16 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

15 April 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - 21 జన్మల రాజ్యాన్ని తీసుకోవడానికి, జ్ఞాన ధనాన్ని దానం చేయండి, ధారణ చేసి మళ్ళీ ఇతరులతో కూడా చేయించండి’’

ప్రశ్న: -

నడుస్తూ-నడుస్తూ గ్రహచారం కూర్చోవడానికి ముఖ్య కారణమేమిటి?

జవాబు:-

శ్రీమతంపై పూర్తిగా నడుచుకోరు, అందుకే గ్రహచారం కూర్చుంటుంది. ఒకవేళ నిశ్చయబుద్ధిగా అయి ఒక్కరి మతంపైనే సదా నడుచుకున్నట్లయితే గ్రహచారం కూర్చోలేదు, సదా కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆలస్యంగా వచ్చినవారు కూడా చాలా ముందుకు వెళ్ళగలరు. ఇది సెకండు యొక్క ఆట. బాబాకు చెందినవారిగా అయ్యారంటే హక్కుదారులుగా అయ్యారు, అపారమైన సుఖపు వారసత్వం లభిస్తుంది, కానీ శ్రీమతముపై సదా నడుస్తూ ఉండాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవు ప్రేమ సాగరుడవు… (తూ ప్యార్ కా సాగర్ హై…)

ఓంశాంతి. ఓం శాంతి యొక్క అర్థమైతే పిల్లలకు పదే-పదే అర్థం చేయించడం జరిగింది. ఓం అనగా అహమ్ ఆత్మ (నేను ఆత్మను), ఇది నా శరీరము. తండ్రి అంటారు, ఓం (అహమ్-ఆత్మ) సో పరమాత్మ. వారికి శరీరం లేదు ఎందుకంటే వారైతే అందరికీ తండ్రి. నేను ఆత్మ సో పరమాత్మ అని మీరు ఇలా అనరు. అహమ్ (నేను) ఆత్మ పరమాత్మ సంతానాన్ని – ఇదైతే సరైనది. ఇకపోతే, ఆత్మనైన నేనే పరమాత్మ అని అనడం పూర్తిగా తప్పు అవుతుంది. పిల్లలైన మీకు తండ్రి గురించి తెలుసు. ఇది పాత ప్రపంచమని అర్థం చేసుకున్నారు. కొత్త ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. కానీ సత్యయుగం ఎప్పుడు ఉంటుంది, ఇది పాపం వారికి తెలియదు. కలియుగమైతే ఇంకా 40 వేల సంవత్సరాలు ఉందని వారు భావిస్తారు. పిల్లలైన మీకు తెలుసు, మేము శ్రీమతంపై ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము. తండ్రి అంటారు, నేను మీ ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయిస్తున్నాను. మీ ద్వారా వినాశనాన్ని చేయించను. మీరు అదే శివ శక్తులు, ప్రజాపిత బ్రహ్మా ముఖవంశావళి, అహింసాత్మక శక్తి సైన్యము. మీరే తండ్రి నుండి వారసత్వాన్ని పొందడానికి అధికారులు. బ్రాహ్మణులైన మీకే శ్రీమతం లభిస్తుంది. మీరు కామ వికారాన్ని జయిస్తారు, కావుననే ఇక్కడకు ఎవరైతే వస్తారో వారిని అడగడం జరుగుతుంది, ఒకవేళ కామ వికారం పైన విజయం పొందితేనే తండ్రిని కలవండి. సొంత పిల్లలు మరియు సవతి పిల్లలు ఉంటారు. సొంత పిల్లలు ఎప్పుడూ వికారాల్లోకి వెళ్ళలేరు. ఇప్పుడు మనకు జ్ఞాన సాగరుడైన తండ్రి లభించారు. కృష్ణుడిని