22 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 21, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘విశ్వ పరివర్తనలో తీవ్రత తీసుకువచ్చేందుకు సాధనము ఏకాగ్రతా శక్తి మరియు ఏకరస స్థితి’’

♫ వినండి ఆడియో (audio)➤

ఈ రోజు దూరదేశీ తండ్రి తమ దూరదేశీ మరియు దేశీ పిల్లలకు మిలనం యొక్క అభినందనలను ఇచ్చేందుకు వచ్చారు. మీరందరూ కూడా దూరదేశం నుండి వచ్చారు. తండ్రి కూడా దూరదేశం నుండి వచ్చారు. పిల్లలు తండ్రికి అభినందనలను ఇచ్చేందుకు వచ్చారు మరియు తండ్రి పిల్లలకు పదమాల రెట్ల అభినందనలను ఇస్తారు. జరుపుకోవడము అనగా సమానంగా తయారుచేయడము. ప్రపంచంలో కేవలం జరుపుకుంటారు కానీ తండ్రి జరుపుకుంటారు అనగా తయారుచేస్తారు. పిల్లలందరూ, సాకార రూపంలో సమ్ముఖంగా ఉన్నా, ఆకార రూపంలో సమ్ముఖంగా ఉన్నా కానీ పిల్లలందరూ విశ్వం యొక్క మూల-మూలలలో తండ్రి యొక్క వజ్రతుల్యమైన జయంతిని జరుపుకుంటున్నారు. బాప్ దాదా ఆకారీ రూపంలో సమ్ముఖంగా ఉన్న పిల్లలకు కూడా వజ్రతుల్యమైన జయంతి యొక్క వజ్రతుల్యమైన పదమాపదమ అభినందనలు ఇస్తున్నారు. ఈ మహాన్ అవతరణ జయంతిని పిల్లలైన మీరందరూ జరుపుకుంటూ స్వయం కూడా వజ్రతుల్యంగా అయ్యారు. దీనినే జరుపుకోవడము అనగా తయారుచేయడము అని అంటారు. పిల్లల ప్రతి ఒకరి మస్తకంపై పదమాపదమ భాగ్యవంతులుగా అయ్యే సితార మెరుస్తుంది. కనుక జరుపుకుంటూ-జరుపుకుంటూ సదా కోసం భాగ్యవంతులుగా అయ్యారు. ఇటువంటి అలౌకిక జయంతిని మొత్తం కల్పంలో ఇంకెవ్వరూ జరుపుకోరు. మహాన్ ఆత్మల జయంతిని కూడా జరుపుకుంటూ ఉండవచ్చు కానీ ఆ మహాన్ ఆత్మలు జరుపుకునేవారిని మహాన్ గా తయారుచేయరు. ఈ సంగమంలోనే పిల్లలైన మీరు పరమాత్మ జయంతిని జరుపుకుంటూ మహాన్ గా అవుతారు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన ఆత్మలుగా అవుతారు. ఎటువంటి వజ్రతుల్యమైన జీవితాన్ని తయారుచేసుకుంటారంటే, జన్మ-జన్మాంతరాలకు వజ్రాలు మరియు రత్నాలతో ఆడుకుంటూ ఉంటారు. నేటి ఈ స్మృతిచిహ్న దివసము కేవలం తండ్రిది మాత్రమే కాదు, కానీ పిల్లల జన్మదినము కూడా, ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి అవతరిస్తారో, అప్పుడు తండ్రితో పాటు పరివర్తన చెందిన ఆత్మ అయిన బ్రహ్మా దాదా కూడా అవతరిస్తారు. తండ్రి మరియు దాదా, ఇరువురి అవతరణ ఒకేసారి జరుగుతుంది. బ్రాహ్మణులు లేకుండా బాప్ దాదా స్థాపన యొక్క యజ్ఞాన్ని రచించలేరు, అందుకే బాప్ దాదా మరియు బ్రాహ్మణ పిల్లలు ఒకేసారి అవతరిస్తారు. కనుక ఎవరి జన్మదినమని అంటారు – మీదా లేక తండ్రిదా? మీది కూడా కదా! కనుక మీరు తండ్రికి అభినందనలు ఇస్తారు మరియు తండ్రి మీకు అభినందనలు ఇస్తారు.

