30 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
29 May 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - మీ శుద్ధమైన కామనలన్నింటినీ పూర్తి చేయడానికి తండ్రి వచ్చారు, రావణుడు అశుద్ధ కామనలను పూర్తి చేస్తాడు మరియు తండ్రి శుద్ధ కామనలను పూర్తి చేస్తారు’’
ప్రశ్న: -
ఎవరైతే తండ్రి శ్రీమతాన్ని ఉల్లంఘిస్తారో, వారి అంతిమ గతి ఏమవుతుంది?
జవాబు:-
శ్రీమతాన్ని ఉల్లంఘించేవారిని మాయా భూతాలు అంతిమంలో రామ నామం సత్యమైనది… అని అంటూ ఇంటికి తీసుకువెళ్తాయి. తర్వాత చాలా కఠినమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. శ్రీమతముపై నడవకపోతే, వారు మరణిస్తారు. ధర్మరాజు పూర్తి లెక్కను తీసుకుంటారు, అందుకే తండ్రి పిల్లలకు మంచి మతాన్ని ఇస్తారు, పిల్లలూ, మాయ యొక్క చెడు మతం నుండి అప్రమత్తంగా ఉండండి. తండ్రికి చెందినవారిగా అయ్యి, మళ్ళీ ఏవైనా వికర్మలు జరిగి 100 రెట్ల శిక్షను అనుభవించే విధంగా ఉండకూడదు. శ్రీమతముపై నడవకపోవడము, చదువును విడిచిపెట్టడమే తమను తాము శపించుకోవడము, అకృప చూపించుకోవడము.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఓం నమః శివాయ..
ఓంశాంతి. పరమపిత పరమాత్మ యొక్క ఈ మహిమను భక్తులు పాడుతారు. ఓ భగవంతుడా, ఓ శివబాబా, అని అంటారు కూడా. ఇలా ఎవరన్నారు? ఆత్మ తన తండ్రిని తలుచుకుంటుంది ఎందుకంటే ఆత్మకు తెలుసు – నాకు లౌకిక తండ్రి కూడా ఉన్నారు మరియు వీరు పారలౌకిక తండ్రి, శివబాబా. వారు రావడం కూడా భారత్ లోనే వస్తారు మరియు ఒక్కసారి మాత్రమే అవతరిస్తారు. ఓ పతిత-పావనా, భ్రష్టాచారీ పతితులను శ్రేష్ఠాచారీ పావనులుగా తయారుచేయడానికి రండి అని పాడుతారు కదా. కానీ అందరూ తమను తాము పతితులుగా, భ్రష్టాచారులుగా భావించరు. అందరూ ఒకే విధంగా కూడా ఉండరు. ప్రతి ఒక్కరికి తమ తమ పదవులు ఉంటాయి. ప్రతి ఒక్కరి కర్మల గతి వేరుగా ఉంటుంది, ఒకరిది మరొకరితో కలవదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు – మీరు తండ్రిని తెలుసుకోని కారణంగా ఇంతగా అనాథలుగా, పతితులుగా అయ్యారు. పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత మీరే అని అంటారు కూడా. అటువంటప్పుడు గీత లేక గంగ పతిత-పావనిగా ఎలా అవుతాయి. మిమ్మల్ని ఇంత తెలివిహీనులుగా ఎవరు తయారుచేసారు? ఈ పంచ వికారాల రూపీ రావణుడు. ఇప్పుడు అందరూ రావణ రాజ్యంలో లేక శోకవాటికలో ఉన్నారు. ఎవరైతే హెడ్ గా ఉంటారో, వారికైతే చాలా చింత ఉంటుంది. అందరూ దుఃఖితులుగా ఉన్నారు, అందుకే పిలుస్తారు – ఓ బాబా, మీరు రండి, మమ్మల్ని స్వర్గంలోకి తీసుకువెళ్ళండి. సదా నిరోగిగా, దీర్ఘాయువు కలవారిగా, శాంతి సంపన్నులుగా, ధనవంతులుగా తయారుచేయండి. తండ్రి అయితే సుఖ-శాంతుల సాగరుడు కదా. మనుష్యులకు ఈ మహిమ ఉండజాలదు. మనుష్యులు తమను తాము శివోహమ్ అని కూడా చెప్పుకుంటారు, కానీ పతితులుగా ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తారు, మీరు తండ్రిని సర్వవ్యాపి అని అంటారు, కానీ ఈ మాటతో ఏ విషయము సరిపోదు. భక్తి కూడా కొనసాగలేదు ఎందుకంటే భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు. భగవంతుడు ఒక్కరే, భక్తులు అనేకమంది ఉన్నారు. ఎప్పుడైతే అందరూ భగవంతుడినైన నన్ను రాయి, రప్పలలో తోసేసి స్వయం కూడా రాతిబుద్ధి కలవారిగా అవుతారో, అప్పుడు నాకు రావలసి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మా ద్వారా పావన ప్రపంచాన్ని స్థాపన చేయిస్తారు. వీరు ప్రజాపిత బ్రహ్మాకు దత్తత తీసుకోబడిన పిల్లలు, ఎంతమంది పిల్లలున్నారు. ఇప్పుడు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇంతకుముందు మీరు శూద్రులుగా ఉండేవారు. తర్వాత బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు, ఆ తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా అవుతారు. ఈ చక్రం తిరుగుతుంది. ఇది తండ్రే అర్థం చేయిస్తారు. ఇది మనుష్య సృష్టి, సూక్ష్మవతనంలో ఫరిశ్తాలుంటారు. అక్కడ వృక్షమేమీ లేదు. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం ఇక్కడ ఉంది. కనుక తండ్రి వచ్చి ఈ జ్ఞానామృత కలశాన్ని మాతల శిరస్సుపై పెడతారు. వాస్తవానికి అమృతమేమీ లేదు. ఇది జ్ఞానము. తండ్రి వచ్చి సహజ రాజయోగ శిక్షణనిస్తారు. తండ్రి అంటారు, నేను అయితే నిరాకారుడను, నంబరువన్ మనిషి తనువులోకి ప్రవేశిస్తాను. వారు స్వయంగా అంటారు, నేను ఎప్పుడైతే బ్రహ్మా తనువులోకి ప్రవేశిస్తానో, అప్పుడే బ్రాహ్మణ సంప్రదాయం ఉంటుంది. బ్రహ్మా ఇక్కడే కావాలి. ఆ సూక్ష్మవతనవాసి అయితే అవ్యక్త బ్రహ్మా. నేను వీరిని ఫరిశ్తాగా చేయడానికి వ్యక్తముగా ఉన్న వీరిలోకి ప్రవేశిస్తాను. మీరు కూడా అంతిమంలో ఫరిశ్తాలుగా అవుతారు. బ్రాహ్మణులైన మీరు ఇక్కడే పవిత్రంగా అవ్వాలి. తర్వాత పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. మీరు రెండు రకాల హింసలను చేయరు. కామ ఖడ్గాన్ని ఉపయోగించడము అన్నింటికన్నా తీవ్రమైన హింస, దీనితో మనుష్యులు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారు. ద్వాపరం నుండి మొదలుకొని కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ వచ్చారు, అప్పటి నుండే పడిపోవడము మొదలవుతుంది. మనుష్యుల వద్ద భక్తి యొక్క జ్ఞానముంది – వేద శాస్త్రాలను చదవడము, భక్తి చేయడము జరుగుతూ ఉంటుంది. జ్ఞానం, భక్తి, వైరాగ్యము అని పాడుతారు కూడా. భక్తి తర్వాతనే బాబా మొత్తం ప్రపంచం నుండి వైరాగ్యాన్ని ఇప్పిస్తారు ఎందుకంటే ఈ పతిత ప్రపంచం యొక్క వినాశనం జరగనున్నది, అందుకే దేహ సహితంగా దేహం యొక్క సంబంధీకులు మొదలైనవారందరినీ మర్చిపోండి. నా ఒక్కరితోనే బుద్ధి యోగాన్ని జోడించండి. ఎటువంటి ప్రాక్టీస్ ఉండాలంటే అంతిమ సమయంలో ఎవ్వరూ గుర్తు రాకూడదు. ఈ పాత ప్రపంచాన్ని