21 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

20 April 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తండ్రి స్మృతిలో ఉండడమనేది చాలా మధురమైన మిఠాయి, దీనిని ఇతరులకు కూడా పంచుతూ ఉండండి అనగా అల్ఫ్ (శివబాబా) మరియు బే (వారసత్వము) యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉండండి’’

ప్రశ్న: -

స్థిరమైన స్మృతిలో ఉండేందుకు సహజమైన విధి ఏమిటి?

జవాబు:-

స్థిరమైన స్మృతిలో ఉండాలంటే దేహ సహితంగా ఏవైతే సంబంధాలున్నాయో, వాటన్నింటినీ మర్చిపోండి. నడుస్తూ-తిరుగుతూ, లేస్తూ-కూర్చుంటూ, తండ్రి స్మృతిలో ఉండేటువంటి అభ్యాసం చేయండి. ఒకవేళ యోగంలో కూర్చున్నప్పుడు ఎర్ర లైటు గుర్తుకొచ్చినా కూడా యోగం తెగిపోతుంది. స్థిరమైన స్మృతి ఉండజాలదు. ప్రత్యేకంగా ఎవరైనా కూర్చుని యోగం చేయించాలి – అని ఎవరైతే అంటారో, వారి యోగం కూడా కుదరదు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు… (రాత్ కే రాహీ థక్ మత్ జానా…)

