22 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

April 21, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - బాబా వచ్చారు పిల్లలైన మీ నుండి దానం తీసుకోవడానికి, మీ వద్ద ఏ పాత చెత్త అయితే ఉందో, దానిని దానం ఇచ్చినట్లయితే పుణ్యాత్ములుగా అయిపోతారు’’

ప్రశ్న: -

పుణ్య ప్రపంచంలోకి వెళ్ళే పిల్లల కోసం తండ్రి యొక్క శ్రీమతం ఏమిటి?

జవాబు:-

మధురమైన పిల్లలూ – పుణ్య ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే అందరి నుండి మమకారాన్ని తొలగించండి. 5 వికారాలను విడిచిపెట్టండి. ఈ అంతిమ జన్మలో జ్ఞాన చితిపై కూర్చోండి. పవిత్రంగా అయినట్లయితే పుణ్యాత్ములుగా అయ్యి పుణ్యం యొక్క ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. జ్ఞాన-యోగాలను ధారణ చేసి తమ దైవీ నడవడికను తయారుచేసుకోండి. తండ్రితో సత్యమైన వ్యాపారాన్ని చేయండి. తండ్రి మీ నుండి ఏమీ తీసుకోరు, కేవలం మమకారం తొలగిపోవాలి, దాని యుక్తిని తెలియజేస్తారు. బుద్ధి ద్వారా అంతా తండ్రికి అర్పించండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఈ పాపపు ప్రపంచం నుండి… (ఇస్ పాప్ కీ దునియా సే…)

ఓంశాంతి. ప్రపంచంలోని మనుష్యులు లేక రావణ రాజ్యంలోని మనుష్యులు పిలుస్తారు, ఓ పతిత-పావనా రండి, పావన ప్రపంచం అనగా పుణ్య ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని. పాటను తయారుచేసేవారికి ఈ విషయాల గురించి అవగాహన లేదు. రావణ రాజ్యం నుండి రామ రాజ్యంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు, కానీ తమను తాము ఎవ్వరూ పతితులమని భావించరు. తమ పిల్లల వద్దనైతే సమ్ముఖంలో తండ్రి కూర్చున్నారు. రామ రాజ్యంలోకి తీసుకువెళ్ళేందుకు, శ్రేష్ఠంగా తయారయ్యేందుకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. భగవానువాచ – రామ భగవానువాచ కాదు. భగవంతుడైతే నిరాకారుడు. నిరాకారీ, ఆకారీ, సాకారీ – మూడు ప్రపంచాలు ఉన్నాయి కదా. నిరాకార పరమాత్మ నిరాకారీ పిల్లలతో (ఆత్మలతో) పాటు నిరాకారీ ప్రపంచంలో నివసించేవారు. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు – స్వర్గం యొక్క రాజ్య భాగ్యాన్ని ఇవ్వడానికి, మనల్ని పుణ్యాత్ములుగా చేయడానికి. రామ రాజ్యం అనగా పగలు, రావణ రాజ్యం అనగా రాత్రి. ఈ విషయాలు వేరెవ్వరికీ తెలియదు. మీలో కూడా ఎవరికో అరుదుగా తెలుసు. ఈ జ్ఞానం కోసం కూడా పవిత్రమైన బుద్ధి కావాలి. ముఖ్యమైన విషయం స్మృతికి సంబంధించినది. మంచి వస్తువు ఎల్లప్పుడూ గుర్తుంటుంది. మీరు ఏం పుణ్యం చేయాలి? మీ వద్ద ఏదైతే చెత్త ఉందో, దానిని నాకు అర్పించండి. మనుష్యులు మరణించినప్పుడు వారి పరుపు, బట్టలు మొదలైనవన్నీ శ్మశాన బ్రాహ్మణునికి ఇస్తారు. వీరు ఒక రకమైన బ్రాహ్మణులు. ఇప్పుడు, మీ నుండి దానం తీసుకునేందుకు బాబా వచ్చారు. ఈ పాత ప్రపంచం, పాత శరీరం అంతా కుళ్లిపోయి ఉంది. వీటిని నాకు ఇచ్చేయండి మరియు వీటిపై మమకారాన్ని తొలగించండి. 10-20 కోట్లు ఉండవచ్చు, కానీ తండ్రి అంటారు, వీటి నుండి బుద్ధిని తొలగించండి. బదులుగా మీకు అంతా కొత్త ప్రపంచంలో లభిస్తుంది, ఇది ఎంత సులువైన బేరము. తండ్రి అంటారు, ఎవరిలోనైతే నేను ప్రవేశించానో, వారు మొత్తం అర్పించేసారు. ఇప్పుడు చూడండి – దానికి బదులుగా ఎంత రాజ్య భాగ్యం లభిస్తుంది. కుమారీలైతే ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. వారసత్వం కొడుకులకు లభిస్తుంది కనుక వారికి ఆస్తి యొక్క నషా ఉంటుంది. ఈ రోజుల్లో స్త్రీని అర్ధ భాగస్వామిగా ఏమైనా చేసుకుంటారా, మొత్తం పిల్లలకే ఇస్తారు. పురుషుడు మరణిస్తే స్త్రీని ఎవ్వరూ అడగను కూడా అడగరు. ఇక్కడైతే మీరు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటారు. ఇక్కడైతే స్త్రీ-పురుషులు అన్న ప్రశ్న ఏమీ లేదు. అందరూ వారసత్వానికి అధికారులు. మాతలకు, కన్యలకైతే ఇంకా ఎక్కువగా హక్కు లభిస్తుంది ఎందుకంటే కన్యలకు లౌకిక తండ్రి యొక్క వారసత్వంపై మమకారం ఉండదు. వాస్తవానికి మీరంతా కుమార-కుమారీలు అయిపోయారు. తండ్రి నుండి ఎంత వారసత్వాన్ని పొందారు. ఒక కథ ఉంది – రాజు కుమార్తెలను, ఎవరిది తింటున్నారు అని అడిగారు. నా భాగ్యానిది తింటున్నాను అని వారిలో ఒకరు అన్నారు. అప్పుడు రాజు ఆమెను పంపించేసారు. ఆమె తండ్రి కన్నా కూడా షావుకారుగా అయ్యారు, తండ్రిని ఆహ్వానించి, ఇప్పుడు ఎవరిది తింటున్నాను, చూడండి అని అడిగారు. కనుక తండ్రి కూడా అంటారు – పిల్లలూ, మీరంతా మీ భాగ్యాన్ని తయారుచేసుకుంటారు.

