14 June 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 13, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - 21 జన్మల పూర్తి ప్రారబ్ధాన్ని తీసుకునేందుకు తండ్రిపై సంపూర్ణముగా బలిహారమవ్వండి, అసంపూర్ణముగా కాదు, బలిహారమవ్వడము అనగా తండ్రికి చెందినవారిగా అవ్వడము’’

ప్రశ్న: -

ఏ గుహ్యమైన విషయాన్ని అర్థం చేసుకునేందుకు అనంతమైన బుద్ధి కావాలి?

జవాబు:-

ఇది అనంతమైన తయారై తయారుచేయబడిన డ్రామా, ఏదైతే గతించిందో అది డ్రామా. ఇప్పుడు ఈ డ్రామా పూర్తవుతుంది, మనం ఇంటికి వెళ్తాము, మళ్ళీ కొత్తగా పాత్ర మొదలవుతుంది… ఈ గుహ్యమైన విషయాలను అర్థం చేసుకునేందుకు అనంతమైన బుద్ధి కావాలి. అనంతమైన రచన యొక్క జ్ఞానాన్ని అనంతమైన తండ్రే ఇస్తారు.

ప్రశ్న: -

మనుష్యులు ఏ విషయంలో అయ్యో-అయ్యో అని అంటూ దుఃఖంతో మొరపెట్టుకుంటారు మరియు పిల్లలైన మీరు సంతోషిస్తారు?

జవాబు:-

అజ్ఞానీ మనుష్యులు కొద్దిగా అనారోగ్యం వచ్చినా సరే దుఃఖంతో మొరపెట్టుకుంటారు, పిల్లలైన మీరు సంతోషిస్తారు ఎందుకంటే ఇది కూడా పాత లెక్కాచారము సమాప్తమవుతూ ఉందని భావిస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు… (తూనే రాత్ గవాయీ సోకే…)

