30 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 29, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఈ ప్రపంచం నుండి మరణించేందుకు మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు, ఎటువంటి అవస్థను పక్కా చేసుకోవాలంటే అంతిమంలో తండ్రి తప్ప ఎవరూ గుర్తు రాకూడదు’’

ప్రశ్న: -

మొత్తం ప్రపంచానికి ఈ సమయంలో అంటుకుని ఉన్న అన్నింటికన్నా తీవ్రమైన అగ్ని ఏది, దానిని ఆర్పివేసే విధానాన్ని వినిపించండి?

జవాబు:-

మొత్తం ప్రపంచంలో ఈ సమయంలో కామం యొక్క అగ్ని అంటుకుని ఉంది, ఈ అగ్ని అన్నింటికన్నా తీవ్రమైనది. ఈ అగ్నిని ఆర్పివేసేటువంటి ఆత్మిక మిషన్ ఒక్కటే, దీని కోసం స్వయాన్ని అగ్నిమాపక దళంగా తయారుచేసుకోవాలి. యోగబలంతో తప్ప ఈ అగ్ని ఆరిపోదు. కామ వికారమే అందరినీ సర్వనాశనం చేస్తుంది, అందుకే ఈ భూతాన్ని పారద్రోలేందుకు పూర్తి పురుషార్థం చేయండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

సభలో దీపం వెలిగింది… (మెహఫిల్ మే జల్ ఉఠీ శమా…)

