04 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 3, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - శ్రీమతం ఆధారంగా పవిత్రంగా అయినట్లయితే ధర్మరాజు శిక్షల నుండి విముక్తులవుతారు, వజ్రతుల్యంగా అవ్వాలంటే జ్ఞానామృతాన్ని తాగండి, విషాన్ని విడిచిపెట్టండి’’

ప్రశ్న: -

సత్యయుగీ పదవి యొక్క ఆధారమంతా ఏ విషయం పై ఉంది?

జవాబు:-

పవిత్రత పై. మీరు స్మృతిలో ఉంటూ పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. పవిత్రంగా అవ్వడంతోనే సద్గతి లభిస్తుంది. ఎవరైతే పవిత్రంగా అవ్వరో, వారు శిక్షలను అనుభవించి తమ ధర్మంలోకి వెళ్ళిపోతారు. మీరు ఇంట్లో ఉంటే ఉండండి కానీ ఏ దేహధారినీ స్మృతి చేయకండి, పవిత్రంగా ఉండండి, అప్పుడు ఉన్నత పదవి లభిస్తుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము మొత్తం ప్రపంచాన్ని పొందాము… (తుమ్హే పాకే హమ్నే జహాన్ పా లియా హై…)

ఓంశాంతి. శివ భగవానువాచ, ఇతరులెవ్వరినీ కూడా భగవంతుడు అని అనడం జరగదు, ఒక్క నిరాకార పరమపిత పరమాత్ముడినే శివబాబా అని అనడం జరుగుతుంది. వారు ఆత్మలందరికీ తండ్రి. మొట్టమొదట ఈ నిశ్చయం ఉండాలి – మేము తప్పకుండా శివబాబా పిల్లలము అని. దుఃఖం సమయంలో – పరమాత్మా, సహాయం చేయండి, దయ చూపండి అని అంటారు. నా ఆత్మ పరమాత్మను స్మృతి చేస్తుందని, ఆత్మనైన నాకు వారు తండ్రి అని కూడా తెలియదు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పతితాత్మలది. మేము పాపులము, నీచులము, మీరు సంపూర్ణ నిర్వికారులు అని పాడుతారు. అయినా కూడా స్వయాన్ని ఆ విధంగా భావించరు. తండ్రి అర్థం చేయిస్తారు, మీరు తండ్రి అయిన భగవంతుడు ఒక్కరే అని అన్నప్పుడు మీరంతా పరస్పరంలో సోదరులుగా అయ్యారు. తర్వాత శరీరం పరంగా అందరూ సోదరీ-సోదరులుగా ఉన్నారు. శివబాబాకు పిల్లలుగా ఉన్నారు, ఇంకా ప్రజాపిత బ్రహ్మాకు కూడా పిల్లలుగా ఉన్నారు. వీరు మీ అనంతమైన తండ్రి, టీచరు, గురువు. వీరంటారు, నేను మిమ్మల్ని పతితంగా చేయను. నేను మిమ్మల్ని పావనంగా చేయడానికి వచ్చాను, కానీ ఒకవేళ నా మతంపై నడిస్తే అప్పుడు. ఇక్కడైతే మనుష్యులందరూ రావణుడి మతంపై ఉన్నారు. అందరిలోనూ 5 వికారాలు ఉన్నాయి. తండ్రి అంటారు, పిల్లలూ, ఇప్పుడు నిర్వికారులుగా అవ్వండి, శ్రీమతంపై నడవండి. కానీ వికారాలను వదలనే వదలరు. కావున స్వర్గానికి యజమానులుగా అవ్వరు. అందరూ అజామిళ్ వంటి పాపులుగా తయారయ్యారు. రావణ సంప్రదాయం ఉంది, ఇది శోకవాటిక, ఎంత దుఃఖితులుగా ఉన్నారు. తండ్రి వచ్చి మళ్ళీ రామ రాజ్యాన్ని తయారుచేస్తారు. కావున పిల్లలైన మీకు తెలుసు, ఇది సత్యాతి-సత్యమైన యుద్ధ మైదానము. గీతలో భగవంతుడు అంటారు, కామం మహాశత్రువు, దానిపై విజయం పొందండి. కానీ పొందడం లేదు. ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీ ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా వింటుంది, మళ్ళీ వినిపిస్తుంది, పాత్రను ఆత్మ అభినయిస్తుంది. మనం ఆత్మలము, శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తాము. కానీ మనుష్యులు ఆత్మాభిమానులకు బదులుగా దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటారు, దేహీ-అభిమానులుగా అవ్వండి. సత్యయుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారు. పరమాత్మ గురించి తెలియదు. ఇక్కడ మీరు దేహాభిమానులుగా