జ్ఞానసాగరుడు అని అనరు. శివబాబా మహిమ మరియు దేవతల మహిమ పూర్తిగా వేరు. సంపూర్ణ నిర్వికారులు అనేది దేవతల మహిమ. శివబాబాను మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్-చిత్-ఆనంద స్వరూపుడు, జ్ఞాన సాగరుడు అని అంటారు. ఈ శరీరం మొదట జడముగా ఉంటుంది, తర్వాత ఎప్పుడైతే దీనిలో ఆత్మ ప్రవేశిస్తుందో, అప్పుడు చైతన్యంగా అవుతుంది. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క ఉత్పత్తి ఎలా అవుతుంది, ఇది కేవలం బీజరూపుడైన తండ్రికే తెలుసు. వారు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. బాబా అంటారు, మీకు కొద్దిగా జ్ఞానం ఇస్తాను, దానితో మీరు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. దానినే శివాలయమని అంటారు. అది శివబాబా ద్వారా స్థాపించబడిన స్వర్గము, అందులో చైతన్య దేవతలు నివసిస్తారు. భక్తి మార్గంలో వారిని మందిరాలలో కూర్చోబెట్టారు. మీరు సత్యాతి-సత్యమైన ఆత్మిక బ్రాహ్మణులు. మిమ్మల్ని శివబాబానే బ్రహ్మా ద్వారా తమవారిగా చేసుకున్నారు. ఆ దైహిక బ్రాహ్మణులైతే, మేము ముఖ వంశావళి అని అంటారు. కానీ మళ్ళీ బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అనేస్తారు ఎందుకంటే మేము పూజారి బ్రాహ్మణులము, మీరు పూజ్యులు అని భావిస్తారు. వికారి బ్రాహ్మణులు పవిత్రులకు నమస్కరిస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు, కానీ మీరు కూడా బ్రాహ్మణ దేవతాయ నమః అని అనవలసి వచ్చే సమయం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పూజ్యులైన మీరే వెళ్ళి పూజారులుగా అవుతారు. ఇవి చాలా గుహ్యమైన, రమణీకమైన విషయాలు. ఎవరైతే శ్రీమతంపై నడుచుకునే వారుంటారో, వారు ఈ విధంగా ధారణ చేసి మరియు చేయించగలరు. ఎలాగైతే బ్యారిస్టర్, సర్జన్ ఎంతగా చదువుకుంటే, అంతగా మందులు లేదా పాయింట్లు బుద్ధిలో ఉంటాయి. పేరైతే వకీల్ అని ఉంటుంది కానీ కొంతమంది లక్షాధికారులు మరియు కొంతమందికి ఏ మాత్రం సంపాదన ఉండదు. ఇక్కడ కూడా నంబరువారుగా దానం చేస్తారు, కనుక దానికి ప్రతి ఫలం లభిస్తుంది. అందుకే ధనం ఎంత దానం చేసినా తరగదు… అని అంటారు. అక్కడ దానం చేసినప్పుడు అల్పకాలము కోసం మరుసటి జన్మలో లభిస్తుంది. షావుకార్ల ఇంట్లోకి వెళ్తారు, ఇక్కడైతే 21 జన్మల కోసం రాజ్యాధికారిగా అవుతారు. మీరు అన్ని పాయింట్లను కూడా నోట్ చేసుకోవాలి. మీరు కాగితాన్ని చూస్తూ భాషణ చేయకూడదు, కానీ బుద్ధిలో పెట్టుకొని భాషణ చేయాలి. శివబాబా ఎలాగైతే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడో, అలాగే పిల్లలైన మీరు కూడా అవ్వాలి.