ఓంశాంతి. ఇప్పుడిది యోగం యొక్క విషయము, ఎందుకంటే ఇప్పుడిది రాత్రి. రాత్రి అని కలియుగాన్ని అంటారు, పగలు అని సత్యయుగాన్ని అంటారు. మీరిప్పుడు కలియుగం రూపీ రాత్రి నుండి సత్యయుగం రూపీ పగలులోకి వెళ్తారు, అందుకే రాత్రిని మరచి పగలును గుర్తు చేయండి. నరకం నుండి బుద్ధిని తొలగించాలి. తప్పకుండా ఇది నరకము అని బుద్ధి అంటుంది. ఇతరులెవ్వరి బుద్ధి ఈ మాట అనదు. బుద్ధి ఆత్మలో ఉంది. రాత్రి నుండి పగలులోకి తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చారని ఆత్మ ఇప్పుడు తెలుసుకుంది. తండ్రి అంటారు, ఓ ఆత్మలూ, మీరు స్వర్గంలోకి వెళ్ళాలి. కానీ మొదట శాంతిధామంలోకి వెళ్ళి, ఆ తర్వాత స్వర్గంలోకి రావాలి. అనగా మీరు మొదట ఇంటి యొక్క, ఆ తర్వాత రాజధాని యొక్క యోగీలు. ఇప్పుడు మృత్యులోకం అనగా రాత్రి పూర్తి అవ్వనున్నది. ఇప్పుడు పగలులోకి వెళ్ళాలి, దీనిని ఈశ్వరీయ యోగమని అంటారు. నిరాకారుడైన ఈశ్వరుడు మనకు యోగం నేర్పిస్తారు అనగా ఆత్మలైన మనకు నిశ్చితార్థం చేయిస్తారు. ఇది ఆత్మిక యోగము, అది దైహిక యోగము. పిల్లలైన మీరు ఒక స్థానంలోనే కూర్చొని యోగం జోడించకూడదు. అక్కడైతే మనుష్యులు స్వయం ఎలా కూర్చుంటారో, అలాగే అందరికీ కూర్చోవడం నేర్పిస్తారు. ఇక్కడ మీకు కూర్చోవడం నేర్పించడం జరగదు. అయితే సభలో నియమానుసారంగా కూర్చోవాలి. ఇకపోతే, యోగంలోనైతే ఎలాగైనా కూర్చోండి, నడుస్తూ-తిరుగుతూ, పడుకుంటూ కూడా యోగం జోడించవచ్చు. చిత్రకారుడు యోగంలో ఉంటూ చిత్రాన్ని తయారుచేయగలడు. ఏ శివబాబాతోనైతే యోగం జోడిస్తారో, వారి చిత్రాన్ని తయారుచేస్తారు. ఈ మా బాబా, నిరాకారీ ప్రపంచమైన పరంధామంలో ఉంటారని తెలుసు. మనం కూడా అక్కడి నివాసులము, ఆత్మలమైన మనము వెళ్ళాలి, ఇది బుద్ధిలో నడుస్తూ-తిరుగుతూ ఉండాలి. నన్ను తపస్యలో కూర్చోబెట్టండి, యోగం చేయించండి అని అనడం కాదు – ఇలా అనడం కూడా తప్పు. అవివేకులు ఈ విధంగా అంటారు. పిల్లలు లౌకిక తండ్రిని ప్రత్యేకంగా కూర్చుని గుర్తు చేస్తారా ఏమిటి? బాబా-బాబా అని అంటూనే ఉంటారు. ఎప్పుడూ మర్చిపోనే మర్చిపోరు. చిన్న పిల్లలైతే ఇంకా ఎక్కువ గుర్తు చేసుకుంటారు. నోటితో పిలుస్తూనే ఉంటారు. ఇక్కడ పారలౌకిక తండ్రిని ఎందుకు మర్చిపోతారు? బుద్ధియోగం ఎందుకు తెగిపోతుంది? నోటితో బాబా-బాబా అని కూడా అనకూడదు. ఆత్మకు తెలుసు, బాబాను గుర్తు చేయాలి అని. ఒకవేళ ప్రత్యేకంగా కూర్చుని యోగం చేసే అలవాటు ఉన్నట్లయితే, యోగం కుదరదు. ఈ ఈశ్వరీయ యోగాన్ని మీకు స్వయంగా ఈశ్వరుడు నేర్పిస్తున్నారు. యోగేశ్వరుడు అని అంటారు కదా. తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని మీకు ఈశ్వరుడు యోగాన్ని నేర్పించారు. అక్కయ్య నన్ను యోగంలో కూర్చోబెట్టినప్పుడు ఆనందం కలుగుతుంది అని భావించకూడదు. అటువంటివారి యోగం ఎప్పుడూ స్థిరంగా నిలవదు. ఒకవేళ గుండెపోటు వచ్చిందనుకోండి, ఆ సమయంలో ఎవరైనా యోగంలో కూర్చోబెడతారా ఏమిటి? ఇక్కడ బుద్ధితో స్మృతి చేయాలి. మనుష్యులు ఏయే యోగాలనైతే నేర్పిస్తారో, అవన్నీ తప్పు. ఈ ప్రపంచంలో యోగీలు ఎవరూ లేరు. వాస్తవానికైతే, ఎవరిని గుర్తు చేసుకున్నా, అది కూడా యోగమే అవుతుంది. మామిడి పండు ఇష్టమనిపిస్తే, దానితో యోగం జోడించబడుతుంది, ఎర్ర లైటు ఇష్టమనిపిస్తే, అది గుర్తుకొస్తుంది, అప్పుడు దానితో కూడా యోగం జోడించబడినట్లు. కానీ ఇక్కడైతే దేహ సహితంగా, దేహపు సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ మరచి ఒక్క నాతో యోగం జోడించండి, అప్పుడు మీ కళ్యాణం జరుగుతుంది మరియు మీరు వికర్మాజీతులుగా అవుతారు. తండ్రే వచ్చి సద్గతి యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ సద్గతినివ్వలేరు. మిగిలినవారంతా దుర్గతి యొక్క మార్గాన్ని తెలియపరిచేవారు. సద్గతిని స్వర్గమని అంటారు మరియు ఆత్మలైన మనం ఎక్కడైతే నివసిస్తామో, ఆ ముక్తిధామము ఇల్లు. ఈ సమయంలో అందరినీ దుర్గతికి చేర్చేది మనుష్య మతము. నిరాకార తండ్రి వచ్చి సద్గతినిస్తారు, అప్పుడిక అర్ధకల్పము మనం సద్గతిలో ఉంటాము. అక్కడ భగవంతుడిని కలుసుకునేందుకు లేక ముక్తి-జీవన్ముక్తులను పొందేందుకు, ప్రతి ముంగిట భ్రమించరు. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో, అప్పుడు ప్రతి ముంగిట వెతకడం మొదలుపెడతాము ఎందుకంటే మనం కింద పడడం ప్రారంభమవుతుంది. భక్తి కూడా ప్రారంభమవ్వాల్సిందే. ఇప్పుడు మేము శరీరాన్ని వదిలి, మళ్ళీ శివాలయంలోకి వెళ్తామని మీకు తెలుసు. సత్యయుగము అనంతమైన శివాలయము. ఈ సమయంలో ఉన్నది వేశ్యాలయము. ఈ విషయాలను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. శివబాబాను స్మృతి చేయకపోతే, వారు యోగీ కాదు, భోగీ అయినట్లు. మీరు ఎవరికైనా వినమని చెప్తే, వారు – మేము రెండు వచనాలు వింటామని అంటారు. ఇప్పుడు రెండు వచనాలైతే చాలా ప్రసిద్ధి చెందినవి. మన్మనాభవ, మధ్యాజీభవ. నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈ రెండు వచనాలతోనే జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే నిరోగులుగా అవుతారు మరియు చక్రాన్ని స్మృతి చేసినట్లయితే ధనవంతులుగా అవుతారు. రెండు వచనాలతో మీరు సదా ఆరోగ్యవంతులుగా మరియు సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. ఒకవేళ ఏదైనా రైట్ విషయం ఉన్నట్లయితే, దానిపై నడుచుకోవాలి లేదంటే అవివేకులని భావిస్తారు. అల్ఫ్ (శివబాబా) మరియు బే (వారసత్వము) – ఇవే రెండు వచనాలు. అల్ఫ్ అనగా అల్లా, బే అనగా రచన. బాబా అనగా అల్ఫ్, బే అనగా రాజ్యము. మీలో కొందరికి రాజ్యము లభిస్తుంది, కొందరు ప్రజల్లోకి వెళ్తారు. పిల్లలైన మీరు లెక్కాపత్రాన్ని పెట్టుకోవాలి – మొత్తం రోజంతటిలో ఎంత సమయము తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసాను. ఈ శ్రీమతాన్ని తండ్రే ఇస్తారు. ఆత్మలకు తండ్రి నేర్పిస్తారు. మనుష్యులు ధనం కోసం ఎంతగా కష్టపడతారు. ధనమైతే బ్రహ్మా వద్ద చాలా ఉండేది, అల్ఫ్ ద్వారా రాజ్యం లభిస్తుంది అన్నది చూసిన తర్వాత ఇక ధనమేమి చేసుకోవాలి? శివబాబాకు అంతా అర్పించి, రాజ్యాన్ని ఎందుకు తీసుకోకూడదు. బాబా దీనిపై ఒక పాట కూడా తయారుచేసారు… మొదటివానికి అల్లా లభించారు… రెండవవానికి అసత్య సంపాదన