ఢిల్లీలో ఒక గ్రౌండ్ ఉంది, రామ లీల గ్రౌండ్ అని పేరు పెట్టారు. వాస్తవానికి రావణ లీల అని పేరు పెట్టాలి ఎందుకంటే ఈ సమయంలో మొత్తం విశ్వంలో రావణ లీల నడుస్తుంది. పిల్లలు రామ లీల గ్రౌండ్ తీసుకొని – అందులో చిత్రాలు పెట్టాలి. ఒకవైపు రాముని చిత్రం ఉండాలి మరియు కింద పెద్ద రావణుని చిత్రం కూడా ఉండాలి. చాలా పెద్ద సృష్టి చక్రం ఉండాలి. మధ్యలో రాయాలి, ఇది రామ రాజ్యము, ఇది రావణ రాజ్యము. అప్పుడు అర్థం చేసుకుంటారు. దేవతలకు చూడండి, ఎంత మహిమ ఉంది – సర్వ గుణ సంపన్నులు… అర్ధకల్పము కలియుగీ భ్రష్టాచారీ, రావణ రాజ్యం ఉంది… అందులో అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు రావణ రాజ్య అంతాన్ని అయితే రాముడే చేస్తారు. ఈ సమయంలో రామ లీల లేదు, మొత్తం ప్రపంచంలో రావణ లీల ఉంది. రామ లీల సత్యయుగంలో ఉంటుంది. కానీ అందరూ తమను తాము చాలా తెలివైనవారని భావిస్తారు. శ్రీ శ్రీ అనే బిరుదును పెట్టించుకుంటారు – ఈ బిరుదు అయితే నిరాకార పరమపిత పరమాత్మది, వారి ద్వారా శ్రీ లక్ష్మీ-నారాయణులు కూడా రాజ్యాన్ని పొందుతారు. ఇప్పుడు బాబా వచ్చారు, మిమ్మల్ని భక్తి రూపీ అంధకారం నుండి విడిపించి వెలుగులోకి తీసుకువెళ్తారు. ఎవరిలోనైతే జ్ఞాన-యోగాలు ఉంటాయో, వారి నడవడిక కూడా దైవీగా ఉంటుంది. ఆసురీ నడవడిక ఉన్నవారు ఎవ్వరి కళ్యాణమూ చేయలేరు. వెంటనే తెలిసిపోతుంది, వీరిలో ఆసురీ అవగుణాలు ఉన్నాయా లేక దైవీ గుణాలు ఉన్నాయా! ఇప్పటివరకు ఎవ్వరూ సంపూర్ణంగా అయితే లేరు. ఇప్పుడు తయారవుతూ ఉంటారు, మరి బాబా అయితే దాత, మీ నుండి ఏం తీసుకుంటారు. ఏదైతే తీసుకుంటారో అది మీ సేవలోనే పెడతారు. బాబా వీరిని కూడా సరెండర్ చేయించారు – భట్టీ తయారుచేయాలి, పిల్లల పాలన చేయాలి. ధనం లేకుండా ఇంతమంది పాలన ఎలా జరుగుతుంది. మొదట బాబా వీరిని అర్పణ చేయించారు, తర్వాత ఎవరైతే వచ్చారో వారిని కూడా అర్పణ చేయించారు. కానీ అందరిదీ ఏకరస అవస్థ అయితే తయారవ్వలేదు, చాలా మంది వెళ్ళిపోయారు కూడా (పిల్లి పిల్లల కథలోని ఉదాహరణ) నంబరువారు పురుషార్థానుసారంగా అందరూ పరిపక్వంగా అయి వెలువడ్డారు. బాబా అయితే పుణ్య ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. కేవలం 5 వికారాలను విడిచిపెట్టండి అని అంటారు. నేను మిమ్మల్ని రాకుమార-రాకుమారీలుగా చేస్తాను. బ్రహ్మా యొక్క సాక్షాత్కారం ఇంట్లో కూర్చొని ఉండగానే చాలామందికి జరుగుతుంది. అక్కడ నుండి రాసి పంపిస్తారు – బాబా, మేము మీకు చెందినవారిగా అయిపోయాము, మాదంతా మీది. బాబా ఏమీ తీసుకోరు. బాబా అంటారు, అంతా మీ వద్దనే ఉంచండి. ఇక్కడ ఇల్లు తయారుచేస్తారు. ధనం ఎక్కడ నుండి తీసుకొచ్చారు అని కొందరు అడుగుతారు. అరే, బాబాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మా పేరును విన్నారు కదా. కేవలం మమకారాన్ని తొలగించండి, మీరు తిరిగి వెళ్ళాలి, బాబాను స్మృతి చేయండి అని అంటారు. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు కనుక సంతోషం యొక్క పాదరసం ఎక్కాలి. లక్ష్మీ-నారాయణులను భగవంతుడు అని అనరు, దేవీ-దేవతలని అంటారు. భగవంతుని వద్ద భగవతి ఏమీ ఉండరు. ఎంత యుక్తితో కూడిన విషయము. సమ్ముఖంలో తప్ప ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. త్వమేవ మాతాశ్చ పితా… అని పాడుతారు కూడా. జ్ఞానం లేని కారణంగా లక్ష్మీ-నారాయణుల ఎదురుగా, హనుమంతుని ఎదురుగా, గణేశుని ఎదురుగా కూడా వెళ్ళి ఈ మహిమను పాడుతారు. అరే, వారైతే సాకారిగా ఉండేవారు, వారిని వారి పిల్లలే మాత-పిత అని అంటారు. మీరు వారి పిల్లలు కాదు కదా? మీరైతే రావణ రాజ్యంలో ఉన్నారు. ఈ బ్రహ్మా కూడా మాత. వీరి ద్వారా బాబా అంటారు, మీరు నా పిల్లలు. కానీ మాతలను, కన్యలను సంభాళించే మాత కావాలి. దత్తత తీసుకోబడిన పుత్రిక బి.కె సరస్వతి. ఎంత గుహ్యమైన విషయాలు. బాబా ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తారో, అది ఏ శాస్త్రాలలోనూ లేదు. భారత్ యొక్క ఒక ముఖ్యమైన శాస్త్రం గీత, దానిలో జ్ఞానం యొక్క చదువుకు సంబంధించిన విషయాలున్నాయి. అందులో చరిత్ర యొక్క విషయమేమీ లేదు. జ్ఞానం ద్వారా పదవి లభిస్తుంది.

