24 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 23, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తండ్రినే సద్గురువు రూపంలో పిల్లలైన మీకు గ్యారంటీ ఇస్తారు, పిల్లలూ, నేను మిమ్మల్ని నాతో పాటు తిరిగి తీసుకువెళ్తాను, ఈ గ్యారంటీని ఏ దేహధారి ఇవ్వలేరు’’

ప్రశ్న: -

పిల్లలైన మీరు ఈ కథను ఏదైతే వింటున్నారో, ఇది ఎప్పుడు పూర్తవుతుంది?

జవాబు:-

ఎప్పుడైతే మీరు ఫరిశ్తాలుగా అవుతారో అప్పుడు. పతితులకే కథను వినిపించడం జరుగుతుంది. పావనంగా అయిన తర్వాత కథ యొక్క అవసరం ఉండదు, అందుకే సూక్ష్మవతనంలో పార్వతికి శంకరుడు కథను వినిపించారు – ఇలా అనడము తప్పు.

ప్రశ్న: -

శివబాబా మహిమలో ఏ పదాలు సరైనవి, ఏవి తప్పు?

జవాబు:-

శివబాబాను అభోక్త, అసోచతా (ఆలోచనా రహితమైనవారు), కరన్ కరావన్ హార్ (చేసేవారు చేయించేవారు) అని అనడం సరైనది. ఇకపోతే, అకర్త (కర్మ చేయనివారు) అని అనడం సరికాదు ఎందుకంటే వారు పతితులను పావనంగా తయారుచేస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి….. (ఛోడ్ భీ దే ఆకాశ్ సింహాసన్…)

