17 June 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 16, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - స్మృతిలో ఉంటూ మీ వికర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లయితే వికర్మాజీతులుగా అవుతారు, పాత లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి’’

ప్రశ్న: -

ఏ పిల్లల ద్వారా ప్రతి విషయము యొక్క త్యాగము సహజంగా అవుతుంది?

జవాబు:-

ఏ పిల్లలకైతే లోపల నుండి వైరాగ్యం వస్తుందో – వారు ప్రతి విషయము యొక్క త్యాగము సహజంగానే చేస్తారు, పిల్లలైన మీలో ఇప్పుడు – ఇది ధరించాలి, ఇది తినాలి, ఇది చేయాలి… అనే కోరికలు ఉండకూడదు. దేహ సహితంగా మొత్తం పాత ప్రపంచాన్నే త్యాగము చేయాలి. అరచేతిలో వైకుంఠాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు కావున ఈ పాత ప్రపంచం నుండి బుద్ధియోగము తొలగిపోవాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మాతా ఓ మాతా..

ఓంశాంతి. పిల్లలు తమ తల్లి యొక్క మహిమను విన్నారు. పిల్లలైతే చాలా మంది ఉన్నారు, తండ్రి ఉన్నారు కావున తప్పకుండా తల్లి కూడా ఉంటారని అర్థం చేసుకోవడం జరుగుతుంది. రచన కొరకు తల్లి తప్పకుండా ఉంటారు. భారత్ లో తల్లి గురించి చాలా మంచి మహిమ జరుగుతుంది. జగదంబ యొక్క చాలా పెద్ద మేళా జరుగుతుంది, ఏదో ఒక రకంగా తల్లికి పూజ జరుగుతుంది. తండ్రికి కూడా జరుగుతూ ఉండవచ్చు. వీరు జగదంబ అయితే వారు జగత్పిత. జగదంబ సాకారములో ఉన్నారు కావున జగత్పిత కూడా సాకారములో ఉన్నారు. వీరిరువురినీ రచయిత అనే అంటారు. ఇక్కడైతే సాకారములో ఉన్నవారు ఉన్నారు కదా. నిరాకారుడినే గాడ్ ఫాదర్ అని అంటారు. తల్లి-తండ్రి యొక్క రహస్యమైతే అర్థం చేయించడం జరిగింది. చిన్న తల్లి కూడా ఉన్నారు, పెద్ద తల్లి కూడా ఉన్నారు. మహిమ చిన్న తల్లికి ఉంది, వారిని దత్తత తీసుకుంటారు, తల్లిని కూడా దత్తత తీసుకున్నారు, కావున వీరు పెద్ద తల్లి అయినట్లు. కానీ మహిమ అంతా చిన్న తల్లికి ఉంది.

ఇది కూడా పిల్లలకు తెలుసు, ప్రతి ఒక్కరూ తమ కర్మభోగం యొక్క లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు వికర్మాజీతులుగా ఉండేవారు, తర్వాత రావణుడు వికర్మలు చేసేవారిగా చేసాడు. వికర్మలు చేసేవారి కాలము కూడా ఉంది, అలాగే వికర్మాజీతుల కాలము కూడా ఉంది. మొదటి అర్ధకల్పాన్ని వికర్మాజీతుల కాలము అని అంటారు, తర్వాతి అర్ధకల్పములో వికర్మలు చేసేవారి కాలము ప్రారంభమవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు వికర్మలపై విజయము పొంది వికర్మాజీతులుగా అవుతారు. పాపాలు ఏవైతే ఉన్నాయో, వాటిని యోగబలముతో ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. స్మృతితోనే ప్రాయశ్చిత్తము జరుగుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, స్మృతి చేసినట్లయితే పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది అనగా తుప్పు తొలగుతుంది. తలపై జన్మ-జన్మాంతరాల పాపాల భారం చాలా ఉంది. ఎవరైతే నంబరువన్ పుణ్యాత్మగా అవుతారో, వారే మళ్ళీ నంబరువన్ పాపాత్మగా కూడా అవుతారు అని అర్థం చేయించడం జరిగింది. వారికి చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వారు నేర్పించేందుకు శిక్షకునిగా అవుతారు కనుక వారికి తప్పకుండా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాధులు మొదలైనవి వచ్చినప్పుడు అవి తమ కర్మల వల్లనే అని చెప్పడం జరుగుతుంది. అనేక జన్మలు వికర్మలు చేసారు, దీని కారణంగా అనుభవించాల్సి ఉంటుంది, అందుకే ఎప్పుడూ వీటికి భయపడకూడదు. వీటిని సంతోషంగా దాటాలి ఎందుకంటే ఇవి మనం తయారుచేసుకున్న లెక్కాచారాలే. ఒక్క తండ్రి స్మృతితో ప్రాయశ్చిత్తము జరగాల్సిందే. ఎప్పటివరకైతే జీవిస్తారో, అప్పటివరకు పిల్లలైన మీరు జ్ఞానామృతాన్ని తాగాలి. యోగములో ఉండాలి, వికర్మలు ఉన్నాయి కావుననే దగ్గు మొదలైనవి వస్తాయి. సంతోషము కలుగుతుంది, ఇక్కడే లెక్కలన్నీ సమాప్తమైపోవాలి, అవి ఉండిపోతే పాస్ విత్ ఆనర్ గా అవ్వలేరు. శిక్షలు అనుభవించి, ఆ తర్వాత చిన్న పదవి లభిస్తే, అది కూడా అవమానమే కదా. అనేక రకాల దుఃఖాలు అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడున్న అనేక రకాల దుఃఖాలకు అంతే లేదు. అక్కడ సుఖానికి అంతు ఉండదు. పేరే స్వర్గము. క్రిస్టియన్లు, హెవెన్, హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు, ఈ విషయాల గురించి మీకు తెలుసు. నివృత్తి మార్గానికి చెందిన సన్యాసులైతే – ఇదంతా కాకి రెట్టతో సమానమైన సుఖము అని అంటారు. ఈ ప్రపంచంలో నిజంగా అలాగే ఉంది. ఎవరికి ఎంత సుఖమున్నా సరే, అది అల్పకాలికమైన సుఖమే. స్థిరమైన సుఖమైతే అస్సలు లేదు. కూర్చుని-కూర్చునే ఆపదలు వస్తాయి, హార్ట్ ఫెయిల్ అవుతుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకదానిలోకి వెళ్ళి ప్రవేశిస్తుంది, ఇక ఆ శరీరము దానికదే మట్టిపాలు అవుతుంది. జంతువుల శరీరాలైతే ఎంతైనా పనికొస్తాయి, మనుష్యులది పనికిరాదు. తమోప్రధాన పతిత శరీరము దేనికీ పనికిరాదు, గవ్వ సమానమైనది. దేవతల శరీరాలు వజ్ర సమానమైనవి. అందుకే వారికి ఎంత పూజ జరుగుతుందో చూడండి. ఈ వివేకము ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది.

