08 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

April 7, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తమ అవస్థను మంచిగా తయారుచేసుకోవాలంటే ఉదయముదయమే లేచి ఏకాంతంలో కూర్చుని ఆలోచించండి - నేను ఆత్మను, నేను ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, ఈ నాటకం పూర్తి అయ్యింది’’

ప్రశ్న: -

పూర్తి-పూర్తిగా బలిహారమవ్వడమంటే అర్థమేమిటి?

జవాబు:-

పూర్తిగా బలిహారమవ్వడం అనగా – బుద్ధి యోగం ఒక వైపే ఉండాలి. పిల్లలు మొదలైన దేహధారులెవ్వరూ గుర్తు రాకూడదు. దేహ భానం తెగిపోవాలి. ఎవరైతే ఈ విధంగా పూర్తిగా బలిహారమవుతారో, వారికి తండ్రి నుండి 21 జన్మల వారసత్వం లభిస్తుంది. ఎవరైతే పరస్పరంలో ఒకరి నామ రూపాలపై ఒకరు మోహితులవుతారో, వారు తండ్రి పేరును మరియు తమ పేరును అప్రతిష్టపాలు చేస్తారు.

ప్రశ్న: -

తండ్రి పిల్లలందరిపై ఎటువంటి కృపను చూపిస్తారు?

జవాబు:-

తండ్రి గవ్వ నుండి వజ్రతుల్యంగా తయారుచేసే కృపను చూపిస్తారు. ఏ పిల్లలైతే అడుగడుగునా సలహా తీసుకుంటారో, ఏదీ దాచిపెట్టరో, వారిపై స్వతహాగా కృప చూపడం జరుగుతుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఈ ఆటనంతటినీ ఎవరు రచించారు… (కిస్నే యహ్ సబ్ ఖేల్ రచాయా…)

