11 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

April 10, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీ బుద్ధిలో రోజంతా సేవ యొక్క ఆలోచనలే నడవాలి. మీరు అందరి కళ్యాణం చేయాలి ఎందుకంటే మీరు అంధులకు చేతికర్ర’’

ప్రశ్న: -

ఉన్నత పదవిని పొందడానికి ముఖ్యంగా ఏ ధారణ కావాలి?

జవాబు:-

ఎప్పుడైతే మీ కర్మేంద్రియాలపై పూర్తి-పూర్తి కంట్రోల్ ఉంటుందో, అప్పుడు ఉన్నత పదవి లభిస్తుంది. ఒకవేళ కర్మేంద్రియాలు వశంలో లేకపోతే, నడవడిక సరిగ్గా లేకపోతే, చాలా కోరికలు ఉన్నట్లయితే, లోభం ఉన్నట్లయితే ఉన్నత పదవి నుండి వంచితులైపోతారు. ఉన్నత పదవి పొందాలంటే తల్లిదండ్రులను పూర్తిగా ఫాలో చేయండి. కర్మేంద్రియజీతులుగా అవ్వండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నయన హీనులకు దారి చూపించండి ప్రభూ… (నయన్ హీన్ కో రాహ్ దిఖావో ప్రభూ…)

ఓంశాంతి. ప్రదర్శినీ కొరకు ఈ పాట చాలా బాగుంది. ప్రదర్శినీలో రికార్డు వేయకూడదని ఏమీ లేదు. దీనిపై కూడా మీరు అర్థం చేయించగలరు ఎందుకంటే అందరూ పిలుస్తూనే ఉంటారు. కానీ ఎక్కడికి వెళ్ళాలి మరియు ఎవరు తీసుకెళ్తారు అన్నది తెలియదు. ఎలాగైతే డ్రామాకు లేక విధికి వశమై భక్తులు భక్తి చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే భక్తి పూర్తవుతుందో, అప్పుడే తండ్రి వస్తారు. ఎంతగా ప్రతి ముంగిట భ్రమిస్తూ ఉంటారు. ఉత్సవాలు-తిరునాళ్ళు మొదలైనవి జరుగుతాయి. దిన ప్రతి దినం వృద్ధి పొందుతూ ఉంటాయి. శ్రద్ధతో తీర్థ యాత్రలకు వెళ్ళడము, భ్రమించడం కొనసాగుతూనే ఉంటుంది. చాలా సమయం గడచిపోయినా గవర్నమెంట్, స్టాంపులు మొదలైనవి తయారుచేస్తూనే ఉంటుంది. సాధువులు మొదలైనవారి స్టాంపులను కూడా తయారుచేస్తారు. జన్మదినాన్ని జరుపుతారు. ఇదంతా రావణ రాజ్యము అనగా మాయ యొక్క ఆడంబరము. వారి ఉత్సవాలు-తిరునాళ్ళు కూడా జరగాల్సిందే. అర్ధకల్పం నుండి మీరు రావణ రాజ్యంలో భ్రమిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబా వచ్చి రావణ రాజ్యం నుండి విడిపించి రామ రాజ్యంలోకి తీసుకెళ్తారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అనే మహిమ ఎవరిదో ప్రపంచానికి తెలియదు. మొదట 16 కళల సంపూర్ణులుగా, పూజ్యులుగా ఉంటారు. తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి, అప్పుడు వారిని సెమీ (సగము) అని అంటారు. ఫుల్ (పూర్తి) పూజ్యులు, తర్వాత రెండు కళలు తగ్గిపోవడంతో సెమీ పూజ్యులు అని పిలవబడతారు. పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారని మీకు తెలుసు, తర్వాత సెమీ పూజ్యులుగా అవుతారు. ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమంలో మన పూజారీ పాత్ర సమాప్తమవుతుంది. పూజ్యులుగా చేసేందుకు బాబా రావలసి ఉంటుంది. ఇప్పుడు బాబా విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. ఇది కూడా విశ్వమే, అది కూడా విశ్వమే. అక్కడ మనుష్యులు చాలా కొద్దిమంది ఉంటారు. ఒకే ధర్మముంటుంది. అనేక ధర్మాలు ఉండడం వలన కూడా హంగామా జరుగుతుంది.