లభించింది… అదే సమయంలో బుద్ధిలోకి వచ్చింది, నేను విష్ణు చతుర్భుజునిగా అవ్వాలి, నేను ఈ ధనాన్ని ఏమి చేసుకుంటాను. అంతే, ఇక బాబా బుద్ధి తాళాన్ని తెరిచారు. ఈ (సాకార) బాబా అయితే ధనం సంపాదించడంలో బిజీగా ఉండేవారు. రాజ్యం లభిస్తుంది అన్నప్పుడు, ఇక గాడిద చాకిరీని ఎందుకు చేయాలి. ఆ తర్వాత బాబా ఆకలితోనేమీ చనిపోలేదు. బాబా వద్దకు ఎవరైతే వస్తారో, వారికి చాలా మంచి పాలన జరుగుతుంది. ఇంట్లో ఆకలితో చనిపోతూ ఉండవచ్చు, ఇక్కడైతే, ఎవరైతే శ్రీమతంపై నడుస్తారో, వారికి బాబా కూడా చాలా బాగా సహాయం చేస్తారు. బాబా అంటారు, అందరికీ మార్గాన్ని తెలియజేయండి, ఏమనంటే – అనంతమైన తండ్రిని స్మృతి చేయండి మరియు చక్రం యొక్క జ్ఞానాన్ని స్మృతి చేయండి, అప్పుడు మీ నావ తీరానికి చేరుతుంది. నావికుడు, నావను తీరానికి చేర్చేందుకు వచ్చారు. అందుకే, పతితపావనా, నావికుడా… అని పాడుతారు, కానీ ఎవరిని స్మృతి చేయాలి అనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే సర్వవ్యాపి అని అనేసారు. ఒక్క శివుని చిత్రాన్నే భగవంతుడు అని అంటారు. మరి లక్ష్మీనారాయణులను, బ్రహ్మా-విష్ణు-శంకరులను భగవంతుడు అని ఎందుకంటారు. ఒకవేళ అందరూ తండ్రులుగా అయితే, మరి వారసత్వాన్ని ఎవరిస్తారు. సర్వవ్యాపి అని అన్నట్లయితే, ఇచ్చేవారూ ఉండరు, తీసుకునేవారూ ఉండరు. బ్రహ్మా ద్వారా స్థాపన అని రాసి ఉంది. పైన శివుడు ఉన్నారు. శివబాబా బ్రహ్మా ద్వారా దేవతలను తయారుచేస్తారు కనుక బ్రహ్మా కూడా దేవతగా అవుతారు. ఈ పని ఒక్క తండ్రిది మాత్రమే. ఏక్ ఓంకార్… అకాలమూర్త్ అని వారికే మహిమ ఉంది. ఆత్మ అకాలమూర్తిగా ఉంటుంది, దానిని మృత్యువు కబళించదు. కావున తండ్రి కూడా అకాలమూర్త్. శరీరాలైతే అందరివీ సమాప్తమైపోతాయి. ఆత్మను ఎప్పుడూ మృత్యువు కబళించదు. అక్కడ అకాల మృత్యువు ఎప్పుడూ సంభవించదు. మేము ఒక శరీరాన్ని విడిచి మరొకటి తీసుకోవాలి అని భావిస్తారు. స్వర్గంలో ఉన్నారంటే తప్పకుండా పునర్జన్మలు కూడా స్వర్గంలోనే ఉంటాయి. ఇక్కడైతే అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఫలానావారు స్వర్గస్థులు అయ్యారు అని అంటారు, అంటే తప్పకుండా ఇంతకుముందు నరకంలో ఉండేవారు. ఇంత సహజమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. సన్యాసులకు కూడా తెలియదు. వారైతే జ్యోతి, జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు. భారతవాసీ భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు. గృహస్థులు భక్తులు, ఎందుకంటే భక్తి అనేది ప్రవృత్తి మార్గం వారి కోసం ఉంటుంది. వారైతే తత్వ జ్ఞానులు. మేము తత్వంతో యోగం జోడించి లీనమైపోతాము అని భావిస్తారు. వారు ఆత్మను కూడా వినాశీ అని భావిస్తారు. సత్యాన్ని ఎప్పుడూ చెప్పలేరు. సత్యము ఒక్క పరమాత్మే. మీకు ఇప్పుడు సత్యం యొక్క సాంగత్యముంది కావున మిగిలినదంతా అసత్యమైనట్లు. కలియుగంలో సత్యం వినిపించే మనుష్యులు ఎవరూ ఉండనే ఉండరు. రచయిత మరియు రచన గురించి ఎవరూ సత్యాన్ని వినిపించరు. తండ్రి అంటారు, ఇప్పుడు నేను మీకు అన్ని శాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను. ముఖ్యమైన గీతలో కూడా పరమాత్మ పేరుకు బదులుగా మనిషి పేరును వేసేసారు, కానీ కృష్ణుడు ఈ సమయంలో నల్లగా ఉన్నారు. ఇప్పుడు కృష్ణుని చిత్రాన్ని కూడా మనుష్యులు అర్థం చేసుకునే విధంగా తయారుచేయాలి. డబల్ షేడ్ ఇవ్వాలి. ఒకవైపు నలుపు షేడ్ ఉండాలి, మరొకవైపు తెలుపు షేడ్ ఉండాలి, ఆ తర్వాత దానిపై అర్థం చేయించాలి – కామ చితిపై కూర్చోవడంతే నల్లగా అవుతారు, మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చోవడంతో తెల్లగా అవుతారు. నివృత్తి మరియు ప్రవృత్తి, రెండు మార్గాలను చూపించాలి. ఇనుప యుగము తర్వాత బంగారు యుగంగా అవుతుంది. బంగారు యుగం తర్వాత వెండి యుగము, రాగి యుగము ఉంటాయి. ఆత్మ అంటుంది – మొదట నేను కామ చితిపై ఉండేవాడిని, ఇప్పుడు నేను జ్ఞానచి తిపై కూర్చున్నాను. మీరు పతితుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. యోగంలో ఉంటూ మీరు ఏ వస్తువునైనా తయారుచేసినట్లయితే, అదెప్పుడూ పాడవ్వదు. బుద్ధి సరిగ్గా ఉన్నట్లయితే సహాయం లభిస్తుంది, కానీ అది కష్టము. బాబా అంటారు, నేను కూడా మర్చిపోతాను. స్మృతి చాలా జారిపోతూ ఉంటుంది. చాలా మంచి అభ్యాసం కావాలి. స్థిరమైన స్మృతి నిలవదు. నడుస్తూ-తిరుగుతూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. స్మృతినైతే ఎక్కడైనా చేయవచ్చు, స్మృతితో బలం లభిస్తుంది. ఈ సమయంలో సత్యమైన యోగం గురించి ఎవరికీ తెలియనే తెలియదు. తండ్రి తప్ప ఇతరులెవరైతే యోగాన్ని జోడించడం నేర్పిస్తారో, వారంతా తప్పు. భగవంతుడు ఎప్పుడైతే యోగాన్ని నేర్పించారో, అప్పుడు స్వర్గం తయారయింది. మనుష్యులు ఎప్పుడైతే యోగాన్ని నేర్పించారో, అప్పుడు స్వర్గం నుండి నరకంగా అయ్యింది. ఎవరైనా కొద్దిగా తప్పుడు నడవడికను నడిచినా, బుద్ధి తాళం మూసుకుపోతుంది, 10-15 నిమిషాలు కూడా స్మృతిలో ఉండలేకపోతారు, లేదంటే ఇది వృద్ధ మాతలకైనా, పిల్లలకైనా, అనారోగ్యంతో ఉన్నవారికైనా కూడా చాలా సహజము. ఇది చాలా మధురమైన మిఠాయి. మూగవారైనా, చెవిటివారైనా, వారు కూడా సంకేతాల ద్వారా అర్థం చేసుకోగలరు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుంది. ఎవరైనా వచ్చినట్లయితే, మేము మీకు మార్గాన్ని తెలియపరుస్తాము అని వారికి చెప్పండి, అదేమిటంటే స్వర్గ రచయిత అయిన అనంతమైన తండ్రి ద్వారా స్వర్గం యొక్క సదా సుఖమయమైన వారసత్వం ఎలా లభిస్తుంది. ఈ చిన్న-చిన్న కరపత్రాలను పంచుతూ ఉండాలి. హృదయంలో చాలా ఉల్లాసముండాలి. ఏ ధర్మంవారు వచ్చినా సరే మనం ఈ విధంగా అర్థం చేయించాలి. తండ్రి అంటారు, ఈ దేహం యొక్క అన్ని ధర్మాలను విడిచి నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, మీరు నా వద్దకు వచ్చేస్తారు. మొట్టమొదట ఇది నిశ్చయం చేసుకోండి, ఆ తర్వాతే రెండవ విషయము, అప్పటివరకు ముందుకు వెళ్ళనే వెళ్ళకూడదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. కేవలం ఇదే అన్నింటికన్నా ఫస్ట్ క్లాస్ విషయము. కేవలం రెండు పదాలే ఉన్నాయి, అల్ఫ్ మరియు బే, తండ్రి మరియు వారసత్వము. అచ్ఛా.

