20 June 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 19, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - దేహ సహితంగా ఈ కనుల ద్వారా ఏదైతే చూస్తారో - దానిని మరచి ఒక్క తండ్రిని స్మృతి చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా సమాప్తమవ్వనున్నది’’

ప్రశ్న: -

సత్యయుగంలో రాజ్య పదవి యొక్క లాటరీని గెలుచుకునే పురుషార్థం ఏమిటి?

జవాబు:-

సత్యయుగంలో రాజ్య పదవిని తీసుకోవాలంటే స్వయంపై పూర్తి దృష్టిని పెట్టుకోండి. లోపల ఏ భూతము ఉండకూడదు. ఒకవేళ ఏదైనా భూతమున్నట్లయితే లక్ష్మిని వరించలేరు. రాజుగా తయారయ్యేందుకు ప్రజలను కూడా తయారుచేసుకోవాలి. 2. ఇక్కడే ఏడుపు ఫ్రూఫ్ గా అవ్వాలి. ఎవరైనా దేహధారి స్మృతిలో ఉండగా షాక్ వచ్చి శరీరం వదిలారంటే పదభ్రష్టులుగా అవుతారు, అందుకే తండ్రి స్మృతిలో ఉండేటువంటి పురుషార్థం చేయాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఈ రోజు కాకపోతే రేపు… (ఆజ్ నహీ తో కల్…)

ఓంశాంతి. శివబాబా ఓం శాంతి అని అంటారు, ఆ తర్వాత వీరి ఆత్మ కూడా ఓం శాంతి అని అంటుంది. వారు పరమాత్మ, వీరు ప్రజాపిత. వీరి ఆత్మ ఓం శాంతి అని అంటుంది. పిల్లలు కూడా ఓం శాంతి అని అంటారు. తమ స్వధర్మాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. మనుష్యులకైతే తమ స్వధర్మం గురించి కూడా తెలియదు. ఓం శాంతి అనగా ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని. ఆత్మ మనసు-బుద్ధి సహితంగా ఉంటుంది. ఇది మర్చిపోయి మనసు అన్న పదాన్ని ఉపయోగిస్తారు. ఒకవేళ ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది అని అడిగితే – వాహ్, ఇది కూడా ప్రశ్నేనా అని అనండి. ఆత్మ స్వయమే శాంతి స్వరూపము, శాంతిధామంలో నివసించేటువంటిది. శాంతి అయితే అక్కడే లభిస్తుంది కదా. ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది, అప్పుడు శాంతిలో ఉంటుంది. ఇదంతా ప్రపంచము, ఇందులో ఆత్మలకు పాత్రను అభినయించాల్సి ఉంటుంది. శాంతిగా ఎలా ఉంటారు. పనులు చేయాల్సి ఉంటుంది. మనుష్యులు శాంతి కోసం ఎంతగా భ్రమిస్తారు. ఆత్మలమైన మన స్వధర్మము శాంతి అని వారికి తెలియదు. ఇప్పుడు మీకు ఆత్మ స్వధర్మము గురించి తెలుసు. ఆత్మ బిందువు వలె ఉంటుంది. అందరూ నిరాకార పరమాత్మాయ నమః అని అంటారని తండ్రి అర్థం చేయించారు. పరమపిత అని వారినే అంటారు. వారు నిరాకారుడు. వారిని శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఇప్పుడు మీ బుద్ధియోగము అటువైపు ఉంది. మనుష్యులందరూ అయితే దేహాభిమానులుగా ఉన్నారు. వారి యోగము తండ్రి వైపు లేదు. పిల్లలైన మీకు ప్రతి విషయము అర్థం చేయించడం జరుగుతుంది. బ్రహ్మా దేవతాయ నమః అని పాడుతారు కూడా, బ్రహ్మా పేరు తీసుకుని ఎప్పుడూ బ్రహ్మా పరమాత్మాయ నమః అని అనరు. ఒక్కరినే పరమాత్మ అని అనడం జరుగుతుంది. వారు రచయిత. మనం శివబాబా పిల్లలము అని మీకు తెలుసు. వారు మనల్ని బ్రహ్మా ద్వారా రచించారు, తమవారిగా చేసుకున్నారు. వారసత్వాన్ని ఇచ్చేందుకు బ్రహ్మా ఆత్మను కూడా తమవారిగా చేసుకున్నారు. బ్రహ్మా ఆత్మకు కూడా, నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. బి.