11 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 10, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీరే చాలా కాలం నుండి వేరై ఉన్నారు, మీరే పూర్తి 84 జన్మల పాత్రను అభినయించారు, ఇప్పుడు మీరు దుఃఖం యొక్క బంధనాల నుండి సుఖం యొక్క సంబంధాలలోకి వెళ్ళాలి, కావున అపారమైన సంతోషంలో ఉండండి’’

ప్రశ్న: -

అపారమైన సంతోషం ఏ పిల్లలకు సదా ఉండగలదు?

జవాబు:-

ఎవరికైతే నిశ్చయముంటుందో 1- బాబా మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చారు. 2- మా సత్యమైన బాబా మాకు అదే గీత యొక్క సత్యాతి-సత్యమైన జ్ఞానాన్ని వినిపించడానికి వచ్చారు. 3- ఆత్మలమైన మేము ఇప్పుడు ఈశ్వరుని ఒడిలో కూర్చొన్నాము. ఆత్మలమైన మేము ఈ శరీర సహితంగా తండ్రికి చెందినవారిగా అయ్యాము. 4- బాబా మాకు భక్తి ఫలాన్ని (సద్గతిని) ఇవ్వడానికి వచ్చారు. 5- బాబా మమ్మల్ని త్రికాలదర్శులుగా చేసారు. 6- భగవంతుడు మమ్మల్ని తల్లిగా అయ్యి దత్తత తీసుకున్నారు. మేము ఈశ్వరీయ విద్యార్థులము. ఎవరైతే ఈ స్మృతిలో మరియు నిశ్చయంలో ఉంటారో, వారికి అపారమైన సంతోషముంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. పిల్లలకు నిశ్చయముంది, మేము ఆత్మలము. బాబా, భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. కావున పిల్లలకు చాలా సంతోషముండాలి. సమ్ముఖంలోకి రావడంతో ఆత్మ అర్థం చేసుకుంటుంది – అందరికీ సద్గతినివ్వడానికి బాబా వచ్చి ఉన్నారు అని. సర్వుల సద్గతిదాత, జీవన్ముక్తిదాత వారే. పిల్లలకు తెలుసు, మాయ పదే-పదే మరపింపజేస్తుంది అని. కానీ మేము బాబా సమ్ముఖంలో కూర్చున్నామని అయితే భావిస్తారు కదా. నిరాకార బాబా ఈ రథంపై స్వారీ అయ్యి ఉన్నారు. ముసల్మానులు తలపాగాను గుర్రంపై పెడతారు. ఈ గుర్రంపై మహమ్మద్ స్వారీ చేసేవారు అని అంటారు. గుర్తును చూపిస్తారు. ఇక్కడైతే నిరాకార బాబా ప్రవేశించి ఉన్నారు. పిల్లలకు చాలా సంతోషముండాలి. స్వర్గానికి యజమానులుగా తయారుచేసే బాబా లేక విశ్వానికి యజమానులుగా తయారుచేసే బాబా వచ్చేసారు అని. బాబా, గీత యొక్క సత్యాతి-సత్యమైన భగవంతుడు. ఆత్మ బుద్ధి తండ్రి వైపుకు వెళ్తుంది. ఇది తండ్రి పట్ల ఆత్మలకు ఉన్న ప్రేమ. ఈ సంతోషం ఎవరికి కలుగుతుంది? ఎవరైతే చాలా కాలం నుండి వేరై ఉన్నారో వారికి. బాబా స్వయంగా కూడా అంటారు, నేను మిమ్మల్ని సుఖం యొక్క సంబంధంలోకి పంపించాను, ఇప్పుడు దుఃఖం యొక్క బంధనంలో ఉన్నారు. 84 జన్మలను అందరూ తీసుకోరని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. 84 లక్షల జన్మల చక్రమైతే ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. బాబా 84 జన్మల చక్రం గురించి చాలా కరెక్టుగా తెలియజేసారు. బాబా పిల్లలు 84 జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే మీకు తెలుసు, ఆత్మలమైన మనము ఈ ఇంద్రియాల ద్వారా వింటాము, బాబా ఈ నోటి ద్వారా వినిపిస్తున్నారు. వారు స్వయంగా అంటారు, నేను ఈ ఇంద్రియాలను ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది, వారికి బ్రహ్మా అని పేరు పెట్టాల్సి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మా అని అన్నప్పుడు