త్యాగం చేయించడం జరుగుతుంది. అనంతమైన సన్యాసాన్ని అనంతమైన తండ్రే చేయిస్తారు. పునర్జన్మలనైతే అందరూ తీసుకోవాల్సిందే, లేదంటే ఇంత వృద్ధి ఎలా జరుగుతుంది. హద్దు సన్యాసుల ద్వారా పవిత్రతా బలము భారతవాసులకు లభిస్తుంది. భారత్ వంటి పవిత్రమైన ఖండం ఇంకేదీ ఉండదు, ఇది తండ్రి యొక్క జన్మ స్థలము. కానీ తండ్రి ఎలా అవతరిస్తారు, ఏం చేస్తారు అన్నది మనుష్యులకు తెలియదు. ఏమీ తెలియదు. బ్రహ్మా పగలు, బ్రహ్మా రాత్రి అని కూడా అంటారు. పగలు అనగా స్వర్గము, రాత్రి అనగా నరకము. కానీ వారికి తెలియదు. బ్రహ్మా రాత్రి అంటే అది పిల్లలైన మీ రాత్రి కూడా. బ్రహ్మా పగలు అయితే పిల్లలైన మీకు కూడా పగలు అవుతుంది. రావణ రాజ్యంలో అందరూ దుర్గతిని పొంది ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి ద్వారా సద్గతిని పొందుతున్నారు. మీరు ఈ సమయంలో ఈశ్వరీయ సంతానము. పరమపిత పరమాత్మకు పుత్రుడు బ్రహ్మా, వారికి మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు, కనుక శివబాబాకు మనవలు అయినట్లు. పుత్రుడైన ఈ బ్రహ్మా కూడా వింటారు, అలాగే మనవలు-మనవరాళ్ళు అయిన మీరు కూడా వింటారు. ఇప్పుడు మళ్ళీ ఈ జ్ఞానం కనుమరుగవుతుంది. ఈ రాజయోగాన్ని తండ్రే వచ్చి నేర్పిస్తారు. సన్యాసుల పాత్రే వేరు మరియు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం వారైన మీ పాత్ర వేరు. అక్కడ దేవతలకు ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. అకాల మృత్యువు ఉండదు. అక్కడ దేవతలు ఆత్మాభిమానులుగా ఉంటారు. పరమాత్మ-అభిమానులుగా ఉండరు. తర్వాత మాయ ప్రవేశించడంతో దేహాభిమానులుగా అవుతారు. ఈ సమయంలో మీరు ఆత్మాభిమానులుగా కూడా ఉన్నారు, అలాగే పరమాత్మ-అభిమానులుగా కూడా ఉన్నారు. ఈ సమయంలో మనం పరమాత్ముని సంతానమని మీకు తెలుసు, పరమాత్ముని కర్తవ్యం గురించి తెలుసు. ఇది శుద్ధ అభిమానము. తమను తాము శివోహమ్ లేక పరమాత్మ అని చెప్పుకోవడమంటే అది అశుద్ధ అభిమానము. మీరిప్పుడు స్వయాన్ని కూడా మరియు పరమాత్మను కూడా పరమాత్మ ద్వారా తెలుసుకున్నారు. పరమపిత పరమాత్మ కల్ప-కల్పము వస్తారని మీకు తెలుసు. భక్తి మార్గంలో కూడా వారు అల్పకాలికమైన సుఖాన్ని ఇస్తారు. ఇకపోతే, ఆ చిత్రాలైతే జడమైనవి. మీరు ఏ మనోకామనలతో పూజలు మొదలైనవి చేస్తారో, నేను మీ ఆ శుద్ధమైన కామనలన్నింటినీ పూర్తి చేస్తాను. అశుద్ధమైన కామనలనైతే రావణుడు పూర్తి చేస్తాడు. చాలామంది రిద్ధి-సిద్ధి మొదలైనవి నేర్చుకుంటారు. అది రావణ మతము. నేను ఉన్నదే సుఖదాతను, నేను ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వను. సుఖ-దుఃఖాలను ఈశ్వరుడు ఇస్తారని అంటారు. నా పై ఈ కళంకాన్ని కూడా మోపుతారు. ఒకవేళ అదే నిజమైతే, మరి నన్ను ఎందుకు పిలుస్తారు. పరమాత్మ, దయ చూపండి, క్షమించండి అని అంటారు. ధర్మరాజు ద్వారా చాలా దండనలను ఇప్పిస్తారని తెలుసు.
తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, భక్తి మార్గం యొక్క ఈ శాస్త్రాలు మొదలైనవాటిలో సారమేమీ లేదు. ఇప్పుడు మీకు భక్తి బాగా అనిపించదు. ఓ భగవంతుడా, అని కూడా అనరు. ఆత్మ మనసులో స్మృతి చేస్తుంది. అంతే, ఇదే నిరంతర జపము. ఆత్మలతో నిరాకార తండ్రి మాట్లాడుతారు. ఆత్మ వింటుంది. ఒకవేళ సర్వవ్యాపి అన్నట్లయితే ఇక అందరూ పరమాత్మలే అవుతారు. తండ్రి అంటారు, ఎంత రాతిబుద్ధి కలవారిగా అయ్యారు. గురువు ఏమైనా శపిస్తారేమోనని మనుష్యులకు చాలా భయం ఉంటుంది. తండ్రి అయితే సుఖదాత. శపించడము లేక అకృప చూపించడమైతే తండ్రి పిల్లల విషయంలో చేయనే చేయరు. పిల్లలు శ్రీమతముపై నడుచుకోకపోతే, చదువుకోకపోతే తమపై తామే అకృప చూపించుకుంటారు. తండ్రి అంటారు, పిల్లలూ, తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి. సత్య-త్రేతా యుగాలలో భక్తి ఉండదు. ఇప్పుడిది రాత్రి కనుక మనుష్యులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు, అందుకే, సద్గురువు లేకపోతే ఘోర అంధకారమే అని అనడం జరుగుతుంది. సద్గురువే వచ్చి మొత్తం చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు – మీరు దేవతలుగా ఉండేవారు, తర్వాత క్షత్రియులుగా అయ్యారు, ఆ తర్వాత వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారు. ఈ విధంగా 84 జన్మలను పూర్తి చేసారు. 8 పునర్జన్మలు సత్యయుగములో, 12 పునర్జన్మలు త్రేతాలో, ఆ తర్వాత 63 జన్మలు ద్వాపర, కలియుగాలలో. చక్రమైతే తిరగాల్సిందే. ఈ విషయం మనుష్యులకు తెలియదు. ఇదే భారత్ విశ్వానికి యజమానిగా ఉండేది, ఇంకే ఖండమూ ఉండేది కాదు. ఎప్పుడైతే అసత్య ఖండము మొదలవుతుందో, అప్పుడిక వేరే-వేరే ఖండాలు కూడా మొదలవుతాయి. ఇప్పుడైతే ఎన్ని కొట్లాటలు-గొడవలు ఉన్నాయో చూడండి. ఇది ఉన్నదే అనాథల ప్రపంచము, తండ్రి గురించి తెలియదు. ఓ పరమాత్మా… అని దుఃఖంతో మొరపెట్టుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు, పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడానికి నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. రామ రాజ్యాన్ని స్థాపన చేస్తారని బాపూజీ కోసం అనుకునేవారు, వారికి చాలా ధనాన్ని ఇచ్చేవారు. కానీ వారు ధనాన్ని ఎప్పుడూ తమ పని కోసం ఉపయోగించేవారు కాదు. అయినా రామ రాజ్యమైతే తయారవ్వలేదు. వీరైతే శివబాబా, దాత కదా. వారు కేవలం ఇలా అర్థం చేయిస్తారు, వినాశనమైతే జరగాల్సిందే, దాని బదులు మీరు ధనాన్ని సఫలం చేసుకోండి. ఈ సెంటర్లు మొదలైనవి తెరవండి. మీరు వచ్చి ఒక్క తండ్రి నుండి సెకెండులో స్వర్గ వారసత్వాన్ని తీసుకోండి అని బోర్డు పెట్టండి. తండ్రి అంటారు, నా స్మృతితోనే మీరు పావనంగా అవుతారు. మీ బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉండాలి. బ్రాహ్మణులే యజ్ఞ రక్షకులుగా అవుతారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము, కృష్ణ యజ్ఞము కాదు. సత్యయుగంలో యజ్ఞాలు ఉండవు. ఇది జ్ఞాన యజ్ఞము. మిగిలినవన్నీ భక్తి యజ్ఞాలు. యజ్ఞములో అనేక రకాల శాస్త్రాలను ఉంచుతారు. కలగాపులగము