వీరు అనంతమైన తండ్రి, వీరు అతి ప్రియమైనవారు, వీరిని అర్ధకల్పము స్మృతి చేసారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో – వారే తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు హక్కుదారులుగా అవుతారు. సత్యమైన బ్రాహ్మణలు చాలా పవిత్రంగా ఉండాలి. సత్యమైన గీతా పాఠకులకైతే పవిత్రంగా ఉండాల్సే ఉంటుంది. ఆ అసత్యమైన గీతా పాఠకులు పవిత్రంగా ఉండరు. ఇప్పుడు గీతలోనైతే, కామము మహాశత్రువు అని రాయబడి ఉంది. కానీ స్వయము గీతను వినిపించేవారు పవిత్రంగా ఎక్కడుంటారు. గీత, సర్వశాస్త్రమయి శిరోమణి, దాని ద్వారా తండ్రి గవ్వ నుండి వజ్ర సమానంగా తయారుచేసారు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు, గీతా పాఠకులు అర్థం చేసుకోలేరు. వారైతే చిలుక వలె చదువుతూ ఉంటారు. మహిమ అంతా ఒక్కరిదే, ఇంకే వస్తువుకూ మహిమ లేదు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా లేదు. మీరు వారి ముందు ఎంతైనా తల వంచండి, వారి ముందు బలి అవ్వండి, అయినా కూడా వారసత్వం లభించదు. కాశీలో కత్తుల బావిలోకి దూకి ప్రాణ త్యాగం చేస్తారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ దానిని ఆపు చేయించింది. లేదంటే చాలామంది కత్తుల బావిలోకి దూకి ప్రాణ త్యాగం చేసేవారు. వెళ్ళి బావిలోకి దూకేవారు. కొంతమంది దేవిపై బలి అయ్యేవారు, కొంతమంది శివునిపై. దేవతలపై బలి అవ్వడం వలన ఏ లాభము ఉండదు. కాళీపై బలి అవుతారు, కాళీని ఎంత నల్ల-నల్లగా చేసేసారు. ఇప్పుడైతే అందరూ ఇనుప యుగము వారిగా ఉన్నారు, వారు ఇంతకుముందు బంగారు యుగము వారిగా ఉండేవారు. అంబ అని ఒక్కరినే అంటారు. తండ్రిని ఎప్పుడూ అంబ అని అనరు. ఇప్పుడిది ఎవ్వరికీ తెలియదు. జగదంబ సరస్వతి, బ్రహ్మా యొక్క పుత్రిక. బ్రహ్మా తప్పకుండా ప్రజాపిత అయి ఉంటారు. సూక్ష్మవతనంలోనైతే ఉండరు. సరస్వతి, బ్రహ్మా యొక్క పుత్రిక అని భావిస్తారు కూడా. బ్రహ్మా యొక్క స్త్రీ గురించి చెప్పరు. తండ్రి అర్థం చేయిస్తారు, నేను ఈ బ్రహ్మా ద్వారా సరస్వతి పుత్రికను దత్తత తీసుకున్నాను. తండ్రి దత్తత తీసుకున్నారని పుత్రిక కూడా భావిస్తుంది. బ్రహ్మాను కూడా దత్తత తీసుకున్నారు. ఇది చాలా గుహ్యమైన విషయము, ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. తండ్రి కూర్చుని తమ గురించి కూడా పూర్తిగా తెలియజేస్తారు, అది తప్పకుండా సమ్ముఖంగానే తెలియజేస్తారు కదా. ప్రేరణ ద్వారా ఏమైనా తెలియజేస్తారా. భగవానువాచ, హే పిల్లలూ…. తప్పకుండా సాకారంలో వచ్చినప్పుడే ఇలా అంటారు కదా. నిరాకార తండ్రి కూర్చుని వీరి ద్వారా చదివిస్తారు, బ్రహ్మా చదివించరు. బ్రహ్మాను జ్ఞానసాగరుడని అనరు, ఒక్క తండ్రినే అంటారు. ఆత్మ అర్థం చేసుకుంటుంది, ఈ లౌకిక తండ్రి చదివించరు, పారలౌకిక తండ్రి కూర్చుని చదివిస్తారు, వారి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నాము. వైకుంఠాన్ని పరలోకమని అనరు. అది అమరలోకము, ఇది మృత్యులోకము. పరలోకము అనగా ఆత్మలమైన మనము అక్కడ ఉంటాము, ఇది పరలోకము కాదు. ఆత్మలమైన మనము ఈ లోకములోకి వస్తాము. పరలోకము అనేది ఆత్మలమైన మన లోకము. మీరు ఈ భారత్ లో రాజ్యం చేసారు, పరలోకములో కాదు. పరలోకము యొక్క రాజు అని అనరు. ఈ లోకములో మరియు పరలోకములో సుఖముగా ఉండాలి అని అంటారు. ఇది స్థూల లోకము, ఆ తర్వాత పరలోకములో కూడా సుఖముగా ఉంటారు. అదే భారత్ వైకుంఠముగా ఉండేది, మళ్ళీ అలా తయారవుతుంది. ఇది మృత్యులోకము, లోకములో మనుష్యులుంటారు. వైకుంఠ లోకానికి వెళ్ళాలని అంటారు. దిల్వాడా మందిరంలో కూడా కింద తపస్యలో కూర్చున్నారు. పైన వైకుంఠం యొక్క చిత్రాలను తయారుచేసారు. ఫలానావారు వైకుంఠానికి వెళ్ళారని భావిస్తారు. కానీ వైకుంఠమైతే ఇక్కడే ఉంటుంది, పైన ఉండదు. ఈ రోజు ఈ పతిత లోకం ఏదైతే ఉందో, అది మళ్ళీ పావన లోకంగా అవుతుంది. ఇంతకుముందు పావన లోకముండేది, ఇప్పుడది గడిచిపోయింది, అందుకే పరలోకమని అంటారు ఎందుకంటే ఇప్పుడది గతించిపోయింది కదా. భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు నరకముగా ఉంది అంటే ఇప్పుడు స్వర్గము గతించిపోయింది కదా. డ్రామానుసారంగా వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు స్వర్గము దూరమైపోతుంది, అందుకే పరలోకమని అంటారు.

