ఎదురుగా కూర్చున్నారు. వారికి చాలా మహిమ ఉంది. ప్రెసిడెంట్, ప్రెసిడెంటుగానే ఉంటారు. ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ గానే ఉంటారు. అందరికీ తమ-తమ పాత్ర లభించి ఉంది. తండ్రి ఉన్నతోన్నతమైనవారు అని అంటూ ఉంటారు. కావున తప్పకుండా మనకు ఉన్నతోన్నతమైన వారసత్వం లభించాలి కదా. ఇది ఎంతగా అర్థం చేసుకునే విషయము. తండ్రి ఎలాగైతే అర్థం చేయిస్తారో, పిల్లలు కూడా అర్థం చేయించాలి. మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, వారసత్వం కూడా తండ్రి నుండే లభిస్తుంది. మీది ప్రవృత్తి మార్గము కావున బుద్ధిలో చక్రం తిరుగుతూ ఉండాలి. సేవ తప్పకుండా చేయాలి. రోజు రోజుకు చాలా సహజమవుతూ ఉంటుంది, అప్పుడే ప్రజలు వృద్ధి చెందుతారు కదా. సహజముగా లభించడంతో సహజముగా నిశ్చయం ఏర్పడుతుంది. కొత్త-కొత్తవారు బాగా సంతోషంతో ఉప్పొంగుతూ ఉంటారు, నిశ్చయం పూర్తిగా కూర్చుంటుంది. నంబరువారు పురుషార్థం అనుసారంగా అందరి పాత్ర నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థం చేస్తున్నారు. సత్యమైన సంపాదన మరియు అసత్యమైన సంపాదనలో తేడా అయితే ఉంటుంది కదా. సత్యమైన రత్నాలు దూరం నుండే మెరుస్తాయి. ఈ రోజుల్లో మనుష్యులకు ధనాన్ని దాచుకోవడము అంటే ఎంత కష్టము. ఎక్కడ దాచిపెట్టాలి, ఎక్కడ ఉంచాలి. ధనము అలా పడి ఉంటుంది, సమయం ఎటువంటిది వస్తుందంటే, ఏమీ చేయలేకపోతారు. పిల్లలైన మీకు కూడా నంబరువారుగా బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంటుంది. ఎక్కడైనా గ్రహచారము కూర్చున్నట్లయితే ఏదో ఒక సంశయము వస్తుంది. చదువునే విడిచిపెట్టేస్తారు, అసలు అర్థమే కాదు. మేమైతే చదివేవారము, చదివించేవారము, కానీ ఇప్పుడు ఏమయ్యింది. కొద్దిగా సంశయం రావడంతో గొంతు ఎండిపోతుంది. బాబా మీద సంశయము వచ్చింది, వికారాల్లోకి వెళ్ళారంటే పూర్తిగా పడిపోతారు. కామము మరియు క్రోధము అన్నింటికన్నా పెద్ద శత్రువులు. మోహము కూడా తక్కువేమీ కాదు. సన్యాసులకు తమ జీవితం యొక్క స్మృతి ఉండదని కాదు. అంతా గుర్తుంటుంది. జ్ఞానీ ఆత్మలైన పిల్లలు సూచనలతోనే అర్థము చేసుకుంటారు, భోగ్ ఎలా పెడతారు, ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది. క్షణ క్షణం డ్రామా నడుస్తూ ఉంటుంది. డ్రామాలో నిశ్చితమై ఉంది, కల్పక్రితము ఏదైతే జరిగిందో, అదే చేస్తారు, ఇమర్జ్ అవుతుంది. డ్రామాలోని పాత్ర క్షణ క్షణం తెరుచుకుంటూ ఉంటుంది. ముఖ్యమైనది తండ్రి స్మృతి, దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి స్మృతిలో ఎంతగా నిమగ్నమై ఉంటారో, అంతగా వికర్మలు వినాశమవుతూ ఉంటాయి. లేదంటే తండ్రి ధర్మరాజు రూపంలో సాక్షాత్కారాలు చేయిస్తారు. ఇప్పటికీ చాలా మంది ఎలా ఉన్నారంటే, నడుస్తూ-నడుస్తూ అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు, చెప్పరు. పేరైతే చాలా మంచిగా ఉంది, కానీ తండ్రికి తెలుసు, ఎంత తక్కువ పదవి వస్తుంది. ఎంతగా గ్రహచారము ఉంది. తప్పుడు వికర్మలు చేస్తూ తండ్రి దగ్గర దాచిపెడుతూ ఉంటారు. సత్యమైనవారి ముందు ఏ విషయమూ దాగలేదు. మీదంతా పైన నిశ్చితమైపోతుంది. అంతర్యామి బాబా అయితే వారు కదా. మేము దాచిపెట్టి వికర్మలు చేసినట్లయితే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది అని అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణులైన మనము సంభాళించేందుకు నిమిత్తులుగా అయ్యాము. మనలోనే ఈ అలవాటు ఉంది అంటే అది సరైనది కాదు. స్కూలులో టీచరు యొక్క రిపోర్టు ఉంటుంది, అప్పుడు ప్రిన్సిపల్ పెద్ద సభ మధ్యలో వారిని బయటకు పంపించేస్తారు, కావున చాలా భయము ఉంచుకోవాలి. మీరు ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. బాబా అంటారు, నన్నొక్కడినే స్మృతి చేయండి. మీరైతే తండ్రి వద్దకు వెళ్ళాలి. వారిని స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి, ఇంకెవరినైనా గుర్తు చేసినట్లయితే మీ ఆత్మిక యాత్ర ఆగిపోతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాయ యొక్క గ్రహచారము నుండి రక్షించుకునేందుకు సత్యమైన తండ్రితో సదా సత్యముగా ఉండాలి. ఏదైనా పొరపాటు చేసి దాచిపెట్టకూడదు. తప్పుడు కర్మల నుండి రక్షించుకుంటూ ఉండాలి.

2. శ్రీమతముపై నడవకపోవడము కూడా వికారమే, అందుకే ఎప్పుడూ శ్రీమతాన్ని ఉల్లంఘించకూడదు. సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి.

వరదానము:-

ఎవరిలోనైతే సత్యతా శక్తి ఉంటుందో, వారు మహాన్ ఆత్మలు. కానీ సత్యతతో పాటు సభ్యత కూడా తప్పకుండా ఉండాలి. ఇటువంటి సత్యత యొక్క సభ్యత కల మహాన్ ఆత్మల యొక్క మాట్లాడడము, చూడడము, నడవడము, తినడము-తాగడము, లేవడము-కూర్చోవడము, ప్రతి కర్మలో సభ్యత స్వతహాగా కనిపిస్తుంది. ఒకవేళ సభ్యత లేకపోతే సత్యత లేదు. సత్యత ఎప్పుడూ ఋజువు చేయడం ద్వారా ఋజువు కాదు. దానికైతే ఋజువు అయ్యేటటువంటి సిద్ధి ప్రాప్తించి ఉంది. సత్యత యొక్క సూర్యుడిని ఎవరూ దాచిపెట్టలేరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top