ఓంశాంతి. వాస్తవానికి ఓం శాంతి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ పిల్లలకు ఏదో ఒకటి అర్థం చేయించాల్సే ఉంటుంది, పరిచయము ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఓం శాంతి-ఓం శాంతి అని జపిస్తూ ఉండేవారు చాలా మంది ఉన్నారు. అర్థాన్ని అయితే అర్థం చేసుకోరు. ఓం శాంతి, ఆత్మనైన నా స్వధర్మము శాంతి. ఇదైతే కరక్టే కానీ మళ్ళీ ఓం శివోహమ్ అని కూడా అన్నారు, అది తప్పు. వాస్తవానికి ఈ పాటలు మొదలైనవాటి అవసరము కూడా లేదు. ప్రపంచములో ఈ రోజుల్లో చెవులకు ఇంపైనవి చాలా ఉన్నాయి. ఈ చెవులకు ఇంపైన వాటన్నిటితో లాభమేమీ ఉండదు. మనసుకైతే ఇప్పుడే రుచి కలుగుతుంది, ఒకే ఒక విషయము పట్ల. తండ్రి పిల్లలకు సమ్ముఖముగా కూర్చుని అర్థం చేయిస్తారు, వారంటారు, మీరు భక్తినైతే చాలా చేసారు, ఇప్పుడు భక్తి యొక్క రాత్రి పూర్తి అయి తెల్లవారుతూ ఉంది. తెల్లవారుజామున సమయానికి చాలా మహత్వము ఉంది. తెల్లవారుజామున సమయములో తండ్రిని స్మృతి చేయాలి. ప్రభాత సమయములో భక్తి కూడా చాలా చేస్తారు. మాలను కూడా జపిస్తారు. ఈ భక్తి మార్గపు ఆచారము కొనసాగుతూ వస్తుంది. తండ్రి అంటారు, పిల్లలూ, ఈ నాటకము పూర్తవుతుంది, మళ్ళీ చక్రము రిపీట్ అవుతుంది. అక్కడైతే భక్తి యొక్క అవసరము ఉండదు. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తారని స్వయమే అంటారు. భగవంతుడిని తలచుకుంటారు ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు. ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేక అనారోగ్యం పాలైనప్పుడు భగవంతుడిని తలచుకుంటారు, భక్తులే భగవంతుడిని తలచుకుంటారు. సత్య, త్రేతా యుగాలలో భక్తి ఉండదు. లేదంటే మొత్తం భక్తి సంప్రదాయమైపోయేది. భక్తి, జ్ఞానము మరియు ఆ తర్వాత వైరాగ్యము. భక్తి తర్వాత మళ్ళీ పగలు ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని పగలు అని అంటారు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్న పదాలు సరైనవి. దేని పట్ల వైరాగ్యము? పాత ప్రపంచము, పాత సంబంధాలు మొదలైనవాటి పట్ల వైరాగ్యము. మేము ముక్తిధామములోకి బాబా వద్దకు వెళ్ళాలి అని కోరుకుంటారు. భక్తి తర్వాత మనకు భగవంతుడు తప్పకుండా లభిస్తారు. భక్తులకే భగవంతుడైన తండ్రి లభిస్తారు. భక్తులకు సద్గతినివ్వడము భగవంతుడి పనే. ఇంకేమీ చేయనవసరము లేదు, కేవలము తండ్రిని గుర్తించాలి. తండ్రి ఈ మనుష్య సృష్టి వృక్షానికి బీజము, దీనిని తలక్రిందులుగా ఉన్న వృక్షమని అంటారు. బీజము నుండి వృక్షము ఎలా వెలువడుతుంది, ఇదైతే చాలా సహజము. ఇప్పుడు మీకు తెలుసు – ఈ వేద శాస్త్రాలు, గ్రంథ్ మొదలైనవి చదవడము, జప-తపాదులు చేయడము, ఇదంతా భక్తి మార్గము. ఇదేమీ భగవంతుడిని పొందేందుకు సత్యమైన మార్గము కాదు. ముక్తి-జీవన్ముక్తుల సత్యమైన మార్గాన్ని అయితే