ఇప్పుడు బాబా వచ్చారు యోగ్యులుగా తయారుచేయడానికి. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో, అంతగా తమ కళ్యాణం కూడా చేసుకుంటారు. కళ్యాణం చేయాలనే అభిరుచి ఎంతగా ఉంటుందో చూసుకోవాలి. ఎలాగైతే ఆర్టిస్టుకు, ఈ-ఈ విధంగా చిత్రాలను తయారుచేయాలి, మనుష్యులు మంచి రీతిలో అర్థం చేసుకోవాలి అని ఆలోచన ఉంటుంది. మేము అనంతమైన తండ్రి సేవ చేస్తున్నామని భావిస్తారు. భారత్ ను స్వర్గంగా తయారుచేయాలి. ప్రదర్శినీలో చూడండి, చాలామంది వస్తారు. కావున ప్రదర్శినీకి ఎటువంటి చిత్రాలను తయారుచేయాలంటే, ఎవరైనా కూడా, ఈ చిత్రాలు ఖచ్ఛితమైన మార్గాన్ని చూపించేవిగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఉత్సవాలు-తిరునాళ్ళు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అవైతే వీటి ముందు ఏమీ కావు. ఆర్టిస్టులు ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో, వారికి – చాలామందికి కళ్యాణం జరగడానికి ఇటువంటి చిత్రాలను తయారుచేయాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. రాత్రింబవళ్ళు బుద్ధి ఈ విషయంలోనే నిమగ్నమై ఉండాలి. ఈ విషయాలపై ఎంతో అభిరుచి ఉంటుంది. మృత్యువు అయితే అకస్మాత్తుగా వస్తుంది. ఒకవేళ చెప్పులు మొదలైనవాటి స్మృతిలో ఉంటే, ఆ సమయంలో మృత్యువు వస్తే, అప్పుడు చెప్పుల సమానమైన జన్మ లభిస్తుంది. ఇక్కడైతే దేహ సహితంగా అన్నింటినీ మర్చిపోండి అని తండ్రి అంటారు. తండ్రి ఎవరు అన్నది కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మల తండ్రి గురించి తెలుసా అని ఎవరినైనా అడగండి, తెలియదు అని వారంటారు. ఎంతగా స్మృతి చేస్తారు, యాచిస్తూ ఉంటారు. దేవీల వద్దకు కూడా వెళ్ళి యాచిస్తూ ఉంటారు. దేవీ యొక్క పూజ చేసారు, ఏదైనా కొద్దిగా లభించింది అంటే, అంతే, ఇక వారిపై బలిహారమైపోతారు. మళ్ళీ పూజారిని కూడా పట్టుకుంటారు, అతను కూడా ఆశీర్వాదాలు మొదలైనవి ఇస్తారు. ఎంతటి అంధ విశ్వాసము. కావున ఇటువంటి పాటలపై ప్రదర్శినీలో కూడా అర్థం చేయించవచ్చు. ఈ ప్రదర్శనీ అయితే గ్రామ-గ్రామాలకు వెళ్తుంది. తండ్రి పేదల పెన్నిధి. వారిని చాలా బాగా పైకి తీసుకురావాలి. షావుకార్లు అయితే కోట్లలో కొందరే వెలువడుతారు. ప్రజలైతే చాలామంది ఉన్నారు. ఇక్కడైతే మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మొట్టమొదట అయితే తండ్రిని తెలుసుకోవాలి – వారు మనల్ని చదివిస్తున్నారు అని. ఈ సమయంలో మనుష్యులు ఎంత రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. సెంటర్లకు ఇంతమంది రావడం చూస్తారు కూడా, అందరికీ నిశ్చయముందా! తండ్రి, టీచర్, సద్గురువు ఉన్నారు, ఇది కూడా అర్థం చేసుకోరు.

మరొక పాట కూడా ఉంది – ఈ పాపపు ప్రపంచం నుండి… ఇది కూడా బాగుంది, ఇదైతే పాపపు ప్రపంచము. భగవానువాచ – ఇది ఆసురీ సంప్రదాయము, నేను దీనిని దైవీ సంప్రదాయంగా చేస్తాను. మరి మనుష్యుల కమిటీలు మొదలైనవి ఈ కార్యాన్ని ఎలా చేయగలవు. ఇక్కడైతే విషయమంతా బుద్ధికి సంబంధించినది. భగవంతుడు అంటారు – మీరు పతితులు, మిమ్మల్ని భవిష్యత్తు కోసం పావనమైన దేవతగా చేస్తాను. ఈ సమయంలో అందరూ పతితులు. పతితము అన్న పదం వికారాలకు సంబంధించినది. సత్యయుగంలో నిర్వికారీ ప్రపంచం ఉండేది. ఇది వికారీ ప్రపంచము. కృష్ణుడికి 16,108 మంది రాణులను చూపించారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఏవైతే శాస్త్రాలు తయారుచేయబడ్డాయో, వాటిలో నింద చేసారు. బాబా, ఎవరైతే స్వర్గాన్ని తయారుచేస్తారో, వారి కోసం కూడా ఏమేమో చెప్తారు. ఇప్పుడు మీకు తెలుసు, బాబా మనల్ని ఎంత ఉన్నతంగా తయారుచేస్తారు, ఎంత మంచి శిక్షణనిస్తారు. ఇది సత్యాతి-సత్యమైన సత్సంగము. మిగిలినవన్నీ అసత్యపు సాంగత్యాలు. మళ్ళీ పరమపిత పరమాత్మ వచ్చి ఇటువంటివారిని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలూ, మీరిప్పుడు అంధులకు చేతికర్రగా అవ్వాలి. ఎవరైతే స్వయం అంధులుగా ఉన్నారో, వారు మళ్ళీ ఇతరులకు చేతికర్రగా ఎలా అవుతారు! జ్ఞానం యొక్క వినాశనమైతే జరగదు. ఒక్కసారి తల్లి-తండ్రి అన్నారంటే ఎంతో కొంత లభించాలి. కానీ నంబరువారు పదవులైతే ఉన్నాయి కదా. నడవడిక ద్వారా కూడా కొంత తెలిసిపోతుంది. అయినా పురుషార్థం చేయించడం జరుగుతుంది. ఏది లభిస్తే అది సరిపోతుంది అని కాదు. పురుషార్థంతో ఉన్నతమైన ప్రారబ్ధం లభిస్తుంది. పురుషార్థం లేకుండా నీరు కూడా లభించదు. దీనిని కర్మక్షేత్రం అని అనడం జరుగుతుంది, ఇక్కడ కర్మ లేకుండా మనుష్యులు ఉండలేరు. కర్మ సన్యాసం అన్న పదమే తప్పు. చాలా హఠం చేస్తారు. నీటిపై, అగ్నిపై నడవడం నేర్చుకుంటారు. కానీ ఉపయోగమేముంది? అనవసరంగా ఆయుష్షును పోగొట్టుకుంటారు. రావణుడి దుఃఖం నుండి విడుదలయ్యేందుకు భక్తి చేయడం జరుగుతుంది. విడుదలై మళ్ళీ తిరిగి వెళ్ళాలి, అందుకే, మనం ముక్తిధామానికి వెళ్ళాలి లేక సుఖధామానికి వెళ్ళాలని అందరూ గుర్తు చేస్తారు. రెండూ గతించిపోయాయి. భారత్ సుఖధామంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది, కావున నరకవాసులు అని అంటారు కదా. ఫలానావారు స్వర్గస్థులయ్యారని స్వయం మీరే అంటారు. అచ్ఛా, మీరైతే నరకంలో ఉన్నారనే కదా. స్వర్గానికి వ్యతిరేకము నరకము. ఇక అదైతే శాంతిధామము. పెద్ద-పెద్దవారు ఇది కూడా అర్థం చేసుకోరు. తమకు తామే, మేము నరకంలో ఉన్నామని నిరూపించుకుంటారు. చాలా యుక్తిగా నిరూపించి చెప్పాలి. ఈ ప్రదర్శనీ అయితే చాలా పని చేసి చూపిస్తుంది. ఈ సమయంలో మనుష్యులు ఎన్ని పాపాలు చేస్తున్నారు. స్వర్గంలో ఇటువంటి విషయాలు ఉండవు. అక్కడైతే ప్రారబ్ధం ఉంటుంది. మీరు మళ్ళీ ఇప్పుడు స్వర్గంలోకి వెళ్తారు, మీరంటారు, అనేక సార్లు మేము విశ్వానికి యజమానులుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ అవుతున్నాము. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా కొంతమందే అర్థం చేసుకుంటారు. ఈ ఆట నుండి ఎవ్వరూ విడుదల అవ్వలేరు. ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో, మోక్షం కూడా, మనుష్యులు అప్పుడే కోరుకుంటారు. బాబా అయితే అంటారు – మంచి రీతిలో పురుషార్థం చేయండి, తల్లిదండ్రులను ఫాలో చేసి మంచి పదవిని పొందండి, తమ నడవడికను సరిదిద్దుకోండి. తండ్రి అయితే మార్గాన్ని తెలియజేస్తారు, మరి దానిపై ఎందుకు నడుచుకోరు. కోరికలు ఎక్కువగా ఉంచుకోకూడదు. యజ్ఞం నుండి ఏది లభిస్తే అది తినాలి. లోభం ఉన్నా, కర్మేంద్రియాలు వశంలో లేకపోయినా, పదవి కూడా ఉన్నతమైనది పొందలేరు. కనుక ఇటువంటి పాటలు ప్రదర్శినీలో వినిపించి, వాటిపై మీరు అర్థం చేయించవచ్చు.