వారు మనిషై ఉండాలి కదా. సూక్ష్మవతనంలో ప్రజాపిత బ్రహ్మా అని ఏమైనా అంటారా. స్థూలవతనంలోకి వచ్చి అంటారు, నేను ఈ బ్రహ్మా తనువులోకి ప్రవేశించి మిమ్మల్ని దత్తత తీసుకుంటాను అని. ఆత్మలమైన మేము ఈశ్వరుని ఒడిలోకి వెళ్తామని మీకు తెలుసు. శరీరం లేకుండానైతే ఒడి ఉండదు. ఆత్మ అంటుంది, నేను శరీరం ద్వారా వారికి చెందినవానిగా అవుతాను. ఈ శరీరాన్ని వారు లోన్ రూపంలో తీసుకున్నారు. ఈ శరీరము వారిది కాదు. పరమాత్మ వీరిలో ప్రవేశించారు. ఆత్మలైన మీరు కూడా శరీరాలలో ప్రవేశించారు కదా! బాబా కూడా ఇలా అంటారు – నేను కూడా వీరిలో ఉన్నాను, ఒక్కోసారి కొడుకుగా అవుతాను, ఒక్కోసారి తల్లిగా కూడా అవుతాను. ఇంద్రజాలికుడు కదా. కానీ చాలా మంది ఈ ఆటపాటలను ఇంద్రజాలంగా భావిస్తారు. ప్రపంచంలో అసత్యమైన తాంత్రిక విద్యకు సంబంధించిన పనులు చాలా నడుస్తాయి. కృష్ణునిగా కూడా అవుతారు, ఎవరికైతే కృష్ణుని పట్ల నమ్మకం ఉంటుందో, వారికి వెంటనే కృష్ణుడు కనిపిస్తారు. ఇక వారిని నమ్ముతారు మరియు వారికి అనుచరులుగా కూడా అవుతారు. ఇక్కడైతే అంతా జ్ఞానానికి సంబంధించిన విషయము. మొదటగా, నేను ఆత్మను అన్న పక్కా నిశ్చయముండాలి మరియు బాబా అంటారు, నేను మీ తండ్రిని, పిల్లలైన మిమ్మల్ని త్రికాలదర్శులుగా చేస్తాను. ఇటువంటి జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. భక్తి మార్గం అంతమవ్వనున్నప్పుడు తండ్రికి రావాల్సి ఉంటుంది. చాలామందికి శివలింగము, అఖండ జ్యోతి స్వరూపము యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఎవరి భావన ఏ విధంగా ఉంటే, నేను అది పూర్తి చేస్తాను. కానీ నన్ను ఎవరూ కలుసుకోలేరు. నన్ను అయితే గుర్తించనే గుర్తించరు. ఇప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారు, బాబా కూడా బిందువు, మేము కూడా బిందువు. నా ఆత్మలో ఈ జ్ఞానముంది, మీ ఆత్మలో కూడా ఈ జ్ఞానముంది. ఆత్మనైన నేను పరంధామంలో నివసించేవాడినని ఎవ్వరికీ తెలియదు. మీరు బాబా ఎదురుగా వచ్చి కూర్చున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఓహో! జ్ఞానసాగరుడైన శివబాబా వీరిలో కూర్చుని మమ్మల్ని చదివిస్తారు. ఇకపోతే కృష్ణుడు లేక గోపికల యొక్క విషయమే లేదు. ఇక్కడా ఉండరు, సత్యయుగంలోనూ ఉండరు. అక్కడైతే ప్రతి రాకుమారుడు తమ-తమ మహళ్ళలో ఉంటారు. ఎవరైతే వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారో, ఈ విషయాలన్నింటినీ వారే అర్థం చేసుకుంటారు. కావున ఈ సంతోషం కూడా లోపల ఉండాలి. మీరు తల్లి-తండ్రి… అని అంటారు కూడా. కానీ దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. తండ్రి అన్న మాట సరిపోతుంది, మరి తల్లి అని ఎవరిని అంటారు. తల్లి అయితే తప్పకుండా కావాలి. ఈ తల్లికి వేరే తల్లి ఎవరూ ఉండరు. ఈ రహస్యం చాలా అర్థం చేసుకోవాల్సినది మరియు తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి అంటారు, మీలో కూడా ఏ అవగుణమూ ఉండకూడదు. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవు అని పాడుతారు కూడా. ఇప్పుడు పిల్లలు గుణవంతులుగా అవ్వాలి. కామము ఉండకూడదు, క్రోధము ఉండకూడదు. దేహ అహంకారం కూడా ఉండకూడదు.