ఉన్నారు మరియు పరమాత్మ గురించి కూడా తెలియదు. అందుకే మీకు ఇటువంటి దుర్గతి ఏర్పడింది. దుర్గతిని కూడా అర్థం చేసుకోరు. ఎవరి వద్దనైతే చాలా ధనముందో, వారు మేము స్వర్గంలో కూర్చున్నామని భావిస్తారు. తండ్రి అంటారు, వీరంతా పేదవారిగా అయిపోతారు ఎందుకంటే వినాశనం జరగనున్నది. వినాశనం జరగడమైతే మంచిదే కదా. మనం తిరిగి ముక్తిధామానికి వెళ్ళిపోతాము, ఇందులోనైతే సంతోషించాలి. మీరు మరణించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మనుష్యులైతే మరణించేందుకు భయపడతారు. తండ్రి మిమ్మల్ని వైకుంఠానికి తీసుకువెళ్ళేందుకు యోగ్యులుగా చేస్తున్నారు. పతితులైతే పతిత ప్రపంచంలోనే జన్మలు తీసుకుంటూ ఉంటారు. స్వర్గవాసులుగా ఎవ్వరూ అవ్వరు. తండ్రి అంటారు, ముఖ్యమైన విషయము, పవిత్రంగా అవ్వండి. పవిత్రంగా అవ్వకుండా పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళలేరు. పవిత్రత విషయంలోనే అబలలకు దెబ్బలు పడతాయి. విషాన్ని అమృతంగా భావిస్తారు. తండ్రి అంటారు, జ్ఞానామృతంతో మిమ్మల్ని వజ్రం వలె తయారుచేస్తాను, మరి మీరు విషాన్ని తిని గవ్వ వలె ఎందుకు అవుతారు? అర్ధకల్పం మీరు విషం తిన్నారు, ఇప్పుడు నా ఆజ్ఞను పాటించండి. లేదంటే ధర్మరాజు శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. లౌకిక తండ్రి కూడా అంటారు, పిల్లలూ, కులం పేరు అప్రతిష్ఠపాలు అయ్యే కర్మలేవీ చేయకండి. అనంతమైన తండ్రి అంటారు, శ్రీమతంపై నడవండి, పవిత్రంగా అవ్వండి. ఒకవేళ కామ చితిపై కూర్చొంటే, మీ ముఖం ఇప్పటికే నల్లగా ఉంది, ఇంకా నల్లగా అయిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని జ్ఞాన చితిపై కూర్చోబెట్టి తెల్లగా చేస్తారు. కామ చితిపై కూర్చోవడంతో స్వర్గం యొక్క ముఖాన్ని కూడా చూడలేరు, అందుకే తండ్రి అంటారు, ఇప్పుడు శ్రీమతంపై నడవండి. తండ్రి అయితే పిల్లలతోనే మాట్లాడుతారు కదా. పిల్లలకే తెలుసు, తండ్రి మాకు స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అని. కలియుగం ఇప్పుడు పూర్తవ్వనున్నది. ఎవరైతే తండ్రి శ్రీమతంపై నడుస్తారో, వారికే సద్గతి లభిస్తుంది. పవిత్రంగా అవ్వకపోతే శిక్షలను అనుభవించి తమ ధర్మంలోకి వెళ్ళిపోతారు. భారతవాసులే స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు పతితులుగా అయ్యారు. స్వర్గం గురించి తెలియనే తెలియదు. కావున తండ్రి అంటారు, మీరు నా శ్రీమతంపై నడవకుండా ఇతరుల మతంపై నడిచి, వికారాల్లోకి వెళ్ళారంటే మరణిస్తారు, అప్పుడిక చివర్లో స్వర్గంలోకి వచ్చినా కానీ చాలా తేలికపాటి పదవిని పొందుతారు. ఇప్పుడు ఎవరైతే షావుకార్లుగా ఉన్నారో, వారు పేదవారిగా అయిపోతారు. ఎవరైతే ఇక్కడ పేదవారిగా ఉన్నారో, వారు షావుకార్లుగా అవుతారు. తండ్రి పేదల పెన్నిధి. మొత్తం ఆధారమంతా పవిత్రతపై ఉంది. తండ్రితో యోగం జోడించినట్లయితే మీరు పావనంగా అవుతారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. నేను ఇళ్ళు-వాకిళ్ళ నుండి విడిపించను. ఇంట్లో ఉంటే ఉండండి కానీ వికారాల్లోకి వెళ్ళకండి మరియు ఏ దేహధారినీ కూడా గుర్తు చేయకండి. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. సత్యయుగంలో పావన దేవతలుగా ఉండేవారు. ఈ సమయంలో వారు కూడా పతితులుగా అయిపోయారు. పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మకు చేరుకున్నారు.

