15 June 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 14, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఇది మీ అందరి వానప్రస్థ అవస్థ, తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయండి, పావనంగా అవ్వండి, అన్ని ఖాతాలను సమాప్తం చేసుకోండి’’

ప్రశ్న: -

తండ్రే పిల్లలకు ఏ ఓర్పును ఇస్తారు?

జవాబు:-

పిల్లలూ, ఇప్పుడు ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో అనేక రకాల విఘ్నాలు కలుగుతాయి, కానీ ఓర్పు వహించండి, ఎప్పుడైతే మీ ప్రభావము వెలువడుతుందో, అప్పుడు లెక్కలేనంతమంది రావడం మొదలుపెడతారు, అప్పుడు అందరూ మీ ముందుకు వచ్చి తల వంచుతారు. బంధనంలో ఉన్నవారి బంధనాలు సమాప్తమవుతాయి. ఎంతగా మీరు తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా బంధనాలు తెగిపోతూ ఉంటాయి. మీరు వికర్మాజీతులుగా అవుతూ ఉంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భోళానాథునికి అతీతమైనవారు ఎవ్వరూ లేరు… (భోలేనాథ్ సే నిరాలా…)

ఓంశాంతి. భోళానాథుడు అని సదా శివుడినే అంటారు, శివ-శంకరుల తారతమ్యాన్ని అయితే బాగానే అర్థము చేసుకున్నారు. శివుడైతే ఉన్నతోన్నతమైన మూలవతనంలో ఉంటారు. శంకరుడైతే సూక్ష్మవతనవాసి, వారిని భగవంతుడు అని ఎలా అనగలరు. ఉన్నతోన్నతమైన స్థానములో నివసించేవారు ఒక్క తండ్రినే. తర్వాత రెండవ అంతస్తులో ముగ్గురు దేవతలు ఉన్నారు. వారు తండ్రి, ఉన్నతోన్నతమైనవారు, నిరాకారుడు. శంకరుడైతే ఆకారీ. శివుడు భోళానాథుడు, జ్ఞానసాగరుడు. శంకరుడిని జ్ఞానసాగరుడని అనలేరు. పిల్లలైన మీకు తెలుసు, భోళానాథుడైన శివబాబా వచ్చి మన జోలిని నింపుతారు. ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియజేస్తున్నారు. రచయిత మరియు రచనల రహస్యము చాలా సరళమైనది. పెద్ద-పెద్ద ఋషులు, మునులు మొదలైనవారు కూడా ఈ సహజమైన విషయాలను తెలుసుకోలేరు. ఆ రజోగుణము వారికే తెలియనప్పుడు ఇక తమోగుణము వారికి ఎలా తెలుస్తుంది. కావున ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖంలో కూర్చున్నారు. తండ్రి అమరకథను వినిపిస్తున్నారు. తప్పకుండా మన బాబా (శివబాబా) సత్యాతి-సత్యమైన అమరకథను వినిపిస్తున్నారని పిల్లలకు నిశ్చయముంది, ఇందులో ఎటువంటి సంశయము ఉండకూడదు. మనకు ఇది మనుష్యులెవరూ వినిపించడము లేదు. శివబాబా భోళానాథుడు, వారంటారు, నాకు నా శరీరమంటూ లేదు. నేను నిరాకారుడిని, పూజ కూడా నిరాకారుడినైన నాకే చేస్తారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు, ఇప్పుడు తండ్రి అయితే జనన-మరణ రహితుడు. వారు భోళానాథుడు. వారు తప్పకుండా వచ్చి అందరి జోలిని నింపుతారు. ఎలా నింపుతారు, ఇది పిల్లలైన మీరే అర్థము చేసుకుంటారు. అవినాశీ జ్ఞాన రత్నాలతో జోలిని నింపుతారు. ఇదే జ్ఞానము, జ్ఞానసాగరుడు వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. గీత