31 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 30, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - జ్ఞాన మార్గంలో మీ ఆలోచనలు చాలా శుద్ధంగా ఉండాలి, సత్యమైన సంపాదనలో అసత్యం చెప్పినట్లయితే, ఏదైనా తప్పుగా చేసినట్లయితే చాలా నష్టం కలుగుతుంది’’

ప్రశ్న: -

అదృష్టవంతులైన పిల్లలు, ఎవరైతే ఉన్నత పదవిని పొందేవారు ఉంటారో, వారి గుర్తులేమిటి?

జవాబు:-

1. వారి ద్వారా ఎటువంటి చెడు కర్మ జరగదు. యజ్ఞ సేవలో ఎముక-ఎముకను పెడతారు. వారిలో లోభం మొదలైనవేవీ ఉండవు. 2. వారు చాలా సుఖాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడతాయి. చాలా మధురంగా ఉంటారు. 3. వారు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడనట్లుగా ఉంటారు. అదృష్టంలో ఏది ఉంటే, అది చూద్దాము అన్న ఈ ఆలోచన వారిలో కలగదు. ఇటువంటి ఆలోచన కలిగే పిల్లలు దేనికీ పనికిరారు అని బాబా అంటారు. మీరైతే చాలా మంచి పురుషార్థం చేయాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మా తీర్థము అతీతమైనది… (హమారే తీర్థ్ న్యారే హై…)

