20 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 19, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తమ ఈ జీవితాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా తయారుచేసుకోవాలంటే సమయాన్ని సఫలము చేసుకోండి, అవగుణాలను తొలగించండి, తినడంలో, త్రాగడంలో, నిదురించడంలో సమయాన్ని వృథా చేసుకోకండి’’

ప్రశ్న: -

మనుష్యులు ఏ ఒక్క పదము వలన అందరినీ భగవంతుని రూపంగా భావించారు?

జవాబు:-

బాబా అంటారు, ఈ సమయంలో నేను బహురూపిని, ఇక్కడ మురళీ వినిపించేటప్పుడు పరంధామం ఖాళీ అయిపోతుందని కాదు, నాకైతే ఈ సమయంలో చాలా పనులు చేయాల్సి ఉంటుంది, చాలా సేవ నడుస్తుంది. పిల్లలకు, భక్తులకు సాక్షాత్కారాలు చేయించాల్సి ఉంటుంది. ఈ సమయంలో నేను బహురూపిని, ఈ ఒక్క పదము వలన మనుష్యులు వీరందరూ భగవంతుని రూపాలే అని అన్నారు.

ప్రశ్న: -

తండ్రి యొక్క ఏ శ్రీమతాన్ని పాలన చేసే పిల్లలు సుపుత్రులు?

జవాబు:-

బాబా అంటారు, పిల్లలూ, ఎప్పుడూ కూడా డిస్సర్వీస్ చేయకండి, సమయం చాలా విలువైనది, దీనిని నిదురించడంలో పోగొట్టుకోకండి. తక్కువలో తక్కువ 8 గంటలైనా నా కోసం కేటాయించండి. ఈ శ్రీమతాన్ని పాలన చేసేవారు సుపుత్రులు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు… (తూనే రాత్ గవాయి సోకే…)

