13 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 12, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు - బ్రాహ్మణులైన మీరు ఈ యజ్ఞాన్ని సంభాళించేవారు, అందుకే మీరు పవిత్రంగా తప్పకుండా ఉండాలి’’

ప్రశ్న: -

అంతిమ సమయంలో తండ్రి ఏ పిల్లలకు సహాయాన్ని అందిస్తారు?

జవాబు:-

ఎవరైతే మంచి రీతిలో సేవ చేస్తారో వారికి అంతిమంలో ఎప్పుడైతే చాలా ఆపదలు వస్తాయో, ఆ సమయంలో సహాయం లభిస్తుంది. ఎవరైతే తండ్రికి సహాయకులుగా అవుతారో వారికి తండ్రి తప్పకుండా సహాయం చేస్తారు.

ప్రశ్న: -

అద్భుతమైన ముఖము ఏది? దాని స్మృతి చిహ్నము ఏ రూపంలో ఉంది?

జవాబు:-

శివబాబా, ఎవరికైతే తమదంటూ ముఖము లేదో, వారు ఎప్పుడైతే ఈ ముఖాన్ని ఆధారంగా తీసుకుంటారో, అప్పుడది అద్భుతమైన ముఖమవుతుంది, అందుకే పిల్లలైన మీరు సమ్ముఖంగా ముఖాన్ని చూసేందుకు వస్తారు. దీనికి స్మృతి చిహ్నంగా రుండ మాలలో ముఖాలను చూపిస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఎంత మధురమైనవారు, ఎంత ప్రియమైనవారు శివ భోళా భగవానుడు… (కిత్నా మీఠా కిత్నా ప్యారా శివ్ భోలా భగవాన్)

