19 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 18, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఈ సమయంలో ఈ భారత్ కు శ్రీమతం యొక్క అవసరముంది, శ్రీమతం ద్వారానే గవ్వలా ఉన్న భారత్ వజ్రంలా అవుతుంది, అందరి గతి-సద్గతి జరుగుతుంది’’

ప్రశ్న: -

సర్వశక్తివంతుడైన తండ్రిలో మనుష్యులలో లేని ఏ శక్తి ఉంది?

జవాబు:-

రావణుడిని హతమార్చే శక్తి ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రిలో ఉంది, మనుష్యులలో లేదు. రాముని శక్తి లేకుండా ఈ రావణుడు మరణించలేడు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు పిల్లలైన మీకు ఎలాంటి శక్తిని ఇస్తారంటే, దాని ద్వారా మీరు కూడా రావణునిపై విజయం పొందుతారు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. మధురమైన పిల్లలకు తెలుసు, ఇది హోలీ హంసల సభ, ఇక్కడంతా బ్రాహ్మణులు కూర్చున్నారు. పవిత్రమైనవారిని బ్రాహ్మణులని అనడం జరుగుతుంది, అపవిత్రమైనవారిని శూద్ర వర్ణానికి చెందినవారని అంటారు. ఎవరైతే పురుషార్థులో, వారిని హాఫ్ కాస్ట్ అని అంటారు, ఇక్కడివారిగానూ ఉండరు, అక్కడివారిగానూ ఉండరు. ఒక కాలు అటువైపు వెళ్ళే నావలో, ఒక కాలు ఇటువైపు వెళ్ళే నావలో ఉన్నట్లయితే చీరుకుపోతారు, అందుకే నిర్ణయించుకోవాలి – ఎటువైపు వెళ్ళాలి? ఒకవేళ అసురులు ఎవరైనా కూర్చుని ఉంటే విఘ్నాలను కలిగిస్తారు. ఇది ఎవరు అర్థం చేయిస్తారు? శివబాబా. శివుని కోసమే బాబా అన్న పదము నోటి నుండి వెలువడుతుంది. శివబాబానే జోలిని నింపేవారు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది. శివునివి లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి, వారు నిరాకారుడు, విశ్వ రచయిత. విశ్వంలో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, అంటే తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభించి ఉంటుంది. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, శూద్రులు రాతిబుద్ధి కలవారు, లక్ష్మీ-నారాయణులైతే పారసబుద్ధి కలవారిగా ఉండేవారు కదా. మాయ ద్వారా బుద్ధి హతమార్చబడుతుంది. మాయ పేరు భారత్ లో ప్రసిద్ధమైనది. ఈ సమయంలో మాయా రావణుడి రాజ్యముంది అనగా రావణ సంప్రదాయముంది, అందుకే రావణుడిని హతమారుస్తారు, కానీ మరణించడు. రాముని శక్తితో తప్ప రావణునిపై విజయం పొందలేరు. సర్వశక్తివంతుడి నుండే శక్తి లభించగలదు. వారు ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే. వారికి సూక్ష్మ శరీరమూ లేదు, స్థూలమైనది లేదు – మరి ఆ నిరాకారుడు భారత్ లోకి ఎలా వచ్చారు అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. ఆత్మ ఇంద్రియాలు లేకుండానైతే కర్మలు చేయలేదు. ఏమీ అర్థం చేసుకోరు, అందుకే రాతిబుద్ధి అని అనడం జరుగుతుంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, భగవంతుడు ఉన్నతోన్నతమైనవారు. వారిది అందరికన్నా ఉన్నతమైన మతము. లేదంటే భగవంతుని స్మరణను ఎందుకు చేస్తారు. వారి మతాన్ని స్మరిస్తారు. తప్పకుండా భగవంతుడు వచ్చే పాత్ర కూడా డ్రామాలో ఉంది. మనుష్యులు అర్థం చేసుకోరు. చాలామంది అంటారు, క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితం గీత వినిపించబడింది అని. కానీ ఇది చెప్పండి, ఆ గీతను ఏ దేశానికి, ఏ యుగంలో వినిపించారు మరియు ఎవరు వినిపించారు? ఒకే ఒక శాస్త్రంలో కృష్ణ భగవానువాచ అని రాసి ఉంది, మళ్ళీ రుద్ర జ్ఞాన యజ్ఞమని కూడా అంటారు. రుద్రుడు అని శివబాబాను అనడం జరుగుతుంది. కృష్ణుడిని ఎప్పుడూ తండ్రి అని అనరు. శివబాబా అని అనడం జరుగుతుంది. శివబాబానే జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, అందుకే భక్తులు వారిని పిలుస్తారు. భక్తి చేసిన తర్వాత భగవంతుడు లభిస్తారని భావిస్తారు. అచ్ఛా, భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది, భగవంతుడు ఎప్పుడు లభిస్తారు? పాపాత్ముల ప్రపంచం నుండి పుణ్యాత్ముల ప్రపంచానికి ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది, ఇది ఎవ్వరికీ తెలియదు. మీరు కూడా శూద్ర వర్ణానికి చెందినవారు. ఇప్పుడు మీరు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులుగా పిలవబడతారు. బ్రాహ్మణులుగా ఎవరు తయారుచేసారు? శివబాబా. వీరు రచయిత. బ్రాహ్మణ వర్ణము అన్నింటికన్నా ఉన్నతమైనది. బ్రాహ్మణులకు పిలక కూడా ఉంది ఎందుకంటే సాకారంలో ఉన్నారు కదా. కానీ వారిని అలా తయారుచేసేది నిరాకారుడు. వారు పరమపిత పరమ ఆత్మ అనగా పరమాత్మ, ఈ పదమును పక్కాగా గుర్తుంచుకోండి. డ్రామానుసారంగా ఎప్పుడైతే సృష్టి తమోప్రధానంగా అవుతుందో, అప్పుడు నేను రావాల్సి ఉంటుంది. నేను కూడా డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నాను. మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసి సుఖ-శాంతుల వారసత్వాన్ని వచ్చి ఇస్తాను. మిగిలినవారందరికీ శాంతి వారసత్వము లభిస్తుంది. తప్పకుండా సత్య, త్రేతా యుగాలు కొత్త ప్రపంచముగా ఉండేవి, అది రాముడు స్థాపన చేసారు. రాముడు అన్నదానికన్నా శివబాబా అన్న పదము సరియైనది. శివబాబా అన్న పదము అందరి నోటిలోనూ ఉంది. కనుక బాబా కొత్త ప్రపంచ రచయిత, వారు వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. గీతను బ్రాహ్మణులకు మాత్రమే వినిపించాలి. ఎప్పుడైతే శూద్రుల నుండి బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయ్యారో, అప్పుడు వారికి గీతను వినిపించారు. బ్రాహ్మణుల జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని తెరిచారు, అందుకే జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు, అజ్ఞానాంధకారము వినాశనమైంది… అని అంటారు. పిల్లలు అంటారు, బాబా, నరకములాంటి ప్రపంచం నుండి ఇప్పుడు స్వర్గంలోకి తీసుకువెళ్ళండి. ఇది శివభగవానువాచ, శివాచార్యవాచ. శివాచార్యులు (శివబాబా) అనంతమైన సన్యాసాన్ని నేర్పిస్తారు. శంకరాచార్యులది హద్దు సన్యాసము. అనంతమైన తండ్రి అంటారు, పాత ప్రపంచాన్ని మర్చిపోండి. ఇప్పుడు మీరు సదా సుఖ ప్రపంచములోకి వెళ్ళాలి. కృష్ణపురి మరియు కంసపురి అని అంటారు కదా. కృష్ణపురి అని సత్యయుగాన్ని, కంసపురి అని కలియుగాన్ని అంటారు. రెండూ కలిసి ఉండలేవు. సత్యయుగంలోకి మళ్ళీ కంసుడు ఎక్కడ నుండి వచ్చాడు? బుద్ధిని ఉపయోగించాలి కదా. ఇప్పుడు స్వర్గం యొక్క అపారమైన సుఖాన్నిచ్చేందుకు తండ్రి స్వయంగా వచ్చారు.