మా తండ్రి టీచరుగా ఉండేవారు, మీరు కూడా నాకు తండ్రి, టీచరు అని ఒక కుమార్తె రాసారు. వారు హద్దుకు చెందినవారు, వీరు అనంతమైనవారు. అనంతమైన తండ్రి అనంతమైన విషయాన్ని వినిపిస్తారు. హద్దు తండ్రి హద్దు విషయాలను వినిపిస్తారు. వారు హద్దు సుఖాన్ని ఇచ్చేవారు. హద్దు సేవను చేసేవారు, సర్వోదయ అన్న పేరును పెట్టుకుంటారు, ఇది కూడా అసత్యము. సర్వము అనగా మొత్తం ప్రపంచం పైన అయితే దయ చూపించరు. తండ్రి మాత్రమే సర్వుల పైన దయ చూపించి పావనంగా చేస్తారు. తత్వాలను కూడా పావనంగా చేస్తారు. ప్రపంచం ఒక్కటే ఉంటుంది. అదే మళ్ళీ కొత్తది నుండి పాతదిగా అవుతుంది. భారత్ యే స్వర్గంగా ఉండేది, భారత్ యే నరకంగా ఉంది. బౌద్ధుల ఖండము, క్రిస్టియన్ల ఖండము ఏమీ స్వర్గంగా ఉండేవని కాదు. ఒక్క తండ్రి మాత్రమే అందరినీ దుఃఖం నుండి విడిపించే హెవెన్లీ గాడ్ ఫాదర్, వారు లిబరేటర్(ముక్తిదాత) కూడా, గైడ్ (మార్గదర్శకుడు) కూడా, వారిని అందరూ స్మృతి చేస్తారు. తండ్రి అంటారు, పిల్లలూ, సమయం చాలా కొద్దిగా ఉంది, ఇప్పుడు దేహ సహితంగా అన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి. ఇప్పుడు మనం మన తండ్రి వద్దకే వెళ్తాము, మళ్ళీ వచ్చి రాజ్యం చేస్తాము. ముఖ్యమైన హీరో మరియు హీరోయిన్ల పాత్ర మీది. యథా తల్లి తండ్రి తథా పిల్లలు, అందరూ పురుషార్థీలు. పురుషార్థం చేయించేవారు ఒక్క పరమపిత పరమాత్మ, అతి ప్రియమైనవారు. భక్తి మార్గంలో కూడా వారిని స్మృతి చేస్తారు కానీ వారి గురించి తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా అనేవారు, రచయిత మరియు రచన అనంతమైనది, అనంతమైనది అని. మరి ఈ రోజుల్లో గురువులు, నేనే పరమాత్మ అని ఎలా అంటారు! దిల్వాడా మందిరంలో ఆది దేవ్ చిత్రాన్ని, కింద నల్లగా చూపిస్తారు, మళ్ళీ అచల్ ఘర్ లో బంగారు చిత్రాన్ని ఉంచారు, కింద తపస్య చేస్తున్నారు, పైన స్వర్గం ఉంది. ఇది మన స్మృతి చిహ్నము. పతితులను పావనంగా చేస్తారంటే ఇది సంగమము అయ్యింది కదా. భక్తి మార్గం వారు కూడా ఉంటారు. బాబా ఈ శరీరం ద్వారా తమ జడ మందిరాల స్మృతి చిహ్నాన్ని కూడా చూస్తారు. నేను చూస్తాను, ఇవి నా స్మృతి చిహ్నాలు తయారై ఉన్నాయి, మీరు కూడా మీ స్మృతి చిహ్నాలు చూడండి అని అర్థం చేయిస్తారు. ఇవి మా స్మృతి చిహ్నాలు అని ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు తెలుసు, పూజ్య దేవతలుగా ఉన్న మీరే ఇప్పుడు పూజారులుగా అయ్యారు. మనమే దేవతలము, మనమే క్షత్రియులము… హమ్ సో అర్థం కూడా మీకే తెలుసు. కొత్త ప్రపంచం నుండి పాతదిగా ఎలా అవుతుంది. కొత్తది తయారవ్వాలి, అప్పుడే పాతది వినాశనం అవుతుంది. బ్రహ్మా ద్వారా స్థాపన అయితే తప్పకుండా ఇక్కడే జరగాలి. ప్రజలను ఇక్కడే రచిస్తారు. సూక్ష్మవతనంలోనైతే బ్రహ్మా ఒంటరిగా కూర్చుని ఉన్నారు. రచనను రచించి పూర్తి చేసిన తర్వాత ఫరిశ్తాగా అయ్యారు.