కె.లకు కూడా నన్ను స్మృతి చేయండి, దేహాభిమానాన్ని వదలండి అని చెప్తారు. ఇవి జ్ఞానం యొక్క విషయాలు. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు ఈ శరీరము శిథిలావస్థకు చేరుకుంది. వ్యాధిగ్రస్తంగా, రోగగ్రస్తంగా అయ్యింది. పిల్లలైన మీరు ఎంత నిరోగిగా ఉండేవారు, సత్యయుగంలో ఎటువంటి రోగము ఉండేది కాదు. సదా ఆరోగ్యవంతులుగా ఉండేవారు. ఎప్పుడూ దివాలా తీసేవారు కాదు. ఇప్పటి నుండి 21 జన్మల కోసం తమ వారసత్వాన్ని తీసుకుంటారు, అందుకే ఇక దివాలా తీయలేరు. ఇక్కడైతే దివాలా తీస్తూనే ఉంటారు. పరమపిత పరమాత్మ శివాయ నమః అని పాడుతారు అని పిల్లలకు అర్థం చేయించారు. బ్రహ్మాను పరమాత్మ అని అనరు. వారిని ప్రజాపిత అని అంటారు. దేవతలు సూక్ష్మవతనంలో ఉంటారు. ఈ ప్రజాపితనే వెళ్ళి ఫరిశ్తాగా అవుతారని ఎవ్వరికీ తెలియదు. సూక్ష్మవతనవాసిగా అవుతారు అనగా సూక్ష్మ దేహధారిగా అవుతారు. ఇప్పుడు పిల్లలకు తండ్రి అర్థం చేయించారు – నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు కూడా నిరాకారులే. నేను కూడా నిరాకారుడినే. నన్ను ఒక్కరినే స్మృతి చేయాలి. మిగిలిన దేహధారులెవరైతే ఉన్నారో, వారి నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి. దేహ సహితంగా ఈ కనులతో ఏదైతే చూస్తారో, అదంతా సమాప్తమవ్వనున్నది. ఆ తర్వాత మీరు వయా శాంతిధామము, సుఖధామానికి వెళ్ళాలి. ఆ సుఖధామము లేక కృష్ణపురి పట్లనే మీకు కోరిక ఉంటుంది. కావున తండ్రి అంటారు, శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. సత్యయుగంలో కూడా పవిత్రత, సుఖము, శాంతి ఉంటాయి కానీ దానిని శాంతిధామము అని అనరు. కర్మలనైతే అందరూ చేయాలి. రాజ్యము చేయాలి. సత్యయుగంలో కూడా కర్మలు చేస్తారు కానీ అవి వికర్మలుగా అవ్వవు ఎందుకంటే అక్కడ మాయే ఉండదు. ఇదైతే సులభంగా అర్థము చేసుకునే విషయము. అది బ్రహ్మా పగలు, పగటిపూట ఎదురుదెబ్బలు తినరు. రాత్రివేళ అంధకారములో ఎదురుదెబ్బలు తింటారు. కావున అర్ధకల్పము భక్తి, బ్రహ్మా రాత్రి. అర్ధకల్పము బ్రహ్మా పగలు. ఒక ప్రదేశంలో 6 మాసాలు పగలు, 6 మాసాలు రాత్రి ఉంటుందని బాబా చెప్పారు. కానీ ఈ విషయాన్ని ఏ శాస్త్రాల్లోనూ చెప్పలేదు. ఈ బ్రహ్మా పగలు, బ్రహ్మా రాత్రి గురించి శాస్త్రాలలో చెప్పారు. ఇప్పుడు విష్ణువు రాత్రి అని ఎందుకు అనరు! అక్కడ వారికి ఈ జ్ఞానమే ఉండదు. బ్రహ్మా మరియు బ్రహ్మాకుమార-కుమారీల కొరకు ఇది అనంతమైన పగలు మరియు రాత్రి అని బ్రాహ్మణులకు తెలుసు. శివబాబా యొక్క పగలు మరియు రాత్రి అని అనరు. మనకు అర్థకల్పము పగలు, అర్ధకల్పము