ఓంశాంతి. పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలకు తెలుసు – మనమంతా తండ్రికి పిల్లలము. మన శరీరానికి తండ్రి అయితే శారీరక రూపం కలవారే కానీ అశరీరిగా ఉన్న ఆత్మకు తండ్రి కూడా అశరీరి అయినవారే. తండ్రి అర్థం చేయించారు, అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. అది ఇప్పుడు ప్రారంభమవుతుంది, త్రేతా అంతిమము వరకు కొనసాగుతుంది. మీరు ఇప్పుడు భవిష్య 21 జన్మల ప్రారబ్ధం కోసం పురుషార్థం చేస్తున్నారు. ఆ తర్వాత హద్దు ప్రారబ్ధం ప్రారంభమవుతుంది, అనంతమైనది పూర్తి అయిపోతుంది. ఇవి గుహ్యమైన విషయాలు కదా. అర్ధకల్పము మనము హద్దు తండ్రి నుండి వారసత్వము తీసుకుంటూ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ వచ్చామని మీకు తెలుసు. ఆత్మ సంబంధంలో అందరూ సోదరులు. వారు తండ్రి. ఆత్మలమైన మనమంతా సోదరులమని, మళ్ళీ మనుష్య సృష్టి యొక్క రచనను రచించినప్పుడు సోదరీ-సోదరులుగా అవుతామని అంటారు కూడా. ఇది కొత్త రచన కదా. ఆ తర్వాత పరివారము వృద్ధి చెందుతుంది. చిన్నాన్నలు, మామయ్యలు మొదలైన వారంతా తర్వాత వస్తారు. ఈ సమయంలో తండ్రి రచనను రచిస్తున్నారు. పుత్రులు మరియు పుత్రికలు ఉన్నారు, ఇంకే సంబంధమూ లేదు. ఇప్పుడు మీరు జీవిస్తూనే సోదరీ-సోదరులుగా అవుతారు. ఇంకే సంబంధంతోనూ సంబంధము లేదు. ఇప్పుడు మీకు కొత్త జన్మ లభించింది. మనమిప్పుడు ఈశ్వరీయ సంతానమని మీకు తెలుసు. శివవంశీయులము, బ్రహ్మాకుమార-కుమారీలము. బ్రహ్మాకుమార-కుమారీలకు ఇంకే సంబంధమూ లేదు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది, దీనిని పావనంగా తయారుచేయాల్సి ఉంటుంది. బాబా, మేము మీ వారము అని అంటారు. తండ్రి అంటారు, పిల్లలూ, భవిష్యత్తు కోసం పురుషార్థము చేసి తమ జీవితాన్ని వజ్ర సమానంగా తయారుచేసుకోవాలి. మొత్తం పగలంతా కేవలం తినటము, తాగటము, రాత్రికి నిదురించటము మరియు తండ్రిని స్మృతి చేయకపోవటము… దీనితో వజ్ర సమానమైన జన్మ ఏమీ లభించదు. తండ్రి అంటారు – శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వాలి. మనము గవ్వ నుండి వజ్ర సమానంగా అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని అర్థం చేసుకుంటారు. మనుష్యులలోనైతే చాలా అవగుణాలు ఉన్నాయి. దేవతలలో గుణాలుంటాయి, అందుకే మనుష్యులు దేవతల ఎదురుగా వెళ్ళి తమ అవగుణాలను తెలుపుతారు కదా. మీరు సర్వ గుణ సంపన్నులు… మేము పాపులము, నీచులము. ఇప్పుడు తండ్రి అంటారు, మీ నుండి ఆసురీ గుణాలను తొలగించి ఈశ్వరీయ దైవీ గుణాలను ధారణ చేయాలి. తండ్రి అయితే నిరాకారుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు. వారు సత్యమైనవారు, చైతన్యమైనవారు, జ్ఞాన సాగరుడు. ఈ జ్ఞానమైతే బుద్ధిలో కూర్చుని ఉంది కదా. ఇది కొత్త జ్ఞానము. ఏ వేద శాస్త్రాలలోనూ ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో, అది మళ్ళీ ప్రాయఃలోపమైపోతుంది. ఇప్పుడు మీకు తెలుసు, మనము ఆసురీ గుణాలు కల మనుష్యుల నుండి దైవీ గుణాలను ధారణ చేసి తండ్రి ద్వారా దేవతలుగా అవుతున్నాము. తలపై ఉన్న పాపాల భారాన్ని తండ్రి స్మృతితో మనం భస్మం చేసుకుంటాము. భక్తి మార్గంలోనైతే, నీటిలో స్నానము చేయడం ద్వారా పాపాలు భస్మమైపోతాయని ఇదే వినిపిస్తూ వచ్చారు. కానీ నీటి ద్వారానైతే పావనంగా అవ్వలేరు. ఒకవేళ అలా జరిగితే, మరి పతితపావనుడైన తండ్రిని ఎందుకు స్మృతి చేస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. తెలివైనవారు మరియు తెలివిహీనులు – దీనిపై కూడా ఒక నాటకం తయారై ఉంది. ఇప్పుడు మీరు ఎంత తెలివైనవారిగా అవుతున్నారు. మొత్తం సృష్టి చక్రం గురించి తెలుసు. చరిత్ర-భౌగోళికముల గురించి తెలుసుకోవడం కూడా వివేకమే కదా. ఒకవేళ తెలియకపోతే వారిని తెలివిహీనులని అంటారు కదా.

ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బాబా తమ పరిచయాన్ని తమ పిల్లలకు ఏమని ఇచ్చారంటే, నేను మిమ్మల్ని వజ్ర సమానంగా తయారుచేయడానికి వచ్చాను. ఇక్కడ నుండి విని వెళ్ళిన తర్వాత ఇంతకుముందు ఎలా నడుచుకునేవారో, అలాగే తింటూ, తాగుతూ ఉండడం కాదు. అది గవ్వ సమానమైన జీవితము. దేవతలది వజ్ర సమానమైన జీవితము. వారైతే స్వర్గంలో సుఖము అనుభవించేవారు. చిత్రాలు కూడా ఉన్నాయి కదా. మనమే సుఖంగా ఉండేవారమని, మళ్ళీ మనమే దుఃఖితులుగా అయ్యామని ఇంతకుముందు మీకు తెలియదు. మనము 84 జన్మలను ఎలా తీసుకున్నాము – ఇది ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు నేను తెలియపరుస్తాను. ఇప్పుడు మీరు ఇతరులకు కూడా అర్థం చేయించేందుకు యోగ్యులుగా అయ్యారు. తండ్రి తెలివైనవారిగా చేస్తారు కనుక ఇతరులకు అర్థం చేయించాలి. ఇంటికి వెళ్తూనే మళ్ళీ అదే పాత నడవడిక ఉండడం కాదు. శిక్షణ పొంది మళ్ళీ ఇతరులకు శిక్షణనివ్వండి. తండ్రి పరిచయాన్ని ఇవ్వడానికి వెళ్ళాల్సి ఉంటుంది. అనంతమైన తండ్రి అయితే అందరికీ ఒక్కరే. అన్ని ధర్మాల వారు – ఓ పరమపిత పరమాత్మ అని లేక ఓ ప్రభూ అని వారినే పిలుస్తారు. పరమాత్మను తలచుకోనివారు ఎవ్వరూ ఉండరు. అన్ని ధర్మాల వారికి తండ్రి ఒక్కరే. ఆ ఒక్కరినే అందరూ తలచుకుంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు అందరూ హక్కుదారులే. వారసత్వము గురించి కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రి ఏ వారసత్వాన్ని ఇస్తారు? ముక్తి మరియు జీవన్ముక్తి. ఇక్కడైతే అందరూ జీవన బంధనంలో ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ రావణుని బంధనాల నుండి విడిపిస్తారు. ఈ సమయంలో ఎవ్వరూ జీవన్ముక్తులుగా లేరు ఎందుకంటే ఇది రావణ రాజ్యము. దేహాభిమానులుగా ఉన్నారు. దేవతలు దేహీ-అభిమానులుగా ఉంటారు కావున, ఆత్మలమైన మేము ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటామని వారికి తెలుసు. వారికి కేవలం పరమాత్మ గురించి తెలియదు. పరమాత్మను తెలుసుకుంటే ఇక మొత్తం సృష్టి చక్రమంతటినీ తెలుసుకుంటారు. కేవలము మీరు మాత్రమే త్రికాలదర్శులు. తండ్రి కూర్చుని బ్రాహ్మణులనే త్రికాలదర్శులుగా చేస్తారు. దేవతలు కూడా త్రికాలదర్శులు కారు అన్నప్పుడు, వారి వంశావళి ఏదైతే వస్తుందో, వారిలో కూడా ఈ జ్ఞానముండదు, ఇక అటువంటప్పుడు ఇతరులలోకి ఈ జ్ఞానమెక్కడ నుండి వస్తుంది. ఇచ్చేవారు కూడా ఒక్కరే. ఈ సహజ రాజయోగం యొక్క జ్ఞానము ఇంకెవ్వరికీ ఉండదు. దేవీ-దేవతా ధర్మం యొక్క శాస్త్రము కూడా ఉండాలి కదా. కావున డ్రామానుసారంగా వారికి మళ్ళీ శాస్త్రాలు తయారుచేయాల్సి ఉంటుంది. గీత, భాగవతము మొదలైనవన్నీ మళ్ళీ ఇదే విధంగా తయారవుతాయి. గ్రంథ్ కూడా ఇదే విధంగా తయారవుతుంది. ఇప్పుడు గ్రంథ్ ఎంత పెద్దిదైపోయింది. లేకుంటే ఇంతకుముందు చాలా చిన్నదిగా ఉండేది – చేతితో రాయబడినదిగా ఉండేది. ఆ తర్వాత వృద్ధిలోకి తీసుకువచ్చారు. ఇది కూడా అలాగే. ఒకవేళ దీని గ్రంథ్ ను కూర్చుని తయారుచేస్తే చాలా పెద్దదైపోతుంది. కానీ దానిని మళ్ళీ క్లుప్తం చేయడం జరుగుతుంది. చివర్లో తండ్రి రెండు పదాలు మాత్రము చెప్తారు – మన్మనాభవ. నేను మీకు అన్ని వేద-శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. కావున తప్పకుండా ఫలానా శాస్త్రములో ఇది ఉందని పేరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కదా. అవి ధర్మశాస్త్రాలేమీ కాదు. భారత్ యొక్క ధర్మము ఒక్కటే. ఇకపోతే అవి ఏ ధర్మం యొక్క శాస్త్రాలు అనేది ఎప్పుడూ ఋజువు చేయలేరు. భారత్ యొక్క శాస్త్రము ఒకే ఒక గీత. గీతను సర్వ శాస్త్రాల శిరోమణి అని అంటూ ఉంటారు. గీత మహిమ గురించి మీకు ఏక్యురేట్ గా (ఖచ్చితంగా) తెలుసు. ఆ గీత ద్వారా తండ్రి వచ్చి భారత్ ను స్వర్గంగా తయారుచేస్తారు. భారత్ యొక్క శాస్త్రాలకు చాలా గౌరవం లభిస్తుంది. కానీ గీతా భగవంతుడు ఎవరు, వారి గురించి తెలియని కారణంగా అసత్య ప్రమాణమును చేస్తారు. ఇప్పుడు దానిని కరెక్ట్ చేయండి. భగవంతుడు ఎప్పుడూ, నేను సర్వవ్యాపిని అని అనలేదు.

