13 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
12 April 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - గృహస్థ వ్యవహారంలో ఉంటూ అద్భుతం చేసి చూపించాలి, మీరు శ్రేష్ఠాచారీ దేవతగా తయారయ్యే మరియు తయారుచేసే సేవను చేయాలి’’
ప్రశ్న: -
రాజ్య వారసత్వం యొక్క అధికారం ఏ పిల్లలకు ప్రాప్తిస్తుంది?
జవాబు:-
ఎవరైతే తండ్రికి సమీప సంబంధంలోకి వస్తారో, తమ నడవడిక మరియు ఆదాయం యొక్క పూర్తి-పూర్తి సమాచారాన్ని తండ్రికి ఇస్తారో, అటువంటి సొంత పిల్లలే రాజ్య వారసత్వం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఎవరైతే తండ్రి ఎదురుగా రానే రారో, తమ సమాచారాన్ని వినిపించనే వినిపించరో, వారికి రాజ్య వారసత్వం లభించజాలదు. వారు సవతి పిల్లలు. బాబా అంటారు, పిల్లలూ తమ పూర్తి-పూర్తి సమాచారాన్ని ఇవ్వండి, అప్పుడు బాబా అర్థం చేసుకుంటారు వీరు ఏం సేవ చేస్తున్నారు అని. బాబా ప్రతి పరిస్థితిలోనూ పిల్లల చేత ఉన్నత పదవిని పొందే పురుషార్థాన్ని చేయిస్తారు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఎవరు నా మనసు అనే ద్వారం వద్దకు వచ్చారు… (కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే…)
ఓంశాంతి. పిల్లలకు తెలుసు, పరమపిత పరమాత్మ శివునితో మన సంబంధం ఏమిటి. పరమపిత అని అయితే అంటారు. పతిత-పావనుడు అనే పదాన్ని కూడా చేర్చండి. మనసులో ఉంది, పతిత-పావనుడైన పరమాత్మ శివునితో మనకు తండ్రి యొక్క సంబంధం ఉంది. తండ్రి అంటారు, నేను పిల్లల ఎదురుగా ప్రత్యక్షమవుతాను. తండ్రి పిల్లలతోనే ఆత్మిక సంభాషణ చేస్తారు, కలుస్తూ ఉంటారు. ఏ విషయమైతే అర్థం చేయించడం జరుగుతుందో, అది మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. ఇప్పుడు మీకు జగదంబ మరియు జగత్పితలు కూడా తెలుసు. శివుడిని జగత్పిత అని అనరు ఎందుకంటే జగత్తులో ప్రజలు ఉంటారు, అందుకే అనడం జరుగుతుంది, ప్రజాపిత బ్రహ్మా మరియు జగదంబ అని. మొత్తం జగత్తుకు అంబ. దీనితో వారు రచయిత అని ఋజువు అయ్యింది. ఈ తెలివి కూడా కావాలి. మనుష్యులైతే అందరూ పరమాత్మను స్మృతి చేస్తారు, కానీ వారి గురించి తెలియదు. ఇప్పుడు మీకు పరమపిత పరమాత్మ గురించి, జగదంబ గురించి, ప్రజాపిత బ్రహ్మా గురించి తెలుసు. మీరు వచ్చి వారికి సంతానంగా అయ్యారు. లౌకిక తల్లిదండ్రులైతే అందరికీ ఉన్నారు. వారిని జగదంబ, జగత్పిత అని అనరు. జగదంబ, జగత్పితలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. ఈ సమయంలో మీరు మళ్ళీ వచ్చి వారికి చెందినవారిగా అయ్యారు, మళ్ళీ చరిత్ర-భౌగోళికం రిపీట్ అవుతుంది. మీకు తెలుసు, మేము ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రి స్వర్గ స్థాపన చేసేవారు, అక్కడ లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది. మీకు కూడా రాజ్యం లభించింది. ఇప్పుడు మళ్ళీ మీరు తీసుకుంటున్నారు. కనుక పరమపిత పరమాత్మ గురించి తెలుసా అని మీరు అడగాలి. ఈ విషయం ఎలాంటిదంటే అర్థం చేసుకొని కూడా మర్చిపోతారు. తమను తాము మర్చిపోయి, తల్లిదండ్రులను మర్చిపోయి వారసత్వాన్ని పోగొట్టుకుంటారు. ఇది ఉన్నదే యుద్ధ స్థలము. మీరు ఈ సమయంలో మాయపై విజయం పొందేందుకు