ఓంశాంతి. అనంతమైన తండ్రి అంటారు, నేను ఒకే ఒక్కసారి 5 వేల సంవత్సరాల తర్వాత పిల్లల ముఖాలను చూస్తాను. తండ్రికైతే తమదంటూ ముఖం లేదు. శివబాబా కూడా పాత ఇంటిని లోన్ గా తీసుకుంటారు. కావున మీరు బాప్ దాదా, ఇరువురి ముఖాన్ని చూస్తారు. అందుకే బాప్ దాదా యొక్క ప్రియస్మృతులను స్వీకరించండి అని అంటారు. ఇప్పుడు రుండ మాలను పిల్లలు చూసారు, దానిలో ముఖాలను చూపిస్తారు. రుండ మాల తయారు చేయబడినప్పుడు శివబాబా ముఖాన్ని కూడా ఈ విధంగా చూస్తాము. శివబాబా కూడా వచ్చి శరీరాన్ని లోన్ గా తీసుకుంటారని ఎవరికీ తెలియదు. శివబాబా ఈ బ్రహ్మా ముఖం ద్వారా మాట్లాడుతారు కావున ఇది వారి ముఖం అయినట్లు కదా. ఈ సమయంలో ఒకే ఒకసారి తండ్రి వచ్చి పిల్లల ముఖాలను చూస్తారు. శివబాబా ఈ ముఖాన్ని అద్దెకు తీసుకున్నారని పిల్లలకు తెలుసు. ఇటువంటి తండ్రికి తమ ఇల్లును అద్దెకు ఇస్తే ఎంత లాభం కలుగుతుంది. మొట్టమొదటగా వీరి చెవులు వింటాయి. మీరు కూడా వెంటనే వింటారు కానీ ఎంతైనా అందరి కన్నా దగ్గరగా వీరి చెవులు ఉన్నాయి. మీ ఆత్మ అయితే దూరంగా కూర్చుని ఉంది కదా. ఆత్మ చెవుల ద్వారా వింటుంది కావున కొద్దిగా తేడా ఉంటుంది. పిల్లలైన మీరు సమ్ముఖంగా ముఖాన్ని చూసేందుకు ఇక్కడకు వస్తారు. ఇది అద్భుతమైన ముఖము. శివరాత్రిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా నిరాకారుడైన శివబాబా ఇక్కడకు వచ్చి ప్రవేశిస్తారు కావున ఈ భారతదేశము వారిది కూడా. భారత్ అవినాశీ పరమపిత పరమాత్మ యొక్క జన్మ స్థలము. కానీ వారి జన్మ ఇతర మనుష్యుల వలె ఉండదు. వారు స్వయంగా అంటారు, నేను వచ్చి వీరిలో ప్రవేశిస్తాను మరియు పిల్లలకు జ్ఞానాన్ని వినిపిస్తాను. మిగిలిన ఆత్మలందరికీ తమ-తమ శరీరాలు ఉన్నాయి. నాకు ఏ శరీరము లేదు. శివునికి సదా లింగ రూపాన్ని చూపిస్తారు. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు మట్టితో గుండ్రంగా ఉన్న లింగాలను తయారుచేస్తారు. సాలిగ్రామాలు చిన్న-చిన్నవి తయారుచేస్తారు, శివలింగము పెద్దది తయారుచేస్తారు. వాస్తవానికి చిన్నగా, పెద్దగా ఏమీ ఉండరు. కేవలం వీరు తండ్రి, వీరు పిల్లలు అని చూపించడానికి అలా తయారుచేస్తారు. పూజ కూడా ఇరువురికీ వేర్వేరుగా చేస్తారు. వీరు శివుడు, ఇవి సాలిగ్రామాలు అని అర్థం చేసుకుంటారు కూడా. అందరూ శివుడే అనైతే అనరు. అలా కాదు, శివలింగాన్ని పెద్దదిగా తయారుచేస్తారు మరియు సాలిగ్రామాలను చిన్న-చిన్నవిగా తయారుచేస్తారు. ఈ పిల్లలందరూ వారితో పాటు ఉన్నారు. ఈ సాలిగ్రామాలకు ఎందుకు పూజ చేస్తారు అనేది బాబా అర్థం చేయించారు. ఎందుకంటే మీరంతా ఆత్మలు కదా. మీరు ఈ శరీరంతో పాటు భారత్ ను శ్రేష్ఠాచారిగా తయారుచేస్తున్నారు. శివబాబా శ్రీమతాన్ని సాలిగ్రామాలు తీసుకుంటున్నాయి. రుద్రుడైన శివబాబా యొక్క ఈ జ్ఞాన యజ్ఞము రచించబడి ఉంది. శివబాబా మాట్లాడుతారు, సాలిగ్రామాలు కూడా మాట్లాడతాయి. ఇది అమర కథ, సత్యనారాయణుని కథ. మనుష్యులను నరుని నుండి నారాయణునిగా చేస్తారు. అందరికన్నా ఉన్నతమైన పూజ వారిదే కదా. ఆత్మ ఏమీ చాలా పెద్దగా