శివ జయంతిని అనగా పరమాత్మ జయంతిని మహాశివరాత్రి అని ఎందుకు అంటారు? కేవలం శివరాత్రి అని అనరు కానీ మహాశివరాత్రి అని అంటారు ఎందుకంటే ఈ అవతరణ దివసమున శివబాబా, బ్రహ్మాదాదా మరియు బ్రాహ్మణులు మహాన్ సంకల్పం యొక్క వ్రతం తీసుకున్నారు, అదేమిటంటే – విశ్వాన్ని పవిత్రతా వ్రతం ద్వారా మహాన్ శ్రేష్ఠంగా తయారుచేస్తాము. విశేషంగా ఆదిదేవ్ బ్రహ్మా తమ నిమిత్త ఆది బ్రాహ్మణ పిల్లలతో పాటు ఈ మహాన్ వ్రతాన్ని తీసుకోవడానికి నిమిత్తంగా అయ్యారు, కనుక ఇది మహాన్ గా చేస్తామనే వ్రతం తీసుకునే దివ్య దినము, అందుకే మహాశివరాత్రి అని అంటారు. మరియు బ్రాహ్మణ పిల్లలైన మీరు ఈ మహాన్ వ్రతాన్ని తీసుకున్నారు, దీని స్మృతిచిహ్న రూపంలో ఈ రోజు వరకు కూడా భక్తులు వ్రతాలు పెట్టుకుంటారు. ఈ మహాన్ జయంతి ప్రతిజ్ఞ తీసుకునే జయంతి. ఇది ఒకవైపు ప్రత్యక్షమయ్యే జయంతి, మరొకవైపు ప్రతిజ్ఞ తీసుకునే జయంతి. ఆది సమయంలో వీరంతా ఎవరైతే నిమిత్తంగా అయ్యారో, ఆదిదేవ్ తో పాటు ఆదిరత్నాలుగా వెలువడ్డారో, వారందరి ప్రతిజ్ఞకు ప్రత్యక్షఫలంగా మీరంతా ప్రత్యక్షమయ్యారు. చూడండి, ఎక్కడెక్కడ మూల మూలలకు వెళ్ళిపోయారు. ఎన్ని మూలలకు వెళ్ళిపోయారు, తండ్రి మట్టిలో దాగి ఉన్నటువంటి తమ వజ్రతుల్యమైన పిల్లలను వెతికారు కదా. ఇప్పుడైతే విశ్వం యొక్క మూల మూలలోనూ అత్యంత పవిత్రమైన మరియు అత్యంత ఉన్నతమైన వజ్రాలైన మీరు మెరుస్తున్నారు. కనుక ఇది పరమాత్మ జయంతి యొక్క వ్రతానికి మరియు ప్రతిజ్ఞకు ఫలము. మీరందరూ ఇప్పటికీ కూడా నలువైపులా శివబాబా జెండా ఎదురుగా ప్రతిజ్ఞ తీసుకుంటారు కదా. కనుక ఆదిలోని ఈ ఆచారం యొక్క విధిని ఇప్పటివరకు మీరు కూడా చేస్తూ ఉంటారు. ఇది పరమాత్మ జయంతి, దీనిని శివరాత్రి అని కూడా ఉంటారు. రాత్రి అనగా అంధకారము. అంధకారంలో ఎవరైనా వ్యక్తి అయినా లేక వస్తువు అయినా, అవి ఎలా ఉన్నాయో అలా కనిపించవు, అవి ఉంటున్నా కానీ కనిపించవు. తండ్రి అవతరించే సమయానికి మీరు కూడా, మీరు ఎవరో, ఎలా ఉన్నారో, ఆ విధంగా మిమ్మల్ని మీరు కూడా చూసుకోలేకపోయేవారు, అలాగే తండ్రిని కూడా తెలుసుకోలేకపోయేవారు. నేను ఆత్మను – ఇలానే ఉన్నా కానీ జ్ఞానం మరియు అనుభవం యొక్క నేత్రము ద్వారా చూడలేకపోయేవారు. నేత్రాలు ఉన్నప్పటికీ కూడా అంధకారంలో ఉండేవారు. నేత్రాలు యథార్థ కార్యాన్ని చేసేవి కావు. స్పష్టంగా కనిపించేది కాదు. కనుక మీరు కూడా అంధకారంలో ఉండేవారు కదా. తమను తామే చూసుకోలేకపోయేవారు, అందుకే తండ్రి మొదట ఈ అంధకారాన్ని తొలగిస్తారు. కనుక శివరాత్రి అనగా అంధకారాన్ని తొలగించి యథార్థము యొక్క ప్రకాశాన్ని ప్రజ్వలితము చేయడము. అందుకే శివరాత్రి అని అంటూ జరుపుకుంటారు. భక్తి మార్గపు విధులు కూడా మీ యథార్థమైన