17 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 16, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - అర్ధకల్పం మీరు భౌతిక యాత్రలు చేసారు, ఇప్పుడు ఆత్మిక యాత్ర చేయండి, ఇంట్లో కూర్చుని తండ్రి స్మృతిలో ఉండడము, ఇది అద్భుతమైన యాత్ర’’

ప్రశ్న: -

తండ్రికి పిల్లల యొక్క ఏ విషయంపై చాలా ఆశ్చర్యం కలుగుతుంది?

జవాబు:-

ఏ ఆస్తి కోసమైతే పిల్లలు అర్ధకల్పం ఎదురుదెబ్బలు తిన్నారో, పిలుస్తూ ఉన్నారో… ఆ ఆస్తిని ఇచ్చేవారు ఎప్పుడైతే వచ్చారో, అప్పుడు వారికి చెందినవారిగా అయి కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతే తండ్రికి ఆశ్చర్యం కలుగుతుంది, పిల్లలు నడుస్తూ-నడుస్తూ ఎక్కేందుకు బదులుగా పూర్తిగా కిందకు పడిపోతారు, ఇది కూడా ఎలాంటి విచిత్రము.

ప్రశ్న: -

ఏ పిల్లలకు తండ్రి ద్వారా చాలా మంచి దక్షిణ లభిస్తుంది?

జవాబు:-

ఎవరైతే తండ్రి ద్వారా రచించబడిన రుద్ర యజ్ఞాన్ని బాగా సంభాళిస్తారో మరియు సదా శ్రీమతంపై నడుస్తారో, వారికి తండ్రి ద్వారా చాలా మంచి దక్షిణ లభిస్తుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మా తీర్థాలు అతీతమైనవి… (హమారే తీర్థ్ న్యారే హై…)