మీరు శివబాబా పరివారము. శివబాబా కంటే పైన అయితే ఎవ్వరూ లేరు. మిగిలిన వారందరి పైన ఎవరో ఒకరు ఉంటారు. 84 జన్మలలో తాతలు, తండ్రులు కూడా 84 మంది లభిస్తారు. శివబాబా రచయిత, ఇప్పుడు కొత్త రచనను రచిస్తున్నారు అనగా పాతదానిని కొత్తదిగా చేస్తారు. మనం నల్లగా ఉన్నవారి నుండి తెల్లగా అవుతామని మీకు తెలుసు. స్వర్గంలో శ్రీకృష్ణుడు నంబరువన్, తర్వాత లాస్ట్ లో వారి జన్మ ఉంటుంది. మళ్ళీ వారే మొదటి నంబరువారిగా అవుతారు. పూర్తి-పూర్తి 84 జన్మలు శ్రీకృష్ణుడే తీసుకున్నారు. సూర్యవంశీ దైవీ సంప్రదాయం వారు పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. తండ్రి అంటారు, శ్రీకృష్ణుడు ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, వారి అంతిమ జన్మలో ప్రవేశించి మళ్ళీ వారినే శ్రీకృష్ణునిగా తయారుచేస్తాను. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వినాశీ కోరికలేవీ ఉంచుకోకూడదు. తమ మరియు సర్వుల కళ్యాణం చేయాలి.

2. దేహ సహితంగా అంతా మరచి తిరిగి ఇంటికి వెళ్ళాలి – అందుకే, బుద్ధి ఎక్కడా కూడా చిక్కుకుని లేదు కదా అని చెక్ చేసుకోవాలి.

వరదానము:-

సైన్యంలో సైనికులు ఎవరైతే ఉంటారో, వారెప్పుడూ కూడా నిర్లక్ష్యులుగా ఉండరు, సదా అటెన్షన్ లో అలర్ట్ (అప్రమత్తం)గా ఉంటారు. మీరు కూడా పాండవ సైన్యము, ఇందులో కొంచెం కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. అటెన్షన్ ఒక న్యాచురల్ విధిగా అయిపోవాలి. చాలా మంది అటెన్షన్ యొక్క టెన్షన్ ను కూడా పెట్టుకుంటారు. కానీ టెన్షన్ తో కూడిన జీవితం సదా కొనసాగదు, అందుకే న్యాచురల్ అటెన్షన్ ను తమ నేచర్ గా చేసుకోండి. అటెన్షన్ పెట్టడంతో స్వతహాగా స్మృతి స్వరూపులుగా అవుతారు, విస్మృతి యొక్క అలవాటు తొలగిపోతుంది.