విధుల యొక్క స్మృతిచిహ్నాలు. ఒకవైపు భక్తుల విధులు ఉన్నాయి మరియు ఇంకొకవైపు పిల్లల యొక్క సంపూర్ణ విధులు ఉన్నాయి, రెండింటినీ చూసి తండ్రి హర్షిస్తారు. మా భక్తులు ఫాలో చేయడంలో ఎంత తెలివైనవారు అని మీరు కూడా హర్షిస్తారు కదా. చివరి జన్మ వరకు కూడా తమ భక్తి యొక్క విధులను నిర్వర్తిస్తూ వస్తారు. ఇదంతా తండ్రి మరియు బిందు రూపులైన మీ యొక్క అద్భుతము. శివబాబాతో పాటు సాలిగ్రామాలు కూడా పూజించబడతాయి. మీ అందరికీ బిందు స్వరూపం యొక్క మహత్వం తెలుసు, అందుకే ఈ రోజు వరకు భక్తులలో శివుని యొక్క అనగా బిందు స్వరూపం యొక్క మహత్వం ఉంది. వారికి కేవలం బిందువు రూపం గురించి తెలుసు, అయితే దాని గురించి యథార్థంగా తెలియదు, వారిదైన పద్ధతిలో వారికి తెలుసు. కానీ మీకు తండ్రి గురించి కేవలం బిందువు రూపంలోనే కాదు, కానీ బిందువుతో పాటు ఎవరైతే సర్వ ఖజానాల సింధువుగా ఉన్నారో, ఆ బిందువుతో పాటు సింధువు రూపం గురించి కూడా తెలుసు. రెండు రూపాలను తెలుసుకున్నారు కదా? సింధువు స్వరూపాన్ని తెలుసుకుని మీరు కూడా మాస్టర్ సింధువులుగా అయ్యారు. మీలో ఎన్ని ఖజానాలు నిండి ఉన్నాయి – లెక్క పెట్టగలరా! లెక్కలేనన్ని, అపారమైన మరియు అవినాశీ ఖజానాలు. అందరూ మాస్టర్ సింధువులుగా అయ్యారు కదా లేక ఇప్పుడు అవ్వాలా?

తపస్యా సంవత్సరంలో ఏం చేస్తారు? తపస్య అనగా ఏ సంకల్పం చేసినా కానీ, అది దృఢత్వంతో చేయడము. తపస్య అనగా ఏకాగ్రత మరియు దృఢత. యోగీ జీవితంలోనైతే ఇప్పుడు కూడా ఉన్నారు. మీరందరూ యోగీ జీవితం కలవారే కదా? లేదా 8 గంటలు, 6 గంటలు లేక కొన్ని గంటలు మాత్రమే యోగం జోడించేవారా? జీవితమే యోగీ జీవితము, మరి ప్రత్యేకంగా తపస్యా సంవత్సరం అని ఎందుకు పెట్టుకున్నారు? బాప్ దాదా పిల్లలందరినీ యోగీ జీవితం కల యోగీ ఆత్మల రూపంలో చూస్తారు మరియు ఉండడం కూడా యోగీ జీవితంలోనే ఉన్నారు. వేరే జీవితమైతే సమాప్తమైపోయింది. భ్రమిస్తున్న భోగీ జీవితంతో అలసిపోయి, నిరాశ చెంది, ఆలోచించి అర్థం చేసుకుని యోగీగా అయ్యారు. ఆలోచించి, అర్థం చేసుకుని అలా అయ్యారా లేక ఎవరో చెప్పడం వలన అలా అయ్యారా? అనుభవం చేసి అలా తయారయ్యారా లేక కేవలం అనుభవాన్ని విని అలా తయారయ్యారా? అనుభవీలుగా అయి యోగీగా అయ్యారా లేక కేవలం వినడంతో, చూడడంతో మంచిగా అనిపించిందా? కేవలం చూసి వ్యాపారం చేసారా లేక విని వ్యాపారం చేసారా? ఎక్కడా ఎవరి ద్వారా మోసపోలేదు కదా? బాగా చూసుకున్నారా? ఇప్పుడు కూడా చూడండి. ఇంద్రజాలమేమీ అంటుకోలేదు కదా? మూడు నేత్రాలను తెరిచి వ్యాపారం చేసారా? ఎందుకంటే బుద్ధి కూడా నేత్రము. ఈ రెండు నేత్రాలు మరియు బుద్ధి యొక్క నేత్రము, మూడింటినీ తెరిచి వ్యాపారం చేసారు. అందరూ పక్కాగా ఉన్నారా?