ఉండదు. పూర్తిగా బిందువు వలె ఉంటుంది. అందులో ఎంత జ్ఞానముంది, ఎంత పాత్ర నిండి ఉంది. ఇంత చిన్న ఆత్మ అంటుంది, నేను శరీరంలోకి ప్రవేశించి పాత్రను అభినయిస్తాను. శరీరము ఎంత పెద్దది. శరీరంలోకి ఆత్మ ప్రవేశించడంతో చిన్నతనం నుండే పాత్రను అభినయించడం మొదలుపెడుతుంది. అనాది, అవినాశీ పాత్ర లభించి ఉంది. శరీరమైతే జడమైనది. అందులో ఎప్పుడైతే చైతన్యమైన ఆత్మ ప్రవేశిస్తుందో, అప్పుడు గర్భంలో శిక్షలు అనుభవించడం మొదలవుతుంది. శిక్షలు కూడా ఎలా అనుభవిస్తుంది. భిన్న-భిన్న శరీరాలను ధారణ చేసి, ఎవరెవరికి ఏ రూపంలో దుఃఖమిచ్చారో, ఆ సాక్షాత్కారాలన్నింటినీ పొందుతూ ఉంటుంది. దండన లభిస్తుంది. దుఃఖంలో రక్షణ కోసం ఆర్తనాదాలు చేస్తుంది, అందుకే గర్భ జైలు అని అంటారు. డ్రామా ఎంత బాగా తయారై ఉంది. ఎంత పాత్రను అభినయిస్తారు. ఆత్మ ప్రతిజ్ఞ చేస్తుంది. నేనెప్పుడూ పాపం చెయ్యను. ఇంత చిన్న ఆత్మకు ఎంతటి అవినాశీ పాత్ర లభించి ఉంది. 84 జన్మల పాత్రను అభినయించి మళ్ళీ రిపీట్ చేస్తారు. అద్భుతం కదా. ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది యథార్థమైన విషయమని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. ఇంత చిన్న బిందువులో ఎంత పాత్ర ఉంది. చాలామందికి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మ నక్షత్రం వంటిది, ఈ భృకుటి మధ్యలో ఉంటుంది అని పాడుతారు కూడా. ఎంత పాత్రను అభినయిస్తుంది, దీనిని ప్రకృతి సిద్ధమైనది అని అంటారు. ఆత్మలమైన మనము ఒక శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటామని మీకైతే తెలుసు. ఎంత పాత్రను అభినయిస్తాము. మనకు బాబా వచ్చి అర్థం చేయిస్తారు. ఎంతటి ఉన్నతమైన జ్ఞానము. ప్రపంచంలో ఎవ్వరికీ ఈ జ్ఞానం లేదు. వీరు కూడా మనిషి కదా, వీరిలో ఇప్పుడు తండ్రి ప్రవేశించారు. వీరు ఎవరో గురువుకు శిష్యుడై ఉంటారు, వారి నుండి రిద్ధి-సిద్ధి నేర్చుకుని ఉంటారు అని కాదు. కొందరు గురువు యొక్క వరదానము, గురువు యొక్క శక్తి లభించిందని భావిస్తారు. ఈ విషయాలే అతీతమైనవి. సమ్ముఖంగా వినడంతో మీకు చాలా ఆనందం కలుగుతుంది. బాబా మాకు సమ్ముఖంగా అర్థం చేయిస్తున్నారని తెలుసు. ఆత్మలమైన మనం ఎంత చిన్నగా ఉన్నామో, బాబా కూడా అంతే చిన్నగా ఉన్నారు. వారిని పరమపిత పరమాత్మ అని అంటారు, పరమ అనగా సుప్రీమ్. వారు ఎంతో దూరంగా ఉన్నటువంటి పరంధామంలో నివసించేటువంటివారు. పిల్లలైన మీరు కూడా ఎంతో దూరంగా ఉంటారు. తండ్రి ఎంతటి సూక్ష్మమైన విషయాలను వినిపిస్తారు. ప్రారంభంలో ఏమైనా ఇవి అర్థం చేయించేవారా. రోజు-రోజుకూ పిల్లలైన మీకు ఎంతటి గంభీరమైన జ్ఞానం లభిస్తూ ఉంటుంది. ఎవరిస్తారు? ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారు వచ్చి, పిల్లలూ… అని అంటారు. ఆత్మ ఇంద్రియాల ద్వారా ఎలా మాట్లాడుతుంది. ఆత్మ భృకుటి మధ్యలో మెరుస్తుందని అంటారు కూడా కానీ కేవలం నామమాత్రంగా అంటారు, ఎవరి బుద్ధిలోకి రాదు. ఇది అర్థం చేయించేందుకు ఎవరికీ ఈ జ్ఞానం లేదు. మీలో కూడా చాలా కొద్దిమందే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. ఎవరైతే అర్థం చేసుకుంటారో, వారు మంచి రీతిలో ధారణ చేస్తారు మరియు తర్వాత ధారణ చేయిస్తారు అనగా వర్ణన చేస్తారు. పరమపిత పరమాత్మ అని అంటున్నారంటే పిత నుండి తప్పకుండా వారసత్వం లభించాలి కదా. స్వర్గానికి యజమానులుగా అవ్వాలి కదా. వారికి తప్పకుండా తండ్రి నుండి స్వర్గం యొక్క వారసత్వం లభించి ఉంటుంది. వారసత్వాన్ని ఎక్కడిచ్చారు? సత్యయుగంలో ఇచ్చారా? తప్పకుండా గతం యొక్క కర్మలుంటాయి. ఇప్పుడు మీరు కర్మల సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నారు. మీకు బాబా ఎటువంటి కర్మలు నేర్పిస్తారంటే, వాటి ద్వారా మీరు ఈవిధంగా తయారవ్వచ్చు. ఎప్పుడైతే మీరు బ్రహ్మా ముఖ వంశావళిగా అయ్యారో, అప్పుడు శివబాబా బ్రహ్మా ముఖం ద్వారా మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. ఎంతగా రాత్రి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఎంతటి ఘోరమైన అంధకారం ఏర్పడింది. ఎవరి ద్వారానైతే ప్రకాశం లభిస్తుందో, ఆ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. పాత్రధారులమైన మేము, పాత్రను అభినయించేందుకు ఈ కర్మక్షేత్రం పైకి వచ్చామని అంటారు. కానీ తాము ఎవరు, తమ తండ్రి ఎవరు – ఇవేవీ తెలియవు. సృష్టిచక్రం ఎలా తిరుగుతుంది, ఏమీ తెలియదు. అహల్యలు, కుబ్జలు, వేశ్యలు ఎవరైతే ఉన్నారో, వారికి వచ్చి చదివిస్తారు అని అంటూ ఉంటారు కూడా. ప్రదర్శనీలలో చాలా పెద్ద-పెద్ద వ్యక్తులు కూడా వస్తారు. కానీ వారి అదృష్టంలో లేదు. తండ్రి ఉన్నదే పేదల పెన్నిధి. 100 మందిలో అతి కష్టం మీద ఎవరో ఒక షావుకారు వెలువడుతారు. అందులోనూ ఉన్నత పదవిని పొందేటువంటి పురుషార్థాన్ని ఎవరో అరుదుగా చేస్తారు. మీరు పేదవారు. మాతల వద్ద చాలా ధనము మొదలైనవి ఏమైనా ఉంటాయా. కన్యలకు ఎక్కడి నుండి వస్తుంది. మాతలైతే ఎంతైనా అర్ధ భాగస్వాములు. కన్యలకైతే ఏమీ లభించదు. ఆమె అక్కడకు వెళ్ళిపోతారు, అర్ధ భాగస్వామిగా అవుతారు, వారసత్వాన్ని తీసుకోలేరు. కొడుకులైతే పూర్తి యజమానులుగా అవుతారు. కావున ఇటువంటి కన్యలనే మొట్టమొదటగా తండ్రి తమవారిగా చేసుకుంటారు. ఒకటేమో చదువుకునే బ్రహ్మచారి జీవితంలో ఉన్నవారు, పేదవారు, పవిత్రమైనవారు, వీరికే పూజ జరుగుతుంది. ఇవన్నీ ఈ సమయానికి చెందిన విషయాలు. ఈ సమయంలో మీ కర్మ నడుస్తుంది, అది తర్వాత పూజించబడుతుంది. శివ జయంతి లేకుండా కృష్ణ జయంతి జరగలేదు. మొదట శివ జయంతి, ఆ తర్వాత కృష్ణుని జయంతి, రాముని జయంతి అని మీకు తెలుసు. శివ జయంతితో జగదంబ, జగత్పితల జన్మ కూడా జరుగుతుంది. కావున తప్పకుండా జగత్తు యొక్క వారసత్వమే లభిస్తుంది. మొత్తం జగత్తుకు యజమానులుగా మీరు అవుతారు. జగన్మాత జగత్తుకు యజమాని. జగదంబకు చాలా మేళాలు జరుగుతాయి. బ్రహ్మాను అంతగా పూజించరు. కావున తండ్రి మాతలను ముందుంచుతారు. శివశక్తులైన మాతలను అందరూ కాలదన్నారు, ముఖ్యంగా పతులు. వీరైతే పతులకే పతి. కన్యలకు అర్థం చేయిస్తారు, జగదంబ యొక్క ఈ కుమార్తెలు మాస్టర్ జగదంబలు అయినట్లు కదా. ఈ కుమార్తెలు తల్లి వంటి కార్యాన్ని చేస్తున్నారు.

