21 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 20, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - శ్రీమతములో ఎప్పుడూ మన్మతాన్ని మిక్స్ చేయకండి, మన్మతముపై నడుచుకోవడం అనగా తమ భాగ్యానికి అడ్డు గీత గీసుకోవడము’’

ప్రశ్న: -

పిల్లలు తండ్రి పట్ల ఏ ఆశను పెట్టుకోకూడదు?

జవాబు:-

చాలామంది పిల్లలు అంటారు, బాబా, మా అనారోగ్యాన్ని బాగు చేయండి, కాస్త కృప చూపించండి. బాబా అంటారు, ఇవైతే మీ పాత ఇంద్రియాలు. ఎంతో కొంత కష్టమైతే తప్పకుండా ఉంటుంది, ఇందులో బాబా ఏం చేయగలరు. ఎవరైనా మరణిస్తే, దివాలా తీస్తే, ఇందులో బాబాను కృప చూపమని ఏమి అడుగుతారు, అదైతే మీ లెక్కాచారము. అయితే, యోగబలంతో మీ ఆయుష్షు పెరగవచ్చు, ఎంత వీలైతే అంత యోగబలాన్ని ఉపయోగించండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవు రాత్రిని పోగొట్టుకున్నావు… (తూనే రాత్ గవాయీ…)

