29 June 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 28, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీరు ఎవ్వరితోనూ ఎక్కువగా వాదించకూడదు, కేవలం తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వండి’’

ప్రశ్న: -

అనంతమైన తండ్రికి సొంత పిల్లలు కూడా ఉన్నారు, అలాగే సవతి పిల్లలు కూడా ఉన్నారు, సొంత పిల్లలు ఎవరు?

జవాబు:-

ఎవరైతే తండ్రి శ్రీమతముపై నడుస్తారో, పవిత్రత యొక్క పక్కా రాఖీని కట్టుకుని ఉంటారో, ఎవరికైతే మేము అనంతమైన వారసత్వాన్ని తీసుకునే తీరుతాము అన్న నిశ్చయము ఉందో, అటువంటి నిశ్చయబుద్ధి కల పిల్లలు సొంత పిల్లలు. మరియు ఎవరైతే మన్మతముపై నడుస్తారో, అప్పుడప్పుడు నిశ్చయము, అప్పుడప్పుడు సంశయముతో ఉంటారో, ప్రతిజ్ఞను చేసి కూడా తెంచేస్తారో, వారు సవతి పిల్లలు. సుపుత్రులైన పిల్లల పనేమిటంటే, తండ్రి యొక్క ప్రతి మాటను స్వీకరించడము. తండ్రి మొదటి మతాన్ని ఇస్తారు, మధురమైన పిల్లలూ, ఇప్పుడు ప్రతిజ్ఞ చేసి సత్యమైన రాఖీని కట్టుకోండి, వికారీ వృత్తిని సమాప్తము చేయండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి… (జాగ్ సజనియా జాగ్…)

ఓంశాంతి. పిల్లలు పాట అర్థాన్ని అయితే అర్థం చేసుకున్నారు. కొత్త సృష్టి, కొత్త యుగము మరియు పాత సృష్టి, పాత యుగము. పాత సృష్టి తర్వాత కొత్త సృష్టి వస్తుంది. పరమపిత పరమాత్మనే కొత్త సృష్టని రచిస్తారు, వారిని ఈశ్వరుడు అని అనండి లేక ప్రభు అని అనండి. వారి పేరు కూడా తప్పకుండా చెప్పవలసి ఉంటుంది. కేవలం ప్రభు అని అంటే, యోగము ఎవరితో జోడించాలి, ఎవరిని స్మృతి చేయాలి? మనుష్యులైతే, వారికి నామ, రూప, దేశ, కాలాలు లేవని అంటారు. అరే, భారత్ లో వారి పేరు శివునిగా ప్రసిద్ధి గాంచింది, వారి పేరు మీద శివరాత్రిని జరుపుకుంటారు, వారిని తండ్రి అని అంటారు. ఎప్పుడైతే తండ్రి యొక్క పరిచయము ఉంటుందో, అప్పుడే తండ్రితో బుద్ధి యోగము జోడించబడుతుంది. ఎవరితోనైనా ఎక్కువగా వాదించడము కూడా అనవసరము. అనంతమైన తండ్రి మనుష్య సృష్టిని ఏ విధంగా, ఎప్పుడు మరియు ఎటువంటిది రచిస్తారు అని మొట్టమొదట పరిచయాన్ని ఇవ్వాలి. లౌకిక తండ్రి అయితే సత్యయుగము నుండి మొదలుకొని కలియుగాంతము వరకు లభిస్తూనే ఉంటారు. కానీ స్మృతి మాత్రము పారలౌకిక తండ్రిని చేయడము జరుగుతుంది. వారు పరంధామంలో నివసించే తండ్రి. స్వర్గాన్ని ఎప్పుడూ పరంధామము అని భావించకండి. సత్యయుగమైతే ఇక్కడి ధామము. ఎక్కడైతే పరమపిత పరమాత్మ మరియు ఆత్మలు నివసిస్తారో, అది పరంధామము. ఇప్పుడు ఆత్మలందరికీ తండ్రి స్వర్గ రచయిత అయినప్పుడు, మరి పిల్లలకు స్వర్గ రాజ్యము ఎందుకు లేదు? అయితే, స్వర్గ రాజ్యం ఒకానొక సమయంలో తప్పకుండా ఉండేది. కొత్త ప్రపంచము, కొత్త యుగము ఉండేవి. ఇప్పుడిది పాత ప్రపంచము, పాత యుగము. తండ్రి అయితే స్వర్గాన్ని రచించారు, ఇప్పుడు నరకంగా అయ్యింది. నరకాన్ని ఎవరు తయారుచేసారు మరియు ఎప్పుడు తయారుచేసారు? మాయా రావణుడు నరకాన్ని తయారుచేసాడా? భారతవాసులకైతే ఈ జ్ఞానాన్ని ఇవ్వడము చాలా సహజము ఎందుకంటే భారతవాసులే రావణుడిని కాలుస్తారు కానీ కేవలం అర్థాన్ని తెలుసుకోరు. భక్తులందరూ భగవంతుడిని తలుచుకుంటారు. కానీ వారు ఎక్కడ ఉంటారో తెలియని కారణంగా, వారిని సర్వవ్యాపి అని, నామ రూపాలకు అతీతమైనవారని, అంతము లేనివారని అంటారు. వారి గురించి పూర్తిగా తెలుసుకోలేరు అందుకే మనుష్యమాత్రులందరూ ఆశను కోల్పోయి చల్లబడిపోయారు. కావున వారు వచ్చే, స్వర్గాన్ని రచించే సమయమంటూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మళ్ళీ వచ్చాను. భక్తులకు భగవంతుడి నుండి ఫలమైతే తప్పకుండా లభిస్తుంది. భగవంతునికి ఇక్కడికి వచ్చే ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అందరూ పతితులుగా ఉన్నారు. అక్కడికైతే పతితులు వెళ్ళలేరు కావున నాకే రావాల్సి ఉంటుంది. నన్ను ఆహ్వానిస్తారు. భక్తులకు భగవంతుడు కావాలి. ఇప్పుడు భగవంతుడి నుండి ఏం లభిస్తుంది? ముక్తి, జీవన్ముక్తి. అందరికీ ఇవ్వరు, ఎవరైతే కృషి చేస్తారో వారికే ఇస్తారు. ఇన్ని కోట్ల మంది ఆత్మలు వారసత్వాన్ని పొందుతారా? ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఇలా చెప్పండి, తండ్రి స్వర్గ రచయిత, మేము అనుభవీలము. మనం ఇప్పుడు భగవంతుడిని వెతకలేము. వారికైతే వారి సమయంలో రావాల్సి ఉంటుంది. మేము కూడా ఇంతకుముందు చాలా వెతికాము, కానీ లభించలేదు. జప-తపాదులు, తీర్థ యాత్రలు మొదలైనవి చేసాము, చాలా వెతికాము కానీ లభించలేదు. వారికైతే తమ సమయానికి పరంధామము నుండి రావాలి. ఆది సనాతన దేవీ-దేవతలకు 84 జన్మలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 5 వర్ణాలు కూడా ప్రసిద్ధమైనవి. ఇప్పుడు శూద్ర వర్ణము ఉంది, దాని తర్వాత బ్రాహ్మణ వర్ణము ఉంటుంది. వర్ణాల గురించి కూడా మంచి రీతిలో అర్థం చేయించాలి. విరాట రూపములో కూడా వర్ణాలు ఉంటాయి. బ్రాహ్మణుల వర్ణము కూడా ఉంది, అది వారికి తెలియదు. కావున మొట్టమొదట, తండ్రి స్వర్గ రచయిత అని మరియు మేము బ్రహ్మాకుమార-కుమారీలము అని పరిచయమివ్వాలి. తండ్రి వచ్చి బ్రాహ్మణులను రచించాలి, అప్పుడే మనము దేవతలుగా అవుతాము. ప్రజాపిత బ్రహ్మా అన్న పేరు ఉంది. కావున బ్రహ్మా ముఖము ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. బ్రహ్మాకు తండ్రి శివబాబా. అనగా ఇది ఈశ్వరీయ కులము. ఏ విధంగానైతే కృపలానీ కులము, వాస్వానీ కులము ఉంటాయో, అలాగే ఈ సమయంలో మీది ఈశ్వరీయ కులము. మీరు వారి సంతానము, మీరు సత్యమైన బ్రాహ్మణులు, పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేసినవారు. వాస్తవానికి అందరూ పిల్లలే కానీ వారిలో కూడా కొందరు సొంత పిల్లలు, కొందరు సవతి పిల్లలు. ఎవరైతే సొంత పిల్లలుగా ఉన్నారో, వారికి పవిత్రతా రాఖీ కట్టబడి ఉంది. రక్షా బంధనం పండుగ కూడా ఉంది కదా, ఇవన్నీ ఈ సంగమయుగానికి సంబంధించిన విషయాలు, దసరా కూడా సంగమయుగానికి సంబంధించినది. వినాశనము తర్వాత వెంటనే దీపావళి వస్తుంది, అందరి జ్యోతి వెలుగుతుంది. కలియుగంలో అందరి జ్యోతి ఆరిపోయి ఉంది.