భగవంతుడే చూపిస్తారు. మీకు తెలుసు, ఇప్పుడు డ్రామా పూర్తి అవుతుంది, ఏదైతే గతించిందో అది డ్రామా. దీనిని అర్థము చేసుకోవడానికి చాలా అనంతమైన బుద్ధి కావాలి. అనంతమైన యజమానే మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల అనంతమైన జ్ఞానాన్ని ఇస్తారు. వారిని జ్ఞానేశ్వరుడు, రచయిత అని అంటారు. జ్ఞానేశ్వరునిలో అనగా ఈశ్వరునిలో జ్ఞానముంది, దీనిని ఆత్మిక ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. ఇది ఈశ్వరీయ జ్ఞానము. మీరు కూడా ఈశ్వరీయ విద్యార్థులుగా అయ్యారు. తప్పకుండా ఇది భగవానువాచ – మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను కావున భగవంతుడు టీచరుగా కూడా అయినట్లు. మీరు విద్యార్థులు కూడా, పిల్లలు కూడా. పిల్లలకు తాతగారి నుండి వారసత్వము లభిస్తుంది. ఇదైతే చాలా సహజమైన విషయము. కొడుకు ఒకవేళ యోగ్యునిగా లేకపోతే తండ్రి తిరస్కరించి బయటకు పంపించేస్తారు, వ్యాపారము మొదలైనవాటిలో ఎవరైతే మంచి సహాయకులుగా ఉంటారో వారికే వాటా ఉంటుంది. కావున పిల్లలైన మీకు కూడా తాతగారి ఆస్తిపై హక్కు ఉంది. వారు నిరాకారుడు. మనము మన తాతగారి నుండి వారసత్వము తీసుకుంటున్నామని పిల్లలకు తెలుసు. వారే స్వర్గ స్థాపన చేస్తారు. వారు జ్ఞాన సంపన్నులు. బ్రహ్మా-విష్ణు-శంకరులను పతితపావనా అని అనరు. వారైతే దేవతలు. వారిని సద్గతిదాత అని అనరు. సద్గతిదాత ఒక్కరే. స్మృతి కూడా అందరూ ఒక్కరినే చేస్తారు. తండ్రి గురించి తెలియని కారణంగా అందరిలోనూ పరమాత్మ ఉన్నారని అనేస్తారు. ఒకవేళ ఎవరికైనా సాక్షాత్కారము జరిగితే, హనుమంతుడు దర్శనము చేయించారని, భగవంతుడు సర్వవ్యాపి అని భావిస్తారు. ఏ వస్తువు పట్లనైనా భావన పెట్టుకుంటే సాక్షాత్కారము జరుగుతుంది. ఇక్కడిది చదువు యొక్క విషయము. తండ్రి అంటారు, నేను పిల్లలకు వచ్చి చదివిస్తాను. ఎలా చదివిస్తారు అన్నది మీరు చూస్తారు కూడా. ఏ విధంగా వేరే టీచర్లు ఉంటారో, అలా పూర్తిగా సాధారణ రీతిలో చదివిస్తారు. బ్యారిస్టరైతే తమ సమానంగా బ్యారిస్టరుగా తయారుచేస్తారు. ఇదైతే మీకు మాత్రమే తెలుసు – ఈ భారత్ ను స్వర్గముగా ఎవరు తయారుచేసారు? మరియు భారత్ లో ఉండే సూర్యవంశీ దేవీ-దేవతలు ఎక్కడ నుండి వచ్చారు? అని. మనుష్యులకు అసలు తెలియదు. ఇప్పుడిది సంగమము. మీరు సంగమములో నిలబడి ఉన్నారు, ఇతరులెవ్వరూ సంగమములో లేరు. ఈ సంగమము యొక్క మేళా ఎలా ఉందో చూడండి. పిల్లలు తండ్రిని కలుసుకునేందుకు వచ్చారు. ఈ మేళానే కళ్యాణకారి అయినది. ఇతర కుంభమేళాలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో, వాటి ద్వారా ఎటువంటి ప్రాప్తి ఉండదు. సత్యాతి-సత్యమైన కుంభమేళా అని సంగమాన్ని అంటారు. ఆత్మ పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు, తర్వాత సుందరమైన మనోహరమైన మిలనము జరిగింది అని