పిల్లలు ప్రశ్న అడిగారు – శివబాబా ఇక్కడకు వచ్చినప్పుడు, మురళీ వినిపించేటప్పుడు పరంధామంలో కూడా ఉంటారా? బాబా అంటారు, ఈ సమయంలోనైతే నాకు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. చాలా సేవ నడుస్తుంది. ఎంతమంది పిల్లలకు, భక్తులకు మొదలైనవారికి కూడా సాక్షాత్కారాలు చేయిస్తాను. ఈ సమయంలో నేను బహురూపిని. బహురూపి అనే పదము వలన కూడా మనుష్యులు – అన్ని రూపాలు వారివే అని భావించారు. మాయ తలకిందులుగా వ్రేలాడదీస్తుంది, మళ్ళీ తండ్రి సరి చేస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు ముక్తిధామంలోకి వెళ్ళే పురుషార్థము చేస్తారు. మీ బుద్ధి ముక్తిధామము వైపు ఉంది. మీతో తండ్రి ఏదైతే పురుషార్థాన్ని చేయిస్తున్నారో, అటువంటి పురుషార్థాన్ని ఏ మనిషీ చేయించలేరు. ఇప్పుడు మీ బుద్ధియోగాన్ని అక్కడ జోడించండి. జీవిస్తూ ఉండగానే ఈ శరీరాన్ని మర్చిపోతూ వెళ్ళండి. మనుష్యులు మరణించినప్పుడు స్వర్గస్తులయ్యారని అంటారు, అయినా ఏడుస్తూ ఉంటారు. తండ్రికి సుపుత్రులైన పిల్లలెవరైతే ఉంటారో, వారే తండ్రికి సహాయకులుగా అయి సేవ చేస్తారు. వారు ఎప్పుడూ డిస్సర్వీస్ చేయరు. ఒకవేళ ఎవరైనా డిస్సర్వీస్ చేస్తే, వారు తమకు తాము డిస్సర్వీస్ చేసుకున్నట్లు. బాబా అంటారు, మధురమైన పిల్లలూ, ఈ సమయం చాలా విలువైనది. భవిష్య 21 జన్మల కోసం మీరు సంపాదన చేసుకుంటారు. మీకు తెలుసు, మనకు విశ్వం యొక్క రాజ్యం లభిస్తుంది, ఇది ఎంత గొప్ప సంపాదన, కావున ఇందులో నిమగ్నమైపోవాలి. తండ్రిని స్మృతి చేయాలి. ఏ విధంగా గవర్నమెంటు సర్వీసులో 8 గంటలు ఉంటారు. బాబా కూడా అంటారు, నా కోసం 8 గంటలు కేటాయించండి. రాత్రివేళ నిదురించి మీ సమయాన్ని వృథా చేసుకోకండి. రాత్రింబవళ్ళు సంపాదన చేసుకోవాలి. ఇది చాలా సులభమైనది, ఇది కేవలం బుద్ధికి సంబంధించిన విషయము. మనుష్యులు వ్యాపారాలకు వెళ్ళినప్పుడు మొదట మందిరము ఎదురుగా చేతులు జోడించి, తర్వాత దుకాణానికి వెళ్తారు. తిరిగి వచ్చేటప్పుడు మర్చిపోతారు, ఇల్లు గుర్తుకు వస్తుంది. అది కూడా మంచిదే. కానీ అర్థమేమీ తెలియదు.