చేసేస్తారు, దానిని జ్ఞాన యజ్ఞమని అనరు. బాబా అంటారు, రుద్రుడినైన నా యొక్క జ్ఞాన యజ్ఞము రచించబడి ఉంది. ఎవరైతే నా మతముపై నడుస్తారో, వారికి విశ్వ రాజ్యాధికారము యొక్క గొప్ప బహుమానం లభిస్తుంది. పిల్లలైన మీకు ముక్తి, జీవన్ముక్తి యొక్క కానుకను ఇస్తాను. బాబా అంటారు – మనుష్యులనైతే 84 లక్షల యోనులలో చూపించారు మరియు నన్ను అయితే కణ-కణములోనూ పడేసారు. అయినా కూడా నేను వారిపై ఉపకారం చూపే సేవాధారిని. మీరు రావణుని మతముపై నన్ను నిందిస్తూ వచ్చారు. ఇది కూడా డ్రామాగా రచించబడి ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు అడుగడుగునా శ్రీమతముపై నడవాలి. తండ్రి మంచి మతాన్ని ఇస్తారు, మాయ చెడు మతాన్ని ఇస్తుంది, అందుకే జాగ్రత్తగా ఉండండి. నాకు చెందినవారిగా అయి, మళ్ళీ ఏదైనా వికర్మ చేసినట్లయితే వంద రెట్ల శిక్ష పడుతుంది. యోగ బలంతో శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. సన్యాసులు, ఆత్మ నిర్లేపి అని, శరీరము పతితంగా అవుతుందని అంటారు, అందుకే గంగా స్నానాలు చేస్తారు. అరే, ఆత్మ సత్యమైన బంగారంగా అవ్వకపోతే ఆభరణం సత్యమైన బంగారముదిగా ఎలా అవుతుంది. ఈ సమయంలో 5 తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి.
మీ ఈ ఆత్మిక గవర్నమెంట్ చాలా పెద్దది, కానీ చూడండి, మీకు సేవ చేసేందుకు 3 అడుగుల భూమి కూడా లభించదు, మళ్ళీ మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను. ఎటువంటి విశ్వ రాజ్యాన్ని ఇస్తానంటే అక్కడ ఎవ్వరూ గొడవలు చేయలేరు. ఆకాశము, సాగరము మొదలైనవాటన్నింటికీ యజమానులుగా అవుతారు. ఎటువంటి హద్దు ఉండదు. ఇప్పుడైతే పూర్తిగా నిరుపేదలుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి యజమానులుగా అవుతున్నారు కనుక శ్రీమతముపై నడుచుకోవాల్సి ఉంటుంది. శ్రీమతముపై నడవకపోతే మరణిస్తారు. మాయా భూతాలు రామ నామము సత్యమైనది అని అంటూ ఇంటికి తీసుకువెళ్తాయి. చాలా కఠినమైన శిక్షలు అనుభవిస్తారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. యజ్ఞానికి ప్రేమగా సేవ చేస్తూ, అడుగడుగునా శ్రీమతముపై నడుస్తూ తండ్రి నుండి మనసు కోరుకునే ఫలాన్ని అనగా విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి.
2. వినాశనమైతే జరగాల్సిందే – అందుకే తమదంతా సఫలం చేసుకోవాలి. ధనం ఉన్నట్లయితే సెంటర్లు తెరిచి అనేకుల కళ్యాణానికి నిమిత్తులుగా అవ్వాలి.
వరదానము:-
సంగమయుగంలో తండ్రి ద్వారా ఏదైతే వరదానాల ఖజానా లభించిందో, దానిని ఎంతగా పెంచుకోవాలనుకుంటే, అంతగా ఇతరులకు ఇస్తూ వెళ్ళండి. ఏ విధంగానైతే తండ్రి దయ కలవారో, అదే విధంగా తండ్రి సమానంగా దయకలవారిగా కండి. కేవలం వాణి ద్వారా మాత్రమే కాదు, తమ మనసా వృత్తితో, వాయుమండలం ద్వారా కూడా ఆత్మలకు మీకు లభించిన శక్తులను ఇవ్వండి. కొద్ది సమయంలోనే మొత్తం విశ్వమంతటి సేవను సంపన్నం చేయాలంటే తీవ్రగతితో సేవ చేయండి. ఎంతగా స్వయాన్ని సేవలో బిజీ చేసుకుంటారో, అంతగా సహజంగా మాయాజీతులుగా కూడా అవుతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!