మీరందరూ పార్వతులు, మీకిప్పుడు అమరనాథుడైన తండ్రి అమరపురికి యజమానులుగా చేయడానికి, అమరకథను వినిపిస్తున్నారు. కావున ఇప్పుడు అమరనాథుడైన తండ్రిని స్మృతి చేయండి. స్మృతితోనే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇకపోతే శివుడు, శంకరుడు లేక పార్వతి పర్వతాలపైన ఏమీ కూర్చోలేదు. ఇవన్నీ భక్తి మార్గం యొక్క ఎదురుదెబ్బలు. అర్ధకల్పం చాలా ఎదురుదెబ్బలు తిన్నారు, ఇప్పుడు బాబా అంటారు, నేను మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకువెళ్తాను. సత్యయుగంలో సుఖమే సుఖముంటుంది. ఎదురుదెబ్బలు తినరు, కింద కూడా పడరు. ముఖ్యమైన విషయము పవిత్రంగా ఉండడము. ఇక్కడ ఎప్పుడైతే చాలా అత్యాచారాలు చేస్తారో, అప్పుడు పాపం యొక్క కుండ నిండుతుంది మరియు వినాశనమవుతుంది. ఇప్పుడు ఒక్క జన్మ పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. అయితే, దీని కోసం శ్రీమతమనుసారంగా నడుచుకోవాలి. ఒకవేళ కల్పక్రితం శ్రీమతంపై నడవలేదంటే ఇప్పుడు కూడా నడవరు, పదవిని కూడా పొందరు. మీరు ఒక్క తండ్రి పిల్లలు. మీరు పరస్పరంలో సోదరీ-సోదరులు అయ్యారు. కానీ తండ్రికి చెందినవారిగా అయి ఒకవేళ కిందపడితే, ఇంకా పాతాళములోకి వెళ్ళిపోతారు, ఇంకా పాపాత్మగా అయిపోతారు. ఇది ఈశ్వరీయ గవర్నమెంటు. ఒకవేళ నా మతంపై పవిత్రంగా అవ్వకపోతే ధర్మరాజు ద్వారా చాలా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. జన్మ-జన్మాంతరాలుగా ఏవైతే పాపాలు చేసారో, వాటన్నింటికీ శిక్షలు అనుభవించి లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాల్సి ఉంటుంది. యోగబలంతోనైనా వికర్మలను భస్మం చేసుకోవాల్సి ఉంటుంది లేక చాలా కఠినమైన శిక్షలనైనా అనుభవించాల్సి ఉంటుంది. ఎంతమంది బ్రహ్మాకుమారులు మరియు కుమారీలు ఉన్నారు, అందరూ పవిత్రంగా ఉంటారు, భారత్ ను స్వర్గంగా తయారుచేస్తారు. మీరు శివశక్తి పాండవ సైన్యము, గోప-గోపికలు, ఇందులో ఇరువురూ వచ్చేస్తారు. భగవంతుడు మిమ్మల్ని చదివిస్తారు. లక్ష్మీ-నారాయణులను భగవాన్-భగవతి అని అంటారు. వారికి తప్పకుండా భగవంతుడే వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. భగవంతుడే వచ్చి మిమ్మల్ని దేవతలుగా తయారుచేస్తారు. సత్యయుగంలో యథా రాజా-రాణి తథా ప్రజా ఉంటారు. అందరూ శ్రేష్ఠాచారులుగా ఉండేవారు. ఇప్పుడిది రావణ రాజ్యము. ఒకవేళ రామ రాజ్యంలోకి వెళ్ళాలంటే పవిత్రంగా అవ్వండి