25 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
24 May 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - నిద్రను జయించేవారిగా అవ్వండి, రాత్రి మేల్కొని జ్ఞాన చింతన చేయండి, తండ్రి స్మృతిలో ఉండండి, అప్పుడు సంతోషం యొక్క పాదరసం పైకి ఎక్కుతుంది’’
ప్రశ్న: -
భారత్ లో అనేక సెలవులు ఉంటాయి కానీ సంగమయుగంలో మీకు ఒక్క క్షణం కూడా సెలవు లభించదు, ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే సంగమము యొక్క ఒక్కొక్క క్షణము చాలా విలువైనది, ఇందులో శ్వాస-శ్వాసలోనూ తండ్రిని స్మృతి చేయాలి, రాత్రింబవళ్ళు సేవ చేయాలి. ఆజ్ఞాకారులుగా, విశ్వాసపాత్రులుగా అయి స్మృతితో వికర్మలను వినాశనం చేసుకుని గౌరవపూర్వకంగా నేరుగా ఇంటికి వెళ్ళాలి, శిక్షల నుండి విముక్తులవ్వాలి, ఆత్మ మరియు శరీరం రెండింటినీ కాంచనంగా తయారుచేసుకోవాలి, అందుకే మీకు ఒక్క క్షణం కూడా సెలవు లేదు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
మా తీర్థాలు అతీతమైనవి… (హమారే తీర్థ్ న్యారే హై…)
ఓంశాంతి. పిల్లలకు తెలుసు, తీర్థ యాత్రలు రెండు రకాలవి ఉంటాయి – ఒకటి ఆత్మికమైనది, రెండవది స్థూలమైనది. తీరాలు కూడా రెండు రకాలవి ఉంటాయి. ఒకటేమో నదీ తీరాలు. రెండవది ఏమో, పిల్లలైన మీ యొక్క కొత్త-కొత్త సెంటర్లు అనగా తీరాలు తయారవుతూ ఉంటాయి. కాన్పూర్ లో జ్ఞానామృతం తాగేందుకు లేక జ్ఞాన స్నానం చేసేందుకు ఎన్ని తీరాలున్నాయి? అని అడుగుతారు. అప్పుడు 4-5 తీరాలున్నాయని చెప్తారు. అన్ని తీరాల చిరునామాలను కూడా ముద్రించడం జరుగుతుంది – ఇది ఫలానా తీరము, అక్కడకు వెళ్ళి ఎవరైతే జ్ఞాన స్నానం చేస్తారో వారు జీవన్ముక్తిని పొందగలరు. ముక్తి మరియు జీవన్ముక్తి అని వేటినంటారు అన్నది పిల్లలకు తెలుసు. తప్పకుండా భారత్ జీవన్ముక్తిలో ఉండేది, దానినే స్వర్గమని అనడం జరుగుతుంది, తర్వాత జీవన బంధనంలోకి వస్తారు అప్పుడు దానిని నరకమని అనడం జరుగుతుంది. పిల్లలైన మీకు తెలుసు, మనం తీర్థాలకు వెళ్తాము, జ్ఞాన స్నానం చేయడంతోనే సద్గతి లభిస్తుంది. సద్గతి యొక్క సాక్షాత్కారం కూడా పిల్లలైన మీకు జరిగింది. సద్గతి అని స్వర్గాన్ని అంటారు మరియు దుర్గతి అని నరకాన్ని అంటారు. సద్గతి, స్వర్గము అంటే తప్పకుండా సత్యయుగము మరియు దుర్గతి, నరకము అంటే కలియుగము. పిల్లలైన మీరు అందరికీ ఆహ్వానమిస్తారు, ఈ కలియుగీ నరకం నుండి సత్యయుగీ స్వర్గంలోకి వస్తారా? స్వర్గము అన్న పదంతో పాటు సత్యయుగము అన్న పదాన్ని కూడా తప్పకుండా వేయాలి, అప్పుడు స్వర్గము మరియు నరకము వేర్వేరు అవుతాయి. లేదంటే మనుష్యులు స్వర్గము, నరకము ఇక్కడే ఉన్నాయని అంటారు. స్వర్గము మరియు నరకము గురించి భారతవాసులకే తెలుసు. అక్కడకు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు వెళ్తారు, ఇతురులెవ్వరికీ తెలియదు. ప్రతి ఒక్కరికీ తమ తమ ధర్మము ఉంది మరియు తమ ధర్మ శాస్త్రము ఉంది. కనుక ప్రతి ఒక్కరూ తమ ధర్మ శాస్త్రాన్నే చదవాలి. తమ ధర్మ శాస్త్రమే కళ్యాణకారిగా ఉంటుంది.