యుద్ధ మైదానంలో నిలబడి ఉన్నారు. ఎప్పటివరకైతే అంతిమం రాదో, అప్పటివరకు యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఆ యుద్ధం చేసేవారికి కూడా, ఒకవేళ మేము కావాలనుకుంటే సెకెండులో అందరినీ అంతం చేయగలము అని తెలుసు. ఇప్పుడైతే ఒకరికొకరు ఆయుధాలను ఇచ్చుకుంటూ ఉంటారు. అప్పులు ఇచ్చుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా హతమారిస్తే అప్పు సమాప్తమైపోతుంది. బాబా కూడా వార్తాపత్రికలు చదువుతారు. పిల్లలు కూడా వార్తాపత్రికలు చదివి వాటి ద్వారా సేవ చేయాలి. బాబా, మీరైతే యజమాని, మళ్ళీ రేడియో ఎందుకు వింటున్నారు? అని బాబాను అడగాలి. ఇప్పుడు పిల్లలూ, యజమాని అయితే శివబాబా, వాయుమండలం ఏముందో, యుద్ధం మొదలైనవాటి గుర్తులు ఎంతవరకు ఉన్నాయో మాకు ఎలా తెలుస్తుంది! ఈ సమయంలో వ్యర్థ ప్రలాపాలైతే చాలా చేస్తూ ఉంటారు. సదాచార కమిటీలు మొదలైనవి తయారుచేస్తూ ఉంటారు. వారికి రాయాలి, ఈ ప్రపంచమే భ్రష్టాచారిగా ఉంది, సదాచారులు ఎవరైనా ఎలా ఉండగలరు. భ్రష్టాచారీ అని వికారులను అనడం జరుగుతుంది. ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు. పిల్లల్లో కూడా నంబరువారుగా ఉన్నారు. పరమపిత పరమాత్మతో మీ సంబంధం ఏమిటి అని మీరు అందరినీ అడగండి. ఎలాగైతే క్రిస్టియన్లకు తెలుసు, క్రైస్టు ఫలానా సమయంలో జన్మ తీసుకున్నారు. అచ్ఛా, వారి కన్నా ముందు ఎవరు ఉండేవారు? లక్ష్మీ-నారాయణుల రాజ్యం చేసి ఎంత సమయం గడిచింది. ఈ సమయంలో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మంవారే ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయ్యారు. శాస్త్రాలలోనే లక్షల సంవత్సరాలని అనేసారు. ఇప్పుడు మీరు జాగృతి పొందారు మళ్ళీ ఇతరులను కూడా జాగృతం చేయాలి.
మీకు తెలుసు, శివుడు మనకు తండ్రి. ప్రజాపిత బ్రహ్మా మరియు జగదంబ కూడా మనకు మమ్మా-బాబా. లక్ష్మీ-నారాయణులకు సత్యయుగ వారసత్వం ఎక్కడి నుండి లభించింది అని మళ్ళీ అడగడం జరుగుతుంది. 5 వేల సంవత్సరాలు అయింది, ఒకప్పుడు లభించింది, ఇప్పుడు లేదు, ఇప్పుడు లభిస్తూ ఉంది. ఇప్పుడు చరిత్ర రిపీట్ అవుతూ ఉంది. ఇప్పుడు అందరికీ తండ్రి సందేశాన్ని ఎలా ఇవ్వాలి! ఇంటింటికి ఏమైనా దండోరా వేయాలా! అచ్ఛా, బోర్డు కూడా మీరు పెట్టవచ్చు, ఎందుకంటే మీరు మాస్టర్ అవినాశీ సర్జన్. పరమపిత పరమాత్మ నిరాకారుడు. శివబాబా ఎవరి శరీరం ద్వారా జన్మ తీసుకున్నారు అనేదైతే ఎవ్వరికీ తెలియదు! కృష్ణుని శరీరంలో ప్రవేశించి జన్మ తీసుకున్నారని ఇలా కూడా అనలేరు. ఇదైతే మీకు నంబరువారుగా తెలుసు, వారు మన పరమపిత కూడా మరియు మన టీచరు కూడా. మనకు చాలా మంచి శిక్షణ ఇస్తున్నారు. బాబా మళ్ళీ కల్పం తర్వాత వచ్చి కలిసారు. అర్థం చేసుకుంటారు, పక్కా-పక్కా నిశ్చయం కూడా ఉంది, కానీ ఇంటికి వెళ్తూనే ఆ నషా తొలగిపోతుంది. ఇల్లు, గృహస్థంలో ఉంటూ, వ్యాపార-వ్యవహారాలలో ఉంటూ ఎంతవరకు నషా ఉంటుంది, ఇదైతే తప్పకుండా తండ్రికి రాయాలి. కానీ పిల్లలు తండ్రికి పూర్తి సమాచారాన్ని ఇవ్వరు. పిల్లలైన మీకు తండ్రి గురించి పూర్తిగా తెలిసినప్పుడు తండ్రికి కూడా మీ గురించి పూర్తిగా తెలియాలి. వారు మీ తాతగారు అయినప్పుడు వారికి మీ నడవడిక