మీరు ప్రజాపిత బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణ కుల భూషణులు. వాస్తవానికి మీరే సర్వోదయ లీడర్లు. శ్రీమతముతో మీరు మీ పైన కూడా దయ చూపించుకుంటారు, తద్వారా సర్వులపైన కూడా దయ చూపిస్తారు. శ్రీ శ్రీ శివబాబా కూర్చొని మిమ్మల్ని శ్రీ గా తయారుచేస్తారు. శ్రీ శ్రీ అని వాస్తవానికి ఒక్కరినే అనగలరు. పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత ఒక్కరే. మిగిలినదంతా అసత్యము, ఇది అసత్యపు ప్రపంచము. ఇందులో ఏదైతే చెప్తారో, అది అసత్యమే అసత్యము. రచయిత మరియు రచనల విషయంలోనే అసత్యం చెప్తారు, బాబా సత్యాన్ని చెప్తారు. దీనిని సత్య నారాయణ కథ అని అంటారు. చూడండి, మీరు జ్ఞానం ద్వారా, ఎలా ఉండేవారు ఎలా అవుతున్నారు. శ్రీమతముపై ఎంతగా నడుచుకుంటారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడం జరుగుతుంది, అందుకే శ్రీమద్భగవద్గీత అని అంటారు. మిగిలిన శాస్త్రాలు దాని రచన. గీత తల్లి తండ్రి. గీతను ఖండించడంతో వారసత్వం ఎవ్వరికీ కూడా లభించదు. ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు. పాతవారు ఎవరైతే ఉంటారో, వారే తెలివైనవారు అని కూడా కాదు. చాలామంది కొత్తవారు పాతవారి కన్నా కూడా చురుకుగా వెళ్తారు. ఆలస్యంగా వచ్చేవారు కూడా ఉన్నత పదవిని పొందుతారు. ఇది సెకెండు యొక్క ఆట. బాబాకు చెందినవారిగా అయ్యారు మరియు హక్కుదారులుగా అయ్యారు. ఒకవేళ ఎవరైనా నిలవలేకపోతే బాబా ఏం చేస్తారు. నిశ్చయబుద్ధిగా అయి శ్రీమతంపై నడుచుకోవాలి, అంతే. ఎలాగైతే ఆ సంపాదనలో దశలు కూర్చుంటాయో, అలాగే ఇక్కడ కూడా దశలు కూర్చుంటాయి. గ్రహచారం కూడా కూర్చుంటుంది ఎందుకంటే శ్రీమతంపై నడుచుకోరు, మిగిలినదంతా చాలా సహజమైన విషయము. బాబా-మమ్మాల పిల్లలుగా అయ్యారంటే అపారమైన సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. ఒక్కరి మతముపై నడుచుకుంటేనే కళ్యాణము. అర్ధకల్పము మీరు ఎవరినైతే స్మృతి చేసారో, ఇప్పుడు వారు మీకు లభించారు కనుక వారిని పట్టుకోవాలి, దీనిలో ఎందుకు తికమక పడతారు. బాబా అంటారు, మళ్ళీ డ్రామానుసారంగా రాజ్య భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాను. నా మతముపై నడుచుకోవాల్సి ఉంటుంది. బుద్ధి ద్వారా నన్ను స్మృతి చేయండి, ఇంకే కష్టమూ మీకు ఇవ్వను. స్వర్గ వారసత్వాన్ని కూడా మీరు పొందుతారు. నిన్న స్వర్గంగా ఉండేది, ఈ రోజు నరకం ఉంది. ఇప్పుడు మళ్ళీ స్వర్గంగా అవ్వాలి. నిన్న ఇక్కడ యజమానులు ఉండేవారు, ఈనాడు బికారిగా అయ్యారు. ఇది రాకుమారునిగా మరియు బికారిగా అయ్యే ఆట. ఎంత సహజమైన విషయము. దేహీ-అభిమానులుగా అవ్వరు, ఇందులోనే శ్రమ ఉంది. సన్యాసులు అంటారు, మీకు క్రోధం వస్తే మీ నోటిలో నాణెం (తావీజు) వేసుకోండి. ఈ ఉదాహరణలన్నీ ఈ సమయానికి సంబంధించినవే. భ్రమరం ఉదాహరణ కూడా ఇక్కడి కోసమే. పేడ పురుగును తన సమానంగా చేస్తుంది, అద్భుతము. తప్పకుండా ఈ సమయంలో అందరూ పేడ పురుగుల వలె ఉన్నారు. వారికి బ్రాహ్మణీలైన మీరు భూ-భూ చేస్తారు. కొందరు బ్రాహ్మణీలు లేక బ్రాహ్మణులు ఎగిరేందుకు యోగ్యులుగా అయిపోతారు. కొందరు శూద్రులకే శూద్రులుగా మిగిలిపోతారు. సర్పం యొక్క ఉదాహరణ కూడా ఇక్కడిదే. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ పాత శరీరాన్ని వదిలి సత్యయుగంలో కొత్త శరీరాన్ని తీసుకోవాలి. తండ్రి జ్ఞాన సాగరుడు, గీతను ఎంత చిన్నదిగా తయారుచేసారు. శ్లోకాలను కంఠస్థం చేసేస్తారు. అందరూ వారి పైన బలిహారమవుతారు. గీతను చదువుతూ-చదువుతూ కలియుగ అంతిమం వచ్చేసింది. సద్గతి ఎవ్వరికీ కూడా లభించదు. మీకు కొంచెం జ్ఞానమే ఇస్తాను – మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఎంత మధురంగా అవ్వాలి. ధారణ చేయాలి. విచార సాగర మథనం చేయాలి. పగలులో వ్యాపారం చేయండి, చాలా సంపాదన జరుగుతుంది. ఉదయముదయమే ఆత్మ రిఫ్రెష్ అవుతుంది. పదే-పదే అభ్యాసం చేయడంతో అలవాటైపోతుంది. ఇప్పుడు ఎవరైతే చేస్తారో, వారు ఉన్నత పదవిని పొందుతారు, నిశ్చయబుద్ధి విజయంతి, సంశయబుద్ధి వినశ్యంతి. అనంతమైన తండ్రి లభించారు, దీనిలో నేను సంశయం ఎందుకు తీసుకురావాలి. శివబాబా విశ్వానికి యజమానిగా చేస్తారు, వారిని ఎందుకు మర్చిపోవాలి. ఈ జ్ఞాన రత్నాలతో చాలా ప్రేమ ఉండాలి. మహాదాని తండ్రి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఈ జ్ఞానం యొక్క ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువైనది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతంపై నడుచుకుంటూ తమపై తాము దయ చూపించుకోవాలి. సర్వోదయులుగా అయ్యి పతిత ప్రపంచాన్ని పావనంగా చేయాలి.

