26 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

April 25, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఉన్నత పదవిని పొందాలంటే ఆత్మలో జ్ఞానం యొక్క పెట్రోల్ ను నింపుతూ వెళ్ళండి, ఉదయముదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి, ఎటువంటి తప్పుడు నడవడికను నడవకండి’’

ప్రశ్న: -

బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరి యొక్క జన్మపత్రి గురించి తెలిసినా కూడా వినిపించరు, ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే బాబా అంటారు – నేను శిక్షకుడిని, నా పని పిల్లలైన మీకు శిక్షణ ఇచ్చి బాగు చేయడము. ఇకపోతే మీ లోపల ఏముందో, అది నేను వినిపించను. నేను ఆత్మకు ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చాను, అంతేకానీ శారీరక వ్యాధులను సరి చేయడానికి కాదు.

ప్రశ్న: -

పిల్లలైన మీరు ఇప్పుడు ఏ విషయానికి భయపడరు, ఎందుకు?

జవాబు:-

మీరు ఇప్పుడు ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టేందుకు భయపడరు, ఎందుకంటే – ఆత్మనైన నేను అవినాశీ అని మీ బుద్ధిలో ఉంది. ఇకపోతే, ఈ పాత శరీరం పోయినా కానీ నేనైతే తిరిగి ఇంటికి వెళ్ళాలి. నేను అశరీరి ఆత్మను. ఇకపోతే ఈ శరీరంలో ఉంటూ తండ్రి నుండి జ్ఞానామృతాన్ని తాగుతున్నాను. కనుక బాబా అంటారు, పిల్లలూ, సదా జీవిస్తూ ఉండండి. సర్విసబుల్ (సేవా యోగ్యులు) గా అయినట్లయితే ఆయుష్షు పెరుగుతూ ఉంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

బాల్యపు రోజులను మర్చిపోకండి … (బచ్పన్ కే దిన్ భులా నా దేనా…)

ఓంశాంతి. పిల్లలు పాటను విన్నారు. ఇప్పుడు ఎవరినైతే మమ్మా-బాబా అని అంటున్నారో, వారిని మర్చిపోకూడదు. పాటను ఎవరైతే తయారుచేసారో, వారికైతే అర్థం తెలియదు. మేము ఆ పరమపిత పరమాత్ముని సంతానము అన్న నిశ్చయమే లేదు. ఆ పరమపిత పరమాత్మకు, పతితులను పావనంగా చేసేందుకు రావాల్సి ఉంటుంది. ఎంత ఉన్నతమైన సేవ కోసం వస్తారు. వారికి ఎటువంటి అభిమానము లేదు, వారిని నిరహంకారి అని అంటారు. వారు నిశ్చయబుద్ధి కలవారిగా లేక దేహీ-అభిమానులుగా అయ్యేటువంటి విషయమేమీ లేదు. వారెప్పుడూ సంశయంలోకి రారు, దేహాభిమానులుగా అవ్వనే అవ్వరు. మనుష్యులు దేహాభిమానులుగా అవుతారు కావున మళ్ళీ దేహీ-అభిమానులుగా అవ్వడానికి ఎంత శ్రమ కలుగుతుంది. బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. మనుష్యులేమో, స్వయాన్ని పరమాత్మగా భావించండి అని అంటారు. ఎంత తేడా ఉంది. ఒకవైపు పతితపావనుడిని స్మృతి చేస్తారు, మరోవైపు అందరిలోనూ పరమాత్మ ఉన్నారని అంటారు. వారికి వెళ్ళి అర్థం చేయించాలి. బాబాను చూడండి, పిల్లలైన మిమ్మల్ని బాగు చేయడానికి ఎక్కడ నుండి వచ్చారు. ఎవరికైతే పక్కా నిశ్చయముందో, వారంటారు – తప్పకుండా మీరు మా తల్లి-తండ్రి, మేము మీ శ్రీమతంపై నడుస్తూ శ్రేష్ఠ దేవతలుగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చాము. పరమాత్మ అయితే సదా పావనంగానే ఉంటారు. వారిని పతిత ప్రపంచంలోకి రండి అని పిలుస్తారు. కావున తప్పకుండా పతిత శరీరంలోకే వారికి రావాల్సి ఉంటుంది. పతిత ప్రపంచంలోనైతే పావన శరీరము ఉండనే ఉండదు. కావున తండ్రిని చూడండి – వారు ఎంతటి నిరహంకారి, పతిత శరీరంలోకి వారికి రావాల్సి ఉంటుంది. మనం స్వయాన్ని సంపూర్ణులుగా చెప్పుకోము, ఇప్పుడు అలా తయారవుతున్నాము.