పిల్లలందరూ మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తారు. వారంటారు – బాబా, మేమైతే మీ వారమే, ఇంకెక్కడికీ అయితే వెళ్ళనే వెళ్ళము. మరియు జ్ఞానీ-యోగీ జీవితమైతే చాలా బాగా అనిపిస్తుంది కానీ కొద్ది-కొద్దిగా ఏదో ఒక విషయంలో సహనం చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో మనసు మరియు బుద్ధి అలజడిలోకి వచ్చేస్తాయి, ఇది ఎంతవరకని జరుగుతుంది, ఎలా జరుగుతుంది…? మధ్య మధ్యలో ఏదైతే అలజడి కలుగుతుందో – అది స్వయంతోనైనా లేక సేవతోనైనా లేక సహచరులతోనైనా కావచ్చు – ఈ అలజడి నిరంతరంలో అంతరాన్ని తీసుకువస్తుంది. కావున సహన శక్తి యొక్క పర్సంటేజ్ కొద్దిగా తగ్గిపోతుంది. వాస్తవానికి పక్కాగా ఉన్నారు కానీ పక్కాగా ఉన్నవారిని కూడా అప్పుడప్పుడు ఈ విషయాలు కదిలేలా చేస్తాయి. కనుక తపస్యా సంవత్సరం అనగా సర్వ గుణాలలో, సర్వ శక్తులలో, సర్వ సంబంధాలలో, సర్వ స్వభావ-సంస్కారాలలో 100 శాతం పాస్ అవ్వడము. ఇప్పుడు పాస్ అయ్యారు కానీ ఫుల్ పాస్ కాలేదు. ఒకటేమో పాస్ అవ్వడము, రెండవది ఫుల్ పాస్ అవ్వడము, మూడవది పాస్ విత్ ఆనర్ గా అవ్వడము. కనుక తపస్యా సంవత్సరంలో ఒకవేళ పాస్ విత్ ఆనర్ గా కొద్దిమందే తయారైనా కానీ, ఫుల్ పాస్ అయితే అందరూ అవ్వగలరు. మరియు ఫుల్ పాస్ అయ్యేందుకు అన్నింటికన్నా సహజమైన సాధనం ఏమిటంటే – ఏ పరీక్ష వచ్చినా సరే… ఈ తపస్యా సంవత్సరంలో కూడా పరీక్షలు వస్తాయి, అవి రావని కాదు, కానీ పరీక్షలుగా భావించి పాస్ అవ్వండి. విషయాన్ని విషయంగా భావించకండి, పరీక్షగా భావించండి. పరీక్షలో ప్రశ్నల విస్తారంలోకి వెళ్ళరు – ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు చేసారు? పాస్ అవ్వాలని అనుకుని పరీక్షను దాటేస్తారు. కనుక పరీక్షగా భావించి పాస్ అవ్వండి. ఇదేమిటి ఇలా జరిగింది? ఇలా జరుగుతుందా ఏమిటి? లేదా మీ బలహీనత విషయంలో కూడా, ఇదైతే జరుగుతూనే ఉంటుంది అని ఆలోచించకండి. స్వయం కోసం ఏమని ఆలోచిస్తారంటే – ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఈ మాత్రమైతే జరుగుతుంది మరియు ఇతరుల కోసం ఏమని ఆలోచిస్తారంటే – వీరు ఎందుకిలా చేసారు, ఏమిటిలా చేసారు. ఈ విషయాలన్నింటినీ పరీక్షగా భావించి ఫుల్ పాస్ అయ్యేటువంటి లక్ష్యం పెట్టుకుని పాస్ అవ్వండి. పాస్ అవ్వాలి (ఉత్తీర్ణులవ్వాలి), పాస్ చేయాలి (దాటాలి) మరియు తండ్రికి దగ్గరగా ఉండాలి, అప్పుడు ఫుల్ పాస్ అవుతారు. అర్థమైందా.