ఓంశాంతి. ఇవి భక్తి మార్గపు పాటలు. మన మహిమే జరుగుతూ ఉందని మీకు తెలుసు. భక్తి మార్గంలో మహిమ చేయడం జరుగుతుంది మరియు ప్రార్థన చేయడం జరుగుతుంది మరియు జ్ఞాన మార్గంలో ఈ ప్రార్థన మరియు భక్తి చేయడం జరగదు. ఏ విధంగా స్కూలులో చదువుకుంటారో, అలా జ్ఞానం అనగా చదువు. చదువులో లక్ష్యం-ఉద్దేశ్యం ఉంటుంది. మేము ఇది చదువుకుని ఫలానా పదవిని పొందుతామని, ఫలానా వ్యాపారం చేస్తామని భావిస్తారు. కొందరు ఈ విధంగా, మోసం చేద్దాము, ధనం సంపాదిద్దాము అని నేర్చుకుంటారు. చాలామంది ధనం కోసం మోసాలు చేస్తారు, దీనిని కూడా భ్రష్టాచారమని అంటారు. దోపిడీలు కూడా చేస్తారు. ధనం సంపాదించి స్వయాన్ని సుఖంగా ఉంచుకునేందుకు మరియు పిల్లలను సుఖంగా ఉంచేందుకు, వారిని చదివించి వివాహం మొదలైనవి చేసేందుకు గవర్నమెంట్ ది కూడా దొంగలిస్తారు. ఇక్కడైతే మీరు ధనాన్ని సంపాదించే విషయమే లేదు. ఇది పవిత్రమైన చదువు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కేవలం చదువుకోవాలి. చాలామంది అంటారు, మాకు జీతం తక్కువ లభిస్తుంది, అందుకే మోసం చేయాల్సి వస్తుంది, ఏం చేయాలి! కానీ ఈ జ్ఞాన మార్గంలోనైతే అటువంటి ఆలోచనలేవీ ఉండకూడదు, లేదంటే దుర్గతి కలుగుతుంది. ఇక్కడైతే చాలా సత్యతతో-శుద్ధతతో తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది, అప్పుడే పదవిని పొందగలరు. స్టూడెంట్ కు చదువు తప్ప ఇంకే విషయము బుద్ధిలో ఉండకూడదు. లేదంటే మనం భవిష్య ఉన్నత పదవిని ఎలా పొందుతాము! ఒకవేళ తప్పుడు పనులు చేసినట్లయితే ఫెయిల్ అయిపోతారు. సత్యమైన సంపాదనలో ఒకవేళ ఏదైనా అసత్యం మొదలైనవి చెప్పినట్లయితే లేదా అటువంటి పనులేవైనా చేసినట్లయితే పద భ్రష్టులైపోతారు. చాలా నష్టం కలుగుతుంది. ఇక్కడికైతే మీరు భవిష్య పదమపతులుగా అవ్వడానికి వచ్చారు. కావున ఇక్కడ ఎటువంటి చెడు ఆలోచనలు రాకూడదు. ఎవరైనా దొంగతనం మొదలైనవి చేస్తే, కేస్ నడుస్తుంది, దాని నుండి ఎవరైనా తప్పించుకోవచ్చు కానీ ఇక్కడైతే ధర్మరాజు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. పాపాత్ములకైతే చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. శిక్షలు అనుభవించాల్సిన అవసరం లేనివారు ఎవరూ ఉండరు, మాయ పడేస్తూ ఉంటుంది, చెంపదెబ్బ వేస్తూ ఉంటుంది. లోపల అశుద్ధమైన ఆలోచనలు నడుస్తాయి – ఇక్కడ నుండి కొంత ధనం ఎత్తుకువెళ్దాము… నిలవగలమో లేదో తెలియదు, కొంచెం కూడబెట్టుకుని ఉంచుకుందాము అని. ఇప్పుడు ఇది ఈశ్వరీయ దర్బారు. రైట్ హ్యాండ్ గా ధర్మరాజు కూడా ఉన్నారు, వారి శిక్షలైతే వందరెట్లు ఎక్కువగా ఉంటాయి. కొత్త-కొత్త పిల్లలకు బహుశా తెలియకపోవచ్చు కూడా, అందుకే బాబా సావధానపరుస్తారు. పిల్లలైన మీ ఆలోచనలు చాలా శుద్ధంగా ఉండాలి. చాలా మంది పిల్లలు రాస్తారు – బాబా, మీ ఆజ్ఞ ఏమిటంటే, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం నన్ను స్మృతి చేయండి, శ్రీమతం లేకుండా ఏ పనీ చేయకండి అని, కానీ మాకైతే వ్యవహారంలో చాలా చేయాల్సి ఉంటుంది, లేదంటే మేము జీవన నిర్వహణ ఎలా చేసుకోవాలి! ఇంత కొద్ది ధనంతో ఇంతమంది పరివార సభ్యులు ఎలా నడవగలరు, ఆకలితో ఉండాల్సి ఉంటుంది, అందుకే వ్యాపారస్థులు ధర్మార్థము కొంత తీసిపెడుతూ ఉంటారు. మా ద్వారా ఏవైతే పాపాలు జరుగుతాయో, అవి తొలగిపోవాలి, మేము ధర్మాత్మలుగా అవ్వాలి అని భావిస్తారు. ధర్మాత్మ పురుషుల ద్వారా ఎక్కువ పాపాలు జరగవు ఎందుకంటే ధర్మాత్ములు పాపాలంటే ఎంతోకొంత భయపడతారు. వ్యాపారంలో ఎప్పుడూ అసత్యం చెప్పనివారు కూడా చాలామంది ఉంటారు, ధరను ఖచ్చితంగా ఫిక్స్ చేసి ఉంచుతారు. కలకత్తాలో పాత్రలు అమ్మేవారు ఒకరు ఉండేవారు, అన్ని ధరలు బోర్డుపై రాసి పెట్టేవారు, ఇక తర్వాత ఏమీ తగ్గించేవారు కాదు. మరికొందరైతే చాలా అబద్ధాలు చెప్తారు. ఇది జ్ఞానం యొక్క చదువు. మీరు భవిష్య 21 జన్మల కోసం చదువుకుంటారు. కావున బాబాకు ప్రతి విషయంలో సత్యం చెప్పాలి, అంతేకానీ పరమాత్మకు అంతా తెలుసునని భావించడం కాదు. తండ్రి అంటారు, చదువుకుంటే ఉన్నత పదవిని పొందుతారు. లేదంటే నరకంలోకి వెళ్ళిపోతారు. మీరు ఏమేమి పాపాలు చేస్తున్నారనేది నేనేమైనా కూర్చుని చూస్తానా. మీరు ఏం చేసినా, అది మీ కోసమే. మీ పదవినే భ్రష్టం చేసుకుంటారు. పాపాత్మ, పుణ్యాత్మ అన్న పేర్లు అయితే ఉన్నాయి. తండ్రి వచ్చి పుణ్యాత్ములుగా చేస్తారు కనుక ఏ పాపం జరగకూడదు. పిల్లల విషయంలోనైతే పాపానికి శిక్ష వందరెట్లు అవుతుంది, చాలా నష్టం జరుగుతుంది. ఏం జరిగితే అది చూద్దాములే, ప్రస్తుతానికైతే చేసేద్దాము అనేటువంటి ఆలోచనను పెట్టుకోకూడదు. అటువంటి పిల్లలు దేనికీ పనికిరారు. ఈ పాత ప్రపంచాన్ని అయితే పూర్తిగా మర్చిపోవాలి. చూస్తూ కూడా చూడనట్లుగా ఉండాలి. మనం పాత్రధారులము, ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. 