బాబా ఇంద్రజాలికుడు. మీరు రత్నాకరుడు, ఇంద్రజాలికుడు… అని పాడుతారు. స్వర్గం కోసం మీ జోలి నిండుతుంది. సాక్షాత్కారమైతే భక్తి మార్గంలో కూడా చేసుకుంటారు, కానీ దాని వలన లాభమేమీ లేదు. రాస్తారు, చదువుకుంటారు… సాక్షాత్కారంతో మీరేమైనా ఆ విధంగా తయారయ్యారా ఏమిటి? సాక్షాత్కారాలను నేను చేయిస్తాను. రాతి మూర్తి ఏమైనా సాక్షాత్కారం చేయిస్తుందా. నవవిధ భక్తిలో భావన అయితే శుద్ధమైనది పెట్టుకుంటారు. దానికి ప్రతిఫలాన్ని నేను ఇస్తాను, కానీ తమోప్రధానమైతే అవ్వాల్సిందే. మీరా సాక్షాత్కారం చేసుకున్నారు కానీ జ్ఞానమైతే ఏమీ లేదు. మనుష్యులైతే దిన ప్రతి దినం తమోప్రధానం అవుతూ ఉంటారు. ఇప్పుడైతే మనుష్యులందరూ పతితంగా ఉన్నారు. మమ్మల్ని ఎటువంటి స్థానానికి తీసుకువెళ్ళండి అంటే అక్కడ సుఖ-శాంతులను పొందాలి అని పాడుతారు కూడా.