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమదంతా అల్ఫ్ (శివబాబా) కు సమర్పించి రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. తండ్రి మరియు వారసత్వము ఎంత సమయం గుర్తున్నాయి అన్న లెక్కను చూసుకోవాలి.

2. ఎటువంటి తప్పుడు నడవడికను నడవకూడదు. స్థిరమైన స్మృతిలో ఉండే అభ్యాసాన్ని చేయాలి.

వరదానము:-

లోపల ఒకవేళ ఏదైనా బలహీనత ఉన్నట్లయితే, దాని కారణాన్ని అర్థం చేసుకుని నివారణ చేయండి ఎందుకంటే మాయ నియమం ఏమిటంటే, మీలో ఏ బలహీనత ఉంటుందో, ఆ బలహీనత ద్వారానే అది మిమ్మల్ని మాయాజీతులుగా అవ్వనివ్వదు. మాయ ఆ బలహీనత యొక్క లాభం తీసుకుంటుంది మరియు అంతిమ సమయంలో కూడా అదే బలహీనత మోసం చేస్తుంది. అందుకే సర్వ శక్తుల స్టాక్ ను జమ చేసుకుని, శక్తిశాలి ఆత్మగా అవ్వండి మరియు యోగ ప్రయోగం ద్వారా ప్రతి ఫిర్యాదును సమాప్తం చేసి సంపూర్ణంగా అవ్వండి. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అన్న స్లోగన్ గుర్తుండాలి.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు – ‘‘తమ అసలైన లక్ష్యం ఏమిటి?’’

తమ అసలైన లక్ష్యం ఏమిటి అన్నది మొట్టమొదటగా తెలుసుకోవడం తప్పనిసరి. అది కూడా మంచి రీతిలో బుద్ధిలో ధారణ చేయాలి, అప్పుడే పూర్తి రీతిలో ఆ లక్ష్యంలో ఉపస్థితులవ్వగలరు. తమ అసలైన లక్ష్యం ఏమిటంటే – ఆత్మనైన నేను ఆ పరమాత్మ సంతానాన్ని. నిజానికి కర్మాతీతుడను. కానీ నన్ను నేను మర్చిపోవడంతో కర్మబంధనంలోకి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ అది గుర్తు రావడంతో, ఈ ఈశ్వరీయ యోగంలో ఉండడంతో, నేను చేసిన వికర్మలను వినాశనం చేసుకుంటున్నాను. కనుక ఆత్మనైన నేను పరమాత్మ సంతానాన్ని అన్నది మన లక్ష్యము. ఇకపోతే ఎవరైనా స్వయాన్ని, మేమే దేవతలము అని భావించి, ఆ లక్ష్యంలో స్థితులైనట్లయితే పరమాత్మ శక్తి లభించదు మరియు వారి వికర్మలు కూడా వినాశనమవ్వవు. ఇప్పుడు తమకైతే ఈ పూర్తి జ్ఞానముంది – ఆత్మనైన నేను పరమాత్మ సంతానాన్ని, నేను కర్మాతీతునిగా అయి భవిష్యత్తులోకి వెళ్ళి, జీవన్ముక్త దేవీ-దేవతా పదవిని పొందుతాను, ఈ లక్ష్యంలో ఉండడంతో ఆ శక్తి లభిస్తుంది. ఇప్పుడు మనుష్యులు, మాకు సుఖము, శాంతి, పవిత్రత కావాలని ఏదైతే కోరుకుంటున్నారో, అది పూర్తి యోగం ఉన్నప్పుడే ప్రాప్తిస్తుంది. ఇకపోతే, దేవతా పదవి అయితే తమ భవిష్య ప్రారబ్ధము. తమ పురుషార్థము వేరు మరియు తమ ప్రారబ్ధము కూడా వేరు, కావున ఈ లక్ష్యము కూడా వేరు. పవిత్ర ఆత్మనైన నేను, చివరికి పరమాత్మగా అవుతాను అన్న లక్ష్యం పెట్టుకోకూడదు, అలా కాదు. కానీ నేను పరమాత్మతో యోగం జోడించి పవిత్ర ఆత్మగా అవ్వాలి, అంతేకానీ ఆత్మ ఏమీ పరమాత్మగా అవ్వదు. అచ్ఛా – ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top