అయితే ఒక్కటే ఉంటుంది, కానీ సంస్కృత శ్లోకాలైతే లేవు. అమాయకపు మాతలకు సంస్కృతము మొదలైనవాటి గురించి ఏం తెలుసు! వారి కోసమే భోళానాథుడైన బాబా వస్తారు. ఈ మాతలైతే పాపం ఇంటి పనుల్లోనే ఉంటారు. ఉద్యోగం చేయడమనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కావున బాబా ఇప్పుడు పిల్లలకు ఉన్నతోన్నతమైన చదువును చదివిస్తున్నారు, ఎవరైతే అసలేమీ చదువుకోలేదో, మొట్టమొదట వారిపై చదువు యొక్క కలశాన్ని పెడతారు. నిజానికి అందరూ భక్తురాళ్ళు, సీతలు. రాముడు రావణుడి లంక నుండి ముక్తులుగా చేయడానికి అనగా దుఃఖము నుండి ముక్తులుగా చేయడానికి వచ్చారు. అప్పుడిక తండ్రితో పాటు ఇంటికే వెళ్తారు, ఇంకెక్కడికి వెళ్తారు. మేము దుఃఖము నుండి ముక్తిని పొందాలి అని స్మృతి కూడా ఇంటినే చేస్తారు. పిల్లలకు తెలుసు, మధ్యలో ఎవ్వరికీ ముక్తి లభించలేదు. అందరూ తమోప్రధానంగా అవ్వాల్సిందే. ముఖ్యమైన పునాది ఏదైతే ఉందో, అది కాలిపోతుంది, ఆ ధర్మమే కనుమరుగైపోతుంది. ఇకపోతే, కొన్ని చిత్రాలు మొదలైనవి మిగులుతాయి. లక్ష్మీ-నారాయణుల చిత్రము కూడా మాయమైతే ఇక స్మృతిచిహ్నాలు ఎలా లభిస్తాయి? తప్పకుండా దేవీ-దేవతలు రాజ్యం చేసేవారని తెలుసు. వారి చిత్రాలు కూడా ఇప్పటివరకూ ఉన్నాయి. పిల్లలకు వీటిపై అర్థం చేయించాలి. మీకు తెలుసు, లక్ష్మీ-నారాయణులు బాల్యములో రాకుమార-రాకుమార్తెలైన రాధే-కృష్ణులుగా ఉండేవారు. తర్వాత మహారాజ-మహారాణిగా అయ్యారు. వారు ఉన్నదే సత్యయుగం యొక్క యజమానులు. దేవతలు ఎప్పుడూ పతిత ప్రపంచములో పాదం మోపలేరు. శ్రీకృష్ణుడైతే వైకుంఠానికి రాకుమారుడు. వారైతే గీతను వినిపించలేరు. పొరపాటు కూడా ఎంత పెద్దది చేసేసారు. కృష్ణుడిని భగవంతుడు అని అనలేరు. వారైతే మనిషి, దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. వాస్తవానికి దేవతలైన బ్రహ్మా-విష్ణు-శంకరులైతే సూక్ష్మవతనములోనే ఉంటారు, ఇక్కడ మనుష్యులుంటారు. మనుష్యులను సూక్ష్మవతనవాసులు అని అనలేరు, బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు కదా. అది దేవీ-దేవతా ధర్మము. శ్రీ లక్ష్మీ దేవి, శ్రీ నారాయణ దేవత అని అంటారు. మనుష్యులకే 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, నిజానికి మనము దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము, ఆ ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది. అక్కడ మేము ఎందుకు లేము అని ఇలా ఎవ్వరూ అనలేరు. ఇదైతే తెలుసు కదా, అక్కడ ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది, ఇక మిగిలిన ధర్మాలు నంబరువారుగా వస్తాయి. ఇది పిల్లలైన మీరు అర్థం చేయించవచ్చు. ఇది అనాది తయారై తయారుచేయబడిన ఆట. ఇందులో మళ్ళీ సత్యయుగము వస్తుంది. ఇది భారత్ లోనే జరగనున్నది ఎందుకంటే భారత్ యే అవినాశీ ఖండము. ఇది వినాశనము అవ్వదు.