ఇప్పుడు అనంతమైన తండ్రి అంటారు, పిల్లలూ, శ్రీమతంపై నడవండి. తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు – ఉదయాన్నే లేచి స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయి. శ్రీమతంపై నడవకపోతే వికర్మలు వినాశనమవ్వవు, కోతుల్లానే ఉండిపోతారు, ఆ తర్వాత చాలా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. జంతువులు మొదలైనవైతే శిక్షలు అనుభవించవు. శిక్షలు మనుష్యుల కోసము. ఒకవేళ ఎద్దు ఎవరినైనా హతమారిస్తే, అవతలి వారు మరణించినా కూడా ఎద్దును జైల్లో వేస్తారా! మనుష్యులనైతే వెంటనే జైల్లో వేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఈ సమయంలో మనుష్యులైతే వాటికన్నా హీనంగా ఉన్నారు. అటువంటివారు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. బాబా అర్థం చేయిస్తారు, ఈ లక్ష్మీ-నారాయణులకు కూడా గీతా జ్ఞానం తెలియదు. అక్కడ అవసరమే ఉండదు ఎందుకంటే తండ్రి రచయిత. అక్కడ త్రికాలదర్శులు ఎవరూ ఉండనే ఉండరు. ఇప్పుడు, ఈ మనుష్యులు త్రికాలదర్శులు కానప్పటికీ మేము భగవంతుడు అని చెప్పుకుంటారు. కావున పెద్ద అక్షరాలలో రాయండి, గీతా భగవంతుడు పరమపిత పరమాత్మ, అంతేకానీ కృష్ణుడు కాదు. ముఖ్యంగా ఈ ఒక్క పొరపాటు ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. అంతేకాక పిల్లలు కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోబెట్టరు. భారత్ యే స్వర్గంగా ఉండేది అనే విషయాన్ని మర్చిపోయారు. కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని చెప్పారు, అందుకే ఏదైనా పురాతన వస్తువు దొరికితే, ఇది లక్షల సంవత్సరాల నాటిది అని అంటారు. అప్పుడప్పుడు కొందరు, క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేదని చెప్తారు. మనం కూడా దేవతలుగా ఉండేవారమని మీకు తెలుసు. మాయ పూర్తిగా గవ్వతుల్యంగా చేసేసింది. ఇప్పుడు ఏ విలువా లేదు. కావున పిల్లలైన మీరు కూడా ఘోర అంధకారం నుండి బయటపడాలి. నీవేమైనా కోతివా అని మిమ్మల్ని కూడా అనాల్సి వచ్చేటువంటి పనులేవీ చేయకూడదు. మీ మురికి పట్టిన వస్త్రాలను శుభ్రపరిచేందుకు నేను ఎంత దూరదేశం నుండి వస్తాను, మీ ఆత్మ పూర్తిగా మురికిగా అయిపోయింది. ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ జ్యోతి వెలుగుతుంది. జ్ఞానం యొక్క పెట్రోల్ ను నింపుతూ వెళ్ళండి. అప్పుడు అక్కడ ఏదో ఒక పదవిని పొందుతారు. అక్కడకు వెళ్ళి దాస-దాసీలుగా అయితే బాగుండదు. ఇది రాజయోగం కావున పదవి కూడా ఉన్నతమైనది పొందాలి. వెళ్ళి దాస-దాసీలుగా అయితే, భగవంతుడి నుండి ఏం వారసత్వం పొందినట్లు? ఏమీ పొందలేనట్లే. బాబాను ఎవరైనా అడిగితే, బాబా వెంటనే చెప్పగలరు. సూచనలతో పని చేయాలి. చెప్పకపోయినా పని చేసేవారు దేవతలు… చెప్పిన తర్వాత చేసేవారు మనుష్యులు. మీకిప్పుడు దేవతలుగా అయ్యేందుకు శ్రీమతం లభిస్తుంది. శ్రేష్ఠంగా తయారుచేసేటువంటి తండ్రి చెప్తున్నారు – ప్రదర్శనీలో పెద్ద-పెద్ద అక్షరాలతో ఎటువంటి బోర్డు తయారుచేయండి అంటే, దాని ద్వారా కృష్ణుడు భగవంతుడు కారు, వారు పునర్జన్మల్లోకి వస్తారని అందరి కళ్ళు తెరుచుకోవాలి. శ్రీ కృష్ణుడు జనన-మరణాలలోకి రారని, వారు