మరియు రాముని మతంపై నడవండి. రావణుడి మతంతోనైతే మీకు దుర్గతి జరుగుతుంది. కొందరిది ధూళిలో కలిసిపోతుంది… అని కూడా అంటూ ఉంటారు. బంగారం మొదలైనవాటిని భూమిలో, గోడలలో దాచి పెడతారు. అకస్మాత్తుగా మరణించినట్లయితే అదంతా అక్కడే ఉండిపోతుంది. వినాశనమైతే జరిగేదే ఉంది. భూకంపాలు మొదలైనవి జరిగినప్పుడు దొంగలు కూడా చాలా మంది వస్తారు. ఇప్పుడు నాథుడైన తండ్రి వచ్చారు, మిమ్మల్ని తమవారిగా చేసుకొని విశ్వానికి యజమానులుగా చేయడానికి. ఈ రోజుల్లో వానప్రస్థ అవస్థలో కూడా వికారాలు లేకుండా ఉండలేకపోతారు, పూర్తిగా తమోప్రధానం అయిపోయారు. తండ్రిని గుర్తించనే గుర్తించరు. తండ్రి అంటారు, నేను పవిత్రంగా చేయడానికి వచ్చాను. ఒకవేళ వికారాల్లోకి వెళ్ళినట్లయితే చాలా కఠినమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. నేను పవిత్రంగా తయారుచేసి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చాను. మీరు మళ్ళీ పతితంగా అయి విఘ్నాలు వేస్తారు! స్వర్గాన్ని రచించడంలో విఘ్నాలను కలిగించినట్లయితే చాలా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. నేను మిమ్మల్ని స్వర్గవాసులుగా చేయడానికి వచ్చాను. ఒకవేళ వికారాలను వదలకపోతే ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు అనుభవిస్తారు. దుఃఖంతో చాలా అలమటించాల్సి ఉంటుంది. ఇది ఇంద్ర సభ. కథ ఉంది కదా – అక్కడ జ్ఞాన ఫరిశ్తాలు ఉండేవి, ఎవరైనా పతితులను తీసుకొచ్చినట్లయితే వారికి వైబ్రేషన్ తెలిసేది. ఇక్కడ ఈ సభలో పతితులెవ్వరినీ కూర్చోబెట్టడం జరగదు. పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయకుండా ఇక్కడ కూర్చోబెట్టడం జరగదు. లేదంటే తీసుకొచ్చినవారిపైకి కూడా దోషం వస్తుంది. అయినా కూడా తీసుకొస్తారని తండ్రికైతే తెలుసు, అందుకే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శివబాబాను స్మృతి చేయడంతో ఆత్మ శుద్ధంగా అవుతుంది. వాయుమండలంలో సైలెన్స్ ఏర్పడుతుంది. నేను మీ తండ్రిని అని తండ్రే కూర్చుని పరిచయాన్ని ఇస్తారు. 5 వేల సంవత్సరాల క్రితం వలె మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా చేయడానికి వచ్చాను. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. యోగబలం ద్వారా వికర్మల లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకొని ఆత్మను శుద్ధంగా మరియు వాయుమండలాన్ని శాంతిగా చేయాలి.