పిల్లలైన మీరు కలకత్తాలో చాలా మంచి రీతిలో అర్థం చేయించాలి – కాళీ మాతకు అక్కడ చాలా గౌరవముంది. బెంగాలీలకు తమ-తమ ఆచార-వ్యవహారాలు ఉంటాయి. బ్రాహ్మణులకు చేపలు తప్పకుండా తినిపిస్తారు. గొప్ప వ్యక్తులు సొంత చెరువు తయారుచేసుకుని అందులో చేపలను పెంచుతారు, ఇక బ్రాహ్మణులకు కూడా అవే తినిపిస్తారు. ఇప్పుడు మీరు పక్కా వైష్ణవులుగా అవుతారు. ప్రాక్టికల్ గా మీరు విష్ణుపురిలోకి వెళ్తారు. అక్కడ 4 భుజాల కల మనుష్యులు ఉంటారని కాదు. లక్ష్మీ-నారాయణులను విష్ణువు అని అనడం జరుగుతుంది. రెండు భుజాలు వారివి, రెండు భుజాలు వీరివి. మీరు మహాలక్ష్మికి పూజ చేస్తారు, వాస్తవానికి విష్ణువుకు పూజ చేస్తారు. ఇరువురూ ఉన్నారు కదా. కానీ ఈ సమయంలో మహిమ మాతలది. జగదంబకు గాయనముంది. లక్ష్మి పేరు కూడా గాయనము చేయబడింది. తండ్రి వచ్చి మాతల ద్వారా అందరికీ సద్గతినిస్తారు. జగదంబయే తర్వాత రాజరాజేశ్వరిగా అవుతారు. తల్లికి పూజ జరుగుతుంది. వాస్తవానికి జగదంబ అయితే ఒక్కరే కదా. ఏ విధంగా శివునికి ఒక లింగమును తయారుచేస్తారో, అదే విధంగా చిన్న-చిన్న సాలిగ్రామాలను కూడా తయారుచేస్తారు. అదే విధంగా కాళికా మందిరాలు కూడా చిన్న-చిన్నవి చాలా ఉన్నాయి. వారు ఆ తల్లి సంతానము వంటివారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు, దీనినే బలిహారమవ్వడమని అంటారు. మీరు వారిపై బలిహారమవుతారు, ఈ బ్రహ్మాపై కాదు.