ఓంశాంతి. ఎవరైతే పాటను తయారుచేసారో, వారికి దీని అర్థం తెలియదు. పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు, చూడండి, మిమ్మల్ని రచించినప్పుడు మీకు ఎంత మంచి వారసత్వాన్ని ఇచ్చాను. స్వర్గము కొత్త రచన. స్వర్గ రచన ఎలా రచించడం జరుగుతుంది, మళ్ళీ మాయ రూపీ 5 వికారాలు ఎలా వస్తాయి అనేది ప్రపంచానికి తెలియదు. కొత్త ప్రపంచం కోసము, ఒక్కొక్క విషయం కొత్తది. సత్యయుగమని దేనినంటారో కూడా తెలియనప్పుడు ఇక ఈ విషయాలు ఎలా తెలుస్తాయి. ఈ జ్ఞానం ఏ శాస్త్రంలోనూ లేదు. స్వయంగా పరమపిత పరమాత్మనే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు, ఈ జ్ఞానం తర్వాత ప్రాయః లోపమైపోతుంది. జ్ఞానంతో రాజయోగాన్ని నేర్చుకొని రాజ్యం పొందుతారు, అంతే. దీనిని స్పిరిచ్యుల్ నాలెడ్జ్ (ఆధ్యాత్మిక జ్ఞానం) అని అనడం జరుగుతుంది. స్పిరిచ్యుల్ అని స్పిరిట్ ను, ఆత్మను అంటారు. సుప్రీమ్ స్పిరిట్ అని తండ్రిని అంటారు. అనేక పేర్లు పెట్టారు. స్పిరిచ్యుల్ జ్ఞానం కావాలి అని అంటారు కూడా. ఫిలాసఫీ అనేది శాస్త్రాల జ్ఞానము. శాస్త్రాలు చదివి ఫిలాసఫీ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. పరమపిత పరమాత్మ అయితే శాస్త్రాలను చదవనే చదవరు, వారిని నాలెడ్జ్ ఫుల్ (జ్ఞాన సంపన్నులు) అని అంటారు. మనుష్యులు వారిని అంతర్యామిగా భావిస్తారు. కానీ అలా కాదు. డ్రామానుసారంగా ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో, వారికి ఆ ఫలమైతే లభించేదే ఉంటుంది. కర్మ అకర్మగా ఎప్పుడు అవుతుంది, మళ్ళీ కర్మ వికర్మగా ఎలా అవుతుంది అని చెప్తూ పిల్లలకు కర్మ, అకర్మ, వికర్మల గతిని కూడా అర్థం చేయిస్తారు. స్వర్గంలో వికర్మలుగా అయ్యేటువంటి చెడు కర్మలేవీ జరగవు ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు, అందుకే కర్మలు అకర్మలుగా అవుతాయి. ఎప్పుడైతే వికర్మలు చేస్తారో, అప్పుడు కర్మల ప్రభావం పడుతుంది. పాపం చేయించేది రావణుడు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తారు. సత్యయుగంలో వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారు అనేది మనుష్యులకు తెలియదు. చాలామంది ఏమంటారంటే, అక్కడ కూడా వికారాలు తప్పకుండా ఉంటాయి కానీ ఇంతగా ఉండవు అని. ఏ విధంగానైతే ఇక్కడ కూడా సన్యాసులు, గురువులు, సంవత్సరానికి లేక నెలకి ఒకసారి వికారాల్లోకి వెళ్ళండి అని చెప్తారు. కానీ తండ్రి అయితే వెంటనే చెప్తారు – పిల్లలూ, కామం మహాశత్రువు, దానిపై పూర్తి విజయాన్ని పొందాలి. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. అక్కడ రావణుడే లేనప్పుడు వికారాలు ఎక్కడ నుండి వచ్చాయి. సిక్కులు కూడా, మురికి పట్టిన వస్త్రాలను శుభ్రం చేస్తారు… అని పాడుతారు, అంటే అందరూ మురికి పట్టిన వస్త్రాలుగానే ఉన్నట్లు. ఇలా అంటూ ఎవరినీ నిందించడం లేదు. ఎవరు ఎలా ఉంటే, తప్పకుండా వారు అలా ఉన్నారనే అంటారు. దొంగను దొంగ అనే అంటారు. గ్రంథ్ లో కూడా చాలా వివరణ రాసి ఉంది. గురునానక్ పరమపిత పరమాత్మ మహిమను చేసారు. వారంటారు – జప సాహెబ్, సుఖమని… తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. దేనినైతే అర్థకల్పము స్మృతి చేసారో, ఆ వస్తువు ఒకవేళ లభించినట్లయితే ఎంత సంతోషం ఉండాలి. కానీ ఎవరైతే ఘడియ-ఘడియ స్వయాన్ని ఆత్మగా భావిస్తారో, సంతోషం కూడా వారికే ఉంటుంది. ఆత్మగా భావించినట్లయితే తండ్రి పట్ల ప్రేమ ఉంటుంది. ఆత్మకు ఈ సమయంలో, నా తండ్రి ఎవరు అనేది తెలియనే తెలియదు. తండ్రికి చెందినవారిగా అయి, తండ్రి