23 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris

April 22, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఇది బాబా యొక్క అద్భుతమైన దుకాణము, ఇందులో అన్ని వెరైటీ సామాన్లు లభిస్తాయి, ఈ దుకాణానికి మీరు యజమానులు”

ప్రశ్న: -

ఈ అద్భుతమైన దుకాణదారుడిని ఎవరూ కాపీ చేయలేరు, ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే వీరు స్వయంగా సర్వ ఖజానాల భాండాగారము. జ్ఞానము, సుఖము, శాంతి, పవిత్రత, అన్నింటిలోనూ సాగరుడు, ఎవరికి ఏది కావాలనుకుంటే అది లభిస్తుంది. నివృత్తి మార్గం వారి వద్ద ఈ సామాన్లు లభించవు. ఎవ్వరూ స్వయాన్ని తండ్రి సమానంగా సాగరము అని చెప్పుకోలేరు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము ప్రపంచాన్నే పొందాము….. ( తుమ్ హే పాకే హమ్…..)

ఓంశాంతి. ఇప్పుడు పిల్లలు అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చొన్నారు. వీరిని అనంతమైన తండ్రి అని కూడా అనవచ్చు, అనంతమైన తాతయ్య అని కూడా అనవచ్చు. ఇక్కడ అనంతమైన పిల్లలు కూర్చొన్నారు మరియు తండ్రి అనంతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు హద్దు విషయాలను విడిచిపెట్టాలి. ఇప్పుడు తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. ఈ దుకాణము ఒక్కటే ఉంది. తమకు ఏమి కావాలి అనేది మనుష్యులకు తెలియదు. అనంతమైన తండ్రి దుకాణము అయితే చాలా పెద్దది. వారిని సుఖ సాగరుడు, పవిత్రతా సాగరుడు, ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు….. అని అంటారు. కొంతమంది దుకాణదారుల వద్ద చాలా వెరైటీలుంటాయి. వీరు అనంతమైన తండ్రి, వీరి వద్ద కూడా వెరైటీ సామాన్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి. బాబా జ్ఞాన సాగరుడు, సుఖ-శాంతుల సాగరుడు. వారి వద్ద ఈ అద్భుతమైన, అలౌకిక సామాన్లు ఉన్నాయి. వారికి సుఖకర్త అన్న మహిమను కూడా చేస్తారు. ఇదొక్కటే దుకాణము, ఇంకెవరికీ ఇటువంటి దుకాణాలు లేవు. బ్రహ్మా, విష్ణు, శంకరుల వద్ద ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఏమీ లేవు. అన్నింటికన్నా ఉన్నతమైన సామాన్లు తండ్రి వద్ద ఉన్నాయి, అందుకే వారి మహిమను పాడుతారు. త్వమేవ మాతాశ్చ పితా….. ఇటువంటి మహిమ ఎప్పుడూ ఎవరికీ జరగదు. మనుష్యులు శాంతి కోసం భ్రమిస్తూ ఉంటారు. కొందరికి మందులు కావాలి, మరికొందరికి ఇంకేదో కావాలి. అవన్నీ హద్దు దుకాణాలు. మొత్తం ప్రపంచంలో అందరి వద్ద హద్దు వస్తువులున్నాయి. ఈ తండ్రి ఒక్కరి వద్ద మాత్రమే అనంతమైన వస్తువులున్నాయి, అందుకే వారికి పతిత పావనుడు, ముక్తిదాత, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అని మహిమను కూడా పాడుతారు. ఇవన్నీ వెరైటీ సామాన్లు. లిస్ట్ రాసినట్లయితే చాలా పెద్దదవుతుంది. ఏ తండ్రి వద్దనైతే ఈ వస్తువులున్నాయో, వారి పిల్లలకు కూడా వాటిపై హక్కు ఉంటుంది. కానీ ఇటువంటి తండ్రికి మేము పిల్లలైనప్పుడు, తండ్రి వస్తువులకు మేము యజమానులుగా అవ్వాలని ఎవరి బుద్ధిలోకి రాదు. తండ్రి భారత్ లోనే వస్తారు. తండ్రి వద్దనున్న వస్తువులన్నింటినీ తప్పకుండా తీసుకొస్తారు. వారి నుండి తీసుకునేందుకు ఎవరూ వారి వద్దకు వెళ్ళలేరు. నేనే రావలసి ఉంటుందని తండ్రి అంటారు. కల్ప-కల్పము, కల్పం యొక్క సంగమంలో, నేను వచ్చి, మీకు అన్ని వస్తువులను ఇచ్చి వెళ్తాను. నేను మీకు ఏ సామాను అయితే ఇస్తానో, అది మళ్ళీ ఎప్పుడూ లభించజాలదు. అర్ధకల్పం కోసం మీ భాండాగారము నిండిపోతుంది. అక్కడ తండ్రిని పిలవాల్సి వచ్చే విధంగా, అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. డ్రామా ప్లాన్ అనుసారంగా, మీరందరూ వారసత్వాన్ని తీసుకొని నెమ్మది-నెమ్మదిగా మెట్లు దిగుతారు. పునర్జన్మలు కూడా తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. 84 జన్మలు కూడా తీసుకోవాలి. 84 జన్మల చక్రమని అంటారు కానీ అర్థం తెలియదు. 84 జన్మలకు బదులుగా, 84 లక్షల జన్మలు అని అంటారు. మాయ తప్పులు చేయిస్తుంది. ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, తర్వాత ఇదంతా మర్చిపోతారు. ఈ సమయంలో సామాన్లు తీసుకుంటారు, సత్యయుగంలో రాజ్యం చేస్తారు. కానీ ఈ రాజ్యాన్ని మాకు ఎవరిచ్చారు అనేది వారికి తెలియదు. లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పుడుండేది అనేది తెలియదు. స్వర్గ సుఖాలు గాయనం చేయబడతాయి కూడా. అన్ని రకాల సుఖాలను ఇస్తారు. దీనికన్నా గొప్ప సుఖము ఏదీ ఉండదు. తర్వాత ఆ సుఖం కూడా ప్రాయః లోపమైపోతుంది. అర్ధకల్పం తర్వాత రావణుడు వచ్చి, అన్ని సుఖాలను లాక్కుంటాడు. ఎవరిపైనైనా కోప్పడితే, నీ కళా కాయము (దివ్య గుణాలు) సమాప్తమైపోయింది అని అంటారు. మీరు కూడా సర్వగుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు. ఆ కళలన్నీ ఇప్పుడు సమాప్తమైపోయాయి. ఒక్క తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ ఇంతటి మహిమ లేదు. ధనముంటే వెళ్ళి అంతా తిరిగి రండి అని అంటారు కదా.