బాబా అంటారు, ఈ అంతిమ జన్మలో ఎవరు చదువుకుంటారో, వారే చదువుకుంటారు, ఇక తర్వాత రాజ్యం స్థాపనైపోతుంది. తండ్రే వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. వారు హిందువులను క్రిస్టియన్లుగా లేక బౌద్ధులుగా తయారుచేస్తారు. కానీ శూద్ర వర్ణము వారిని బ్రాహ్మణ వర్ణము వారిగా తయారుచేసారని ఎప్పుడైనా విన్నారా! ఇదైతే కేవలం శివబాబా పనే. వారే బ్రాహ్మణులను మళ్ళీ దేవతలుగా తయారుచేస్తారు. ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోండి, మేము మొదట ఏ ధర్మములో మరియు ఏ వర్ణములో ఉండేవారము? గురువుగా ఎవరు ఉండేవారు? ఏ శాస్త్రాలు చదివేవారము? గురువు నుండి ఏ మంత్రము లభించింది? తర్వాత ఎప్పటి నుండి శివబాబా బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ వర్ణములోకి తీసుకువచ్చారు? ఇది ప్రతి ఒక్కరి చేత వ్రాయించాలి. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేయండి. మాయా రావణుడు మీకు ఎలాంటి దుర్దశను కలిగించాడు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సంప్రదాయం వారిగా అయ్యారు, మళ్ళీ దైవీ సంప్రదాయం వారిగా అవ్వాలి. మిమ్మల్ని నిరాకార పరమపిత పరమాత్మ కన్వర్ట్ చేసారు. పిల్లలు ప్రతి ఒక్కరి చేత వ్రాయించాలి – ఏ ధర్మానికి చెందినవారిగా ఉండేవారు? ఎవరిని పూజించేవారు? గురువును ఆశ్రయించారా లేదా? తర్వాత బ్రాహ్మణ వర్ణములోకి ఎవరు తీసుకువచ్చారు? ఈ బాబా కూడా ఏమని రాస్తారంటే, నేను హిందూ ధర్మానికి చెందినవానిగా పిలవబడేవాడిని. ఎంతో మంది గురువులను ఆశ్రయించాను. శాస్త్రాలు ఎన్నో చదివాను. సిక్కు ధర్మం వారు, మేము సిక్కు ధర్మానికి చెందినవారమని అంటారు. కేవలం భారతవాసులకు మాత్రమే తమ దేవీ-దేవతా ధర్మం గురించి తెలియదు. సిక్కు ధర్మం వారు తమను తాము దేవతలుగా చెప్పుకుంటారని కాదు. ప్రతి ఒక్కరు తమను తాము తమ ధర్మం వారిగానే చెప్పుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, శివ భక్తులు ఎవరైతే ఉంటారో లేక శివుని రచన అయిన దేవీ-దేవతల భక్తులు ఎవరైతే ఉంటారో, వారికి వినిపించాలి. వారు మంచి రీతిలో వింటారు. సత్య-త్రేతా యుగాలలో తప్పకుండా సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉండేవారు, వారి చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంగ్లీషులో డెయిటీజమ్ అని అంటారు. ఇప్పుడు బాబా దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణము నుండి దేవతా వర్ణము వారిగా అవుతున్నారు. భారతవాసులే తామే పూజ్యులుగా, తామే పూజారులుగా అవుతారు. సత్యయుగంలో పూజ్యులుగా ఉండేవారు… బాబా అంటారు, నేనైతే సదా పూజ్యుడను. ఇప్పుడు మీరిక్కడకు రాజయోగాన్ని నేర్చుకునేందుకు, భవిష్య 21 జన్మలకు శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. కావున ఫాలో చేయాలి. ఎప్పటివరకైతే మీరు బ్రహ్మా వంశీయులుగా అవ్వరో, అప్పటివరకు బ్రాహ్మణులుగా ఎలా పిలువబడతారు? అచ్ఛా.