ఈ సమయంలో మీరిక్కడ కూర్చొని ఉన్నారు, మేమిక్కడ ఉన్నామని మీకు తెలుసు, మరి ఉదాసీనత మొదలైనవి ఎందుకు కలగాలి. కానీ ఆ పరిపక్వ అవస్థ అంతిమంలోనే ఉంటుంది. అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే, గోప-గోపికలను అడగండి అని అంటూ ఉంటారు కూడా. ఇది అంతిమంలో జరుగుతుంది. మేము 75 శాతం అతీంద్రియ సుఖంలో ఉంటామని ఎవరూ అనలేరు. ఈ సమయంలో పాపాల భారం చాలా ఉంది. గురువు కృపతో లేక గంగా స్నానాలతో పాపాలు తొలగవు. తండ్రి అంతిమంలోనే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. కన్యల ద్వారా బాణాలు వేయించారని, వారు మరణించారని మరియు మరణించే సమయంలో గంగా జలాన్ని తాగించారని చూపిస్తారు. ఇక్కడ మీరు ఎప్పుడైతే మూర్ఛితులవుతారో, అప్పుడు మీకు బాబా స్మృతిని ఇప్పించడం జరుగుతుంది. మామేకమ్ (నన్నొక్కడినే), ఇది పిల్లలకు అలవాటైపోవాలి. ఎవరో స్మృతిని ఇప్పించాలి అన్నట్లు ఉండకూడదు. శరీరం వదిలే సమయంలో దానంతటదే స్మృతి కలగాలి. ఎవరి సహాయము లేకుండా, తండ్రిని స్మృతి చేయాలి. వారైతే మంత్రాలు ఇస్తారు. అది సాధారణ విషయము. ఆ సమయంలో చాలా కొట్లాటలు మొదలైనవి జరుగుతాయి. మీరు వేర్వేరు స్థానాలలో ఉంటారు. శివ శివ అని అనమని, ఆ సమయంలో చెప్పరు. ఆ సమయంలో పూర్తి స్మృతి ఉండాలి, ప్రేమ ఉండాలి, అప్పుడే నంబరువన్ పదవిని ప్రాప్తి చేసుకోగలరు. పిల్లలైన మీకు తెలుసు, నేను మీ తండ్రిని, కల్పక్రితం కూడా పిల్లలైన మిమ్మల్ని పుష్పాలుగా తయారుచేసాను. సత్యయుగంలో యోగబలంతో పుష్పాల వంటి పిల్లలు జన్మిస్తారు. దుఃఖమిచ్చేటువంటి వస్తువేదీ అక్కడ ఉండదు. దాని పేరే స్వర్గము. కానీ అక్కడ ఎవరు నివసిస్తారు – ఇది భారతవాసులకు తెలియనే తెలియదు. శాస్త్రాలలో, అక్కడ కూడా హిరణ్యకశిపుడు మొదలైనవారు ఉండేవారని చెప్తూ, చాలా విషయాలు రాసేసారు – ఇదంతా భక్తి యొక్క సామాగ్రి. భక్తి కూడా మొదట సతోప్రధానంగా ఉండేది. తర్వాత నెమ్మది నెమ్మదిగా తమోప్రధానమవుతూ ఉంటుంది.

తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఆకాశానికి ఎక్కిస్తాను, మీరు మెల్ల-మెల్లగా కిందకు వచ్చేస్తారు. మనుష్యులెవ్వరికీ మహిమ లేనే లేదు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. మిగిలిన గురువులు అనేక రకాల తీర్థయాత్రలు మొదలైనవి నేర్పిస్తారు, అయినా కూడా కిందకు పడిపోతూ ఉంటారు. భక్తి మార్గంలో మీరాకు సాక్షాత్కారాలు కలిగాయి. కానీ వారేమైనా విశ్వానికి యజమానిగా అయ్యారా. మీకైతే బాబా చెప్తారు, జిన్నుగా అవ్వండి. మీకు పని ఇస్తున్నాను – కేవలం అల్ఫ్ (భగవంతుడిని), బే (వారసత్వాన్ని) స్మృతి చేస్తూ ఉండండి. ఒకవేళ అలసిపోతే, స్మృతి చేయకపోతే, మాయ కచ్చాగా తినేస్తుంది. జిన్ను తినేసాడు అని ఒక కథ కూడా ఉంది. బాబా కూడా అంటారు, మీరు స్మృతి చేయకపోతే మాయ కచ్చాగా తినేస్తుంది. స్మృతిలో కూర్చోవడంతో సంతోషం కలుగుతుంది. బాబా మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. బాబా ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఆత్మలైన మీరు వింటారు. మధురమైన ప్రియమైన పిల్లలూ, నేను మిమ్మల్ని ముక్తిధామంలోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. తిరిగి వెళ్ళేందుకు చాలా ప్రయత్నిస్తారు కానీ ఎవ్వరూ వెళ్ళలేరు. కలియుగము తర్వాత సత్యయుగము, రాత్రి తర్వాత పగలు రావాల్సిందే. సత్యయుగంలో మనమే ఉంటామని మీకు తెలుసు. బాబా మళ్ళీ మనకు రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. సంతోషం యొక్క పాదరసం అంతిమంలో పైకి ఎక్కుతుంది. ఫైనల్ అయినప్పుడు వినాశనమైపోతుంది. మీరు సాక్షిగా అయి చూస్తూ ఉంటారు. అనవసరమైన రక్తపాతము కదా. ఏం అపరాధం చేసారని వారిని హతమార్చడానికి బాంబులు మొదలైనవి తయారుచేసారు. తప్పకుండా మరణిస్తారు. వారికి కూడా అనిపిస్తుంది, మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు, అందుకే వద్దనుకున్నా కూడా మేము ఈ బాంబులు మొదలైనవి తయారుచేస్తున్నాము అని. చాలా ఖర్చు అవుతుంది. డ్రామాలో నిశ్చితమై ఉంది, వీటి ద్వారా వినాశనం జరిగేదే ఉంది. అనేక ధర్మాల మధ్యన ఏక ధర్మము రాజ్యం చేయలేదు. ఇప్పుడు అనేక ధర్మాల వినాశనం జరిగి, ఏక ధర్మ స్థాపన జరగనున్నది.