స్వర్గంలో ఎంత అపారమైన ధనము-సంపద ఉండేవో మీరు ఆలోచించండి. ఇప్పుడవి లేవు. అన్ని మాయమైపోతాయి. ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోతారు కనుక ధనము-సంపద కూడా మాయమైపోతాయి, అప్పుడిక కిందకు పడిపోవడం మొదలవుతుంది. మీకు ఇంత ధనమునిచ్చాను, మిమ్మల్ని వజ్రాల వలె తయారుచేసాను, మరి మీరు ఆ ధనము-సంపదలను ఎక్కడ పోగొట్టుకున్నారు, అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి మీ వారసత్వాన్ని తీసుకోండి అని తండ్రి అంటారు. బాబా మనకు మళ్ళీ స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. బాబా అంటారు – ఓ పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీకు పట్టి ఉన్న తుప్పు తొలగిపోతుంది. పిల్లలంటారు – బాబా, మేము మర్చిపోతాము. ఇదేమిటి? కన్య వివాహం చేసుకున్న తర్వాత పతిని ఎప్పుడైనా మర్చిపోతుందా. పిల్లలు ఎప్పుడైనా తండ్రిని మర్చిపోతారా. తండ్రి అయితే దాత. వారసత్వాన్ని పిల్లలు తీసుకోవాలి కనుక తప్పకుండా స్మృతి చేయాలి. తండ్రి అర్థం చేయిస్తారు – మధురాతి మధురమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలూ, స్మృతి యాత్రలో ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, ఇంకే ఉపాయము లేదు. భక్తి మార్గంలో తీర్థ యాత్రలు, గంగా స్నానాలు మొదలైనవి ఏవైతే చేస్తూ వచ్చారో, వాటితో మెట్లు దిగుతూనే వచ్చారు. ఎవరూ పైకి ఎక్కలేరు. ఇది లా కాదు. అందరిదీ దిగే కళే ఉంటుంది. ఫలానావారు ముక్తిలోకి వెళ్ళారు అని ఏదైతే అంటారో, అది అసత్యము చెప్తున్నట్లు. ఎవరూ తిరిగి వెళ్ళలేరు. మిమ్మల్ని 16 కళా సంపూర్ణులుగా చేయడానికి బాబా వచ్చారు. నిర్గుణుడినైన నాలో….. అని మీరే పాడేవారు. బాబా గుణవంతులుగా చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనమే గుణవంతులుగా, పూజ్యులుగా ఉండేవారము, మనమే వారసత్వాన్ని తీసుకున్నాము. ఇది జరిగి 5000 సంవత్సరాలయ్యింది. మీకు వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళానని తండ్రి కూడా అంటారు. శివజయంతి, రక్షాబంధనము, దసరా మొదలైనవాటిని జరుపుకుంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. అంతా మర్చిపోతారు. మళ్ళీ తండ్రి వచ్చి స్మృతినిప్పిస్తారు. అక్కడ మీరే ఉండేవారు, మళ్ళీ మీరే రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. తండ్రి అర్థం చేయిస్తారు – ఇప్పుడు ఈ ప్రపంచమంతా పాతదిగా, శిథిలావస్థలో ఉంది. ప్రపంచమైతే ఇదే ఉంటుంది. ఈ భారత్ యే కొత్తదిగా ఉండేది, ఇప్పుడు పాతదిగా అయింది. స్వర్గంలో సదా సుఖముంటుంది. మళ్ళీ ద్వాపరం నుండి దుఃఖం ప్రారంభమైనప్పుడు, ఈ వేదశాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. భక్తి చేస్తూ-చేస్తూ మీరు ఎప్పుడైతే భక్తిని పూర్తి చేస్తారో, అప్పుడు భగవంతుడు వస్తారు కదా. బ్రహ్మా పగలు, బ్రహ్మా రాత్రి. సగం-సగం ఉంటాయి కదా. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. వారు కల్పం ఆయువును తప్పుగా రాసేసారు.