ఓంశాంతి. పిల్లలకు ఓం యొక్క అర్థాన్ని అయితే తెలియపరిచారు. ఓం అంటే భగవంతుడు అని కాదు. ఓం అనగా అహమ్ అనగా నేను. నేను ఎవరు? ఇవి నా ఇంద్రియాలు. తండ్రి కూడా అంటారు, నేను ఆత్మను, కానీ నేను పరమ ఆత్మను అనగా పరమాత్మను. వారు పరంధామ నివాసి, పరమపిత పరమాత్మ. వారంటారు, నేను ఈ శరీరానికి యజమానిని కాను. నేను రచయితగా, డైరెక్టరుగా, పాత్రధారిగా ఎలా అవుతాను – ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. నేను తప్పకుండా స్వర్గ రచయితను. సత్యయుగాన్ని రచించి కలియుగ వినాశనాన్ని తప్పనిసరిగా చేయించాల్సిందే. నేను చేసేవాడిని-చేయించేవాడిని కావున నేను చేయిస్తాను. ఇలా ఎవరంటారు? పరమపిత పరమాత్మ. ఇంకా, నేను బ్రహ్మాండానికి యజమానిని అని అంటారు. తండ్రితో పాటు ఉన్నప్పుడు పిల్లలైన మీరు కూడా బ్రహ్మాండానికి యజమానులే. దానిని స్వీట్ హోమ్ అని కూడా అంటారు. మళ్ళీ ఎప్పుడైతే సృష్టి రచించబడుతుందో అప్పుడు మొదట బ్రాహ్మణులను రచిస్తారు, వారు తర్వాత దేవతలుగా అవుతారు. వారు పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. శివబాబా సదా పూజ్యులు. ఆత్మకైతే పునర్జన్మ తప్పకుండా తీసుకోవాల్సే ఉంటుంది. ఇకపోతే, 84 లక్షల జన్మలైతే ఉండలేవు. తండ్రి అంటారు, మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను తెలియజేస్తాను. 84 జన్మల చక్రమని అంటారు, 84 లక్షల జన్మలు కాదు. ఈ చక్రాన్ని స్మృతి చేయడంతో మీరు చక్రవర్తీ రాజులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. ఎప్పటివరకైతే ఈ విషయం బుద్ధిలోకి రాదో అప్పటివరకు అర్థం చేసుకోరు. ఇది పాత శరీరము, పాత ప్రపంచము. ఈ దేహమైతే సమాప్తం అవ్వనున్నది. మీరు మరణిస్తే మీకు సంబంధించినంతవరకు ప్రపంచం కూడా మరణించినట్లే అన్న నానుడి కూడా ఉంది. ఇది పురుషార్థం చేసేందుకు కొద్దిపాటి సంగమయుగ సమయము. పిల్లలు అడుగుతారు, బాబా, ఈ జ్ఞానం ఎప్పటి వరకు నడుస్తుంది? ఎప్పటివరకైతే భవిష్య దైవీ రాజధాని స్థాపన అవ్వదో, అప్పటివరకు వినిపిస్తూనే ఉంటారు. పరీక్ష పూర్తి అయిన తర్వాత కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు. అప్పటివరకు శరీరానికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ శారీరక రోగాలు కూడా కర్మభోగమే. బాబా యొక్క ఈ శరీరం ఎంత ప్రియమైనది. అయినా కూడా దగ్గు మొదలైన వచ్చినప్పుడు బాబా అంటారు, మీ ఈ ఇంద్రియాలు పాతవైపోయాయి అందుకే ఇబ్బంది కలుగుతుంది. ఇందులో బాబా సహాయం చేయాలి అనేటువంటి ఆశను పెట్టుకోకూడదు. దివాలా తీసారు, అనారోగ్యం పాలయ్యారు, తండ్రి అంటారు – ఇది ఈ మీ లెక్కాచారమే. అయినప్పటికీ యోగంతో ఆయుష్షు పెరుగుతుంది, మీకే లాభం కలుగుతుంది. మీ వైపు నుండి కృషి చేయండి, కృప చూపమని అడగకండి. తండ్రి స్మృతిలో కళ్యాణం ఉంది. ఎంత వీలైతే అంత యోగబలాన్ని ఉపయోగించండి. నన్ను మీ కనురెప్పలలో దాచుకోండి… అని పాడుతారు కదా. ప్రియమైన వస్తువును కంటిపాప అని, ప్రాణ ప్రదమైనది అని అంటారు. ఈ తండ్రి అయితే చాలా ప్రియమైనవారు, కానీ గుప్తంగా ఉన్నారు, అందుకే ప్రేమ పూర్తిగా నిలవదు. లేదంటే వారి పట్ల ఎంతటి ప్రేమ ఉండాలంటే ఇక అడగకండి. పిల్లలనైతే తండ్రి కనురెప్పలలో దాచుకుంటారు. కనురెప్పలు అంటే ఈ నేత్రాలు కాదు, ఈ జ్ఞానాన్ని మాకు ఎవరు ఇస్తున్నారు అనేది బుద్ధిలో గుర్తుంచుకోవాలి. అతి ప్రియమైన నిరాకార తండ్రి, వారికే మహిమ ఉంది – పతితపావనుడు, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, వారిని మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు. అటువంటప్పుడు ప్రతి మనిషి జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు అయి ఉండాలి. కానీ అలా లేరు, ప్రతి ఆత్మకు తన అవినాశీ పాత్ర లభించి ఉంది. ఇవి చాలా గుప్తమైన విషయాలు. మొదట అయితే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. పారలౌకిక తండ్రి స్వర్గం యొక్క రచనను రచిస్తారు. సత్యయుగ సత్య ఖండంలో దేవీ-దేవతల రాజ్యం ఉంటుంది, ఆ కొత్త ప్రపంచాన్ని తండ్రి రచిస్తారు. ఏ విధంగా రచిస్తారు అనేది పిల్లలైన మీకు తెలుసు. వారంటారు, నేను పతితులను పావనంగా చేయడానికే వస్తాను. కనుక పతిత సృష్టిలోకి వచ్చి పావనంగా చేయాల్సి ఉంటుంది కదా. బ్రహ్మా ద్వారా స్థాపన అని గాయనం కూడా ఉంది. కనుక వారి ముఖం ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు మరియు శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తారు. పిల్లలతో అంటారు, నేను మీకు ఎటువంటి కర్మలు నేర్పిస్తానంటే, అక్కడ మీ కర్మలు వికర్మలుగా అవ్వవు ఎందుకంటే అక్కడ మాయ లేనే లేదు, అందుకే మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. ఇక్కడ మాయ ఉంది అందుకే మీ కర్మలు వికర్మలుగానే అవుతాయి. మాయా రాజ్యంలో ఏం చేసినా తప్పుగానే చేస్తారు.

ఇప్పుడు తండ్రి అంటారు, నా ద్వారా మీరు అంతా తెలుసుకుంటారు. వారు పరమాత్మను కలుసుకునేందుకు సాధన మొదలైనవి చేస్తారు, అనేక రకాల హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. ఇక్కడైతే ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, అంతే. నోటితో శివ శివ అని కూడా అనకూడదు. ఇది బుద్ధి యొక్క యాత్ర. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా రుద్రమాలలో పూసగా అవుతారు, తండ్రికి సమీపంగా వస్తారు. శివబాబా మెడలో హారంగా అవ్వడము లేక రుద్ర మాలలో సమీపంగా రావడము, ఇది దానికి సంబంధించిన రేస్. చార్టు పెట్టాలి, అప్పుడు అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. దేహం కూడా గుర్తుకు రాకూడదు, అటువంటి అవస్థ కావాలి.