పాడుతారు. ఈ సమయము ఎంత బాగుంది. ఈ సంగమ సమయము ఎంత కళ్యాణకారి అయినది ఎందుకంటే ఈ సమయములోనే అందరి కళ్యాణము జరుగుతుంది. తండ్రి వచ్చి అందరినీ చదివిస్తారు, వారు నిరాకారుడు, నక్షత్రము. అర్థము చేయించేందుకు లింగ రూపాన్ని పెట్టారు. బిందువును పెడితే ఏమీ అర్థము చేసుకోలేరు. మీరు ఇలా అర్థం చేయించవచ్చు – ఆత్మ ఒక నక్షత్రము, తండ్రి కూడా నక్షత్రము. ఆత్మ ఎలా ఉంటుందో, పరమపిత పరమాత్మ కూడా అలాగే ఉంటారు. తేడా లేదు. ఆత్మలైన మీరు కూడా నంబరువారుగా ఉన్నారు. కొందరి బుద్ధిలో ఎంతో జ్ఞానము నిండి ఉంది, కొందరి బుద్ధిలో కొంత ఉంది. ఆత్మలమైన మనము 84 జన్మలను ఎలా అనుభవిస్తాము అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి తమ లెక్కాచారాన్ని అనుభవించాల్సే ఉంటుంది. కొందరు అనారోగ్యం పాలవుతారు, లెక్కలను సమాప్తము చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ, ఈశ్వరీయ సంతానానికి ఈ అనుభవించడమనేది ఎందుకు ఉంటుంది అని కాదు! తండ్రి అర్థం చేయించారు, పిల్లలూ, జన్మ-జన్మాంతరాల పాపాలు ఉన్నాయి. కుమారీ కావచ్చు, కుమారీ ద్వారా ఏం పాపము జరిగి ఉంటుంది? కానీ ఇక్కడ అనేక జన్మల లెక్కాచారాలు సమాప్తమవ్వాలి కదా. బాబా అర్థం చేయించారు, ఒకవేళ ఈ జన్మలో కూడా చేసిన పాపాలను చెప్పకపోతే అవి లోపల వృద్ధి చెందుతూ ఉంటాయి. చెప్తే ఇక అవి వృద్ధి చెందవు. అన్నింటికన్నా నంబరువన్ పావనంగా భారత్ ఉండేది, ఇప్పుడు భారత్ అన్నింటికన్నా పతితంగా ఉంది. కావున వారికి శ్రమ కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఎవరైతే చాలా సేవ చేస్తారో, వారు మేము ఉన్నతమైన నంబరులోకి వెళ్తామని అర్థం చేసుకోగలరు. ఏదైనా లెక్కాచారము మిగిలి ఉన్నట్లయితే అనుభవించాల్సి ఉంటుంది. ఆ అనుభవించడము కూడా సంతోషంగా అనుభవించడం జరుగుతుంది. అజ్ఞానీ మనుష్యులకు ఏదైనా జరిగితే వెంటనే అయ్యో-అయ్యో అని అంటూ దుఃఖముతో మొరపెట్టుకోవడం మొదలుపెడతారు. ఇక్కడైతే సంతోషంగా అనుభవించాలి. మనమే పావనంగా ఉండేవారము, మళ్ళీ మనమే అందరికన్నా పతితంగా అవుతాము. ఈ వస్త్రము పాత్రను అభినయించేందుకు మనకు ఇలా లభించింది. మనము అందరికన్నా ఎక్కువ పతితంగా అయ్యామని ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఫలానావారికి ఈ అనారోగ్యం ఎందుకు అని ఆశ్చర్యపోకూడదు. అరే చూడండి, కృష్ణుడిని కూడా నల్లనివాడు, తెల్లనివాడు అన్న పేర్లుతో పిలుస్తూ ఉంటారు. చిత్రాలను తయారుచేసేవారైతే అర్థము చేసుకోరు. వారు రాధేను తెల్లగా, కృష్ణుడిని నల్లగా చూపిస్తారు. రాధేను కుమారిగా భావిస్తారు కావున వారిని గౌరవిస్తారు. వారు ఎందుకు నల్లగా ఉంటారని భావిస్తారు. ఈ విషయాలను మీరు అర్థము చేసుకుంటారు. ఎవరైతే దేవతా కులానికి చెందినవారో, వారు ఇప్పుడు స్వయాన్ని హిందూ ధర్మానికి చెందినవారిగా భావిస్తున్నారు.