మనం తప్పకుండా ఉన్నత కులానికి చెందినవారమని పిల్లలైన మీకు తెలుసు. ఎప్పటివరకైతే మీరు మనుష్యులకు డ్రామా రహస్యాన్ని అర్థం చేయించరో, అప్పటివరకైతే వారు ఘోర అంధకారంలో ఉంటారు, అందుకే ఈ చిత్రాలపై కూడా అర్థం చేయించాలి. పిల్లలైన మీకు అన్ని యుగాల గురించి తెలుసు, చిత్రాలు లేకుండా మనుష్యులు అర్థం చేసుకోలేరు. బుద్ధిలో కూర్చోనే కూర్చోదు. మీరు స్కూలులో మ్యాప్ లేకుండా ఎవరికైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఇక్కడ ఉన్నాయని చెప్తే అసలేమీ అర్థం చేసుకోరు. అలాగే ఈ విషయాన్ని కూడా చిత్రాలు లేకుండా ఏమీ అర్థం చేసుకోలేరు. చిత్రాలు ఎదురుగా తీసుకొచ్చి అర్థం చేయించాలి – ఇది డ్రామా. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ ధర్మానికి చెందినవారు? మీ ధర్మం ఎప్పుడు వస్తుంది? సత్యయుగంలో ఏ ధర్మముంటుంది? చిత్రాలలో చాలా స్పష్టంగా రాసి ఉంది. సత్య, త్రేతాయుగాలలో సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉండేటప్పుడు, ఇంకే ధర్మమూ లేదు. ఇప్పుడు ఆ దేవతా ధర్మం లేదు, అందుకే తప్పకుండా అది స్థాపన అవ్వాలి. ఇప్పుడు ప్రపంచము పాతదిగా ఉంది కనుక తప్పకుండా మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన జరగాలి. కొత్త ప్రపంచంలో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. లక్ష్మీ-నారాయణుల చిత్రమే ముఖ్యమైనది. లక్ష్మీ-నారాయణుల పేరు ప్రసిద్ధమైనది, వారికి పెద్ద-పెద్ద మందిరాలను కూడా నిర్మిస్తారు. శివునికి కూడా అనేక పేర్లు పెట్టి, అనేక మందిరాలు నిర్మించారు. వారి పేరు కూడా ప్రసిద్ధమైనది. సోమరసాన్ని తాగిస్తారు, అందుకే సోమనాథుడు అన్న పేరు పెట్టారు. మనుష్యులు చాలా పేర్లు పెట్టారు, కావున ఇలా అర్థం చేయించాల్సి ఉంటుంది – రుద్రుడు, శివుడు, సోమనాథుడు, ఈ పేర్లన్నీ ఎందుకు పెట్టారు? బద్రీనాథుడు అంటే అర్థమేమిటి? అర్థం చేసుకోకుండానే చాలా పేర్లు పెట్టేసారు, అందుకే మనుష్యులు తికమకలో ఉన్నారు. దీని యథార్థమైన పేరే రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము. తండ్రి అంటారు – నా ఈ జ్ఞాన యజ్ఞముతో ఈ వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. ఇది భగవానువాచ. కావున ఎవరైనా వస్తే మొదట వారికి గీత గురించి తప్పకుండా అర్థం చేయించండి. అందులో రాయబడి ఉంది, భగవానువాచ – నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు నా వద్దకు వచ్చేస్తారు. వారు అనంతమైన తండ్రి, స్వర్గ రచయిత, జీవన్ముక్తి రచయిత. వారి పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్ (స్వర్గ రచయిత), స్వర్గాన్ని స్థాపన చేస్తారు. వారు స్వర్గంలో ఉండరు. స్వర్గాన్ని స్థాపన చేసేవారు భగవంతుడు. స్థాపన, వినాశనము, పాలన యొక్క కార్యాలను చేస్తారు కదా. కనుక ఇప్పుడు తండ్రి అంటారు, పారలౌకిక తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి, లేదంటే నా వద్దకు ఎలా వస్తారు. తండ్రి అంటారు, ఇది మీ అంతిమ జన్మ, అందుకే నాతో యోగం జోడించినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. దీనిని యోగాగ్ని అని అంటారు. మనుష్యులైతే ఆరోగ్యం కోసం అనేక రకాల యోగాలను నేర్పిస్తారు. ఇప్పుడు పారలౌకిక తండ్రి అంటారు, నాతో యోగం జోడించండి మరియు ఈ జ్ఞానాన్ని ధారణ చేయండి, అప్పుడు మీ వికర్మలు వినాశనమవుతాయి, అప్పుడు నేను మీకు సత్యయుగము, వైకుంఠం యొక్క రాజ్యాన్ని ఇస్తాను. మరి నమ్మాలి కదా. తండ్రి అంటారు, ఓ నిద్రను జయించే పిల్లలూ, నిద్రను జయించి తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే మీరు నా వద్దకు నా నిరాకారీ ప్రపంచంలోకి రావాలి. అదే కృష్ణుడైతే, నా వైకుంఠంలోకి రావాలి అని అంటారు. ఎవరు ఎక్కడి నివాసి అయితే, అక్కడి గమ్యాన్నే చూపిస్తారు కదా. నిరాకార తండ్రి అంటారు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే నా నిరాకారీ ప్రపంచంలోకి వస్తారు, నా వద్దకు వచ్చేందుకు ఇదొక్కటే మార్గము. ఇప్పుడు పిల్లలైన మీరు ముఖ వంశావళి. కుఖ వంశావళి మరియు ముఖ వంశావళి అన్న పదాలు పూర్తిగా సహజమైనవి. ఇప్పుడు మీరంటారు, బాబా, నేను మీ వాడిని. నేను కూడా అంటాను, అవును పిల్లలు మీరు నా వారు, కనుక ఇప్పుడు మీరు నా మతముపై నడుచుకోండి.