తండ్రి అంటారు, ఇప్పుడు మీకు వజ్ర సమానమైన జన్మ లభించింది. కావున నా ప్రియమైన పిల్లలూ, నిద్రను జయించే పిల్లలూ, తక్కువలో తక్కువ 8 గంటలు నా స్మృతిలో ఉండండి. ఇప్పుడింకా ఆ అవస్థ రాలేదు. చార్టు పెట్టండి, నేను రోజంతటిలో ఎంత సమయం స్మృతి యాత్రలో నడుస్తున్నాను, ఎక్కడ నిలిచిపోవడం లేదు కదా. తండ్రిని స్మృతి చేయడంతో వారసత్వం కూడా బుద్ధిలో ఉంటుంది. ప్రవృత్తి మార్గం కదా. తండ్రి స్థాపన చేసినటువంటి స్వర్గం యొక్క దేవీ-దేవతా ధర్మము నంబరువన్. తండ్రి రాజయోగాన్ని నేర్పించి, స్వర్గానికి యజమానులుగా చేస్తారు, తర్వాత ఈ జ్ఞానం ప్రాయః లోపమైపోతుంది. అటువంటప్పుడు ఈ జ్ఞానం శాస్త్రాలలోకి ఎక్కడ నుండి వచ్చింది? రామాయణం మొదలైనవాటిని తర్వాత తయారుచేసారు. మొత్తం ప్రపంచమంతా లంకయే. రావణ రాజ్యం కదా. కోతి వలె ఉన్న మనుష్యులను పవిత్రంగా మందిర యోగ్యులుగా తయారుచేసి రావణ రాజ్యాన్ని సమాప్తం చేస్తారు. సద్గతిదాత తండ్రి సద్గతి కోసం జ్ఞానాన్ని ఇస్తారు. వారికి అంతిమంలో సద్గతి చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలూ, ఇతరులందరినీ విడిచి ఒక్క నా నుండి మాత్రమే వినండి. నేను ఎవరిని, మొదట ఈ నిశ్చయం కావాలి. నేను మీ యొక్క ఆ తండ్రినే, నేను మీకు మళ్ళీ అన్ని వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తాను. ఈ జ్ఞానాన్ని అయితే తండ్రి సమ్ముఖంలో ఇస్తారు. ఇక ఆ తర్వాత వినాశనమైపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే ద్వాపరంలో వెతుకుతారో, అప్పుడు అవే గీత మొదలైన శాస్త్రాలు బయటకు వస్తాయి. భక్తి మార్గం కోసం తప్పకుండా అదే సామాగ్రి కావాలి. వాటిని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇతరుల జ్ఞానమైతే పరంపరగా కొనసాగుతూ వస్తుంది. ఈ జ్ఞానమైతే ఇక్కడే సమాప్తమైపోతుంది. తర్వాత ఎప్పుడైతే వెతుకుతారో, అప్పుడు ఇవే శాస్త్రాలు మొదలైనవి చేతికి వస్తాయి, అందుకే వాటిని అనాది అని అంటారు. ద్వాపరంలో అన్నీ అవే శాస్త్రాలు వెలువడుతాయి. అందుకే నేను వచ్చి మళ్ళీ అన్నింటి యొక్క సారాన్ని వినిపిస్తాను. మళ్ళీ అదే పునరావృతమవుతుంది. కొంతమంది పునరావృతం అవ్వడానిని నమ్ముతారు, కొంతమంది ఇంకేదో చెప్తారు. అనేక మతాలు ఉన్నాయి. ప్రపంచం యొక్క చరిత్ర-భౌగోళికాలు అయితే పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. వారైతే కల్పం యొక్క ఆయువును లక్షల సంవత్సరాలు చేసేసారు. మహాభారత యుద్ధం జరిగి 5 వేల సంవత్సరాలు అయ్యిందని కూడా చాలామంది అంటారు. ఇది మళ్ళీ అదే యుద్ధము. కావున తప్పకుండా గీతా భగవంతుడు కూడా ఉంటారు! ఒకవేళ అది కృష్ణుడు అయితే, మరి ఆ నెమలి పింఛ ముకుటధారి ఉండాలి. కృష్ణుడైతే సత్యయుగంలోనే ఉంటారు. అదే కృష్ణుడైతే ఇప్పుడు ఉండరు. వీరి మరుసటి జన్మలో కూడా అవే కళలు ఉండవు. 16 కళల నుండి 14 కళలవారిగా అవ్వాలంటే జన్మ-జన్మకు కొద్ది-కొద్దిగా తేడా వస్తూ ఉంటుంది కదా. నిజానికైతే నెమలి పింఛ ముకుటధారులు చాలామంది ఉన్నారు. కృష్ణుడు, ఎవరైతే మొదటి నంబరు 16 కళల సంపూర్ణుడో, వారికి పునర్జన్మల వలన కొద్ది-కొద్దిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది చాలా గుహ్యమైన రహస్యము.