కర్తవ్యం గురించి తెలుసుకోకపోతే వారిని అవివేకులు అని అంటారు. ప్రహ్లాదుని కథను వినిపిస్తారు, ప్రతీకారం తీర్చుకునేందుకు స్తంభం నుండి బయటకు వచ్చినట్లుగా…చెప్తారు. కానీ పరమాత్మ ఉన్నది ఎక్కడ… అడ్రస్ తెలియను కూడా తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీరు బ్రహ్మాకుమార-కుమారీలు. ప్రజాపిత బ్రహ్మా పేరు కూడా ప్రసిద్ధి చెందింది. పిల్లలకు జన్మనివ్వడానికి పత్ని అయితే లేరు. తప్పకుండా ముఖవంశావళి అవుతారు. మీరు కూడా అర్థం చేయించవచ్చు – మేము బ్రహ్మాకుమార-కుమారీలము, మీరు ప్రజాపిత బ్రహ్మా పేరు విన్నారా. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా రచనను రచిస్తారు. మొట్టమొదట బ్రహ్మాను రచించారు, తర్వాత బ్రహ్మా ద్వారా రచనను రచించారు. తండ్రి అర్థం చేయిస్తారు, చూడండి, నాకు ఎంతమంది ముఖవంశావళి ఉన్నారు. వారసత్వమైతే అందరికీ శివబాబా నుండే లభిస్తుంది, ఎవరినైతే దత్తత తీసుకున్నారో, వారు తప్పకుండా పేదవారిగా ఉంటారు. మొదట బ్రహ్మాను దత్తత తీసుకున్నారు. బ్రహ్మా ద్వారా మళ్ళీ ముఖవంశావళి తయారయ్యారు. ఆ కుఖ వంశావళి బ్రాహ్మణులు దైహిక యాత్రలను చేయిస్తారు, ఈ బ్రహ్మా ముఖవంశావళి వారు ఆత్మిక యాత్రను చేయిస్తారు. ఈ ఆత్మిక యాత్ర గురించి ఎవరికీ తెలియదు. మేము నిర్వాణధామానికి వెళ్ళాలి అని పురుషార్థం చేస్తారు కనుక బుద్ధి యొక్క యాత్ర బ్రహ్మతత్వం వైపు ఉంటుంది. అది బ్రహ్మతత్వం యొక్క యాత్ర అయినట్లు. మేము బ్రహ్మతత్వంలో లీనమైపోతామని భావిస్తారు. అటువంటప్పుడు, మళ్ళీ దైహిక యాత్రలు చేయాల్సిన అవసరం ఏముంది. ఆ యాత్ర నిర్వాణధామానికి వెళ్ళేటువంటిది. దానిని మళ్ళీ జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని లేక నీటి బుడగ, నీటి బుడగలో కలిసిపోయిందని ఈ విధంగా అనరు. ఇక్కడ ఆత్మ యాత్ర చేస్తుంది. బ్రహ్మతత్వంలోకి వెళ్తుంది. ఇది ఆత్మిక యాత్ర, మిగిలినవన్నీ దైహిక యాత్రలు. నిర్వాణధామానికి ఎవరు తీసుకువెళ్ళగలరు అనేది వారికి తెలియనే తెలియదు. ఇప్పుడు అనంతమైన తండ్రి అంటారు, నేనే అందరినీ తీసుకువెళ్తాను, సర్వులకు మార్గదర్శకునిగా తండ్రే అవుతారు. సత్యయుగంలో చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు, మిగిలిన ఆత్మలందరూ తప్పకుండా తిరిగి వెళ్తారు. న్యాయబద్ధమైన విషయాలను తండ్రే తెలియజేస్తారు. ఇప్పుడు మీరు సత్యాతి-సత్యమైన యాత్రలో ఉన్నారు. మనం ఆత్మలము, నాటకం పూర్తి అవుతుంది, తిరిగి వెళ్ళాలి. ఇది పక్కా అయిపోవాలి. ఏకాంతంలో కూర్చొని ఆలోచించాలి – నేను ఆత్మను, బాబా నన్ను తీసుకువెళ్ళేందుకు వచ్చారు, ఇది ఛీ-ఛీ వస్త్రము. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది, దీనిని విచార సాగర మథనం అని అంటారు. తండ్రి కర్మలు చేయడానికి అనుమతినిచ్చారు. ఇకపోతే, రాత్రివేళ మేలుకొని ఈ అభ్యాసం చేసినట్లయితే పగలు కూడా అవస్థ బాగుంటుంది, సహాయం లభిస్తుంది. రాత్రివేళ యొక్క అభ్యాసం పగలు పనికొస్తుంది. రాత్రివేళ 2 గంటల తర్వాత మేలుకోవాలి; ఎందుకంటే 9 నుండి 12 గంటల వరకు కల సమయము చాలా అశుద్ధమైనది, అందుకే విచార సాగర మథనం ఉదయమునే చేయడం జరుగుతుంది. నేను ఆత్మను, అంతే, ఇప్పుడిక బాబా వద్దకే వెళ్ళాలి, ఒక వస్త్రాన్ని విడిచి మరొకటి తీసుకుంటాను – ఇది మీతో మీరు మాట్లాడుకునే పద్ధతి. 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. ఇది అనంతమైన డ్రామా. ఈ విధంగా బుద్ధిలో ఉండడం ద్వారా దేహ భానం తెగిపోతుంది. తండ్రి మరియు వారసత్వమే గుర్తుకొస్తాయి.