84 జన్మలు పూర్తి చేసుకున్నాము, ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. ఎంతగా సేవ చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు ప్రదర్శనీ, మేళాల సేవ మొదలయ్యింది. ఎవరైతే ఉన్నత పదవిని పొందే పురుషార్థులుగా ఉంటారో, వారికి ఈ ఆలోచన నడుస్తూ ఉంటుంది – వెళ్ళి వినాలి, భిన్న-భిన్నమైన రీతులలో ఎలా అర్థం చేయిస్తారో నేర్చుకోవాలి అని. వారు తిరుగుతూ ఉంటారు, ఫలానావారు ఎలా అర్థం చేయిస్తారు అనేది వింటూ ఉంటారు. ఈ విధంగా వింటూ-వింటూ బుద్ధి తాళం తెరుచుకుంటుంది. ప్రదర్శనీ ద్వారా మా బుద్ధి తాళం తెరుచుకుంది, బాబా చాలా సహాయం చేసారని చాలామంది రాస్తారు. బాబా ఈ విధంగా చాలా సహాయం చేస్తారు, కానీ ఎవ్వరికీ తెలియదు. నేను చాలా బాగా అర్థం చేయించానని భావిస్తారు. కొంతమంది సత్యమైన పిల్లలు, ఈ సహాయమంతా బాబాది అని అర్థం చేసుకుంటారు. ప్రదర్శినీ సేవతో చాలా ఉన్నతి జరగగలదు. మీరు జ్ఞానసాగరుని పిల్లలు. బాబా స్మృతిలో ఉండడం ద్వారానే చాలా బలం లభిస్తుంది. యోగబలంతోనే మీరు విశ్వ రాజ్యాన్ని తీసుకుంటారు. మేము బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి మరియు శ్రీమతంపై నడవాలి అన్నది మాత్రమే ఉండాలి. కేవలం శ్రీమతంపై నడవడంలోనే సంపాదన ఉంది. ఇకపోతే, ఈ ప్రపంచంలోనైతే పనికొచ్చే వస్తువేమీ లేదు. అంతా సమాప్తం అవ్వనున్నది. మీరు జ్ఞాన సితారలు, ఈ భారత్ ను స్వర్గంగా తయారుచేస్తున్నారు మరియు స్వర్గవాసులుగా అయ్యేందుకు యోగ్యులుగా మీరు ఇక్కడే అవ్వాలి. యజ్ఞం కోసమైతే ఎముక ఎముకను చూర్ణం చేయాలి. అటువంటివారికి వేరే ఏ లోభము ఉండదు. ఎవరి అదృష్టంలోనైతే ఉండదో, వారి ద్వారా మరి చెడు కర్మలే జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే మీరు సుఖమిచ్చేవారిగా అవ్వాలి. తండ్రి అంటారు, నేను సుఖమిచ్చేవారిగా చేయడానికి వచ్చాను. మీరు కూడా సుఖమిచ్చేవారిగా అవ్వండి. అటువంటివారి నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలు వెలువడతాయి. చెడు మాటలేవీ వెలువడవు. అబద్ధం చెప్పడం కన్నా ఏమీ చెప్పకుండా ఉండడం మంచిది. చాలా మధురంగా తయారవ్వాలి. తల్లిదండ్రులను ప్రత్యక్షం చేయాలి. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు… అని బాబా కోసమే రాసారు. కొద్దిగా కూడా చేదుతనము, అవగుణాలు మొదలైనవి ఉండకూడదు. చాలామంది ఎలా ఉంటారంటే, కొంచెం ఏదైనా వస్తువు లభించకపోతే వెంటనే డిస్టర్బ్ అయిపోతారు. కానీ పిల్లలు పరీక్షగా భావించి శాంతిగా ఉండాలి. పూర్వము పెద్ద-పెద్ద ఋషులు-మునులు, మాకు ఈశ్వరుడి గురించి తెలియదు అని అనేవారు. ఇప్పుడు ఒకవేళ ఈ సన్యాసులు మొదలైనవారు అలా అంటే ఇక ఎవరూ వారిని నమ్మరు. ఎవరికైతే స్వయమే ఈశ్వరుని గురించి తెలియదో, వారు మాకు మార్గాన్ని ఏమి తెలియజేస్తారని భావిస్తారు. ఈ రోజుల్లో చాలామంది ఒకరికొకరు గురువులుగా అయిపోయారు. హిందూ నారికి పతి కూడా గురువు, ఈశ్వరుడు. గురువు అయితే సద్గతినిస్తారా లేక పతితంగా చేస్తారా. ప్రేయసులందరూ ఎవరైతే ఉన్నారో, వారికి గురువు లేక ప్రియుడు ఒక్కరేనని, తల్లి-తండ్రి, బాప్ దాదా అన్నీ వారేనని ఇప్పుడు మీకు తెలుసు. కానీ వాళ్ళేమో పతి విషయంలో ఆ మాటలు చెప్తారు. ఇప్పుడు ఇక్కడైతే అటువంటి విషయం లేదు. ఇక్కడైతే ఆత్మలైన మిమ్మల్ని పరమపిత పరమాత్మ చదివిస్తారు. ఆత్మ ఎంత చిన్నది, దానిలో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. పరమాత్మ కూడా చిన్న నక్షత్రము, వారిలో కూడా మొత్తం పాత్రంతా నిశ్చితమై ఉంది, పరమాత్మ సర్వశక్తివంతుడని, అన్నీ చేయగలరని మనుష్యులు భావిస్తారు. పరమపిత పరమాత్మ అంటారు, అటువంటి విషయమేమీ లేదు, డ్రామానుసారంగా నా పాత్ర కూడా ఉంది.