మీకు తెలుసు, భారత్ ఎప్పుడైతే స్వర్గంగా ఉండేదో, అప్పుడు మిగిలిన ఈ ఆత్మలన్నీ ఎక్కడ ఉండేవి? ముక్తిధామంలో. అక్కడ ఉన్నది ఒకటే ధర్మము, అందుకే చప్పట్లు మోగవు. గొడవలు, కొట్లాటలు అన్న పేరే ఉండదు. హిందువులు-చైనీయులు అయిన మేము పరస్పరంలో సోదరులము అని మనుష్యులు అనడం అంటారు, కానీ అలా ఎక్కడ ఉన్నారు? వీరు కొట్లాడుకుంటూనే ఉంటారు. పతిత-పావన సీతా రామా, అని పాడుతారు అంటే తప్పకుండా స్వయం పతితులుగా ఉన్నారు, అందుకే పాడుతారు. సత్యయుగంలోనైతే ఉన్నదే పావన ప్రపంచము కనుక అక్కడ ఇలా పాడరు. ఇది పతిత ప్రపంచము, అందుకే పాడుతారు. పావన ప్రపంచం అని సత్యయుగాన్ని అనడం జరుగుతుంది, పతిత ప్రపంచం అని కలియుగాన్ని అనడం జరుగుతుంది. ఇది కూడా మనుష్యులు అర్థం చేసుకోలేరు. ఎంతటి మలినమైన బుద్ధి కలవారు. మనం కూడా అర్థము చేసుకునేవారము కాదు. తమోప్రధాన బుద్ధిగా అవ్వడంతో అంతా మర్చిపోతారు. తండ్రి అంటారు, మీరు పూర్తిగా తెలివిహీనులుగా అయిపోయారు. మీరు ఎంత తెలివైనవారిగా ఉండేవారు. మీరే దేవతలుగా, సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తెలివిహీన శూద్రులుగా, తమోప్రధానంగా అయిపోయారు. మీరు స్వర్గంలో ఎంత సుఖాన్ని పొందారు. భారతవాసులైన మీది దేవీ-దేవతల ఉన్నతోన్నతమైన కులము. ఇప్పుడు మీరు ఎంత తుచ్ఛమైన నరకవాసులుగా అయ్యారు. ఇది తండ్రే వచ్చి తమ పిల్లలకు చెప్తారు. తప్పకుండా మనమే పూజ్య దేవతలుగా ఉండేవారమని, మళ్ళీ పూజారులుగా అయ్యామని పిల్లలు అనుభవం చేస్తారు. తండ్రి ఎంత తెలివైనవారిగా తయారుచేసారు, ఇప్పుడు మళ్ళీ అలా తయారుచేస్తున్నారు. ఈ విషయాలను రాత్రి చింతన చేసి చాలా సంతోషంలోకి రావాలి. అమృతవేళ లేచి బాబాను స్మృతి చేయండి మరియు ఈ చింతన చేయండి, అప్పుడు సంతోషం యొక్క పాదరసం చాలా పైకి ఎక్కుతుంది. చాలామంది పిల్లలైతే మొత్తం రోజంతటిలో ఒక్క క్షణం కూడా స్మృతి చేయరు. ఇక్కడే వింటూ ఉంటారు కానీ బుద్ధి యోగం మరొకవైపు ఉంటుంది. నిరాకార పరమాత్మ అని ఎవరిని అంటారు, అది కూడా అర్థం చేసుకోరు. స్కూలులో కొందరు రెండు మూడు సార్లు కూడా ఫెయిల్ అవుతారు. చివరికి చదవలేకపోతే, ఇక స్కూలునే వదిలేస్తారు. ఇక్కడ కూడా చదువు అర్థం కాకపోతే వదిలేస్తారు. మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. వికారాల దెబ్బ తగిలింది అంటే, ఇక సర్వనాశనము. మాయ అంతటి ప్రబలమైనది, చాలా శక్తివంతమైనది. మీ బాక్సింగ్ మనుష్యులెవ్వరితోనూ కాదు, కానీ మాయతో జరుగుతుంది. మనం మాయపై విజయం పొందుతాము. దీని కోసం పిల్లలైన మీరు చాలా పురుషార్థం చేయాలి. ఎంత వీలైతే అంత రాత్రి మేల్కొని విచార సాగర మథనం చేయాలి. అలవాటైపోతుంది. భగవానువాచ అనేది పిల్లలందరి కోసము, కేవలం ఒక్క అర్జునుడి కోసం మాత్రమే కాదు. అందరూ యుద్ధ మైదానంలో ఉన్నారు. తండ్రి పిల్లలందరికీ చెప్తారు, పిల్లలూ, రాత్రి మేల్కొని