తండ్రే వచ్చి శిక్షణనిస్తారు. లేదంటే మనం ఈ విధంగా శ్రేష్ఠంగా, పవిత్రంగా ఎలా అవ్వగలము. ఈ సమయంలో అవినీతి అయితే చాలా ఉంది, అందుకే సదాచార కమిటీ అన్న పేరు వెలువడింది. ఇంతకుముందు ఈ విషయాలన్నీ ఉండేవి కావు. ఈ అవినీతి మొదలైనవన్నీ ఇప్పుడు మొదలయ్యాయి. మినిస్టర్ మొదలైనవారిగా అయినప్పుడు ఎంత ధనం దోచుకుంటూ ఉంటారు, ఎంత భ్రష్టాచారం చేస్తారు. సత్యయుగంలో శ్రేష్ఠాచారీ గవర్నమెంట్ ఉంటుంది. మీరు చాలా శ్రేష్ఠాచారులుగా అవుతున్నారు. అక్కడ పాపం యొక్క పేరు ఉండదు. తండ్రి వచ్చి స్వర్గానికి యోగ్యులుగా చేస్తారు. అశుద్ధంగా ఉన్నవారందరినీ పుష్పాలుగా తయారుచేస్తారు, స్వర్గ స్థాపన చేసి, సర్వులకు సద్గతినిచ్చి, తర్వాత నేను స్వయం దాగిపోతాను. నా పాత్రే అందరికీ సద్గతినివ్వడము. నేను మొత్తం ప్రపంచాన్ని, ఎలా ఉన్నదానిని ఎలా తయారుచేస్తాను. యుద్ధం జరుగుతుందని మనుష్యులు కూడా అంటారు. 5 సంవత్సరాలలో ఇది జరుగుతుంది, అది జరుగుతుందని వార్తా పత్రికల్లో కూడా వస్తుంది. అచ్ఛా, వినాశనం జరుగుతుంది – అయితే, తర్వాత ఏం జరుగుతుంది? ఈ వినాశనం కూడా ఎందుకు జరుగుతుంది, కారణం చెప్పాలి కదా. తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు కనుక నరకం యొక్క వినాశనం తప్పకుండా జరుగుతుందని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి వచ్చి పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా చేస్తారు. అక్కడ అకాల మృత్యువు జరగదు. మృత్యు భయం ఎప్పుడూ ఉండదు, ఆత్మ యొక్క జ్ఞానముంటుంది – మేము ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొకటి తీసుకుంటాము అని. ఎవరైతే ఆలస్యంగా వస్తారో, వారు తప్పకుండా కొన్ని జన్మలే తీసుకుంటారని కూడా అర్థం చేసుకుంటారు. మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఈ విషయం ప్రపంచానికి తెలియదు. ఆత్మలైన మీకు పరమపిత పరమాత్మ కూర్చుని అర్థం చేయిస్తారు. ప్రజాపితకు పిల్లలు కనుక పరస్పరంలో సోదరీ-సోదరులు అయినట్లు. కావున ఏ వికర్మ చేయలేరు. హిందువులు, చైనీయులు పరస్పరంలో సోదరులు అని అంటారు కూడా, మరి వికారాల్లోకి ఎలా వెళ్తారు. చెప్పడం సులభమే కానీ అర్థం తెలుసుకోరు. పరస్పరంలో సోదరులు అనగా ఆత్మకు సంబంధించినది అని అర్థము. సోదరీ-సోదరుల సంబంధంలో వికారీ దృష్టి ఉండజాలదు. లౌకిక సంబంధంలో కూడా ఒకవేళ దగ్గరి సంబంధీకులతో వివాహం చేసినట్లయితే హాహాకారాలు జరుగుతాయి.