ఇది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రి జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది, వారిది దివ్య జన్మ, అది మనుష్యుల జన్మ వలె ఉండదు. తండ్రి బయటకు తీయడానికి వచ్చారు. ఇప్పుడు మీరు కేవలం తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయండి. తర్వాత మీరు రాజధానిలోకి వచ్చేస్తారు. ఇదైతే ఆసురీ రాజస్థాన్, తండ్రి దైవీ రాజస్థాన్ లోకి తీసుకువెళ్తారు. ఇంకే కష్టాన్ని ఇవ్వరు, కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఇది నిరంతర స్మృతి… నోటితో ఏమీ చెప్పాల్సిన అవసరము లేదు. సూక్ష్మంగా కూడా ఏమీ చెప్పాల్సిన అవసరము లేదు. ఇంట్లో కూర్చుని సైలెన్స్ లో తండ్రిని స్మృతి చేయాలి. బంధనములో ఉన్నవారు కూడా ఇంట్లో కూర్చుని వింటారు. వారికి అనుమతి లభించదు. అయితే, ఇంట్లో కూర్చుని కేవలం పవిత్రంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. మాకు పవిత్రంగా అవ్వమని స్వప్నములో డైరెక్షన్ లభించింది అని చెప్పండి. ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. మీరు ఇప్పుడు వానప్రస్థ అవస్థలో ఉన్నారు. వానప్రస్థములో ఎప్పుడైనా వికారాల ఆలోచనలు వస్తాయా. ఇప్పుడు తండ్రి మొత్తం ప్రపంచం కోసం చెప్తున్నారు, అందరిదీ వానప్రస్థ అవస్థ. అందరూ తిరిగి వెళ్ళాలి కావున ఇంటిని స్మృతి చేయాలి. మళ్ళీ రావడము కూడా భారత్ లోనే రావాలి. ముఖమైతే ఇంటి వైపే ఉంటుంది కదా. పిల్లలకు ఇంకే కష్టమూ ఇవ్వడం జరగదు, ఇది చాలా సహజము. ఇంట్లో కూర్చునే శివబాబా స్మృతిలో భోజనము తయారుచేయండి. ఇంట్లో భోజనం తయారుచేసేటప్పుడు పతి గుర్తుంటారు కదా. తండ్రి అంటారు, వీరైతే పతులకే పతి. వారిని స్మృతి చేయండి, తద్వారా 21 జన్మల కోసం వారసత్వము లభిస్తుంది. అచ్ఛా, కొందరికి అనుమతి లభించదు. అక్కడ ఉంటూ కూడా తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మిమ్మల్ని మీరు అయితే విముక్తులుగా చేసుకోండి. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోగలరు. నెమ్మది నెమ్మదిగా అయితే బంధనముక్తి లభించేదే ఉంది. అయితే, రుద్ర జ్ఞాన యజ్ఞములో విఘ్నాలు కూడా తప్పకుండా వస్తాయి. చివరికి ఎప్పుడైతే మీ ప్రభావము వెలువడుతుందో, అప్పుడు మీ చరణాలకు తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. విఘ్నాలైతే కలుగుతూనే ఉంటాయి. ఇందులో ఓర్పు వహించాలి, ఓర్పును కోల్పోకూడదు. ఇంట్లో కూర్చునే పతి మొదలైన మిత్ర-సంబంధీకులకు ఈ ఒక్క విషయాన్ని అర్థం చేయించండి, తండ్రి ఆజ్ఞ ఏమిటంటే – నన్ను స్మృతి చేయండి, వారసత్వము తీసుకోండి. ఈ మాటను కృష్ణుడైతే చెప్పలేరు. తండ్రినే స్మృతి చేయాలి. మా బాబా శివబాబా అని అందరూ తెలుసుకునే విధంగా తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. ఇప్పుడు స్మృతి బాగా నిలవగలదు. కొద్ది సమయము కోసము ఈ బంధనము, కొట్టడము మొదలైనవి ఉంటాయి. మున్ముందు ఇవన్నీ సమాప్తమైపోతాయి. కొన్ని వ్యాధులు ఎలా ఉంటాయంటే, అవి వెంటనే దూరమైపోతాయి. కొన్ని ఒకటి, రెండు సంవత్సరాల వరకు కూడా నడుస్తాయి. దీనికి కూడా ఉపాయము ఇదే, బాబాను స్మృతి చేస్తూ-చేస్తూ బంధనాలు దూరమైపోతాయి, అందుకే ప్రతి విషయములో ఓర్పు కావాలి. తండ్రి అంటారు, ఎంతగా మీరు స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి. బుద్ధి తెగుతూ ఉంటుంది. ఇవి వికర్మల బంధనాలు కూడా. వికారాలనే నంబరువన్ వికర్మ అని అంటారు.

