19 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris

April 18, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీకు ఎప్పుడు సమయం లభించినా, ఏకాంతంలో కూర్చొని సత్యమైన ప్రియుడిని స్మృతి చేయండి ఎందుకంటే స్మృతి ద్వారానే స్వర్గం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది”

ప్రశ్న: -

బాబా లభించారు కనుక ఏ నిర్లక్ష్యం సమాప్తమైపోవాలి?

జవాబు:-

మేము ఎలాగూ బాబాకు చెందినవారమే అని చాలామంది పిల్లలు నిర్లక్ష్యంగా అంటారు. స్మృతి యొక్క శ్రమ చేయరు. పదే-పదే స్మృతిని మర్చిపోతారు. ఇదే నిర్లక్ష్యము. బాబా అంటారు – పిల్లలూ, ఒకవేళ స్మృతిలో ఉన్నట్లయితే, లోలోపల స్థిరమైన సంతోషం ఉంటుంది. ఏ రకమైన గుటకలు కలగవు. ఏ విధంగా బంధనంలో ఉన్నవారు స్మృతిలో తపిస్తూ ఉంటారో, రాత్రింబవళ్ళు స్మృతి చేస్తారో, అదే విధంగా మీకు కూడా నిరంతర స్మృతి ఉండాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భాగ్యాన్ని మేల్కొలుపుకొని వచ్చాను….. (తక్దీర్ జగాకర్ ఆయీ హూ…..)

ఓంశాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయించారు – మీరు కూడా, ఓం శాంతి అని అంటారు, తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు అనగా ఆత్మలైన మీరు శాంతి స్వరూపాలు. తండ్రి కూడా శాంతి స్వరూపుడు. ఆత్మ స్వధర్మము శాంతి. పరమాత్ముని స్వధర్మము కూడా శాంతి. మీరు కూడా శాంతిధామ నివాసులు. తండ్రి అంటారు – నేను కూడా అక్కడ నివసించేవాడను, పిల్లలైన మీరు పునర్జన్మల్లోకి వస్తారు, నేను రాను. నేను ఈ రథంలో ప్రవేశిస్తాను, ఇది నా రథము. ఒకవేళ శంకరుడిని అడిగినట్లయితే, నిజానికి అడగలేరు, కానీ ఒకవేళ ఎవరైనా సూక్ష్మవతనానికి వెళ్ళి అడిగినట్లయితే, శంకరుడు – ఈ సూక్ష్మ శరీరము నాది అని అంటారు. శివబాబా అంటారు – ఇది నా శరీరము కాదు, నేను దీన్ని అప్పుగా తీసుకున్నాను ఎందుకంటే నాకు కూడా కర్మేంద్రియాల ఆధారము కావాలి. మొట్టమొదట, పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు శ్రీకృష్ణుడు కాదు అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. శ్రీకృష్ణుడు సర్వాత్మలను పతితుల నుండి పావనులుగా చేయరు, వారు వచ్చి పావన ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ముందు రాజకుమారునిగా అవుతారు, తర్వాత మహారాజుగా అవుతారు. వారిలో కూడా ఈ జ్ఞానం లేదు. రచన యొక్క జ్ఞానం రచయితలోనే ఉంటుంది కదా. శ్రీకృష్ణుడిని రచన అని అంటారు. రచయిత అయిన తండ్రియే వచ్చి జ్ఞానాన్నిస్తారు. ఇప్పుడు తండ్రి రచిస్తున్నారు, మీరు నా పిల్లలు అని అంటారు. మీరు కూడా – బాబా, మేము మీ వారము అని అంటారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల స్థాపన అని కూడా అంటారు. లేదంటే బ్రాహ్మణులు ఎక్కడ నుండి వచ్చారు. సూక్ష్మవతనంలో వేరే బ్రహ్మా ఏమీ ఉండరు. పైనున్న వారే కిందనున్న వారు, వీరే పైనున్న వారు. ఇరువురూ ఒక్కరే. అచ్ఛా, విష్ణువు మరియు లక్ష్మీ-నారాయణులు కూడా ఒక్కరే. వారు ఎక్కడివారు. బ్రహ్మాయే విష్ణువుగా అవుతారు. బ్రహ్మా-సరస్వతులే, లక్ష్మీనారాయణులుగా అవుతారు, తర్వాత వారే మొత్తం కల్పంలో 84 జన్మలు తీసుకున్న తర్వాత సంగమంలో బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు కూడా మనుష్యులే, వారిది దేవీ దేవతా ధర్మము. విష్ణువుకు కూడా 4 భుజాలను చూపించారు. ప్రవృత్తి మార్గానికి గుర్తుగా అలా చూపించారు. భారత్ లో ప్రారంభం నుండి ప్రవృత్తి మార్గమే కొనసాగుతూ వస్తుంది, అందుకే విష్ణువుకు 4 భుజాలను చూపించారు. ఇక్కడ బ్రహ్మా-సరస్వతులుంటారు. ఈ సరస్వతి దత్త పుత్రిక. వీరి అసలు పేరు లఖీరాజ్, తర్వాత వీరికి బ్రహ్మా అని పేరు పెట్టారు. శివబాబా వీరిలో ప్రవేశించారు మరియు రాధను తమవారిగా చేసుకున్నారు, సరస్వతి అని పేరు పెట్టారు. బ్రహ్మా, సరస్వతికి లౌకిక తండ్రి ఏమీ కాదు. వీరిరువురికీ తమ-తమ లౌకిక తండ్రులు ఉండేవారు, ఇప్పుడు ఆ తండ్రులు లేరు. ఈ శివబాబా, బ్రహ్మా ద్వారా దత్తత తీసుకున్నారు. మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. బ్రహ్మా కూడా శివబాబా కుమారుడు. బ్రహ్మా ముఖకమలం ద్వారా రచిస్తారు కనుక బ్రహ్మాను కూడా తల్లి అని అంటారు. మీరే తల్లి-తండ్రి, మేము మీ పిల్లలము, మీ కృపతో అపారమైన సుఖం లభిస్తుంది….. అని పాడుతారు కదా. బ్రాహ్మణులైన మీరు వచ్చి, పిల్లలుగా అయ్యారు. ఇది అర్థం చేసుకోవడానికి చాలా మంచి బుద్ధి కావాలి. పిల్లలైన మీరు శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. బ్రహ్మా ఏమీ స్వర్గ రచయిత లేక జ్ఞానసాగరుడు కాదు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. ఆత్మకు తండ్రియే జ్ఞానసాగరుడు. ఆత్మ కూడా జ్ఞానసాగరంగా అవుతుంది కానీ ఆత్మను జ్ఞానసాగరుడు అని అనరు ఎందుకంటే సాగరుడు ఒక్కరే ఉంటారు. మీరందరూ నదులు. సాగరుడికి తన శరీరమంటూ ఏమీ లేదు, నదులకు ఉన్నాయి. మీరు జ్ఞాన నదులు. కలకత్తాలోని బ్రహ్మాపుత్ర నది చాలా పెద్ది, ఎందుకంటే దానికి సాగరంతో కనెక్షన్ ఉంది. అక్కడ చాలా పెద్ద మేళా జరుగుతుంది. ఇక్కడ కూడా మేళా జరుగుతుంది. ఇక్కడ సాగరుడు మరియు బ్రహ్మాపుత్ర, ఇరువురూ కలిసి ఉన్నారు. ఈ మేళా చైతన్యమైనది, అది జడమైనది. ఈ విషయాలను బాబా అర్థం చేయిస్తారు. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. శాస్త్రాలు భక్తి మార్గపు డిపార్టుమెంట్. ఇది జ్ఞాన మార్గము, అది భక్తి మార్గము. అర్ధకల్పం భక్తి మార్గపు డిపార్టుమెంట్ నడిచింది. అందులో జ్ఞానసాగరుడు లేరు. పరమపిత పరమాత్మ, జ్ఞానసాగరుడైన తండ్రి సంగమంలో వచ్చి, జ్ఞాన స్నానంతో అందరికీ సద్గతినిస్తారు.