అతి ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి మరియు జ్ఞాన ధారణ కూడా జరుగుతుంది. లేదంటే కొద్దిగా కూడా ధారణ జరగదు. ఒకవేళ నా ఆజ్ఞను ఉల్లంఘిస్తే, నన్ను స్మృతి చేయకపోతే చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఈశ్వరీయ డైరెక్షన్లు లభిస్తాయి కదా. నేను మీ యొక్క చాలా మధురాతి-మధురమైన తండ్రిని, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు. శిక్షలు అనుభవించిన తర్వాత రావడమంటే, అది సరికాదు. నేరుగా వచ్చినట్లయితే గౌరవం లభిస్తుంది, అందుకే నా ఆజ్ఞను ఉల్లంఘించకండి. ఆజ్ఞను పాటించనివారిని నిందకులు అని అంటారు. వీరు సత్యమైన బాబా, సత్యమైన సద్గురువు. కావున వారి ఆజ్ఞను పాటించాలి కదా. శివబాబా అయితే చాలా మధురమైనవారు. ఆత్మ మరియు శరీరము, రెండింటినీ కాంచనంగా చేస్తారు. కంచనకాయ అంటే కేవలం శరీరం యొక్క ఆరోగ్యం మాత్రమే కాదు. ఆత్మ కూడా పవిత్రంగా మరియు శరీరం కూడా పవిత్రంగా ఉంటే, దానిని కంచనకాయ అని అంటారు. దేవతలకు కంచనకాయ ఉండేది. ఇప్పుడైతే అందరిదీ మురికి శరీరము. 5 తత్వాలు తమోప్రధానంగా ఉన్నాయి, కావున వాటితో ఎలాంటి శరీరం తయారవుతుందో చూడండి. ముఖాలు చూడండి, ఎలా ఉన్నాయి. కృష్ణుడికైతే చాలా మహిమ ఉంది. అటువంటి శరీరమైతే మీకు స్వర్గంలోనే లభించగలదు. ఇప్పుడు మీరు మళ్ళీ అటువంటి దేవతలుగా అవుతారు. కావున ముఖ్యమైన విషయమేమిటంటే, రాత్రి మేల్కొని స్మృతి చేసినట్లయితే అలవాటవుతుంది. నిద్రను వదిలించుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే అన్నీ జరుగుతాయి. వ్యాపార-వ్యవహారాలు, రొట్టెలు చేయడము, వంట చేయడము, అన్నింటినీ ప్రాక్టీస్ తో నేర్చుకోవడం జరుగుతుంది కదా. తండ్రిని స్మృతి చేయడము కూడా నేర్చుకోవాలి. ఎవరినైతే మొత్తం కల్పమంతా మర్చిపోయారో, ఇప్పుడు ఆ తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడు బాబా సంతోషిస్తారు. లేదంటే ఇతడు విశ్వాసపాత్రుడైన, ఆజ్ఞాకారుడైన బిడ్డ కాదు అని అంటారు. అప్పుడు చాలా శిక్షలను అనుభవిస్తారు. ఇటువంటివారి భాగ్యంలో దెబ్బలు ఉంటాయి. ఇక్కడ ఎవరైనా కొద్దిగానైనా ఎవరిపైనైనా కోప్పడితే, వారు తిరగబడతారు, అక్కడైతే ధర్మరాజు శిక్షలు విధిస్తారు, అప్పుడు ఏమైనా చేయగలరా. ఏ విధంగానైతే జైలులో గవర్నమెంటు ఉచితంగా ఎన్నో పనులు చేయించుకుంటుంది, కొందరు కష్టపడకుండా జైలు శిక్షను అనుభవిస్తారు, కొందరికి కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ధర్మరాజుపురిలో కూడా ఎప్పుడైతే ధర్మరాజు శిక్షలు విధిస్తారో, అప్పుడేమీ చేయలేరు. తప్పు మాదే, అందుకే శిక్ష లభించింది అని లోలోపల భావిస్తారు. మేము తండ్రి ఆజ్ఞను పాటించలేదు, అందుకే శిక్ష లభిస్తుంది అని కూడా ఫీల్ అవుతారు. అందుకే బాబా అంటారు, ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేయండి. అచ్ఛా.