ఓంశాంతి. ఎవరైతే మంచి-మంచి సర్వీసబుల్ పిల్లలున్నారో, వారు ఈ పాట యొక్క అర్థాన్ని మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. ఈ పాటను వినడంతో మొత్తం సృష్టి చక్రం, రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడం జరుగుతుంది. మనుష్యులు తెలుసుకోవాలని పాటలు మోగించడం జరుగుతుంది. ఎవరి ద్వారా? జ్ఞానసాగరుని ద్వారా. ఈ పాత ప్రపంచం నుండి మరణించి మన పరంధామానికి వెళ్ళేందుకు మనం తండ్రికి చెందినవారిగా అవుతామని పిల్లలకు తెలుసు. కేవలం ఒక్క తండ్రి తప్ప ఈ పురుషార్థాన్ని ఇంకెవరూ చేయించలేరు. తండ్రి అంటారు, నాకు చెందినవారిగా అవ్వడంతో మీరు ఈ ప్రపంచం నుండి మరణించాల్సి ఉంటుంది. చివర్లో కేవలం ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇతరులెవ్వరి స్మృతి రానంతగా అవస్థ పక్కాగా ఉండాలి. దీపం పురుగులను తమతో పాటు తీసుకువెళ్ళేందుకు దీపం వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. దీపపు పురుగులైతే అనేకానేకమున్నాయి. ప్రదర్శనీలో కూడా ఎంతమంది వస్తారో చూడండి. చాలామంది పిల్లలకు ప్రదర్శనీ యొక్క అర్థం కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇది పాత ప్రపంచాన్ని మళ్ళీ కొత్త ప్రపంచంగా తయారుచేసే ప్రదర్శినీ. పాత ప్రపంచ వినాశనమై, మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుంది, ఇది సంగమంలోనే చూపించడం జరుగుతుంది. రెండూ కలిసైతే ఉండవు. ఒకటి తప్పకుండా సమాప్తం అవ్వాల్సిందే. మీలో కూడా మంచి-మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారికి తెలుసు. రామ రాజ్యము అనగా కొత్త ప్రపంచం స్థాపనవుతూ ఉంది. రామ రాజ్యము స్థాపనైన తర్వాత రావణ రాజ్యము సమాప్తమైపోతుంది. మీరు రామ రాజ్యంలోని సభ్యులుగా అవుతారన్నప్పుడు మీలో ఏ భూతము ఉండకూడదు. భూతాలను పారద్రోలేందుకు ప్రయత్నం చేయాలి. మొట్టమొదట కామాగ్నిని ఆర్పివేయాలి. స్వయం కొరకు అగ్నిమాపక దళంగా అవ్వాలి. ఈ అగ్ని అన్నింటికన్నా తీవ్రమైనది మరియు చాలా అశుద్ధమైనది, కేవలం యోగబలంతో తప్ప దానిని ఆర్పివేయలేరు. మొత్తం ప్రపంచమంతటికీ ఉన్న ప్రశ్న ఇదే. అందరికీ కామం యొక్క అగ్ని అంటుకుని ఉంది. ఈ అగ్నిని ఆర్పివేసేటువంటి ఆత్మిక మిషన్ ఒక్కటే. వారికి తప్పకుండా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఓ పతితపావనా రండి అని అంటారు కూడా. పతితులు అని కామవికారులను అంటారు. హే కామాగ్నిని (భూతాన్ని) భస్మం చేసేవారా రండి. ఇక్కడ మెజారిటీ అయితే పతితులుగా ఉన్నారు. అయితే కొందరు పవిత్రంగా కూడా ఉంటారు. దీనిని ఎలా ఆర్పివేయాలనే యుక్తిని మీకు తెలియజేస్తాను. ఈ కామాగ్ని కూడా సతో, రజో, తమోలలోకి వస్తుంది. ఎవరైతే ఇది లేకుండా అసలు ఉండలేరో, అగ్ని అంటుకునే ఉంటుందో, వారు తమోప్రధానులు. ఈ కామ వికారము మనుష్యులను సర్వనాశనం చేస్తుంది. సత్యయుగంలో ఏ శత్రువు ఉండరు. అక్కడ రావణుడూ ఉండడు, అలాగే మనుష్యులకు శత్రువులు ఉండరు. భారత్ కు అన్నింటికన్నా పెద్ద శత్రువు రావణుడని మీరు అర్థం చేయిస్తారు. మొత్తం ఆట అంతా భారత్ పై తయారై ఉంది. సత్యయుగంలో రామ రాజ్యము, కలియుగంలో రావణ రాజ్యము. వారూ మనుష్యులే, వీరూ మనుష్యులేనని కార్టూన్ లో కూడా చూపించారు. దేవతల ఎదురుగా వెళ్ళి, చేతులు జోడించి – మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము, దుఃఖితులము అని అంటారు. ఈ భారత్ తప్పకుండా శ్రేష్ఠాచారిగా, పావనంగా ఉండేది. అక్కడ దేవీ-దేవతలు రాజ్యం చేసేవారు. లక్ష్మీ-నారాయణులు మరియు సీతా-రాములు, ఇరువురి రాజ్యాలు ఉండేవి. వారి వంశావళి ఉండేది. ప్రజల చిత్రాలనైతే తయారుచేయరు. ఇప్పుడు తండ్రి ఈ విషయాలను ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు. అర్థం చేయించిన తర్వాత, బుద్ధిలో ధారణ అవుతుంది కదా అని అడుగుతారు. నా బుద్ధిలో ధారణ అయి ఉంది, వృక్షము గురించిన, డ్రామా గురించిన జ్ఞానం నా వద్ద ఉంది, అందుకే నన్ను జ్ఞానసాగరుడు అని అంటారు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానం నా వద్ద ఉంది. నన్ను పవిత్రతా సాగరుడని కూడా అంటారు. పతిత పావనుడని కూడా నన్నే అంటారు. నేనొచ్చి మొత్తం భారత్ ను పావనంగా చేస్తాను. ఇది రాజయోగము మరియు జ్ఞానము. బ్యారిస్టర్ చదువును చదివితే, దానిని బ్యారిస్టర్ యోగమని అంటారు. ఎందుకంటే ఆ చదువుతోనే బ్యారిస్టర్ గా అవుతారు. ఈ తండ్రి అంటారు, నేనొచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. రాజులందరూ కూడా భగవంతుడిని స్మృతి చేస్తారు. భగవంతుడి నుండి ఏం లభిస్తుంది? తప్పకుండా స్వర్గ వారసత్వం లభించాలి.