ఈ రోజు భోగ్ ఉంది. బ్రాహ్మణులకు తినిపించే ఆచారము కూడా ఉంది. ఇకపోతే, జ్ఞానానికి దీనితో సంబంధమేమీ లేదు. ఇక్కడ ఉన్నది జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన గంగల మిలనము. అక్కడేమో దేవతలు మరియు బ్రాహ్మణులైన మీ మిలనము జరుగుతుంది, ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. తండ్రి అంటారు, దేహ సహితంగా దేహపు సంబంధాలన్నింటి నుండి మమకారాన్ని తొలగిస్తూ వెళ్ళండి. నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను – మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను. రోజూ క్లాసులో అడగండి – శివబాబాతో ప్రతిజ్ఞ చేస్తారా! శివబాబా అంటారు, నా మతంపై నడవండి. తండ్రి శ్రీమతము ప్రసిద్ధమైనది. శ్రీమతము అనగా శ్రేష్ఠమైన మతము. బ్రహ్మా మతము అని కూడా అంటూ ఉంటారు. బ్రహ్మా కన్నా బ్రహ్మా తండ్రి అయిన శివబాబా ఉన్నతమైనవారు కదా. భోజనానికి కూర్చున్నప్పుడు కూడా శివబాబాను స్మృతి చేయండి. వారు అతి ప్రియమైన తండ్రి. మనము వారితో పాటు భోజనము చేస్తున్నట్లు. ఈ స్మృతితో చాలా శక్తి వస్తుంది. కానీ పిల్లలు ఘడియ-ఘడియ మర్చిపోతారు. భారత్ కు ఇప్పుడు శివబాబా శ్రీమతం యొక్క అవసరముంది, ఎందుకంటే తండ్రే సర్వుల సద్గతిదాత, పతితపావనుడు కదా. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. మాయ విఘ్నాలను కూడా అనేక రకాలుగా కలిగిస్తుంది, వాటికి భయపడకూడదు. జ్ఞానమైతే చాలా సహజమైనది. ఇకపోతే యోగంలో ఉండడము, ఒక్కరితోనే బుద్ధియోగాన్ని జోడించడము, ఇందులోనే శ్రమ ఉంది. అటూ-ఇటూ భ్రమించడం కన్నా ఒక్క శివబాబాను స్మృతి చేయడం మంచిది కదా. స్వయంగా తండ్రి వచ్చారు కనుక గీతను చదివే విషయం కూడా లేదు. మిగిలిన శాస్త్రాలన్నీ పిల్లల వంటివి, వాటి ద్వారా వారసత్వము లభించలేదు. అనంతమైన వారసత్వము ఒక్క అనంతమైన తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. అచ్ఛా!