ఇక్కడే హాజరై ఉన్నారని వాళ్ళు భావిస్తారు. హనుమంతుని పూజారులు, హనుమంతుడు ఇక్కడే హాజరై ఉన్నారని భావిస్తారు. ఇక్కడైతే ఒక్క తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. గీతా భగవంతుడు వజ్రతుల్యంగా తయారుచేస్తారు. వారి పేరును మార్చడంతో భారత్ కు ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ విషాన్ని ఇప్పుడు ఇంకా అంత తీవ్రతతో అర్థం చేయించలేదు. జ్ఞానసాగరుడైతే ఒక్కరే. వారే పతితపావనుడు. వాళ్ళు అయితే గంగను పతితపావని అని అంటారు. ఇప్పుడు సాగరం నుండే గంగ వెలువడింది కావున సాగరంలోకి వెళ్ళి స్నానమెందుకు చేయకూడదు? వారికి అర్థం చేయించేందుకు పిల్లల్లో దైవీ గుణాలు కావాలి. మేము కేవలం తండ్రి మహిమనే చేస్తామని అందరికీ అర్థం చేయించాలి. నిరాకార పరమాత్మనైతే అందరూ నమ్ముతారు కానీ కేవలం వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఓ రామా, ఓ పరమాత్మా అని కూడా అంటారు. మాలను స్మరిస్తారు కదా. పైన పుష్పము ఉంటుంది. దాని అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. పుష్పము మరియు మేరువు జంటపూసలు ఉంటాయి. మాతా-పితలు అని అన్నప్పుడు అది ప్రవృత్తి మార్గం కదా. రచనను రచిస్తే, తప్పకుండా మాతా-పితలు కావాలి. కావున వీరి ద్వారా కూర్చుని యోగ్యులుగా చేస్తారు, తర్వాత ఆ మాలే స్మరించబడుతుంది. పరమాత్మ రూపమేమిటి, ఆత్మ రూపమేమిటి అనేది కూడా తెలియదు. మీరు కొత్త విషయాన్ని విన్నారు. పరమాత్మ ఒక చిన్న బిందువు. ఇంత చిన్న బిందువును ఎవరైనా జ్ఞానసాగరునిగా భావిస్తారా? ఇది ఆశ్చర్యం కదా. వారు మనుష్యులను అలా భావిస్తారు కానీ అక్కడ మనుష్యులకు, మనుష్యుల ద్వారా జ్ఞానం లభిస్తుంది, దాని ద్వారా దుర్గతే జరిగింది. ఇక్కడైతే భగవంతుడు స్వయంగా వచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి సద్గతి చేస్తారు అనగా రాజులకే రాజులుగా తయారుచేస్తారు. మీరు ఆశ్చర్యపోతారు, ఏమనంటే – ఆత్మ చిన్న బిందువు, అతి సూక్ష్మమైనది, కావున తండ్రి కూడా ఆ విధంగానే ఉంటారు కదా, కానీ వారు ఎంత పెద్ద అథారిటీ, వారు ఏ విధంగా పతిత ప్రపంచంలోకి మరియు పతిత శరీరంలోకి వచ్చి చదివిస్తారు. ఈ విషయాల గురించి మనుష్యులకేమి తెలుసు. వారైతే తలకిందులుగా వేలాడుతున్నారు. ఇప్పుడు తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు – ఎవరైతే నా మతంపై నడుస్తారో, వారే స్వర్గానికి యజమానులుగా అవుతారు, ఇందులో భయపడే విషయమేమీ లేదు. ఆత్మనైన నేను అశరీరి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. నేనైతే అవినాశీ ఆత్మను. ఇక, ఈ పాత శరీరం పోయినా పర్వాలేదు. అయితే, బాబా జ్ఞానామృతాన్ని తాగిస్తున్నారు కావున జీవిస్తూ ఉండండి. వారిలో కూడా ఎవరైతే సర్విసబుల్ (సేవాయోగ్యులు) గా ఉంటారో, వారి ఆయుష్షు పెరుగుతుంది. ప్రదర్శినీలో చాలా సేవ జరగనున్నది, చాలా అభివృద్ధి జరుగుతుంది. శ్రీకృష్ణుని మహిమకు మరియు పరమాత్మ మహిమకు చాలా తేడా ఉంది. తండ్రి అంటారు, మీరు స్వర్గంలో పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితులుగా ఎలా అయ్యారు, తెలుసుకోవాలి కదా. తండ్రి వచ్చి రాతి బుద్ధి కలవారిని పారసంగా చేస్తారు.