మీకు పరమపిత పరమాత్మ పరిచయముందా అని మీరు అందరినీ అడుగుతారు. ఆ తండ్రి రచయిత కావున తప్పకుండా స్వర్గాన్ని రచిస్తారు మరియు స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు. అది ఇంతకుముందు పిల్లలైన మనకు లభించింది, ఇప్పుడది లేదు, మళ్ళీ తీసుకుంటున్నాము. ఏ విధంగా భారతవాసులు కల్పక్రితం తీసుకున్నారో, ఇప్పుడు మళ్ళీ భారతవాసులు తీసుకోవాలి. (నారదుని ఉదాహరణ). వైకుంఠానికి వస్తారా? భగవంతుడి నుండి కొత్త ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారా? అని పిల్లలైన మీరు కూడా అడుగుతారు. భారత్ కే ఇంతకుముందు వారసత్వం లభించింది, ఇప్పుడు లేదు. ఇతరులెవ్వరికీ లభించజాలదు, ఎందుకంటే భారత్ యే భగవంతుని జన్మభూమి. కావున దానం ఇంటి నుండే మొదలవుతుంది. ఇక్కడివారికే ఇస్తారు. కానీ చాలామంది కుమార్తెలు అర్థం చేయించలేరు. చాలామంది పిల్లలకు సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు. మీరు వైకుంఠానికి రాకుమారులుగా-రాకుమార్తెలుగా అవుతారని చూపిస్తారు. ఇది ఉన్నదే మనుష్యుల నుండి రాకుమారులుగా తయారయ్యే పాఠశాల. రాకుమారునిగా అవ్వడమన్నా లేక రాజుగా అవ్వడమన్నా విషయం ఒక్కటే. పురుషార్థం చేసి ఈ విధంగా తయారవ్వడం కోసం ఈ సాక్షాత్కారాలు జరుగుతాయి. తండ్రి శ్రీమతంపై నడుస్తూ పురుషార్థం చేయండి. కేవలం కృష్ణుడిని చూసినంతమాత్రాన, అది గొప్ప విషయమేమీ కాదు. ఆ మాటకొస్తే, ఇంతకుముందు చాలామంది చూసేవారు కానీ వారు తర్వాత వెళ్ళిపోయారు. సాక్షాత్కారమైన తర్వాత మళ్ళీ ఈ విధంగా చదవరు, ఈ విధంగా తయారవ్వరు, అంతటి పురుషార్థం చేయరు, ఎందుకంటే లోపల భూతాల దాడి ఉంది. దేహాభిమానము కఠినమైన భూతము. ఆట పూర్తవుతుందని బుద్ధిలో ఉండాలి. మేము 84 జన్మల పాత్రను పూర్తి చేసాము, ఇప్పుడు మేము ఈ పాత వస్త్రాన్ని వదిలేస్తాము, కేవలం ఇది గుర్తున్నా సరే, అహో భాగ్యము, సంతోషపు పాదరసం పైకి ఎక్కి ఉంటుంది. ఇప్పుడు మనం తిరిగి ముక్తిధామానికి వెళ్తాము. ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోజాలదు. సన్యాసులు ఉంటారు, వారు, మేము శరీరాన్ని విడిచి బ్రహ్మములో లీనమైపోతామని అంటారు. కానీ తత్వాన్ని స్మృతి చేయడంతో వికర్మలు వినాశనమవ్వవు అన్నప్పుడు ఎలా వెళ్ళగలుగుతారు. తీసుకువెళ్ళేవారు ఒక్క రాముడే, వారు పిల్లలందరినీ తీసుకువెళ్తారు. తమంతట తామే అయితే ఎవరూ వెళ్ళలేరు. వెళ్ళేందుకు పురుషార్థమైతే చేస్తారు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండడం బాగా అనిపించదు. మరికొందరు అంటారు, మేము ఈ నాటకంలోకి రానే రాకూడదు అని. ఈ విధంగా అనేక మత-మతాంతరాలు ఉన్నాయి. గురువులు, పండితులు మొదలైనవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అందరికీ తమ-తమ మతాలు ఉన్నాయి. మీ జ్ఞానం చాలా బాగుందని అనడం అంటారు. బయటకు వెళ్ళగానే సమాప్తమైపోతుంది. రావడమైతే చాలామంది వస్తారు కానీ వారి భాగ్యంలో లేదు. అంతటి పదవిని విడిచిపెట్టి రావడమనేది వారి వల్ల జరగదు, అందుకే పేదవారే తీసుకుంటారు. ఇక్కడకు వచ్చి పిల్లలుగా అవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సన్యాసులు, గురువులు ఇంతమంది అనుచరులను విడిచిపెట్టి రావడమనేది చాలా కష్టము. అందులోనూ, ఇది ప్రవృత్తి మార్గము, స్త్రీ పురుషులు ఇరువురూ కలిసి ఉండాల్సి ఉంటుంది. నిశ్చయబుద్ధి కలవారికి వెంటనే పరీక్ష తీసుకోవడం జరుగుతుంది. గురుత్వాన్ని వదులుతారేమో చూస్తారు. బాబాకు చెందినవారిగా అవ్వాల్సి ఉంటుంది కదా. ఎవరికైనా అర్థం చేయించేందుకు బాబా సహజమైన ఉపాయాన్ని కూడా అర్థం చేయిస్తారు. కేవలం, పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది అని అడగాలి. వారు తప్పకుండా ముక్తి, జీవన్ముక్తులను ఇస్తారు. మనుష్యులు, మనుష్యులకు ఇవ్వలేరు. బాబా నుండి వారసత్వం తీసుకునేందుకు వచ్చి నేర్చుకోవాల్సి ఉంటుంది, శ్రీమతం ఏం చెప్తే అది చేయాలి. మొట్టమొదట నిశ్చయబుద్ధి కావాలి, ఇక తర్వాత ఏ శ్రీమతం లభిస్తే అది చేయాలి. మొట్టమొదటగా తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. లెక్కలేనంతమంది వస్తారు. ఇది చాలా మంచిది అని అంటారు. కానీ వారు స్వయం ఏమైనా నిలబడతారా, కేవలం తమ సలహాలను ఇచ్చి వెళ్ళిపోతారు. మీరు ఎవరి మతంపై నడుస్తున్నారు అనేది వారికి తెలియదు. ఇటువంటి ప్రదర్శనీలైతే అన్ని చోట్ల ఉండాలని అంటారు. అలా సలహాలనివ్వడం మొదలుపెడతారు. అరే, ఈశ్వరునికి ఏమైనా సలహా ఇస్తారా. కానీ సలహాలివ్వడం అలవాటైపోయింది. ఇకపోతే వారు స్వయం కూర్చుని అర్థం చేసుకోవడమనేది చేయరు. ఇక్కడ ఏ మతమునూ ఇవ్వకూడదు, శ్రీమతంపై నడుచుకోవాలి. మొదట తండ్రికి చెందినవారిగా అవ్వాలి, ఆ తర్వాత ఈ విధంగా ఎవరికైనా అర్థం చేయించండి అని వారు శ్రీమతాన్ని ఇస్తారు. ఎవరికైనా అర్థం చేయించిన తర్వాత, వారు, నేనైతే శ్రీమతంపై నడవాలి అని రాసి ఇస్తే, అప్పుడు వారు ఎంతోకొంత సరిగ్గా అర్థం చేసుకున్నారని అర్థమవుతుంది. రావడం ఎంతోమంది వస్తారు కానీ బాగా అర్థం చేసుకోరు, జ్ఞానం యొక్క నషా కలవారిగా అవ్వరు. ఈ సమయంలో అందరూ భక్తి యొక్క నషా కలవారు. జప-తపాదులు, పఠనము మొదలైనవన్నీ భక్తి కోసమే చేస్తారు. భగవంతుడు అంటారు, భగవంతుడిని కలుసుకునేందుకు మీరు అర్ధకల్పం భక్తి చేసారు. అందరూ భక్తులే, భగవంతుడైతే ఒక్కరే. వారొక్కరినే పతితపావనుడని అంటారు. కావున స్వయం అందరూ పతితులే. ఇది రావణ రాజ్యము. ఈ కల్పం యొక్క సంగమానికే మహిమ ఉంది. ప్రతి కల్పం యొక్క సంగమయుగంలో తండ్రి వస్తారు.