ఓంశాంతి. ఇది పిల్లల పిలుపు, బాబా, ఇప్పుడు రండి ఎందుకంటే మేము రావణ రాజ్యంలో మళ్ళీ దుఃఖితులుగా ఉన్నాము. మళ్ళీ మాయ నీడ పడింది అనగా 5 వికారాల రూపీ రావణుడు మమ్మల్ని చాలా దుఃఖితులుగా చేసాడు. బాబా బదులిస్తారు, అవును పిల్లలూ, ఇదైతే నా నియమము. ఈ మాటను తప్పకుండా ఇక్కడికి వచ్చే అంటారు కదా. అవును పిల్లలూ, ఎప్పుడెప్పుడైతే భూమిపై భారతవాసులు పూర్తిగా భ్రష్టాచారులుగా, దుఃఖితులుగా అవుతారో అప్పుడు వస్తాను. సద్గతి కోసం ఎంతమంది గురువులను ఆశ్రయిస్తారు, కానీ వారు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. అంధులందరికీ చేతి కర్ర అయితే ప్రభువు ఒక్కరే. మొట్టమొదట తండ్రి జన్మనిస్తారు అనగా దత్తత తీసుకుంటారు, గురువుగా సద్గతినిస్తారు. ఇప్పుడు ఎవరూ సద్గతినివ్వరు, అలాగే ఎవరూ తండ్రిగానూ లేరు. ఇప్పుడు మీరంటారు, పరమపిత పరమాత్మ మాకు తండ్రి కూడా, గురువు కూడా. ఆ ఒక్కరినే సద్గురువు, సత్యమైన తండ్రి అని అనగలరు. వారు సత్యమైన తండ్రి, వారిని సుప్రీమ్ అని అంటారు. వారు సద్గురువు కూడా. వారితో పాటు తీసుకువెళ్తారు. ఇది గ్యారంటీ, ఇంకే గురువు, నేను ఆత్మలైన మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను అని ఎప్పుడూ గ్యారంటీనివ్వరు. వారికి తెలియనే తెలియదు. ఇవన్నీ కొత్త విషయాలు. మీరు వీరిని చూసినప్పుడు బుద్ధిలో శివుడిని స్మృతి చేయాలి. వారే తండ్రి, టీచరు, గురువు. మనుష్యులు, ఎవరైనా గురువును ఆశ్రయిస్తే లేక టీచరు వద్దకు వెళ్తే, వారి శరీరాన్నే చూస్తారు. ఆత్మనే రకరకాల శరీరాలను ధారణ చేసి, రకరకాల నామ, రూప, దేశ, కాలాలలోకి వెళ్తుంది. అచ్ఛా, బాబా అయితే ఒక్కరే మరియు ఒక్కసారే వస్తారు. వారైతే పునర్జన్మలు తీసుకోరు. సంస్కారాలైతే ఆత్మలో ఉంటాయి. ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని ధారణ చేస్తుందో, అప్పుడే వర్ణన జరుగుతుంది కదా. పిల్లలైన మీరు తండ్రి మహిమను పాడుతారు – వారు నిరాకారుడు, ఎప్పుడూ సాకార శరీరాన్ని తీసుకోరు. శివునికి తమ శరీరమంటూ ఉండదు. కానీ వారు జ్ఞానసాగరుడు, పతితపావనుడు, సద్గురువు. వారు తండ్రి కూడా, రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. ఎవరైతే బ్రహ్మాండానికి, మొత్తం విశ్వానికి యజమానియో, వారే స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు కదా. శరీరధారులైతే అలా తయారుచేయలేరు. పిల్లలకు తప్ప తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. మీరంటారు, పరమాత్మ మమ్మల్ని చదివిస్తున్నారు అని. అప్పుడు వారంటారు, నిరాకార పరమపిత పరమాత్మ శరీరంలోకి వస్తారు అని ఏ శాస్త్రాలలోనూ లేదు. అరే, శివ జయంతి అని అంటూ ఉంటారు కదా. పాటలో కూడా, రూపాన్ని మార్చుకొని రండి అని అన్నారు. మరి వారు ఏ శరీరంలో, ఏ రూపంలో వచ్చారు? మీదైతే కర్మ బంధనం యొక్క శరీరము. మంచి కర్మలతో మంచి పదవి, చెడు కర్మలతో చెడు పదవి లభిస్తుంది, వీరి కోసమైతే ఇలా అనరు. మనుష్యులైతే పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటారు. తండ్రి తీసుకోరు. వారు ఈ శరీరంలో ప్రవేశించారు. శివబాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారని అంటారు కూడా. శివుడైతే నిరాకారుడు, బ్రహ్మా ద్వారా స్థాపన ఎలా చేస్తారు? పై నుండి ప్రేరణ ఇస్తారా ఏమిటి? పతిత ప్రపంచంలోకి వస్తారన్నప్పుడు, రాజయోగం నేర్పించడానికి ఏ శరీరంలోకి రావాలి. పిల్లలైన మీకు తెలుసు, బాబా వచ్చి ఉన్నారు, మనం వారి నుండి వింటాము. వారు ఈ బ్రహ్మా ముఖం ద్వారా వినిపిస్తారు. ఇతర దేహధారులందరూ గురువు పేరు చెప్తారు. మీకు తెలుసు, నిరాకార శివుడు మన తండ్రి. మొదట అయితే జన్మనిచ్చే తండ్రి కావాలి కదా. శివబాబా ప్రజాపిత బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటారు. ప్రజాపితకు గర్భం ద్వారానైతే ఇంతమంది పిల్లలు జన్మించలేరు. ప్రజాపిత బ్రహ్మాకైతే అనేకమంది పిల్లలున్నారు. బ్రాహ్మణ కులం చాలా పెద్దది, ఈ బ్రాహ్మణులు తర్వాత దేవతలుగా అవుతారు. ఎప్పుడైతే దేవతలుగా అవుతారో, అప్పుడు దత్తత తీసుకోవడం జరగదు. దత్తత తీసుకోవడమనేది ఇప్పుడు జరుగుతుంది. ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు.