ఇప్పుడు మీరు అంటారు, మేమిక్కడకు వచ్చి కొత్త ప్రపంచములో మళ్ళీ మా రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాము. ప్రతి ఒక్కరూ తమ కోసము పురుషార్థం చేస్తారు. ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. అందరూ అయితే చేయరు. ఎవరైతే చదువుకుంటారో, రాసుకుంటారో వారు వైకుంఠానికి నవాబులుగా అనగా యజమానులుగా అవుతారు. మీరు ఈ సృష్టిని బంగారుమయంగా చేస్తారు. ద్వారక బంగారుమయంగా ఉండేది, తర్వాత సముద్రం కిందకు వెళ్ళిపోయిందని అంటారు కదా. దానిని బయటకు తీసేందుకు అది అక్కడ కూర్చుని అయితే లేదు కదా. భారత్ స్వర్గంగా ఉండేది, దేవతలు రాజ్యం చేసేవారు. ఇప్పుడైతే ఏమీ లేదు. మళ్ళీ అంతా బంగారముతో తయారుచేయాల్సి ఉంటుంది. అక్కడ బంగారు మహళ్ళు బయటకు తీయడం ద్వారా బయటకు వస్తాయని కాదు, అక్కడ అన్నీ తయారుచేయాల్సి ఉంటుంది. మేము రాకుమారులుగా-రాకుమార్తెలుగా అవుతున్నాము అనే నషా ఉండాలి. ఇది రాకుమారులుగా-రాకుమార్తెలుగా తయారయ్యే కాలేజి. అది రాకుమారులు-రాకుమార్తెలు చదువుకునే కాలేజి. మీరు రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు చదువుకుంటున్నారు. వారు గత జన్మలో దాన-పుణ్యాలు చేయడంతో రాజుల ఇంట్లో జన్మ తీసుకుని, రాకుమారులుగా అయ్యారు. ఆ కాలేజి ఎంత బాగుండి ఉండవచ్చు. కూర్చునే సీట్లు మొదలైనవి ఎంత బాగుంటాయి. టీచరు కోసము కూడా మంచి ఆసనము ఉంటుంది. సత్య-త్రేతాయుగాలలో ఎవరైతే రాకుమారులు-రాకుమార్తెలు ఉంటారో, వారి కాలేజి ఎంత బాగుంటుంది. కాలేజికైతే వెళ్తూ ఉండవచ్చు కదా. భాష అయితే నేర్చుకుంటారు కదా. ఆ సత్యయుగ రాకుమార-రాకుమార్తెల కాలేజి మరియు ద్వాపరం యొక్క వికారీ రాకుమార-రాకుమార్తెల కాలేజిని చూడండి మరియు రాకుమార-రాకుమార్తెలుగా తయారయ్యే మీ కాలేజిని చూడండి, ఇది ఎంత సాధారణంగా ఉంది. మూడు అడుగుల భూమి కూడా లభించదు. అక్కడ రాకుమారులు కాలేజీలకు ఎలా వెళ్తారో మీకు తెలుసు. అక్కడ కాలి నడకన వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. మహల్ నుండి బయటకు రాగానే, ఇక విమానం ఎగురుతుంది. అక్కడ కాలేజీలు ఎంత మంచిగా ఉంటాయి. ఎంతటి సుందరమైన పూదోటలు, మహళ్ళు మొదలైనవి ఉంటాయి. అక్కడి ప్రతి వస్తువు కొత్తదిగా, అన్నింటికన్నా ఉన్నతంగా, నంబరువన్ గా ఉంటుంది. 5 తత్వాలు సతోప్రధానంగా అవుతాయి. మీ సేవను ఎవరు చేస్తారు? ఈ 5 తత్వాలు మీ కోసము అత్యంత మంచి పదార్థాలను తయారుచేస్తాయి. ఎప్పుడైనా ఎక్కడైనా చాలా మంచి ఫలాలు పండితే, వాటిని రాజు-రాణికి కానుకగా పంపిస్తారు. ఇక్కడైతే మీ తండ్రి అయిన శివబాబా అందరికన్నా ఉన్నతమైనవారు, వారికి మీరేమి తినిపిస్తారు! వీరు ఏ వస్తువు పట్ల కోరిక పెట్టుకోరు, ఇది ధరించాలి, ఇది తినాలి, ఇది చేయాలి… పిల్లలైన మీకు కూడా ఈ కోరికలేవీ ఉండకూడదు. ఇక్కడ ఇవన్నీ చేస్తే, అక్కడ అవి తగ్గిపోతాయి. ఇప్పుడైతే మొత్తం ప్రపంచాన్ని త్యాగం చేయాలి. దేహ సహితంగా అంతా త్యాగం చేయాలి. వైరాగ్యం వస్తే త్యాగము జరుగుతుంది.