ఓంశాంతి. ఆత్మిక యాత్రికులు ఈ పాటను విన్నారు. పిల్లలైన మీరు ఆత్మిక యాత్రికులు. ఆ యాత్రలకు వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో, వారిని భౌతిక యాత్రికులు అని అంటారు. ఆ భౌతిక యాత్రలు కూడా అర్ధకల్పం నడుస్తాయి. జన్మజన్మాంతరాలుగా మీరు యాత్రలు చేస్తూ ఉన్నారు. ఆ భౌతిక యాత్రలను చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఇది మీ ఆత్మిక యాత్ర. వారు భౌతిక పండాలు. మీరు ఆత్మిక పండాలు. పండాలైన మీ గురువు ఎవరు? నిరాకార పరమపిత పరమాత్మ. వారిని పాండవ సైన్యం యొక్క ఆది పిత అని అంటారు. మీకు తెలుసు, మనం దేహాభిమానులుగా ఉండేవారము, ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మలను తిరిగి ఇంటికి తీసుకువెళ్ళేందుకు దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు ఆత్మిక యాత్రలో ఉన్నారు, ఇందులో కర్మేంద్రియాల యొక్క విషయం ఉండదు. యాత్రలో ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటారు, మళ్ళీ తిరిగి వచ్చారంటే వికారులుగా అయిపోతారు. యాత్రలకు వెళ్ళాల్సింది కూడా గృహస్థులే. వాస్తవానికి నివృత్తి మార్గము, గృహస్థ ధర్మానికి అతీతమైనది. యాత్రలకు తీసుకువెళ్ళేది ఎల్లప్పుడూ బ్రాహ్మణులే. పాట కూడా ఉంది – 4 ధామాలు తిరిగాము, అయినా కానీ తండ్రికి దూరంగా ఉన్నాము అని. ఇప్పుడు తండ్రి యాత్రకు తీసుకువెళ్ళేందుకు మిమ్మల్ని పవిత్రంగా చేస్తారు. ముక్తిధామానికి, జీవన్ముక్తిధామానికి తీసుకువెళ్తారు, మళ్ళీ ఈ పతిత ప్రపంచంలోకి వచ్చేదే లేదు. వారు భౌతిక తీర్థయాత్రలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు, వచ్చి అశుద్ధమైన వ్యాపారాలు చేస్తారు. యాత్రలో క్రోధం కూడా చేయకూడదు అని అంటారు. ముఖ్యంగా ఆ సమయంలో పతితులుగా అవ్వరు. నాలుగు ధామాల యాత్ర చేయడానికి 3-4 నెలలు పడుతుంది. ఇప్పుడు మీకు తెలుసు, ఆత్మలమైన మనం వెళ్తున్నాము. తండ్రి ఆజ్ఞ ఉంది, ఎంత వీలైతే అంత నా స్మృతిలో ఉండండి. ఇది ముక్తిధామము యొక్క యాత్ర. మీరు అక్కడికి వెళ్తున్నారు. మీరు అక్కడి నివాసులు. తండ్రి ప్రతి రోజు చెప్తారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, ఇంట్లో కూర్చునే మీరు ఈ యాత్ర చేస్తున్నారంటే, అద్భుతమైన యాత్ర అయినట్లు కదా. యోగాగ్నితో అన్ని పాపాలు తొలగిపోతాయి. అర్ధకల్పం మీరు భౌతిక యాత్రలు చేసారు. మొదట అవ్యభిచారి యాత్ర ఉండేది, తర్వాత వ్యభిచారీ యాత్రగా అయ్యింది. పూజ కూడా మొదట ఒక్క శివునిదే చేస్తారు, తర్వాత బ్రహ్మా, విష్ణు, శంకరులది, ఆ తర్వాత లక్ష్మీ-నారాయణలు మొదలైనవారిది చేస్తారు. ఇప్పుడైతే చూడండి, కుక్క, పిల్లి, రాయి, రప్పలు మొదలైన వాటన్నింటినీ పూజిస్తూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలూ, ఇదంతా బొమ్మల పూజ. శివబాబా మరియు దేవీ-దేవతల కర్తవ్యం గురించి తెలియదు. బొమ్మలకు కర్తవ్యము ఉండదు. శివబాబా కర్తవ్యం గురించి