2. అమృతవేళ ఆత్మిక వ్యాపారం చేసి సంపాదన జమ చేసుకోవాలి. విచార సాగర మథనం చేయాలి. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు శ్రమ తప్పకుండా చేయాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క అథారిటీతో శక్తులను ఆర్డర్ అనుసారంగా నడిపిస్తారో, అప్పుడు, ప్రతి శక్తి రచన రూపంలో, మాస్టర్ రచయిత ఎదురుగా వస్తుంది. ఆర్డర్ చేసారు మరియు హాజరైపోతుంది. కనుక ఎవరైతే హజూర్ అనగా తండ్రి ప్రతి అడుగు యొక్క శ్రీమతంపై ప్రతి సమయం ‘‘జీ హాజిర్’’ లేక ప్రతి ఆజ్ఞలో ‘‘జీ హాజిర్’’ చేస్తారో, అలా జీ హాజిర్ చేసేవారి ఎదురుగా ప్రతి శక్తి కూడా జీ హాజిర్ లేక జీ మాస్టర్ హజూర్ అని అంటుంది. ఇలా ఆర్డర్ అనుసారంగా శక్తులను కార్యంలో ఉపయోగించే వారినే మాస్టర్ రచయిత అని అంటారు.

స్లోగన్:-

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు – ‘‘డైరెక్ట్ ఈశ్వరీయ జ్ఞానం ద్వారా సఫలత’’

మనకు ఏదైతే ఈ అవినాశీ జ్ఞానం లభిస్తుందో, ఇది డైరెక్ట్ జ్ఞానసాగరుడైన పరమాత్మ ద్వారా లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని మనం ఈశ్వరీయ జ్ఞానం అని అంటాము ఎందుకంటే ఈ జ్ఞానం ద్వారా మనుష్యులు జన్మ-జన్మాంతరాల దుఃఖం యొక్క బంధనాల నుండి విడుదలవుతారు, కర్మ బంధనంలోకి రారు, అందుకే ఈ జ్ఞానాన్ని అవినాశీ జ్ఞానం అని అంటారు. ఇప్పుడు ఈ జ్ఞానం కేవలం ఒకే ఒక్క అవినాశీ పరమపిత పరమాత్మ ద్వారా మనకే ప్రాప్తిస్తుంది ఎందుకంటే వారు స్వయంగా అవినాశీ. మిగిలిన మనుష్యాత్మలందరూ అయితే జనన-మరణ చక్రంలో వచ్చేవారు, అందుకే వారి ద్వారా లభించిన జ్ఞానం మనల్ని కర్మ బంధనాల నుండి విడిపించేది కాదు. ఈ కారణంగా వారి జ్ఞానాన్ని మిథ్యా జ్ఞానం లేదా వినాశీ జ్ఞానము అని అంటారు. కానీ ఈ దేవతలు సదా అమరులు ఎందుకంటే వీరు అవినాశీ పరమాత్మ ద్వారా ఈ అవినాశీ జ్ఞానాన్ని ప్రాప్తించుకున్నారు, కనుక దీని ద్వారా ఋజువు అవుతుంది, పరమాత్మ కూడా ఒక్కరే, వారి జ్ఞానం కూడా ఒక్కటే. ఈ జ్ఞానంలో రెండు ముఖ్యమైన విషయాలను బుద్ధిలో పెట్టుకోవాలి, ఒకటేమో – ఇందులో వికారీ కలియుగీ సాంగత్య దోషం నుండి దూరంగా ఉండాలి మరియు రెండవ విషయం – అశుద్ధమైన ఆహార-పానీయాలు మొదలైనవాటి పత్యం పెట్టుకోవాలి. ఈ పత్యం పెట్టుకోవడం వలనే జీవితం సఫలమవుతుంది. అచ్ఛా – ఓంశాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top