మమ్మా వలె మీరు కూడా త్రికాలదర్శులు. స్త్రీ, పురుషులు ఇరువురూ ఉన్నారు. ప్రవృత్తి మార్గం కదా. మెజారిటీ మాతలది. పేరు కూడా వీరిదే ప్రసిద్ధమైనది. బ్రహ్మాది అంత ప్రసిద్ధము కాదు. సారసిద్ధ బ్రాహ్మణులు బ్రహ్మాను పూజిస్తారు. రెండు రకాల బ్రాహ్మణులుంటారు – సారసిద్ధ బ్రాహ్మణులు, పుష్కరిణీ బ్రాహ్మణులు. శాస్త్రాలు వినిపించేవారు వేరే ఉంటారు. ఏ విధంగా ఈ చక్రం తిరుగుతుంది, ఏ విధంగా నేను వస్తాను, ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. నేను మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత జ్ఞానాన్ని వినిపిస్తాను అన్న ప్రతిజ్ఞ అయితే ఉంది కదా. పాటలో కూడా ఉంది కదా. ఏదైతే గతించిపోతుందో, దానిని మళ్ళీ భక్తి మార్గంలో తలుచుకుంటారు. ఇదైతే అనాది డ్రామా. ఇదెప్పుడూ షూట్ అవ్వదు, దీనికి ఆదిమధ్యాంతాలేవీ లేవు. నడుస్తూనే ఉంటుంది. ఈ డ్రామా ఎలా నడుస్తుంది అనేది తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. 84 జన్మలను మీరే అనుభవించాల్సి ఉంటుంది. మీరే బ్రాహ్మణ, దేవత, క్షత్రియ మొదలైన వర్ణాలలోకి వస్తారు. శివబాబాను మరియు బ్రాహ్మణులను, ఇరువురినీ మాయం చేసేసారు. బ్రహ్మా ద్వారా మీరు బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులే యజ్ఞాన్ని సంభాళిస్తారు. పతితులైతే యజ్ఞాన్ని సంభాళించలేరు. యజ్ఞాన్ని రచించినప్పుడు వికారాలలోకి వెళ్ళరు. యాత్రలలో కూడా వికారాలలోకి వెళ్ళరు. మీరు ఆత్మిక యాత్రలో ఉన్నారు, కావున వికారాలలోకి వెళ్ళలేరు. లేదంటే విఘ్నాలు కలుగుతాయి. మీది ఆత్మిక యాత్ర. బాబా అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తాను. దోమల గుంపు వలె తీసుకువెళ్తాను. అక్కడ ఆత్మలమైన మనము ఉంటాము. అది పరంధామము, అక్కడ ఆత్మలు నివసిస్తాయి. ఆ తర్వాత మనం వస్తాము, దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యాము. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే స్వర్గంలోకి వస్తారు. అక్కడ కూడా ఊయలల్లో ఊగుతారు కదా. అక్కడ మీరు రత్నజడితమైన ఊయలల్లో ఊగుతారు. శ్రీ కృష్ణుని ఊయలను ఎంత బాగా అలంకరిస్తారు. వారి పట్ల అందరికీ ప్రేమ ఉంటుంది. రాధే గోవిందులను భజించండి, బృందావనానికి పదండి… అని పాడుతారు కదా. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా అక్కడికి వెళ్ళేందుకు తయారవుతున్నారు. మా మనోకామనలు పూర్తవుతాయని తెలుసు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ పురిలోకి వెళ్తారు. బాబా అందరినీ ఎలా తీసుకువెళ్తారో మీకు తెలుసు. వెన్న నుండి వెంట్రుక తీసినట్లుగా. బాబా మీకు ఏ కష్టాన్ని ఇవ్వరు, ఎంత సహజంగా రాజ్యాన్ని ఇస్తారు. తండ్రి అంటారు, ఎక్కడికైతే వెళ్ళాల్సి ఉందో, మీ ఆ కృష్ణపురిని స్మృతి చేయండి. మొట్టమొదటగా తప్పకుండా బాబా మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తారు. తర్వాత అక్కడ నుండి స్వర్గంలోకి పంపిస్తారు. ఇప్పుడు మీరు వయా శాంతిధామము శ్రీ కృష్ణపురిలోకి వెళ్తున్నారు. ఏ విధంగా వయా ఢిల్లీ వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు తిరిగి వెళ్తాము, మళ్ళీ కృష్ణపురిలోకి వస్తాము అని మీరు భావిస్తారు. మనం శ్రీమతంపై నడుస్తున్నాము కావున తండ్రిని స్మృతి చేయాలి, పవిత్రంగా అవ్వాలి. యాత్రలో ఎప్పుడూ పవిత్రంగా ఉంటారు. చదువును కూడా బ్రహ్మచర్యంలో చదువుకుంటారు. పవిత్రత తప్పకుండా కావాలి. అయినా కూడా తండ్రి పిల్లల చేత పురుషార్థం చేయిస్తారు. ఈ సమయం యొక్క మీ పురుషార్థము కల్ప-కల్పపు పురుషార్థంగా అవుతుంది. పురుషార్థమైతే చేయాలి కదా. ఈ స్కూల్ చాలా పెద్దది కావున తప్పకుండా చదువుకోవాలి. భగవంతుడు స్వయంగా చదివిస్తారు. ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. ఇది అత్యంత విలువైన చదువు. ఈ బాబా ఎప్పుడూ కూడా మిస్ చేయరు. ఇక్కడ పిల్లలైన మీరు సమ్ముఖంగా ఖజానాలతో జోలిని నింపుకోవచ్చు. ఎంతగా చదువుకుంటారో, అంత నషా ఎక్కుతుంది. బంధనం లేకపోతే ఆగవచ్చు. కానీ మాయ ఎటువంటిదంటే, అది బంధనంలో బంధించేస్తుంది. అనుమతి లభించేవారు కూడా చాలా మంది ఉన్నారు. బాబా అంటారు, పూర్తిగా రిఫ్రెష్ అవ్వండి. బయటకు వెళ్ళడంతో ఇక ఆ నషా ఉండదు. చాలా మందికి కేవలం మురళీ చదవడం ద్వారా కూడా నషా ఎక్కుతుంది. పెద్ద ఆపదలు రానున్నాయి. ఎవరైతే సహాయకులుగా అవుతారో, మంచి రీతిలో సేవ చేస్తారో, వారికి సహాయం లభిస్తుంది. కావున వారికి అంతిమంలో సహాయం కూడా లభిస్తుంది కదా. అచ్ఛా.