మీరు శ్రీమతము ఆధారంగా తమ కులం యొక్క ఉద్ధరణ చేస్తారు. మొత్తం కులమును పావనంగా చేయాలి, వారిని విముక్తులుగా చేసి పైకి తీసుకురావాలి. మీరు ముక్తిదళము కదా. తండ్రే దుర్గతి నుండి బయటకు తీసి సద్గతినిస్తారు, వారినే రచయిత, డైరెక్టర్, ముఖ్యమైన పాత్రధారి అని అంటూ ఉంటారు. వారు పాత్రధారిగా ఎలా అయ్యారు, పతిత-పావనుడైన తండ్రి వచ్చి పతిత ప్రపంచములో అందరినీ పావనంగా చేస్తారు కావున ముఖ్యమైనవారు అయినట్లు కదా. బ్రహ్మా-విష్ణు-శంకరులను చేసేవారు-చేయించేవారు అని ఏమీ అనరు. ఇప్పుడు మీరు అనుభవంతో చెప్పగలరు – ఏ బాబాను అయితే చేసేవారు-చేయించేవారు అని అంటారో, వారు ఈ సమయంలో పాత్రను అభినయిస్తారు. వారు పాత్రను కూడా సంగమంలోనే అభినయిస్తారు. వారి గురించి ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు 16 కళల నుండి మళ్ళీ కిందికి పడిపోతారు. నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ప్రతి జన్మలో ఎంతో కొంత కళ తగ్గుతుంది. సత్యయుగంలో 8 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క జన్మకు డ్రామానుసారంగా ఎంతో కొంత కళ తగ్గుతుంది. ఇప్పుడిది పైకి ఎక్కే సమయము. ఎప్పుడైతే పూర్తిగా ఎక్కుతారో, అప్పుడు మళ్ళీ నెమ్మది-నెమ్మదిగా దిగుతారు. ఇప్పుడు ఈ రాజధాని స్థాపన అవుతూ ఉందని పిల్లలకు తెలుసు. రాజధానిలోనైతే అన్ని రకాల వారు కావాలి. ఎవరైతే మంచి రీతిలో శ్రీమతముపై నడుస్తారో, వారు ఉన్నత పదవిని పొందుతారు, కానీ అది కూడా శ్రీమతాన్ని అడిగినప్పుడే కదా! బాబాకు తమ పూర్తి లెక్కాపత్రాన్ని కూడా పంపించాలి, అప్పుడు బాబా సలహానివ్వగలరు. బాబాకైతే అంతా తెలుసు కదా అని కాదు. వారికైతే మొత్తం ప్రపంచం యొక్క ఆదిమధ్యాంతాలు తెలుసు. అలాగని ఒక్కొక్కరి మనసును కూర్చుని తెలుసుకోరు, వారు జ్ఞాన సంపన్నులు. బాబా అంటారు, నాకు ఆదిమధ్యాంతాల గురించి తెలుసు, అందుకే, మీరు ఇలా-ఇలా పడిపోతారు, మళ్ళీ ఇలా పైకి ఎక్కుతారు అని చెప్తాను. ఇది భారత్ యొక్క పాత్ర. భక్తినైతే అందరూ చేస్తారు. ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తి చేస్తారో, వారికి మొదట సద్గతి లభించాలి. పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలను కూడా వారే తీసుకున్నారు. భక్తిని కూడా వారే నంబరువారుగా చేసారు. ఈ సమయములో ఈ జన్మ లభించి ఉండవచ్చు, కానీ మునుపటి జన్మల పాపాలైతే ఉన్నాయి కదా. అవి స్మృతి బలముతో కట్ అవుతాయి. స్మృతే కష్టమైనది. మీ కొరకు బాబా అంటారు, మీరు స్మృతిలో కూర్చున్నట్లయితే నిరోగిగా అవుతారు. బాబా నుండి సుఖము, శాంతి, పవిత్రత యొక్క వారసత్వము లభిస్తుంది. నిరోగి శరీరము లేక దీర్ఘాయువు కూడా కేవలం స్మృతితో లభిస్తాయి. జ్ఞానముతో మీరు త్రికాలదర్శిగా అవుతారు. త్రికాలదర్శి అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. రిద్ధి-సిద్ధి చేసేవారు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ కూర్చుని కూడా లండన్ యొక్క పార్లమెంట్ మొదలైనవాటిని చూస్తూ ఉంటారు. కానీ ఈ రిద్ధి-సిద్ధితో లాభమేమీ ఉండదు. సాక్షాత్కారాలు కూడా దివ్యదృష్టి ద్వారా జరుగుతాయి, ఈ నయనాల ద్వారా కాదు. ఈ సమయంలో అందరూ నల్లగా ఉన్నారు. మీరు బలిహారమవుతారు అనగా తండ్రికి చెందినవారిగా అవుతారు. బాబా కూడా సంపూర్ణముగా బలిహారమయ్యారు, ఎవరైతే అసంపూర్ణముగా బలిహారమవుతారో, వారికి లభించడం కూడా అసంపూర్ణంగానే లభిస్తుంది. బాబా కూడా బలిహారమయ్యారు కదా. ఏమేమి ఉందో, అంతా బలిహారం చేసేసారు. ఎవరైతే ఇంతగా బలిహారమవుతారో, వారికి 21 జన్మల కోసం ప్రాప్తి లభిస్తుంది, ఇందులో జీవహత్య యొక్క విషయము లేదు. జీవహత్య చేసుకునేవారిని మహాపాపి అని అంటారు. ఆత్మ తన శరీరాన్ని హత్య చేసుకోవడము, ఇది మంచిది కాదు. మనుష్యులు ఇతరుల గొంతును కోస్తారు, వీరు తమది తామే కోసుకుంటారు, అందుకే జీవహత్య చేసుకునేవారిని మహాపాపులని అంటారు.