మొట్టమొదట మీరు అందరికీ తండ్రి మహిమను కూర్చొని వినిపించండి. తండ్రి జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు. కృష్ణుడిని నిరాకారుడు, పతితపావనుడు, సుఖసాగరుడు….. అని అనరు. వారి మహిమ వేరు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. శివుడిని బాబా అని అంటారు. కృష్ణ బాబా అన్న పదమే శోభించదు. ఇది ఎంత పెద్ద పొరపాటు. తర్వాత చిన్న-చిన్న పొరపాటులను చేస్తూ 100 శాతం మర్చిపోయారు. తండ్రి అంటారు – సన్యాసుల నుండి ఎప్పుడూ ఈ వ్యాపారం లభించజాలదు. వారు నివృత్తి మార్గము వారు. మీరు ప్రవృత్తి మార్గము వారు. మీరు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, అప్పుడు నిర్వికారీ ప్రపంచముండేది. ఇది వికారీ ప్రపంచము. మరి సత్యయుగంలో పిల్లలు జన్మించరా, అక్కడ కూడా వికారాలుంటాయి కదా అని అంటారు. అరే, అది సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము, సంపూర్ణ నిర్వికారులుగా ఉన్నవారు వికారులుగా ఎలా అవ్వగలరు. అలా అయితే, సత్యయుగంలో ఇంతమంది మనుష్యులు ఉండడమనేది ఎలా సాధ్యము అని అడుగుతారు. అక్కడ ఇంతమంది మనుష్యులుండరు. భారత్ తప్ప ఇంకే ఖండము ఉండదు. వారు, మేము ఒప్పుకోము, ప్రపంచమైతే సదా నిండుగా ఉంటుంది అని అంటారు. ఏమీ అర్థం చేసుకోరు. భారత్ స్వర్ణిమ యుగముగా ఉండేదని, ఇప్పుడు ఇనుప యుగముగా ఉందని, రాతి బుద్ధి కలవారిగా ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. గాంధీ మొదలైనవారంతా రామ రాజ్యాన్ని కోరుకునేవారు. కానీ మహాభారత యుద్ధం జరిగినట్లుగా, ఇక తర్వాత ఆట సమాప్తమైనట్లుగా చూపిస్తారు. తర్వాత ఏమి జరిగింది అనేది ఏమీ చూపించలేదు. ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది చాలా సులువైనది. శివజయంతిని జరుపుకుంటారు అనగా తప్పకుండా శివబాబా వస్తారు. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్ కనుక తప్పకుండా హెవెన్ గేటులను తెరిచేందుకు వస్తారు. నరకంగా ఉన్నప్పుడే, వారు వస్తారు. హెవెన్ ద్వారాలను తెరిచి, హెల్ ను మూసేస్తారు. హెవెన్ ద్వారాలు తెరుచుకుంటే, తప్పకుండా అందరూ హెవెన్ లోకే వస్తారు. ఈ విషయాలేమీ కష్టమైనవి కాదు. మహిమ కేవలం ఒక్క తండ్రిది మాత్రమే. శివబాబాది ఒకే ఒక్క దుకాణము. వారు అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రి ద్వారా భారత్ కు స్వర్గ సుఖం లభిస్తుంది. అనంతమైన తండ్రి స్వర్గ స్థాపనను చేస్తారు. అక్కడ తప్పకుండా అనంతమైన సుఖముండేది. మరి మనం నరకంలో ఎందుకు ఉన్నాము. ఇది ఎవరికీ తెలియదు. మీరే అలా ఉండేవారు, మళ్ళీ మీరే పడిపోయారు అని తండ్రి అర్థం చేయిస్తారు. దేవతలే 84 జన్మలను తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు పతితులుగా అయ్యారు. మళ్ళీ వారే పావనంగా అవ్వాలి. తండ్రి జన్మ కూడా జరుగుతుంది, అలాగే రావణుని జన్మ కూడా జరుగుతుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. రావణుడిని ఎప్పటి నుండి కాలుస్తున్నారని ఎవరినైనా అడిగితే, అది అనాదిగా నడుస్తూ వస్తుందని అంటారు. తండ్రి ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి యొక్క దుకాణానికే మహిమ ఉంది. సుఖము, శాంతి, పవిత్రతలు మనుష్యుల నుండి మనుష్యులకు లభించవు. శాంతి కేవలం ఒక్కరికి మాత్రమే లభించదు. ఫలానావారి నుండి శాంతి లభించిందని అసత్యం చెప్తారు. అరే, శాంతి అయితే శాంతిధామంలోనే లభిస్తుంది. ఇక్కడ ఒకరు శాంతిగా ఉన్నప్పుడు, మరొకరు అశాంతపరిస్తే శాంతిగా ఉండలేరు. సుఖము, శాంతి, పవిత్రత, ఈ వస్తువులన్నింటి వ్యాపారి ఒక్క శివబాబాయే. వారితో ఎవరైనా వచ్చి వ్యాపారం చేయవచ్చు. వారిని వ్యాపారస్థుడు అని అంటారు. పవిత్రత, సుఖము, శాంతి, సంపద అన్నీ వారి వద్ద ఉన్నాయి. అప్రాప్తి అన్న వస్తువేదీ లేదు. మీరు స్వర్గ రాజ్యాన్ని పొందుతారు. తండ్రి అయితే ఇచ్చేందుకే వచ్చారు, తీసుకునేవారు తీసుకుంటూ-తీసుకుంటూ అలసిపోతారు. నేను ఇవ్వడానికే వస్తాను కానీ మీరు తీసుకోవడంలో చల్లబడిపోతారు. పిల్లలంటారు – బాబా, మాయ తుఫానులు వస్తాయి. అవును, మరి పదవి కూడా చాలా ఉన్నతమైనది పొందాలి. స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది తక్కువ విషయమా! కనుక శ్రమించాలి. శ్రీమతం అనుసారంగా నడుచుకుంటూ ఉండండి. మీకు ఏ సామానైతే లభిస్తుందో, దానిని మళ్ళీ ఇతరులకు కూడా ఇవ్వవలసి ఉంటుంది. దానం చేయవలసి ఉంటుంది. పవిత్రులుగా అవ్వాలంటే, పంచ వికారాలను తప్పకుండా దానం చేయాలి. శ్రమించాలి. తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడే తుప్పు తొలగిపోతుంది. ముఖ్యమైనది స్మృతి. బాబా, మేము వికారాల్లోకి ఎప్పుడూ వెళ్ళము, ఎవరిపైనా క్రోధము చేయము అని ప్రతిజ్ఞ చేయండి. కానీ స్మృతిలో తప్పకుండా ఉండాలి. లేదంటే ఇన్ని పాపాలు ఎలా వినాశనం అవుతాయి. ఇకపోతే, నాలెడ్జ్ అయితే చాలా సహజమైనది. 84 జన్మల చక్రంలో ఎలా తిరిగాము అన్నది మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఇకపోతే, స్మృతి యాత్రలోనే శ్రమ ఉంది. భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. ఏ జ్ఞానాన్ని ఇస్తారు. మన్మనాభవ అనగా నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు వచ్చినప్పుడు, ఇతర సాంగత్యాలను వదిలి, ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తాము, మీపై బలిహారమవుతాము, మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయము అని మీరు పాడేవారు కూడా. ప్రతిజ్ఞ చేసారు, మరి ఎందుకు మర్చిపోతారు. చేతులు పని వైపు, హృదయం ప్రియుని వైపు….. అని కూడా అంటారు. మీరే కర్మయోగులు. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. ప్రియుడైన తండ్రి స్వయంగా చెప్తున్నారు – ప్రేయసులైన మీరు అర్ధకల్పం స్మృతి చేసారు, ఇప్పుడు నేను వచ్చాను, నన్ను స్మృతి చేయండి. ఈ స్మృతినే పదే-పదే మర్చిపోతారు, ఇందులోనే శ్రమ ఉంది. కర్మాతీత అవస్థ ఏర్పడినప్పుడు, ఈ శరీరాన్ని కూడా వదలవలసి ఉంటుంది. ఎప్పుడైతే రాజధాని స్థాపన జరిగిపోతుందో, అప్పుడు మీరు కర్మాతీత అవస్థను పొందుతారు. ఇప్పుడైతే అందరూ పురుషార్థులు. మమ్మా-బాబా అందరికన్నా ఎక్కువగా స్మృతి చేస్తారు. వారు సూక్ష్మవతనంలో కూడా కనిపిస్తారు.