పిల్లలకు తెలుసు, మనం శివబాబా వద్దకు వచ్చాము. వారే నాలెడ్జ్ ఫుల్. వారంటారు, నేను పిల్లలైన మీకు మాత్రమే ఈ జ్ఞానాన్ని వినిపిస్తాను. నాకు నా శరీరమంటూ లేదు. శివ జయంతిని జరుపుకుంటారు కానీ శివబాబా ఎలా వచ్చారు, ఇది ఎవ్వరికీ తెలియదు. శివరాత్రి అని అంటారు కూడా. రాత్రివేళలో కృష్ణుని జన్మను కూడా చూపిస్తారు. శివ జయంతి తర్వాత వెంటనే శ్రీకృష్ణుని జన్మ జరుగుతుంది. శివుని జన్మ అయితే సంగమంలో జరుగుతుంది. బ్రహ్మా రాత్రి పూర్తయిన తర్వాత పగలు ప్రారంభమవుతుంది. ఆ సంగమంలోనే తండ్రి వస్తారు. ఇది అనంతమైన రాత్రి, అది హద్దుకు సంబంధించినది. అర్ధకల్పము రాత్రి, అర్ధకల్పము పగలు. భక్తి మార్గంలో ఎదురుదెబ్బలే తింటూ వస్తారు, భగవంతుడు లభించరు, అంటే అంధకారం ఉన్నట్లే కదా. పూర్తిగా బుద్ధిహీనులుగా ఉన్నారు. పరమపిత పరమాత్మ పైన ఉన్నారు… అని పాడుతారు. మళ్ళీ అంటారు, తీర్థ యాత్రలలో కూడా భగవంతుడు లభిస్తారు, దాన-పుణ్యాలతో కూడా లభిస్తారు అని. ఎంత సమయం మీరు ఎదురుదెబ్బలు తిన్నారు. అనేక మతాలు ఉన్నాయి, అందుకే భక్తి మార్గమును బ్రహ్మా రాత్రి అని అనడం జరుగుతుంది. ఎదురుదెబ్బలు తింటూ-తింటూ దుర్గతిని పొంది పాపాత్ములుగా అవుతారు. వికారాల ద్వారా జన్మించినవారినే పాపాత్ములు అని అంటారు. శ్రీకృష్ణుడు వికారాల ద్వారా జన్మించారని మీరు అనరు. అలా జరగదు, వారైతే యోగబలంతో జన్మిస్తారు. ఈ విషయాల గురించి భారతవాసీ గృహస్థ ధర్మం వారైన మీకు తెలుసు. సన్యాసులకు తెలియదు, వారు ఒప్పుకోరు కూడా.