స్లోగన్:-

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు

1. స్మృతి యొక్క సంబంధ జ్ఞానంతో ఉంది, జ్ఞానం లేకుండా స్మృతి థార్థంగా ఉండజాలదు

మొట్టమొదట మనుష్యులు తమ సుఖవంతమైన జీవితాన్ని తయారుచేసుకునేందుకు ఎటువంటి ముఖ్యమైన పాయింటును బుద్ధిలో ఉంచుకోవాలి? మొదట అయితే ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఏ పరమాత్మ తండ్రికైతే మనం సంతానమో, ఆ తండ్రి స్మృతిలో ప్రతి సమయం, శ్వాస-శ్వాసలో ఉపస్థితమై ఉండాలి, ఆ అభ్యాసంలో ఉండేందుకు పూర్తి రీతిలో ప్రయత్నం చేయాలి. ఇప్పుడు శ్వాస-శ్వాసలో అనగా నిరంతరం బుద్ధియోగం జోడింపబడి ఉండాలి, దీనినే నిరంతర యోగము, ఎడతెగని అఖండ జపము అని అంటారు, ఇదేమీ నోటి ద్వారా జపించే స్మృతి కాదు మరియు ఏదైనా మూర్తిని ఎదురుగా పెట్టుకొని దానిని ధ్యానించడం కాదు. కానీ ఇది బుద్ధియోగం ద్వారా స్మృతిలో పెట్టుకోవాలి, ఇప్పుడు ఆ స్మృతి కూడా నిరంతరం ఎప్పుడు ఉండగలదు అంటే, ఎప్పుడైతే పరమాత్మ యొక్క పూర్తి పరిచయం ఉంటుందో, అప్పుడే ధ్యానం పూర్తి రీతిగా జోడింపబడగలదు. కానీ పరమాత్మ అయితే గీతలో స్పష్టంగా చెప్తారు, నేను ధ్యానం ద్వారా గానీ, జపం ద్వారా గానీ లభించను మరియు నా మూర్తిని ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేయడం వలన లభించను. కానీ జ్ఞాన-యోగాల ద్వారా పరమాత్మను పొందాలి, అందుకే మొదట జ్ఞానం కావాలి, జ్ఞానం లేకుండా స్మృతి స్థిరంగా ఉండజాలదు. స్మృతి యొక్క సంబంధం జ్ఞానంతోనే ఉంది. ఇప్పుడు జ్ఞానం ద్వారా, కావాలంటే మనసుతో కల్పన చేసినా లేక కూర్చుని దర్శనం చేసినా, ఒకవేళ చూసిన ఆ వస్తువుది కూడా మొదట జ్ఞానం ఉంటే, అప్పుడే యోగం మరియు ధ్యానం సరిగ్గా జోడింపబడగలదు, అందుకే పరమాత్మ అంటారు, నేను ఎవరిని, నాతో యోగం ఎలా జోడించాలి, దీని జ్ఞానం కూడా కావాలి. జ్ఞానం కోసం మళ్ళీ మొదట సాంగత్యం కావాలి, ఇప్పుడు ఈ జ్ఞానం యొక్క పాయింట్లన్నీ బుద్ధిలో పెట్టుకోవాలి, అప్పుడే యోగం సరిగ్గా జోడింపబడగలదు.

2. ‘‘సృష్టి ఆది ఎలా జరుగుతుంది?’’