మనం అనంతమైన తండ్రి ద్వారా స్వర్గ సుఖాల భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నామని మీకు తెలుసు. మనం తప్పకుండా సత్య-త్రేతా యుగాల్లో పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారము. ఇప్పుడు మనం పూజారి మనుష్యులుగా ఉన్నాము. మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణుల నుండి దేవతా ధర్మంలోకి వచ్చారు, తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ కిందకు దిగవలసి వచ్చింది. ఇది కూడా తండ్రి మీకు అర్థం చేయించారు. ఇంతకుముందు మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 జన్మలను కూడా మీరే తీసుకుంటారు. ఎవరైతే మొట్టమొదట వస్తారో, వారే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. యోగంతోనే మాలిన్యం తొలగిపోతుంది, యోగంలోనే శ్రమ ఉంది. చాలామంది పిల్లలు జ్ఞానంలో చురుకుగా ఉన్నారు కానీ యోగంలో కచ్చాగా ఉన్నారు. బంధనంలో ఉన్నవారు యోగంలో నిర్భంధునుల కన్నా బాగున్నారు. వారైతే శివబాబాను కలుసుకునేందుకు రాత్రింబవళ్ళు తపిస్తారు, మీరైతే కలుసుకున్నారు. మీకు, స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుంది, అయినా మీరు పదే-పదే మర్చిపోతారు. మీకు చాలా తుఫాన్లు వస్తాయి. వారు స్మృతిలో తపిస్తూ ఉంటారు. మీరు తపించరు. వారు ఇంట్లో కూర్చుని ఉన్నా కానీ, వారికి ఉన్నత పదవి లభిస్తుంది. బాబా స్మృతిలో ఉండడం ద్వారా మనకు స్వర్గ రాజ్యాధికారం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఏ విధంగా ఒక బిడ్డ గర్భం నుండి బయటకు రావడానికి తపిస్తాడో, అదే విధంగా బంధనంలో ఉన్నవారు, శివబాబా, ఈ బంధనం నుండి బయటకు తీయండి అని తపిస్తూ-తపిస్తూ పిలుస్తారు. రాత్రింబవళ్ళు స్మృతి చేస్తారు. మీకు తండ్రి లభించారు కానీ నిర్లక్ష్యులుగా అయిపోయారు. మేము బాబా పిల్లలము, మేము ఈ శరీరాలను వదిలి వెళ్ళి రాజకుమారులుగా అవుతాము అని లోలోపల స్థిరమైన సంతోషం ఉండాలి. కానీ మాయ స్మృతిని నిలవనివ్వదు. స్మృతి వలన చాలా సంతోషంగా ఉంటారు. స్మృతి చేయకపోతే గుటకలు మింగుతూ ఉంటారు. అర్ధకల్పం రావణ రాజ్యంలో మీరు దుఃఖాన్ని చూసారు. అకాల మృత్యువులు జరుగుతూ వచ్చాయి. దుఃఖం అయితే ఎలాగూ ఉంది. ఎంతటి షావుకారులైనా సరే, దుఃఖమైతే ఉంటుంది. అకాల మృత్యువులు జరుగుతాయి. సత్యయుగంలో ఇలాంటి అకాల మృత్యువులు సంభవించవు. ఎప్పుడూ రోగగ్రస్థులుగా అవ్వరు. సమయం వచ్చినప్పుడు తమకు తామే, కూర్చుని-కూర్చునే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. దాని పేరే సుఖధామము. మనుష్యులు స్వర్గం యొక్క విషయాలను కల్పన (ఊహ) అని భావిస్తారు. స్వర్గం ఎక్కడ నుండి వచ్చింది అని అంటారు. మనమైతే స్వర్గంలో ఉండేవారమని, తర్వాత 84 జన్మలు తీసుకుంటామని మీకు తెలుసు. ఈ ఆట అంతా భారత్ పైనే తయారుచేయబడింది. మీరు 21 జన్మలు పావన దేవతలుగా ఉండేవారని, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ స్వదర్శన చక్రం చాలా సులభమైనది. శివబాబా కూర్చుని దీనిని అర్థం చేయిస్తారు.