తండ్రి అర్థం చేయిస్తారు – నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో, అది వారి అనేక జన్మల అంతిమ జన్మ. వారు కూడా పురుషార్థం చేస్తున్నారు. కర్మాతీత అవస్థకు ఇప్పుడింకా ఎవరూ చేరుకోలేరు. కర్మాతీత అవస్థను చేరుకున్నట్లయితే, ఇక ఈ శరీరం ఉండజాలదు. బాబా అయితే చాలా మంచిరీతిగా అర్థం చేయిస్తారు. ఇక మిగిలినది అర్థం చేసుకునేవారి బుద్ధిపై ఆధారపడి ఉంది. హెవెన్లీ గాడ్ ఫాదర్ ఒక్కరే. వారి వద్దనే జ్ఞానం యొక్క సామాగ్రి అంతా ఉంది. వారే ఇంద్రజాలికుడు. ఇతురులెవ్వరి నుండి సుఖము-శాంతి-పవిత్రతల వారసత్వం లభించజాలదు. తండ్రి చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తారు. పిల్లలు ధారణ చేయాలి మరియు ధారణ చేయించాలి. ఎంతగా ధారణ చేస్తారో, అంతగా వారసత్వాన్ని తీసుకుంటారు. రోజు-రోజుకు చాలా తాజా సరుకు లభిస్తుంది. లక్ష్మీనారాయణులు ఎంత మధురమైనవారో చూడండి, వారిలా మధురంగా తయారవ్వాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఇంకే సత్సంగంలోనైనా ఈ విధంగా అంటారా. మన ఈ భాష పూర్తిగా కొత్త భాష, దీనిని స్పిరిచ్యుల్ నాలెడ్జ్ అని అంటారు. అచ్ఛా.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ద్వారా సుఖము-శాంతి-పవిత్రతల సామాను ఏదైతే లభించిందో, దానిని అందరికీ ఇవ్వాలి. ముందు వికారాలను దానమిచ్చి పవిత్రంగా అవ్వాలి, తర్వాత అవినాశీ జ్ఞాన ధనాన్ని దానం చేయాలి.