మరియు ఆదాయం గురించి పూర్తి-పూర్తిగా తెలియాలి, అప్పుడే మతాన్ని ఇస్తారు. శివబాబా అయితే అంతర్యామి అని మీరంటారు, కానీ ఈ బ్రహ్మాకు ఎలా తెలుస్తుంది. కొంతమంది అయితే బాబా ఎదురుగా రానే రారు, అందుకే వారు సవతి పిల్లలు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది, కనుక రాజ్య వారసత్వాన్ని పొందలేరు. ఒకవేళ శ్రీమతంపై నడవాలి అంటే పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. పిల్లలు కూడా తండ్రి గురించి అంతా తెలుసుకుంటారు. తండ్రికి కూడా సమాచారాన్ని ఇవ్వాలి. ఇది మన ఆత్మిక, గృహస్థ వ్యవహారం యొక్క సంబంధము.
ఇది ఆత్మిక ఈశ్వరీయ పరివారము. పరమ ఆత్మతో ఆత్మలకు సంబంధం ఉంది కదా. అందరినీ ఈ ప్రశ్న అడగండి, మీకు ఈ లక్ష్మీ-నారాయణుల గురించి తెలుసా, పరమపిత పరమాత్మ గురించి తెలుసా? మీకు సత్యయుగీ శ్రేష్ఠాచారీ దేవీ-దేవతల గురించి తెలుసా? ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవడంతో మీరు శ్రేష్ఠాచారులుగా అవ్వగలరు, లేదంటే ఎప్పటికీ కాలేరు అని మీరు రాయవచ్చు. ఇలా-ఇలా సేవ చేయడంతో మీరు ఉన్నత పదవిని పొందగలరు. భ్రష్టాచారులను శ్రేష్ఠాచారులుగా చేయడము – ఇది మీ వ్యాపారము. మరి బోర్డు ఎందుకు పెట్టుకోరు! స్త్రీ-పురుషులు ఇరువురూ ఈ సేవలో ఉన్నారు. బాబా డైరెక్షన్ ఇస్తారు కానీ పిల్లలు మళ్ళీ మర్చిపోతారు, తమ వ్యాపారంలోనే నిమగ్నమైపోతారు. సేవ ఏదైతే చేయాలో అది చేయనే చేయరు. పూర్తి సమాచారాన్ని ఇవ్వరు, బోర్డు కూడా పెట్టరు. బోర్డు పెట్టలేదు, సేవ చేయలేదు అంటే దేహాభిమానం చాలా ఉందని అర్థం చేసుకుంటారు. మురళీ అయితే అందరూ వింటారు. బాబా ఏమంటారు, అనేక మతాలు లభిస్తాయి. ప్రదర్శనీ కోసం బాబా అంటారు, వేడిగా ఉంటే కొండ పైకి వెళ్ళి ఏర్పాటు చేయండి. బాబా, మేము ఈ ఏర్పాట్లు చేయగలము అని ఎక్కడ నుండి సమాచారం వస్తుందో ఇప్పుడు చూడాలి. పరిచయం ఉన్నట్లయితే వెళ్ళి హాల్ లేక ధర్మశాల తీసుకొని ఏర్పాటు చేయాలి, అప్పుడు చాలా మందికి సందేశం లభిస్తుంది. ఇక్కడ కూడా బోర్డు పెట్టాలి – జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, నిరాకార పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది? మళ్ళీ జగదంబ మరియు జగత్పితలతో మీకు ఏం సంబంధం ఉంది? వారు ఏమిస్తారు? తప్పకుండా జగత్తుకు యజమానులుగా చేస్తారు. వాస్తవానికి మీరు ఇప్పుడు తయారవుతున్నారు. కల్పక్రితము కూడా తయారయ్యారు. మీరు ఈ బోర్డు రాసినట్లయితే మిగిలిన ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి. లక్ష్మీ-నారాయణులకు ఈ విశ్వ యజమానత్వం యొక్క వారసత్వం ఎలా లభించింది? అడిగేవారికైతే తప్పకుండా తెలిసే ఉంటుంది. ఒకవేళ ఇంత సేవ చేయకపోతే సింహాసనంపై ఎలా కూర్చొంటారు. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే రాజయోగము. ప్రజలుగా అయ్యేటువంటిది కాదు. మీరు ఇక్కడకు ప్రజలుగా అయ్యేందుకు వచ్చారా ఏమిటి? బాబా వద్దకు సమాచారం వస్తే, వీరు సేవ చేస్తున్నారని బాబా అర్థం చేసుకుంటారు. ఇంటి గురించి, సేవ గురించి సమాచారం ఇవ్వకపోతే, వీరు విజయ మాలలో వస్తారని ఎలా అర్థం చేసుకోవాలి. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి.