మనుష్యులు అడుగుతారు, పరమాత్మ సృష్టిని ఎలా రచించారు? ఆదిలో ఏ మనిషిని రచించారు, ఇప్పుడు వారి నామ-రూపాలను అర్థం చేసుకోవాలి అని కోరుకుంటారు. ఇప్పుడు దానిపై వారికి అర్థం చేయించడం జరుగుతుంది – పరమాత్మనే సృష్టి ఆదిని బ్రహ్మా తనువు ద్వారా చేసారు, మొట్టమొదటి మనిషి బ్రహ్మాను రచించారు. కనుక ఏ పరమాత్మ అయితే సృష్టి ఆదిని చేసారో, ఆ పరమాత్మ కూడా తప్పకుండా ఈ సృష్టిలో తమ పాత్రను అభినయించారు. ఇప్పుడు పరమాత్మ ఏ విధంగా పాత్రను అభినయించారు? మొదట అయితే పరమాత్మ సృష్టిని రచించారు, అందులో కూడా మొదట బ్రహ్మాను రచించారు, అనగా మొదట బ్రహ్మా ఆత్మ పవిత్రంగా అయ్యింది, వారే వెళ్ళి శ్రీకృష్ణునిగా అయ్యారు, ఆ తనువు ద్వారానే తర్వాత దేవీ-దేవతల సృష్టిని స్థాపన చేసారు. కనుక దైవీ సృష్టి యొక్క రచనను బ్రహ్మా తనువు ద్వారా చేయించారు, కనుక దేవీ-దేవతలకు ఆది పిత బ్రహ్మా అయినట్లు. బ్రహ్మా నుండి శ్రీకృష్ణునిగా అవుతారు, ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ అంతిమ జన్మలో బ్రహ్మా. ఇప్పుడు ఈ విధంగానే సృష్టి నియమం నడుస్తూ వస్తుంది. ఆ ఆత్మనే ఇప్పుడు సుఖం యొక్క పాత్రను పూర్తి చేసి, దుఃఖం యొక్క పాత్రలోకి వస్తుంది, కనుక రజో, తమో అవస్థలను దాటి మళ్ళీ శూద్రుడి నుండి బ్రాహ్మణునిగా అవుతుంది. కనుక మనం బ్రహ్మావంశీ సో శివవంశీ సత్యమైన బ్రాహ్మణులము. ఎవరైతే బ్రహ్మా ద్వారా అవినాశీ జ్ఞానాన్ని తీసుకొని పవిత్రంగా అవుతారో, ఇప్పుడు వారినే బ్రహ్మావంశీయులు అని అంటారు.

3. ఓం పదానికి యథార్థమైన అర్థము

ఎప్పుడైతే మనం ఓం శాంతి అనే పదాన్ని అంటామో, అప్పుడు మొట్టమొదట ఓం పదం యొక్క అర్థాన్ని పూర్తి రీతిలో అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎవరినైనా ఓం యొక్క అర్థమేమిటి అని అడిగితే, వారు ఓం యొక్క అర్థాన్ని చాలా పెద్దగా వినిపిస్తారు. ఓం యొక్క అర్థము ఓంకారాన్ని, పెద్ద శబ్దంతో వినిపిస్తారు, ఈ ఓం పైన మళ్ళీ చాలా పెద్ద శాస్త్రాలను తయారుచేస్తారు, కానీ వాస్తవానికి ఓం యొక్క అర్థమేమీ విస్తారమైనది కాదు. మనకైతే స్వయం పరమాత్మ, ఓం యొక్క అర్థాన్ని చాలా సరళంగా మరియు సహజంగా అర్థం చేయిస్తారు. ఓం యొక్క అర్థము, నేను ఆత్మను, నా అసలైన ధర్మము శాంత స్వరూపము. ఇప్పుడు ఈ ఓం యొక్క అర్థంలో ఉపస్థితమై ఉండాలి, కనుక ఓం యొక్క అర్థము, నేను ఆత్మ, పరమాత్మ సంతానాన్ని. ముఖ్యమైన విషయం ఇదే – ఓం యొక్క అర్థంలో కేవలం స్థితులవ్వాలి, ఇకపోతే, నోటి ద్వారా ఓం యొక్క ఉచ్చరణ చేయాల్సిన అవసరం లేదు. ఇదైతే బుద్ధిలో నిశ్చయం పెట్టుకొని నడవాలి. ఓం యొక్క అర్థమేదైతే ఉందో, ఆ స్వరూపంలో స్థితులవ్వాలి. ఇకపోతే, వారు ఓం యొక్క అర్థాన్ని వినిపిస్తారు కానీ ఆ స్వరూపంలో స్థితులవ్వరు. మనకైతే ఓం యొక్క స్వరూపం తెలుసు, అందుకే ఆ స్వరూపంలో స్థితులవుతాము. మనకు ఇది కూడా తెలుసు, పరమాత్మ బీజరూపుడు మరియు ఆ బీజరూపుడైన పరమాత్మ ఈ మొత్తం వృక్షాన్ని ఎలా రచించారు, దాని మొత్తం జ్ఞానం ఇప్పుడు మనకు లభిస్తుంది. అచ్ఛా – ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top