ఇప్పుడు తండ్రిని నావికుడు, తోట యజమాని అని కూడా అంటారు. బ్రహ్మా, విష్ణు, శంకరులను నావికులు లేక తోట యజమానులు అని అనరు. తండ్రి వచ్చి తమ తోటలో తమ పిల్లలను చూస్తారు. వారిలో కొందరు గులాబీలు, కొందరు సంపెంగలు, మరి కొందరు లిల్లీ పుష్పాలుగా ఉన్నారు. ప్రతి ఒక్కరిలో జ్ఞానం యొక్క సుగంధం ఉంది. మీరిప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఇది ముళ్ళ అడవి. ఎన్ని గొడవలు, కొట్లాటలు మొదలైనవి ఉన్నాయి ఎందుకంటే అందరూ నాస్తికులుగా ఉన్నారు, అనాథలుగా ఉన్నారు. వారికి మతమునిచ్చి వారిని సనాథలుగా చేయడానికి ఆ నాథుడు లేరు. నాథుని గురించి ఎవ్వరికీ తెలియదు. కనుక నాథునికి తప్పకుండా రావాల్సి ఉంటుంది కదా. కావున తండ్రి వచ్చి నాథునికి చెందినవారిగా చేస్తారు. మనుష్యులు, ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండాలి, పవిత్రత కూడా ఉండాలి అని కోరుకుంటారు కూడా. సత్యయుగములో ఒకే ధర్మము ఉండేది కదా. ఇప్పుడిది దుఃఖధామము. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణములోకి ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆ తర్వాత దేవతా వర్ణములోకి వెళ్తారు. అప్పుడిక ఈ పతిత సృష్టిపై రారు. భారత్ అన్నింటికన్నా ఉన్నతమైన ఖండము. ఒకవేళ గీతను ఖండితము చేయకపోతే ఈ భారత్ యొక్క ప్రస్తావన ఎవరు తీసుకువస్తారు? శివుని మందిరాలకు వెళ్తారు కదా. అవి అనంతమైన తండ్రి యొక్క మందిరాలు ఎందుకంటే తండ్రే సద్గతి దాత. వారు వచ్చి అనాథలను సనాథలుగా చేస్తారు. ఈ విషయాలు తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మిగిలినవారందరూ భక్తి నేర్పించేవారు. అక్కడైతే జ్ఞానము యొక్క విషయమే లేదు. జ్ఞాన సాగరుడు, సద్గతిదాత ఒక్కరే. మనుష్యులు ఎప్పుడూ సద్గతినిచ్చే గురువులుగా కాలేరు. వాస్తవానికి ఏదైనా కళను నేర్పించేవారిని గురువు అని అంటారు. కానీ ఆ గురువు మొత్తం సృష్టి అంతటికీ సద్గతినివ్వలేరు. మాకు సాధువులు మొదలైనవారి నుండి శాంతి లభిస్తుంది అని అంటారు కానీ అది అల్పకాలము కోసము. సన్యాసులేమో, స్వర్గ సుఖము కాకి రెట్ట సమానమైనదని అంటారు. మరి సన్యాసుల ద్వారా ఏదైతే శాంతి లభిస్తుందో, అది కూడా కాకి రెట్ట సమానంగానే ఉంటుంది. వారు ముక్తినైతే ఇవ్వలేరు కదా. ముక్తి-జీవన్ముక్తి దాత అయితే ఒక్క తండ్రి మాత్రమే. శ్రీ కృష్ణుని పట్ల అందరికీ చాలా ప్రేమ ఉంది, కానీ వారి గురించి పూర్తిగా తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, సత్యయుగంలో కృష్ణపురి ఉండేది, ఇప్పుడది కంసపురిగా అయ్యింది. ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ కృష్ణపురిని తయారుచేస్తారు. మళ్ళీ అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యముగా, నరకముగా అవుతుంది. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దుఃఖము. సుఖం యొక్క సమయము ఎక్కువగా ఉంటుంది, కానీ సుఖ-దుఃఖాల ఆట అయితే నడుస్తూ ఉంటుంది. దీనిని సృష్టి చక్రము అని అంటారు లేదా గెలుపు-ఓటముల ఆట అని అంటారు. మేము మోక్షాన్ని పొందుతామని సన్యాసులు భావిస్తారు. కానీ మోక్షాన్ని ఎవ్వరూ పొందలేరు. ఈ రహస్యం గురించి ఎవ్వరికీ తెలియదు. ముక్తి మరియు జీవన్ముక్తిని తండ్రి తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. మీరు మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు కదా! ఇక్కడ చూడండి, దుఃఖమే దుఃఖము ఉంది. ఇప్పుడు మనము తండ్రి సహాయముతో స్వర్గాన్ని తయారుచేస్తున్నాము, మళ్ళీ మనమే యజమానులుగా అయి రాజ్యము చేస్తాము మరియు మిగిలినవారందరినీ ముక్తిధామములోకి పంపిస్తాము. వారు మళ్ళీ తమ సమయానుసారముగా వస్తారు. వారు దిగినప్పుడు కూడా మొదట సుఖములోకి వస్తారు, ఆ తర్వాత దుఃఖములోకి వస్తారు. భక్తి మార్గములో జప తపాదులు, మాలను తిప్పడము మొదలైనవి చేస్తారు కదా. ఒక్కరినే స్మృతి చేయాలి అని అంటారు కూడా. ఇందులో దేహాభిమానాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది, కానీ ఎవ్వరూ విడిచిపెట్టరు. తండ్రి అంటారు, ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాల్సిందే. తండ్రి పిల్లలతోనే మాట్లాడుతారు. పిల్లలలో కూడా కొందరు సవతి పిల్లలుగా ఉన్నారు, మరికొందరు సొంత పిల్లలుగా ఉన్నారు. ఎవరైతే పవిత్రత యొక్క రాఖీని కట్టుకోరో, వారు సవతి పిల్లలు. సొంత పిల్లలకైతే, మేమైతే వారసత్వాన్ని తీసుకునే తీరుతామని నిశ్చయం ఉంటుంది. ఇకపోతే, కొంతమంది అయితే ఫెయిల్ అవుతారు. కొందరు కచ్చాగా, కొందరు పక్కాగా నంబరువారుగా అయితే ఉంటారు. ఎవరైతే పక్కాగా ఉంటారో, వారు స్త్రీని, పిల్లలను మొదలైనవారందరినీ తీసుకుని వస్తారు, తమ సమానంగా తయారుచేస్తారు. కొంగ-హంస అయితే కలిసి ఉండలేవు. తండ్రిపై పెద్ద బాధ్యత ఉంది. అందరినీ పవిత్రంగా చేయడము – ఇది తండ్రి పని, అందుకే తండ్రి అంటారు, రెండు చక్రాలు కలిసే నడవాలి. స్త్రీ మరియు పతి కలిసి నడిచినట్లయితే బండి సరిగ్గా నడుస్తుంది. రండి, మనం ఇద్దరమూ పవిత్రతా కంకణాన్ని కట్టుకుందాము. ఇప్పుడు మనం పవిత్రంగా అయి తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుందాము. బ్రహ్మాకు పిల్లలుగా అయ్యారంటే సోదరీ-సోదరులుగా