ఇప్పుడు మన రాజధాని స్థాపన అవుతూ ఉందని మీకు తెలుసు. ఆ రాజధానిలో ఉన్నత పదవిని పొందేందుకు పిల్లలైన మీరు పురుషార్థం చేయాలి. కానీ ఎవరికైనా అదృష్టంలో లేకపోతే టీచరు ఏం చేయగలరు. మీరే అటువంటి చెడు కర్మలు చేసారు, వాటిని మీరు అనుభవించాల్సి ఉంటుంది. మమ్మా మంచి కర్మలు చేసారు కనుక ఎంత మంచి అటెన్షన్ తో మమ్మా ఉన్నత పదవిని ప్రాప్తి చేసుకున్నారు. పిల్లలైన మీరు ప్రతి పరిస్థితిలోనూ మంచి పురుషార్థం చేయాలి. బాబా సలహా ఇచ్చారు, ఈ లక్ష్మీ-నారాయణులను తెలుసుకోవడంతో మీరు ఈ శ్రేష్ఠాచారీ దేవతగా అయిపోతారని బోర్డు తయారుచేయించి పెట్టాలి మరియు చిన్న-చిన్న కరపత్రాలను చేయించి పంచాలి. శుభ కార్యంలో ఆలస్యం చేయకూడదు. మధురాతి-మధురమైన పిల్లలైన మీరు చాలా సేవ చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ అద్భుతం చేసి చూపించాలి. ఎప్పుడూ విడిచిపెట్టే ఆలోచన రాకూడదు. మీకు తెలుసు, బాబా మనకు బ్రహ్మా ద్వారా నేర్పిస్తున్నారు, శివబాబా భారత్ లో వచ్చారంటే, నిరాకారుడు ఏమైనా వచ్చారా? ఎలా వచ్చారు, ఏం చేసారు? ఎవ్వరికీ తెలియదు. శివరాత్రి జరుపుకుంటారు, కొంచెం కూడా తెలియదు. పావనంగా తయారుచేయడానికే పరమాత్మ వస్తారు.
బాబా అంటారు, ఏ విషయంలోనైనా తికమక చెందితే, బాబా, మాకు ఈ విషయం అర్థం కావడం లేదు అని అడగండి, 84 జన్మల రహస్యం కూడా అర్థం చేయించారు. వర్ణాలలోకి కూడా రావాలి. మీరు దీనిని ధారణ చేస్తారు. తప్పకుండా మేమే ఈ విధంగా 84 జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు మనం మళ్ళీ సూర్యవంశీయులుగా అవుతాము. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. ఎంత సహజమైన విషయం, అయినా కూడా బుద్ధిలో కూర్చోకపోతే, అప్పుడు – బాబా, మేము ఈ విషయంలో తికమకపడుతున్నామని వచ్చి అడగండి. మొట్టమొదట అల్ఫ్ యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఈ బోర్డులు అందరూ పెట్టండి, ఈ జ్ఞానంతో మీరు సదా సుఖమయంగా, శ్రేష్ఠాచారిగా అవుతారు, కనుక ఇది మంచిది కదా. ఇటువంటి విషయాన్ని వెళ్ళి ఎందుకు అర్థం చేసుకోకూడదు అని ఆసక్తి కలుగుతుంది. ఎవరెవరు సత్యమైన పిల్లలు అని బాబా సేవ ద్వారా అర్థం చేసుకుంటారు, ఎవరైతే అటెన్షన్ పెడతారో – వారే మాలలో పూసగా అవుతారు. చేసి చూపించాలి. మీరైతే ప్రాక్టికల్ గా సమ్ముఖంలో కూర్చుని వింటున్నారు. మిగిలిన పిల్లలు మురళీ ద్వారా వింటారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పరమాత్మ తండ్రి కూడా, మళ్ళీ పతితం నుండి పావనంగా తయారుచేసి తీసుకొని వెళ్తారు కనుక గురువు అయినట్లు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని శిక్షకుడిగా అయి చదివిస్తారు కావున ముగ్గురూ అయ్యారు కదా. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతారు. బుద్ధి నుండి ఆ నషా తొలగిపోతుంది. లేదంటే స్థిరమైన సంతోషం ఉండాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. విజయ మాలలో పూసలుగా అయ్యేందుకు తమపై తాము పూర్తి అటెన్షన్ పెట్టాలి. శ్రేష్ఠాచారిగా తయారయ్యే మరియు తయారుచేసే సేవను చేయాలి.