ఇప్పుడు మీరు వికర్మాజీతులుగా అవుతారు. స్మృతితోనే వికర్మాజీతులుగా అవ్వడం జరుగుతుంది. అన్ని ఖాతాలు సమాప్తమైపోతాయి, అప్పుడు సుఖం యొక్క ఖాతా ప్రారంభమవుతుంది. వ్యాపారస్థులకైతే ఇది చాలా సహజము. పాత ఖాతాను సమాప్తం చేసి మళ్ళీ కొత్తదానిని ప్రారంభించాలని అనుకుంటారు. స్మృతి చేస్తూ ఉంటే జమ అవుతూ ఉంటుంది. స్మృతి చేయకపోతే జమ ఎలా అవుతుంది? ఇది కూడా వ్యాపారము కదా. తండ్రి అయితే ఏ కష్టము ఇవ్వరు. ఎదురుదెబ్బలు మొదలైనవేవీ తినాల్సిన అవసరము లేదు. వాటినైతే జన్మ-జన్మాంతరాలుగా తింటూనే వచ్చారు. ఇప్పుడు సత్యమైన తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. భగవంతుడే సత్యాన్ని తెలియజేస్తారు. మిగిలినదంతా అసత్యము. బాబా ఏమి అర్థం చేయిస్తారు మరియు మనుష్యులు ఏం అర్థం చేయిస్తారు, వ్యత్యాసము చూడండి. ఇది డ్రామా. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు, శ్రీమతంపై నడవడం ద్వారా మనం సద్గతిని పొందుతాము. లేదంటే ఇంత ఉన్నత పదవి లభించదు. మీరు స్వర్గములోకి వెళ్ళేందుకు నిమిత్తులుగా అవుతారు, అక్కడ ఏ వికర్మ జరగదు. ఇక్కడ వికర్మ జరుగుతుంది కావున శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైతే శ్రీమతంపై నడవరో, వారిని కూడా ఏమని అనాలి? నాస్తికులు. బాబా ఆస్తికులుగా చేస్తారని అయితే తెలుసు. అయినా ఒకవేళ వారి మతంపై నడవకపోతే, నాస్తికులు అయినట్లు కదా. శివబాబా శ్రీమతముపైనే నడవాలని కూడా తెలుసు, కానీ తెలిసి కూడా నడవకపోతే వారిని ఏమంటారు! శ్రీమతము అనేది శ్రేష్ఠంగా అవ్వడానికి. అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు ఆ సద్గురువు. తండ్రి కూర్చుని పిల్లలకు సమ్ముఖంగా అర్థం చేయిస్తారు. కల్ప-కల్పము అర్థం చేయించారు. మిగిలిన శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. లెక్కలేనన్ని శాస్త్రాలున్నాయి. శాస్త్రాలను కూడా చాలా గౌరవిస్తారు. ఏ విధంగానైతే శాస్త్రాలకు పరిభ్రమణం చేయిస్తారో, అలాగే చిత్రాలను కూడా పరిభ్రమణం చేయిస్తారు. ఇప్పుడు బాబా అంటారు, వీటన్నింటినీ మర్చిపోండి. పూర్తిగా బిందువుగా (జీరోగా) అయిపోండి. బిందువు పెట్టండి, ఇంకే విషయాలను వినకండి. చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి. ఒక్క తండ్రిది తప్ప వేరెవ్వరి మాట వినకండి. అశరీరులుగా అవ్వండి, మిగిలినదంతా మర్చిపోండి. ఆత్మలైన మీరు శరీరం ద్వారా వింటారు. తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా అర్థం చేయిస్తారు. పిల్లలకు సద్గతి యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. అయితే, ఇంతకుముందు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసారు, కానీ ముక్తి-జీవన్ముక్తిని ఎవ్వరూ పొందలేకపోయారు. కల్పం యొక్క ఆయువునే పెద్దదిగా చేసేసారు. ఎవరి భాగ్యంలోనైనా ఉంటే, వారు వింటారు. భాగ్యంలో లేకపోతే రాలేరు. ఇక్కడ కూడా ఇది భాగ్యానికి సంబంధించిన విషయము. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు, కొందరు మా నోరు తెరుచుకోవడం లేదు అని అంటారు. అరే, ఇది ఎంత సహజమైన విషయము, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. దానినే సంస్కృతంలో మన్మనాభవ అని అంటారు. శివబాబా ఆత్మలందరికీ తండ్రి. కృష్ణుడిని తండ్రి అని అనలేరు. బ్రహ్మా కూడా ప్రజలందరికీ తండ్రి. ఆత్మల తండ్రి పెద్దవారా లేక ప్రజల తండ్రి పెద్దవారా? పెద్ద బాబాను స్మృతి చేసినట్లయితే ప్రారబ్ధముగా స్వర్గ వారసత్వము లభిస్తుంది. మున్ముందు మీ వద్దకు చాలా మంది వస్తారు. ఇంకెక్కడికి వెళ్తారు? వస్తూ ఉంటారు. ఎక్కడికైతే చాలామంది వెళ్తారో, అక్కడికి ఒకరిని చూసి ఒకరు చాలామంది వస్తారు. మీలో కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. విఘ్నాలు ఎన్ని వచ్చినా సరే, ఆ గొడవలను దాటుకొని తమ రాజధానిని అయితే స్థాపన చేయాల్సిందే. రామ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. రామ రాజ్యము అంటే కొత్త ప్రపంచము.