తండ్రి అర్థం చేయిస్తారు – ఇప్పుడు సమయాన్ని వృథా చేయకూడదు. వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి. ఒకవేళ తినడానికి సరిపడా ధనముంటే, ఇక ఎక్కువ ఎందుకు తల బాదుకుంటారు? అయితే, శివబాబా యజ్ఞంలో ఇస్తే విశ్వ సేవలో ఉపయోగించినట్లు. బాబా అంటారు, సెంటర్లను తయారుచేయండి, అక్కడ కుమార్తెలు మనుష్యులను దేవతలుగా తయారుచేసే దారిని తెలియపరుస్తారు. ఈ చదువు ఎంత ఫస్ట్ క్లాస్ అయినది. చాలా మంది కళ్యాణము జరుగుతుంది. తండ్రి అంటారు, లక్షలు, కోట్లు సంపాదించండి కానీ ఎటువంటి పని చేయండంటే, దాని ద్వారా భారత్ పావనంగా అవ్వాలి, సదా ఆరోగ్యవంతముగా అవ్వాలి. మీరు భవిష్యత్తు కోసం ఇప్పుడు పూర్తి వారసత్వాన్ని తీసుకుంటారు. అక్కడ పేదవారు ఎవ్వరూ ఉండరు. అక్కడ కూడా ఇప్పటి ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు కనుక అంతగా ధారణ చేయాలి. మీ ఒక్కొక్క పైసా వజ్ర సమానమైనది, దీని ద్వారా భారత్ స్వర్గముగా అవుతుంది. ఇకపోతే, మిగిలి ఉన్నదంతా సమాప్తమైపోతుంది. ఏ ధనమైతే మిగులుతుందో, దానిని ఈ సేవలో ఉపయోగించండి. ఇది అత్యంత పెద్ద హాస్పిటల్. చాలా మంది పేద పిల్లలు అంటారు, మేము 8 అణాలు ఇస్తాము, ఇంటిలో ఒక ఇటుక పెట్టండి అని. ఇక్కడి నుండి మనుష్యులు సదా ఆరోగ్యవంతులుగా అవుతారని మనకు తెలుసు. ఇక్కడికైతే లెక్కలేనంత మంది వస్తారు. ఎప్పుడూ చూడనంతటి క్యూ ఏర్పడుతుంది. కావున ఎంత సంతోషము ఉండాలి, ఎలా ఉన్న మనము ఎలా తయారవుతున్నాము. మనము శివబాబా నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి నిరాకారుడు, జ్ఞాన సాగరుడు. వారు ఈ రథంలో ప్రవేశిస్తారు. కావున పిల్లలు చాలా దయార్ద్రహృదయులుగా అవ్వాలి. స్వయంపై కూడా మరియు ఇతరులపై కూడా దయ చూపించాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. భారత్ ను పావనంగా తయారుచేసే సేవలో తమ తనువు-మనసు-ధనాన్ని సఫలం చేసుకోవాలి. ధనాన్ని వజ్ర సమానంగా భావిస్తూ స్వర్గాన్ని తయారుచేసే సేవలో ఉపయోగించాలి, వ్యర్థంగా పోగొట్టకూడదు.

2. భవిష్య 21 జన్మల పారబ్ధాన్ని తయారుచేసుకునేందుకు రాత్రింబవళ్ళు సంపాదనను జమ చేసుకోవాలి, సమయాన్ని వృథా చేసుకోకూడదు. శరీరాన్ని మర్చిపోయే పురుషార్థము చేయాలి.

వరదానము:-

అకాల సింహాసనాధికారి ఆత్మ సదా ఆత్మిక నషాలో ఉంటుంది. ఏ విధంగా రాజు నషా లేకుండా రాజ్యాన్ని నడిపించలేరో, అలా ఆత్మ ఒకవేళ స్వరాజ్యం యొక్క నషాలో లేకపోతే కర్మేంద్రియాల రూపీ ప్రజలపై రాజ్యం చేయలేదు. అందుకే అకాల సింహాసనాధికారుల నుండి హృదయ సింహాసనాధికారులుగా అవ్వండి మరియు ఇదే ఆత్మిక నషాలో ఉండండి, అప్పుడు ఎటువంటి విఘ్నము లేక సమస్య మీ ముందుకు రాలేదు. ప్రకృతి మరియు మాయ కూడా దాడి చేయలేవు. కావున సింహాసనాధికారులుగా అవ్వడం అనగా సహజంగా ప్రకృతీజీతులుగా మరియు మాయాజీతులుగా అవ్వడము.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top