ఇప్పుడు మెజారిటీ యొక్క రిజల్టులో ఏం కనిపించిందంటే, చాలా విషయాలలోనైతే మంచి రీతిలో పాస్ అయ్యారు. కేవలం తమ పాత స్వభావాలు మరియు సంస్కారాలు అప్పుడప్పుడు కొత్త జీవితంలో ఇమర్జ్ అయిపోతాయి. స్వయం మరియు ఇతరుల స్వభావ-సంస్కారాల మధ్యన కూడా ఘర్షణ జరుగుతుంది. తమ బలహీన సంస్కారం ఇతరుల సంస్కారంతో ఘర్షణ పడుతుంది. ఈ బలహీనత ఇప్పుడు విశేష లక్ష్యాన్ని చేరుకోవడంలో విఘ్నం వేస్తుంది. ఫుల్ పాస్ కు బదులుగా పాస్ మార్కులను ఇప్పిస్తుంది. తమ స్వభావ-సంస్కారాలను సంకల్పాలలోకి లేక కర్మలలోకి తీసుకురాకండి, అలాగే ఇతరుల స్వభావ-సంస్కారాలతో ఘర్షణ పడకండి. రెండింటికీ సహన శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి యొక్క అవసరముంది. ఈ బలహీనతే ఫుల్ పాస్ కు సమీపంగా రానివ్వదు. మరియు ఇదే కారణం వలన అక్కడక్కడ నిర్లక్ష్యము, అక్కడక్కడ సోమరితనము వచ్చేస్తుంది. తపస్యా సంవత్సరంలో మనసు-బుద్ధిని ఏకాగ్రం చేయండి అనగా ఒకే సంకల్పంలో ఉండండి – నేను ఫుల్ పాస్ అవ్వాల్సిందే. ఒకవేళ మనసు, బుద్ధి చంచలమైనా సరే, దృఢత్వంతో మళ్ళీ వాటిని ఏకాగ్రం చేయండి. చేయాల్సిందే, అవ్వాల్సిందే. ఈ బలహీనతలన్నీ ఏవైతే ఉన్నాయో, వాటిని తపస్య యొక్క యోగాగ్నిలో భస్మం చేయండి. యోగాన్ని ప్రజ్వలితమయిందా? లగనమనే అగ్నిలో ఇప్పుడు కూడా ఉంటారు కానీ అప్పుడప్పుడు ఆ అగ్ని శాతం కాస్త తగ్గిపోతుంది. ఆరిపోదు, కానీ తగ్గిపోతుంది. తీవ్రమైన అగ్నిలో ఏ వస్తువును వేసినా, అది పరివర్తన అన్నా అవుతుంది లేక భస్మమన్నా అవుతుంది. పరివర్తన చేయటానికైనా మరియు భస్మం చేయటానికైనా రెండింటికీ తీవ్ర అగ్ని కావాలి. యోగము అగ్ని. లగనమనే అగ్ని కూడా వెలిగి ఉంది కానీ సదా తీవ్రంగా ఉండాలి. ఒక్కోసారి తీవ్రంగా, ఒక్కోసారి తక్కువగా ఉండకూడదు. ఏ విధంగానైతే ఇక్కడ స్థూల అగ్నిలో కూడా ఒకవేళ ఏదైనా వస్తువును మంచిగా తయారుచేయాలనుకుంటే మరియు అనుకున్న సమయానికి తయారుచేయాలనుకుంటే, ఆ అగ్నిని దానికి తగిన రూపంలో ఉంచుతారు, అప్పుడు ఆ వస్తువు సమయానికి మంచి రీతిలో తయారవుతుంది. ఒకవేళ మధ్యలో అగ్ని ఆరిపోతే సమయానికి వస్తువు తయారవ్వగలదా? తయారవ్వచ్చు కానీ సమయానికి అవ్వదు. అలాగే మీ యోగాగ్ని కూడా మధ్యమధ్యలో ఢీలా అయిపోతే సంపన్నంగా అవుతారు కానీ చివర్లో అవుతారు. చివర్లో సంపన్నమయ్యేవారికి ఫాస్ట్ గా మరియు ఫస్ట్ రాజ్య భాగ్యం యొక్క అధికారం లభించజాలదు. మీ అందరి లక్ష్యము మొదటి జన్మలో రాజ్య భాగ్యాన్ని తీసుకోవడమా లేక రెండవ-మూడవ జన్మలో వస్తారా? మొదటి జన్మలో రావాలి కదా?