తండ్రి అంటారు – ప్రియమైన పిల్లలూ, సత్యయుగంలో మీరు పవిత్ర ప్రవృత్తి మార్గంలో ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ పతితులుగా కూడా అవుతారు. భారత్ పవిత్రంగా ఉండేది, దేవతల రాజ్యం ఉండేది. అక్కడ శాంతి కూడా ఉండేది. నిజానికి శాంతిధామమైతే నిర్వాణధామము కానీ సత్యయుగంలో కూడా మీకు వారసత్వం లభించి ఉంటుంది, అందుకే అక్కడ ఎప్పుడూ అశాంతి ఉండదు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఎప్పుడూ అశాంతి చెందరు. ఎవ్వరూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. ఇక్కడైతే పిల్లలు కూడా తల్లిదండ్రులకు దుఃఖాన్నిచ్చి అశాంతపరుస్తారు. ఇప్పుడు మీరు శాంతిసాగరుడి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అక్కడ గొడవలు, కొట్లాటలు ఏవీ ఉండవు. ఇక్కడ కూడా మీ అవస్థ ఆ విధంగా ఉండాలి. పరస్పరంలో ఉప్పు నీరు వలె అవ్వకూడదు. మొట్టమొదటైతే ఈ నిశ్చయం కావాలి – అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు, మనల్ని దుఃఖపు ప్రపంచం నుండి ఇంటికి తీసుకువెళ్తారు. సత్యయుగంలోనైతే తండ్రి రారు. ఇక్కడకు వచ్చి ఈ కిటికీల (నయనాల) ద్వారా మిమ్మల్ని చూస్తారు. వీరి ఆత్మ కూడా చూస్తుంది, శివబాబా కూడా చూస్తారు. ఒక శరీరంలో రెండు ఆత్మలు ఎలా ఉండగలవు, మనుష్యులు ఒప్పుకోరు. అరే, మీరు బ్రాహ్మణులకు తినిపిస్తారు, పతి లేక తండ్రి ఆత్మను పిలుస్తారు, వారు వచ్చి మాట్లాడుతారు, వారిని అడుగుతారు, అంటే రెండు ఆత్మలు ఉన్నట్లు కదా. బాబా అంటారు, ఆ ఆత్మలు వచ్చి కూర్చోవు. అది జరగదు. తండ్రికైతే తమ శరీరమంటూ లేదు. వారైతే రాగలరు కదా. 5 వేల సంవత్సరాల క్రితం కూడా నేను ఈ విధంగా చెప్పాను, సాధారణ వృద్ధ తనువులోకి, భగీరథునిలోకి అనగా భాగ్యశాలీ రథంలోకి వస్తాను. తప్పకుండా మనిషి తనువులోకి వస్తారు, అంతేకానీ ఎద్దు పైన వస్తారా? సూక్ష్మవతనంలో శంకరుని ఎదురుగా ఎద్దు ఎక్కడ నుండి వచ్చింది? ఒకవేళ శంకరుడిని లేక శంకర-పార్వతులను పూజిస్తే నేను సాక్షాత్కారం చేయిస్తాను. ఇకపోతే, శంకరుడు పార్వతికి కథను వినిపించారని చూపించారు, ఇది అసత్యము. శంకరుడు ఎందుకు కథ వినిపిస్తారు? సూక్ష్మవతనంలోనైతే అవసరమే లేదు. మీరు ఫరిశ్తాలుగా అయితే, అప్పుడు కథ పూర్తి అవుతుంది. పతితులను పావనంగా చేసేందుకు కథను వినిపించడం జరుగుతుంది. బాబా అమరలోకంలోకి తీసుకువెళ్ళేందుకు అమరకథను వినిపిస్తారు, యోగ్యులుగా చేస్తారు. అమరలోకము అని సత్యయుగాన్ని అనడం జరుగుతుంది. ఇది మృత్యులోకము.