బాబా అర్థం చేయిస్తారు – ఆత్మలైన మీరందరూ పరస్పరంలో సోదరులు. ఆత్మ తన సోదరుని శరీరాన్ని ఎలా హత్య చేస్తుంది! ఆత్మలైన మనమంతా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి, అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు…. ఈ దేహాభిమానాన్ని కూడా విడిచిపెట్టాలి. శివబాబా ఎంత మధురమైనవారు. మరి మనం కూడా శివబాబా పిల్లలము, సోదరులము కనుక మనం ఎప్పుడూ కూడా పరస్పరంలో కొట్లాడుకోకూడదు, గొడవపడకూడదు. దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా కొట్లాడుకోరు. బాబా ఏమంటారు! తండ్రి చూస్తే మధురమైనవారు మరియు పిల్లలేమో కొట్లాడుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మనుష్యుల్లో ఆత్మ జ్ఞానం కూడా లేదు. ఆత్మలైన మనం పరమాత్మ సంతానము, మరి ఎందుకు కొట్లాడుకోవాలి? మనుష్యులైతే కేవలం నామ మాత్రంగా అంటూ ఉంటారు. మీరైతే ప్రాక్టికల్ గా ఉన్నారు. తండ్రి అంటారు – దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. మనం ఆత్మలము, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, ఇదే చింత ఉండాలి. పూర్తి పురుషార్థం చేయాలి. తండ్రి వలె మధురంగా మరియు ప్రియంగా తప్పకుండా అవ్వాలి, అప్పుడు, సుపుత్రుడైన బిడ్డ, ఎంత ప్రియంగా అయ్యాడు అని తండ్రి అంటారు. తండ్రి ఎంత నిరహంకారి. వారంటారు, నేను మీ తండ్రి, టీచరు, గురువు సర్వస్వమును. బాబా రండి, అని అర్ధకల్పము నుండి మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. డ్రామాలో నా పాత్ర కూడా ఉంది. ఒకప్పుడు ఈ గడియారాలు మొదలైనవి ఉండేవి కావు, ఇసుకపై టైమ్ చూసేవారు. ఈ సైన్స్ తో ఏవైతే తయారవుతున్నాయో, అవి మీ కోసమే. ఈ సైన్స్ వారు జ్ఞానాన్ని ఏమీ తీసుకోరు. వారు రావడమే ప్రజల్లోకి వచ్చేది ఉంది. మహళ్ళు మొదలైనవి తయారుచేసేవారైతే ప్రజలే కదా! రాజా-రాణి అయితే ఆర్డర్ ఇచ్చేవారిగా ఉంటారు. కనుక ఆ సైన్సు వారేమీ మాయమైపోరు, వారు చాలా తెలివైనవారిగా అవుతున్నారు. ఇకపోతే, చంద్రుడు మొదలైనవాటి పైకి వెళ్ళడము – ఇదంతా అతికి గుర్తు. సైన్స్ కూడా దుఃఖమిచ్చేదిగా అయిపోయింది. అక్కడ సుఖాన్ని ఇచ్చే వస్తువులు ఉంటాయిఇది ఇంకా కొద్ది సమయం కోసమే ఉందిఅతిలోకి వెళ్ళినట్లయితే వినాశనమైపోతుంది. ఇకపోతే, సుఖాన్ని అయితే మీరు అనుభవిస్తారు. మమ్మా-బాబా అని అంటున్నారంటే ఫాలో చేయాలి. మీ నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి.