తండ్రి అంటారు, నడుస్తూ-తిరుగుతూ, విహరిస్తూ సమయాన్ని పోగొట్టుకోవడం కాదు. ఇదే సంపాదన సమయము. ఎవరి వద్దనైతే చాలా ధనం ఉందో, మాకు ఇదే స్వర్గము అని వారు భావిస్తారు. తండ్రి అంటారు, ఇదే స్వర్గమైనట్లయితే మీకు అభినందనలు. తండ్రి అయితే పేదల పెన్నిధి. పేదలకు దానమివ్వాలి. పేదలకు సమర్పణవ్వడం సహజమవుతుంది. అయితే, ఎవరో అరుదుగా షావుకార్లు కూడా వెలువడుతారు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. దేహ భానాన్ని కూడా విడిచిపెట్టాలి. ఈ ప్రపంచమే అంతం అవ్వనున్నది. అప్పుడిక మనం బాబా వద్దకు వెళ్ళిపోతాము. సృష్టి కొత్తదిగా అయిపోతుంది. కొందరైతే అడ్వాన్స్ గా కూడా వెళ్తారు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులు కూడా, కృష్ణుడిని ఒడిలోకి తీసుకునేందుకు అడ్వాన్స్ లో వెళ్ళాలి కదా. కృష్ణుడితోనే సత్యయుగం ప్రారంభం అవుతుంది. ఇవి చాలా గుప్తమైన విషయాలు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. తల్లి-తండ్రిగా ఎవరు అవుతారు, సెకెండు నంబరులో వచ్చేందుకు ఎవరు యోగ్యులు అనేవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. సేవ ద్వారా కూడా మీరు అర్థం చేసుకోగలరు. అదృష్టముతో కూడా కొంతమంది వేగంగా పరుగు తీసి ముందుకు వచ్చేస్తారు. ఈ విధంగా జరుగుతుంది, చివర్లో వస్తున్నవారు చాలా ఫస్ట్ క్లాస్ సేవ చేస్తున్నారు. పిల్లలైన మీరు రూప్-బసంత్ (యోగులు- జ్ఞానులు). తండ్రిని కూడా బసంత్ అని అంటారు. వారు ఒక నక్షత్రము. అంత పెద్దగా అయితే ఉండరు. పరమ ఆత్మ అనగా పరమాత్మ. ఆత్మ రూపం పెద్దగా ఏమీ ఉండదు కానీ తికమకపడకుండా ఉండేందుకు పెద్ద రూపాన్ని చూపించారు. ఉన్నతోన్నతమైనవారు శివబాబా. ఆ తర్వాత – బ్రహ్మా, విష్ణు, శంకరులు. బ్రహ్మా కూడా వ్యక్తం నుండి అవ్యక్తమవుతారు, ఇంకే చిత్రాలు లేవు. విష్ణువు యొక్క రెండు రూపాలే లక్ష్మీ-నారాయణులు. శంకరుని పాత్ర సూక్ష్మవతనం వరకు ఉంది. ఇక్కడ స్థూల సృష్టి పైకి వచ్చి పాత్రను అభినయించేది లేదు, అలాగే పార్వతికి అమరకథను వినిపించరు. ఇవన్నీ భక్తి మార్గపు కథలు. ఈ శాస్త్రాలు మళ్ళీ వెలువడుతాయి. వాటిలో కొంత, పిండిలో ఉప్పు అంత సత్యం ఉంది. ఏ విధంగానైతే శ్రీమత్ భగవద్గీత అనే పదం సరైనది. మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు… అని అంటారు. అది పూర్తిగా తప్పు. దేవతల మహిమ వేరు, ఉన్నతోన్నతమైనవారు పరమపిత పరమాత్మనే. వారిని అందరూ స్మృతి చేస్తారు. వారి మహిమ వేరు. అందరూ ఒకటే ఎలా అవుతారు. సర్వవ్యాపి అన్న పదానికి అర్థమే సరిపోదు.

మీరు ఆత్మిక ముక్తిదళము, కానీ గుప్తంగా ఉన్నారు. స్థూలమైన ఆయుధాలు మొదలైనవైతే ఉండజాలవు. ఇక్కడ జ్ఞాన బాణాలు, జ్ఞాన ఖడ్గం యొక్క విషయము. పవిత్రతలో శ్రమ ఉంది. తండ్రితో పూర్తి ప్రతిజ్ఞ చేయాలి, బాబా, మేము పవిత్రంగా అయి స్వర్గం యొక్క వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. వారసత్వం పిల్లలకే లభిస్తుంది. తండ్రి వచ్చి ఆశీర్వదిస్తారు, మాయా రావణుడైతే శపిస్తాడు. మరి ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి. పిల్లలకు నిష్కామ సేవ చేస్తారు. పతిత ప్రపంచం, పతిత శరీరంలోకి వచ్చి పిల్లలైన మిమ్మల్ని వజ్ర సమానంగా తయారుచేసి, స్వయం నిర్వాణధామంలో కూర్చుండిపోతారు. ఈ సమయంలో మీ అందరిదీ వానప్రస్థ అవస్థ, అందుకే బాబా వచ్చారు. అందరి జ్యోతి వెలిగితే అందరూ మధురంగా అవుతారు. బాబా వలె మధురంగా అవ్వాలి. ఎంత మధురమైనవారు, ఎంత ప్రియమైనవారు… అని పాడుతారు కదా. కానీ బాబా ఎంత నిరహంకారిగా పిల్లలైన మీ సేవ చేస్తారు. పిల్లలైన మీరు కూడా రిటర్న్ లో అంత సేవ చేయాలి. ఏ విధంగానైతే ఇంటింటిలోనూ మందిరాలు నిర్మిస్తారు కదా, అలా హాస్పిటల్ మరియు యూనివర్సిటీ అయితే ఇంటింటిలోనూ ఉండాలి. కుమార్తెలైన మీరు శ్రీమతం ఆధారంగా 21 జన్మల కోసం ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందిస్తారు. పిల్లలైన మీరు కూడా శ్రీమతంపై నడుచుకోవాలి. ఎక్కడైనా తమ మతాన్ని చూపించారంటే అదృష్టానికి అడ్డుగీత పడుతుంది. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకండి. మహారథి పిల్లలు ఏ విధంగా సేవ చేస్తున్నారో, అలా వారిని ఫాలో చేయాలి. సింహాసనాధికారులుగా అయ్యే పురుషార్థం చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానంగా నిరహంకారిగా అయి సేవ చేయాలి. తండ్రి నుండి ఏదైతే సేవ తీసుకుంటున్నారో, దానికి హృదయపూర్వకంగా రిటర్న్ ఇవ్వాలి, చాలా మధురంగా అవ్వాలి.

2. నడుస్తూ-తిరుగుతూ తమ సమయాన్ని పోగొట్టుకోకూడదు… శివబాబా మెడలోని హారంగా అయ్యేందుకు రేస్ చేయాలి. దేహం కూడా గుర్తుకు రాకూడదు… ఈ అభ్యాసం చేయాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే నాలెడ్జ్ ఫుల్ గా, త్రికాలదర్శులుగా ఉంటారో, వారెప్పుడూ అసంతృప్తి చెందరు. ఎవరైనా నిందించినా, అవమానపర్చినా కానీ సంతృప్తిగానే ఉంటారు ఎందుకంటే డ్రామా యొక్క ప్రతి రహస్యము తెలిసినవారు అసంతృప్తి చెందరు. ఎవరికైతే రహస్యము గురించి తెలియదో వారు అసంతృప్తి చెందుతారు, అందుకే సదా ఇది గుర్తుంచుకోండి, భగవంతుడైన తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత కూడా సంతృప్తిగా ఉండకపోతే ఇంకెప్పుడు ఉంటారు. కావున ఎవరైతే ఇప్పుడు సంతోషంగా కూడా ఉన్నారో, సంతృప్తిగా కూడా ఉన్నారో, వారే తండ్రికి సమీపులు మరియు సమానులు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top