ఈ రోజు బాబా అడిగారు – శివబాబా స్నానం చేస్తారా? బాప్ దాదా చేస్తారు అని బదులిచ్చారు. నేను అన్నాను, స్నానమైతే దాదా చేస్తారు కదా, శివుడు ఎందుకు చేస్తారు! స్నానం చేసేందుకు వారికేమైనా లెట్రిన్ లోకి వెళ్ళాల్సి ఉంటుందా. శివుడైతే అభోక్త కదా. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. స్నానం చేసేందుకు వారేమైనా అపవిత్రంగా అవుతారా. వారైతే పతితులను పావనంగా చేసేందుకే వస్తారు. వారు చేసేవారు చేయించేవారు, అభోక్త, అసోచతా (ఆలోచనా రహితమైనవారు). అకర్త (కర్మ చేయనివారు) అని అనడం తప్పు అవుతుంది. పతితులను పావనంగా చేస్తారు కదా. వారు చేసేవారు చేయించేవారు. (దగ్గు వచ్చింది) వీరి ఆత్మ యొక్క ఈ శరీరం రూపీ వాయిద్యం పాడయ్యింది, దీనికి శివబాబా ఏం చేస్తారు? మీరు, శివబాబా వాయిద్యం పాడయ్యింది అని అనరు. అలా అనరు, ఈ శరీరం వారిది కాదు, లోన్ గా తీసుకున్నది. లోన్ గా తీసుకున్న వస్తువు విరిగిపోతే యజమానిది విరిగినట్లు కదా. శివబాబా ఈ శరీరం యొక్క యజమాని కాదు. యజమాని అయితే వీరు (బ్రహ్మా). వారు దీనిని అద్దెకు తీసుకున్నారు. ఇది భాగ్యశాలీ రథము. ఒక్కటే ఎద్దు ఉంది. మళ్ళీ గోముఖము అని కూడా అంటారు. బాబా అంటారు, నిజానికి కొంతమంది కుమార్తెలు అంత తెలివైనవారిగా లేరు. ఎవరినైనా లేపాలంటే నేను పిల్లలలోకి ప్రవేశించి వారిని లేపుతాను. పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకైతే రావాల్సే ఉంటుంది. కనుక ఎవరికైనా కళ్యాణం చేయడానికి కూడా పిల్లలలో ప్రవేశిస్తాను. పిల్లలకు అర్థం కాదు. వారి కన్నా కూడా ఆ వినేవారే చాలా చురుకుగా అవుతారు. ఇక్కడ తండ్రి యొక్క సహాయం లభిస్తుంది. ఒకటేమో, నిశ్చయబుద్ధి కలిగి ఉంటారు, రెండవది దృష్టి లభిస్తుంది. బాబా అంటారు, నేను ప్రవేశించగలను, అలాగని నేను సర్వవ్యాపినని కాదు. నన్ను బహురూపి అని ఎందుకంటారు? ఎవరు ఎవరికి పూజ చేస్తారో, వారి సాక్షాత్కారం చేయిస్తాను. సాక్షాత్కారంలో ఎలా చూస్తారంటే, ఎదురుగా వస్తున్నట్లుగా చూస్తారు. విష్ణువు సాక్షాత్కారం జరుగుతుంది, విష్ణువు చైతన్యమవుతారు. తలపై చేతిని పెడతారు. నాకు చతుర్భుజుని సాక్షాత్కారం జరిగిందని అంటారు. కానీ దాని వలన లాభమేమిటి? ఏమీ లేదు. కేవలం నాకు భగవంతుడి సాక్షాత్కారం జరిగింది అని మనస్సు సంతోషిస్తుంది. భక్తిలో చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి, కానీ వీటి ద్వారా సద్గతిని పొందరు. సద్గతిదాత, పతితపావనుడు ఒక్కరేనని పాడుతారు. అది విష్ణువు కాదు. వారేమైనా తండ్రా. తండ్రి ఒక్కరే, వారి కొడుకు కూడా ఒక్కరే, ప్రజాపిత బ్రహ్మా. ప్రజాపిత విష్ణువు లేక శంకరుడు అని ఎప్పుడూ అనరు. ప్రజాపిత ఒక్కరే, తర్వాత వారి ద్వారా బ్రాహ్మణులను దత్తత తీసుకోవడం జరుగుతుంది. పిల్లలకు తెలుసు, మనం మొదట బ్రాహ్మణులుగా అవుతాము, తర్వాత దేవతలుగా అవుతాము. బ్రాహ్మణుల మాల ఏక్యురేట్ (ఖచ్చితం)గా తయారవ్వలేదు ఎందుకంటే మార్పు-చేర్పులు జరుగుతూ ఉంటాయి. కొంతమంది పడిపోతారు, కొంతమంది మరణిస్తూ ఉంటారు. అప్పుడేమి చేస్తారు! వారిని తీసేస్తారా? రుద్ర మాల అంతిమంలోనే ఏక్యురేట్ గా తయారవుతుంది. ఈ మధురాతి-మధురమైన విషయాలను తండ్రే వినిపిస్తారు, ఇతరులెవ్వరికీ తెలియనే తెలియవు. ఓ రామా, ప్రపంచం తయారవ్వనే లేదు… అని అనేవారు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు రామచంద్రుడైతే ఇక్కడి నుండే ప్రారబ్ధాన్ని తీసుకువెళ్తారు, త్రేతాలోకి వెళ్ళి రాజుగా అవుతారు, ప్రపంచం తయారవ్వనే లేదు అని వశిష్టుడు వారికి