తండ్రి అర్థం చేయిస్తారు, మీరంతా దేవీ-దేవతలుగా, శ్రేష్ఠాచారులుగా ఉండేవారు, తర్వాత భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ శ్రేష్ఠాచారులుగా అవుతున్నారు. మనమే శ్రేష్ఠాచారులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారము, తర్వాత 14 కళలలోకి వచ్చాము, మళ్ళీ భ్రష్టాచారులుగా అవుతూ-అవుతూ ఇప్పుడు ఇంకా తమోప్రధానంగా, భ్రష్టాచారులుగా అయిపోయాము. ఈ సృష్టి చక్రం చిత్రంలో కూడా స్పష్టంగా రాసి ఉంది. వర్ణాల రూపాన్ని కూడా తయారుచేస్తారు. కానీ అందులో పిలక స్థానమైన బ్రాహ్మణుల గురించి తెలపరు. శివబాబాను, బ్రాహ్మణులను చూపించరు. ఇక మిగిలిన దేవతలను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను చూపిస్తారు. మనం పిల్లిమొగ్గలాట ఆడుతున్నామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవీ-దేవతలుగా అవుతాము, అందుకే దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఇక మన కోసం మొత్తం ప్రపంచం స్వర్గంగా అవుతుంది. భూమికి నీరు అందుతుంది. ఈ విధంగా రాత్రివేళ మంచి రీతిలో విచార సాగర మథనం చేసినట్లయితే, పగలు చాలా సహాయం లభిస్తుంది. ఇప్పుడు మనం స్వీట్ ఫాదర్ (మధురమైన తండ్రి) వద్దకు వెళ్తాము, వారి కోసం మనం ప్రతి ముంగిట ఎదురుదెబ్బలు తిన్నాము కానీ మార్గం ఎక్కడా లభించలేదు. ఇప్పుడు వారసత్వాన్ని పొందేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. కానీ మాయ కూడా చాలా శక్తివంతమైనది. చాలా మోసం చేస్తుంది. వెంటనే చెవిని, ముక్కును పట్టుకుంటుంది. భ్రష్టాచారులుగా అవుతారు. కామం యొక్క నషా వచ్చేస్తుంది. ఎవరో ఒకరి నామ రూపాలకు మోహితులవుతారు, ప్రేయసీ-ప్రియుల వలె అయిపోతారు. చాలా మోసపోతారు. లోభి కూడా పూర్తిగా పేరును అప్రతిష్టపాలు చేస్తారు. ఇదంతా జరుగుతూనే ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, యోగంలో ఉండాలి. మంచి యోగీలు ఎవరైతే ఉంటారో, వారు 4-5 రోజులు భోజనం తినకపోయినా కూడా వారికి చింత ఉండదు. చాలా సంతోషంగా ఉంటారు. అవస్థ ఆ విధంగా ఉండాలి. నాలో ఏ వస్తువు పట్ల లోభమైతే లేదు కదా! అని చూసుకోవాలి. మేము ఫుల్ పాస్ అయ్యి చూపించాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. ఇది కల్ప-కల్పం యొక్క ఆట. మేము లక్ష్మీ-నారాయణులను వరించేందుకు అనగా రాజ్యాన్ని తీసుకునేందుకు యోగ్యులుగా అయ్యామా! అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏవైనా లోపాలు ఉన్నట్లయితే, వాటిని తొలగించాల్సి ఉంటుంది, లోపాలు దాగి ఉండలేవు. ఇప్పుడు మీ కనెక్షన్ శివబాబాతో ఉంది. ఉన్నతిలోకి తీసుకువెళ్ళడానికి ఎవరికైనా దృష్టినిస్తారు. తండ్రి చాలా సహాయం చేస్తారు. బ్రహ్మాకుమారీలు అంటారు, ఇది మేము చేసాము, మేము ఈ విధంగా మురళీని మంచిగా నడిపించాము – ఈ అహంకారం అవస్థను పడేస్తుంది. ఎవరైతే మంచి-మంచి పిల్లలుంటారో, వారు – బాబా సహాయం లభిస్తుందని అర్థం చేసుకుంటారు. చాలామందిలోనైతే మాయ ప్రవేశించడంతో పడిపోతారు, ఇందులో పూర్తిగా ఆత్మాభిమానులుగా అవ్వాలి. దేహం వైపుకు దృష్టి వెళ్ళకూడదు. బాబా శిక్షణ ఇస్తూ ఉంటారు, పరివర్తనవుతూ వెళ్ళండి. మాయ చేతిలో మోసపోకండి, లేదంటే పదవిని పోగొట్టుకుంటారు. ఆ పతిని మీరు ఎంతగా స్మృతి చేస్తారు, మరి ఈ పతులకే పతిని, ఎవరైతే మీకు అమృతాన్ని తాగిస్తారో, గవ్వ నుండి వజ్రంలా తయారుచేస్తారో, వారిని స్మృతి చేయరు. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి! శ్రీమతం ఆధారంగా పురుషార్థం చేయడం జరుగుతుంది. ఏదైనా విషయం ఉన్నట్లయితే, అడగాలి – బాబా, నాలో ఏ అవగుణముంది! దేహ భానాన్ని తెంచాలి. ఎవరైతే పూర్తిగా బలిహారమవుతారో, వారికి 21 జన్మల వారసత్వం లభిస్తుంది. పూర్తిగా బలిహారమవ్వడమంటే అర్థము, వారి వైపు బుద్ధి ఉండడము. ఈ పిల్లలు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారి నుండి కూడా బుద్ధి తొలగిపోవాలి. బాబా అంటారు, దీనికి బదులుగా మీకు అక్కడ అంతా కొత్తది లభిస్తుంది. భగవంతుడి కృపతో కొడుకు జన్మించాడని అంటారు. ఇప్పుడు భగవంతుడు స్వయంగా అంటారు, ఆ కృప అయితే అల్పకాలానిది. ఇప్పుడైతే మీపై చాలా కృప చూపిస్తాను. మిమ్మల్ని గవ్వ నుండి వజ్రతుల్యంగా తయారుచేస్తాను. గృహస్థ వ్యవహారంలో ఉంటూ, ఇదంతా తండ్రిది అని భావించండి. అడుగడుగునా సలహా తీసుకుంటూ ఉండండి. తండ్రే సలహానిస్తారు. ఎటువంటి తప్పుడు పని చేయనివ్వరు. వికారులకు ఇవ్వనివ్వరు. అవినాశీ సర్జన్ నుండి ఏదీ దాచిపెట్టకూడదు. అడుగడుగునా అడగాలి. చాలామంది పిల్లలు అడుగుతారు కూడా, రాస్తారు కూడా, బాబా, ఈ వికారాలు సతాయిస్తున్నాయి అని. కొందరైతే నల్ల ముఖం చేసుకున్న తర్వాత కూడా చెప్పరు. దాచిపెడుతూ ఉంటే ఇంకా నల్లగా అయిపోతూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఫుల్ పాస్ అయ్యేందుకు లోపాలు మరియు వికారాల యొక్క అంశం ఏదైతే ఉందో, దానిని సమాప్తం చెయ్యాలి. ఏ విషయం యొక్క అహంకారము పెట్టుకోకూడదు.