బాబా అంటారు, నేను పిల్లలైన మీకు అరచేతిలో వైకుంఠాన్ని ఇచ్చేందుకు వచ్చాను. మీకు తెలుసు, బాబా మనవారు, కావున తప్పకుండా వారిని స్మృతి చేయాల్సి ఉంటుంది. ఏ విధంగానైతే కన్యకు నిశ్చితార్థం జరిగినప్పుడు లేక లగ్నం కుదిరినప్పుడు ఆమె – నేను పతిని తలచుకోను అని ఎప్పుడూ అనరు, ఎందుకంటే వారు జీవితాంతము కలిసి ఉండేవారిగా అవుతారు. అదే విధంగా తండ్రి మరియు పిల్లల మిలనము జరుగుతుంది. కానీ మాయ మరపింపజేస్తుంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇందులోనే ముక్తి, జీవన్ముక్తి వస్తాయి. మరి మీ ద్వారా ఈ పొరపాటు ఎందుకు జరుగుతుంది! ఇది బుద్ధి ద్వారా చేసే పని, నోటితో ఏమీ మాట్లాడాల్సి అవసరము ఉండదు, మరియు నిశ్చయం చేసుకోవాలి. పవిత్రంగా ఉంటూ పవిత్ర ప్రపంచం యొక్క వారసత్వాన్ని తీసుకుంటామని మనకు తెలుసు. ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయముంది, మాట్లాడాల్సిన విషయము కాదు. మనం బాబాకు చెందినవారిగా అయ్యాము. శివబాబా పతితులను పావనంగా చేసేవారు. నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని అంటారు. దీని అర్థమే మన్మనాభవ. వారు మళ్ళీ కృష్ణ భగవానువాచ అని రాసేసారు. పతితపావనుడైతే ఒక్కరే. సర్వుల సద్గతిదాత ఒక్కరే, ఒక్కరినే స్మృతి చేయాలి. వారు అంటారు, తండ్రినైన నన్ను మర్చిపోయిన కారణంగా ఎంత మందిని స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మాజీత్ రాజులుగా అవుతారు. వికర్మాజీత్ రాజులు మరియు వికర్మలు చేసే రాజులకు మధ్యన తేడాను కూడా తెలియజేసారు కదా. పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. కిందికి దిగాల్సిందే. వైశ్య వంశము, ఆ తర్వాత శూద్ర వంశము. వైశ్య వంశీయులుగా అవ్వడము అనగా వామ మార్గములోకి రావడము. చరిత్ర-భౌగోళికమంతా బుద్ధిలో ఉంది, దీని గురించి కథలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ మోహానికి సంబంధించిన విషయము కూడా ఉండదు. పిల్లలు మొదలైనవారు చాలా ఆనందంగా ఉంటారు, స్వతహాగా మంచి రీతిలో పాలన చేయబడతారు. దాస-దాసీలైతే ఎదురుగా ఉండనే ఉంటారు. కావున మీ అదృష్టాన్ని చూసుకోండి – మేము ఎటువంటి కాలేజీలో కూర్చున్నామంటే ఇక్కడి నుండి మేము భవిష్యత్తులో రాకుమారులుగా-రాకుమార్తెలుగా