శివబాబా బ్రహ్మా రథంలోకి వచ్చారని మీకు తెలుసు. ఎవరైతే బ్రహ్మాగా ఉన్నారో, వారే సత్యయుగం ఆదిలో శ్రీకృష్ణునిగా ఉండేవారు. వారు 84 జన్మలు తీసుకుని పతితంగా అయ్యారు, మళ్ళీ వారిలో తండ్రి ప్రవేశించి దత్తత తీసుకున్నారు. తండ్రి స్వయంగా అంటారు – నేను ఈ తనువును ఆధారంగా తీసుకుని, మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను, తర్వాత మిమ్మల్ని స్వర్గ రాజధానికి యోగ్యులుగా తయారుచేస్తాను. ఎవరైతే యోగ్యులుగా అవుతారో, వారే రాజ్యంలోకి వస్తారు. దీని కోసం మంచి మ్యానర్స్ కావాలి. ముఖ్యమైనది పవిత్రత. దీని గురించి అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అక్కడక్కడ పురుషులపై కూడా అత్యాచారాలు జరుగుతాయి. వికారాల కోసం ఒకరినొకరు విసిగించుకుంటారు. ఇక్కడ మాతలు ఎక్కువగా ఉన్న కారణంగా శక్తి సైన్యమనే పేరు గాయనం చేయబడింది, వందే మాతరమ్. ఇప్పుడు మీరు కామ చితి నుండి దిగి, సుందరంగా అయ్యేందుకు, జ్ఞాన చితిపై కూర్చున్నారు. ద్వాపరం నుండి మొదలుకొని, కామ చితిపై కూర్చున్నారు. వికారీ బ్రాహ్మణులు ఒకరికొకరు వికారాలు ఇచ్చుకునే బంధాన్ని ముడి వేస్తారు. మీరు నిర్వికారీ బ్రాహ్మణులు. మీరు దానిని క్యాన్సిల్ చేసి జ్ఞాన చితిపై కూర్చోబెడతారు. కామ చితి వలన నల్లగా అయిపోయారు, జ్ఞాన చితి వలన సుందరంగా అయిపోతారు. మీరు కలిసే ఉండండి కానీ మేము వికారాల్లోకి వెళ్ళము అన్న ప్రతిజ్ఞను చేయండి అని తండ్రి అంటారు, అందుకే బాబా ఉంగరాన్ని కూడా ధరింపజేస్తారు. శివబాబా, తండ్రి కూడా, ప్రియుడు కూడా, వారు సీతలందరికీ రాముడు. వారే పతితపావనుడు. అంతేకానీ, రఘుపతి రాఘవ రాజా రాముడి విషయము కాదు, వారు సంగమంలోనే ఈ ప్రారబ్ధాన్ని పొందారు. అతనికి హింసాత్మక బాణాలను చూపించడము రాంగ్. చిత్రంలో కూడా అలా చూపించకూడదు. కేవలం చంద్రవంశీ అని రాయాలి. శివబాబా వీరి ద్వారా, మనకు ఈ చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. సత్యనారాయణ కథ ఉంటుంది కదా, అది మనుష్యులు తయారుచేసిన కథ. (ఆ కథ ద్వారా) ఎవరూ నరుని నుండి నారాయణునిగా అవ్వరు. సత్యనారాయణ కథ యొక్క అర్థమే నరుని నుండి నారాయణునిగా అవ్వడము. అమరకథను కూడా వినిపిస్తారు కానీ అమరపురిలోకి ఎవరూ వెళ్ళరు. మృత్యులోకం 2500 సంవత్సరాలు కొనసాగుతుంది. మూడవ నేత్రం కథ మాతలు వింటారు. వాస్తవానికి ఇది జ్ఞానమనే మూడవ నేత్రాన్నిచ్చే కథ. ఇప్పుడు ఆత్మకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది కనుక ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇప్పుడు నేను ఈ శరీరం ద్వారా దేవతగా అవుతాను, నాలోనే ఈ సంస్కారాలున్నాయి. మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. బాబా వచ్చి దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. మనుష్యులు ఆత్మ-పరమాత్మ ఒక్కటేనని, పరమాత్మయే ఈ రూపాలన్నింటినీ ధారణ చేసారని అంటారు. ఇదంతా రాంగ్ అని, దీనిని మిథ్యా అభిమానము, మిథ్యా జ్ఞానము అని అంటారని బాబా అంటారు. నేను బిందువు వలె ఉంటానని బాబా అంటారు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు, వీరికి కూడా తెలియదు. ఇందులో సంశయం కలగకూడదు, నిశ్చయముండాలి అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. తండ్రి తప్పకుండా సత్యాన్నే వినిపిస్తారు. సంశయ బుద్ధి వినశ్యంతి. అటువంటివారు పూర్తి వారసత్వాన్ని పొందలేరు. ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. భోజనం తయారు చేస్తున్నప్పుడు, బుద్ధి తండ్రి వైపు జోడించబడి ఉండాలి. ప్రతి విషయంలోనూ ఇది ప్రాక్టీస్ చేయాలి. రోటీ తయారుచేస్తూ, తమ ప్రియుడిని స్మృతి చేస్తూ ఉండాలి – ప్రతి విషయంలోనూ ఈ అభ్యాసం చేయాలి. ఎంత సమయం తీరిక లభిస్తే, అంత సమయం స్మృతి చేయాలి. స్మృతితోనే మీరు సతోప్రధానంగా అవుతారు. 8 గంటలు కర్మల కోసం అనుమతి ఉంది. కర్మల మధ్యలో కూడా ఏకాంతంలోకి వెళ్ళి కూర్చోవాలి, మీరు అందరికీ బాబా పరిచయాన్ని కూడా వినిపించాలి. ఈ రోజు వినకపోతే రేపు వింటారు. తండ్రి స్వర్గ స్థాపనను చేస్తారు, మనం స్వర్గంలో ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ నరకవాసులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి వారసత్వం లభించాలి. తండ్రి భారతవాసులకే అర్థం చేయిస్తారు. బాబా రావడం కూడా భారత్ లోనే వస్తారు. మీ వద్దకు ముసల్మానులు కూడా వస్తారు, వారు కూడా సెంటర్లను సంభాళిస్తారు చూడండి. శివబాబాను స్మృతి చేయండి అని అంటారు. సిక్కులు కూడా వస్తారు, క్రిస్టియన్లు కూడా వస్తారు, మున్ముందు చాలా మంది వస్తారు. ఈ జ్ఞానం అందరి కోసము ఉంది, ఎందుకంటే ఇది సహజమైన స్మృతి మరియు తండ్రి యొక్క సహజమైన వారసత్వము. కానీ తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సి ఉంటుంది. దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. ఇప్పుడు భారత్ పై రాహు గ్రహణముంది, తర్వాత 21 జన్మల కోసం బృహస్పతి దశ ప్రారంభమవుతుంది. ముందు బృహస్పతి దశ ఉంటుంది, తర్వాత శుక్ర దశ ఉంటుంది. సూర్యవంశీయులపై బృహస్పతి దశ ఉంటుందని, చంద్రవంశీయులపై శుక్ర దశ ఉంటుందని అంటారు. తర్వాత దశలు తగ్గిపోతూ వస్తాయి. రాహు దశ అన్నింటికన్నా చెడ్డది. బృహస్పతి అంటే గురువేమీ కాదు. ఇది వృక్షపతి దశ. వృక్షపతి అయిన తండ్రి వచ్చినప్పుడు, బృహస్పతి దశ మరియు శుక్ర దశ ఉంటాయి. రావణుడు వచ్చినప్పుడు రాహు దశ ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీపై బృహస్పతి దశ కూర్చుంటుంది. కేవలం వృక్షపతిని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి, అంతే. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రతి కార్యం చేస్తూ ఆత్మాభిమానులుగా అయ్యే ప్రాక్టీస్ చేయాలి. దేహ అహంకారం సమాప్తమైపోవాలి, దీని కోసమే శ్రమించాలి.

2. సత్యయుగ రాజ్యానికి యోగ్యులుగా అయ్యేందుకు, తమ మ్యానర్స్ ను రాయల్ గా తయారుచేసుకోవాలి. పవిత్రతయే అన్నింటికన్నా ఉన్నతమైన నడవడిక. పవిత్రంగా అవ్వడం ద్వారానే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు.

వరదానము:-

అప్పుడప్పుడు అమాయకత్వం చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సరళత, భోళా రూపాన్ని ధారణ చేస్తుంది. కానీ ఎవరినీ ఎదుర్కోలేనంత అమాయకులుగా అవ్వకండి. సరళతతో పాటు ఇముడ్చుకునే శక్తి మరియు సహన శక్తి కావాలి. ఏ విధంగా తండ్రి, భోళానాథునిగా ఉండడంతో పాటు ఆల్మైటీ అథారిటీగా ఉన్నారో, అదే విధంగా మీరు కూడా భోళాతనంతో పాటు శక్తి స్వరూపులుగా కూడా అవ్వండి, అప్పుడు మాయ యొక్క తూటా తగలదు, మాయ ఎదురించేందుకు బదులుగా నమస్కారం చేస్తుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top