2. దృష్టిని చాలా పవిత్రంగా, శుద్ధంగా చేసుకోవాలి. ఎప్పుడూ ఏ దేహధారి వెనుక మోహితులవ్వకూడదు, పూర్తిగా ఆత్మాభిమానులుగా అవ్వాలి.

వరదానము:-

ఏ విధంగా సైన్స్ సాధనాలతో పాడైపోయిన సామాగ్రిని కూడా పరివర్తన చేసి మంచి వస్తువులను తయారుచేస్తారో, అలా మీరు సైలెన్స్ శక్తితో చెడు విషయాన్ని లేక చెడు సంబంధాన్ని, చెడు నుండి మంచిలోకి పరివర్తన చేయండి. ఎంతటి శుభ భావనా సంపన్నులుగా అవ్వాలంటే, మీ శ్రేష్ఠ సంకల్పాలతో ఇతర ఆత్మలు కూడా చెడును మార్చుకుని మంచిని ధారణ చేయాలి. నాలెడ్జ్ ఫుల్ గా ఉన్న లెక్కలో రైట్, రాంగ్ ను తెలుసుకోవడం వేరు, కానీ స్వయంలో ఆ చెడును చెడు రూపంలో ధారణ చేయడం తప్పు, అందుకే చెడును చూస్తూ కూడా, తెలుసుకుని కూడా, దానిని మంచిలోకి పరివర్తన చేయండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top