బాప్ దాదా అయితే పిల్లల ఎదురుగా కూర్చుని ఉన్నారు. తండ్రి అంటారు, మీ తండ్రినైన నేను బ్రహ్మా ద్వారా మమ్మా, దాదా మరియు పిల్లలందరి యొక్క ప్రియస్మృతులను ఇస్తాను. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అతి ప్రియమైన తండ్రిని తోడుగా ఉంచుకుని భోజనం చేయాలి. ఒక్క తండ్రితోనే బుద్ధియోగాన్ని జోడించాలి. ఒక్కరి శ్రీమతంపైనే నడవాలి.

2. బుద్ధి ద్వారా అనంతమైన పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి, దీనినే సన్యసించాలి.

వరదానము:-

ఫరిశ్తా అనగా పాత ప్రపంచము మరియు పాత దేహముతో మొహపు సంబంధము లేకుండా ఉండటము. దేహంతో ఆత్మకు సంబంధమైతే ఉంది కానీ మోహముతో కూడిన సంబంధము కాదు. కర్మేంద్రియాలతో కర్మ సంబంధములోకి రావడం వేరే విషయము కానీ కర్మబంధనములోకి రాకూడదు. ఫరిశ్తా అనగా కర్మలు చేస్తూ కూడా కర్మ బంధనాల నుండి ముక్తులుగా ఉండటము. దేహ బంధనము లేదు, దేహ సంబంధాల బంధనము లేదు, దేహ పదార్థాల బంధనము లేదు – ఇలా బంధనముక్తులుగా ఉండేవారే జీవన్ముక్త ఫరిశ్తాలు.