తపస్యా సంవత్సరం అనగా ఫాస్ట్ పురుషార్థం చేసి ఫస్ట్ జన్మలో ఫస్ట్ నంబరు ఆత్మలతో పాటు రాజ్యంలోకి రావడము. ఇంటికి వారితోపాటు వెళ్ళాలి కదా? మళ్ళీ రాజ్యంలోకి కూడా బ్రహ్మాబాబాతో పాటు రావాలి. కనుక తపస్యా సంవత్సరాన్ని ఎందుకు పెట్టారో అర్థమయిందా? ఏకాగ్రతా శక్తిని పెంచుకోండి. ఇప్పుడు కూడా వద్దనుకున్నా కానీ వ్యర్థం నడుస్తుంది. కొన్ని-కొన్ని సమయాలలో శుద్ధ-శ్రేష్ఠ సంకల్పాల వైపు కంటే వ్యర్థం వైపు బరువు ఎక్కువ అవుతుంది. తపస్య అనగా వ్యర్థ సంకల్పాల సమాప్తి ఎందుకంటే ఈ సమాప్తినే సంపూర్ణతను తీసుకువస్తుంది. సమాప్తి లేకుండా సంపూర్ణత రాదు. కనుక ఈ రోజు నుండి తపస్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నారు. ఉల్లాస-ఉత్సాహాలకు బాప్ దాదా అభినందనలను ఇస్తారు. నాలుగు సబ్జెక్టులలోనూ ఫుల్ పాస్ అయ్యే మార్కులు తీసుకోవాలి. నావి మూడు సబ్జెక్టులైతే బాగున్నాయి, కేవలం ఒకదానిలోనే లోటు ఉంది అని అనుకోకండి. అలా ఉంటే ఫుల్ పాస్ అవుతారా? అవ్వరు, అయినా కూడా పాస్ అయినవారి లిస్టులోకి అయితే వస్తారు. ఫుల్ పాస్ అనగా నాలుగు సబ్జెక్టులలోనూ ఫుల్ మార్కులు ఉండాలి. సదా ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉండాలి, వారు మీ స్థితిని కదిలించేందుకు ప్రయత్నించినా కానీ అకళ్యాణం చేసేవారి పట్ల కూడా కళ్యాణ భావన, కళ్యాణ దృష్టి, కళ్యాణ వృత్తి, కళ్యాణమయ కృతి ఉండాలి. ఇటువంటివారినే కళ్యాణకారి ఆత్మ అని అంటారు. శివుడు అనగా కూడా కళ్యాణకారి అని అర్థం కదా? కనుక శివజయంతి అనగా కళ్యాణకారి భావన. కళ్యాణం చేసేవారికి కళ్యాణం చేయడము, ఇదైతే అజ్ఞానులు కూడా చేస్తారు. మంచివారితో మంచిగా నడుచుకోవడమనేది అందరికీ తెలుసు. కానీ అకళ్యాణ వృత్తి కలవారిని తమ కళ్యాణ వృత్తితో పరివర్తన చేయండి లేదా క్షమించండి. పరివర్తన చేయలేకపోయినా కానీ, క్షమించడమైతే క్షమించగలరు కదా! మాస్టర్ క్షమాసాగరులు కదా! కనుక మీ క్షమ ఆ ఆత్మకు శిక్షణగా అవుతుంది. ఈ రోజుల్లో శిక్షణ ఇవ్వడంతో కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోరు. క్షమించినట్లయితే అది శిక్షణగా అవుతుంది. క్షమ అనగా శుభభావన యొక్క ఆశీర్వాదాలను ఇవ్వడము, సహయోగాన్ని ఇవ్వడము. శిక్షణ ఇచ్చే సమయం ఇప్పుడు గడిచిపోయింది. ఇప్పుడు స్నేహం ఇవ్వండి, గౌరవం ఇవ్వండి, క్షమించండి. శుభభావనను పెట్టుకోండి, శుభకామనను పెట్టుకోండి – ఇదే శిక్షణ యొక్క విధి. ఆ విధి ఇప్పుడు పాతదైపోయింది. మరి కొత్త విధి వచ్చు కదా? తపస్యా సంవత్సరంలో ఈ కొత్త విధితో సర్వులను ఇంకా సమీపంగా తీసుకురండి. ఇంతకుముందు వినిపించాము కదా, కొన్ని పూసలు తయారయ్యాయి కూడా, కానీ మాల ఇప్పుడింకా తయారవ్వలేదు. దారం కూడా ఉంది, పూసలు కూడా ఉన్నాయి కానీ పూస, పూసకు సమీపంగా లేదు, అందుకే మాల తయారవ్వలేదు. తమదైన పద్ధతితో పూస తయారై ఉంది కానీ సంగఠనలో, సామీప్యతలో తయారుగా లేదు. కనుక తపస్యా సంవత్సరంలో తండ్రి సమానంగానైతే అవ్వాల్సిందే కానీ పూస, పూసకు సమీపంగా కూడా రావాలి. అర్థమయిందా. ఇకపోతే, యోగీలుగా ఉండేవారు, యోగీలుగా ఉన్నారు, సదా యోగీ జీవితంలోనే ఉండాలి. డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని అతీతంగా-ప్రియంగా అయి చూస్తూ నడవండి. డ్రామాలోని ప్రతి దృశ్యం ప్రియమైనది. ప్రపంచానికి ఏదైతే అప్రియమైన దృశ్యమూ, అది మీకు ప్రియమైనది. ఏది జరిగినా సరే, అందులో ఏదో రహస్యము నిండి ఉంటుంది. రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే ఎప్పుడూ ఏ విషయంలోనూ, ఏ దృశ్యంలోనూ అసంతృప్తి చెందరు. రహస్యం తెలిసినవారు అసంతృప్తి చెందరు, రహస్యం తెలియనివారు అసంతృప్తి చెందుతారు.