మనం బాబా శ్రీమతంపై రాజ్యస్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. వారేమో డ్రిల్లు మొదలైనవి నేర్చుకునేందుకు మైదానంలోకి వెళ్ళిపోతారు. చావాలి మరియు చంపాలి అని భావిస్తారు. ఇక్కడైతే అటువంటి విషయం లేదు. బాబా వచ్చారని చాలా సంతోషం ఉండాలి, ప్రాచీన భారత్ యొక్క రాజయోగాన్ని నిరాకార భగవంతుడే నేర్పించారు. వారి పేరును మార్చి కృష్ణుడిది పెట్టారు. మాదే ప్రాచీన యోగము అని సన్యాసులు భావిస్తారు. మీకు ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. పిల్లలూ, నన్ను గుర్తించారా – నేను మీ తండ్రిని. నన్నే పతితపావనుడని, జ్ఞానసాగరుడని అంటారు. కృష్ణుడైతే పతిత ప్రపంచంలోకి రాలేరు. కృష్ణుడినేమో ద్వాపరంలోకి తీసుకువెళ్ళారు. ఎంత అపార్థము, పూర్తిగా తమోప్రధానంగా అయిపోయారు. అందరినీ ముక్తిధామంలోకి తీసుకువెళ్ళాల్సి వచ్చినప్పుడే నేను వస్తాను.

మీకు తెలుసు, మనం చదువుకుంటున్నాము. మనం ఈశ్వరీయ విద్యార్థులము. ఇది స్మరణ చేసుకుంటూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బాబా, పిల్లలైన మీకు జ్ఞానం యొక్క గర్భాన్ని ధారణ చేయిస్తున్నారు. మరి మీరు ఇది ఎందుకు మర్చిపోతారు. బిడ్డ జన్మిస్తూనే, బాబా అని అనడం మొదలుపెడతాడు. నేను వారసుడిని అని అర్థం చేసుకుంటాడు. కావున నిరంతరం తాతగారిని స్మృతి చేయండి. బాబా మతాన్ని ఇస్తారు, పిల్లలూ, కామం మహాశత్రువు, ఇది మీకు ఆదిమధ్యాంతాలు చాలా దుఃఖాన్ని ఇచ్చింది. ఇది మృత్యులోకము, వేశ్యాలయము. రాముడు శివాలయాన్ని తయారుచేస్తారు, అక్కడ దేవీ-దేవతల రాజ్యం ఉంటుంది. కానీ వారు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అనేది మీరిప్పుడు తెలుసుకున్నారు. దేవీ-దేవతలు ఎప్పుడూ పునర్జన్మలు తీసుకోరని వారు భావిస్తారు. ఎవరైనా ఒక పెద్ద వ్యక్తికి అర్థమైతే, ఆ శబ్దము వ్యాపిస్తుంది. పేదవారి మాటనైతే ఎవ్వరూ వినరు. మీలో కూడా ధారణ కలవారు నంబరువారుగా ఉన్నారు. స్కూలు ఒక్కటే. టీచరు ఒక్కరే. ఇకపోతే చదువుకునేవారు అందరూ నంబరువారుగా ఉన్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాయ దాడి నుండి రక్షించుకునేందుకు జిన్నుగా అయి అల్ఫ్ (భగవంతుడిని) మరియు బే (వారసత్వాన్ని) స్మృతి చేస్తూ ఉండాలి. తలపై ఏదైతే పాపాల భారముందో, దానిని యోగబలంతో తొలగించాలి. అతీంద్రియ సుఖంలో ఉండాలి.