రాత్రి అని పిల్లలకు తెలుసు. ఆట కూడా ఈ విధంగానే ఉంది. ప్రవృత్తి మార్గము వారి గురించి సన్యాసులకు తెలియదు. వారు నివృత్తి మార్గము వారు. వారికి స్వర్గము మరియు నరకము గురించి తెలియదు. వారు స్వర్గము ఎక్కడి నుండి వచ్చింది అని అంటారు ఎందుకంటే శాస్త్రాలలో సత్యయుగాన్ని కూడా నరకంగా చేసేసారు. ఇప్పుడు తండ్రి చాలా మధురాతి-మధురమైన విషయాలను వినిపిస్తారు. వారంటారు, పిల్లలూ, నిరాకారుడినైన నేను జ్ఞానసాగరుడను. నేను జ్ఞానమిచ్చే పాత్ర ఈ సమయంలో ఇమర్జ్ అవుతుంది. తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు. భక్తి మార్గములో నా జ్ఞానము ఇమర్జ్ అవ్వదు. ఆ సమయములో ఆచార-పద్ధతులన్నీ భక్తి మార్గానివి కొనసాగుతాయి. డ్రామానుసారంగా ఏ భక్తులు ఏ భావనతో పూజ చేస్తారో, వారికి ఆ విధంగా సాక్షాత్కారము చేయించేందుకు నేను నిమిత్తమై ఉన్నాను. ఆ సమయంలో నా ఆత్మలో జ్ఞానము యొక్క పాత్ర ఇమర్జ్ అయి ఉండదు. అది ఇప్పుడే ఇమర్జ్ అయ్యింది. ఏ విధంగా మీ 84 జన్మల రీలు నిండి ఉందో, అలా నాలో కూడా ఏ-ఏ పాత్ర డ్రామాలో ఎప్పుడు నిశ్చితమై ఉందో, అది ఆ సమయంలోనే జరుగుతుంది. ఇందులో సంశయం యొక్క విషయమేమీ లేదు. ఒకవేళ నాలో జ్ఞానము ఇమర్జ్ అయి ఉంటే, భక్తి మార్గములో కూడా ఎవరికైనా వినిపించేవాడిని. లక్ష్మీ-నారాయణులకు అక్కడ ఈ జ్ఞానము లేదు. డ్రామాలో ఆ విధంగా నిశ్చితమై లేదు. మనుష్యమాత్రులకు ఒకవేళ ఎవరైనా, మాకు ఫలానా గురువు సద్గతినిస్తారని చెప్పారనుకోండి, గురువులు సద్గతిని ఎలా ఇస్తారు? వారికి కూడా పాత్ర ఉంది. మరికొందరు, ఈ ప్రపంచము తప్పకుండా రిపీట్ అవుతూ ఉంటుందని అంటారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. దీనికి గుర్తుగా చరఖాను (రాట్నమును) చూపించారు. ఈ సృష్టి ఒక చక్రము వంటిది. విచిత్రము చూడండి, రాట్నమును తిప్పడముతో పొట్ట కూటి లభిస్తుంది. ఇక్కడ ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడముతో మీకు 21 జన్మల కోసము ప్రారబ్ధము లభిస్తుంది. బాబా యథార్థ రీతిలో అర్థాన్ని కూర్చుని వినిపిస్తారు. మిగిలినవారంతా అయథార్థమును వినిపిస్తారు. మీ బుద్ధి తాళము తెరిచి ఉంది. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, ఆ తర్వాత బ్రహ్మా, విష్ణు, శంకరులు సూక్ష్మవతనవాసులు. ఆ తర్వాత స్థూలవతనంలో మొదట లక్ష్మీ-నారాయణులు, ఆ తర్వాత జగదంబ-జగత్పితలు. వీరు సంగమయుగానికి చెందినవారు. వాస్తవానికి వీరూ మనుష్యులే. భుజాలు మొదలైనవి ఎక్కువగా ఏమీ లేవు. బ్రహ్మాకు కూడా రెండు భుజాలే ఉన్నాయి. భక్తి మార్గములోని చిత్రాలలో ఎన్ని భుజాలను చూపించారు. ఒకవేళ ఎవరికైనా 8 భుజాలుంటే, 8 కాళ్ళు కూడా ఉండాలి. కానీ అలా ఉండదు. రావణునికి 10 తలలు చూపిస్తారు, అటువంటప్పుడు కాళ్ళు 20 చూపించాలి. ఇదంతా బొమ్మలాట. ఏమీ అర్థము చేసుకోరు. రామాయణము వినిపించినప్పుడు చాలా ఏడుస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు – ఇదంతా భక్తి మార్గము. ఎప్పటి నుండైతే మీరు వామమార్గములోకి వెళ్ళారో, అప్పటి నుండి కామ చితిపై కూర్చుని మీరు నల్లగా అయిపోయారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో జ్ఞాన చితిపై కూర్చునే కంకణము కట్టుకున్నట్లయితే 21 జన్మల కోసం వారసత్వము లభిస్తుంది. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు. ఒక పాత శరీరాన్ని వదిలి మరొక కొత్త శరీరాన్ని తీసుకుంటారు. ఏడ్చేటువంటి విషయమేమీ ఉండదు. ఇక్కడ పుత్రుడు జన్మిస్తే అభినందనలు తెలియజేస్తారు, ఘనంగా జరుపుకుంటారు. ఒకవేళ రేపు ఆ పుత్రుడు మరణిస్తే ఓ ఈశ్వరా, అయ్యో దేవుడా అని మొరపెట్టుకుంటారు. దుఃఖధామము కదా. భారత్ పైనే మొత్తం ఆటంతా ఉందని మీకు తెలుసు. భారత్ అవినాశీ ఖండము. అందులోనే సుఖము-దుఃఖము, నరకము-స్వర్గము యొక్క వారసత్వము ఉంటుంది. స్వర్గ రచయితనే తప్పకుండా స్వర్గాన్ని రచించి ఉంటారు. ఒకవేళ ఇది లక్షల సంవత్సరాల విషయమైతే ఎవరికైనా ఎలా గుర్తుకొస్తుంది? స్వర్గము మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. కలియుగము ఆయువు ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని అంటారు. 5000 సంవత్సరాలలో 84 జన్మలున్నాయి అన్నప్పుడు మరి 40,000 సంవత్సరాలలో ఎన్ని జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది! ఇప్పుడు పిల్లలైన మీకు అర్థమవుతుంది. మీరు ప్రకాశములో ఉన్నారు. మిగిలినవారు ఎవరికైతే జ్ఞానము లేదో, వారు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు. ఇది అజ్ఞాన అంధకారమయ రాత్రి అనగా సృష్టి చక్రం యొక్క జ్ఞానము లేదు. మనము పాత్రధారులము, ఈ సృష్టి చక్రములో నాలుగు భాగాలున్నాయి. ఈ విషయాలను మనుష్యులు మాత్రమే తెలుసుకుంటారు. తండ్రి నాలెడ్జ్ ఫుల్ అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారిలో ఏ-ఏ విశేషతలున్నాయో, అవన్నీ మీకు దానమిస్తారు. జ్ఞానసాగరుడి నుండి మీరు వారసత్వాన్ని తీసుకుంటారు. దేహధారులను గుర్తు చేయకండి అని బాబా ఎప్పుడూ చెప్తారు. నేను కూడా దేహము ద్వారానే వినిపిస్తూ ఉండవచ్చు కానీ మీరు నిరాకారుడినైన నన్నే స్మృతి చేయాలి. స్మృతి చేస్తూ ఉంటే ధారణ కూడా జరుగుతుంది, బుద్ధి తాళము కూడా తెరుచుకుంటుంది. 15 నిమిషాలు లేక అర్ధగంటతో మొదలుపెట్టండి, తర్వాత పెంచుతూ వెళ్ళండి. చివరి సమయములో ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. అందుకే సన్యాసులు అంతా విడిచిపెట్టేస్తారు. తపస్యలో కూర్చొంటారు. ఎప్పుడైతే శరీరము వదులుతారో, ఆ సమయంలో చుట్టుప్రక్కల వాయుమండలము కూడా శాంతిగా అయిపోతుంది. ఏదైనా పట్టణములో ఎవరైనా మహాపురుషుడు శరీరము వదిలినట్లుగా ఉంటుంది. మీకైతే ఇప్పుడు జ్ఞానముంది. ఆత్మ అవినాశీ, అది లీనము అవ్వలేదు. వారిలోనైతే ఈ జ్ఞానము లేదు.