భారతవాసులైన మీకు సత్యయుగంలో చాలా సుఖం ఉండేది. సత్యయుగం పేరు ప్రసిద్ధమైనది కదా. స్వర్గం భారత్ లోనే ఉండేది – కానీ అర్థం చేసుకోరు. భారత్ యే ప్రాచీనంగా ఉండేది, స్వర్గంగా ఉండేది అని కూడా తెలుసు. అక్కడ ఇంకే ధర్మమూ ఉండేది కాదు. ఈ విషయాలన్నింటినీ తండ్రే అర్థం చేయిస్తారు. మీరందరూ ఇప్పుడు శ్రవణ కుమారులుగా మరియు కుమారీలుగా అవుతారు. మీరు అందరినీ జ్ఞానం యొక్క కావడిపై కూర్చోబెడతారు. మీరు మిత్ర-సంబంధీకులందరికీ జ్ఞానాన్ని ఇచ్చి పైకి లేపాలి. బాబా వద్దకు యుగళులు కూడా వస్తారు. ఇంతకుముందు అయితే దైహిక బ్రాహ్మణుల చేత ముడి వేయించుకునేవారు. ఇప్పుడు ఆత్మిక బ్రాహ్మణులైన మీరు కామ చితి యొక్క ముడిని తెంచేస్తారు. బాబా వద్దకు వచ్చినప్పుడు – స్వర్గంలోకి వెళ్తారా అని బాబా అడుగుతారు. కొంతమంది, మాకు స్వర్గం ఇక్కడే ఉంది అని అంటారు. అరే, ఇది అల్పకాలిక స్వర్గము. నేను మీకు 21 జన్మల కోసం స్వర్గాన్ని ఇస్తాను, కానీ ముందు పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది. అంతే, ఈ విషయంలోనే ఢీలా అయిపోతారు. అరే, అనంతమైన తండ్రి చెప్తున్నారు – కనుక ఈ అంతిమ జన్మ జ్ఞాన చితిపై కూర్చోండి. మరి స్త్రీలు వెంటనే వచ్చేస్తారు అన్నది చూడడం జరుగుతుంది. మళ్ళీ కొందరు అంటారు, పతి పరమేశ్వరుడికి కోపం ఎలా తెప్పిస్తాము అని అంటారు.