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చదువు అత్యంత విలువైనది. స్వయంగా భగవంతుడు చదివిస్తారు, అందుకే ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు. జ్ఞాన ఖజానాతో రోజూ జోలిని నింపుకోవాలి.

2. ఇది చదువుకునే సమయము, యాత్రలో ఉన్నారు. రుద్ర యజ్ఞాన్ని సంభాళించాలి, అందుకే పవిత్రంగా తప్పకుండా ఉండాలి. ఏ వికారానికి వశమై విఘ్నాలను కలిగించకూడదు.

వరదానము:-

అన్నింటికన్నా పెద్ద భాగ్యము ఏమిటంటే, భాగ్యవిధాత తండ్రి తమవారిగా చేసుకున్నారు! భగవంతుని దృష్టి ఒక్క క్షణం కోసమైనా మాపై పడాలి అని ప్రపంచంవారు తపిస్తారు మరియు మీరు సదా నయనాలలో ఇమిడి ఉన్నారు. దీనినే భాగ్యమని అంటారు. భాగ్యము మీ వారసత్వము. మొత్తం కల్పంలో ఇటువంటి భాగ్యము ఇప్పుడే లభిస్తుంది. కావున భాగ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. పెంచుకునే సాధనము పంచడము. ఎంతగా ఇతరులకు పంచుతారో అనగా భాగ్యవంతులుగా చేస్తారో, అంతగా భాగ్యం పెరుగుతూ ఉంటుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top