మీకు తెలుసు, మనము మన తనువు-మనస్సు-ధనములతోనే భారత్ ను శ్రీమతంపై స్వర్గంగా తయారుచేస్తున్నాము. ఎవరినైనా మొదట మీరు ఇది అడగండి – పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధముంది? ప్రజాపిత బ్రహ్మాతో ఏం సంబంధముంది? వీరు అనంతమైన తండ్రి. ఆ తర్వాత వంశాలు ఉంటాయి. ఒకదాని నుండే వెలువడ్డాయి కదా. పరమపిత పరమాత్మ, ప్రజాపిత బ్రహ్మా ద్వారా సృష్టిని రచించారు అనగా పతితుల నుండి పావనంగా చేసారు. మనమే పూజ్యులము, మనమే పూజారులము… అని ప్రపంచానికి ఏమీ తెలియదు. ఇలా పాడుతారు కానీ అది భగవంతుని కోసమని చెప్తారు. ఒకవేళ భగవంతుడే పూజారిగా అయితే, మరి పూజ్యునిగా ఎవరు తయారుచేయాలి… ఈ మాట మీరు అడగాలి. పిల్లలకు హమ్ సో యొక్క అర్థాన్ని అర్థం చేయించారు. మనమే శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు మనమే దేవతలుగా అవుతున్నాము. చక్రాన్ని అయితే స్మృతి చేయగలరు కదా! తండ్రి కొడుకుని ప్రత్యక్షం చేస్తారు, తర్వాత కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు అని అంటూ ఉంటారు కూడా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తెలివైన వ్యాపారస్థులుగా అయి పాత ఖాతాలన్నింటినీ సమాప్తం చేసి సుఖం యొక్క ఖాతాను ప్రారంభించాలి. స్మృతిలో ఉంటూ వికర్మల బంధనాలను తెంచాలి. ఓర్పు వహించాలి, ఓర్పును కోల్పోకూడదు.

2. ఇంట్లో కూర్చుని భోజనము తయారుచేస్తూ, ప్రతి కర్మను చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి. తండ్రి ఏవైతే అవినాశీ జ్ఞాన రత్నాలను ఇస్తారో, వాటితో తమ జోలిని నింపుకుని ఇతరులకు దానమివ్వాలి.

వరదానము:-

మాయ ఎన్ని రంగులను చూపించినా, నేను మాయపతిని, మాయ అనేది రచన, నేను మాస్టర్ రచయితను – ఈ స్మృతితో మాయ ఆటను చూడండి, ఆటలో ఓడిపోకండి. సాక్షీగా ఉంటూ మనోరంజనముగా భావిస్తూ చూస్తూ ఉండండి, అప్పుడు మొదటి నంబరులోకి వస్తారు. అటువంటివారికి మాయ యొక్క ఏ సమస్య, సమస్యగా అనిపించదు. ఎటువంటి ప్రశ్న ఉండదు. సదా సాక్షీ మరియు సదా తండ్రి తోడు యొక్క స్మృతితో విజయులుగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top