2. నోటితో కేవలం శివ-శివ అని అనకూడదు. తండ్రి పట్ల సత్యమైన ప్రేమను పెట్టుకోవాలి. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేసే సేవలో తత్పరులై ఉండాలి.

వరదానము:-

సదా విజయులుగా అయ్యేందుకు సహజమైన సాధనము – ఒకే బలము, ఒకే నమ్మకము. ఒక్కరిపై నమ్మకం ఉన్నట్లయితే, బలం లభిస్తుంది. నిశ్చయం సదా నిశ్చింతగా చేస్తుంది మరియు ఎవరి స్థితి నిశ్చింతగా ఉంటుందో, వారి ప్రతి కార్యంలో సఫలత ఉంటుంది ఎందుకంటే నిశ్చింతగా ఉండడంతో బుద్ధి యథార్థంగా నిర్ణయిస్తుంది. కనుక యథార్థ నిర్ణయానికి ఆధారము – నిశ్చయబుద్ధి, నిశ్చింతత. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఫాలో ఫాదర్ చేయాలి (తండ్రిని అనుసరించాలి), అడుగుపై అడుగు వేయాలి, ఏ శ్రీమతం లభిస్తే, దాని అనుసారంగానే నడుచుకోవాలి. కేవలం శ్రీమతం యొక్క అడుగులపై అడుగులు వేస్తూ వెళ్ళినట్లయితే, విజయీ రత్నాలుగా అవుతారు.

స్లోగన్:-

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు

ఈ సంగమ సమయంలో, ఈశ్వరీయ జ్ఞానం ఏదైతే మనకు లభిస్తుందో, ఇదే జ్ఞానం మళ్ళీ సత్యయుగంలో లభిస్తుందా? ఇప్పుడు దీని గురించి అర్థం చేయించడం జరుగుతుంది – సత్యయుగంలోనైతే మనం స్వయం జ్ఞాన స్వరూపులుగా ఉంటాము. దేవతా ప్రారబ్ధాన్ని అనుభవిస్తాము, అక్కడ జ్ఞానం ఇచ్చిపుచ్చుకోవడం జరగదు, జ్ఞానం యొక్క అవసరం అజ్ఞానులకు ఉంటుంది. సత్యయుగంలోనైతే అందరూ జ్ఞాన స్వరూపులు, అక్కడ జ్ఞానం ఇవ్వాల్సిన అవసరముండేందుకు అజ్ఞానులెవ్వరూ ఉండనే ఉండరు. ఈ సమయంలో మనకు, మొత్తం విరాట డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు తెలుసు. ఆదిలో మనం ఎవరిమి, ఎక్కడి నుండి వచ్చాము మరియు మధ్యలో కర్మబంధనాలలో చిక్కుకున్నాము, మరియు ఎలా పడిపోయాము, అంతిమంలో మనం కర్మబంధనాల నుండి అతీతంగా అయి కర్మాతీత దేవతలుగా అవ్వాలి. ఇప్పుడు ఏదైతే పురుషార్థం నడుస్తుందో, దీని ద్వారా మనం భవిష్య ప్రారబ్ధమైన సత్యయుగీ దేవతలుగా అవుతాము. ఒకవేళ అక్కడ మనకు, దేవతలమైన మేము పడిపోతాము అనే తెలిస్తే, ఆ ఆలోచన రావడంతోనే సంతోషం మాయమైపోతుంది. కావున అక్కడ పడిపోవడం గురించిన జ్ఞానం ఉండదు. ఈ ఆలోచన అక్కడ ఉండదు. మనం ఎక్కాలి మరియు సుఖమయమైన జీవితాన్ని తయారుచేసుకోవాలి అని మనకు ఈ జ్ఞానం ద్వారా ఇప్పుడు తెలిసింది. అర్ధకల్పం తమ ప్రారబ్ధాన్ని అనుభవించి, మళ్ళీ తమను తాము మర్చిపోయి, మాయకు వశమై పడిపోతారు. ఈ ఎక్కడము మరియు పడిపోవడము, అనాదిగా తయారై తయారుచేయబడిన ఆట. ఈ జ్ఞానమంతా ఇప్పుడు బుద్ధిలో ఉంది, ఇది సత్యయుగంలో ఉండదు. అచ్ఛా – ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top