ఈశ్వరీయ సంతానము ఎప్పుడూ ఎవరికీ మనసా-వాచా-కర్మణా దుఃఖమివ్వకూడదు. తండ్రి అంటారు, దుఃఖమిచ్చినట్లయితే, మహాన్ దుఃఖితులుగా అయి మరణిస్తారు. ఎల్లప్పుడూ అందరికీ సుఖమివ్వాలి. ఇంట్లో, అతిథులకు చాలా మంచి సేవ చేస్తారు. ఇది పాత శరీరము, కర్మ భోగాన్ని అనుభవించి, లెక్కాచారలను సమాప్తం చేసుకోవాలి, ఇందులో భయపడకూడదు. లేదంటే మళ్ళీ శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. చాలా మధురంగా అవ్వాలి. తండ్రి ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు. సంపాదనలో ఎప్పుడూ ఆవలింతలు లేక కునికిపాట్లు రాకూడదు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు సదా నిరోగులుగా అవుతారు. మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను కావున ఎటువంటి చెడు కర్మలు చేయకండి. సంకల్పాలైతే చాలా వస్తాయి – ఫలానా వస్తువును తీసుకొని తినాలి, ఫలానావారిని ఆలింగనం చేసుకోవాలి అని. అరే, తండ్రికైతే పిల్లల యొక్క జన్మపత్రి తెలుసు, అందుకే మంచి మ్యానర్స్ ధారణ చేయాలి. తండ్రి అంటారు, నాకు అందరి జన్మపత్రి గురించి తెలుసు, కానీ ఒక్కొక్కరినీ కూర్చోబెట్టి వారి లోపల ఏముంది అనేది ఏమైనా వినిపిస్తారా. నా పని శిక్షణ ఇవ్వడము. నేనైతే టీచర్ ను. అంతేకానీ బాబాకు తెలుసు కదా, నాకు కావాల్సిన మందును వారు తమకు తామే పంపిస్తారని భావించకూడదు. బాబా అంటారు, అనారోగ్యంగా ఉన్నట్లయితే డాక్టర్ వద్దకు వెళ్ళండి. అవును, అన్నింటికన్నా మంచి మందు యోగము. అంతేకానీ నేను కూర్చొని మందులివ్వడానికి నేనేమైనా డాక్టర్ నా. అయితే, డ్రామాలో నిశ్చయించి ఉంటే, అప్పుడప్పుడు ఇస్తాను కూడా. ఇకపోతే, నేను మీ ఆత్మకు ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చాను. డ్రామాలో ఉన్నట్లయితే, అప్పుడప్పుడు మందులు కూడా ఇస్తాను. అంతేకానీ, బాబా సమర్థుడు కదా, మా అనారోగ్యాన్ని ఎందుకు పోగొట్టలేరు, భగవంతుడైతే ఏది కావాలంటే అది చేయగలరు కదా అని భావించకూడదు. అలా కాదు, తండ్రి పతితులను పావనంగా చేసేందుకే వచ్చారు. అచ్ఛా.