తెలుసుకోకపోవడం అంటే అది రాతి పూజ అయినట్లు. అయినా కూడా ఏదో ఒక మనోకామన పూర్తవుతుంది. సత్యయుగంలో భౌతిక యాత్రలు ఉండవు. అక్కడ మందిరాలు మొదలైనవి ఎక్కడ నుండి వచ్చాయి. ఇదైతే భ్రష్టాచారీ ప్రపంచము. స్వయాన్ని పతితులుగా భావిస్తారు, అందుకే పావనంగా అవ్వడానికి గంగా స్నానాలు చేస్తారు. కుంభ మేళాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇది సత్యాతి-సత్యమైన సంగమము. ఆత్మ, పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు, ఇప్పుడు సద్గురువు మధ్యవర్తి అయి సుందర మిలనాన్ని చేయించారు… అని అంటూ ఉంటారు కూడా. సద్గురువు, పతిత-పావనుడు మధ్యవర్తి రూపంలో వచ్చి కలుస్తారు. వారికి తమదంటూ శరీరమైతే లేదు. ఈ మధ్యవర్తి ద్వారా ఆత్మలైన మీకు తమతో నిశ్చితార్థం చేయించుకుంటారు అనగా పిల్లలకు తమ పరిచయాన్ని ఇస్తారు. పిల్లలూ, మిమ్మల్ని శాంతిధామ యాత్రకు తీసుకువెళ్ళేందుకు, పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళేందుకు నేను వచ్చాను. పిల్లలకు తెలుసు, భారత్ పావనంగా ఉండేది. ఒకే ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది. ఆర్య ధర్మం ఉండేది కాదు. ఆర్యులు మరియు అనార్యులు. ఒకవేళ దేవతలను ఆర్యులు అని అంటే మరి ఆర్య ధర్మంలో ఎవరు రాజ్యం చేసేవారు? ఆర్యులు అని చదువుకున్నవారిని అంటారు. ఈ సమయంలో అందరూ అనార్యులు, చదువురాని వారు. బాప్ దాదా గురించి తెలియనే తెలియదు. ఉన్నతోన్నతమైనవారు శివబాబా, తర్వాత బ్రహ్మా, విష్ణు, శంకరులు, ఆ తర్వాత ప్రజాపిత బ్రహ్మా, కావున జగదంబ కూడా ప్రజా మాత అయినట్లు. వీరి ద్వారా బ్రాహ్మణుల రచన జరుగుతుంది. వీరంతా దత్తత తీసుకోబడిన పిల్లలు. ఎవరు దత్తత తీసుకుంటారు? పరమపిత పరమాత్మ. మీకు తెలుసు, మనము వారి సంతానము. కానీ తండ్రిని మర్చిపోయి అనాథలుగా అయిపోయాము. గాడ్ ఫాదర్ యొక్క కర్తవ్యము గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి మళ్ళీ ఇటువంటివారిని పావనంగా చేస్తారు. తండ్రే పిల్లలైన మీకు పవిత్రత యొక్క శిక్షణను ఇస్తారు. ఇప్పుడు ఎక్కడికైతే వెళ్ళాలో, దానిని గుర్తు చేయాలి. మాయ పదే-పదే మరపింపజేస్తుంది. యుద్ధ మైదానము కదా. మీరు తండ్రికి చెందినవారిగా అవుతారు, మాయ మళ్ళీ తనవారిగా చేసుకుంటుంది. ఇది ప్రభువు మరియు మాయ యొక్క నాటకము. బాబాకు చెందినవారిగా అయి, మళ్ళీ ఆశ్చర్యం కలిగేలా వింటారు….. పారిపోతారు. మాయ కూడా పెద్ద బలశాలి. ఈ బుద్ధియోగ బలం యొక్క యుద్ధాన్ని తండ్రి తప్ప ఇంకెవరూ నేర్పించలేరు. సర్వశక్తివంతుడైన తండ్రితో యోగం జోడించడంతోనే శక్తి లభిస్తుంది. మీకు తెలుసు, ఇప్పుడు పవిత్రంగా అయి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ పాత్రను అభినయించేందుకు ఈ శరీరాన్ని తీసుకున్నారు. మనం 84 జన్మలు పూర్తి చేసాము. ఇది చివర్లో ఉన్న చిన్న మహాన్ కళ్యాణకారీ యుగము. జ్ఞాన గంగలైన మీరందరూ జ్ఞాన సాగరుడి నుండి వెలువడ్డారు.