సత్యయుగము కళ్యాణకారీ స్వర్గము, కలియుగము అకళ్యాణకారీ నరకము. రావణుడు అకళ్యాణకారి, రాముడు కళ్యాణకారి. ఈ జ్ఞానం పిల్లల బుద్ధిలో మెదులుతూ ఉండాలి. మేము వెళ్ళి, పాపం వారి కళ్యాణం చేయాలి అనే చింత ఉండాలి. కొంతమందిలో ఎలాంటి లోపాలున్నాయంటే, వాటి వలన అందరూ హైరానా పడతారు. బాబా, ఫలానావారిలో ఈ అవగుణం ఉందని అంటారు. చాలా సమాచారాలు వస్తూ ఉంటాయి. బాబా ఏమంటారంటే – సమాచారాన్ని ఇచ్చినట్లయితే సావధానము లభిస్తుంది. ఏదైనా అవగుణముంటే, సేవ తక్కువగా చేస్తారు. ఈ రోజుల్లో చదువుకున్న విద్వాంసులు, పండితులైతే చాలామంది ఉన్నారు, వారు చాలా చురుకుగా ఉన్నారు. వారు కచ్చాగా (అపరిపక్వంగా) ఉండే పిల్లల బుద్ధిని పాడు చేసేస్తారు, అందుకే చురుకైన పిల్లలను పిలుస్తారు. వీరు మా కన్నా చురుకైనవారని భావిస్తారు. ప్రదర్శనీ నుండి కూడా బాబా సమాచారాన్ని తెప్పించుకుంటూ ఉంటారు. ఎవరెవరు మంచి సేవ చేస్తున్నారు అన్న సమాచారాన్ని తీసుకుంటారు. ఇందులో చాలా చురుకైనవారు కావాలి. మీరు శాస్త్రాలు మొదలైనవి చదువుతారా అని ఎవరైనా అడిగితే, మీరు వారికి చెప్పండి – ఈ వేద శాస్త్రాలను జన్మ-జన్మాంతరాలుగా అందరూ చదువుతూ వచ్చారని మాకు తెలుసు. ఇప్పుడు మాకు తండ్రి డైరెక్షన్ ఉంది – ఇంకేమీ చదవకండి, నేను ఏదైతే వినిపిస్తానో, అది వినండి, నా మతంపై నడవండి, నన్ను స్మృతి చేయండి, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. నేను మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాను, నేను మీ తండ్రిని. మీకు ముక్తి-జీవన్ముక్తులను ఇస్తాను. ప్రతి ఒక్కరు డ్రామా అనుసారంగా మొదట ముక్తిలోకి వెళ్ళాలి, ఆ తర్వాత జీవన్ముక్తిలోకి, సతోప్రధానతలోకి వస్తారు. అందుకే వారిని సర్వుల సద్గతిదాత, సర్వోదయుడని అంటారు. సర్వము అనగా మొత్తం ప్రపంచమంతా వస్తుంది. సర్వుల అనగా మొత్తం ప్రపంచం యొక్క తండ్రి అర్థం చేయిస్తారు. వారంతా అల్పకాలికమైన హద్దు సేవను చేసేవారు. అనంతమైన సర్వోదయ లీడర్ అయితే ఒక్కరే. వారు మొత్తం విశ్వంపై దయ చూపించి, విశ్వాన్ని పరివర్తన చేసేవారు. బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చారని మీకు తెలుసు. సదా ఆరోగ్యవంతులుగా, ధనవంతులుగా అవుతారు. కానీ ఈ మాత్రం కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. రెండు మాటలు కూర్చొన్నా సరే మంచిదే. మేము భగవంతుడైన తండ్రికి పిల్లలము. భగవంతుడి నుండి స్వర్గం యొక్క వారసత్వం లభించాలి. ఇంతకుముందు లభించింది, ఇప్పుడు లేదు, మళ్ళీ లభిస్తూ ఉంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇతరులకు ఇదే మంత్రాన్ని ఇవ్వండి. నేను మీ అనంతమైన తండ్రిని. ధర్మ స్థాపన కోసం ఎదురుదెబ్బలైతే తినాల్సి వస్తుంది. ఇప్పుడు నాటకం పూర్తవుతుందని బుద్ధిలో ఉండాలి. ఇంకా కొద్ది సమయమే ఉంది, మన ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత మన పాత్ర కొత్తగా ప్రారంభమవుతుంది. ఇది బుద్ధిలో ఉంటే చాలా మంచిది, అచ్ఛా.