చూడండి, భారత్ లో అందరికీ ఎంతగా సెలవులు లభిస్తాయో, అంతగా ఇంకెక్కడా లభించవు. కానీ ఇక్కడ మనకు ఒక్క క్షణం కూడా సెలవు లభించదు ఎందుకంటే శ్వాస-శ్వాసలోనూ స్మృతిలో ఉండండి అని బాబా అంటారు. ఒక్కొక్క శ్వాస అతి విలువైనది. పిల్లలు రాత్రింబవళ్ళు బాబా సేవలో ఉండాలి.
మీరు సర్వశక్తివంతుడైన బాబాకు ప్రేయసులుగా ఉన్నారా లేక వారి రథానికి ప్రేయసులుగా ఉన్నారా? లేక ఇరువురికీనా? తప్పకుండా ఇరువురికీ ప్రేయసులుగా ఉండాల్సి ఉంటుంది. వారు ఈ రథములో ఉన్నారని బుద్ధిలో ఉంటుంది. ఈ కారణం చేత మీరు వీరికి ప్రేయసులుగా అయ్యారు. శివుని మందిరంలో కూడా ఎద్దు ఉంది. అది కూడా పూజింపబడుతుంది. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు, ఎవరైతే రోజూ వినరో, వారు ఏవో కొన్ని విషయాలను మిస్ చేస్తారు. రోజూ వినేవారు ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. మ్యానర్స్ కూడా బాగుంటాయి. బాబాను స్మృతి చేయడంలో చాలా పెద్ద లాభం ఉంది. అయితే అంతకన్నా కూడా పెద్ద లాభం బాబా జ్ఞానాన్ని గుర్తు చేసుకోవడము. యోగము కూడా లాభమే, జ్ఞానం కూడా లాభమే. బాబాను స్మృతి చేయడంతోనైతే వికర్మలు వినాశనమవుతాయి మరియు పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది. ఎక్కడైతే బాబా నివసిస్తారో, అది ముక్తిధామము, బ్రహ్మలోకము. కానీ అన్నింటికన్నా మంచిది ఈ బ్రాహ్మణుల లోకము. బ్రాహ్మణులు జంధ్యాన్ని తప్పకుండా ధరిస్తారు, పిలకను కూడా పెట్టుకుంటారు ఎందుకంటే బాబా బ్రాహ్మణులైన మనల్ని పిలకతో పట్టుకుని తీసుకువెళ్తారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శరీరము మరియు ఆత్మ, రెండింటినీ కాంచనంగా చేసుకునేందుకు తండ్రిని స్మృతి చేసే అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ ఆజ్ఞను ఉల్లంఘించకూడదు.
2. చదువుకునే సమయంలో చెక్ చేసుకోవాలి, బుద్ధి అటు-ఇటు పరుగెత్తడము లేదు కదా. ఎప్పుడూ చదువును మిస్ చేయకూడదు. మాయతో బాక్సింగ్ లో ఓడిపోకూడదు.
వరదానము:-
కేవలం వాణి యొక్క సేవనే సేవ కాదు, శుభ భావన, శుభ కామన పెట్టడము కూడా సేవనే. బ్రాహ్మణుల కర్తవ్యమే ఈశ్వరీయ సేవ. ఎక్కడ ఉంటున్నా సరే సేవ చేస్తూ ఉండండి. ఎవరు ఎలాంటివారైనా కానీ, పక్కా రావణులుగా ఉన్నా కానీ, ఎవరైనా మిమ్మల్ని నిందించినా కానీ, మీరు వారికి మీ ఖజానాల నుండి, శుభ భావన, శుభ కామనల యొక్క దోసిలిని తప్పకుండా ఇవ్వండి, అప్పుడు సత్యమైన సేవాధారి అని అంటారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!