2. తండ్రి శ్రీమతంపై సంపూర్ణ పావనంగా అయ్యే ప్రతిజ్ఞను చేయాలి. వికారాలకు వశమై స్వర్గ రచనలో విఘ్నరూపులుగా అవ్వకూడదు.

వరదానము:-

ఏ కార్యములోనైనా, సమయానికి బుద్ధి యథార్థమైన నిర్ణయం ఇచ్చినప్పుడే సఫలత ప్రాప్తిస్తుంది. కానీ మనసు-బుద్ధి స్వచ్ఛంగా ఉన్నప్పుడు, ఎలాంటి చెత్త లేనప్పుడు నిర్ణయ శక్తి పని చేస్తుంది. అందుకే యోగాగ్ని ద్వారా చెత్తను సమాప్తం చేసి బుద్ధిని స్వచ్చంగా చేసుకోండి. ఎలాంటి బలహీనత ఉన్నా – అది అశుద్ధత. కొద్దిగా వ్యర్థ సంకల్పం ఉన్నా కూడా అది చెత్తనే. ఎప్పుడైతే ఈ చెత్త సమాప్తమవుతుందో, అప్పుడు నిశ్చింతగా ఉంటారు మరియు స్వచ్ఛ బుద్ధి ఉండటం వలన ప్రతి కార్యంలో సఫలత ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-

మాతేశ్వరి గారి మధురమైన మహావాక్యాలు

ఈ కలియుగ ప్రపంచాన్ని నిస్సారమైన ప్రపంచమని ఎందుకు అంటారు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ సారము లేదు అనగా ఏ వస్తువులోనూ ఆ శక్తి లేక సుఖము, శాంతి, పవిత్రత లేవు. ఈ సృష్టిలో ఒకానొక సమయంలో సుఖము, శాంతి, పవిత్రత ఉండేవి, ఇప్పుడవి లేవు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో 5 భూతాలు ప్రవేశించి ఉన్నాయి, అందుకే ఈ సృష్టిని భయ సాగరమని లేక కర్మబంధన సాగరమని అంటారు, ఇందులో ప్రతి ఒక్కరు దుఃఖితులుగా అయి పరమాత్మను పిలుస్తున్నారు – పరమాత్మా, మమ్మల్ని భవ సాగరం నుండి దాటించండి. దీని ద్వారా ఋజువవుతుంది, ఏమనంటే – తప్పకుండా ఏదో భయం లేని ప్రపంచం అనగా నిర్భయతా ప్రపంచం కూడా ఉంది, అందులోకి వెళ్ళాలని కోరుకుంటారు, అందుకే ఈ ప్రపంచాన్ని పాపాల సాగరమని అంటారు, దీనిని దాటి పుణ్యాత్ముల ప్రపంచంలోకి వెళ్ళాలని కోరుకుంటారు. కనుక రెండు ప్రపంచాలు ఉన్నాయి, ఒకటి సత్యయుగీ సారయుక్తమైన ప్రపంచము, రెండవది కలియుగీ నిస్సారమైన ప్రపంచము. రెండు ప్రపంచాలు ఈ సృష్టిపై ఉంటాయి.