డబల్ విదేశీయులు కూడా ఈ సారి శివ జయంతిని జరుపుకోవడానికి సమయానికి చేరుకున్నారు. వెళ్ళాల్సిందే అని దృఢ నిశ్చయం పెట్టుకున్నారు కనుక చేరుకున్నారు కదా? వెళ్ళాలా, వద్దా – ఇలా ఆలోచించినవారు ఉండిపోయారు. ఇప్పుడిది ఏమీ కానే కాదు, ఇప్పుడింకా జరగనున్నది. ఇప్పుడింకా ప్రకృతి ఫుల్ ఫోర్స్ తో అలజడిని ప్రారంభించలేదు. చేస్తుంది, మళ్ళీ మిమ్మల్ని చూసి కొద్దిగా చల్లబడిపోతుంది. నా యజమానులు ఇంకా తయారవ్వలేదు అని అది కూడా భయపడుతుంది. ఎవరికి దాసిగా అవ్వాలి? నిర్భయులు కదా? భయపడేవారైతే కాదు కదా? ప్రపంచంవారు మరణించడానికి భయపడతారు మరియు మీరు మరణించే ఉన్నారు. పాత ప్రపంచం నుండి మరణించి ఉన్నారు కదా? కొత్త ప్రపంచంలో జీవిస్తారు, పాత ప్రపంచం నుండి మరణించి ఉన్నారు, కనుక మరణించినవారికి మరణమంటే భయమేముంటుంది? మరియు ట్రస్టీలు కదా? ఒకవేళ ఏ రకమైనా నాది అన్న భావన ఉన్నా కానీ, మాయ పిల్లి మ్యావ్, మ్యావ్ అని అంటుంది. మై ఆవూ, మై ఆవూ (నేను వస్తాను, నేను వస్తాను). మీరు ఉన్నదే ట్రస్టీలు. శరీరం కూడా నాది కాదు. మనుష్యులకు మరణించే చింత ఉంటుంది లేక వస్తువులది లేక పరివారం యొక్క చింత ఉంటుంది. మీరైతే ఉన్నదే ట్రస్టీలుగా. అతీతంగా ఉన్నారు కదా లేక కొద్ది-కొద్దిగా మోహం ఉందా? దేహాభిమానం ఉన్నట్లయితే కొద్ది-కొద్దిగా మోహం ఉంటుంది, అందుకే తపస్య అనగా జ్వాలా స్వరూపము, నిర్భయత్వము. అచ్ఛా.