2. దేని ద్వారానైతే శిక్షలు అనుభవించవలసి వస్తుందో, అటువంటి చెడు కర్మ ఏదీ చేయకూడదు, అడుగడుగునా తండ్రి సలహాపై నడుచుకోవాలి.
వరదానము:-
సేవలో వృద్ధి జరగడం లేదు లేదా వినేవారు లభించడం లేదు అని ఆత్మిక సేవాధారులు ఎప్పుడూ ఈ విధంగా ఆలోచించలేరు. వినేవారు చాలా మంది ఉన్నారు, కేవలం మీరు తమ స్థితిని ఆత్మికంగా, ఆకర్షణమయంగా చేసుకోండి. అయస్కాంతం తన వైపుకు ఆకర్షించగలిగినప్పుడు, మరి మీ ఆత్మిక శక్తి ఆత్మలను ఆకర్షించలేదా! కనుక ఆత్మిక ఆకర్షణ చేసేటువంటి అయస్కాంతంగా అవ్వండి, దానితో ఆత్మలు స్వతహాగా ఆకర్షితులై మీ ఎదురుగా వచ్చేయాలి, ఇదే ఆత్మిక సేవాధారి పిల్లలైన మీ సేవ.
స్లోగన్:-
మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు – ‘‘పరమాత్మ ఒక్కరే మిగిలిన వారందరూ మనుష్యాత్మలు’’
ఇప్పుడు ఇదైతే మొత్తం ప్రపంచానికి తెలుసు, పరమాత్మ ఒక్కరే, వారు సర్వశక్తివంతుడు, సర్వం తెలిసినవారు, ఇలా మొత్తం ప్రపంచం స్వయం కూడా అంటుంది, మేము పరమాత్మ సంతానము అని. పరమాత్మ ఒక్కరే, ఏ ధర్మం వారైనా సరే, వారు కూడా పరమాత్మనే నమ్ముతారు. వారు కూడా స్వయాన్ని పరమాత్మ ద్వారా పంపించబడిన సందేశ వాహకులుగా భావిస్తారు, అలాగే సందేశాన్ని తీసుకొచ్చి తమ-తమ ధర్మం యొక్క స్థాపన చేస్తారు. ఎలాగైతే గురునానక్ కూడా ఏక్ ఓంకార్ సత్ నామ్ అని పరమాత్మను ఇంతగా మహిమ చేసారు, ఏక్ ఓంకార్ కు అర్థము పరమాత్మ ఒక్కరే. సత్ నామ్ అనగా వారి పేరు సత్యము అనగా పరమాత్మ నామ రూపాలు కలవారు కూడా, అవినాశీ, అకాలమూర్తి కూడా, మళ్ళీ కర్తా పురుష్ కూడా అనగా వారు స్వయం అకర్త అయి ఉన్నా కూడా బ్రహ్మా తనువు ద్వారా కర్తా పురుషునిగా అవుతారు. ఇప్పుడు ఈ మొత్తం మహిమ ఒక్క పరమాత్మదే, ఇప్పుడు మనుష్యులు ఇంతగా అర్థం చేసుకుని కూడా మళ్ళీ ఈశ్వరుడు సర్వత్రా ఉన్నారు, అహం ఆత్మ సో పరమాత్మ(ఆత్మనైన నేను పరమాత్మను) అని అంటారు. ఒకవేళ అందరూ పరమాత్మలే అయితే మళ్ళీ ఏక్ ఓంకార్… ఈ మహిమ ఏ పరమాత్మకు చేస్తారు? దీనితో పరమాత్మ ఒక్కరు అని ఋజువవుతుంది. అచ్ఛా – ఓం శాంతి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!