బాబాకు చెందినవారిగా అయ్యారు కనుక అడుగడుగునా శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు బాబా వచ్చారు, స్వర్గానికి యజమానులుగా చేయడానికి. పవిత్రంగా అవ్వడము మంచిది. కుల కళంకితులుగా అవ్వకండి. తండ్రి అంటారు కదా! లౌకిక తండ్రి అయితే చెంపదెబ్బ కూడా వేస్తారు. తల్లి మధురంగా ఉంటారు. చాలా మధురంగా, దయాహృదయులుగా అవ్వాలి. తండ్రి అంటారు, పిల్లలూ, మీరు నన్ను చాలా నిందించారు. ఇప్పుడు నేను అపకారులకు కూడా ఉపకారం చేస్తాను. రావణ మతం వలన మీకు ఈ పరిస్థితి ఏర్పడిందని నాకు తెలుసు. ఏ సెకెండు అయితే గతించిందో, అది డ్రామా. కానీ మా ఖాతా పాడవ్వకూడదు అని మున్ముందు కోసం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ ప్రజలను కూడా తయారుచేసుకోవాలి, వారసులను కూడా తయారుచేసుకోవాలి. మురళీ ఎవ్వరూ మిస్ చేయకూడదు. ఏ పాయింట్లు మిస్ అవ్వకూడదు. మంచి-మంచి జ్ఞాన రత్నాలు వెలువడ్డాయి మరియు వినలేదు అంటే ధారణ ఎలా చేస్తారు. రెగ్యులర్ స్టూడెంట్స్ మురళీ ఎప్పుడూ మిస్ చేయరు. ప్రయత్నం చేసి రోజూ వాణిని చదువుకోవాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ ఖాతా పాడవ్వకూడదు, దీని కోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కుల కళంకితులుగా అవ్వకూడదు. చదువును రోజూ చదువుకోవాలి, మిస్ చేయకూడదు.

2. శ్రవణకుమార-కుమారీలుగా అయ్యి జ్ఞాన కావడిలో అందరినీ కూర్చోబెట్టాలి. మిత్ర-సంబంధీకులకు కూడా జ్ఞానాన్ని ఇచ్చి వారి కళ్యాణం చేయాలి.

వరదానము:-

అమృతవేళ మరియు రోజంతటిలో మధ్య-మధ్యలో, నేను రాజయోగిని అని తమ వృత్తిని స్మృతిలోకి తెచ్చుకోండి. రాజయోగి అనే సీటుపై సెట్ అయి ఉండండి. రాజయోగి అనగా రాజు, వారిలో కంట్రోలింగ్ మరియు రూలింగ్ పవర్ ఉంటుంది. వారు ఒక్క సెకండులో మనసును కంట్రోల్ చేయగలరు. వారెప్పుడూ తమ సంకల్పం, మాట మరియు కర్మను వ్యర్థంగా పోగొట్టుకోలేరు. ఒకవేళ వద్దనుకున్నా కూడా వ్యర్థంగా వెళ్ళిపోతుంది అంటే వారిని నాలెడ్జ్ ఫుల్ లేక రాజు అని అనరు.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

‘‘ఈ అవినాశీ జ్ఞానానికి అనేక పేర్లు పెట్టబడ్డాయి’’