ప్రియమైన దాదీలు ఇరువురు వింటున్నారు, చూస్తున్నారు. కొంత నవీనతను చూడాలి కదా. బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, ఒకటేమో వాణి సేవ, మరొకటి, ఫరిశ్తా మూర్తి మరియు శక్తిశాలి స్నేహమయి దృష్టితో కూడిన సేవ. కొంత సమయం వీరికి ఈ సేవ కోసం పాత్ర లభించింది. ఆది నుండి మొదలుకొని వాణి మరియు కర్మల యొక్క సేవలనైతే చేస్తూనే ఉన్నారు. ఈ విధితో కూడిన సేవ కూడా డ్రామాలో ఉంది. అంతిమంలో ఈ సేవే మిగిలిపోతుంది. ఈ పాత్ర కొద్ది సమయం కోసం లభించింది. ఎంతైనా ప్రియమైన పిల్లలు కదా. వీరి లెక్కాచారం సమాప్తమవ్వడంలో కూడా సేవ ఉంది. లెక్కాచారం కేవలం నిమిత్తము కానీ ఇందులో ఉన్న రహస్యం సేవ. అనంతమైన ఆటలో ఇది కూడా ఒక అద్భుతమైన ఆట. ఇరువురి పాత్ర కూడా నవీనతతో కూడినది. వీరు త్వరత్వరగా లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుని సంపన్నత మరియు సంపూర్ణతకు సమీపంగా వెళ్తున్నారు. ఒంటరిగా వెళ్ళరు అని ఎవ్వరూ ఆలోచించకండి. ప్రతి ఒక్కరూ సమాప్తమైతే చేసుకోవాల్సిందే కానీ కొందరు కేవలం సమాప్తం చేసుకుంటారు, కొందరు సమాప్తం చేసుకుంటూ కూడా సేవ చేస్తారు. అందరూ విజయులుగా అయ్యారు కదా? అందరి ఆశీర్వాదాలనే మందు కూడా శూలం నుండి ముల్లులా చేసేస్తుంది. లెక్కాచారం యొక్క ప్రభావంలోకి రాలేదు. ఇరువురు బాగైపోయారు. కేవలం పథ్యంలో ఉన్నారు. విశ్రాంతి కూడా పథ్యం వంటిదే. ఏ విధంగానైతే భోజనంలో పథ్యం ఉంటుందో, అలా ఇది నడవడము, తిరగడము, మాట్లాడడము యొక్క పథ్యము. స్నేహం ఏం చేయలేదు! స్నేహము రాతిని నీరుగా చేయగలదు అన్న సామెత ఉంది, అటువంటప్పుడు ఈ అనారోగ్యాన్ని మార్చలేదా? మారిపోయింది కదా! గుండె అనారోగ్యం మారిపోయింది. రాతి నుండి నీరుగా అయితే అయిపోయింది కదా! కావున ఇది మీ అందరి ప్రేమ. ఇప్పుడిక కేవలం నీరు మిగిలింది, రాయి సమాప్తమైపోయింది. విశ్రాంతిలో ఉండడం ద్వారా ఇరువురి ముఖాలు మెరుస్తున్నాయి. పరివారం యొక్క ప్రేమ కూడా చాలా సహాయాన్ని అందిస్తుంది. అచ్ఛా.

నలువైపులా ఉన్న సర్వ విశ్వ కళ్యాణం యొక్క శ్రేష్ఠ భావనను పెట్టుకునేవారు, నలువైపుల యొక్క ఇటువంటి దృఢ సంకల్పం చేసేవారు, తపస్య ద్వారా స్వయాన్ని, విశ్వాన్ని పరివర్తన చేసేవారు, ఏకాగ్రతా శక్తితో ఏకరస తీవ్ర స్థితిలో ఉండేవారు, ఇటువంటి తపస్వీ ఆత్మలకు, స్నేహీ ఆత్మలకు, సదా తండ్రితో పాటు ఉండే ఆత్మలకు, సదా భిన్న-భిన్న విధులతో సేవలో సహచరులుగా ఉండే పిల్లలకు మహా-పరమాత్మ జయంతికి అభినందనలను మరియు ప్రియస్మృతులను స్వీకరించండి మరియు నమస్తే.

వరదానము:-

ఏ పిల్లలైతే అష్ట శక్తులతో సంపన్నంగా ఉన్నారో, వారు ప్రతి కర్మలో సమయమనుసారంగా, పరిస్థితి అనుసారంగా ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగిస్తారు. అష్ట శక్తులు వారిని ఇష్టులుగా మరియు అష్ట రత్నాలుగా తయారుచేస్తాయి. ఇటువంటి అష్ట శక్తి సంపన్నులైన ఆత్మలు ఎటువంటి సమయమో, ఎటువంటి పరిస్థితో అటువంటి స్థితిని సహజంగా తయారుచేసుకుంటారు. వారి ప్రతి అడుగులో సఫలత ఇమిడి ఉంటుంది. ఎటువంటి పరిస్థితి అయినా వారిని శ్రేష్ఠ స్థితి నుండి కిందకు దించలేదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top