పిల్లలైన మీ అడుగడుగులో పదమాలు నిండి ఉన్నాయి. ఇది చాలా భారీ సంపాదన. స్వయంగా భగవంతుడు సంపాదన చేసుకునేందుకు సలహాను ఇస్తారు. సలహాపై నడుచుకోవడంతో స్వర్గంలోకి చేరుకుంటారు. కానీ స్వర్గంలో కూడా ఉన్నత పదవిని పొందాలి. ఇది నిశ్శబ్దంగా చేసుకునే సంపాదన. కర్మేంద్రియాలతో కర్మలు చేయండి కానీ హృదయం ప్రియుని వైపు ఉండాలి, అప్పుడు నావ తీరానికి చేరుకుంటుంది. ఇది చాలా భారీ సంపాదన. తండ్రి సేవలో ఉండడం ద్వారా ఆటోమేటిక్ గా చాలా సంపాదన జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడీ నాటకం పూర్తి అయింది, మనం తిరిగి ముక్తిధామానికి వెళ్ళాలి. ఈ సంతోషంలో ఉంటూ పాత దేహం యొక్క అభిమానాన్ని విడిచిపెట్టాలి.

2. ఒక్క తండ్రి మతంపై నడుచుకోవాలి. తండ్రికి తమ మతాన్ని ఇవ్వకూడదు. నిశ్చయబుద్ధి కలవారిగా అయి, తండ్రి ద్వారా ఏదైతే శ్రీమతం లభించిందో, దానిపై నడుస్తూ ఉండాలి.

వరదానము:-

రాజయోగీ పిల్లలకు భిన్న-భిన్న స్థితులే ఆసనాలు. ఒకసారి స్వమానం యొక్క స్థితిలో స్థితులవ్వండి, మరోసారి ఫరిశ్తా స్థితిలో, ఒకసారి లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితిలో, మరోసారి ప్రేమ స్వరూప లవలీన స్థితిలో. ఏ విధంగానైతే ఆసనంపై ఏకాగ్రులై కూర్చుంటారో, అలా మీరు కూడా భిన్న-భిన్న స్థితుల యొక్క ఆసనాలపై స్థితులై వెరైటీ స్థితులను అనుభవం చేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనసు-బుద్ధిని ఆర్డర్ చేయండి మరియు సంకల్పం చేసిన వెంటనే ఆ స్థితిలో స్థితులవ్వండి, అప్పుడు రాజయోగీ స్వరాజ్య అధికారీ అని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top