అయినట్లు. ఇక అశుద్ధ కర్మలు జరగలేవు. వికారాల్లోకి వెళ్ళలేరు. ఇది ఈశ్వరీయ నియమము. ఇప్పుడు తండ్రి అంటారు, విషాన్ని తాగే మరియు తాగించే వృత్తిని తెంచేయాలి. మనం ఒకరికొకరు జ్ఞానామృతాన్ని తాగిద్దాము. మనం కూడా తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుందాము. సుపుత్రులైన పిల్లల పని ఏమిటంటే, తండ్రి చెప్పినది పాటించడము. ఎవరైతే పాటించరో, వారు కుపుత్రులు. కుపుత్రులైన పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడంలో తండ్రి తప్పకుండా కారణాలు చెప్తారు. బ్రాహ్మణులైన మీరు దేవతలుగా అవ్వనున్నారు, కావున మీరు మీ స్త్రీకి కూడా జ్ఞానామృతాన్ని తాగించాలి. ఎలాగైతే చిన్న పిల్లలకు ముక్కు పట్టుకుని మందు తాగిస్తారో, అలా స్త్రీకి కూడా చెప్పండి – ఈ పతి నీకు గురువు, ఈశ్వరుడు అన్నది నీవు అంగీకరిస్తావా? మరి తప్పకుండా నేను నీకు సద్గతినిస్తాను కదా! పురుషులైతే వెంటనే స్త్రీని తమ సమానంగా చేయగలరు. స్త్రీ అయితే పురుషుడిని త్వరగా అలా చేయలేరు, అందుకే అబలలపై చాలా అత్యాచారాలు జరుగుతాయి. కుమార్తెలు చాలా దెబ్బలు తినవలసి వస్తుంది. మిమ్మల్ని గవర్నమెంట్ కూడా రక్షించలేదు. మేము ఏమీ చేయలేము అని వారు అంటారు. తండ్రి అయితే అంటారు, పిల్లలూ, శ్రీమతముపై నడుచుకున్నట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఒకవేళ కుపుత్రులుగా అయితే వారసత్వాన్ని పోగొట్టుకుంటారు. అక్కడ లౌకిక తండ్రి ద్వారా పిల్లలు హద్దు వారసత్వాన్ని తీసుకుంటారు మరియు ఇక్కడ సుపుత్రులైన పిల్లలు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. దీనిని దుఃఖధామము అని అంటారు. ఇక్కడైతే మీరు బంగారాన్ని కూడా ధరించకూడదు ఎందుకంటే ఈ సమయములో మీరు నిరుపేదలు. మరుసటి జన్మలోనే మీకు పూర్తిగా బంగారు మహళ్ళు లభిస్తాయి. రత్న జడితమైన మహళ్ళు ఉంటాయి. మీకు తెలుసు, మనం ఇప్పుడు తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నాము. భక్తి మార్గంలో నేను కేవలం భావనకు ఫలాన్ని ఇస్తాను. శ్రీకృష్ణుని ఆత్మ ఎక్కడ ఉంది, గురునానక్ ఆత్మ ఎక్కడ ఉంది అన్నది వారికి తెలియదు. మీకు తెలుసు, ఇప్పుడు వారందరూ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ తమోప్రధానంగా అయ్యారు. వారు కూడా సృష్టి చక్రములోనే ఉన్నారు, అందరూ తమోప్రధానంగా అవ్వాల్సిందే. అంతిమములో తండ్రి వచ్చి మళ్ళీ అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు పవిత్రతా యొక్క కంకణము కట్టుకోవాలి. దేహాభిమానాన్ని వదిలి వికారీ వృత్తులను పరివర్తన చేసుకోవాలి.

2. తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ సుపుత్రులైన పిల్లలుగా అవ్వాలి. జ్ఞానామృతాన్ని తాగాలి మరియు తాగించాలి. స్వయంలో జ్ఞానం యొక్క సుగంధాన్ని ధారణ చేసి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి.

వరదానము:-

మాయ వచ్చేందుకు ఏవైతే ద్వారాలున్నాయో, వాటికి స్మృతి మరియు సేవ యొక్క డబల్ లాక్ వేయండి. ఒకవేళ స్మృతిలో ఉంటూ మరియు సేవ చేస్తూ కూడా మాయ వస్తుందంటే తప్పకుండా స్మృతిలో లేక సేవలో ఏదో లోపము ఉంది. యథార్థ సేవ అంటే అందులో ఎటువంటి స్వార్థం ఉండకూడదు. ఒకవేళ అది నిస్వార్థ సేవ కాదు అంటే లాక్ వదులుగా ఉన్నట్లు, అంతేకాక స్మృతి కూడా శక్తిశాలిగా ఉండాలి. ఇటువంటి డబల్ లాక్ ఉన్నట్లయితే నిర్విఘ్నులుగా అవుతారు. అప్పుడు ఎందుకు, ఏమిటి అనే వ్యర్థమైన ఫీలింగ్ కు అతీతముగా ఫీలింగ్ ప్రూఫ్ ఆత్మగా ఉంటారు.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

వాస్తవానికి జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకోవడమనేది ఒక్క క్షణం పనే, కానీ ఒకవేళ మనిషి ఒక్క క్షణంలోనే అర్థం చేసుకున్నట్లయితే, వారికి – నిజానికి నేను శాంతి స్వరూప ఆత్మను మరియు పరమాత్మ సంతానాన్ని అన్న తమ స్వధర్మాన్ని తెలుసుకోవడానికి ఒక్క క్షణమే పడుతుంది. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడమైతే ఒక్క క్షణం యొక్క విషయమే, కానీ దీని పట్ల నిశ్చయం ఏర్పడడానికి ఏదైనా హఠయోగము, ఏవైనా జప-తపాదులు, ఏదో ఒక రకమైన సాధన చేయడము, ఇవేవీ అవసరము లేదు. కేవలం తమ ఒరిజినల్ రూపాన్ని పట్టుకోండి. ఇకపోతే, మనం ఇంత పురుషార్థము ఏదైతే చేస్తున్నామో, అది దేని కోసము? ఇప్పుడు దీనిపై అర్థం చేయించడం జరుగుతుంది, మనం ఇంత పురుషార్థం ఏదైతే చేస్తున్నామో, అది కేవలం ఈ విషయం కోసమే చేస్తున్నాము. తమ ప్రాక్టికల్ జీవితాన్ని తయారుచేసుకోవాలంటే, తమ ఈ దేహాభిమానాన్ని పూర్తిగా తొలగించాలి. నిజానికి ఆత్మాభిమానీ రూపంలో స్థితులవ్వడంలో మరియు ఈ దైవీ గుణాలను ధారణ చేయడంలో శ్రమ తప్పకుండా అనిపిస్తుంది. ఇందులో మనం ప్రతి సమయంలో, ప్రతి అడుగులో అప్రమత్తంగా ఉంటాము, ఇప్పుడు మనం మాయతో ఎంతగా అప్రమత్తంగా ఉంటామో, అంతగా ఎన్ని ఘటనలు ఎదురుగా వచ్చినా కూడా, మనల్ని ఎదిరించలేవు. ఎప్పుడైతే మనల్ని మనము మర్చిపోతామో, అప్పుడు మాయ ఎదిరిస్తుంది, ఇప్పుడు ఇంత అవకాశము ఏదైతే ఉందో, అది కేవలం ప్రాక్టికల్ జీవితాన్ని తయారుచేసుకోవడము కోసమే. ఇకపోతే, జ్ఞానమైతే క్షణం యొక్క విషయము. అచ్ఛా – ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top