బాబా అర్థం చేయిస్తారు, ఆత్మ ఎప్పటికీ వినాశనమవ్వదు. ఆత్మలో ఏదైతే జ్ఞానముందో, అది కూడా ఎప్పటికీ వినాశనమవ్వదు. ఇది అవినాశీ డ్రామా. సత్యయుగము, త్రేతా, ద్వాపరము, కలియుగము… ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. మీరు మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, ఆ తర్వాత నంబరువారుగా ఇతర ధర్మాల వారు కూడా వస్తారు. గాడ్ ఫాదర్ ఒక్కరే. సత్యయుగము నుండి కలియుగము వరకు వృద్ధి చెందుతూ ఉంటారు, మరో వృక్షము తయారవ్వదు. చక్రము కూడా ఒక్కటే. స్మృతి కూడా ఒక్కరినే చేస్తారు. గురునానక్ ను తలచుకుంటారు కానీ వారు మళ్ళీ వారి సమయములోనే రావాల్సి ఉంటుంది. జనన-మరణాలలోకి అయితే అందరికీ రావాల్సి ఉంటుంది. కృష్ణుడు అంతటా ఉన్నారని మనుష్యులు భావిస్తారు. కొందరు ఒకరిని నమ్ముతారు, మరికొందరు ఇంకొకరిని నమ్ముతారు. బాబా అర్థం చేయిస్తారు – పిల్లలూ, యుక్తిగా అర్థం చేయించండి – అందరికీ ఈశ్వరుడు నిరాకారుడొక్కరే. గీతలో భగవానువాచ అని ఉంది. కావున గీత అందరికీ తల్లి-తండ్రి ఎందుకంటే దాని ద్వారానే అందరికీ సద్గతి లభిస్తుంది. తండ్రి సర్వుల దుఃఖహర్త-సుఖకర్త. భారత్ అందరి తీర్థ స్థానము. సద్గతి తండ్రి ద్వారానే లభిస్తుంది. ఇది వారి జన్మ స్థలము, అందరూ వారిని స్మృతి చేస్తారు. తండ్రే వచ్చి అందరినీ రావణ రాజ్యం నుండి విడిపిస్తారు. ఇప్పుడిది రౌరవ నరకము.

ఇప్పుడు తండ్రి అంటారు, ఓ దేహధారీ ఆత్మలు, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, కేవలం నన్ను మాత్రమే స్మృతి చేయండి. ఎప్పుడైనా దేహధారుల్లో చిక్కుకున్నారంటే, ఏడ్వాల్సి ఉంటుంది. ఒక్కరినే స్మృతి చేయాలి, అక్కడికి రావాలి. మీ ఏడుపు 21 జన్మల కోసం సమాప్తమైపోతుంది. ఎవరైనా మరణించినప్పుడు మీరు ఏడవడం మొదలుపెడితే, ఇక ఏడుపు-ప్రూఫ్ గా అవ్వరు. ఎవరి స్మృతిలోనో ఉండగా, షాక్ వచ్చి మరణించినట్లయితే దుర్గతి ఏర్పడుతుంది. మీరు శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి కదా. హార్ట్ ఫెయిల్ కూడా అవుతుంది. మీరైతే లేస్తూ-కూర్చుంటూ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఇది కూడా బుద్ధిలో కూర్చోబెట్టడం జరుగుతుంది ఎందుకంటే రోజంతటిలో స్మృతి చేయకపోతే సంగఠనలో కూర్చోబెట్టడం జరుగుతుంది. అందరిదీ కలిస్తే ఫోర్సు ఉంటుంది. ఒకవేళ ఇంకెవరి స్మృతి అయినా బుద్ధిలో ఉంటే, మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఏం జరిగినా సరే, స్థిరంగా ఉండాలి. దేహ భానము ఉండకూడదు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, ఆ స్మృతి రికార్డులో నిశ్చితమవుతుంది. మనము త్వరగా వెళ్ళిపోతాము, వెళ్ళి సింహాసనంపై కూర్చుంటామని