ఈ అవినాశీ ఈశ్వరీయ జ్ఞానానికి అనేక పేర్లు పెట్టబడ్డాయి. కొందరు ఈ జ్ఞానాన్ని అమృతం అని కూడా అంటారు, కొందరు జ్ఞానాన్ని అంజనం అని కూడా అంటారు. గురునానక్ జ్ఞాన అంజనాన్ని గురువు ఇచ్చారని అన్నారు, కొందరు మళ్ళీ జ్ఞాన వర్షం అని కూడా అన్నారు ఎందుకంటే ఈ జ్ఞానంతోనే మొత్తం సృష్టి అంతా సస్యశ్యామలంగా తయారవుతుంది. ఎవరైతే తమోప్రధాన మనుష్యులు ఉన్నారో, వారు సతోగుణీ మనుష్యులుగా అవుతారు మరియు జ్ఞాన అంజనంతో అంధకారం తొలగిపోతుంది. ఇదే జ్ఞానాన్ని మళ్ళీ అమృతం అని కూడా అంటారు, దీనితో మనుష్యులెవరైతే పంచ వికారాల అగ్నిలో కాలిపోతున్నారో, దీని ద్వారా శీతలంగా అవుతారు. చూడండి, గీతలో పరమాత్మ స్పష్టంగా అంటారు, కామేషు, క్రోధేషు అని, దానిలో కూడా మొదట ముఖ్యమైనది కామము, ఇదే పంచ వికారాలలో ముఖ్యమైన బీజము. బీజం ఉన్నప్పుడు మళ్ళీ క్రోధం, లోభం, మోహం, అహంకారం మొదలైనవాటి వృక్షం ఉత్పన్నమవుతుంది, దాని ద్వారా మనుష్యుల బుద్ధి భ్రష్టమైపోతుంది. ఇప్పుడు అదే బుద్ధిలో జ్ఞానం యొక్క ధారణ జరుగుతుంది, ఎప్పుడైతే జ్ఞానం యొక్క ధారణ బుద్ధిలో పూర్తిగా జరుగుతుందో, అప్పుడే వికారాల బీజం సమాప్తమైపోతుంది. ఇకపోతే, సన్యాసులు, వికారాలను వశం చేసుకోవడం చాలా కఠినమైన విషయమని భావిస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానమైతే సన్యాసులలో లేనే లేదు. కనుక ఇటువంటి శిక్షణను ఎలా ఇస్తారు? కేవలం మర్యాదలో ఉండండి అని అనడానికి అనేస్తారు. కానీ అసలైన మర్యాద ఏముండేది? ఆ మర్యాద అయితే ఈ రోజుల్లో లేనే లేదు. ఎక్కడ ఆ సత్యయుగీ, త్రేతాయుగీ దేవీ-దేవతల మర్యాద, వారు గృహస్థంలో ఉంటూ ఎలా నిర్వికారీ ప్రవృత్తిలో ఉండేవారు. ఇప్పుడు ఆ సత్యమైన మర్యాద ఎక్కడ ఉంది? ఈ రోజుల్లో అయితే వ్యతిరేకమైన వికారీ మర్యాదను పాలన చేస్తున్నారు, ఒకరికొకరు మర్యాదలలో నడవండి అని ఊరికే నేర్పిస్తారు. మనుష్యుల మొదటి కర్తవ్యం ఏమిటి, అదైతే ఎవ్వరికీ తెలియదు. కేవలం, మర్యాదలలో ఉండండి అని ఈ మాత్రం ప్రచారం చేస్తారు. కానీ మనుష్యుల మొదటి మర్యాద ఏమిటి అని ఇంత కూడా తెలియదు మనుష్యుల మొదటి మర్యాద, నిర్వికారిగా అవ్వడము, ఒకవేళ ఎవరినైనా, మీరు ఈ మర్యాదలో ఉంటున్నారా అని ఈ విధంగా అడగడం జరిగితే, అప్పుడు, ఈ రోజుల్లో ఈ కలియుగీ సృష్టిలో నిర్వికారిగా అయ్యే ధైర్యం లేదు అని అంటారు. ఇప్పుడు నోటి ద్వారా, మర్యాదలలో ఉండండి, నిర్వికారిగా అవ్వండి అని అనడం ద్వారా నిర్వికారిగా ఎవ్వరూ అవ్వలేరు. నిర్వికారిగా అవ్వడం కోసం మొదట ఈ జ్ఞాన ఖడ్గంతో ఈ పంచ వికారాల బీజాన్ని సమాప్తం చేయాలి, అప్పుడే వికర్మలు భస్మం అవ్వగలవు. అచ్ఛా – ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top