స్లోగన్:-

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు

దురదృష్టము మరియు అదృష్టము, ఇప్పుడు ఈ రెండు పదాలకు ఆధారము దేని బట్టి ఉంటుంది? ఇదైతే మనకు తెలుసు, అదృష్టవంతులుగా తయారుచేసేది పరమాత్మ, కావున దురదృష్టాన్ని తయారుచేసుకునేవారు స్వయంగా మనుష్యులే. ఎప్పుడైతే మనుష్యులు నిత్యం సుఖమయంగా ఉంటారో, అప్పుడు వారిది మంచి అదృష్టము అని అంటారు మరియు ఎప్పుడైతే మనుష్యులు తమను తాము దుఃఖితులుగా భావిస్తారో, అప్పుడు స్వయాన్ని దురదృష్టవంతులుగా భావిస్తారు. దురదృష్టము లేక అదృష్టము అనేది పరమాత్మ ద్వారా లభిస్తుంది అని ఇలా మనం అనము. అలా కాదు. అదృష్టాన్ని పాడుచేసుకోవడము లేక తయారుచేసుకోవడము, ఇదంతా కర్మల పైనే ఆధారపడి ఉంది. ఇదంతా మనుష్యుల సంస్కారాల పైనే ఆధారపడి ఉంది. తర్వాత, ఎటువంటి పాపం మరియు పుణ్యం యొక్క సంస్కారం నిండుతుందో, అటువంటి అదృష్టం తయారవుతుంది కానీ మనుష్యులు ఈ రహస్యాన్ని తెలుసుకోని కారణంగా పరమాత్మపై దోషం మోపుతారు. ఇప్పుడు చూడండి, మనుష్యులు తమను తాము సుఖమయంగా ఉంచుకునేందుకు ఎన్ని మాయా విధానాలను కనుగొంటారు, మళ్ళీ అదే మాయతో కొందరు తమను తాము సుఖమయంగా ఉన్నామని భావిస్తారు, మరికొందరు అదే మాయను సన్యసించి మాయను విడిచిపెట్టడం వలన తమను తాము సుఖమయంగా ఉన్నామని భావిస్తారు. అర్థం ఏమిటంటే, చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దాని ప్రతిఫలం దుఃఖం వైపుకు వెళ్తుంది. ఎప్పుడైతే సృష్టిపై భారీ దుఃఖం ఏర్పడుతుందో, అప్పుడు అదే సమయంలో స్వయంగా పరమాత్మ వచ్చి గుప్త రూపంలో తమ ఈశ్వరీయ యోగ శక్తితో దైవీ సృష్టిని స్థాపన చేయించి మనుష్యాత్మలందరినీ అదృష్టవంతులుగా తయారుచేస్తారు.

2. మనుష్యులు పాడుతారు – నీవే తల్లివి తండ్రివి, మేము నీ పిల్లలము, నీ కృపతో అపారమైన సుఖము… ఇప్పుడు ఈ మహిమ ఎవరి కోసం పాడడం జరిగింది? తప్పకుండా పరమాత్మ కోసమే గాయనం ఉంది ఎందుకంటే పరమాత్మ స్వయంగా మాత-పిత రూపంలో వచ్చి ఈ సృష్టికి అపారమైన సుఖాన్ని ఇస్తారు. పరమాత్మ తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు సుఖవంతమైన సృష్టిని తయారుచేసారు, అందుకే వారిని మాత-పిత అని అంటూ పిలుస్తారు. కానీ మనుష్యులకు అసలు సుఖం అంటే ఏమిటో తెలియనే తెలియదు. ఈ సృష్టిపై ఎప్పుడైతే అపారమైన సుఖం ఉండేదో, అప్పుడు శాంతి కూడా ఉండేది, కానీ ఇప్పుడు ఆ సుఖం లేదు. ఇప్పుడు మనుష్యులలో ఈ కోరిక కలుగుతుంది – ఆ సుఖము మాకు కావాలి అని. అయితే, కొందరు ధనాన్ని, పదార్థాలను కోరుకుంటారు, మరికొందరు పిల్లలను కోరుకుంటారు, కొందరైతే ఇలా కూడా కోరుకుంటారు – నేను పతివ్రతా నారిగా అవ్వాలి, నా పతి జీవించి ఉండాలి, నేను విధవను కాకూడదు అని. కనుక కోరికైతే సుఖం కోసమే ఉంటుంది కదా. మరి పరమాత్మ కూడా ఏదో ఒక సమయంలో వారి ఆశను తప్పకుండా పూర్తి చేస్తారు. సత్యయుగ సమయంలో సృష్టిపై స్వర్గం ఉన్నప్పుడు అక్కడ సదా సుఖం ఉంటుంది, అక్కడ స్త్రీ ఎప్పుడూ విధవగా అవ్వదు. కనుక ఆ ఆశ అపారమైన సుఖమున్న సత్యయుగంలో పూర్తి అవుతుంది. ఇక ఈ సమయంలో ఉన్నదే కలియుగము. ఈ సమయంలో మనుష్యులు దుఃఖమే దుఃఖము అనుభవిస్తారు. దుఃఖితులైన మనుష్యులు, ప్రభువు ఇచ్చినదానిని మధురంగా చేసుకుని అనుభవించాలని అంటారు. అంతేకానీ వారు ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేరు. వారు మన కర్మలన్నిటి ఖాతాను సమాప్తం చేయిస్తారు, అందుకే మనము, నీవే తల్లివి తండ్రివి, మేము నీ పిల్లలము అని అంటాము. అచ్ఛా. ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top