తండ్రి మధురాతి-మధురమైన పిల్లలకు ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. మీకు తెలుసు, కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగములో ఈ కుంభమేళాలోకి వస్తారు. వీరు అదే తల్లి తండ్రి. పిల్లలంటారు, బాబా, మీరే మా సర్వస్వము. బాబా కూడా అంటారు, ఓ పిల్లలూ, ఆత్మలైన మీరు నా వారు. శివబాబా కల్పక్రితము వలె వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో, వారిని అలంకరిస్తున్నారు. బాబా జ్ఞానసంపన్నుడు, పతితపావనుడు అని మీ ఆత్మకు తెలుసు. వారు ఇప్పుడు మనకు మొత్తం జ్ఞానాన్ని ఇస్తారు. వారే జ్ఞాన సాగరుడు, ఇందులో శాస్త్రాల విషయమేమీ లేదు. ఇక్కడైతే దేహ సహితంగా అంతా మరచి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఒక్క తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున మిగిలినవన్నీ మర్చిపోవాలి. ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి. పాడుతారు కూడా, మేము మీతోనే సాంగత్యాన్ని జోడిస్తాము, బాబా, మేము పూర్తిగా బలిహారమవుతాము అని. తండ్రి కూడా అంటారు, నేను మీపై బలిహారమవుతాను. మధురమైన పిల్లలూ, మొత్తం విశ్వ రాజ్యానికి మిమ్మల్ని యజమానులుగా చేస్తాను, నేనైతే నిష్కామిని. మనుష్యులు, నిష్కామ సేవ చేస్తున్నామని అంటారు కానీ వారికి ఫలమైతే లభిస్తుంది కదా. తండ్రి నిష్కామ సేవ చేస్తారు, ఇది కూడా మీకు తెలుసు. ఆత్మ, నేను నిష్కామ సేవ చేస్తాను అని ఏదైతే అంటుందో, అది ఎక్కడ నుండి నేర్చుకుంది! మీకు తెలుసు, నిష్కామ సేవను బాబానే చేస్తారు. వారు కల్పం యొక్క సంగమయుగములోనే వస్తారు. ఇప్పుడు కూడా మీ సమ్ముఖంలో కూర్చున్నారు. తండ్రి స్వయంగా అంటారు, నేనైతే నిరాకారుడిని. నేను మీకు ఈ వారసత్వాన్ని ఎలా ఇవ్వను? సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఎలా వినిపించను? ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. శివ జయంతిని జరుపుకుంటారంటే తప్పకుండా వస్తానని కదా. నేను భారత్ లో వస్తాను. భారత్ యొక్క మహిమను వినిపిస్తారు. భారత్ అయితే పూర్తిగా మహాన్ గా, పవిత్రంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతుంది. తండ్రికి పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతము ఆధారంగా తమ కులము యొక్క ఉద్ధరణ చేయాలి. మొత్తం కులాన్ని పావనంగా చేయాలి. తండ్రికి తమ సత్యాతి-సత్యమైన లెక్కాపత్రాన్ని ఇవ్వాలి.

2. స్మృతి బలముతో తమ శరీరాన్ని నిరోగిగా చేసుకోవాలి. తండ్రిపై సంపూర్ణముగా బలిహారమవ్వాలి. బుద్ధియోగాన్ని ఇతర సాంగత్యాల నుండి తెంచి ఒక్కరితోనే సాంగత్యము జోడించాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే సదా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు – అని ఇదే స్మృతిలో ఉంటారో, వారి మనసు-బుద్ధి సహజంగా ఏకాగ్రమవుతాయి. వారు సేవను కూడా నిమిత్తముగా ఉంటూ చేస్తారు, అందుకే వారికి దాని పట్ల మోహము ఉండదు. మోహానికి గుర్తు ఏమిటంటే – ఎక్కడైతే మోహము ఉంటుందో, అక్కడికి బుద్ధి వెళ్తుంది, మనసు పరుగుపెడుతుంది, అందుకే అన్ని బాధ్యతలను తండ్రికి అర్పణ చేసి ట్రస్టీలుగా లేక నిమిత్తులుగా అయి సంభాళించండి, అప్పుడు మోహముక్తులుగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top