మీకు సంతోషము కూడా చాలా ఉంటుంది. తండ్రి సదా చెప్తారు – పిల్లలూ, మీరు ఎప్పుడూ ఏడవకూడదు, విధవలు ఏడుస్తారు. మీరు సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే అవ్వాలి, అది ఇక తర్వాత అవినాశీగా నిలుస్తుంది. కృషి అవసరము. తమపై తాము దృష్టి పెట్టుకోవాలి, ఏదైనా భూతము ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందలేరు. నారదుడు భక్తుడు, లక్ష్మిని వరించాలనుకున్నారు, కానీ ముఖము చూస్తే కోతి వలె ఉంది…. మీరు లక్ష్మిని వరించేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎవరిలోనైతే 5 భూతాలు ఉంటాయో, వారు ఎలా వరించగలరు. చాలా కృషి అవసరము. చాలా గొప్ప లాటరీని గెలుస్తారు. మనము రాజులుగా తప్పకుండా అవుతాము కనుక ప్రజలు కూడా ఉంటారు. వేలాది, లక్షలాది సంఖ్యలో వృద్ధి జరుగుతూ ఉంటుంది. మొట్టమొదట ఎవరైనా వస్తే, వారికి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. పతితపావనుడైన పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధముంది! వారు తండ్రి అని తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. అచ్ఛా, అయితే రాయండి. ఒక్క పతితపావనుడే సర్వులను పావనంగా చేసేవారు. రాయించుకుంటే, ఇక ఎవరూ వాదించరు. మీరు ఇక్కడికి వినడానికి వచ్చారా లేక వినిపించడానికా అని అడగండి. సర్వుల సద్గతిదాత అయితే ఒక్క నిరాకారుడే కదా. వారెప్పుడూ ఆకారములోకి, సాకారములోకి రారు. అచ్ఛా, మరి ప్రజాపితతో మీకు ఏం సంబంధముంది? వీరు సాకారములో ఉన్నవారు, వారు నిరాకారీ బాబా. మనము ఒక్క తండ్రినే స్మృతి చేస్తాము. ఇది మన లక్ష్యము-ఉద్దేశ్యము. వీరి నుండి మనము రాజ్యాన్ని పొందుతాము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ దేహధారిలోనూ తమ బుద్ధిని చిక్కుకోనివ్వకూడదు. స్మృతి రికార్డును సరిగ్గా ఉంచుకోవాలి. ఎప్పుడూ ఏడవకూడదు.

2. తమ శాంతి స్వధర్మములో స్థితులై ఉండాలి. శాంతి కోసము భ్రమించకూడదు. అందరినీ ఈ భ్రమించడము నుండి విడిపించాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి.

వరదానము:-

ఎప్పుడూ కూడా పురుషార్థములో నిరాశ చెందకండి. చేయాల్సిందే, అవ్వాల్సిందే, విజయమాల నా స్మృతిచిహ్నమే – ఈ స్మృతితో విజయులుగా అవ్వండి. ఒక్క సెకండు లేక నిముషము కోసం కూడా నిరాశకు మీ లోపల స్థానమివ్వకండి. అభిమానము మరియు నిరాశ – ఈ రెండు మహాబలవంతులుగా అవ్వనివ్వవు. అభిమానము కలవారికి, అవమానము యొక్క ఫీలింగ్ చాలా వస్తుంది, అందుకే ఈ రెండు విషయాల నుండి ముక్తులుగా అయి నిర్మానులుగా అవ్వండి, అప్పుడు నవ నిర్మాణ కార్యాన్ని చేస్తూ ఉంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top