2. దేవతల వలె మధురంగా అవ్వాలి. బాప్ దాదాకు ఏదైతే ప్రతిజ్ఞ చేసారో, దానిని సదా గుర్తుంచుకోవాలి మరియు తండ్రి స్మృతిలో ఉంటూ వికర్మలను కూడా వినాశనం చేసుకోవాలి.

వరదానము:-

ఎవరైతే స్వయం పట్ల లా-ఫుల్ గా అవుతారో, వారే ఇతరుల పట్ల కూడా లా-ఫుల్ గా అవ్వగలరు. ఎవరైతే స్వయం లా ను బ్రేక్ చేస్తారో, వారు ఇతరులపై లా ను నడపలేరు. అందుకే తమను తాము చూసుకోండి – ఉదయం నుండి రాత్రి వరకు మనసా సంకల్పాలలో, వాణిలో, కర్మలలో, సంపర్కంలో మరియు ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకోవడంలో మరియు సేవలో, ఎక్కడా కూడా లా బ్రేక్ అవ్వడం లేదు కదా. ఎవరైతే లా-మేకర్ గా ఉంటారో, వారు లా-బ్రేకర్ గా అవ్వలేరు. ఎవరైతే ఈ సమయంలో లా-మేకర్ గా అవుతారో, వారే పీస్ మేకర్ గా, న్యూ వరల్డ్ మేకర్ గా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top