మనుష్యులంటారు, ఓ ప్రభు, మమ్మల్ని ఈ భవ సాగరం నుండి అటువైపుకు తీసుకువెళ్ళండి అని, అటువైపు అంటే అర్థమేమిటి? మనుష్యులు అనుకుంటారు, అటువైపుకు అంటే జనన-మరణ చక్రంలోకి రాకపోవడము అనగా ముక్తులుగా అవ్వడము అని. ఇప్పుడిది మనుష్యులు చెప్పింది, కానీ పరమాత్మ అంటారు – పిల్లలూ, నిజంగా ఎక్కడైతే సుఖ-శాంతులు ఉన్నాయో, దుఃఖము-అశాంతి నుండి దూరంగా ఉందో, ఆ ప్రపంచంలోకి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. మీరు సుఖాన్ని కోరుకుంటున్నారంటే తప్పకుండా అది ఈ జీవితంలోనే ఉండాలి. ఇప్పుడు అదైతే సత్యయుగీ వైకుంఠంలోని దేవతల ప్రపంచము, అక్కడ సదా సుఖమయమైన జీవితం ఉండేది, ఆ దేవతలను అమరులని అనేవారు. ఇప్పుడు అమరులు అన్నదానికి కూడా ఏ అర్థము లేదు, అయితే, దేవతల ఆయువు ఎంత ఎక్కువగా ఉండేదంటే వారు ఎప్పుడూ మరణించరు అన్నట్లు కాదు, ఇప్పుడు ఇలా చెప్పడం వారి పొరపాటు ఎందుకంటే అలా లేరు. వారి ఆయువు సత్య-త్రేతాయుగాలంతా నడవదు, కానీ దేవీ-దేవతల జన్మలు సత్య-త్రేతాయుగాలలో చాలా జరిగాయి, 21 జన్మలైతే వారు బాగా రాజ్యం చేసారు మరియు ఆ తర్వాత ద్వాపరం నుండి కలియుగ అంతిమం వరకు 63 జన్మలు ఉంటాయి. వారికి మొత్తం ఎక్కే కళకు చెందిన జన్మలు 21 మరియు దిగే కళకు చెందినవి 63, పూర్తిగా మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారు. ఇకపోతే మనుష్యులు 84 లక్షల యోనులను అనుభవిస్తారని మనుష్యులు ఏదైతే భావిస్తారో, అలా అనడం తప్పు. ఒకవేళ మనిషి తన యోనిలోనే సుఖము, దుఃఖము, రెండు పాత్రలను అనుభవించగలిగినప్పుడు మళ్ళీ జంతువుల యోనిలో అనుభవించాల్సిన అవసరం ఏముంది. ఇకపోతే సృష్టిపై మొత్తం జంతువులు, పశుపక్ష్యాదులన్నీ కలిపి 84 లక్షల యోనులు ఉండవచ్చు ఎందుకంటే అనేక రకాల జీవులున్నాయి. కానీ మనుషులు, మనుష్య యోనిలోనే తమ పాప పుణ్యాలు అనుభవిస్తున్నారు మరియు జంతువులు తమ-తమ యోనులలో అనుభవిస్తున్నాయి. మనిషి జంతువుల యోనిని తీసుకోడు మరియు జంతువులు మనుష్య యోనిలోకి రావు. మనుష్యులకు తమ యోనిలోనే అనుభవించాల్సి ఉంటుంది, అందుకే అతనికి మనుష్య జీవితంలోనే సుఖ దుఃఖాలు అనుభవమవుతాయి. అలాగే జంతువులు కూడా తమ యోనులలోనే సుఖ-దుఃఖాలను అనుభవించాలి. కానీ ఏ కర్మ వలన ఇది అనుభవిస్తున్నాను అని తెలుసుకునే బుద్ధి వాటికి లేదు. అవి అనుభవించడం కూడా మనిషి ఫీల్ అవుతాడు ఎందుకంటే మనిషి బుద్ధిమంతుడు, అంతేకానీ మనుష్యులు 84 లక్షల యోనులను అనుభవిస్తారని కాదు. మనుష్యులను భయపెట్టడం కోసం ఇలా అంటారు, ఒకవేళ తప్పుడు కర్మలు చేస్తే పశువు యోనిలో జన్మ లభిస్తుంది అని. మనం కూడా ఇప్పుడు ఈ సంగమ సమయంలోనే మన జీవితాన్ని పరివర్తన చేసుకుని పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతున్నాము. అచ్ఛా – ఓంశాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top