అవుతాము. తేడా అయితే తెలుసు కదా. వారు కలియుగీ రాకుమార-రాకుమార్తెలు, వారు సత్యయుగీ రాకుమార-రాకుమార్తెలు… వారు మహారాణి-మహారాజు, వారు రాజు-రాణి. చాలామందికి లక్ష్మీ-నారాయణులు, రాధే-కృష్ణులు అన్న పేర్లు ఉన్నాయి. మరి ఆ లక్ష్మీ-నారాయణులు, రాధే-కృష్ణులకు పూజ ఎందుకు చేస్తారు! పేరైతే ఒక్కటే కదా. అవును, వారు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఈ జ్ఞానము శాస్త్రాలలో లేదని ఇప్పుడు మీకు తెలుసు. యజ్ఞ, తపాదులు, దాన-పుణ్యాలు మొదలైనవాటిలో ఏ సారము లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. డ్రామానుసారంగా ప్రపంచము పాతదిగా అవ్వాల్సిందే. మనుష్యమాత్రులు తమోప్రధానంగా అవ్వాల్సిందే. ప్రతి విషయములో తమోప్రధానము, క్రోధము, లోభము అన్నింటిలోనూ తమోప్రధానముగా ఉన్నారు. మా వాటాలో వీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు, తుపాకీతో కాల్చండి. ఎంతగా కొట్లాడుకుంటారు, పరస్పరంలో ఎంతగా గొడవపడతారు. ఒకరినొకరు హతమార్చుకోవడానికి కూడా వెనకాడరు. తండ్రి మరణిస్తే ఆస్తి లభిస్తుంది కదా… అని కొడుకు అనుకుంటాడు. ఇటువంటి తమోప్రధాన ప్రపంచము ఇప్పుడు వినాశనమవ్వాల్సిందే. ఆ తర్వాత సతోప్రధాన ప్రపంచము వస్తుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పుణ్యాత్ములుగా అయ్యేందుకు స్మృతి యొక్క శ్రమ చేయాలి. అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకుని పాస్ విత్ ఆనర్ గా అయ్యి గౌరవపూర్వకంగా వెళ్ళాలి, అందుకే కర్మభోగానికి భయపడకూడదు, చాలా సంతోషంగా సమాప్తం చేసుకోవాలి.

2. మేము భవిష్య రాకుమార-రాకుమార్తెలుగా అవుతున్నామనే నషాలో సదా ఉండాలి. ఇది రాకుమార-రాకుమార్తెలుగా అయ్యే కాలేజి.

వరదానము:-

ఎవరైతే అచల స్థితి కలవారు ఉంటారో, వారికి – వీరు కూడా అచలంగా అవ్వాలి అనే శుభ భావన, శుభ కామన ఉత్పన్నమవుతుంది. అచల స్థితి కలవారి విశేష గుణము – దయా హృదయము. ప్రతి ఆత్మ పట్ల సదా దాతృత్వ భావన ఉంటుంది. వారి విశేషమైన టైటిలే విశ్వ కళ్యాణకారి. వారిలో ఏ ఆత్మ పట్ల కూడా అసహ్య భావము, ద్వేష భావము, ఈర్ష్యా భావము లేక నిందించే భావము ఉత్పన్నమవ్వజాలదు. సదా కళ్యాణ భావమే ఉంటుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top