తండ్రి అంటారు, తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది మరియు భవిష్య 21 జన్మల కోసం కూడా మీరు అమరులుగా అవుతారు. అకాల మృత్యువు ఎప్పుడూ జరగదు. సమయానికి తమంతట తామే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. నడుస్తూ-తిరుగుతూ తండ్రి స్మృతిలో ఉండాలి. ఈ స్మృతితో మీరు సృష్టిని పవిత్రంగా చేస్తారు. తండ్రి వచ్చారే పావనంగా చేయడానికి. ఎవరైతే దేవతలుగా ఉండేవారో, వారిదే అంటు కట్టడం జరుగుతుంది. ఇప్పుడు శూద్రులుగా అయ్యారు, వేరే-వేరే ధర్మాలలోకి కూడా కన్వర్ట్ అయిపోయారు, వారందరూ ఇప్పుడు తిరిగ వస్తారు. అందరికీ తమ-తమ సెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా అందరికీ తమ-తమ ఆచారాలున్నాయి. ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క అంటు కట్టబడుతుంది. ఎవరైతే ఇంతకుముందు బ్రాహ్మణులుగా అయ్యారో, వారే వస్తారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. బ్రహ్మాకు చెందినవారిగా అవ్వకపోతే శివబాబా నుండి వారసత్వాన్ని పొందలేరు. ఎవరైతే దేవతా ధర్మానికి చెందినవారో, వారు బ్రాహ్మణ ధర్మంలోకి తప్పకుండా వస్తారు. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యారు. ఎవరికీ దుఃఖమివ్వరు. అందరికన్నా పెద్ద శత్రువు రావణుడు. 5 వికారాల రూపీ శత్రువు గుప్తంగా ఉన్నాడు. అర్ధకల్పం నుండి అందరూ గొడవపడేలా చేసి, కింద పడేసి, పతితులుగా చేసేసాడు. ఇప్పుడు తండ్రి యజ్ఞాన్ని రచించారు. అనంతమైన తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు – అందులో అంతటినీ స్వాహా చేయాలి. ఈ గుర్రంపై ఆత్మ విరాజమానమై ఉంది. పేరే రాజస్వ రుద్ర జ్ఞాన యజ్ఞము, ఇది రాజ్యాధికారము కోసము. స్వర్గ స్థాపన కోసము ఎంత పెద్ద యజ్ఞాన్ని రచించారు. మీకు తెలుసు, ఇప్పుడు ఈ ప్రపంచం ట్రాన్స్ఫర్ అవ్వనున్నది. హృదయంలో నషా ఉంటుంది. బాబా యజ్ఞాన్ని రచించారు – దీనిని మంచి రీతిలో సంభాళించాలి. ఎవరైతే శ్రీమతంపై నడుస్తారో, వారికి చాలా మంచి దక్షిణ లభిస్తుంది. యజ్ఞాన్ని బాగా సంభాళించినట్లయితే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఏ ఆస్తి కోసమైతే మీరు అర్ధకల్పం ఎదురుదెబ్బలు తిన్నారో, అది ఇచ్చేందుకు తండ్రి వస్తారు, అటువంటి తండ్రిని మళ్ళీ విడిచిపెట్టేస్తారు, తండ్రి ఆశ్చర్యపోతారు. మీపై బలిహారమవుతాము అని ప్రేయసులు పాడేవారు. ఇప్పుడు నేను వచ్చాక మీరు నాకు చెందినవారిగా అయి కూడా విడిచిపెట్టేస్తారు. అటువంటివారు ఉన్నతిలోకి వెళ్ళేందుకు బదులుగా కిందకు పడిపోతారు. ఉన్నతిలోకి వెళ్తూ ఉంటే వైకుంఠ రసాన్ని ఆస్వాదిస్తారు… తేడా అయితే ఉంది కదా. ప్రధానమంత్రి మొదలైనవారు ఎక్కడ మరియు పేద కోయవారు ఎక్కడ. కావున ఇప్పుడు పురుషార్థం చేసి తండ్రి నుండి రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇందులో కృష్ణుని పేరు వేసేసారు. భక్తి మార్గం కోసం ఈ వస్తువులు, శాస్త్రాలు మొదలైనవన్నీ తయారయ్యాయి. భగవంతుడైతే ఒక్కరే, వారిని పతిత-పావనుడని అంటారు. శాంతిధామం మరియు సుఖధామంలో ఎవ్వరూ పిలవరు. కావున పిల్లలకు పూర్తి నషా ఎక్కాలి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. దీని తర్వాత ఇంకే యజ్ఞము రచించడం జరగదు. ఆపదలను తొలగించేందుకు వారు భౌతిక యజ్ఞాలను రచిస్తారు. తండ్రి ఎంత పెద్ద ఆపదలను అర్ధకల్పం కోసం అంతం చేస్తారు. దీని గురించి సాధువులు-సత్పురుషులకేమీ తెలియదు. ముఖ్యమైనది గీతా మాత, దానిని భగవంతుడు వినిపించారు, అందులో కృష్ణుని పేరు వేసేసారు. కావున ఇప్పుడు మనుష్యులను సావధానపర్చాలి, ఎందుకంటే వారి బుద్ధియోగం కృష్ణునితో జోడించబడింది. కృష్ణుడైతే, మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే నాతో పాటు తీసుకువెళ్తాను అని అనరు. ఈ తండ్రి కూర్చుని ఇక్కడ యోగ్యులుగా తయారుచేస్తారు. నల్లగా ఉన్నవారి నుండి తెల్లగా తయారుచేస్తారు. మీరు నల్లగా అయిపోయారు, బాబా మళ్ళీ సుందరంగా, స్వర్గానికి యోగ్యులుగా తయారుచేస్తారు. నడుస్తూ-తిరుగుతూ బుద్ధిలో బాబాను గుర్తు చేసుకోవాలి. ఈ అవస్థ ఏర్పడితే చాలు, ఇక మీ నావ తీరానికి చేరుకుంటుంది. ఆరోగ్యం, ఐశ్వర్యము, సంతోషము. బాబా నుండి మీరు ఇంతటి వారసత్వాన్ని తీసుకుంటారు, కావున ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేసి వారి శిక్షణపై నడుచుకోవాలి. ముళ్ళను పుష్పాలుగా తయారుచేయాలి. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు, అది పూదోట. ఇప్పుడిది ముళ్ళ అడవి. అకాసురుడు, బకాసురుడు, ఇవన్నీ సంగమం యొక్క పేర్లు. అందరి ఉద్ధరణ జరగాలి. ఎవరెంతగా చదువుకుంటారో, చదివిస్తారో, శ్రీమతంపై నడుచుకుంటారో, వారు తండ్రి నుండి 21 తరాల వారసత్వాన్ని పొందుతారు. మీరు సదా సుఖమయంగా అవుతారు. ఇప్పుడు మీది 100 శాతం ఎక్కే కళ. తర్వాత కళలు తగ్గుతూ వస్తాయి. ఈ సమయంలో కళలు పూర్తిగా సమాప్తమైపోయాయి. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవు అని పాడుతారు కూడా. తండ్రిని దయాహృదయుడు అని అంటారు కదా. కల్ప-కల్పము సంగమంలో వస్తారు. భారత్ స్వర్గంగా అయినట్లయితే అందరూ సుఖమయంగా అవుతారు. ఇప్పుడు పిల్లలు శ్రీమతంపై నడుచుకోవాలి, ఆసురీ మతంపై కాదు. తండ్రి అంటారు – అందరికన్నా ఎక్కువగా నన్ను నింద చేస్తారు, నామ రూపాలకు అతీతుడు అనైనా అంటారు లేక కణకణంలో ఉన్నారు అనైనా అంటారు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. మీరిప్పుడు త్రికాలదర్శులుగా అయ్యారు మరియు తండ్రిని తెలుసుకొని తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడైతే అనవసరమైన రక్తపాతం జరగనున్నది. అకారణంగా ఎన్ని ఆపదలు వస్తాయి, ఎంతమంది మరణిస్తారు. భక్తి మార్గంలోనైతే ఎంతమంది దేవీల చిత్రాలను తయారుచేస్తారు, ఖర్చు చేస్తారు. దేవీలను తయారుచేసి, పూజించి, మళ్ళీ ముంచేస్తారు. కావున బొమ్మల పూజ అయినట్లు కదా. కాళీ చిత్రాన్ని ఎలా తయారుచేస్తారు, మనుష్యులెవరైనా ఇలా ఉంటారా. మీరిక్కడ కూర్చుని ఉన్నప్పుడు యాత్రలో ఉన్నారు. ట్రైన్ లో కూర్చుని కూడా ఆత్మిక యాత్రలో ఉంటారు. బుద్ధి యాత్రలో జోడించబడి ఉంది. ఒకవేళ బుద్ధియోగం జోడించబడి లేకపోతే సమయం వృథా అవుతుంది. తండ్రి అంటారు, సమయాన్ని వృథా చేయకండి. మీ సమయం చాలా విలువైనది. ఒక్క క్షణాన్ని కూడా సంపాదన లేకుండా వదలకండి. తండ్రి అయితే పూర్తి పురుషార్థం చేయిస్తారు. బాబా విశ్వాన్ని స్వర్గంగా తయారుచేసేందుకు ఈ యజ్ఞాన్ని రచించారు. బాబా-బాబా అని అంటూ ఉంటే మీ నావ తీరానికి చేరుకుంటుంది. మనం బ్రాహ్మణులము, మనపై చాలా పెద్ద బాధ్యత ఉంది. తండ్రి అంటారు, పిల్లలూ, ఆత్మాభిమానులుగా అవ్వండి. మనసా-వాచా-కర్మణా ఎవరికీ దుఃఖమివ్వకండి, చాలా మధురంగా అవ్వండి. క్రోధముతో చాలా డిస్సర్వీస్ చేస్తారు. సంపూర్ణంగా అయితే ఇంకా ఎవరూ అవ్వలేదు. భూతాలు చాలా చెడ్డవి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ సమయం చాలా విలువైనది, అందుకే ఒక్క క్షణాన్ని కూడా ఈ సంపాదన లేకుండా వదలకూడదు. ఆత్మాభిమానులుగా ఉండేందుకు పూర్తి పురుషార్థాన్ని చేయాలి.

2. నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేసి తమ అవస్థను తయారుచేసుకోవాలి. చాలా మధురంగా అవ్వాలి. ఎవరికీ దుఃఖమివ్వకూడదు.

వరదానము:-

ఏ విధంగానైతే ప్రకాశంతో అంధకారం స్వతహాగా సమాప్తమైపోతుందో, అలా సమయాన్ని, సంకల్పాలను, శ్వాసను సఫలం చేసుకోవడంతో వ్యర్థం స్వతహాగా సమాప్తమైపోతుంది, ఎందుకంటే సఫలం చేసుకోవడమంటే అర్థము – శ్రేష్ఠం వైపు ఉపయోగించడము. కావున శ్రేష్ఠం వైపు ఉపయోగించేవారు వ్యర్థంపై విజయం పొంది నంబరువన్ తీసుకుంటారు. వారికి వ్యర్థాన్ని ఆపు చేసే సిద్ధి ప్రాప్తిస్తుంది. ఇదే పరమాత్మ సిద్ధి. రిద్ధి-సిద్ధిలను చేసేవారు అల్పకాలపు చమత్కారాన్ని చూపిస్తారు మరియు మీరు యథార్థ విధి ద్వారా పరమాత్మ సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top