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనసా-వాచా-కర్మణా ఎప్పుడూ ఎవరికీ దుఃఖమివ్వకూడదు. కర్మభోగానికి భయపడకూడదు. చాలా సంతోషంగా పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి.

2. సంకల్పాలకు వశమై ఎటువంటి చెడు కర్మ చేయకూడదు. మంచి మ్యానర్స్ ను ధారణ చేయాలి. దేవతలుగా అయ్యేందుకు ప్రతి విషయాన్ని సూచనలతో అర్థం చేసుకుని చేయాలి, చెప్పించుకోకూడదు.

వరదానము:-

వర్తమాన సమయంలో పిల్లలైన మీరు ఎటువంటి శ్రేష్ఠమైన సంపూర్ణ అధికారులుగా అవుతారంటే, మీకు స్వయంగా ఆల్మైటీ అథారిటీపై అధికారం ఉంటుంది. పరమాత్మ అధికారి పిల్లలు, సర్వ సంబంధాలు మరియు సర్వ సంపత్తుల యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ సమయంలోనే తండ్రి ద్వారా సర్వ శ్రేష్ఠ సంపత్తి భవ అనే వరదానం లభిస్తుంది. మీ వద్ద సర్వ గుణాలు, సర్వ శక్తులు మరియు శ్రేష్ఠ జ్ఞానం యొక్క అవినాశీ సంపద ఉంది, అందుకే మీ వంటి సంపత్తివంతులు ఇంకెవ్వరూ లేరు.

స్లోగన్:-

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు

‘‘పరమాత్మ గురించి అనేక మనుష్య మతాల యొక్క అంతిమ నిర్ణయము’’

పరమాత్మ ఒక్కరేనని ఇప్పుడైతే మొత్తం ప్రపంచానికి తెలుసు. ఆ పరమాత్మనే కొందరు శక్తిగా భావిస్తారు, కొందరు ప్రకృతి అని అంటారు, అంటే ఏదో ఒక రూపంలోనైతే తప్పకుండా నమ్ముతారు. కావున ఏ వస్తువునైతే నమ్ముతారో, తప్పకుండా అది ఏదో వస్తువై ఉంటుంది, అందుకే దానికి పేరు పెడతారు. కానీ ఆ ఒక్క వస్తువు విషయంలో ఈ ప్రపంచంలో ఎంతమంది మనుష్యులున్నారో, అన్ని అభిప్రాయాలున్నాయి, కానీ ఎంతైనా వస్తువైతే ఒక్కటే. వాటిలో ముఖ్యంగా నాలుగు అభిప్రాయాల గురించి వినిపిస్తాము – కొందరు ఈశ్వరుడు సర్వత్రా ఉన్నారని అంటారు, కొందరు బ్రహ్మాము సర్వత్రా ఉంది అని అంటారు, కొందరు ఈశ్వరుడు సత్యము, మాయ మిథ్య అని అంటారు, కొందరు ఈశ్వరుడు లేనే లేరు, అంతా ప్రకృతియే ప్రకృతి అని అంటారు. అటువంటివారు ఈశ్వరుడిని నమ్మరు. ఇప్పుడు ఇన్ని అభిప్రాయాలున్నాయి. వారు జగత్తు అంతా ప్రకృతి, ఇంకేమీ లేదని భావిస్తారు. ఇప్పుడు చూడండి, జగత్తును నమ్ముతారు, కానీ ఏ పరమాత్మ అయితే జగత్తును రచించారో, ఆ జగత్తు యొక్క యజమానిని నమ్మరా! ప్రపంచంలో ఎంతమంది మనుష్యులైతే ఉన్నారో, వారివి అన్ని అభిప్రాయాలున్నాయి. చివరికి ఈ అన్ని అభిప్రాయాల యొక్క నిర్ణయాన్ని స్వయంగా పరమాత్మ వచ్చి చేస్తారు. ఈ మొత్తం జగత్తు యొక్క నిర్ణయాన్ని పరమాత్మ వచ్చి చేస్తారు అనగా ఎవరైతే సర్వోత్తమమైన శక్తివంతుడు ఉంటారో, వారే తమ రచన యొక్క నిర్ణయాన్ని విస్తారపూర్వకంగా అర్థం చేయిస్తారు. వారే మనకు రచయిత పరిచయాన్ని కూడా ఇస్తారు మరియు తమ రచన యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు. అచ్ఛా – ఓంశాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top