జ్ఞానమివ్వడానికి వారికి అజ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఇది సృష్టి చక్రము. అన్ని విషయాల్లోనూ తికమకలో ఉన్నారు. ఎవ్వరికీ తెలియదు, అర్థం చేసుకోలేరు కూడా. వారు శివబాబానే మాయం చేసేసారు. శివ జయంతిని జరుపుకుంటారు కూడా, కానీ అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడే నల్లగా అవుతారు. బాబా కూడా, వీరిని నలుపు నుండి తెల్లగా చేయవలసి వచ్చినప్పుడే వస్తారు. శివ జయంతి తర్వాత, వెంటనే శ్రీకృష్ణుని జన్మ జరుగుతుంది. శివబాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు, ఎవరికి? బ్రాహ్మణులకు. ప్రజాపిత బ్రహ్మా యొక్క ముఖవంశావళికి. వారే మళ్ళీ రాజా-రాణులుగా అవుతారు. శివబాబా వెళ్ళిపోతారు, ఆ తర్వాత లక్ష్మీ-నారాయణుల రాజ్యం వస్తుంది, కనుక తండ్రి కృష్ణుడిని అలా తయారుచేసారు. వారేమో తండ్రికి బదులుగా కృష్ణుని పేరు వేసేసారు. కృష్ణుడిని ద్వాపరంలోకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు శివబాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. మీకు తెలుసు, మనం స్వర్గం యొక్క రాజధానిని స్థాపన చేస్తున్నాము, ఇంకా చాలామంది రాకుమార-రాకుమారీలు తయారవుతారు. సంగమము మరియు సత్యయుగము గురించి ఎవరికీ తెలియనే తెలియదు. నేను కల్పం యొక్క సంగమంలోనే వస్తాను. వారేమో యుగే-యుగే అని అన్నారు. అందులోనూ 4 యుగాలు ఉంటాయి. ద్వాపరం తర్వాత కలియుగం ఉంటుంది. మరి ఆ ద్వాపర యుగంలో వచ్చి ఏం చేస్తారు? దిగే కళలోకైతే అందరూ వెళ్ళాల్సిందే. ఎప్పుడైతే ఎక్కే కళ ఉంటుందో, అప్పుడే నా పాత్ర ఉంటుంది, వీరైతే కిందకు దిగాల్సిందే. పిల్లలైన మీరు 84 జన్మలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉన్నతాతి ఉన్నతమైనది బ్రాహ్మణ వర్ణము. బ్రాహ్మణ, తర్వాత దేవత, క్షత్రియ… ఈ వర్ణాలు కూడా భారత్ లోనే మహిమ చేయబడతాయి. విరాట రూప చిత్రాన్ని తయారుచేస్తారు, అందులో బ్రాహ్మణులను మరియు శివుడిని మాయం చేసేసారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. శివబాబా వచ్చి బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. ఇకపోతే, సూక్ష్మవతనవాసి అయిన బ్రహ్మా ప్రజాపితగా ఎలా అవ్వగలరు. మొదట ఈ నిశ్చయం కావాలి, తప్పకుండా వారు తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా. సద్గతిదాత ఒక్కరే అని అంటారు కూడా కానీ వారి నామ, రూప, దేశ, కాలాల గురించి తెలియదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శాంతిసాగరుడైన తండ్రి నుండి శాంతి-సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుని శాంతచిత్తులుగా ఉండాలి. ఎప్పుడూ ఎవరికీ దుఃఖమిచ్చి అశాంతపర్చకూడదు. ఉప్పు నీరు వలె అవ్వకూడదు.

2. తండ్రి సమానంగా అంధులకు చేతి కర్రగా అవ్వాలి. తండ్రి సహాయము తీసుకునేందుకు నిశ్చయబుద్ధి కలవారిగా అయి సేవ చేయాలి.

వరదానము:-

తపస్యలో సఫలతకు విశేషమైన ఆధారము లేక సహజమైన సాధనము – ఒక్కరు అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. తపస్య అనగా ఒక్కరికి చెందినవారిగా అవ్వడము, తపస్య అనగా మనసు-బుద్ధిని ఏకాగ్రం చేయడము, తపస్య అనగా ఏకాంతప్రియులుగా ఉండడము, తపస్య అనగా స్థితిని ఏకరసంగా ఉంచుకోవడము, తపస్య అనగా ప్రాప్తించిన సర్వ ఖజానాలను వ్యర్థము నుండి రక్షించుకోవడము అనగా పొదుపు చేయడము. ఈ ఒక్కరు అనే పాఠాన్ని స్మృతిలో ఉంచుకున్నట్లయితే నిరంతర యోగులుగా, సహజ యోగులుగా అవుతారు. శ్రమ నుండి విముక్తులవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top