రాళ్ళు పాట పాడాయి అని అంటారు. ఇంతకుముందు మీరు రాతి బుద్ధి కలవారిగా ఉండేవారు. బాబా వచ్చి మిమ్మల్ని రాతిబుద్ధి నుండి పారస బుద్ధి కలవారిగా తయారుచేసారు. ఇప్పుడు మీరు గీత యొక్క పాటను పాడుతున్నారు. ఇకపోతే, ఆ రాళ్ళు పాటలేమీ పాడవు. గీతనే పాట అని అంటారు. మీకిప్పుడు పరమపిత పరమాత్మ యొక్క చరిత్ర తెలుసు. వారైతే అర్థాన్ని ఏమీ తెలుసుకోరు. రత్నాలకు బదులుగా రాళ్ళనే విసురుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో రత్నాలు నంబరువారుగా ఉన్నాయి. కొందరి నోటి నుండి అయితే వజ్రాలు, ముత్యాలు వెలువడతాయి, అందుకే మీకు నీలమణి, మరకతము… అనే పేర్లు ఉన్నాయి. మీరు రాళ్ళ నుండి రత్నాలుగా లేక పారసంగా అవుతున్నారు. ఇప్పుడు మీ పని ఏమిటంటే, ఎవరు వచ్చినా సరే పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది అని అర్థం చేయించాలి. ఎప్పటివరకైతే ఈ మాటకు ఏక్యురేట్(ఖచ్చితం)గా జవాబు రాసి ఇవ్వరో, అప్పటి వరకు బాబాను కలవడమే వ్యర్థము. మొదట తండ్రిని తెలుసుకోవాలి, అప్పుడే బి.కె.లు ఎవరి మనవలు అన్నది అర్థం చేసుకుంటారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. 21 జన్మల రాజ్యాన్ని అతి పేదవారు కూడా తీసుకోవచ్చు. విశ్వానికి యజమానులుగా అవ్వడం ఏమైనా తక్కువ విషయమా? కేవలం శ్రీమతంపై నడవాలి. స్వయంగా భగవంతుడు పిల్లలపై బలిహారమవుతారు. 21 జన్మలకు బలిహారమవుతారు. విశ్వ యజమాని భవ అని అంటారు. తప్పకుండా పిల్లల నోటి ద్వారా రత్నాలే వెలువడతాయి, అప్పుడే భవిష్యత్తులో పూజ్యనీయ దేవతలుగా అవుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మధురంగా అయి, తల్లిదండ్రులను ప్రత్యక్షం చేయాలి. చేదుతనము కొద్దిగా ఉన్నా సరే, దానిని తొలగించి వేయాలి. తండ్రి వలె మధురంగా, ప్రియంగా తప్పకుండా అవ్వాలి.

2. ఏ పనినైనా శ్రీమతం లేకుండా చేయకూడదు. శ్రీమతంలోనే సత్యమైన సంపాదన ఉంది.

వరదానము:-

త్రికాలదర్శీ పిల్లలు ప్రతి కర్మ యొక్క పరిణామాన్ని తెలుసుకుని, ఆ తర్వాత కర్మ చేస్తారు. వారెప్పుడూ ఈ విధంగా అనరు – ఇలా జరిగి ఉండకూడదు కానీ జరిగిపోయింది, మాట్లాడి ఉండకూడదు కానీ మాట్లాడేసాను. దీనితో, కర్మ యొక్క పరిణామాన్ని తెలుసుకోకుండా అమాయకత్వంలో కర్మ చేసేస్తారని ఋజువవుతుంది. అమాయకులుగా అవ్వడము మంచిదే కానీ మనసు పరంగా అమాయకులుగా అవ్వండి, మాటలలో మరియు కర్మలలో అమాయకులుగా అవ్వకండి. అందులో త్రికాలదర్శిగా అయి ప్రతి మాటను వినండి మరియు మాట్లాడండి, అప్పుడు సెయింట్ అనగా మహాన్ ఆత్మ అని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top